
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని హాయ్‌ల్యాండ్ సంస్థ అగ్రిగోల్డ్ గ్రూపుల్లో భాగమేనని ఆర్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవే ట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అల్లూరి వెం కటేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. హాయ్‌ల్యాండ్ యాజమాన్యమైన మెస్సర్స్ ఆర్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈనెల 16న హైకోర్టుకు సమర్పించిన రిట్ పిటిషన్‌లో తాము ఆర్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెం ట్ ప్రైవేట్ లిమిటెడ్.. అగ్రిగోల్డ్ గ్రూపునకు చెందిన ఒక కంపెనీగా తెలియజేశామన్నా రు. హాయ్‌ల్యాండ్ కానీ, ఆర్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు అగ్రిగోల్డ్ సంస్థ కు చెందినవి కాదని తాము ఎక్కడా, ఎప్పుడూ తెలపలేదని పిటిషన్‌లో పేర్కొన్నామన్నారు.
తమ నివేదికను వక్రీకరించి తప్పు గా అర్థం చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేయడంతోపాటు మనోవ్యధకు గురిచేసిందన్నారు. అఫి డవిట్‌లో హాయ్‌ల్యాండ్ అనేది ఆతిథ్య పర్యాటక పరిశ్రమ, వినోద్ థీమ్ పార్కు నడిపేదానిగా తెలియజేశామని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇం డియా ప్రైవేట్ లిమిటెడ్ మాత్రం స్థిరాస్తి కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపా రు. కం పెనీస్ యాక్ట్ 1956 కింద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ హైదరాబాద్‌లో రెండు కంపెనీలు రిజిస్టర్ అయ్యాయన్నారు. హాయ్‌ల్యాండ్ నిర్వహణ, వ్యాపారం అగ్రిగోల్డ్ గ్రూపులో మరో కంపెనీ అయిన అగ్రిగోల్డ్ ఫార్మా ఎస్టేట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యాపారం నిర్వహణ నుంచి పూర్తిగా భిన్నమైనదని చెప్పారు.