సాక్షి,అమరావతి: టీడీపీలో ఇంత వరకు చంద్రబాబు, లోకేశ్‌కే పూర్తిగా మతి చెడిందని అనుకున్నామని, అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు చెల్లించడంపై అచ్చెన్నాయుడు చేసిన విమర్శలు చూస్తే అచ్చెన్నకు కూడా పూర్తిగా మతి తప్పిందని అనిపిస్తుందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కో–ఆర్డినేటర్ లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ బాధితులకు నగదు చెల్లింపుపై కొన్ని పత్రికలు, కొంతమంది స్వార్థరాజకీయ నాయకులు కువిమర్శలు చేయడంపై అప్పిరెడ్డి ఘాటుగా స్పందించారు.
ఈ మేరకు ఆయన బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అగ్రిగోల్డ్‌లో రూ.20 వేలు లోపు పొదుపు చేసిన వారికి ప్రభుత్వమే ముందుగా చెల్లించి.. ఆ తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తులమ్మి తీసుకోవాలని ప్రతిపక్ష నేతగా సీఎం జగన్.. ఆనాడే అసెంబ్లీ సాక్షిగా అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సూచించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. కానీ ఆర్‌బీఐ ఒప్పుకోదన్న కుంటిసాకుతో బాధితుల బలవన్మరణాలకు, వారి కుటుంబాలు రోడ్డున పడడానికీ కారకుడైన చంద్రబాబుకు నేడు అగ్రిగోల్డ్ అన్న పదాన్ని ఉచ్ఛరించడానికి కూడా అర్హత లేదని మండిపడ్డారు.
అచ్చెన్నకు మతి తప్పింది
Published Thu, Aug 26 2021 4:32 AM | Last Updated on Thu, Aug 26 2021 4:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment