
కొవ్వూరులో మంత్రి జవహర్ ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు
పశ్చిమగోదావరి, కొవ్వూరు: తమ సమస్యలు విన్నవించుకుందా మని వచ్చిన అగ్రిగోల్డ్ బాధితులపై మంత్రి కేఎస్ జవహర్ ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర దు మారం రేపింది. అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం కొవ్వూరులో మంత్రి జవహర్ ఇంటి వద్ద ధర్నాకు దిగారు. తమకు రావాల్సిన సొమ్ములు ప్రభుత్వం వెంటనే ఇప్పించాలని, బాధితులకు న్యాయం చే యాలంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో మంత్రి జవహర్ బయటకి వచ్చారు. తమ సొ మ్ములు కాజేశారని, 40 నెలలు కావస్తున్నా మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని, మా సొమ్ములు కాజేసిన వారికి మా ఉసురు తగులుతుందని బాధితులు దుమ్మెత్తిపోశారు. ఈ సందర్భంగా మంత్రి జవహర్ కలుగజేసుకుని ‘ఆ ఉసురు మాకు తగలదు.. ఉసురు తగిలినోడు ఎప్పుడో చచ్చాడు’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ సంస్థను ఎవరి హయాంలో ప్రారంభించారు.. బాధ్యత ఎవరు వహించాలి అంటూ ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. బాధితులు ఆ విధంగా మాట్లాడటం సరికాదని బాధితులపై మంత్రి జవహర్ మండిపడ్డారు. దీంతో 1995లో ఈ కంపెనీ ప్రారంభించింది చంద్రబాబు హ యాంలోనే అని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.తి రుపతిరావు స్పష్టం చేశారు. చంద్రబాబు హ యాంలోనే అగ్రిగోల్డ్ ప్రారంభమైందనే సరికి మంత్రికి చిర్రెత్తుకుని వచ్చింది.
1995 నవంబర్‌లోనే కంపెనీ ప్రారంభమైందని, మీ రికార్డులు తీ యండని బాధితులు సూచించడంతో సరే వదిలేయ్ అంటూ మంత్రి ఇంట్లోకి వెళ్లిపోయారు. కనీ సం బాధితుల ఆవేదన వినిపించుకోకుండా లో నికి వెళ్లిపోవడం, అగ్రిగోల్డ్ సంస్థ టీడీపీ పాలనలో ప్రారంభం కాలేదని మంత్రి సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం, మంత్రి నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ నినదించారు. దీంతో మంత్రి అనుచరులు బాధితులపై విరుచుకుపడ్డారు. బాధితులతో వాగ్వావాదానికి దిగారు. అప్పటికే పట్టణ ఎస్సై జీజే విష్ణువర్ధన్ తన సిబ్బందితో మంత్రి ఇంటికి చేరుకుని బాధితులను నిలువరించే ప్రయత్నం చేశారు. మీడియా అంతా ఇది గమనిస్తుం దని గుర్తించిన మంత్రి జవహర్ బాధితుల తరఫున నలుగురు ప్రతినిధులను లోనికి పిలిపించుకుని మాట్లాడటంతో బాధితులు శాంతించారు. బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ప్రకటించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కోర్టు పరిధిలో ఉన్నందున క్రయవిక్రయాలకు జాప్యం అవుతుందన్నారు. అనంతరం బాధితులు మంత్రికి వినతిపత్రం అందజేశారు.
మంత్రిది అవగాహన రాహిత్యం
కేబినేట్ మంత్రిగా ఉన్న జవహర్‌కి కనీసం అగ్రి గోల్డ్ సంస్థ ఏ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైందో కూడా తెలియకుండా వ్యాఖ్యానించా రని, ఇది చాలా బాధాకరమని బాధితుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు అన్నారు. నలు గురు సీనియర్ ఐఏఎస్‌లతో కమిటీ, ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు సీఎం చంద్రబాబు ప్రకటించడమే తప్ప ఇప్ప టివరకూ ఎలాంటి పురోగతి లేదన్నారు. తాము ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఆం దోళన చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్నికలలోపు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెం ట్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి వై.నాగలక్ష్మి, జిల్లా సంఘం అధ్యక్షుడు వి.ఎ సయ్య, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పి.శేషుకుమార్, చాగల్లు మండల అధ్యక్షుడు ఎస్.ఆంజనేయులు, ఎన్.రాంబాబు, ఇనపన సత్యవతి, తణుకు బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శి ఎన్.గణపతి, ఎన్.రా మ శ్రీను, పెద్ద సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు.