
గెలిచింది ‘పొన్నాలే’
రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైకోర్టులో విజయం సాధించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పొన్నాల గెలుపుపై అభ్యంతరం వ్యక్తం .
=ఎమ్మెల్యే ఎన్నికపై కొమ్మూరి పిటిషన్ కొట్టివేత
=మంత్రి లక్ష్మయ్య గెలుపును సమర్థించిన హైకోర్టు
=కాంగ్రెస్ నాయకుల సంబరాలు
జనగామ, న్యూస్‌లైన్ : రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైకోర్టులో విజయం సాధించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పొన్నాల గెలుపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన సమీ ప ప్రత్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. 2009 ఎన్నికల్లో జనగామ నియోజకర్గం నుంచి కాం గ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుత ఐటీశాఖ మం త్రి పొన్నాల లక్ష్మయ్య బరిలో నిలిచి టీఆర్‌ఎస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పై 236 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.
అయితే కౌంటింగ్ సమయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని.. పొన్నాల గెలుపుపై విచారణ చేపట్టాలని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోస్టల్ బ్యాలెట్లను మొదటగా లెక్కించాల్సిన అధికారులు చివర్లో లెక్కించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే రౌండ్ , రౌండ్‌కు లెక్కింపు 100 నుంచి 200ల మెజారిటీకి అటు ఇటుగా ఇరు అభ్యర్థులకు వచ్చింది.
చివర్లో 236 ఓట్ల లీడ్‌తో పొన్నాల గెలుపొందారని ఎన్నికల అధికారులు ప్రకటించగా, కొమ్మూరి సదరు కౌంటింగ్ తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. కౌంటింగ్ చివర్లో తనకు వచ్చిన లీడ్‌ను పొన్నాలకు వచ్చినట్లుగా అధికారులకు చూపించార ని.. రీకౌంటింగ్ చేయాలని హైకోర్టులో పిటిష న్ దాఖలు చేసి ఆయన న్యాయ పోరాటానికి దిగారు. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య తనపై హైకోర్టులో వేసిన ఎన్నికల పిటిషన్‌ను కొట్టి వేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో కేసు నడుస్తున్నందున తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ సదరు పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2012 జూలై 6న తోసిపుచ్చింది. ఈ క్రమంలో ఇరువురి వాదనలు విన్న హై కోర్టు బుధవారం కొమ్మూరి పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు.
నిజాయితీ మరోసారి బహిర్గతం..
హైకోర్టు వెలువరించిన తీర్పుతో మంత్రి పొన్నాల లక్ష్మయ్య నిజాయితీ మరోసారి బహిర్గతమైందని కాంగ్రెస్ జనగామ మండల శాఖ అధ్యక్షుడు చిర్ర సత్యనారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు వనజారెడ్డిలు అన్నారు. బుధవా రం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరి గిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు త ప్పు చేయలేదని చెప్పారు. ప్రజా తీర్పును జీర్ణించుకోలేని కొమ్మూరి హైకోర్టులో కేసు వేసి భంగపడ్డారని విమర్శించారు. నిత్యం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పొన్నాలపై ఇకనైనా ఆరోపణలు మానుకోవాలని వారు సూచించా రు. సమావేశంలో నాయకులు జక్కుల వేణుమాధవ్, మజూర్ షరీఫ్, ఎమ్డీ అన్వర్, మేడ శ్రీనివాస్, మల్లేష్, విజయ, యాదగిరి, ప్రవీ ణ్, రాజేశ్వరి, నర్సింగారావు, వెంకట్‌న ర్సు, యాదగిరి, ప్రకాష్, మహెందర్‌రెడ్డి, రంగరాజు ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.