agri gold
-
అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలని చూసి.. ఇప్పుడు నీతులు చెబుతావా లోకేష్
టీడీపీ ప్రభుత్వంలో వెలుగుచూసిన అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని చంద్రబాబు, టీడీపీ నేతలు ఆస్తుల సంపాదనకు అక్షయ పాత్రగా మలచుకోవాలని పన్నిన పన్నాగాలు అన్నీ ఇన్ని కావు. కేసులను బూచిగా చూపి అగ్రిగోల్డ్ ఆస్తులను చవగ్గా కొట్టేయడానికి ఆ సంస్థ యాజమాన్యంతో తెరచాటు మంతనాలు సాగించారు. ప్రధానంగా రాజధాని అమరావతి పరిధిలో ఉన్న వందల కోట్ల విలువైన హాయ్‌ల్యాండ్‌ను హస్తగతం చేసుకోవాలని పంతం పట్టిన చంద్రబాబు తనయుడు లోకేశ్ ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడు. మేము అగ్రి గోల్డ్ బాధితులకు 7 కోట్లు (ఆత్మహత్య చేసుకున్న 142 మందికి ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున ) ఇచ్చామని లోకేష్ అంటున్నారు. రాష్ట్రంలో 11 .57 లక్షల మంది డిపాజిటర్లు అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేశారు. వారిలో 20 వేలు లోపు డిపాజిట్ చేసినవారికి "930 కోట్లు చెల్లించి" 10.37లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నారు సీఎం జగన్. మిగిలిన వారికి కూడా డిపాజిట్ మొత్తం చెల్లించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంతో ఏలూరు కోర్టులో కేసు వేసి పోరాడుతోంది జగన్ ప్రభుత్వం (అసలు అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగుచూసింది చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే) అగ్రిగోల్డ్ సంస్థ 8 రాష్ట్రాల్లో 19 లక్షల మంది (19,18,865 )డిపాజిటర్ల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసి, వారందరినీ నిలువునా ముంచింది. టీడీపీ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నతాధికారి ద్వారా మంత్రాంగం చేశారు, 85 ఎకరాల్లో విస్తరించిన హాయ్‌ల్యాండ్‌లో దాదాపు 25 ఎకరాల్లో భవనాలు, సామగ్రి ఉన్నాయి. అందుకోసం అగ్రిగోల్డ్ ఆస్తులను సంస్థ యాజమాన్యం అమ్మేసుకుని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించేందుకు టీడీపీ ప్రభుత్వం సహకరించింది. ప్రతిఫలంగానే అగ్రిగోల్డ్ యాజమాన్యం కోట్లు విలువ చేసే కొన్ని కీలక ఆస్తులను కారు చౌకగా టీడీపీ ముఖ్యులకు విక్రయించింది. అగ్రిగోల్డ్ మాజీ వైస్ చైర్మన్ డొప్పా రామ్మోహన్రావు 2016 ఏప్రిల్ 30న టీడీపీలో చేరడం ఆ సంస్థ యాజమాన్యానికి చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనం. అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్మెంట్ జీవో రాక ముందే 2015 జనవరి 19న టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చౌదరి భార్య వెంకాయమ్మ పేరుతో అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీ అయిన రామ్ ఆవాస్ రిసార్ట్స్, హోటల్స్ గ్రూప్ డైరెక్టర్ ఉదయ్ దినకర్ నుంచి 14 ఎకరాలు కొన్నది. అగ్రి గోల్డ్ డైరెక్టర్లు, వారి భార్యలు, బంధువులు, బినామీల పేరుతో ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తులపై అప్పట్లో సీఐడీ దృష్టి పెట్టలేదు. రూ. 976 కోట్లను 156 కంపెనీలకు మళ్లించిన విషయాన్నీ పట్టించుకోలేదు. ఇదీ చదవండి: ఓం ప్రథమం... ఎదురైంది దుశ్శకునం -
అగ్రిగోల్డ్ భూములు అన్యాక్రాంతం!
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తులో సీఐడీ నిద్రమత్తులో జోగుతోంది. వేల ఎకరాలు చే తులు మారుతున్నా పట్టించుకోకపోవడమే కాకుం డా గతంలో అటాచ్ చేసిన ఆస్తులను కాపాడటంలోనూ విఫలమవుతోంది. హైదరాబాద్‌లో అగ్రిగోల్డ్‌కు చెందిన ఓ భవనాన్ని కబ్జాదారులు కూల్చేసి దర్జాగా మరో నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతుండటం ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. నాలుగేళ్ల క్రితం జప్తు: హైదరాబాద్‌లోని కాప్రాలో అగ్రిగోల్డ్ ఫుడ్స్ అండ్ ఫారమ్స్ లిమిటెడ్‌కు 333 గజాల స్థలంలో ఓ భవనం ఉంది. దీన్ని సీఐడీ 2018లోనే జప్తు చేసింది. అయితే గతేడాది 2021 మేలో ఒక వ్యక్తి కబ్జాకు విఫలమయత్నం చేశాడు. అప్పుడు అగ్రిగోల్డ్ డైరెక్టర్లలో ఒకరైన అవ్వా సీతారామారావు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. కబ్జా వ్యవహారం, కేసు నమోదుపై 2021, మే 21న మల్కాజ్గిరి డీసీపీ సీఐడీకి ఓ లేఖ రాశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించిన జీవోలతోపాటు వివరాల ప్రతిని ఇవ్వాలని, తమ జోన్లో అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ఒక భవనం కబ్జాపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు సీఐడీకి ఆ డీసీపీ రాసిన లేఖగానీ, ఆస్తి కబ్జా సమాచారం గానీ లేదు. గతేడాది దర్యాప్తు అధికారి ఆ వ్యవహారంపై దృష్టి పెట్టకపోవడం, అగ్రిగోల్డ్ డైరెక్టర్లు ఇచ్చిన సమాచారంతో కనీసం క్షేత్రస్థాయిలోనూ తనిఖీ చేయకపోవడం వివాదాస్పదమవుతోంది. దర్జాగా భవనం కూల్చి...: ఈసీఐఎల్‌లో ఉన్న అగ్రిగోల్డ్‌కు చెందిన భవనాన్ని కూల్చేసి బోరు వేసి న ఓ వ్యక్తిపై అగ్రిగోల్డ్ బాధిత సంఘం ‘సాక్షి’కి సమాచారం ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. అగ్రిగోల్డ్ వ్యవహారంపై వరుస కథనాలు అందిసు ్తన్న ‘సాక్షి’కి బాధితులు ఆ ఆస్తికి సంబంధించిన అన్ని వివరాలు అందజేశారు. ఈ విషయాన్ని సీఐడీ ఉన్నతాధికారులకు తెలపగా అప్పుడు రంగంలోకి దిగారు. నెల రోజుల క్రితం ఆ స్థలంలో ఉన్న భవ నం కూల్చేసి బోర్ వేసినట్టు బాధితులు గుర్తించా రు. ఆ ఫొటోలను సీఐడీకి పంపగా కొత్తగా వచ్చిన దర్యాప్తు అధికారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి సంబంధిత స్థలం సీఐడీ జప్తులో ఉందని, కబ్జాకు యత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందంటూ ఎట్టకేలకు బోర్డు ఏర్పాటు చేశారు. జప్తు చేసిన వాటిని కాపాడాలి.. అగ్రిగోల్డ్‌కు చెందిన బినామీ ఆస్తులను ఎలాగూ గుర్తించని సీఐడీ అధికారులు, కనీసం జప్తులో ఉన్న ఆస్తులనైనా కాపాడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కష్టపడి సంపాధించిన సొమ్మును అగ్రిగోల్డ్‌లో పెట్టి మోసపోయామని... ఇప్పటికైనా సీఐడీ అధికారులు జప్తు చేసిన ఆస్తుల పరిస్థితి ఏమిటి? అవి భద్రంగా ఉన్నాయా లేకా అన్యాక్రాంతమయ్యాయా అనే అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. మరోవైపు ఈ విషయంలో స్థానిక పోలీసుల నుంచి లేఖలు వచ్చినా అవి దర్యాప్తు అధికారి వరకు రాకపోవడంపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం అటాచ్ చేసిన ఆస్తుల పరిస్థితిపై దృష్టి పెట్టకపోవడంపై గత దర్యాప్తు అధికారి నిర్లక్ష్యం ఉన్నట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
‘అగ్రిగోల్డ్’లో కొత్త ట్విస్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు పునర్విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అగ్రిగోల్డ్‌కు బినామీ కంపెనీలుగా ఉన్న నాలుగు కంపెనీలను గుర్తించడంలో విఫలమైన గత దర్యాప్తు అధికారులు... వాటిని అమ్మిన, కొన్న వ్యక్తుల విచారణలోనూ విఫలమైనట్లు సీఐడీ ఉన్నతాధికారులు తాజాగా గుర్తించారు. 76 ఎకరాలకు సంబంధించి జరిగిన లావాదేవీల్లో కొనుగోలు చేసిన వ్యక్తిని బినామీగా ఆరోపించిన గత అధికారులు... మరి నాలుగు కంపెనీల్లో డైరెక్టర్‌గా లేదా కనీసం ఉద్యోగిగా కూడా లేని వ్యక్తి విక్రయాలు సాగించడంపై ఎందుకు దృష్టి సారించలేదన్నది ఇప్పుడు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2016లో 76 ఎకరాల భూమి అమ్మకం జరగ్గా కొనుగోలు చేసిన వ్యక్తిని బినామీగా గత దర్యాప్తు అధికారులు అనుమానిస్తూ 2020లో పలు విభాగాలకు లేఖలు రాశారు. బినామీ కంపెనీల నుంచి భూములు కొన్న వ్యక్తి హైకోర్టు ఆదేశాల ప్రకారం మహబూబ్‌నగర్‌లోని మిడ్జిల్‌లో 150 ఎకరాల అగ్రిగోల్డ్ భూమిని 2018లో వేలంపాటలో దక్కించుకున్నాడు. అప్పుడు వేలంపాట కమిటీలో ఉన్న సీఐడీ దర్యాప్తు అధికారి ఎందుకు అభ్యంతరం చెప్పలేదన్నది ఇప్పుడు సీఐడీ ఉన్నతాధికారులకు అంతుచిక్కకుండా ఉంది. ఇది నిర్లక్ష్యమా లేకా మరేదైనా వ్యవహారమా అన్నది తేల్చే పనిలో ఉన్నతాధికారులున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే దర్యాప్తు అధికారిని మార్చి ప్రస్తుతం అంతర్గత విచారణ చేస్తున్నట్లు సమాచారం. అగ్రిగోల్డ్ బినామీ కంపెనీల పేరిట ఉన్న 76 ఎకరాల భూమిని గుర్తించలేని దర్యాప్తు అధికారులు 2020లో అకస్మాత్తుగా ఎలా గుర్తించారు? గుర్తించినా అర్హతలేని వ్యక్తి అమ్మకం సాగించినా కేసు ఎందుకు పెట్టలేదు? కొనుగోలు చేసిన వ్యక్తికి అవి అగ్రిగోల్డ్ భూములు కాదని ఎలా తెలుస్తుంది? బినామీ కంపెనీలను ఎందుకు కేసులోకి లాగలేకపోయారు వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో ఉన్నారు. -
అగ్రిగోల్డ్ నయా ‘భూ’గోతం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్రిగోల్డ్ కంపెనీకి అనుబంధ కంపెనీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు సంస్థలకు చెందిన 76 ఎకరాల అమ్మకం వెలుగులోకి రావడం పెనుదుమారం రేపుతోంది. దీనిపై ఇన్నాళ్లూ దర్యాప్తు చేసిన అధికారులు కళ్లు మూసుకున్నట్లు వ్యవహరించిన తీరే కారణమా అనే అనుమానాలు బలపడుతున్నాయి. బినామీ కంపెనీలుగా ఉన్న కంపెనీలకు చెందిన ఎకరాల కొద్దీ భూమిని ఓ మామూలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అమ్మకం చేయగా మాజీ కానిస్టేబుల్ కొనుగోలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతున్నట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ చైర్మన్‌ను విచారించిన సీఐడీ.. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావును శుక్రవారం సీఐడీ అధికారులు విచారించారు. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లా, ఫరూక్నగర్ మండలంలో ఉన్న అగ్రిగోల్డ్ బినామీ కంపెనీలుగా సీఐడీ భావిస్తున్న మోహనా గ్రోవిస్ ఇన్ఫ్రా, లియోరా ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మాతంగి ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఖిలేంద్ర ఇన్ఫ్రా ఆగ్రో వెంచర్స్ లిమిటెడ్‌కు చెందిన 76 ఎకరాల భూమి విక్రయ వ్యవహారంపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కంపెనీల పేరిట ఉన్న భూములను రాందాస్ అనే వ్యక్తి ఏ అధికారంతో విక్రయించారో చెప్పాలని ప్రశ్నించినట్లు సమాచారం. సంబంధిత కంపెనీల డైరెక్టర్లు రాందాస్‌కు అధికారం ఇచ్చి ఉంటారా అనే విషయం తెలియదని అగ్రిగోల్డ్ చైర్మన్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అగ్రిగోల్డ్ ప్రధాన కంపెనీల నుంచి బినామీ కంపెనీల్లోకి జరిగిన లావాదేవీల పూర్తి వివరాలు అందించాలని కోరగా ఇప్పటికే పలు రాష్ట్రాల అధికారులు డాక్యుమెంట్లు సీజ్ చేశారని ఆయన సమాధానమిచ్చినట్లు తెలియవచ్చింది. అటాచ్ ప్రాపర్టీ విక్రయం ఎలా? అగ్రిగోల్డ్‌కు చెందిన 80 కంపెనీలతోపాటు బినామీ కంపెనీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 70 కంపెనీలకు చెందిన ఆస్తులను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగాలు అటాచ్ చేస్తూ గతంలోనే ఉత్తర్వులిచ్చాయి. అయితే మహబూబ్‌నగర్‌కు చెందిన ఆస్తులు తెలంగాణ పోలీస్ శాఖ ఆటాచ్ చేసిన జాబితాలో లేవు. ఈ వ్యవహారంపై రామారావును సీఐడీ అధికారులు ప్రశ్నించగా గతంలోనే ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఈ ఆస్తులను అటాచ్ చేసి ఉంటుందని, వాటిని ఎలా విక్రయించారో తనకు తెలియదని, 2016లో ఈ రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు తాను జైల్లో ఉన్నట్లు రామారావు బదులిచ్చినట్లు సమాచారం. హైకోర్టులో అఫిడవిట్.. ఈ భూముల్లో కొంత భాగాన్ని మాజీ కానిస్టేబుల్ కొనుగోలు చేయడంపై గతంలో ఈ కేసు దర్యాప్తు చేసిన అధికారి హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించినట్లు తెలిసింది. మాజీ కానిస్టేబుల్ అగ్రిగోల్డ్‌కు బినామీగా వ్యవహ రించినట్లు ఆ అధికారి కోర్టు తెలిపారని తెలిసింది. అయితే దర్యాప్తు సమయంలో ఈ బినామీ కంపెనీలకు చెందిన ఆస్తులను గుర్తించడంతోపాటు విక్రయాలు జరిగాయా లేదా అనే అంశాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారన్న విషయంపై ఇప్పుడు సీఐడీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆ దర్యాప్తు అధికారిని సీఐడీ వెంటనే పక్కనపెట్టి మరో అధికారికి బాధ్యతలు అప్పగించడంతో ఈ భూముల వ్యవహారంపై విచారణ లోతుగా కొనగసాగుతున్నట్లు తెలుస్తోంది. -
రైతులకు ఎస్బీఐ తీపికబురు.. తక్కువ వడ్డీకే రుణాలు!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రైతులకు తీపికబురు అందించింది. రైతులకు తక్కువ వడ్డీకే అగ్రి గోల్డ్ రుణాలను అందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఆసక్తి గల వ్యక్తులు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణాన్ని పొందవచ్చు. ఈ వియాన్ని ఎస్బీఐ ట్విట్టర్లో వెల్లడించింది. ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణాల పేరుతో రైతులకు రుణాలను అందిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ 7 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. యోనో యాప్ ద్వారా అప్లై చేసే రుణాలు వేగంగా మంజూరవుతాయి. రీపేమెంట్ ఆప్షన్ కూడా రైతులు తమకు కావాల్సినట్టుగా ఎంచుకోవచ్చు. ఈ ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణం మాత్రం కేవలం బంగారు నగలపై మాత్రమే లభిస్తుంది. 24 క్యారట్, 22 క్యారట్, 20 క్యారట్, 18 క్యారట్ స్వచ్ఛత గల నగలు, ఆభరణాలపై రుణాలు తీసుకోవచ్చు. 50 గ్రాముల వరకు బ్యాంక్ గోల్డ్ కాయిన్స్ పైనా రుణాలు లభిస్తాయి. గోల్డ్ బార్స్ పై ఈ రుణాలు వర్తించవు. కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణాలు తీసుకోవచ్చు. డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, పిగ్గరీ, గొర్రెల పెంపకం లాంటి వాటికీ ఈ రుణాలు వర్తిస్తాయి. యంత్రాల కొనుగోలు, వ్యవసాయం, హార్టీకల్చర్, ట్రాన్స్‌పోర్టేషన్ లాంటి అవసరాలకు ఈ రుణాలను ఉపయోగించుకోవచ్చు. Avail SBI's Agri gold loan at lowest interest rate through YONO. #SBIAgriGoldLoan #SBI #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/jawDwSzWsH — State Bank of India (@TheOfficialSBI) December 21, 2021 (చదవండి: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. రూ.1.44 లక్షల కోట్లు రీఫండ్..!) -
ఏపీ తరహాలో డిపాజిటర్లను ఆదుకుంటారా?
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ డిపాజిటర్లను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం రూ.900 కోట్లు అందించిన తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా వారిని ఆదుకునే అవకాశం ఉందా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాను పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చిన రూ.26 లక్షలను అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేశానని, వృద్ధాప్యం లో ఉన్న తనకు ఆ డబ్బు ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన రవికాంత్ సిన్హా దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. సంస్థ సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో కేన్సర్ బారినపడిన తన భార్యకు చికిత్స అందించలేకపోయానని సిన్హా పేర్కొన్నారు. ఆయన తరఫున న్యాయవాది శ్రవణ్‌కుమార్ వాదనలు విని పిస్తూ, వృద్ధాప్యంలో ఉన్న సిన్హాకు పూటగడవడం కష్టంగా ఉందని, అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బు హైకోర్టు రిజిస్ట్రార్ అధీనంలో ఉందని, ఆ డబ్బు నుంచి కొంత మొత్తాన్ని సిన్హాకు ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. డిపాజిటర్లను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముం దుకు వచ్చిందని, ఇప్పటి వరకు రూ.900కోట్లు బడ్జెట్లో కేటాయించి డిపాజిటర్లకు పంచిందని తెలిపారు. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డిపాజిటర్లకు న్యాయం చేయాలని కోరారు. కాగా, అగ్రిగోల్డ్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయ వాది తెలిపారు. అయితే పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణకు చెందిన అగ్రిగోల్డ్ బాధితుల సంఘమని, ఈ పిటిషన్‌ను బదిలీ చేయరాదని శ్రవణ్‌కుమార్ కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. అగ్రిగోల్డ్ కుంభకోణంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంతో కలిపి ఈ పిటిషన్‌ను దసరా సెలవుల తర్వాత విచారిస్తామని స్పష్టం చేసింది. అప్పటిలోగా తెలంగాణకు చెందిన అగ్రిగోల్డ్ డిపాజిటర్లను ఆదుకునే ఉద్దేశం ఉందా అన్నది తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
లేని భూమిని అమ్మేశారు.. అసలు భూమిని కొట్టేశారు
కోడుమూరు: అగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ నాయకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలతో ఆ సంస్థకు కొంత భూమిని అమ్మారు. అమ్మిన భూమికి కూడా తిరిగి తమ కుటుంబ సభ్యుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ తంతు వెనుక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రధాన అనుచరుడు దామోదర్ నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించారు. సీఐడీ అధికారుల విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామంలో సర్వే నంబర్ 113లో ఉన్న 8.24 ఎకరాల భూమిని దామోదర్ నాయుడు సోదరులు వెంకటయ్య, నారాయణ గతంలో అగ్రి గోల్డ్ సంస్థకు విక్రయించారు. ఇది సాగులో ఉన్న భూమి కావడంతో రెవెన్యూ అధికారులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని దామోదర్ నాయుడు భార్య వరలక్ష్మి, వెంకటయ్య భార్య రంగమ్మకు తిరిగి బదలాయించుకున్నారు. అలాగే సర్వే నంబర్ 146/1 రెవెన్యూ రికార్డుల్లో లేకున్నా.. నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకం సృష్టించి 6.95 ఎకరాల భూమిని దామోదర్ నాయుడు అగ్రి గోల్డ్ సంస్థకు విక్రయించారు. 149బీ, 80/1, 40/2, 40, 33/7, 25/9, 84ఏ సర్వే నంబర్లలో దామోదర్ నాయుడు సమీప బంధువులు రామాంజనేయులు, శ్రీనివాసులు, నారాయణ, నాగేశ్వరరావు, లక్ష్మమ్మ, పుల్లయ్య, పార్వతమ్మలకు భూములు లేకపోయినా నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాల ద్వారా 21.4 ఎకరాలను అగ్రి గోల్డ్ సంస్థకు అమ్మారు. బయటపడుతున్న అక్రమాలు అగ్రి గోల్డ్ కొనుగోలు చేసిన భూముల్లో భారీ ఎత్తున అక్రమాలు బయటపడుతున్నాయి. రెవెన్యూ రికార్డులు తారుమారు కావడంతో వాటి మూలాలను వెలికి తీసేందుకు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల్ని పరిశీలించి అవకతవకలను గుర్తించారు. 40/2 సర్వే నంబర్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తి విస్తీర్ణం 2.72 ఎకరాలుండగా.. 10.61 ఎకరాలున్నట్టు రిజిస్ట్రేషన్ చేయించారు. ఇలా రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నంబర్లను సృష్టించి నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలతో రిజిస్ట్రేషన్ చేయించి భూములు అమ్మినట్టు సీఐడీ అధికారుల విచారణలో బయటపడింది. వారం పది రోజుల్లో పూర్తి నివేదికను సీఐడీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు సమాచారం. రికార్డులు తారుమారు రెవెన్యూ అధికారులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని దామోదర్ నాయుడు కుటుంబ సభ్యులు రికార్డులను తారుమారు చేశారు. ప్రస్తుతం కృష్ణగిరి గ్రామ సర్పంచ్ వరలక్ష్మి (దామోదర్ నాయుడు భార్య) పేరిట సర్వే నంబర్ 113లో గల 4.12 ఎకరాల భూమిని గతంలోనే దామోదర్ నాయుడు అగ్రి గోల్డ్‌కు విక్రయించారు. అలాగే సర్వే నంబర్ 95లో రామాంజనేయులు, శ్రీనివాసులు, నారాయణ, వెంకటలక్ష్మికి ఉన్న 4.57 ఎకరాల భూమిని అగ్రి గోల్డ్‌కు అమ్మారు. అదే భూమిని వారి కుటుంబ సభ్యులు హరిబాబు, జయరాముడు, వెంకటయ్య పేర్ల మీద బదలాయించుకున్నారు. సర్వే నంబర్లు 123/1ఏ, 123/2ఏ, 123/3ఏ, 141/1, 121/2సీ, 121/1బీ, 113, 93, 92/ఏ2, 76, 68/ఏ, 64/2, 64/ఏ, 54/2, 48/5, 5/4,5,7, 144/1,2, 145/ఏ, 2సీ, 133/2, 3, 149/బీ1, 146/1బీ, 95లలో ఉన్న 126.56 ఎకరాల భూమిని గతంలో అగ్రి గోల్డ్‌కు అమ్మారు. మా దృష్టికి రాలేదు అగ్రి గోల్డ్ సంస్థ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులు తారుమారైనట్టు మా దృష్టికి రాలేదు. ఏడాది క్రితమే నేను కృష్ణగిరి తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్నాను. రికార్డుల మార్పులు, చేర్పులపై సీఐడీ అధికారులు పరిశీలన చేస్తున్నారు. – రామచంద్రారావు, తహసీల్దార్, కృష్ణగిరి -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం
సాక్షి, అమరావతి: అమాయక ప్రజలను అగ్రిగోల్డ్ సంస్థ మోసం చేస్తే, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు అండగా నిలిచి ఆదుకున్నారని అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల అగ్రిగోల్డ్ బాధితులు ఆదివారం ‘థ్యాంక్యూ సీఎం సార్’ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అగ్రిగోల్డ్ బాధితులు, సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి ప్రభుత్వం తరఫున రూ.905 కోట్ల మేర సహాయం అందించిన సీఎం.. చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. అగ్రిగోల్డ్ సంస్థ ద్వారా దేశంలో దాదాపు 8 రాష్ట్రాల్లో లక్షలాది మంది నష్టపోయారన్నారు. ఆరేళ్ల క్రితం సంస్థను మూసి వేయడంతో డబ్బు కోసం రోడ్డెక్కి ఆందోళనలు, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేశామన్నారు. సంస్థ ఆస్తులు విక్రయించడం ద్వారా బాధితులకు న్యాయం చేయవచ్చని గత ప్రభుత్వ హయాంలో కింది స్థాయి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వరకూ ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు అందించినా పట్టించుకోలేదని చెప్పారు. పోలీసులతో లాఠీచార్జ్‌లు చేయించి, కేసులు పెట్టి, జైళ్ల పాలు చేశారని వాపోయారు. ఆ సమయంలో పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు, అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన 10.40 లక్షల మందికి రూ.905 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయ, సాంకేతిక సమస్యల వల్ల కొంత మంది బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి వినతిపత్రం అందచేశారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘ నాయకులు రత్నాచారి, మోజెస్, జడ్ సన్, రాము, నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల సహకారం.. అగ్రిగోల్డ్ భూములు హాంఫట్!
సాక్షి,కర్నూలు : అగ్రిగోల్డ్ కొనుగోలు చేసిన భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఆ సర్వే నంబర్లకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకూడదు. అయితే జిల్లాలో పలుచోట్ల ఇందుకు విరుద్ధంగా జరిగింది. అగ్రిగోల్డ్ సంస్థ కొనుగోలు చేసిన భూములు వేరొకరి పేరున రిజిస్ట్రేషన్‌అయ్యాయి. కొందరికి పాసు పుస్తకాలు కూడా వచ్చాయి. సంస్థ 450 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా..క్షేత్రస్థాయిలో 100 ఎకరాలు కూడా లేదని సీఐడీ అధికారుల విచారణలో బయటపడినట్లు సమాచారం. ఇవీ అక్రమాలు.. కృష్ణగిరిలో సర్వే నంబర్ 65లో ఉన్న 3.25 ఎకరాల భూమిని బోయ లక్ష్మన్న, సర్వే 63లో 5.07 ఎకరాలను కట్టెల రంగారెడ్డి.. అగ్రిగోల్డ్ సంస్థకు విక్రయించారు. అయితే సదరు సర్వే నంబర్లలోని 8.32 ఎకరాల భూమికి కొత్త రాధమోహన్‌కు 2019 జూలైలో అప్పటి తహసీల్దార్ పట్టాదారు పాసుపుస్తకాన్ని మంజూరు చేశారు. ► అగ్రిగోల్డ్‌కు చెందిన 83/బీ, 84/సీ, 93, 82/3, 81/1, సర్వే నంబర్లలోని 30ఎకరాల భూమిని కోడుమూరు సబ్‌రిజిస్టార్ అధికారులు అబ్దుల్ రహిమాన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం సైతం మంజూరు చేశారు. ►రామకృష్ణాపురంలో టీడీపీ నాయకుడు దామోదర్‌నాయుడు 113, 146/1 సర్వే నంబర్లలో 13 .19 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్ సంస్థకు అమ్మాడు. సర్వే నంబర్ 146/1 రెవెన్యూ రికార్డులలో లేదు. అయినప్పటికీ 5.95 ఎకరాలు ఉన్నట్లు చూపి సంస్థను మోసం చేశాడు. టీడీపీ నేతల సహకారంతో రికార్డులు తారుమారు చేయించాడు. ► కృష్ణగిరి గ్రామంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం కొనుగోలు చేసిన భూములకు సంబంధించి 4/ఏ, 5, 41, 42, 43, 45, 48, 49, 54, 57/బీ, 59/సీ, 64, 113, 146/1, 141 తదితర సర్వే నంబర్లు రెవెన్యూ రికార్డుల్లో లేవు. రెవెన్యూ అధికారులు నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంతో 102.69 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్ సంస్థ కొనుగోలు చేసింది. ► కోడూరు నరసింహారావు, కోడూరు నరసయ్య, కోడూరు శశికళలకు కృష్ణగిరి గ్రామంలో 27.24 ఎకరాల భూమి ఉంది. ఈ భూములకు వేరొకరి పేరు మీద రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు ఇచ్చారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆ భూములను కొనుగోలు చేసింది. దీంతో పట్టాదారులైన రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పెదకాకానిలో అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ విచారణ
పెదకాకాని : పెదకాకాని మండలంలోని అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ పోలీసులు విచారణ చేపట్టారు. నంబూరు గ్రామ శివార్లలో అగ్రిగోల్డ్ ప్రతినిధులు 2010లో భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సీఐడీ డీఎస్పీ రామారావు సిబ్బందితో శనివారం పెదకాకాని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అగ్రిగోల్డ్ ప్రతినిధులు నంబూరులో సర్వే నంబర్ 175బీలో 2.10 ఎకరాలు, 178లో ఎకరం చొప్పున మొత్తం 3.10 ఎకరాలను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఆ భూమిలో 1.60 ఎకరాలను 2014లో వెర్టెక్స్ వెంచర్ నిర్వాహకులు కొనుగోలు చేశారని, అలానే 1.50 ఎకరాలను బొంతు శ్రీనివాసరెడ్డికి అమ్మి రిజిస్ట్రేషన్ కూడా చేశారని గుర్తించారు. అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారులకు డిపాజిట్లు చెల్లించకుండా వివాదాల్లో ఉన్నప్పుడు కొనుగోళ్లు, అమ్మకాలు ఎలా చెల్లుతాయన్న అంశంపై చర్చించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఖాతాదారులకు డిపాజిట్లు చెల్లించకుండా మోసం చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులు గుర్తించి బహిరంగ వేలం వేస్తామని సీఐడీ డీఎస్పీ రామారావు చెప్పారు. -
సీఎం జగన్ చేసిన మేలు ఎప్పటికీ మరువలేం: అగ్రిగోల్డ్ బాధితులు
-
అచ్చెన్నకు మతి తప్పింది
సాక్షి,అమరావతి: టీడీపీలో ఇంత వరకు చంద్రబాబు, లోకేశ్‌కే పూర్తిగా మతి చెడిందని అనుకున్నామని, అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు చెల్లించడంపై అచ్చెన్నాయుడు చేసిన విమర్శలు చూస్తే అచ్చెన్నకు కూడా పూర్తిగా మతి తప్పిందని అనిపిస్తుందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కో–ఆర్డినేటర్ లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ బాధితులకు నగదు చెల్లింపుపై కొన్ని పత్రికలు, కొంతమంది స్వార్థరాజకీయ నాయకులు కువిమర్శలు చేయడంపై అప్పిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అగ్రిగోల్డ్‌లో రూ.20 వేలు లోపు పొదుపు చేసిన వారికి ప్రభుత్వమే ముందుగా చెల్లించి.. ఆ తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తులమ్మి తీసుకోవాలని ప్రతిపక్ష నేతగా సీఎం జగన్.. ఆనాడే అసెంబ్లీ సాక్షిగా అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సూచించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. కానీ ఆర్బీఐ ఒప్పుకోదన్న కుంటిసాకుతో బాధితుల బలవన్మరణాలకు, వారి కుటుంబాలు రోడ్డున పడడానికీ కారకుడైన చంద్రబాబుకు నేడు అగ్రిగోల్డ్ అన్న పదాన్ని ఉచ్ఛరించడానికి కూడా అర్హత లేదని మండిపడ్డారు. -
మాట నిలబెట్టుకున్నాం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్‌లో డిపాజిట్ చేసి మోసపోయిన లక్షలాది మంది కష్టజీవులను ఆదుకోవాల్సిన గత ప్రభుత్వం మోసం చేస్తే, ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మనందరి ప్రభుత్వం న్యాయం చేసిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆ సంస్థలో డిపాజిట్ చేసిన వారందరూ కష్టజీవులని, వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అండగా నిలిచామని చెప్పారు. అగ్రి గోల్డ్ వ్యవహారం కోర్టుల్లో కొలిక్కి రాగానే ఆస్తులు అమ్మి, మిగతా బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రైవేట్ కంపెనీ మోసం చేస్తే ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని కష్టజీవులకు న్యాయం చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి అని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని పాదయాత్రలో మాటిచ్చానని, అదే విషయాన్ని మేనిఫేస్టోలో కూడా పెట్టామని.. ఆ మేరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని డిపాజిట్ దారులకు న్యాయం చేశామన్నారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి బాధితుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు. గతంలో మిగిలిపోయిన రూ.10 వేల లోపు డిపాజిట్ దారులు మరో 3.86 లక్షల మందికి రూ.207.61 కోట్లు, రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులైన 3.14 లక్షల మందికి రూ.459.23 కోట్లను చెల్లించారు. హైకోర్టు నిర్దేశించిన విధంగా మొత్తం 7 లక్షల పైచిలుకు అర్హులైన అగ్రిగోల్డ్ బాధితులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించి.. రూ.666.84 కోట్లను వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని అగ్రిగోల్డ్ బాధితులనుద్దేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వీడియో కాన్ఫరెన్స్‌లో అగ్రిగోల్డ్ బాధితులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లు ► ఈరోజు దేవుడి దయతో దాదాపు 7 లక్షల పైచిలుకు డిపాజిటర్లకు రూ.666.84 కోట్లు నేరుగా వారి అకౌంట్లలో జమ చేస్తున్నాం. మొత్తంగా అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి విడత, ఇవాళ ఇస్తున్న రెండో విడత అన్నీ కలుపుకుంటే 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లకుపైనే మన ప్రభుత్వం ఇచ్చింది. ► గత ప్రభుత్వం 2015లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మోసం చేసింది. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, మేనిఫెస్టోలో చెప్పిన మేరకు అడుగులు ముందుకు వేసి బాధితులకు న్యాయం చేశాం. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన కుటుంబాలు అన్నింటికీ ఆ మొత్తం తిరిగి ఇచ్చేసే కార్యక్రమాన్ని ఈరోజుతో పూర్తి చేస్తున్నాం. ఇలా దేశంలో ఎక్కడా జరగలేదు. గత ప్రభుత్వ మనుషుల కోసం జరిగిన స్కాం ► అగ్రిగోల్డ్ స్కాం అన్నది గత ప్రభుత్వం చేత, గత ప్రభుత్వం వల్ల, గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసం జరిగిన స్కాం అని తేలింది. గత ప్రభుత్వంలో ఉన్న వారే అగ్రిగోల్డ్ ఆస్తులను ఏవిధంగా కొట్టేయాలనుకున్నారో సాక్ష్యాధారాలు చూపిస్తూ గతంలో అసెంబ్లీలో చెప్పాం. ► అగ్రి గోల్డ్ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ గత ప్రభుత్వంలోని పెద్దలే. ఆ పెద్దలు ఎంత సేపూ అగ్రి గోల్డ్ ఆస్తులను ఎలా కొట్టేయాలనే ఆలోచించారు. ఈ మల్టీ స్టేట్ స్కాం అనేక రాష్ట్రాల్లో కోర్టుల పరిధిలో విచారణలో ఉంది. కాబట్టి, దీని వల్ల మన రాష్ట్రంలో ఎవరు.. ఎంత నష్టపోయారు? అన్నదాని మీదే ధ్యాస పెట్టాం. రూపాయి కూడా చెల్లించని గత ప్రభుత్వం ► గత ప్రభుత్వం అరకొర లెక్కల ద్వారా రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితుల సంఖ్యను 8.79 లక్షల మందిగా తేల్చింది. వీరికి రూ.785 కోట్లుగా చెల్లించాలని చెప్పింది. ప్రజలను మోసం చేస్తూ ఎన్నికలకు 2 నెలల ముందు.. 2019 ఫిబ్రవరి 7న జీవో నంబరు 31 జారీ చేసింది. కానీ రూపాయి కూడా చెల్లించలేదు. ► రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ద్వారా అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టుల్లో ఒక కొలిక్కి రాగానే వారి భూముల్ని, ఆస్తులను అమ్మించి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును తీసుకుని, మిగిలిన డబ్బును డిపాజిట్ దారులకు చెల్లించే దిశగా న్యాయపరంగా వేగంగా అడుగులు వేస్తాం. ► మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయ వల్ల మీ సోదరుడు ఈ పని చేయగలుగుతున్నాడు. మీ ఆశీస్సులు మనందరి ప్రభుత్వం మీద కలకాలం ఉండాలని కోరుకుంటున్నా. ► ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్పశ్రీవాణి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ అండ్ బి మంత్రి ఎం శంకరనారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ అడిషనల్ డీజీపీ పీ వీ సునీల్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖ వన్‌టౌన్‌లో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు అది శ్రమ జీవుల కష్టార్జితం ► రూపాయి.. రూపాయి దాచుకుని, కొద్దిగా ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో డిపాజిట్ చేసిన కష్టజీవుల సొమ్మే అగ్రిగోల్డ్ డబ్బు. ఇక్కడ డిపాజిట్ చేసింది లక్షలాది మంది కూలి పనులు చేసుకుంటున్న వారు, చిన్న చిన్న వృత్తుల వారు, తోపుడు బళ్లు, రిక్షా కార్మికులు. ఇలాంటి కష్టజీవులందరినీ కూడా గత ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి మోసం చేసి, గాలికి వదిలేసింది. ► అలాంటి వారిని ఆదుకోవాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా నిలదీశాం. వారికి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తూ అధికారంలోకి రాగానే 2019 నవంబర్‌లో రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన 3.40 లక్షల మందికి కోర్టు ఆమోదించిన జాబితా మేరకు అప్పట్లో రూ.238.73 కోట్లు చెల్లించాం. ► ఆ సమయంలో అర్హత ఉండి కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) జాబితాలో మిగిలిపోయిన మరో 3,86,275 మంది రూ.10 వేలు లోపు డిపాజిట్‌దారులకు ఇవాళ రూ.207.61 కోట్లు చెల్లింపులు చేస్తున్నాం. దీంతో పాటు రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులు దాదాపు 3.14 లక్షల మందికి రూ.459.23 కోట్లు ఇస్తున్నాం. మొత్తంగా 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లు ఇచ్చాం. రాఖీ పండగ బహుమానం అన్నా.. నేను అగ్రి గోల్డ్‌లో నెలకు రూ.500 చొప్పున రూ.11,500 జమ చేశాను. కంపెనీ మూత పడటంతో చాలా బాధపడ్డాను. చంద్రబాబుకు చాలాసార్లు ఫిర్యాదు చేశాం. రోడ్లెక్కి ధర్నాలు చేశాం. కానీ సాయం చేయలేదు. మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు మా సమస్య చెప్పుకున్నాం. మీరు సీఎంగా అవగానే వలంటీర్ మా ఇంటికి వచ్చి అన్ని వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు రెండో విడతలో మా డబ్బు మాకు అందింది. ఈ రాఖీ పండగకు మీరు మాకు ఇచ్చిన కానుకిది. –విశాలాక్షి, కర్నూలు -
మాట నిలబెట్టుకున్నాం
-
పలు జిల్లాల్లో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
-
అగ్రిగోల్డ్‌లో ఉన్న డబ్బంతా కష్ట జీవులదే..: సీఎం జగన్
-
‘మేము మోసపోతే.. ప్రభుత్వం ఆదుకోవడం చరిత్ర’
సాక్షి, తాడేపల్లి: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రెండో విడత డబ్బులు విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా నుంచి చంద్రశేఖర్ రావు అనే వాచ్మెకానిక్ మాట్లాడుతూ.. ‘‘ఐదు సంవత్సరాల పాటు అగ్రిగోల్డ్ కంపెనీలో రోజుకు 40 రూపాయల చొప్పున 18,500 కట్టాను. 2016లో సంస్థను ఎత్తేశారని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఎక్కడ తిరిగినా మాకు న్యాయం జరగలేదు. మీరు పాదయాత్రలో మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. దానిలో భాగంగానే మొదటివిడతలో పదివేల రూపాయలలోపు బాధితులకు డబ్బులు ఇచ్చారు. రెండో విడతలో భాగంగా 20వేల రూపాయలోపు బాధితులమైన మాకు ఈ రోజు డబ్బులు ఇచ్చారు’’ అని తెలిపారు. ‘‘దీని గురించి వలంటీర్లు మా ఇంటికి వచ్చి.. వివరాలు తెలుసుకుని.. దగ్గరుండి అప్లికేషన్ నింపారు. ఆన్లైన్లో అప్లై చేశారు. ఈ నెల 24 న డబ్బులు వస్తాయని చెప్పారు. మమ్మల్ని ఆదుకున్నందుకు చాలా సంతోషం. ప్రైవేట్ కంపెనీలో డబ్బులు పెట్టి.. మోసపోతే.. ప్రభుత్వం ఆదుకోవడం నిజంగా చరిత్రే. పోయాయనుకున్న డబ్బులు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మీలాంటి సీఎం ఉన్నందుకు గర్వపడుతున్నాను’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. గుంటూరు నుంచి ఉషా రాణి మాట్లాడుతూ.. ‘‘నా భర్త డెలివరీ బాయ్‌గా పని చేసేవారు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు పొదుపు చేయాలని భావించి.. అగ్రిగోల్డ్‌లో నెలనెల పొదుపు చేశాం. కానీ 2016లో కంపెనీని ఎత్తేశారని తెలిసి మా కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యిందని బాధపడ్డాం. మా డబ్బులు తిరిగి ఇప్పించాల్సిందిగా గత ప్రభుత్వాలను అభ్యర్థించాం. మీకోసం కార్యక్రమంలో అప్లికేషన్ పెట్టినా లాభం లేదు. ఏడాదిన్నర పాటు నేను ఒక్కదానే ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఆ బాధలు వర్ణించలేను. పాదయాత్రలో మీరు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. దాని ప్రకారమే మొదటి విడతలో పది వేల రూపాలయలోపు బాధితులకు డబ్బులు ఇచ్చారు. దాంతో నాకు నమ్మకం కలిగింది’’ అన్నారు. ‘‘ఈరోజు రెండో విడతలో భాగంగా 20 వేల రూపాలయ లోపు లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. నేను 15 వేల రూపాయలు కట్టాను. నా కష్టార్జితం తిరిగి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇద్దరుపిల్లలు. వారికి అమ్మ ఒడి, విద్యా కానుకు ఇలా అన్ని పథకాలు అందుతున్నాయి. నాడు-నేడులో భాగంగా స్కూళ్ల రూపురేఖలు మార్చారు. ఇప్పుడవి గవర్నమెంట్ బడుల్లా లేవు.. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో ఉన్నాయి. వలంటీర్లు ఇంటి దగ్గరకే వచ్చి అన్ని ఇస్తుండటంతో ఎంతో మేలు జరగుతుంది. మా ఆయనకు తెలియకుండా పెట్టిన డబ్బులు పొగొట్టుకుని.. ఎంత బాధపడ్డానే నాకే తెలుసు. ఓ అన్నలా మీరు నాకు తోడుండి.. నా డబ్బులు నాకు తిరిగి ఇస్తున్నారు. మీరు తండ్రిని మించిన తనయుడిగా నిలిచారు’’ అంటూ కృతజ్ఞతలు తెలిపింది. కర్నూలు నుంచి చిరువ్యాపారం చేసుకునే విశాలాక్షి మాట్లాడుతూ.. ‘‘వాళ్లు, వీళ్లు చెప్పిన మాటలు విని అగ్రిగోల్డ్ సంస్థలో నెలకు ఐదు వందల రూపాయల చొప్పున 11,500 రూపాయలు దాచుకున్నాను. 2016లో అగ్రిగోల్డ్ సంస్థ ఎత్తేశారని తెలిసి చాలా బాధపడ్డాను. డబ్బులు తిరిగి వస్తాయా రావా అని ఆందోళన పడ్డాను. చంద్రబాబు ప్రభుత్వంలో దీని గురించి ఎన్ని అభ్యర్థనలు చేసినా ఫలితం లేదు. ఇక డబ్బులు రావని ఆశలు వదిలేసుకున్నాను. ఆ సమయంలో మీరు పాదయాత్రలో మా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అప్పుడు అగ్రిగోల్డ్ సమస్య గురించి మీకు విన్నవించుకున్నాం’’ అన్నారు. ‘‘అధికారంలోకి వచ్చాకా మీరు వలంటీర్లను పంపి మా వివరాలను తెలుసుకుని.. మా డబ్బులు మాకు తిరగి ఇప్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీన్ని ఈ రాఖీ పండుగకు మీరు నాకు ఇచ్చిన కానుకగా భావిస్తున్నాను. డబ్బులు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మన ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి పథకం నాకు అందుతుంది. ఏ ప్రభుత్వం ప్రజల సమస్యల గురించి ఇంతలా ఆలోచించలేదు. మీరే ఎప్పటికి సీఎంగా ఉండాలి అని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారు: హోంమంత్రి సుచరిత
-
పేద ప్రజలు నష్టపోకుండా బాధ్యతగా తీసుకున్నాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. దీనిలో భాగంగా 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు చెల్లించినట్లు సీఎం జగన్ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారుల బ్యాంకు ఖాతాల్లో రెండో విడత పరిహారాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రెండో దశ కింద రూ.20వేల లోపు 7 లక్షల మంది డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేశామని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసమే అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిందని, గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కైందని సీఎం జగన్ అన్నారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని, 2019 నవంబర్లోనే 3.40 లక్షల మందికి రూ.238.73 కోట్లు చెల్లించామని సీఎం జగన్ తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్లు, 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు జమ చేశామని సీఎం తెలిపారు. అగ్రిగోల్డ్ వ్యవహారం కొలిక్కి రాగానే మిగిలిన డిపాజిటర్లకు చెల్లింపులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం కష్టజీవుల సొమ్మును కాజేసింది అగ్రిగోల్డ్ సంస్థను నమ్మి చిన్న వ్యాపారులు నష్టపోయారని, ఆ సంస్థలో ఉన్న డబ్బంతా కష్టజీవులదేనని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వం కష్టజీవుల సొమ్మును కాజేసిందని తెలిపారు. అగ్రిగోల్డ్ స్కామ్‌కు కర్త, కర్మ, క్రియ గత ప్రభుత్వమేనని సీఎం తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసమే అగ్రిగోల్డ్ స్కామ్మని, బాధితులకు ఒక్క రూపాయి చెల్లించలేదని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు మోసం చేస్తూ వచ్చిందని సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, గతంలో 300 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారని తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేస్తున్నారని, ఇప్పటికే రూ.10వేలలోపు డిపాజిటర్లకు రూ.238.73 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి దశలో రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులైన 3.40 లక్షల మందికి 2019లోనే రూ.238.73 కోట్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొదటి, రెండో దశలో కలిపి మొత్తం 10.40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం రూ.905.57 కోట్లు పంపిణీ చేసినట్లు అయింది. చదవండి: Andhra Pradesh: ఇళ్లకు సుముహూర్తం -
అగ్రి గోల్డ్ బాధితులకు రెండో విడత చెల్లింపులు
-
'అగ్రిగోల్డ్' అసలు దొంగ చంద్రబాబే
గుంటూరు రూరల్: అగ్రిగోల్డ్ సంస్థ విషయంలో అసలు దొంగ చంద్రబాబునాయుడేనని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. లక్షలాదిమంది ప్రజలకు అగ్రిగోల్డ్ శాపంగా మారటానికి ప్రధాన కారకుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని చెప్పారు. ఆయన హయాంలోనే అగ్రిగోల్డ్ కనీసం సెబీ అనుమతి లేకుండా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. గుంటూరులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అగ్రిగోల్డ్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకుని ప్రజలు, బాధితుల నెత్తిన శఠగోపం పెట్టారని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఆర్థిక నేరాల ద్వారా మోసపోయిన ప్రజలను ఆదుకున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని చెప్పారు. అగ్రిగోల్డ్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి రూ. వేల కోట్లు వసూలు చేశారని, 2014 డిసెంబర్లో బోర్డు తిప్పేశారని తెలిపారు. అప్పుడు చంద్రబాబు బాధితులకు న్యాయం చేస్తానని చెప్పి అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్నేసి డిపాజిట్‌దారులను నట్టేట ముంచాడన్నారు. అగ్రిగోల్డ్‌తో కుమ్మక్కై విలువైన ఆస్తులను కాజేసి 2014 నుంచి 2019 వరకు బాధితులకు సొమ్ము చెల్లించకుండా తొక్కిపట్టి ప్రజలను మోసం చేశాడని చెప్పారు. 300 మంది ఏజెంట్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రజల కష్టాలను గమనించిన జగనన్న వారికి చెప్పినట్లే ఇప్పటికే రూ.10 వేలలోపు డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించారని, ఇప్పుడు రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులకు చెల్లిస్తున్నారని వివరించారు. గుంటూరు ఏటీ అగ్రహారంలో ఒక యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం చేసినట్లు లోకేశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. -
AgriGold: బాధితులకు బాసట
అమరావతి: ఓ ప్రైవేట్ కంపెనీ మోసం చేస్తే ప్రభుత్వం బాధ్యత వహించి బాధితులను ఆదుకోవడం అన్నది ఇంతవరకు ప్రపంచ చరిత్రలోనే లేదు. కానీ ప్రజా సంక్షేమంలో కొత్త చరిత్ర సృష్టిస్తూ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ముందుకొచ్చారు. పాదయాత్రలో, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ మాట నిలబెట్టుకుంటున్నారు. అగ్రిగోల్డ్ బాధిత డిపాజిట్‌దారులకు రెండో దశ నష్టపరిహారాన్ని సీఎం జగన్ మంగళవారం అందించనున్నారు. రెండో దశ కింద 7,00,370 మంది డిపాజిట్‌దారులకు మొత్తం రూ.666,85,47,256 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. చదవండి: బాధితురాలికి అండగా ప్రభుత్వం తొలిదశలో రూ.238.73 కోట్లు పంపిణీ తమ కష్టార్జితాన్ని అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసి మోసపోయిన డిపాజిట్‌దారులను ఆదుకుంటానని పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సీఎం అయిన తరువాత అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ఉపక్రమించారు. మొదటి దశలో రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులైన 3.40 లక్షల మందికి 2019లోనే రూ.238.73 కోట్లను పంపిణీ చేశారు. అర్హులైనప్పటికీ ఏ కారణంతోనైనా సరే మొదటి దశలో పరిహారం పొందనివారికి మరో అవకాశం కల్పిస్తూ రెండో దశలో పంపిణీ చేయాలని నిర్ణయించారు. టీడీపీ సర్కారు నిర్వాకం ఇదీ... అగ్రిగోల్డ్ బాధితుల పట్ల టీడీపీ అధికారంలో ఉండగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. అరకొర లెక్కల ద్వారా రూ.20 వేల వరకూ డిపాజిట్ చేసిన బాధితులు కేవలం 8.79 లక్షల మందే ఉన్నట్లు నిర్ధారించి వారికి రూ.785 కోట్లు చెల్లించాలని తేల్చింది. అయితే ఎవరికీ ఒక్క రూపాయి కూడా పరిహారం ఇచ్చి ఆదుకోలేదు. బాధితులైన వేల మంది కూలీలు, చిన్న వృత్తులవారు, తోపుడు బండ్లు, రిక్షా కార్మికులు తదితరులను గాలికి వదిలేసింది. రెండో దశలో రూ.666.85 కోట్లు పంపిణీ ఒక డిపాజిట్‌దారుడికి ఒకటికి మించి డిపాజిట్లు ఉన్నా ఒక డిపాజిట్‌కు మాత్రమే చెల్లింపులు జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఆ విధంగానే ప్రభుత్వం గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా పారదర్శకంగా అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులను గుర్తించి సీఐడీ విభాగం ద్వారా నిర్ధారించింది. రూ.10 వేల లోపు డిపాజిట్ చేసి గతంలో వివిధ కారణాలతో నష్టపరిహారం పొందలేకపోయిన 3.86 లక్షల మందిని గుర్తించి వారు డిపాజిట్ చేసిన రూ.207,61,52,904 పంపిణీ చేయాలని నిర్ణయించింది.చదవండి: 'అగ్రిగోల్డ్' అసలు దొంగ చంద్రబాబే ఇక రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులైన 3.14 లక్షల మందికి పైగా బాధితులకు రూ.459,23,94,352 పంపిణీ చేయనుంది. ఇలా మొత్తం 7,00,370 మంది డిపాజిట్‌దారులకు రూ.666,85,47,256 చెల్లించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం బటన్ నొక్కడం ద్వారా అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారుల బ్యాంకు ఖాతాల్లో పరిహారాన్ని జమ చేస్తారు. దీంతో మొదటి, రెండో దశలో కలిపి మొత్తం 10.40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం రూ.905.57 కోట్లు పంపిణీ చేసినట్లు అవుతుంది. -
అగ్రి గోల్డ్ బాధితులకు అండగా ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పాదయాత్ర సందర్భంగా అగ్రి గోల్డ్ బాధితులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి ఖాతాల్లో నగదు జమ చేస్తూ ఆదుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. ఈ నెల 24న రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేయనుందని తెలిపారు. ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 19 వరకూ 7.76 లక్షల మంది డిపాజిట్‌దారులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి ఇప్పటికే రూ.240 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్న 1995లో అగ్రి గోల్డ్ సంస్థ భారీ ఎత్తున డిపాజిట్లను సేకరిస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదని అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. డిపాజిట్‌దారులకు ఎలాంటి చెల్లింపులు చేయకుండా 2015లో అగ్రిగోల్డ్ యాజమాన్యం బోర్డు తిప్పేస్తే.. ఆ యాజమాన్యంతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తమ పోరాటాల వల్లే అగ్రి గోల్డ్ బాధితులకు ప్రభుత్వం నగదు చెల్లిస్తోందని చంద్రబాబు, టీడీపీ నేతలు బీరాలు పలుకుతున్నారని విమర్శించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అగ్రి గోల్డ్ కేసును తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ప్రభుత్వం ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిందన్నారు. -
అగ్రి గోల్డ్ బాధితులకి అండగా వైఎస్సార్సీపీ:లేళ్ల అప్పిరెడ్డి
-
అగ్రిగోల్డ్ బాధితుల నమోదు గడువు పొడిగింపు
సాక్షి,అమరావతి: అగ్రిగోల్డ్ సంస్థలో రూ.20 వేలు లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్‌దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు గడువును సీఐడీ విభాగం ఈనెల 19 సాయంత్రం5 గంటల వరకు పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6 నుంచి డిపాజిటర్ల వివరాలను సేకరణ కొనసాగుతోంది. రూ.20వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు agrigolddata.in వెబ్సైట్లో ఆధార్ నమోదుతో పూర్తి వివరాలును చూడవచ్చు. ఒక వేళ వివరాలను మార్పు చేయాల్సివస్తే ఎంపీడీవో ఆఫీస్ ద్వారా సరిచేసుకునే అవకాశం కల్పించనట్లు అధికారులు తెలిపారు. సందేహాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800-4253875 సంప్రదించాలని అధికారులు కోరారు.