టీడీపీ ప్రభుత్వంలో వెలుగుచూసిన అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని చంద్రబాబు, టీడీపీ నేతలు ఆస్తుల సంపాదనకు అక్షయ పాత్రగా మలచుకోవాలని పన్నిన పన్నాగాలు అన్నీ ఇన్ని కావు. కేసులను బూచిగా చూపి అగ్రిగోల్డ్ ఆస్తులను చవగ్గా కొట్టేయడానికి ఆ సంస్థ యాజమాన్యంతో తెరచాటు మంతనాలు సాగించారు. ప్రధానంగా రాజధాని అమరావతి పరిధిలో ఉన్న వందల కోట్ల విలువైన హాయ్‌ల్యాండ్‌ను హస్తగతం చేసుకోవాలని పంతం పట్టిన చంద్రబాబు తనయుడు లోకేశ్ ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడు.
మేము అగ్రి గోల్డ్ బాధితులకు 7 కోట్లు (ఆత్మహత్య చేసుకున్న 142 మందికి ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున ) ఇచ్చామని లోకేష్ అంటున్నారు. రాష్ట్రంలో 11 .57 లక్షల మంది డిపాజిటర్లు అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేశారు. వారిలో 20 వేలు లోపు డిపాజిట్ చేసినవారికి "930 కోట్లు చెల్లించి" 10.37లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నారు సీఎం జగన్. మిగిలిన వారికి కూడా డిపాజిట్ మొత్తం చెల్లించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంతో ఏలూరు కోర్టులో కేసు వేసి పోరాడుతోంది జగన్ ప్రభుత్వం (అసలు అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగుచూసింది చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే) అగ్రిగోల్డ్ సంస్థ 8 రాష్ట్రాల్లో 19 లక్షల మంది (19,18,865 )డిపాజిటర్ల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసి, వారందరినీ నిలువునా ముంచింది.
టీడీపీ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నతాధికారి ద్వారా మంత్రాంగం చేశారు, 85 ఎకరాల్లో విస్తరించిన హాయ్‌ల్యాండ్‌లో దాదాపు 25 ఎకరాల్లో భవనాలు, సామగ్రి ఉన్నాయి. అందుకోసం అగ్రిగోల్డ్ ఆస్తులను సంస్థ యాజమాన్యం అమ్మేసుకుని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించేందుకు టీడీపీ ప్రభుత్వం సహకరించింది. ప్రతిఫలంగానే అగ్రిగోల్డ్ యాజమాన్యం కోట్లు విలువ చేసే కొన్ని కీలక ఆస్తులను కారు చౌకగా టీడీపీ ముఖ్యులకు విక్రయించింది.
అగ్రిగోల్డ్ మాజీ వైస్ చైర్మన్ డొప్పా రామ్‌మోహన్‌రావు 2016 ఏప్రిల్ 30న టీడీపీలో చేరడం ఆ సంస్థ యాజమాన్యానికి చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనం. అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్‌మెంట్ జీవో రాక ముందే 2015 జనవరి 19న టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చౌదరి భార్య వెంకాయమ్మ పేరుతో అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీ అయిన రామ్ ఆవాస్ రిసార్ట్స్, హోటల్స్ గ్రూప్ డైరెక్టర్ ఉదయ్ దినకర్ నుంచి 14 ఎకరాలు కొన్నది. అగ్రి గోల్డ్ డైరెక్టర్లు, వారి భార్యలు, బంధువులు, బినామీల పేరుతో ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తులపై అప్పట్లో సీఐడీ దృష్టి పెట్టలేదు. రూ. 976 కోట్లను 156 కంపెనీలకు మళ్లించిన విషయాన్నీ పట్టించుకోలేదు.
ఇదీ చదవండి: ఓం ప్రథమం... ఎదురైంది దుశ్శకునం
Comments
Please login to add a commentAdd a comment