Pratap Reddy
-
మా తాత బర్త్ డే నాకెంతో ప్రత్యేకం.. వేదికపై ఉపాసన ఎమోషనల్!
భారతీయ వైద్య రంగంలో విప్లవం తీసుకొచ్చిన ప్రముఖ వైద్యుడు, అపోలో ఆస్పత్రి అధినేత ప్రతాప్ సీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైద్య రంగంలో ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. అలాంటి ప్రతాప్ సీ రెడ్డి తన అపోలో ఆస్పత్రి సేవలను దేశంవ్యాప్తంగా విస్తరించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీన ఆయన 91వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చెన్నైలోని గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆయన మనవరాలు, రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత నిమ్మి సాక్సో రాసిన అపోలో స్టోరీ అనే కామిక్ బుక్‌ను డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం పట్ల ఎలా అనిపిస్తుందని ఉపాసనను ప్రశ్నించారు. దీనికి ఉపాసన చెప్పిన సమాధానం వైరల్‌గా మారింది. ఉపాసన మాట్లాడుతూ.. 'మా గ్రాండ్ ఫాదర్ మాత్రమే కాదు.. ఇప్పుడు క్లీంకార గ్రాండ్ ఫాదర్ కూడా పద్మ విభూషణ్ అందుకున్నారు. మా కుటుంబంలో ఇద్దరు ఈ పురస్కారం అందుకోవడం నిజంగా ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మా తాత జన్మదినం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ రోజును భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా ఎదగాలని కలలు కనే యువ వ్యాపారవేత్తలు, మహిళలతో కలిసి జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. వైద్య రంగంలో ఆయన ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడం, ఆయన కలలను నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తామని' ఉపాసన పేర్కొన్నారు. కాగా.. సినీ రంగంలో చేసిన సేవలకు మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. అంతకుముందు 2010లో ప్రతాప్ చంద్ర రెడ్డి కూడా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. Happy 91st Birthday Thatha @DrPrathapCReddy The Apollo Story is an emotional tribute to every girl child to dream without boundaries & to every father to support their daughters as equals Thank You @amarchitrkatha @RanaDaggubati for helping us put this together@ApolloFND pic.twitter.com/mPPuUjpbdG — Upasana Konidela (@upasanakonidela) February 5, 2024 -
చరణ్ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే..
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్‌చరణ్ గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగాడు. ప్రపంచమంతటా అభిమానులను సంపాదించుకున్నాడు. నాటునాటుకు ఆస్కార్ రావడంతో సినిమా యూనిట్‌కు మరింత గుర్తింపు లభించింది. అయితే ఈ పేరు, ప్రతిష్టలు రావడానికి కారణం ఉపాసన కడుపులో పెరుగుతున్న బిడ్డేనని మురిసిపోయాడు. ఆ బిడ్డను చేతుల్లో ఎత్తుకుని ముద్దాడే సమయం కోసం వేయి కళ్లతో ఎదురుచూశాడు. ఒక్క చరణ్ మాత్రమేనా? మెగా ఫ్యామిలీ అంతా పుట్టబోయే బిడ్డకోసం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూశారు. సెంటిమెంట్ రోజే పాప జననం చివరకు వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ మెగా కుటుంబం సెంటిమెంట్ రోజైన మంగళవారం నాడే (జూన్ 20న) ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. స్వయంగా మహాలక్ష్మి దేవియే మా కుటుంబంలోకి వచ్చిందని కుటుంబమంతా సంబరాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో అసలు ఉపాసన ఏం చదివింది? తనకు ఎంత ఆస్తి ఉంది? అన్న వివరాలు ఆరా తీస్తున్నారు. కావున.. ఉపాసన ఆస్తి వివరాలు ఓసారి చూసేద్దాం.. 100 బిలియనీర్స్‌లో ఉపాసన తాతయ్య రామ్‌చరణ్-ఉపాసనల ఆస్తి విలువ రూ.2500 కోట్లు. ఇందులో ఒక్క ఉపాసన ఆస్తే రూ.1130 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఉపాసన బడా వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన మహిళ. ఉపాసన బిజినెస్ టైకూన్ సి.ప్రతాప్ రెడ్డి మనవరాలు. ఆయన అపోలో హాస్పిటల్స్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన నికర ఆస్తుల విలువ రూ.21,000 కోట్లు. భారత్‌లోని టాప్ 100 బిలియనీర్స్‌లో ఆయన ఒకరు. ప్రస్తుత అపోలో హాస్పిటల్స్ మార్కెట్ విలువ రూ.70,000 కోట్లుగా ఉంది. అపోలో హాస్పిటల్స్‌కు ఉపాసన వైస్ ప్రెసిడెంట్‌గా, ఆమె తల్లి శోభన ఎగ్జిక్యూటివ్ వైఎస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. తాతయ్య ప్రతాప్ రెడ్డి దంపతులతో ఉపాసన జంట పట్టా చేతికి రాగానే.. ఉపాసన చదువు విషయానికి వస్తే.. ఆమె ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పట్టా చేతికి రాగానే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. అపోలో ఆస్పత్రిలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే బి పాజిటివ్ అనే మ్యాగజైన్‌కు ఎడిటర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరిస్తోంది. కుటుంబ ఆరోగ్య బీమాకు సంబంధించిన టీపీఏ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గానూ ఉంది. ఉపాసన తండ్రి కెఈఐ అనే కంపెనీని స్థాపించాడు. వ్యాపారంలోనే కాదు సేవలోనూ ముందంజలో ఇకపోతే ఉపాసనకు ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆశగా ఉండేది. ఏమైందో ఏమో కానీ తన నిర్ణయం మార్చుకుని ఫ్యామిలీ బిజినెస్ చూసేందుకే మొగ్గు చూపింది. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో జనరల్ మేనేజర్‌గా చేరి ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరింది. వ్యాపారాన్ని సమర్థవంతంగా చూసుకునే ఆమె స్వచ్ఛంద కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో ఉంటుంది. చదవండి: వేరొక మహిళతో ఎఫైర్? డబ్బులిచ్చి మరీ కమెడియన్ కాళ్లు విరగ్గొట్టించిన భార్య! రామ్‌చరణ్.. బాల్యంలో నా చేతులతో నిన్ను హత్తుకున్న రోజులు నాకింకా గుర్తున్నాయి: మంత్రి రోజా -
ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డిపై టీడీపీ, సీపీఐ నేతల దాడి
సాక్షి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో అలజడి సృష్టించేందుకు టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల నేతలు కుట్రలు చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏకంగా అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు.. పాఠశాలల్లో నాడు - నేడు పనులు పర్యవేక్షణలో భాగంగా ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిపై అనంతపురంలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు దాడికి యత్నించటం తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి భర్త, విద్యాశాఖ కడప రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రతాప్ రెడ్డి పై దాడికి యత్నించారు. అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులతో మాట్లాడుతుండగా.. టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాల నేతలు ఒక్కసారిగా దౌర్జన్యం చేశారు. ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిపై దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయ సంఘాల నేతలు దుండగులను అడ్డుకున్నారు. ఇంతలో పోలీసులు వచ్చి ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డిపై దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు. తనను హత్య చేసేందుకు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు ప్రయత్నించారని.. పలువురు ఉపాధ్యాయులు, స్నేహితుల సహకారం తో బయటపడ్డానని కడప ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. తనపై అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చని.. ఇలా దౌర్జన్యానికి దిగటం అప్రజాస్వామికం అన్నారాయన. ప్రతాప్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చదవండి: టీడీపీ స్కెచ్.. ‘నీ పంట దున్నెయ్.. లీడర్ని చేస్తాం..’ -
ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా నల్లమల
సాక్షి, నాగర్‌కర్నూల్: అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, అందులో భాగంగా ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా నల్లమల అటవీ ప్రాంతాన్ని తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అటవీ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో మంత్రి పర్యటించారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రియాల్తో కలసి మన్ననూరులో కొత్తగా నిర్మించిన ట్రీహౌస్, అదనపు కాటేజీలతోపాటు 8 సఫారీ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ల్లోని పులుల సంరక్షణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 2018లో 12గా ఉన్న పులుల సంఖ్య 2021లో 21కి పెరిగినట్టు తెలిపారు. వన్యప్రాణులను వేటాడే వారిపై పీడీ యాక్ట్ నమో దు చేస్తున్నామని, సమాచారం తెలిపిన వారికి బహుమతులు ఇస్తున్నామని చెప్పారు. పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. ఎకో టూరిజంలో భాగంగా ప్యాకేజీలు.. టైగర్ స్టే ప్యాకేజీలో భాగంగా రెండ్రోజులు అడవిలో ఉండి టైగర్ సఫారీతోపాటు ట్రెక్కింగ్, కాటేజీల్లో బస చేసే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. ఇప్పటికే ఉన్న కాటేజీలకు మరో ఆరు కాటేజీలతోపాటు ఇటీవల నిర్మించిన ట్రీహౌస్æ కాటేజీ ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. ఈనెల 26 నుంచి టైగర్ స్టే ప్యాకేజీ అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వెబ్సైట్లో బుకింగ్‌ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. సాధారణ కాటేజీలో ఇద్దరికి రూ.4,600, మడ్ హౌస్‌లో రూ. 6 వేలు, ట్రీ హౌస్‌లో రూ. 8 వేలతో ప్యాకేజీని ఖరారు చేశామన్నారు. బుకింగ్‌ల కోసం www.amrabadtigerreserve.com సంప్రదించొచ్చన్నారు. పులుల అభయారణ్యాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి పునరావాసం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రీయాల్ చెప్పారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు కలెక్టర్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. -
పోషకాహారం అందజేతలో ఏపీ అగ్రగామి
ఉయ్యూరు: ప్రజలకు పోషకాహారం అందించడంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సీహెచ్ విజయ ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఫుడ్ కమిషన్ రాష్ట్ర బృందం గురువారం కృష్ణా జిల్లా ఉయ్యూరులో పర్యటించింది. కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉయ్యూరు జెడ్పీ పాఠశాలలో జగనన్న గోరుముద్ద కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తిని పదార్థాల నాణ్యతను తెలుసుకున్నారు. నాడు–నేడు కింద పాఠశాలలో చేపట్టిన ప్రగతిని పరిశీలించి పనుల నాణ్యతను తనిఖీ చేశారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలోని పౌరసరఫరాల గోదామును సందర్శించి సరుకుల నాణ్యత పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. కడవకొల్లు–కాటూరు మధ్య అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే కోళ్లఫారంను సందర్శించారు. విజయ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారులు అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు పథకాలను అందించాలన్నారు. -
Kandimalla Pratap Reddy: ‘కొరియర్’గా.. వారియర్‌గా!
హిమాయత్‌నగర్: పసి వయసు నుంచి కసిగా నిజాం వ్యతిరేక, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగస్వామి అయిన వ్యక్తి ఆయన. అప్పుడాయన వయసు 13 ఏళ్లే. ఆయనే తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి. స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జొన్నలగడ్డగూడెం. ‘సెప్టెంబర్ 17’నేపథ్యంలో అప్పటి పోరాటంలో పాల్గొన్న ప్రతాప్‌రెడ్డి అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘స్వాతంత్య్రం వచ్చేనాటికి నాటికి నాకు సుమారుగా 13 ఏళ్లు. మా తండ్రి రంగారెడ్డి నన్ను నల్లగొండ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానానికి రాలేదంటూ చెలరేగిన ఉద్యమానికి బడులన్నీ మూతపడ్డాయి. అనంతరం నేను ఓ వేపచెట్టు కింద విద్యార్థి నాయకులు, దళాలు చేపట్టిన సాయుధ పోరాట కార్యక్రమంలో తొలిసారిగా పాల్గొన్నాను. ఆ వేపచెట్టుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాను. గ్రామాల్లోకి వచ్చిన దళాలను రహస్య ప్రాంతాల్లో దాచేవాడిని. నన్ను కమ్యూనిస్టు పార్టీ బాలసంఘం సెక్రెటరీగా నియమించారు. కొరియర్‌గా ఇటు ప్రజలకు, అటు దళాలు, విద్యార్థి నాయకులకు దగ్గరగా ఉండేవాడిని. వీరితో పాటు ప్రజలకు నేనే సమాచార వారధిగా ఉండేవాడిని. తుపాకీని ముట్టనిచ్చేవాళ్లు కాదు.. మా ఉద్యమాన్ని అణచివేసేందుకు రజాకార్లు గుర్రాలపై, జీపులపై గ్రామాల్లోకి చొరబడేవాళ్లు. రజాకార్లను ఎదుర్కొనేందుకు దళాలు కూడా ఊళ్లలోకి వచ్చేవి. తుపాకీని పట్టుకోవాలనే ఆశ నాకున్నప్పటికీ బాలుడిని కావడంతో దళసభ్యులు ముట్టనిచ్చేవాళ్లు కాదు. రజాకార్లను అడ్డుకునేందుకు తిప్పర్తి వంతెనను మూడు, నాలుగు గ్రామాలవాళ్లం కొంతవరకు కూల్చివేశాం. మేం కోదాడ, నల్లగొండ ప్రధాన రహదారులపై ఉన్న సమయంలో షోలాపూర్, కోదాడల మీదుగా పెద్దపెద్ద సైన్యాలు హైదరాబాద్ వైపు వెళ్లడాన్ని గమనించాం. ఈ సైన్యాలు వెళ్లిన మూడు రోజులకు, అంటే సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు నిజాం రాజు నుంచి వెలువడిన వార్త మా దాకా వచ్చింది. ఎంతో సంతోషంగా ఈ వార్తను ఒక కొరియర్లా తీసికెళ్లి పలు గ్రామాల్లో చెప్పాను. -
బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌గా సీహెచ్ ప్రతాప్‌రెడ్డి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌గా తెలుగు సీనియర్ ఐపీఎస్ సీహెచ్ ప్రతాప్‌రెడ్డి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆయనను సీపీగా నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ప్రతాప్‌రెడ్డి 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో బెంగళూరు నగర అదనపు కమిషనర్‌గా పని చేశారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా ఉన్నారు. బీటెక్ పూర్తిచేసి ఐపీఎస్ అయిన ప్రతాప్‌రెడ్డి మొదట హాసన్ జిల్లా అరసికెరె ఏఎస్పీగా, తరువాత పలు జిల్లాల ఎస్పీగా, కొంతకాలం బెంగళూరు – ముంబయి సీబీఐ విభాగంలో విధులు నిర్వర్తించారు. సైబర్ సెక్యూరిటీ విభాగంలో కీలక పాత్ర పోషించారు. విశిష్ట సేవలకు రాష్ట్రపతి, సీఎం మెడళ్లను అందుకున్నారు. ఆయన మంగళవారం కొత్తబాధ్యతలు తీసుకుంటారు. చదవండి: (ఆత్మహత్య వెనుక హనీట్రాప్) -
దోమకొండ ఫోర్టులోపోచమ్మ పండుగ
దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండగడీ కోట వారసులైన కామినేని అనిల్‌కుమార్, శోభనల కుమార్తె అనుష్పాల వివాహం సందర్భంగా ఆదివారం కోటలో పోచమ్మ పండుగ నిర్వహించారు. పెళ్లికూతురు అనుష్పాల పోచమ్మకు బోనం సమర్పించారు. ఈ పండుగ కోసం రిటైర్డు ఐఏఎస్ అధికారి, దివంగత కామినేని ఉమాపతిరావ్ భార్య పార్వతమ్మ హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి వచ్చారు. వేడుకలకు సినీ నటుడు రామ్‌చరణ్ తేజ, ఆయన సతీమణి ఉపాసనతో పాటు అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీలు టి.సుబ్బరామిరెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. అపోలో ఆస్పత్రులకు చెందిన వందలాది మంది ఉద్యోగులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
‘ఆయన చంద్రబాబు కోవర్ట్’
సాక్షి, అనంతపురం: బిర్రు ప్రతాప్‌రెడ్డి చంద్రబాబు కోవర్ట్ అని ఏపీ రెడ్డి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ రెడ్డి సంఘం అధ్యక్షుడు నరేష్ కుమార్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డిపై మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాల మేరకే స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై బిర్రు ప్రతాప్ రెడ్డి సుప్రీంకోర్టు ను ఆశ్రయించారని ఆరోపించారు. గత ఎన్నికల్లో రెడ్ల ఓట్లను చీల్చేందుకు కుట్ర పన్నారని దుయ్యబట్టారు. బిర్రు ప్రతాప్‌రెడ్డిని రెడ్డి సంఘం ఎప్పుడో బహిష్కరించిందని నరేష్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. (ఈయన వైఎస్సార్సీపీ నాయకుడట!) టీడీపీ మరోసారి నిరూపించకుంది.. టీడీపీ.. బీసీలకు వ్యతిరేకమని మరో నిరూపించుకుంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మొత్తంగా 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ కోర్టుకు వెళ్లి మోకాలొడ్డింది. టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ గౌరవాధ్యక్షుడుగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చాంబర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న బిర్రు ప్రతాప్ రెడ్డి రిజర్వేషన్ల తగ్గింపు కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. చంద్రబాబు సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇతనికి ఓ నామినేటేడ్ పదవిని కూడా కట్టబెట్టింది. (టీడీపీ.. బీసీ వ్యతిరేకి) -
‘స్థానిక’ సందడి!
ఈసారి మనూరి ప్రెసిడెంట్‌గా వెంకట్రావు పోటీ చేస్తానంటున్నాడట..! ఎంపీటీసీకి పోటీ చేయడానికి ప్రతాప్‌రెడ్డి రెడీ అవుతున్నాడు. వీలైతే మండల ప్రెసిడెంట్ కావాలని ప్రయత్నిస్తున్నాడు..!! సాక్షి, అమరావతి: త్వరలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ ఎన్నికలు వరుసగా జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఏ ఊరిలో చూసినా ఇలాంటి చర్చలే జోరుగా సాగుతున్నాయి. మార్చి నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రక్రియ వేగం అందుకుంది. స్థానిక సంస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనే లక్షన్నరకు పైగా పదవులకు పోటీ జరగనుంది. దాదాపు ఆరున్నర ఏళ్ల తరువాత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. తెరపైకి కొత్త తరం! రాజకీయాల ద్వారా సామాజిక సేవ చేయాలని ఎన్నికల్లో పోటీకి యువతరం అసక్తి చూపుతోంది. యువ సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు మహిళలకు కూడా సమాన అవకాశాలు దక్కాలన్న ఉద్దేశంతో పార్టీ, ప్రభుత్వపరంగా ప్రోత్సాహంఅందిస్తుండటం యువత ముందుకు రావటానికి కారణమని విశ్లేషిస్తున్నారు. కొత్తవి ఏర్పాటు, విలీనంపై నిషేధం ఎత్తివేత గ్రామ పంచాయతీలను విడదీసి కొత్తవి ఏర్పాటు చేయడం, ప్రస్తుతం పంచాయితీలుగా ఉన్న వాటిని రెండు మూడు కలిపి ఒకటిగా విలీనం చేయడంపై ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి నిషేధం అమలులో ఉంది. పలుచోట్ల నుంచి అందుతున్న విజ్ఞప్తుల మేరకు నాలుగు రోజుల క్రితం నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. డిసెంబరు 20 నాటికి జిల్లాల నుంచి అందే వినతుల మేరకు కొత్త పంచాయతీల ఏర్పాటు, విలీనం ప్రక్రియను చేపట్టి ఆ తర్వాత తిరిగి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ చివరి వరకే గడువు 2020 జనవరి నుంచి దేశవ్యాప్తంగా జనగణన మొదలు కానున్న నేపథ్యంలో గ్రామ, మండల, జిల్లా, పట్టణ ప్రాంతాల సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయదలిస్తే డిసెంబరు నెలాఖరుకే పూర్తి చేయాలని సూచిస్తూ కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. జనవరి నుంచి ఆయా ప్రాంతాలలో మార్పులు చేర్పులకు తావు ఉండదని అధికారులు చెబుతున్నారు. కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ గ్రామ పంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల హడావుడి మొదలైన నేపధ్యంలో పంచాయితీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పని చేసేందుకు సిబ్బందిని తాత్కాలికంగా డిప్యుటేషన్, ఔట్సోర్సింగ్ విధానంలో నియమించుకునేందుకు అనుమతి కోరుతూ కమిషనర్ కార్యాలయం ప్రభుత్వానికి లేఖ రాసింది. సిద్ధంగా ఉన్నాం.. రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రకటన చేసిన వెంటనే అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు పంచాయితీరాజ్ శాఖ సిద్ధంగా ఉంది. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేస్తాం. – గిరిజాశంకర్ (పంచాయితీరాజ్ శాఖ కమిషనర్) పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు - ప్రస్తుతం గ్రామ పంచాయతీలుగా ఉన్న 249 గ్రామాలను పట్టణాలుగా మార్పు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినట్టు అధికారులు చెబుతున్నారు. - 78 పంచాయతీలను కొత్తగా 36 నగర పంచాయితీలుగా మార్చే ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉంది. - వివిధ పట్టణాలు, నగర పాలక సంస్థలకు చుట్టుపక్కల ఉండే మరో 97 గ్రామాలను సమీప పట్టణాల్లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఇవికాకుండా కలెక్టర్ల వద్ద మరో 74 ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. - రెండు మూడు గ్రామాలు కలిపి ఒక పంచాయతీగా ఉన్న చోట్ల వాటిని వేరు చేసి కొత్తవి ఏర్పాటు చేయాలంటూ మరో 60 దాకా ప్రతిపాదనలు అందాయి. -
పెన్నా ప్రతాప్ రెడ్డికి పాక్షిక ఊరట
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితునిగా ఉన్న పెన్నా ప్రతాప్‌రెడ్డికి హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. అతనిపై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 12 కింద సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. అయితే ఐపీసీ సెక్షన్ 120(బీ), 420 కింద ఉన్న కేసులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో పెన్నా ప్రతాప్‌రెడ్డితో పాటు పెన్నా గ్రూపు కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12 కింద కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ అటు పెన్నా ప్రతాప్‌రెడ్డి, ఇటు పెన్నా గ్రూపు కంపెనీలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, పెన్నా గ్రూపు కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేశారు. ప్రతాప్‌రెడ్డి పిటిషన్‌ను పాక్షికంగా అనుమతిస్తూ, అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసును మాత్రమే కొట్టేశారు. ఐపీసీ సెక్షన్లు 120 బీ, 420 కింద ఉన్న కేసుల్లో విచారణను కొనసాగించవచ్చునని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి స్పష్టం చేశారు. సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసుకునేందుకు అనుమతినిచ్చారు. ఈ తీర్పు ప్రభావం లేకుండా.. ఆ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ జరపాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించారు. -
ఆస్తులెందుకు వేలం వెయ్యరు?
సాక్షి, వైఎస్సార్సీపీ: అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఈ పార్టీ కడప కన్వీనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా ఈనెల 22, 23 తేదిల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈనెల 30న కపలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కోరినా ప్రభుత్వం పట్టింకోవట్లేదని మండిపడ్డారు. బాధితుల ఆస్తులను టీడీపీ నేతలు దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారని, బాధితుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. వేలకోట్ల రూపాయలు విలువచేసే అగ్రిగోల్డ్ ఆస్తులను వేలంవేసి ప్రభుత్వం ఎందుకు ఆదుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. -
చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి - లీడర్‌తో
-
ఒంటేరుపై చర్యలు తీసుకోండి: టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ నియోజకవర్గంలో తన మామ కేసీఆర్‌ను ఓడించాలని మంత్రి హరీశ్‌రావు కోరి నట్లు ఆరోపణలు చేసిన టీడీపీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డితో పాటు ఓటర్లకు డబ్బులు పంచాలని సూచించిన బీజేపీ స్టార్ క్యాంపెయినర్ స్వామి పరిపూర్ణానందపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ సోమవారం ఇక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. అనం తరం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీని వాస్‌రెడ్డి మాట్లాడుతూ హరీశ్‌రావుపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన ప్రతాప్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. మునుగోడు నియోజ కవర్గం పరిధిలోని చౌటుప్పల్‌లో శనివారం నిర్వహించిన బీజేపీ ప్రచార ర్యాలీలో ఓటర్లకు రూ. 200 ఇచ్చి ప్రలోభాలకు గురి చేయాలని కోరిన స్వామి పరిపూర్ణానందపై సైతం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామని పార్టీ నేత విఠల్ తెలిపారు. డబ్బులిస్తే ప్రజలు ఓట్లేస్తారని చెప్పడం ద్వారా ఆయన రాష్ట్ర ప్రజలందరినీ అవమానించారని పార్టీ నేత ఉపేంద్ర అన్నారు. పరిపూర్ణానందవి పగటి కలలు: కర్నె సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత పరిపూర్ణానంద తనకు తాను యోగి ఆదిత్యనాథ్‌లా ఊహించుకుని పగటి కలలు కంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రవచనాలు చెప్పేందుకు స్వామి డబ్బులు తీసుకుంటారేమోనని.. అందుకే ప్రజలు డబ్బులు తీసుకుని సభలకు వస్తారని హేళనగా మాట్లాడారని చెప్పారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ నేతలు కేంద్రంలో అధికారంలో ఉండి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారు. బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదు. రాజకీయాలంటే ఛారిటీ కాదని మాట్లాడిన రాంమాధవ్ కూడా టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. పరిపూర్ణా నందస్వామి రాజకీయాలు ఇక్కడ నడవవు. మత రాజకీయాలతో బీజేపీకి తెలంగాణలో ఓట్లు పడవు. టీపీసీసీ అధికారిక ట్విట్టర్లో అన్నీ అబద్ధాలను ప్రచారం చేస్తోంది’ అని అన్నారు. -
అభివృద్ధికి ప్రతిపక్షాల అడ్డు: కేకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్షాలు అనవసరంగా అడ్డు తగులుతున్నాయని టీఆర్ఎస్ పీపీ నేత, ఎంపీ కేశవరావు ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్లో కేసీఆర్ సేవాదళం అధ్యక్షుడు ఆమీర్ ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు. ‘ప్రతిపక్షాలు ప్రతీ పనికి అడ్డుతగులుతున్నాయి. ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నా యి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ముందుకు సాగనీయడం లేదు. వారి ఆరోపణలపై ప్రజల్లోనే తేల్చుకోవాలని ముందస్తుకు వెళ్లాం’ అని కేకే అన్నారు. కేసీఆర్‌ను గెలిపించడానికి ప్రతీ కార్యకర్త, సేవాదళ్ కార్యకర్తలు మరిం తగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు చారిత్రక అవసరమని అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ‘ఓటమి భయంతోనే ఒంటేరు ఆరోపణలు’ సాక్షి, హైదరాబాద్: గజ్వేల్‌లో ఓడిపోతానన్న భయంతోనే మహాకూటమి అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డి హరీశ్‌రావుపై విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, పార్టీ కార్యదర్శి గట్టు రాంచంద్రారావు, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదివారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ శ్రీని వాసరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావుపై ఒంటేరు ఇష్టానుసారంగా చేస్తున్న విమర్శలు, కుట్రలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన స్కిప్ట్రునే చదువుతున్న ఒంటేరును పార్టీ నుంచి బహిష్కరించడమే కాం గ్రెస్‌కు మేలని గట్టు రాంచంద్రారావు సూచిం చారు. నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్కౌంటర్ల పేరుతో తెలంగాణ ప్రజలను చంపించిన చరిత్ర దేవేందర్‌గౌడ్‌దని కాబట్టి ఆయనే తెలం గాణకు క్షమాపణ చెప్పాలని, కేసీఆర్ కాదని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. -
మామా అల్లుళ్ల అవినీతిపై విచారణ: ఒంటేరు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల అవినీతిపై సమగ్ర విచారణ జరిపి స్తామని కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు. మామా అల్లుళ్లు విదేశాలకు తరలించిన సొమ్మును వెనక్కి తీసుకొస్తామని.. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2001లో రబ్బర్ చెప్పులతో తిరిగిన హరీశ్‌రావు, ఇప్పుడు వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. సోని యాగాంధీ భిక్షతో పదవులు అనుభవిస్తున్న కేసీ ఆర్, హరీశ్‌రావులు అధికార మదంతో ఆమెనే విమర్శిస్తున్నారన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోతే రాళ్లతో కొట్టాలని చెప్పిన కేసీఆర్‌ను ప్రజలు అదే పనిచేసి బుద్ధి చెప్పాల న్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చే టీఆర్ఎస్ నేత లను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
‘తెలంగాణలో నిర్బంధ, నియంతృత్వ పాలన’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధ, నియంతృత్వ పాలన సాగుతోందని.. ప్రజలకు స్వేచ్ఛ, హక్కులు లేకుండా పోయాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగను తమ పార్టీ నేతలతో పాటు ఆయన కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన భారతి అనే మహిళ సంస్మరణ సభ జరిపినందుకు మందకృష్ణను అరెస్ట్ చేశారని తెలిపారు. ఏబీసీడీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకుపోతామని సీఎం కేసీఆర్ హామీయిచ్చారని గుర్తు చేశారు. అదే ముఖ్యమంత్రి.. ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న మందకృష్ణను అరెస్ట్ చేసి రెండు వారాలు జైల్లో పెట్టించారని ధ్వజమెత్తారు. ఇంత దారుణంగా పాలన సాగుతోందని, అణగారిన వర్గాలకు హక్కులు లేకుండా పోయాయని వాపోయారు. నెరేళ్లలో దళితులను ఇసుక మాఫియా అండతో పోలీసులు వేధింపులకు గురిచేశారని, ఖమ్మంలో మద్దతుధర కోసం డిమాండ్ చేసినందుకు రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టారని తెలిపారు. ఇపుడు మంద కృష్ణను అరెస్ట్ చేసి వేధిస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డిపై కూడా కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళి ముదిరాజ్ కుటుంబాన్ని పరామర్శించినందుకు ఆయనను అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేశారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. -
రేవంత్‌రెడ్డి దమ్మున్న మగాడు
మెదక్ జిల్లా : తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి దమ్మున్న మగాడు అని సిద్దిపేట జిల్లా టీడీపీ అధ్యక్షుడు బూరుగుపల్లి ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం తూప్రాన్‌లో డీఎన్ఆర్కేఎస్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లిన రేవంత్‌రెడ్డిని దమ్మున్న మగాడిగా ఆయన అభివర్ణించారు. ఇతర పార్టీ గుర్తులపై గెలిచిన నాయకులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుమాలిన చర్య అని ఆయన అన్నారు. ఇలాంటి దిగజారుడు తనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్పడడం శోచనీయమన్నారు. మగాళ్ళైతే ఇతర పార్టీ గుర్తులపై గెలిచిన నాయకులు రాజీనామాలు చేసి తిరిగి ప్రజల్లోకి వెళ్లాలని ఘాటుగా సవాల్ విసిరారు. మూడున్నర ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2019లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన ప్రతి కార్మికుడికి రూ. 10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతోపాటు 55సంవత్సరాలు దాటిన వారికి రూ. 5వేల పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు కిష్టారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు వెంకటేష్‌యాదవ్, భవన నిర్మాణరంగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెలిమెల రాములు, కార్మిక సంఘం నాయకులు రఘుపతి, సత్తయ్య, శ్రీనివాస్, కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యంగా సీఎం జయలలిత
-
ఆరోగ్యంగా సీఎం జయలలిత
డిశ్చార్జ్ ఆమె అభీష్టం: అపోలో చైర్మన్ ప్రతాప్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, చెన్నై: కొన్నిరోజుల క్రితమే పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి జయలలిత సహజస్థితికి చేరుకున్నారని అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. ఆమె కోరుకుంటే ఎప్పుడైనా ఇంటికి వెళ్లవచ్చన్నారు. అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 22 అర్ధరాత్రి అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలితకు దేశ, విదేశీ వైద్యులు సుమారు రెండు నెలలపాటు సుదీర్ఘ చికిత్స అందించారు. అవయవదానంపై అపోలో ఆస్పత్రి శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ... ఎప్పుడు డిశ్చార్జ్ కావాలని ఆమె మనస్సులో ఉందో తెలుసుకునేందుకు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నామన్నారు. ఫిజియోథెరపీ వల్ల సీఎం సహజస్థితికి చేరుకున్నారన్నారు. మైక్ సహాయంతో కొద్ది నిమిషాలు ఆమె మాట్లాడారని, 90 శాతం వరకూ ఆమె సహజసిద్ధంగా శ్వాస తీసుకుంటున్నట్లు తెలిపారు. -
'పోలీస్ విభాగంలో ఇమడలేకపోయారు'
సంగారెడ్డి : ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కుకునూర్‌పల్లి ఎస్ఐ ఎస్సై రామకృష్ణారెడ్డి(38) పోలీసు విభాగంలో ఇమడ లేకపోయారని విచారణాధికారి ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. ఆర్మీ నుంచి వచ్చిన రామకృష్ణారెడ్డి చదువు అంతంత మాత్రమే కావడంతో విధి నిర్వహణలో ఇబ్బంది పడ్డారని తెలిపారు. అతడికి కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయన్నారు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి... రామకృష్ణారెడ్డి తనకు తాను కాల్చుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రతాప్ రెడ్డి చెప్పారు. డీఎస్పీ, సీఐ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మంగళవారం రాత్రి రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. నిజామాబాద్ ఏఎస్పీ ప్రతాప్‌రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. దీంతో రామకృష్ణారెడ్డి మృతిపై విచారణ జరిపిన ఆయన ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నారు. -
అవినీతికి అడ్డాగా గజ్వేలు: వంటేరు
హైదరాబాద్: గజ్వేలును అవినీతికి అడ్డాగా మార్చేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. ఈ నియోజకవర్గ పరిధిలోని ఎస్సై రామకృష్ణ మరణం వెనుక డీఎస్పీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్లో బుధవారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ, ఈ సంఘటనపై హోం మంత్రి గానీ, జిల్లా మంత్రి హరీశ్‌రావు కానీ స్పందించలేదని పేర్కొన్నారు. తాను రూ.15 లక్షలు వసూలు చేయలేనని డీఎస్పీకి ఫోన్లో చెప్పి మరీ ఎస్సై ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఒక్క పోలీస్ శాఖలోనే ఇంత అవినీతి ఉంటే ఇతర ప్రభుత్వ శాఖ ల్లో ఎంత అవినీతి జరుగుతుందో ఊహించవచ్చన్నారు. స్నేహపూర్వక పోలీస్ వ్యవస్థను అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటోందని, అయితే ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఆ వ్యవస్థ లేదని, ప్రజలన -
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం కోనాయిపల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి నడుచుకుంటూ వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన ప్రతాప్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. -
అపోలో ‘జియో’యాప్ ఆవిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: జీవన విధానంలో మార్పుల కారణంగా వచ్చే వ్యాధులనుంచి ప్రజలు తమను తాము కాపాడుకునేందుకు అపోలో లైఫ్ గ్రూపు ‘అపోలో జియో యాప్’ను గురువారం ఆవిష్కరించింది. మారుతున్న జీవనశైలితో కేన్సర్, మధుమేహం వంటి వ్యాధులు పెరుగుతున్నాయని అపోలో గ్రూపు చైర్మన్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. నటుడు, ‘అపోలో జియో’ బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్ తేజ ఈ యాప్‌ను తాను వ్యక్తిగతంగా వినియోగించానన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో ైవైస్ ఛైర్ పర్సన్ ఉపాసనా కామినేని పాల్గొన్నారు. -
సిరుల పంట ‘కినోవా’!
సాగు నీటి కొరత తదితర కారణాల వల్ల వరి సాగు లాభదాయకంగా లేకపోవటంతో నల్లగొండ జిల్లా (పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట)కు చెందిన అభ్యుదయ రైతు వంగాల ప్రతాప రెడ్డి(9885949265) కినోవా అనే కొత్త పంటను సాగు చేస్తున్నారు. బొలీవియా దేశం నుంచి తెప్పించిన తెల్ల రకం కినోవాను ఖరీఫ్‌లో ఎకరంన్నరలో సాగు చేసి 11 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. రూ. 95 వేల నికరాదాయం పొందారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయటంతో రూ. 15 వేలు మాత్రమే ఖర్చయిందన్నారు. తాను పండించిన కినోవా ధాన్యం కిలో రూ. 100లకు విక్రయించారు. వరి సాగు చేసినా ఎకరాకు రూ. 10 వేలు కూడా మిగలటంలేదని, దీనికి బదులు కినోవాను ఆరుతడి పంటగా సాగు చేస్తే ఎకరాకు మంచి ఆదాయం పొందవ చ్చని ఆయన అంటున్నారు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన రబీలో రెండెకరాల్లో కినోవాను సాగు చేస్తున్నారు. ట్రేలలో నారు పెంచి, నాట్లు వేశారు. -
కలప తరలిపోతోంది..
* ప్రేక్షక పాత్రలో అధికారులు * మొబైల్ పార్టీ నిఘాతో పట్టివేత జన్నారం : కలప స్మగ్లర్ల కన్ను కవ్వాల్ అభయారణ్యంలోని టేకు చెట్లపై పడింది. ఈ ప్రాంతంలో లభించే టేకుకు భారీ డిమాండ్ ఉండడంతో వృక్షాలపై వేటు వేస్తున్నారు. కవ్వాల్ అభయారణ్యంలోని పలు ప్రాంతాల నుంచి విలువైన టేకును తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. తాళ్లపేట్ రేంజ్లో నిత్యం కలప తరలిపోతున్నట్లు తెలుస్తోంది. స్వయంగా డీఎఫ్‌వో దామోదర్‌రెడ్డి రంగంలోకి దిగి మొబైల్ పార్టీ, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది ద్వారా కలప స్వాధీనం చేసుకున్న సంఘటనలే అందుకు నిదర్శనం. ఉన్నతాధికారులు కలప స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతుండగా.. కొందరు కింది స్థాయి అధికారుల సహకారంతో కలప అక్రమ రవాణా సాగిపోతోంది. డివిజన్లోని ఇందన్పల్లి రేంజ్ పరిధిలో కూడా ఇటీవల స్మగ్లింగ్ పెరిగింది. రేంజ్ పరిధిలోని కల్లెడ, ఇందన్పల్లి బీట్ల పరిధిలో ఇటీవల పట్టుబడిన సంఘటనలు చూస్తే స్మగ్లర్ల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కల్లెడ బీట్‌లోని ఎర్రగుంటలో 20 రోజుల క్రితం రెండు ఎడ్లబండ్లు పట్టుకోగా.. గొడవకు దారి తీసి పోలీసు కేసు వరకు వెళ్లింది. ఇటీవల రూ.25వేలు విలువైన పది టేకు దుంగలు పట్టుకున్నారు. ఇందన్పల్లి రేంజ్‌లోని పలు ప్రాంతాల్లో టేకు చెట్లను నరికి వేసి దుంగలను అమ్ముకుంటున్నారు. టేకు విలువ పెరగడంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఓ ఉన్నతాధికారి తన సొంతానికి టేకు కలపతో ఫర్నిచర్ చేయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పది రోజుల క్రితం రెండు టేకు దుంగలను సదరు అధికారి కింది స్థాయి అధికారులతో తెప్పించి ఫర్నిచర్ కోసం కోతకు ఇచ్చినట్లు తెలిసింది. కలప స్మగ్లింగ్ అరికట్టాల్సిన అధికారే ఇలాంటి పనిచేయడం చర్చనీయాంశంగా మారింది. కంచె చేను మేసిన చందంగా అధికారులు వ్యవహరిస్తే కలప అక్రమ రవాణాకు ఎలా అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కలప స్మగ్లింగ్‌ను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. స్మగ్లింగ్ తగ్గింది.. గతంతో పోలిస్తే ఇందన్పల్లి అడవుల్లో కలప స్మగ్లింగ్ తగ్గింది. ఒకట్రెండు సంఘటన తప్పా కలప రవాణా లేదు. ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేశాం. రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్నాం. స్మగ్లింగ్ నిరోధానికి చర్యలు చేపడుతున్నాం. - ప్రతాప్‌రెడ్డి, ఇందన్పల్లి రేంజ్ అధికారి -
తుపాకీతో బెదిరించిన ట్రావెల్స్ యజమాని
హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల మధ్య బస్సు కొనుగోలు వివాదం గురువారం తారాస్థాయికి చేరింది. దీంతో ఓ బస్సు ట్రావెల్స్ యజమానిని తుపాకీతో బెదిరించాడు. దీంతో మరో బస్సు ట్రావెల్స్ యజమాని అయిన బాధితుడు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి బెదిరించిన ట్రావెల్స్ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... కూకట్‌పల్లిలోని ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డ్ వద్ద కృష్ణవేణి ట్రావెల్స్ యజమాని ప్రతాప్ రెడ్డి మూడు బస్సులు కొనుగోలు చేశాడు. మొత్తం నగదు చెల్లించేందుకు కొద్దిగా గడువు కావాలని ప్రతాప్ రెడ్డి కోరాడు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించాడు. గడువు ముగిసిన నగదు చెల్లించకపోవడంతో ప్రతాప్ రెడ్డి వైఖరిపై సునీల్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతాప్ రెడ్డిని గురువారం సునీల్ రెడ్డి తుపాకీతో బెదిరించారు. దీంతో తనకు ప్రాణ హాని ఉందని సునీల్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. -
ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఫిక్కీ ఎక్స్‌లెన్స్ అవార్డ్
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య పరిరక్షణలో అసాధారణమైన సేవలందిస్తున్నందుకు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టుకు ఫిక్కీ హెల్త్‌కేర్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. ఈనెల 1న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఫిక్కీ అవార్డుల జ్యూరీ చైర్మన్, కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ సరీన్, అపోలో ఆస్పత్రుల అధినేత డాక్టర్ ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ ధనుంజయ్‌రెడ్డి అవార్డును అందుకున్నారు. పేదలకు నాణ్యమైన వైద్యసేవలను అందించినందుకుగాను ఈ అవార్డును ప్రదానం చేశారు. అవార్డు కోసం దేశవ్యాప్తంగా అందిన దరఖాస్తుల పరిశీలనకు జస్టిస్ మన్మోహన్సరీన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దరఖాస్తుల పరిశీలనతోపాటు క్షేత్రస్థాయిలోనూ అధ్యయనం చేసిన అనంతరం ‘ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు’ను ఎంపిక చేసింది. -
గజ్వేల్ లో గట్టెక్కిన గులాబీ బాస్!
తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావుకు మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో విజయం సునాయాసంగా దక్కలేదు. రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో అత్యంత ఉత్యంఠ రేపిన గజ్వేల్ నియోజకవర్గంలో సమీప ప్రత్యర్ధి, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ప్రతాపరెడ్డిపై 19218 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కేసీఆర్, ప్రతాప్ రెడ్డిల మధ్య విజయం దోబూచలాడింది. ఓ దశలో నువ్వా నేనా అనే రీతిలో ఆసక్తిని కలిగించింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్రను పోషించిన కేసీఆర్ కు ప్రతాపరెడ్డి గట్టిపోటినే ఇచ్చారు. తెలంగాణ తెచ్చింది... ఇచ్చింది మేమే అంటూ క్రెడిట్ ను కొట్టేయడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ తరపున టి. నర్సారెడ్డిని సైతం ప్రతాప్ రెడ్డి వెనక్కినెట్టడం చర్చనీయాంశమైంది. ఎన్నికల ఫలితాలకు ముందే గజ్వేల్ కేసీఆర్ కు ఓటమి తప్పదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తోపాటు, పలు రాజకీయపార్టీల నేతలు జోరుగా ప్రచారం చేశారు. ప్రత్యర్ధుల ప్రచారానికి తోడు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కేసీఆర్ కు ప్రతాప్ రెడ్డి ఎదురొడ్డి పోరాడారు. ప్రతాపరెడ్డి ఓటమిపాలైనా.. కేసీఆర్ కు ధీటుగా నిలిచి.. రెండు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించారు. గజ్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ప్రతాప్ రెడ్డిపై కేసీఆర్ 19218 ఓట్ల తేడాతో విజయం సాధించడం పక్కనపెడితే.. కేసీఆర్ కు ఊహించని రితీలో గట్టిపోటిని ఇచ్చారు. జిల్లాలో ఇతర టీఆర్ఎస్ నేతలు భారీ మెజార్టీని చేజిక్కించకుంటే.. కేసీఆర్ స్వల్ప మెజారిటీని సాధించారు. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ సుమారు 4 లక్షల ఓట్ల మెజార్టీ సాధించారు. అయితే గజ్వేల్ లో మాత్రం భారీ మెజార్టీని సాదించలేకపోయారు. అసెంబ్లీ ఫలితాలకు ముందే గజ్వేల్ మున్సిపాలిటి, జెడ్పీటీసీని తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. కాని టీఆర్ఎస్ మాత్రం కేసీఆర్ గెలుపుపై ఆరంభం నుంచి ధీమాగానే ఉంది. కేసీఆర్ విజయానికి సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్ రావు అన్ని తానై వ్యవహరించారు. గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడంతో ఓదశాబ్ద కాలం తర్వాత కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 2004లో కరీంనగర్, 2009 మహబూబ్ నగర్ పార్లమెంటరీ స్థానం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. 70వ దశకంలో సంజయ్ గాంధీ నేతృత్వంలోని యూత్ కాంగ్రెస్ లో చేరడం ద్వారా తన రాజకీయ కెరీర్ ను అరంభించారు. 1977లో ఇందిరాగాంధీ క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో జిల్లా కాంగ్రెస్ నేతలతోపాటు కేసీఆర్ మద్దతుగా నిలిచారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన కేసీఆర్ కాంగ్రెస్ నేత ఏ.మదన్ మోహన్ చేతిలో పరాజయం పాలయ్యారు. 1985 నుంచి 2004 వరకు సిద్దిపేట ఎమ్మెల్యేగా, 2004లో కరీంనగర్, 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2001లో డిప్యూటీ స్పీకర్ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించారు. 2004లో యూపీఏ-1 ప్రభుత్వంలో కొంతకాలం కేంద్రమంత్రిగా సేవలందించారు. -
ఓయూ పరీక్షలు మళ్లీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో మే 3 నుంచి ప్రారంభం కానున్న వివిధ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. తొలుత ఏప్రిల్ 25 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను 30న జరిగే సాధరణ ఎన్నికల దృష్ట్యా మే 3కు వాయిదా వేశారు. ఓట్ల లెక్కింపు కారణంగా ఇప్పుడు మరోమారు పరీక్షలను వాయిదా వేశారు. ఓయూ క్యాంపస్‌తో పాటు అనుబంధ కళాశాలల్లో నిర్వహిస్తున్న పీజీ కోర్సులు, బీఈ, బీటెక్, ఎంబీఏ సెమిస్టర్ పరీక్షలను మే 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొ.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. పరీక్షల టైం టేబుల్, ఇతర వివరాలను www.osmania.ac.in లో చూడవచ్చు. -
పెరిగిన నామినేషన్లు
ఇందూరు, న్యూస్‌లైన్ : జడ్పీటీసీకి, ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం నామినేషన్ల జోరు పెరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జడ్పీటీసీకి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోగా, భోజన విరామం తర్వాత సాయంత్రం ఐదు గంటల లోపు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పిట్లం మండలానికి చెందిన ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్ తరపున రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇటు మండల కార్యాలయాలలో ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 134 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి 36, టీడీపీ నుంచి 15, టీఆర్ఎస్ నుంచి 33, బీజేపీ నుంచి 18, స్వతంత్రులు 32 మంది నామినేషన్లు వేశారు. వాహనదారులు ఇబ్బందుల పాలు జిల్లా పరిషత్ ముందు పోలీసులు రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వాహన దారు లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా పరిషత్ దాటిన తర్వాత నాందేవ్‌వాడ, దుబ్బ, గౌతంనగర్, హమల్వాడీ, చంద్రశేఖర్ కాలనీ, ఎన్జీఓస్ కాలనీలున్నాయి. ఈ ప్రాంత ప్రజలు తమ నివాసాలకు వెళ్లాలంటే జిల్లా పరిషత్ రోడ్డు మీద నుంచి వెళ్లాలి. పోలీసులు ఈ దారిని మూసివేయడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. నామినేషన్ కేంద్రానికి రోడ్డుకు కొద్ది దూరంలో ఉన్నప్పటికీ పోలీసులు రోడ్డును బ్లాక్ చేయడంపై నిరనసలు వ్యక్తం అయ్యాయి. -
టెట్ ప్రశాంతం
తిరుపతి, న్యూస్‌లైన్: జిల్లాలో తిరుపతి కేంద్రంగా ఆది వారం జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రశాం తంగా ముగిసింది. పేపర్-1, పేపర్-2 పరీక్షలకు మొ త్తం 20,040 మంది హాజరయ్యారు. వివిధ ప్రాంతాల్లోని మూడు పరీక్ష కేంద్రాల్లో ఇదివరకే ఉపాధ్యాయులుగా పనిచేస్తూ టెట్ రాస్తున్న ముగ్గురిని వారి వైఖరి అనుమానాస్పదంగా ఉండడంతో అధికారులు సస్పెండ్ చేసి విచారణ ప్రారంభించారు. తిరుపతిలోని ఒక పరీక్షా కేంద్రంలో పైఅధికారుల అనుమతి లేకుండా ఎస్జీటీ పరీక్ష రాస్తున్న వీ.కోట ఉర్దూ జిల్లా పరిషత్ ఉన ్నత పాఠశాలకు చెందిన ఒక స్కూల్ అసిస్టెంట్‌ను డీఈవో సస్పెం డ్చేసి విచారణకు ఆదేశించారు. బంగారుపాళెంలో ఇదివరకే ఎస్జీటీగా పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు మళ్లీ టెట్(ఎస్జీటీ) పరీక్ష రాస్తుండగా అధికారులు గుర్తించి సస్పెండ్ చేశారు. సదరు టీచర్ అదే సెంటర్ లో వెనక బెంచీలో పరీక్ష రాస్తున్న తన సోదరికి సహకారం అందించడానికి పరీక్షకు హాజరైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు పరీక్ష రాస్తున్న ఒక ఉపాధ్యాయుడు ఇది వరకే శ్రీకాళహస్తిలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండడంతో అనుమానం వచ్చి అధికారులు సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. ఈ సంఘటనలు మినహా మొత్తం మీద టెట్ ప్రశాంతంగా జరిగింది. పేపర్-1 పరీక్ష నిర్వహణకు 16 కేంద్రాలను, పేపర్-2 అభ్యర్థుల కోసం 88 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-1(డీఎడ్) పరీక్షను ఉదయం 9.30 గంటలకు, పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించారు. పేపర్-1కు 3,657 మంది దరఖాస్తు చేసుకోగా 3,292 మంది హాజరయ్యారు. పేపర్-2కు 19,150 మంది దరఖాస్తు చేసుకోగా 16,748 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
జిల్లాలో 267 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు
మదనపల్లె అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో 267 కేంద్రాల్లో 53వేల841 మం ది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారని డీఈవోప్రతాప్రెడ్డి తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం 250 పరీక్ష కేంద్రాల్లో 51వేల445 మంది రెగ్యులర్ విద్యార్థులు, 17 ప్రయివేటు పరీక్ష కేంద్రాల్లో 2,396 మంది ప్రయివేటు విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు. జిల్లాలో 67 సీ క్యాటగిరి పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, అక్కడి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈనెల 14, 15తేదీల్లో తొలివిడత ప్రశ్నపత్రా లు, 21, 22 తేదీల్లో రెండవ విడత ప్రశ్నపత్రాలను పంపిణీ చేయునున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి సౌకర్యంగా ఆర్టీసీ బస్సులు నడిపేలా అధికారులతో మాట్లాడతామన్నారు. సమావేశంలో డీవైఈవో శ్యామ్యూల్ కూడా పాల్గొన్నారు. బెంచీలు ఏర్పాటు చేయాలి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు బెంచీలు ఏర్పాటు చేయాలని మండల విద్యాశాఖాధికారులను డీఈవో ప్రతాప్‌రెడ్డి ఆదేశించారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం డివిజన్లో చీఫ్ సూపరింటెం డెంట్లు, డిపార్టుమెంటు అధికారులకు పరీక్షల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థుల్లో భయం పోగొట్టి ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి సిద్ధం చేయాలన్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులను పరిశీలన పేరుతో ఇబ్బంది పెట్టకుండా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చొని పరీక్షలు రాయకూడదన్నా రు. పరీక్ష కేంద్రం లేని ప్రయివేటు పాఠశాలలో ఉన్న ఫర్నీచర్‌ను రవాణా చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోని గదుల్లో చీకటి లేకుండా చూడాలని, మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి రోజు పాఠశాలలో జరిగే టెస్టులపై మూడు రోజులకు ఒకసారి తప్పనిసరిగా తనకు మెసేజ్ పెట్టాలన్నారు. ఈ విద్యా సంవత్సరం పరీక్ష ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో డీవైఈవో శ్యామ్యూల్, పరీక్షల నిర్వహణ సహాయ అధికారులు నిరంజన్, ఆనంద్, డివిజన్ లోని చీఫ్సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటు అధికారులు పాల్గొన్నారు. -
సర్పంచ్, వార్డు సభ్యుడిపై దాడి
డిచ్పల్లి, న్యూస్‌లైన్: డిచ్పల్లి మండలంలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామ సర్పంచ్ రూప్సింగ్ రాథోడ్, వార్డు సభ్యుడు రాజుపై ఉపసర్పంచ్ ప్రతాప్‌రెడ్డి దాడి చేయించాడని నిరసిస్తూ శనివారం డిచ్పల్లి తండావాసులు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించా రు. ట్రాక్టర్, ఆటోల్లో తరలి వచ్చిన తండా వాసులు, సర్పం చ్తో సహా డిచ్పల్లి-నిజామాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. ప్రతాప్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీధర్‌గౌడ్ ఘటనా స్థలానికి చే రుకుని తండావాసులు, సర్పంచ్‌ను సముదాయించి రాస్తారోకో విరమింపచేశారు. అనంతరం తండావాసులందరూ పోలీస్‌స్టేషన్‌ను తరలివెళ్లారు. ప్రతాప్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చే శారు. పోలీస్‌స్టేషన్ వద్ద సర్పంచ్ రూప్సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజనుడనే చిన్న చూపుతోనే తనపై గ్రామానికి చెందిన శ్రీధర్‌రెడ్డితో ఉపసర్పంచ్ దాడి చేయించినట్లు ఆరోపించా రు. తండాలో సీసీ రోడ్డు కాంట్రాక్టు పనులు అప్పగించలేదనే కక్షను మనుసులో ఉంచుకుని ఉపసర్పంచ్ ఇదం తా చేశాడని ఆరోపించాడు. తండాలో సీసీ రోడ్డు పనుల కో సం వార్డు సభ్యుడు రాజు శుక్రవారం రాత్రి కంకర వేసి ట్రాక్టర్‌పై వస్తుండగా శ్రీధర్‌రెడ్డి అడ్డగించాడన్నారు. తాను అక్కడికి వెళ్లి ట్రాక్టర్‌ను వదిలేయాలని కోరగా కులంపేరుతో దూషిం చాడని, అక్కడికి వచ్చిన ఉపసర్పంచ్ ప్రోత్సాహంతో తనపై దాడి చేసినట్లు సర్పంచ్ తెలిపారు. శ్రీధర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు బంధువులు సైతం తనపై దాడికి పాల్పడ్డారని, అడ్డువచ్చిన వార్డు సభ్యుడిపై దాడి చే సినట్లు తెలిపారు. తనతో పాటు వార్డుసభ్యుడిపై దాడి చేసిన శ్రీధర్‌రెడ్డి, దాడికి ప్రోత్సహించిన ప్రతాప్‌రెడ్డి, బెదిరించిన నర్సారెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సర్పంచ్ డిచ్పల్లి పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. సర్పంచ్ రూప్‌సింగ్‌పై తాను దాడి చేయలేదని, దాడికి ప్రోత్సహించలేదని ఉపసర్పంచ్ ప్రతాప్‌రెడ్డి విలేకరులతో తెలిపారు. గిరిజన సర్పంచ్ రూప్‌సింగ్‌పై ఉపసర్పంచ్ దాడి చేయించడం సిగ్గుచేటని మండల సర్పంచుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు పాశం కుమార్, రవీందర్‌రెడ్డి అన్నారు. ఖిల్లా డిచ్పల్లి సర్పంచ్ రూప్సింగ్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని ఎస్సై శ్రీధర్‌గౌడ్ తెలిపారు. ఇరువర్గాలతో మాట్లాడి కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
గెలిచింది ‘పొన్నాలే’
=ఎమ్మెల్యే ఎన్నికపై కొమ్మూరి పిటిషన్ కొట్టివేత =మంత్రి లక్ష్మయ్య గెలుపును సమర్థించిన హైకోర్టు =కాంగ్రెస్ నాయకుల సంబరాలు జనగామ, న్యూస్‌లైన్ : రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైకోర్టులో విజయం సాధించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పొన్నాల గెలుపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన సమీ ప ప్రత్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. 2009 ఎన్నికల్లో జనగామ నియోజకర్గం నుంచి కాం గ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుత ఐటీశాఖ మం త్రి పొన్నాల లక్ష్మయ్య బరిలో నిలిచి టీఆర్ఎస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పై 236 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే కౌంటింగ్ సమయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని.. పొన్నాల గెలుపుపై విచారణ చేపట్టాలని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోస్టల్ బ్యాలెట్లను మొదటగా లెక్కించాల్సిన అధికారులు చివర్లో లెక్కించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే రౌండ్ , రౌండ్‌కు లెక్కింపు 100 నుంచి 200ల మెజారిటీకి అటు ఇటుగా ఇరు అభ్యర్థులకు వచ్చింది. చివర్లో 236 ఓట్ల లీడ్‌తో పొన్నాల గెలుపొందారని ఎన్నికల అధికారులు ప్రకటించగా, కొమ్మూరి సదరు కౌంటింగ్ తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. కౌంటింగ్ చివర్లో తనకు వచ్చిన లీడ్‌ను పొన్నాలకు వచ్చినట్లుగా అధికారులకు చూపించార ని.. రీకౌంటింగ్ చేయాలని హైకోర్టులో పిటిష న్ దాఖలు చేసి ఆయన న్యాయ పోరాటానికి దిగారు. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య తనపై హైకోర్టులో వేసిన ఎన్నికల పిటిషన్‌ను కొట్టి వేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో కేసు నడుస్తున్నందున తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ సదరు పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2012 జూలై 6న తోసిపుచ్చింది. ఈ క్రమంలో ఇరువురి వాదనలు విన్న హై కోర్టు బుధవారం కొమ్మూరి పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నిజాయితీ మరోసారి బహిర్గతం.. హైకోర్టు వెలువరించిన తీర్పుతో మంత్రి పొన్నాల లక్ష్మయ్య నిజాయితీ మరోసారి బహిర్గతమైందని కాంగ్రెస్ జనగామ మండల శాఖ అధ్యక్షుడు చిర్ర సత్యనారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు వనజారెడ్డిలు అన్నారు. బుధవా రం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరి గిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు త ప్పు చేయలేదని చెప్పారు. ప్రజా తీర్పును జీర్ణించుకోలేని కొమ్మూరి హైకోర్టులో కేసు వేసి భంగపడ్డారని విమర్శించారు. నిత్యం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పొన్నాలపై ఇకనైనా ఆరోపణలు మానుకోవాలని వారు సూచించా రు. సమావేశంలో నాయకులు జక్కుల వేణుమాధవ్, మజూర్ షరీఫ్, ఎమ్డీ అన్వర్, మేడ శ్రీనివాస్, మల్లేష్, విజయ, యాదగిరి, ప్రవీ ణ్, రాజేశ్వరి, నర్సింగారావు, వెంకట్న ర్సు, యాదగిరి, ప్రకాష్, మహెందర్‌రెడ్డి, రంగరాజు ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఓయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ బంద్ నేపథ్యంలో ఈ నెల 5 (గురువారం)న ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలను www.smania.ac.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. నేటి పాలిటెక్నిక్ డిప్లొమా పరీక్షలు 30కి వాయిదా తెలంగాణ బంద్ నేపథ్యంలో నేడు జరగాల్సిన పాలిటెక్నిక్ డిప్లొమా పరీక్షలను ఈ నెల 30కి వాయిదా వేశారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి డీ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంద్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు. బీఎస్సీ నర్సింగ్, ఎంఎల్టీ పరీక్షలు వాయిదా విజయవాడ: తెలంగాణ బంద్ నేపథ్యంలో గురువారం జరగాల్సిన బీఎస్సీ (ఎంఎల్టీ), బీఎస్సీ (నర్సింగ్) పరీక్షలు వాయిదా వేసినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి. విజయ్‌కుమార్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. 6వ తేదీ శుక్రవారం నుంచి జరుగాల్సిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. -
హైవేపై లారీ దగ్ధం
డోన్‌టౌన్, న్యూస్‌లైన్ : గ్రానైట్ క్వారీ నుంచి రాళ్లను తరలిస్తున్న ఓ లారీని ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై తగులబెట్టిన ఘటన డోన్‌లో కలకలం రే పింది. ఆదోని క్వారీ నుంచి కృష్ణగిరి, చనుగొండ్ల, ఇందిరాంపల్లెలో ఉన్న గ్రానైట్ క్వారీల నుంచి నిత్యం టన్నుల కొద్ది గ్రానైట్ తరలిపోతోంది. అయితే వీటి రవాణా విషయంలో ఆధిపత్యం చాటుకోవడం కోసం టీడీపీ నాయకుడు కేశన్న, తాడిపత్రికి చెందిన ట్రాన్స్‌పోర్టు యజమాని మధ్య వివాదపడుతున్నారు. ఇద్దరి మధ్య నెలకొన్న వివాదాగ్నికి ఆదివారం రాత్రి లారీ బుగ్గిగా మారింది. ఓబులాపురం మిట్ట వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు బొలెరో క్యాబ్‌లో వచ్చి లారీని అడ్డుకున్నట్లు డ్రైవర్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సెల్ఫోన్లను లాక్కోవడంతోపాటు టైర్లలో గాలితీశారన్నారు. చితకబాదడడంతో పారిపోయినట్లు తెలిపాడు. అనంతరం డీజిల్ట్యాంకును పగులగొట్టి లారీకి నిప్పు పెట్టారని ఆరోపించాడు. అయితే గ్రానైట్ తరలిస్తుంటే అడ్డుకుని చెక్ పోస్టు అధికారి వెంకటయ్య, మీడియాకు సమాచారం అందించాము తప్పితే మిగతా విషయాలు తమకు తెలియవని ఎమ్మార్పీఎస్ నాయకులు గంధం శ్రీనివాసు, మరికొందరు తెలిపారు. యాజమాన్యమే ఈ పని చేసి నింద తమపై మోపుతోందని ఆరోపించారు. లారీని ఎవరు తగులబెట్టారనే విషయంపై స్పష్టత రాలేదు. ఇందుకు సంబంధించి లారీ యజమాని సుబ్బారావు ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకుడు టీ.ఈ. కేశన్నగౌడ్, ఉంగరానిగుండ్ల సర్పంచ్ రాముడు, ఎమ్మార్పీఎస్ నాయకుడు గంధం శ్రీనివాస్, క్యాబ్ డ్రైవర్ బాషా, ఈడిగె గోపాలు, సుధాకర్, ముజాఫర్, రంగన్న, మరొకరిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. -
వసూళ్లకు పది మార్గాలు!
=విద్యార్థుల నుంచి ఎక్కువ మొత్తంలో పది పరీక్షల ఫీజు వసూలు = ప్రైవేటులోనే కాదు.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ అదే తీరు =అధికారులకు ఫిర్యాదుల వెల్లువ చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో తరగతులు సరిగ్గా జరక్క విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటే విద్యాసంస్థలు మా త్రం అవేమీ పట్టించుకోవడం లేదు. నిబంధనలు తుంగలో తొక్కి అధిక మొత్తంలో ఫీజులు వసూళ్లు చేస్తూ నిలువుదోపిడీ చేస్తున్నాయి. 2014 మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ ప రీక్షలు రాసేందుకు రెగ్యులర్ విద్యార్థులకు రూ.125 ఫీజుగా నిర్ణయించారు. అయితే జిల్లాలోని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి నాలుగైదు ఇంతలు ఎక్కువగా వసూలు చేస్తూ జేబులు నింపుకునే పనిలో పడ్డారు. రెం డ్రోజుల క్రితం జిల్లా విద్యాశాఖాధికారి విద్యార్థుల నుంచి అధికంగా ఫీజు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని ఫోన్ నంబర్లు ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది. 50కు పైగా పాఠశాలల్లో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు అధికారులకు మేసేజ్‌లు వచ్చాయి. అధిక మొత్తంలో వసూలు చేసిన వాటిలో ప్రభుత్వ పాఠశాలలూ ఉండడం గమనార్హం. రూ.వెయ్యి వరకూ వసూలు పదో తరగతి ఫీజు 125 రూపాయలే. కొన్ని వి ద్యాసంస్థలు విద్యార్థుల నుంచి రూ.500, రూ. 600 వరకు వసూలు చేసినట్టు తల్లిదండ్రులు మేసేజ్‌ల ద్వారా ఫిర్యాదు చేశారు. తిరుపతి, చిత్తూరు ప్రాంతాల నుంచే ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. నాలుగైదు పాఠశాలల్లో అయితే వెయ్యి వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదులందాయి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఎక్కువ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారో అని సదరు యా జమాన్యాన్ని అడుగుదామంటే, పరీక్షల సమయంలో హాల్‌టిక్కెట్ ఇవ్వరేమోననే భయంతో ఇవ్వాల్సి వచ్చిందని ఓ విద్యార్థి తండ్రి అధికారులతో వాపోయాడు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఒకసారి ఫెయిల్ అయి, పరీక్షలు రాసే విద్యార్థుల నుంచి వెయ్యి నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఫిర్యాదులు డీఈవో ప్రతాప్ రెడ్డి దృష్టికి వెళ్లాయి. అధికారులకు ఇవ్వాలి .. ‘ఎక్కువ డబ్బులు తీసుకుంటోంది మా కోసం కాదు.. పరీక్షలు నిర్వహించే అధికారుల కోసం’ అంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తల్లి దండ్రులను బోల్తాకొట్టిస్తున్నాయి. పరీక్షల సిబ్బంది నుంచి ఐసీఆర్ (ఇంటెలిజెంట్ క్యారక్టర్ రికగ్నేషన్) ఫారాలు తీసుకునేటప్పు డు, తర్వాత వారికి నామినల్ రోల్స్ సమర్పించేటప్పుడు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు అనధికారికంగా కొంత మొత్తం ఇస్తారు. అందువల్లే విద్యార్థుల నుంచి యాజమాన్యాలు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తాయని పలువురు అంటున్నారు. అయితే అధికారులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. తప్పు ఎవరిదైనా ఈ విషయంలో విద్యార్థులే చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు 21వ తేదీ వరకు సమయం ఉండడంతో విద్యాశాఖ అధికారులు వెంటనే మేల్కొనాల్సి ఉంది. కఠిన చర్యలు తీసుకుంటాం నిబంధనల ప్రకారమే పదో తరగతి విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసూలు చేయాలి. ఎక్కువగా వసూలు చేసే పాఠశాలల వివరాలు చెప్పాలని కోరగా, కొందరు తల్లిదండ్రులు స్పందించారు. వీటిపై చర్యలు తీసుకుంటాం. అలాగే ఐసీఆర్ ఫారాలు తీసుకొనేప్పుడు ఎవ్వరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగినా నేరుగా ఫిర్యాదు చేయాలి, -ప్రతాప్‌రెడ్డి, డీఈవో