సాక్షి, అనంతపురం: బిర్రు ప్రతాప్‌రెడ్డి చంద్రబాబు కోవర్ట్ అని ఏపీ రెడ్డి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ రెడ్డి సంఘం అధ్యక్షుడు నరేష్ కుమార్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డిపై మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాల మేరకే స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై బిర్రు ప్రతాప్ రెడ్డి సుప్రీంకోర్టు ను ఆశ్రయించారని ఆరోపించారు. గత ఎన్నికల్లో రెడ్ల ఓట్లను చీల్చేందుకు కుట్ర పన్నారని దుయ్యబట్టారు. బిర్రు ప్రతాప్‌రెడ్డిని రెడ్డి సంఘం ఎప్పుడో బహిష్కరించిందని నరేష్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. (ఈయన వైఎస్సార్‌సీపీ నాయకుడట!)
టీడీపీ మరోసారి నిరూపించకుంది..
టీడీపీ.. బీసీలకు వ్యతిరేకమని మరో నిరూపించుకుంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మొత్తంగా 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ కోర్టుకు వెళ్లి మోకాలొడ్డింది. టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ గౌరవాధ్యక్షుడుగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చాంబర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న బిర్రు ప్రతాప్ రెడ్డి రిజర్వేషన్ల తగ్గింపు కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. చంద్రబాబు సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇతనికి ఓ నామినేటేడ్ పదవిని కూడా కట్టబెట్టింది. (టీడీపీ.. బీసీ వ్యతిరేకి)
Comments
Please login to add a commentAdd a comment