సాక్షి, వైఎస్సార్‌సీపీ: అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ఈ పార్టీ కడప కన్వీనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా ఈనెల 22, 23 తేదిల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈనెల 30న కపలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామని పేర్కొన్నారు.
అగ్రిగోల్డ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కోరినా ప్రభుత్వం పట్టింకోవట్లేదని మండిపడ్డారు. బాధితుల ఆస్తులను టీడీపీ నేతలు దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారని, బాధితుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. వేలకోట్ల రూపాయలు విలువచేసే అగ్రిగోల్డ్ ఆస్తులను వేలంవేసి ప్రభుత్వం ఎందుకు ఆదుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment