రాష్ట్రంలో రూ. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే వారికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, ఆ వైద్యం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ఏపీ ఆరోగ్య మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆయన ఆదివారమిక‍్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1150 కోట్లను హైకోర్టు సమక్షంలో జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.