ఐసీఐసీఐ బ్యాంకులో ఫ్రాడ్‌.. రెండోరోజు విచారిస్తున్న సీఐడీ | CID Second Day Inquiry In ICICI Bank Fraud Case In AP's Palnadu | Sakshi
Sakshi News home page

AP: ఐసీఐసీఐ బ్యాంకులో అక్రమాలు.. రెండోరోజు విచారిస్తున్న సీఐడీ

Published Fri, Oct 11 2024 12:18 PM | Last Updated on Fri, Oct 11 2024 12:51 PM

CID Second Day Inquiry In ICICI Bank Fraud Case In AP's Palnadu

సాక్షి,పల్నాడుజిల్లా: చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు రెండోరోజు శుక్రవారం(అక్టోబర్‌11)విచారణ చేపట్టారు.ఇవాళ మరికొంత మంది ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఖాతాదారులు చెప్పిన అంశాల ఆధారంగా బ్యాంకు శాఖల్లో సీఐడీ రికార్డులను పరిశీలిస్తోంది.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు,బంగారు ఆభరణాలపై రుణాలు,ఇతర దేశాల నుంచి వచ్చిన నగదు తదితర అంశాలపై విచారిస్తున్నారు.బ్యాంకు శాఖల్లో అక్రమాలకు ఇప్పటి వరకు 72 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ప్రతిరోజు కొంతమంది ఖాతాదారులను పిలిచి సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.

కాగా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసినట్లు అక్రమాలు వెలుగు చూడడంతో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.

	ఐసీఐసీఐ బ్యాంకులో భారీ స్కామ్.. సీఐడీ విచారణ

ఇదీ చదవండి: రూ.229 కోట్ల మోసం.. ఇద్దరి అరెస్టు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement