
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ ఖాతాదారుల బాండ్ల పరిశీలన తొలిరోజైన అయోమయం, గందరగోళం నడుమ మొదలైంది. రాష్ట్రంలో 19,43,120 మంది డిపాజిటర్ల పూర్తి వివరాలు పరిశీలించి ఆన్‌లైన్ చేసేలా చేపట్టిన ప్రక్రియ సీఐడీ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైంది. పలు జిల్లాల్లో ఆన్‌లైన్ సర్వర్‌లు పనిచేయక డిపాజిటర్లు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ప్రతీ మండలానికి ఒక కౌంటర్ పెడతామన్న అధికారులు ఒక్కో జిల్లాకు కేవలం 10 నుంచి 17 కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు.
అయితే డిపాజిటర్ల రద్దీ పెరిగితే కౌంటర్లు పెంచుతామని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ బాధితులు సుమారు 32,02,607 మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment