ఆ ఉద్యమాన్ని నీరుగార్చింది ప్రభుత్వమే | Agri Gold Movement Was Diluted By Government Only Said By Lella Appireddy | Sakshi
Sakshi News home page

ఆ ఉద్యమాన్ని నీరుగార్చింది ప్రభుత్వమే

Published Sun, Jun 3 2018 7:18 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Agri Gold Movement Was Diluted By Government Only Said By Lella Appireddy - Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ర్ట కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి

సాక్షి, గుంటూరు జిల్లా : మొన్నటి అగ్రిగోల్డ్‌ ఉద్యమాన్ని ప్రభుత్వమే నీరుగార్చిందని వైఎస్సార్‌సీపీ రాష్ర్ట కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..మూడేళ్లుగా అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉండేందుకే వైఎస్సార్‌సీపీ తరపున బాసట కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 9న విజయవాడలో అగ్రిగోల్డ్‌ బాధితులతో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల సమావేశం ఉంటుందని తెలిపారు.

ఆ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. పదమూడు జిల్లాలోని అగ్రిగోల్డ్‌ ఉద్యమకారులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తక్షణమే రూ.1100 కోట్లు విడుదల చేసి అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement