
సాక్షి, హైదరాబాద్ : తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాచౌక్‌లో అగ్రిగోల్డ్ భాదితులు ఆందోళన చేపట్టారు. తెలంగాణాలో అగ్రిగోల్డ్ కష్టమర్లుకు రావలసిన 500 కోట్లు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణాలో ఉన్న సుమారు 1200 ఎకరాల అగ్రిగోల్డ్ భూమిని వెంటనే వేలం వేసి న్యాయం చేయాలని కోరారు. ఏపీలో మాదిరిగానే తెలంగాణాలో కూడా మరణించిన బాధితులకు 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment