Jagananna Amma Vodi scheme
-
సంక్షేమం.. సాధికారత.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పౌరుల ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసించింది. ఏపీతో పాటు మహారాష్ట్ర, కేరళ, కర్నాటక తమ ఆదాయ రాబడుల్లో సంక్షేమ పథకాల కోసం గణనీయంగా వ్యయం చేశాయని పేర్కొంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలకు చేసిన వ్యయాలపై రీసెర్చ్ నివేదికను ఎస్బీఐ సోమవారం విడుదల చేసింది. దేశం సంక్షేమ రాజ్యంగా మారుతున్నట్లు కనిపిస్తోందని తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళలు, పిల్లల విద్య, ఆరోగ్యంతో పాటు సాధికారత దిశగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసినట్లు నివేదిక విశ్లేషించింది. ⇒ ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను రీసెర్చ్ నివేదిక వ్యయంతో సహా ప్రముఖంగా ప్రస్తావించింది. ఏటా 47 లక్షల మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక కింద యూనిఫాం, బ్యాగ్, బూట్లు, పాఠ్యపుస్తకాలు తదితరాలను ఉచితంగా అందచేశారని పేర్కొంది. జగనన్న అమ్మ ఒడి కింద పిల్లల తల్లుల ఖాతాల్లో పారదర్శకంగా నగదు జమ చేశారని, ఇవన్నీ మహిళలు, పిల్లల విద్యతో ముడిపడి రూపొందించిన సంక్షేమ పథకాలని తెలిపింది. మహిళల ఆర్ధికాభివృద్ధే లక్ష్యంగా అర్హత కలిగిన ప్రతి మహిళకూ వైఎస్సార్ చేయూత పథకాన్ని అందించారని, పేద మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారని వెల్లడించింది. జగనన్న గోరు ముద్ద ద్వారా సుమారు 43 లక్షల మంది స్కూలు పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించారని, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను నివారించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నారని ప్రశంసించింది. పొదుపు సంఘాల మహిళల (ఎస్‌హెచ్‌జీ) సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశారని ఎస్బీఐ నివేదిక తెలిపింది. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత లక్ష్యంగా రూపొందించిన ఈ పథకాలు దేశ ఆర్ధికాభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొంది. ⇒ ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 12 శాతం వృద్ధి నమోదు కాగా అందులో 11 శాతం మేర సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు రీసెర్చ్ నివేదిక తెలిపింది. మహారాష్ట్రలో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 10 శాతం వృద్ధి చెందగా అందులో 11 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేశారు. ఒడిశాలో ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల్లో వృద్ధి 13 శాతం కాగా అందులో 8.10 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు తెలిపింది. కేరళలో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8 శాతం నమోదు కాగా అందులో 8 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేశారు. కర్నాటక, పశ్చిమ బెంగాల్లో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి కంటే సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కర్నాటకలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు వృద్ధి 8 శాతం ఉండగా పధకాలకు కేటాయింపులు 15 శాతం ఉంది. పశ్చిమ బెంగాల్లో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8 శాతం ఉండగా పథకాలకు కేటాయింపులు 10 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
చదువుకు ఊపిరి.. అమ్మ ఒడి
మదనపల్లె సిటీ: ఆర్థిక పరిస్థితి కారణంగా ఏ ఒక్క పేద విద్యార్థీ చదువుకు దూరం కారాదు. పనికి పంపే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని బడికి పంపాలి. అందుకే సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున జమ చేశారు. నాడు–నేడు పథకంలో ఓ పక్కన స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ది చేస్తూనే, బడిబయట పిల్లలు కూడా బడిలో చేరేలా అమ్మ ఒడి పథకాన్ని పైసా అవినీతికి అస్కారం లేకుండా అమలు చేశారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ఓ విద్యావిప్లవం. విద్యారంగం సంస్కరణల్లో భాగంగా సీఎం వై.ఎస్.జగనమోహన్‌రెడ్డి అమల్లోకి తెచ్చిన ఈ పథకాన్ని దేశమంతా ప్రశంసించింది. ప్రతి ఒక్కరికీ అత్యుత్తమ విద్య అందితే, రాష్ట్ర భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని నమ్మిన సీఎం వైఎస్ జగన్ ఆ దిశగా అవసరమైన ప్రతి చర్యనూ తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువులకు దూరమైన వారంతా అమ్మ ఒడి ఉందనే ధీమాతో బడిబాట పడుతున్నారు. ఇందుకు 2019 నుంచి 2023 వరకు ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యే ప్రామాణికం.అర్హతే ప్రామాణికంవిద్యార్థుల చదువులకు తోడ్పాటు అందించాలనే ఉన్నతాశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నప్పటికీ అమ్మఒడి మంజూరు చేస్తున్నారు. పథకం పారదర్శకంగా అమలు చేసే క్రమంలో సచివాలయం స్థాయిలో లబ్ధిదారుల బయోమెట్రిక్ ఆథంటికేషన్ (ఈకైవెసీ)తో ఆధార్‌కార్డు అనుసంధానించిన బ్యాంక్ ఖాతాకు డబ్బులు జమ చేస్తున్నారు. మధ్యవర్తుల బెడద, పైసా అవినీతి లేకుండా, నేరుగా లబ్దిదారులకు డబ్బులు అందుతున్నాయి.ఒక్కో విద్యార్థికి రూ.60 వేలు లబ్ధిఏటా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్జులు లబ్ధి పొందుతున్నారు. ఏడాదికి రూ.15 వేలు చొప్పున ప్రతి విద్యార్థికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొత్తంగా రూ.60 వేలు లబ్ధి చేకూరుతుంది. ముందస్తు షెడ్యూలు మేరకు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి మరో రూ.15 వేలు ఈ వేసవి సెలవుల అనంతరం బడి తెరిచిన మొదటి రోజునే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఏటా క్రమం తప్పకుండా అమ్మ ఒడి పథకం ద్వారా పేద విద్యార్థులకు సీఎం జగన్మోహన్రెడ్డి అండగా నిలుస్తున్నారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.విద్యాకానుకతో ధీమాజగనన్న విద్యాకానుక పథకం కింద ప్రభుత్వ యాజమాన్యాల పరిఽధిలోని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్‌బ్యాగ్, నోట్ పుస్తకాలు,షూస్, సాక్స్, మూడు జతల యూనిఫాం( కుట్టుకూలీతో సహా) ఇలా తొమ్మిది రకాల వస్తువులను ఇస్తున్నారు. ఒక్కో కిట్ విలువ రూ.1,964.నా పేరు భువనేశ్వరి. నా భర్త హరి హోటల్లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద బాబు దేవాన్ష్ మూడో తరగతి చదువుతున్నాడు. పాప ఇంటి వద్ద ఉంది. బాబుకు అమ్మ ఒడి కింద రూ.15 వేలు వచ్చింది. పాఠశాలలో బాబుకు జగనన్న విద్యా కానుక కింద పుస్తకాలు,యూనిఫాం ఇచ్చారు. సీఎం జగన్మోహన్రెడ్డి పుణ్యామని బాబును బాగా చదివిస్తున్నాం. నా పేరు కె.పల్లవి. మాది సామాన్య కుటుంబం. ఇద్దరు పిల్లలు. పెద్ద పాప భావన 8వ తరగతి, చిన్నపాప ప్రేరణ 5వ తరగతి చదువుతున్నారు. వారిని ప్రైవేటు బడుల్లో చదివించే స్థోమత లేదు.ఇద్దరిని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదివిస్తున్నా. గతంలో పుస్తకాలు,బ్యాగులకు రూ.8 వేల వరకు ఖర్చు వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అమ్మ ఒడి కింద రూ.15 వేలు వస్తున్నాయి. దీంతో పాటు జగనన్న విద్యాకానుక ద్వారా పుస్తకాలు,యూనిఫాం అన్ని ఉచితంగా ఇస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ బడిలో మంచి బోధన ఉంది. పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వమే తీసుకున్నందున మాకు చాలా సంతోషంగా ఉంది.అమ్మ ఒడి వల్లే మా పాప చదువుమాది పేద కుటుంబం. నాకు ఇద్దకు పిల్లలు. పిల్లలను చదవించుకోవాలంటే కష్టంగా ఉండేది. పాఠశాల తెరిచే రోజుకు బట్టలు, పుస్తకాలు కొనాలంటే అప్పులు చేయాల్సి వచ్చేది. జగనన్న సీఎం అయిన వెంటనే మా బిడ్డ సనకు అమ్మఒడి కింద డబ్బులు వచ్చాయి. స్థానిక ఉర్దూ మున్సిపల్ పాఠశాలలో చదువుతోంది. పాఠశాలలో జగనన్న విద్యాకానుక కింద పుస్తకాలు, దుస్తులు ఇచ్చారు. సీఎంకు రుణపడిఉంటాం.– షహరాభాను, బాపనకాలువ, మదనపల్లెజగనన్న మేలు మరువలేంనా పేరు శిరిషా, నా భర్త వెంకటరమణారెడ్డి. ఓ బేకరీ షాపులో పని చేస్తున్నాడు. నాకు జ్ఞానప్రకాష్, రోహిత్‌కుమార్ ఇద్దరు పిల్లలు. పిల్లలను చదివించాలంటే కష్టంగా ఉండేది. పుస్తకాలు, యూనిఫాం కొనాలంటే అప్పులు చేయాల్సి వచ్చేది. జగనన్న సీఎం అయ్యాక మా బిడ్డకు అమ్మ ఒడి కింద డబ్బు వస్తున్నాయి. జగనన్న మేలు మరవలేము.– శిరిషా, బీటీ కాలేజీ రోడ్డు, మదనపల్లె -
వేలం పాటలు మొదలయ్యాయి!
ఎన్నికల సీజన్ మొదలవడంతో, మళ్లీ మేనిఫెస్టోలను రూపొందించే పనిలో అన్ని రాజకీయ పార్టీలూ తలము నకలు అవుతున్నాయి. మేనిఫెస్టో అనేది రాజకీయ పార్టీలు అవి అధి కారంలోకి వచ్చిన తరువాత చేయగల పనులను పేర్కొనే హామీ పత్రం. మేనిఫెస్టోను నమ్మే చాలా మంది ఓట్లు వేస్తూ ఉంటారు. కాని, చాలా రాజ కీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టోను మరచిపోయి ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తాయి. ఎక్కడో ఒకటో ఆరో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాంటివి మాత్రం మేని ఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్‌ల వంటి పవిత్ర గ్రంథాలుగా భావిస్తున్నాయి. ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాయి. మేనిఫెస్టోలో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించటం ప్రతి పార్టీ చేసే పనే. అయితే వాటిని చిత్తశుద్ధితో ఎంత వరకు అమలు చేశారు అనేది ముఖ్యం, చిత్తశుద్ధితో చేసే ఏ పనైనా విజయవంతమవుతుంది. తద్వారా ప్రజలకు మేలు కలిగి పాల కులు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఒకప్పుడు ‘రెండు రూపాయలకు కిలో బియ్యం’ తన మేనిఫెస్టోలో పొందు పరిచి, చిత్తశుద్ధితో అమలు పరిచిన నందమూరి తారక రామా రావు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నారు. ఈ పథకం పేరు చెప్పగానే ఆయనే గుర్తుకు వస్తారు. అలాగే ప్రజల ఆరోగ్యం కోసం ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని రూపొందించిన డా‘‘ వై.ఎస్. రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే ఆరోగ్యశ్రీనే గుర్తుకు వస్తుంది. అదేవిధంగా పేద పిల్లల చదువుల కోసం అహర్నిశలూ పాటు పడుతున్న నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పగానే ‘అమ్మ ఒడి’ గుర్తుకొస్తుంది. పేదవాడి సంక్షేమం గురించి చిత్తశుద్ధితో ఆలోచించి అమలు పరిచే పథకాలకు ఎప్పటికీ మరణం ఉండదు. అందుకనే ఆ పథకాలూ, వాటిని అమలు పరిచిన నాయకులు చిరస్మరణీయం. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ఆ పథకాలను మాత్రం మార్చలేని పరిస్థితికి పార్టీలు వచ్చాయి అంటే అవి ఎంతగా ప్రజలకు మేలు చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ‘మేము అధికారంలోకి వస్తే కొనసాగిస్తాము’ అని ప్రతిపక్షాలు ప్రజలకు హామీ ఇస్తున్నాయి అంటే ఆ పథకాలు ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పక్క రాష్ట్రంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మెచ్చి ప్రజలు అక్కడ ఒక రాజకీయ పార్టీకి అధికారం కట్ట బెట్టడంతో, అవే హామీలను తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నాయి. పొందు పరచడమేకాక ఒకరు వంద ఇస్తానంటే మరొకరు రెండు వందలు ఇస్తాం అంటూ వేలం పాటలు మొదలు పెట్టారు. వెయ్యి రూపాయలు ఉన్న వంట గ్యాస్ సిలిండర్ పై ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెండు వందలు తగ్గించింది. అంటే ఏడు వందలకే ఇస్తుందన్నమాట. ఇది చూసి మరో రెండు వందలు తగ్గించి, ఐదు వందలకే ఇస్తామని మరో పార్టీ ప్రకటిస్తే, ఇంకో పార్టీ నాలుగొందలకే ఇస్తామని ప్రకటించింది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ను ఒక పార్టీ మూడు వేలు అంటే... మరో పార్టీ ఐదు వేలు అంటోంది. ఇలా వేలం పాటల్లో ఇచ్చే హామీలను అధికారం వచ్చిన తరువాత గాలికి వదిలేస్తారు అనటంలో ఏ సందేహం లేదు. మేనిఫెస్టోలో ప్రకటించే సంక్షేమ పథకాలకూ, ఉచిత పథకాలకూ ఉన్న తేడా ప్రజలు గుర్తించాలి. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి కొన్ని రాజకీయ పార్టీలు గ్యారంటీ నినాదాన్ని అందుకున్నాయి. కొంత మంది భవిష్యత్తుకు గ్యారంటీ అంటే మరి కొంతమంది ‘ఆరు స్కీముల’ గ్యారంటీ అంటూ ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారు. ఒకప్పుడు ఈ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవటంతో గ్యారంటీ స్కీములతో ముందుకొచ్చారిప్పుడు ప్రజలను నమ్మించ టానికి! మరికొంత మంది ఇంటింటికీ తిరిగి, తమ స్కీముల వల్ల ఎంత లబ్ధి చేకూరుతుందో అంత మొత్తానికి ‘బాండ్లు’ రాసిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఓట్లు కొనుగోలు చేస్తున్నట్లే! చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలను అమలు చేసే వాళ్ళనే ప్రజలు నమ్ముతారు. ప్రజల నమ్మకం ముందు ఈ గ్యారంటీలు, బాండ్లు ఎందుకూ కొరగావు. ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదు. కొన్నిసార్లు ఇచ్చిన హామీల్లో ఒకటో, రెండో అమలు చేయడం సాధ్యం కాదు. అలాంట ప్పుడు నిజాయతీగా ఎందుకు అమలు చేయలేక పోతున్నదీ ప్రజలకు వివరిస్తే అర్థం చేసుకుంటారు. అలా కాకుండా ఉత్తుత్తి హామీలు ఎన్ని ఇచ్చినా ఏ ఉపయోగమూ ఉండదు! ఈదర శ్రీనివాస రెడ్డి వ్యాసకర్త నాగార్జున యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ -
చరిత్ర తిరగరాసిన సీఎం జగన్.. విద్యలో ఏపీ టాప్
సాక్షి, హైదరాబాద్: విద్యాబోధన, సంస్కరణల్లో ఏపీ విధానాలు అత్యుత్తమంగా ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కేంద్ర విద్యాశాఖ పర్మామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ) విడుదల చేసిన అతి ఉత్తమ్ కేటరిగిలో.. దేశంలోనే ఏపీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ మేరకు ఏపీకి అభినందనలు సైతం తెలిపింది. విద్యకు పెట్టిన పెట్టుబడికి సమీప భవిష్యత్తులో అద్భుత ఫలితాలు రానున్నట్టు చెప్పుకొచ్చింది. అక్షరాస్యతలో అద్భుతంగా ఉంటే అభివృద్ధి సునాయసమని తెలిపింది. ఈ సందర్బంగా ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్ల కాలంలో ఏపీలో విద్య విషయంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్టు తెలిపారు. విద్యకు సంబంధించి 10 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పిల్లల విద్య విషయంలో తల్లిదండ్రులకు అన్ని విధాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా ఉందన్నారు. విద్యా కానుక, అమ్మఒడి, నాడు-నేడు వంటి పథకాలతో విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. విద్య కోసం 67వేల కోట్లు.. ఇక, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, నాడు-నేడు కోసం ప్రభుత్వం ఏకంగా రూ.66,722 కోట్లు ఖర్చు చేస్తోంది. కేవలం జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ప్రతీ విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం రూ.15వేలు అందిస్తోంది. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది. నాడు-నేడు.. మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు,మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు, వంట శాలలను అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తుంది సీఎం జగన్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కింద మొదటి, రెండవ దశలలో మొత్తం 22,344 పాఠశాలలో పనులు చేపట్టారు. దీని కోసం రూ.11,669 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్‌లు, బూట్లు, సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, స్కూల్ బెల్ట్, మాస్క్‌ల సెట్లతో కూడిన ‘టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్’ను విద్యార్థి కిట్ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కిద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటి వరకు రూ. 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన.. పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం కింద 9,249 కోట్ల రూపాయలను పంపీణి చేశారు. డిజిటల్ విద్య.. ఇక, 2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం ప్రభుత్వం రూ. 29,690 కోట్ల రూపాయలు కేటాయించింది. ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయించింది. కొత్త విద్యా సంవత్సరం (2023–24)లో 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థుల కోసం కొత్తగా 6 లక్షల ట్యాబ్‌లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులందరికీ ట్యాబ్‌లు అందించింది. ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో 8వ తరగతి విద్యార్థులతోపాటు సుమారు 75 వేల మంది ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్‌లను ఉచితంగా అందించింది. 8, 9 తరగతుల విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలకు సంబంధించి సుమారు రూ.25 వేల ఖరీదు చేసే బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లను అందించింది. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తోంది. ఇది కూడా చదవండి: విద్యా రంగానికి పెద్దపీట.. భారీగా కేటాయింపులు -
పిల్లల చదువులపై రామోజీ క్షుద్ర ‘విద్య’!
సాక్షి, అమరావతి: పిల్లలు చక్కగా చదువుకోవడమే అంతిమ లక్ష్యం కావాలి! అందుకనే ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్.. ఇలా ఎక్కడ చదువుతున్నా సరే అర్హులందరికీ జగనన్న అమ్మ ఒడి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. మన విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించేలా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బాగు చేసేందుకు సీఎం వైఎస్ జగన్‌సర్కారు నాలుగేళ్లలో రూ.66,722.36 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది జగనన్న అమ్మఒడి కింద అందించిన రూ.6,392.94 కోట్లతో కలిపితే ఈ ఒక్క పథకానికే ఇప్పటివరకు రూ.26,067.28 కోట్లు వ్యయం చేసింది.ప్రభుత్వ స్కూళ్లు కళకళలాడుతుంటే కొందరు పెత్తందారులు మాత్రం పేదింటి పిల్లలకు ఈ చదువులేంటని కుళ్లుకుంటున్నారు. సర్కారు స్కూళ్లలో విద్యార్థులు తగ్గిపోయారంటూ క్షుద్ర కథనాన్ని వార్చేశారు. ► ఈనాడు లెక్కల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో ఎన్రోల్మెంట్ 37.88 లక్షలు. ఇందులోనూ నిజం లేదు. ఇప్పటివరకు 38.22 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారు. ఈ ఏడాది ప్రవేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. అడ్మిషన్లకు మరో నెలన్నరకు పైగా సమయం ఇంకా మిగిలే ఉంది! మరి వేల మంది పిల్లలను రామోజీ కాకి లెక్కలతో ఏం చేసినట్లు? ► 2018–19లో ప్రాథమిక స్థాయిలో 92.91శాతంగా ఉన్న జీఈఆర్ 2022–23లో 100.80 శాతానికి చేరుకుంది. సెకండరీ విద్యలో 79.69 నుంచి 89.63 శాతానికి చేరింది. హయ్యర్ సెకండరీలో 46.88 నుంచి 69.87 శాతానికి పెరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉందా? ► జీఈఆర్‌ను పెంచేందుకు టెన్త్, ఇంటర్ ఫెయిలైన వారికి తిరిగి ప్రవేశాలు కలి్పంచడంతో పాటు మరోసారి అమ్మఒడిని ప్రభుత్వం అందిస్తోంది. ► పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు గతేడాది టాప్–10 ర్యాంకులు 25 లభించగా ఈ ఏడాది 64కు పెరిగాయి. 75 శాతానికి పైగా మార్కులతో డిస్టింక్షన్ సాధించిన విద్యార్థులు గతేడాది 63,275 మంది కాగా ఈ ఏడాది 67,114 మంది సత్తా చాటారు. గతేడాది 66.50 శాతం మంది ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులు కాగా ఈ ఏడాది 70.16 శాతానికి పెరిగారు. ► ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ చూపారు. 67 మంది ఐఐటీ, ఎన్ఐటీ, నిఫ్ట్, సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందారు. మరి ఈ విషయం రామోజీ చదివారా? విద్యా సంస్కరణల్లో మచ్చుకు కొన్ని.. ► ప్రభుత్వ స్కూళ్లల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.16,500కోట్లతో ‘మనబడి నాడు–నేడు’ ► డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ బైజూస్ కంటెంట్‌తో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలు ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంతోపాటు సీబీఎస్సీతో అనుసంధానం. ఇంగ్లిష్‌లో పావీణ్యం సాధించేలా 3వ తరగతి నుంచే ‘టోఫెల్’కు శిక్షణ. ► రూ.685.87 కోట్లతో 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్‌ల పంపిణీ. ఏటా డిసెంబర్ 21న ఈ కార్యక్రమం నిర్వహణ. ► వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా బైజూస్ కంటెంట్, 45 వేల పాఠశాలల్లో ఇంటర్నెట్. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ విధానం. గతంలో ఇదీ దుస్థితి... ► జగనన్న అమ్మ ఒడి లేదు. స్కూళ్లు తెరిచిన 6–7 నెలలకు కూడా యూనిఫాం సంగతి దేవుడెరుగు కనీసం టెక్ట్స్ బుక్స్ కూడా అందించలేని దుస్థితి. శిథిలావస్థలో స్కూళ్లు. ► రాగిజావ, చిక్కీ ఊసే లేదు. ఆయాల జీతాలు, సరుకుల బిల్లులు 8–9 నెలలు పెండింగ్‌లోనే. ► గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,778 కోట్లు (వీటిని సీఎం జగన్ ప్రభుత్వం వచ్చాక చెల్లించి విద్యార్థులను ఆదుకుంది) ► విదేశీ విద్యా దీవెనలో అవకతవకలు, భారీగా బకాయిలు. -
విద్య వ్యవస్థలో సరి కొత్త శకం
-
ప్రభుత్వ స్కూళ్లలో వసతుల గురించి విద్యార్థిని మాటల్లో
-
మా పిల్లలు చదివించడానికి పేదరికం అడ్డు రాకుండా చేసింది జగనన్న అమ్మఒడి
-
జగనన్న అమ్మఒడి.. కన్నీటిని ఆనంద భాష్పాలుగా మార్చిన ఒరవడి
-
ముఖ్యమంత్రి గారు ఇచ్చే అమ్మఒడి పిల్లల చదువుల కోసం ఉపయోగపడుతుంది
-
జగనన్న వచ్చాక ‘అమ్మఒడి’ అనే పథకం రావడం వల్ల పిల్లలు స్కూల్‌కి వెళ్లి బాగా చదువుతున్నారు
-
సీఎం జగన్ భరోసా.. ఆదుకోవాలన్న బాధితులకు అండ
పార్వతీపురం/కురుపాం: వివిధ సమస్యలతో బాధ పడుతున్న వారిని కురుపాం పర్యటనలో బుధవారం సీఎం జగన్ మనసున్న మారాజుగా ఆదుకున్నారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లికి చెందిన రెండేళ్ల చిన్నారి గుదే జియశ్రీకి బోన్‌మెరో ట్రాన్స్‌ప్లాంటేషన్ కారణంగా పెరుగుదల లోపించింది. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించాలని వైద్యులు సూచించారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించక పోవడంతో చిన్నారి తల్లి గుదే గౌరి సీఎంకు సమస్యను విన్నవించింది. వెంటనే స్పందించిన సీఎం.. వైద్యం కోçÜం రూ.10 లక్షలు సాయం అందిస్తామని, తక్షణ సాయంగా రూ.లక్ష అందజేయాలని కలెక్టర్ నిషాంత్‌కుమార్‌ను ఆదేశించారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న పార్వతీపురంలోని రామానందనగర్కు చెందిన ఎనిమిదేళ్ల బేతా హాసిని వైద్యం కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేశామని, ఆదుకోవాలని బాలిక తండ్రి శ్రీనివాసరావు సీఎం జగన్‌కు విన్నవించారు. తక్షణ సహాయంగా రూ.3 లక్షలు అందించాలని సీఎం కలెక్టర్‌ను ఆదేశించారు. మరో 11 మంది కూడా సీఎంకు వారి సమస్యలు చెప్పుకున్నారు. వారందరి సమస్యలు ఓపికగా విన్న జగన్.. తక్షణ సాయంగా రూ.లక్ష చొప్పున మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం హామీ మేరకు బాధితులందరికీ 24 గంటలు గడవక ముందే కలెక్టర్, ప్రజాప్రతి–నిధులు చెక్కులు అందజేశారు. సీఎం ఉదారత పట్ల బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. -
అమ్మ ఒడి 4వ విడత పంపిణీ కార్యక్రమం
-
నమ్మించి ముంచడమే వారి నైజం
గాంధీ గారి మూడు కోతుల కథలో ‘చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు అనొద్దు’ అని నీతి చెబుతాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ‘మంచి వినొద్దు, మంచి కనొద్దు, మంచి అనొద్దు, మంచి చేయొద్దు’ అనే నాలుగు కోతులున్నాయి. వీరినే దుష్ట చతుష్టయం అని మనం పిలుచుకుంటున్నాం. అవినీతి సొమ్మును పంచుకోవడం కోసం వారికి అధికారం కావాలి. ఇదీ వారి దుర్నీతి. నమ్మించి ప్రజల్ని నట్టేట ముంచడమే వారికి తెలిసిన ఏకైక నీతి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘మనం ప్రజలకు మంచి చేస్తున్నామని కొంత మందికి కడుపులో మంట. వారికి మద్దతుగా ఉండే దుష్టచతుష్టయం జీర్ణించుకోలేకపోతోంది. పదేపదే అబద్ధాలు చెబుతూ, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఈర్ష్యతో కళ్లు కప్పుకుపోయాయి. వీరి దుర్నీతిని ప్రజలు గమనించాలి’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అమ్మఒడి నాలుగో ఏడాది ఆర్థిక సాయం విడుదల సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎంగా ఉండీ కూడా ఏమీ చేయని ఓ నాయకుడు (చంద్రబాబు), ఆ నాయకుడి కోసం 15 ఏళ్ల కిందటే పుట్టిన ఓ దత్తపుత్రుడు (పవన్ కళ్యాణ్) మన ప్రభుత్వం చేస్తున్న మంచి చూసి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ‘ఇదీ టీడీపీ అంటే.. టీ–తినుకో, డీ–దోచుకో, పీ–పంచుకో. దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకుంటూ.. బొజ్జలు పెంచుకుంటూ.. బొజ్జ రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. వారి పత్రికలు, వారి టీవీలతో కలిసి మంచి పనులు చేస్తున్న మనపై దుష్ప్రచారం చేస్తున్నారు’ అని చెప్పారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. కొత్త డ్రామాలు మొదలు ► మూడుసార్లు సీఎం అయినా కూడా ఏ ప్రాంతానికీ ఏ మంచీ చేయని చంద్రబాబు.. ఎన్నికల ముందు మేనిఫెస్టో బుక్ తెస్తారు. అది చేస్తా, ఇది చేస్తా అంటారు. అధికారంలోకి వస్తే దానిని చెత్త బుట్టలో పడేస్తారు. ఇదీ వాళ్ల ట్రాక్ రికార్డు. ఇదే దుష్ట చతుష్టయం, ఇదే బాబు.. మరోసారి అధికారం ఇవ్వండంటూ మరోసారి మేనిఫెస్టోతో మళ్లీ మోసానికి దిగారు. డ్రామాలు మొదలు పెట్టారు. ► ఈసారి డ్రామాలను కొంచెం రక్తి కట్టించారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారంట.. మోసం చేసేదానికి ఒక హద్దు పద్దు లేకుండా పోయింది. జగన్ ఏం చేస్తున్నాడు.. జగన్ కంటే కాస్త ఎక్కువ చెప్పాలని చెప్పి మోసం చేయడంలో రక్తి కట్టిస్తున్నాడు. వీళ్లందరికీ తోడు ఒక దత్త పుత్రుడు ఉన్నాడు. 2014లో చంద్రబాబుకు మద్దతు పలికాడు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు దత్తపుత్రుడి సంతకాలతో మీకు లేఖలు వచ్చాయి. మాదీ బాధ్యత అని, అన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్నికలు అయిపోయాక ఎన్నికల ప్రణాళికను చెత్తబుట్టలో వేశారు. ప్యాకేజీ స్టార్ ఊగిపోతున్నాడు ► రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, చిన్న పిల్లలను సైతం వదలకుండా చంద్రబాబు మోసం చేశాడు. పూచీగా సంతకం పెట్టిన దత్తపుత్రుడు ఐదేళ్లలో ఒక్క మాటా మా ట్లాడలేదు. అలాంటి దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ ఈ రోజు ఓ లారీ ఎక్కాడు. దాని పేరు వారాహి అట. ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుతో కొడతానంటాడు.. తాట తీస్తానంటాడు.. గుడ్డలూడదీసి తంతానంటాడు.. ఈయన నోటికి అదుపులేదు.. మనిషికి నిలకడ లేదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతాడు. అలా మనం మాట్లాడలేం. వారి లా మనం రౌడీల్లా మీసాలు మెలేయలేం. బూతులు తిట్ట లేం. నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకోసారి భార్యనూ మార్చలేం. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకురాలేం. ఇవన్నీ వారికే పేటెంట్. తేడా మీరే గమనించాలి ► బాబు వర్గానికి అధికారం అంటే కేవలం దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం (డీపీటీ). వాళ్ల పునాదులు, మన పునాదుల మధ్య తేడా గమనించండి. అప్పుడూ ఇప్పుడూ అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ఒక్క జగన్ మాత్రమే. మరి వాళ్లెందుకు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయలేకపోయారు? మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు? వాళ్ల సోషల్ మీడియా, పత్రికలు, టీవీలు, వాళ్లంతా కలిసికట్టుగా రోజూ అదే అబద్ధాలు, వాళ్లు చేస్తున్న దుర్నీతిని గమనించాలి. చిన్న పొరపాటు జరిగినా ఇంతింత పెద్దగా చూపిస్తున్నారు. మనది కాని తప్పును మన మీద వేస్తూ బురద జల్లుతున్నారు. ► మీ బిడ్డ ప్రభుత్వంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలే. రాష్ట్రానికి హోం మంత్రి నా దళిత చెల్లెమ్మ. అలాంటి మనందరి ప్రభుత్వం మీద కావాలని పనిగట్టుకొని సమాజాన్ని చీల్చడం కోసం వాళ్లు పడుతున్న పాట్లు చూడాలి. ► ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మంత్రులు బొత్స , గుడివాడ, ఎంపీలు బెల్లాన, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, కళావతి, అలజంగి జోగారావు, కంబాల జోగులు, శంబంగి చినవెంకట అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం (సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్), పాలవలస విక్రాంత్, రఘురాజు తదితరులు పాల్గొన్నారు. మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ చెట్టెక్కి ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ప్రజలు పేదల పట్ల ప్రేమ నుంచి మన పునాదులు ► మన పార్టీ పునాదులు పేదల పట్ల ప్రేమలోంచి పుట్టాయి. రైతుల మమకారంలోంచి పుట్టాయి. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల పట్ల వారి బాధ్యతలోంచి పుట్టాయి. మాట ఇచ్చి మోసం చేయడం అనే వారి పునాదులు మన దగ్గరికి కూడా రావు. నా అక్కచెల్లెమ్మల భవిష్యత్తు కోసం, వారి కుటుంబాల భవిత కోసం రెండు లక్షల 23 వేల కోట్ల రూపాయలు నాలుగేళ్లలో నేరుగా వారికి అందించిన డీబీటీ మీద మన పునాదులు పుట్టాయి. ► పేదల కోసం తీసుకొస్తున్న విద్యా విప్లవంలో, వాళ్లకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో, వారి కోసం కట్టిస్తున్న ఇళ్లలో.. గ్రామాల్లో ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, అవ్వాతాతలు, పిల్లలకు మంచి జరిగేలా అందిస్తున్న పౌర సేవల్లో నా పునాదులున్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారత కోసం అమలు చేస్తున్న పథకాల్లో మన పునాదులున్నాయి. వాళ్ల మాదిరిగా పనికిమాలిన పంచ్ డైలాగుల్లో మన పునాదులు లేవు. ► మన ఓదార్పు యాత్ర నుంచి, 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నుంచి, పేదల కష్టాల్లోంచి నా పునాదులు పుట్టాయి. వారి మాదిరిగా వెన్నుపోటులోంచి నా పునాదులు పుట్టలేదు. అబద్ధాలపైన మన పునాదులు లేవు. దోచుకో, పంచుకో, తినుకో అనే సిద్ధాంతం నుంచి పుట్టలేదు. మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయి తప్ప వారిలా సమాజాన్ని చీల్చడంలో లేవు. ఇదీ మన ఫిలాసఫీ ► 2009 నుంచి ఇప్పటి వరకు పేద వాడి కోసం నిలబడగలిగిన జగన్‌ను గమనిస్తే.. ఏ కార్యకర్త అయినా అడు గో అతడే మా నాయకుడని కాలర్ ఎగరేసేలా నడత, ప్రవర్తన ఉంది. ఏ రోజూ అధర్మాన్ని, అబద్ధాలు చెప్పి గెలవాలని ప్రయత్నం చేయలేదు. అధికారం కోసం, పొత్తుల కోసం పాకులాడలేదు. ప్రతి అడుగులోనూ పేదవాడు బాగుండాలని ఆలోచన చేశా. ఇదీ మన పునాది, ఇదీ మన ఫిలాసఫీ, ఇదీ మన పార్టీ, ఇదీ మన మనసున్న ప్రభుత్వం. ► ఈ రోజు చేసిన మంచే మన బలం, ఇదే మన నినాదం. మనం యుద్ధం చేస్తున్నది రాక్షసులతో. అధర్మాన్నే ధర్మంగా వాళ్లు ఎంచుకొని యుద్ధం చేస్తున్నారు. వాళ్ల మాదిరిగా మీ బిడ్డకు ఢంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లేదు. ఓ దత్తపుత్రుడు తో డుగా లేడు. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పిందే చెప్పి.. అదే నిజమని భ్రమ కలిగించే మీడియా మాధ్యమాలూ లేవు. మీ బిడ్డ ఇలాంటి తోడేళ్లను నమ్ముకో లేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్నే. ► వీళ్లు చెబుతున్న అబద్ధాలు నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేదే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీ బిడ్డకు శ్రీరామరక్షగా నిలవాలని కోరుతున్నా. ఇంకా మీకు మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుతున్నా. -
ఇది భవితకు పునాది
పిల్లల బంగారు భవిష్యత్ కోసం తప్పనిసరిగా మీ పిల్లలను బడికి పంపించాలని ప్రతి తల్లినీ కోరుతున్నా. మన పిల్లల బాగు కోరే ప్రభుత్వంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మన పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇందులో భాగంగా తొలి దశలో పిల్లల భవిష్యత్ కోసం వారిని బడికి పంపించినందుకు ప్రోత్సాహ కంగా ఈ నాలుగేళ్లలో ఏకంగా రూ.26 వేల కోట్లు తల్లుల ఖాతాల్లో వేశాం. ఇలా దేశంలోని 28 రాష్ట్రాల్లో కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరిగింది. ఇకపై కూడా కొనసాగుతుంది. బటన్ నొక్కడం అంటే తెలియని బడుద్దాయిలకు ఈ విషయం అర్థం అయ్యేలా చెప్పండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విజయనగరం: వర్గాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రతి ఇంటి నుంచి సత్య నాదెళ్ల రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. తమది చదువుల సంకల్పమని స్పష్టం చేశారు. విదేశీ కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే ఫీజు రూ.1.25 కోట్లయినా భరిస్తామని హామీ ఇచ్చారు. జగనన్న అమ్మఒడి నాలుగో సంవత్సరానికి సంబంధించి 42,61,965 మందికి లబ్ధి చేకూరుస్తూ రూ.6,392.94 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన బహిరంగ సభలో అశేష జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తమ పిల్ల లు తమకంటే గొప్పగా ఉండాలని, తాము పడిన కష్టాలు పిల్లలకు రాకూడదని తల్లిదండ్రులందరూ కోరుకుంటారన్నారు. పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడాలని, ప్రపంచాన్నే ఏలే పరిస్థితిలోకి పిల్లలు రావాలనే గట్టి సంకల్పంతో ఈ నాలుగేళ్లుగా మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు వేసిందని చెప్పారు. అందులో భాగంగానే అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని, నాలుగో ఏడాది కార్యక్రమాన్ని కురు పాం వేదికగా ప్రారంభిస్తున్నామన్నారు. పది రోజులపాటు ప్రతి మండలంలోనూ పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని, విద్యార్థులతో ప్రజా ప్రతినిధులంతా మమేకమవుతారని తెలిపారు. ఈ పథకం ద్వారా ఒకటి నుంచి 12వ తరగతి దాకా పిల్లలను చదివిస్తున్న 42 లక్షల 62 వేల మంది అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నా మని చెప్పారు. తద్వారా 83 లక్షల 15 వేల మంది విద్యార్థులకు మంచి చేస్తున్నామని తెలిపారు. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, జూనియ ర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా తల్లులకు అమ్మఒడి వర్తింపజేస్తున్నామని, ఈ ఒక్క పథకం ద్వారా నాలుగేళ్లలో ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా వారి ఖాతాల్లో రూ.26,067 కోట్లు జమ చేశామని స్పష్టం చేశారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. కళ్లెదుటే మార్పు కనిపిస్తోంది ► గవర్నమెంట్ బడులన్నింటిలో ఇంగ్లిష్ మీడి యం ప్రవేశపెట్టాం. బడులు ప్రారంభం కాగానే మెరుగైన విద్యాకానుక కిట్లను ప్రతి పిల్లాడు, ప్రతిపాప చేతిలో పెడుతున్నాం. క్లాస్ టీచర్లకే దిక్కులేని పరిస్థితి గతంలో చూశాం. ఈ నాలుగేళ్ల కాలంలో మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీ చర్లు ఉండేలా అడుగులు పడ్డాయి. 3వ తర గతి నుంచే పిల్లలకు ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ టోఫెల్ కరిక్యులమ్ తీసుకొచ్చింది కూడా ఈ ప్రభుత్వంలోనే. పిల్లలకు చక్కగా అర్థమయ్యేలా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు మొట్టమొదటిసారిగా ఇస్తున్నాం. బైజూస్ కంటెంట్‌ను కూడా మన పాఠాలతో అనుసంధానం చేయడం మీ జగన్ మామ ప్రభుత్వంలోనే జరిగింది. ► 6వ తరగతి నుంచే ప్రతిక్లాస్ రూమ్‌ను డిజిటలైజ్ చేశాం. ఐఏఎఫ్తో డిజిటల్ బోధనను స్కూల్స్‌లోకి తీసుకొచ్చాం. రోజుకొక మెనూతో చిక్కీ, రాగిజావ కూడా గోరుముద్దగా ఇస్తున్నాం. పౌ ష్టికాహారం అందించేలా అంగన్వాడీల్లోనూ మా ర్పులు తెచ్చాం. గర్భిణులు, బాలింతలు, పిల్ల లకు సంపూర్ణ పోషణ అమలు చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ ప్లస్ కూడా అమలు చేస్తున్నాం. ► నాడు–నేడుతో 45 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. 8వ తరగతి పిల్లలకు, టీచర్లకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా విద్యను అందించేలా ట్యాబ్స్ అందిస్తున్నదీ మీ మేనమామ ప్రభుత్వమే. ఆడపిల్లల కోసం స్వేచ్ఛ అనే పథ కాన్ని అమలు చేస్తున్నాం. పెద్ద చదువుల కోసం వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యా దీవెన ఇస్తోంది మీ మేనమామ ప్రభుత్వంలోనే. మెస్, హాస్టల్ ఖర్చుల కోసం వసతి దీవెన కార్యక్రమాన్నీ అమలు చేస్తున్నాం. ఇంకా గొప్పగా చదవాలి ► పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి. ప్రతి కుటుంబం నుంచి సత్యనాదెళ్ల రావాలి. విదేశాల్లో చదవాలన్నా తల్లిదండ్రులకు ఇబ్బందులు ఉండకూ డదనే విదేశీ విద్యా దీవెన పథకం తీసుకొచ్చాం. ప్రపంచంలోనే టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టిస్లో ఎక్కడ..ఏ సీటు వచ్చినా రూ.1.25 కోట్ల ఫీజు వరకు పూర్తిగా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. జీవితంలో చదువు అవసరాన్ని చెప్పేందుకే పదో తరగతి పూర్తి చేసి ఉండాల్సిందే అన్న నిబంధనతో వైఎస్సార్ కల్యాణమస్తు–షాదీ తోఫా అమలు చేస్తున్నాం. ఈ నాలుగేళ్లలోనే కేవలం విద్యా రంగంలో సంస్కరణల కోసం రూ.66,722 కోట్లు ఖర్చు చేశాం. గవర్నమెంట్ బడి వెలుగుతోంది.. ► గత ప్రభుత్వం దాదాపు కోటి మంది పిల్లలకు చేసిన అన్యాయం క్షమించగలమా? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులతో చదువుల్లో అంటరానితనాన్ని తుదముట్టించడం ఈ ప్రభుత్వంలోనే జరిగింది. ఒకప్పుడు పెత్తందార్లకు మాత్ర మే అందుబాటులో ఉన్న ఆ చదువుల కన్నా గొ ప్ప చదువులు పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడులకు తీసుకొచ్చాం. ప్రైవేట్ బడులకు తీసిపోకుండా పోటీపడే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో వచ్చింది. పెత్తందారీ విధానా న్ని బద్దలుగొట్టి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదల పిల్లలు గొప్ప చదువులకు వెళ్లేలా చేశాం. గవర్నమెంట్ బడుల్లో ఆణిముత్యాలుంటాయని, వజ్రాలు, రత్నాలు మెండుగా పుట్టే విద్యా విధానాన్ని తీసుకొచ్చింది ఈ నాలుగేళ్లలో మీ మేనమామ ప్రభుత్వంలోనే. ► పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేలా గవర్నమెంట్ బడి వెలుగుతోంది. టెన్త్ పరీక్షల్లో గవర్నమెంట్ స్కూళ్ల నుంచి టాప్ 10 ర్యాంకులు గతేడాది 25 రాగా, ఈ ఏడాది ఏకంగా 64కు పెరిగాయి. 75%కి పైగా మార్కులతో డిస్టింక్షన్ సాధించిన విద్యార్థుల సంఖ్య గత ఏడాది 63,275 ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య 67,114కు పెరిగింది. 66.50% ఫస్ట్ క్లాస్‌లో పాసైతే ఈసారి 70.16%కి పెరిగారు. 67 మంది పిల్లలకు ఐఐటీ, ఎన్ఐటీ, నిఫ్ట్, సెంట్రల్ వర్సిటీల్లో అడ్మిషన్లు దొరికే అవకాశం ఈ సంవత్సరం రాబోతోంది. ► బాబు హయాంలోని 2018–19లో ప్ర భుత్వ స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 84.48% తో ఏపీ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉండింది. ఇప్పుడు 100.80%తో మెరుగైంది. జాతీయ సగటు 100.13% కంటే ఎక్కువగా ఉన్నాం. ఇది విద్యా రంగంలో మనం చూపించిన శ్రద్ధకు దక్కిన ఫలితం. ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ► గిరిజన ప్రాంతంలో ఒకప్పుడు వైద్యానికి దిక్కులేని పరిస్థితి. ఇప్పుడు ఐదు ఐటీడీఏల పరిధిలో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు కడుతున్నాం. కురుపాం నియోజకవర్గంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీని వేగంగా నిర్మిస్తున్నాం. ఇదే నియోజకవర్గంలో మరో మెడికల్ కాలేజీ రాబోతోంది. ► ఉత్తరాంధ్రకు సంబంధించిన గిరిజన ప్రాంతంలో కొత్తగా కురుపాం, పాడేరు, నర్సీపట్నంలో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. నాలుగోది విజయనగరంలో నిర్మాణంలో ఉంది. వచ్చే నెలలో ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయబోతున్నాం. గిరిజనులను గుండెల్లో పెట్టుకున్నాం ► గిరిజనులను గుండెల్లో పెట్టుకున్నది మీ బిడ్డ ప్రభుత్వమే. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుంటే వారిలో మొట్టమొదటి గిరిజన డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో పనిచేసిన చరిత్ర నా సోదరి, కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిది. ఇప్పుడు మరో గిరిజనుడు పీడిక రాజన్నదొర డిప్యూటీ సీఎంగా పని చేస్తున్నారు. ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని సకాలంలో వేసిన చరిత్ర మనదే. ► నవరత్నాలను మారుమూల గిరిజన గ్రామాలకు చేర్చాలని తపన పడుతున్నాం. ఒక్క కురుపాం నియోజకవర్గంలోనే 118 టవర్లను ఒక్కొక్కటి రూ.80 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేశాం. గిరిజనుల్లో ఏకంగా 1,47,242 కుటుంబాలకు మేలు చేస్తూ ఆర్వోఎఫ్ఆర్ డీకేటీ పట్టాలు ఇచ్చాం. వారికి 3,62,737 ఎకరాలను పంచి పెట్టింది మీ బిడ్డ ప్రభుత్వమే. ► కురుపాం నియోజకవర్గంలోనే 21,311 కుటుంబాలకు 38,798 ఎకరాలు పంపిణీ చేశాం. వాళ్లందరికీ వైఎస్సార్ రైతు భరోసా సొమ్మును గత నాలుగేళ్లుగా ఇస్తున్నాం. నామినేటెడ్ పదవి అయినా, కాంట్రాక్ట్ అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కచ్చితంగా 50 శాతం కేటాయించాలని చట్టం చేశాం. మన కళ్లెదుటే గ్రామ సచివాలయాల్లో 1.30 లక్షల మంది ఉద్యోగులుగా ఉన్నారు. వారిలో నా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు 84 శాతం మంది కనిపిస్తున్నారు. -
పండుగలా ‘అమ్మ ఒడి’.. సీఎం జగన్ కురుపాం పర్యటన దృశ్యాలు..
-
అమ్మఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
-
జగనన్న అమ్మఒడి నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
-
మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్ గా తయారుకావాలన్నదే లక్ష్యం
-
అమ్మ ఒడి: కురుపాంలో థాంక్యూ జగన్ మామయ్య (ఫొటోలు)
-
కురుపాంలో అమ్మ ఒడి నిధుల్ని జమ చేసిన సీఎం జగన్
జగనన్న అమ్మ ఒడి 2023.. కురుపాం సభ అప్డేట్స్ ► కురుపాంలో 2023-24 ఏడాదిగానూ.. అమ్మ ఒడి నిధుల్ని బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలో జమ చేశారు సీఎం జగన్. ► సీఎం జగన్ మాట్లాడుతూ.. పదిరోజులపాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి కొనసాగుతోంది. అన్ని స్కూల్స్, కాలేజీల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నిధులు జమవుతున్నాయి. అవినీతి, వివక్ష లేకుండా నేరుగా నిధులు అందజేస్తున్నాం. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకే అమ్మ ఒడి పథకం. ప్రపంచస్థాయిలో పిల్లలు పోటీపడేలా తీర్చిదిద్దుతున్నాం. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. వచ్చే తరం మనకంటే బాగుండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ► రోజుకో మెనూతో విద్యార్థులకు గోరుముద్ద అందిస్తున్నాం. పిల్లలకు తొలిసారిగా బైలింగ్వుల్ పుస్తకాలు అందజేస్తున్నాం. పిల్లలకు సులువుగా అర్థమయ్యేందుకు డిజిటల్ బోధనను తీసుకొచ్చాం. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకు అమ్మ ఒడి అందిస్తున్నాం. అమ్మ ఒడి కింద ఇప్పటి వరకు రూ.26,067.28 కోట్లు అందజేశాం. ► అంగన్వాడీల్లోనూ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తున్నాం. నాడు-నేడు ద్వారా 45వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ పిల్లలకు ట్యాబ్స్ కూడా అందించాం. ఆడపిల్లల కోసం స్వేచ్చ పథకం అమలు చేస్తున్నాం. ► విదేశాల్లో పెద్ద చదువుల కోసం విద్యార్థులకు ఎక్కడ సీటు వచ్చినా రూ. కోటి 25లక్షలు అందజేస్తున్నాం. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా అమలుచేస్తున్నాం. పెద్ద చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా వంద శాతం పూర్తి ఫీజురియింబర్స్మెంట్తో జగనన్న విద్యాదీవెన అందిస్తున్నాం. ప్రతీ కుటుంబంలోనూ ఒక సత్యనాదెళ్ల వంటి వ్యక్తి రావాలి. పెత్తందారులకు అందుబాటులో ఉన్న చదవుల కన్నా గొప్ప చదువులు పేదల పిల్లలకు అందుబాటులోకి వచ్చాయి. చదువుల్లో అంటరానితనాన్ని తుదముట్టించాం. నాలుగేళ్లలో ఏపీలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి అమలవుతోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. బడులు ప్రారంభమైన వెంటనే మెరుగైన విద్యాకానుక కిట్లు అందజేస్తున్నాం. మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండేలా చర్యలు చేపట్టాం. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్‌గా తయారుకావాలన్నదే లక్ష్యం. ► విద్యార్థి మనస్వినీ మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ద్వారా నేను ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నాను. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ లెజెండ్ అని ప్రశంసించింది. సీఎం జగన్ తీసుకువచ్చిన ప్రతీ పథకం తమకు ఎంతో మేలు చేస్తున్నదని తెలిపింది. సీఎం జగన్ ఏపీలో హిస్టరీ క్రియేట్ చేశారని పేర్కొంది. ► మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 83 లక్షల మందికిపైగా విద్యార్థులకు అమ్మఒడి ద్వారా లబ్ధి. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చారు. విద్యారంగంలో సీఎం జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలో డిజిటల్ ఎడ్యుకేషన్‌ను తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీపడేలా తీర్చిదిద్దుతున్నారు. ► ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. పిల్లలను బడికి పంపించాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి. ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలనే లక్ష్యంతోనే అమ్మఒడి పథకం తీసుకువచ్చాం. విద్యారంగంలో సీఎం జగన్ సంస్కరణలు తీసుకువచ్చారు. ► పేదల తలరాతలు మార్చే పథకం జగనన్న అమ్మఒడి. చదువుల విప్లవం ఎలా ఉంటుందో సీఎం జగన్ ప్రభుత్వంలో చూస్తున్నాం. ► జగనన్న అమ్మఒడి పథకం గొప్ప ఆలోచన. పేద పిల్లల చదువు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ► చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా పేదల చదువుల కోసం అమ్మఒడి లాంటి పథకం అమలు చేశారా?. ► అమ్మ ఒడి పథకం పేదల అక్షయపాత్ర. పేదలకు మేలు చేసే జగనన్న డెడికేషన్‌ను చంద్రబాబు కాపీకొట్టలేరు. చంద్రబాబు పప్పులు ఈసారి జనం దగ్గర ఉడకవు. ► పార్టీ గుర్తులేని వారు ఎంతమంది గుంపులుగా వచ్చినా కనీసం జగనన్న నీడను కూడా తాకలేరు. జగనన్నను గుండెల్లో పెట్టుకున్న హనుమంతుని లాంటి కార్యకర్తలు కోట్లలో ఉన్నారు. ► జగనన్న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమం కోసం.. కురుపాం బహిరంగ సభ వేదికపైకి సీఎం జగన్ చేరుకున్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి.. జ్యోతి ప్రజల్వనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రజలకు అభివాదం చేసి కూర్చున్నారు. ► సీఎం జగన్ రాక నేపథ్యంలో.. కురుపాం హెలిప్యాడ్ వద్దకు భారీగా జనం చేరుకున్నారు. ఆయన్ని చూసి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆ అభిమానానికి మురిసిపోయిన ఆయన.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆత్మీయ స్వాగతం ► సీఎం వైఎస్ జగన్ కురుపాం చేరుకున్నారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర, పుష్ప శ్రీ వాణి, ఎమ్మల్యే లు, ఎంపీలు.. ఆయనకు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో నాలుగో విడత జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం. ► జగనన్న అమ్మఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమంతో.. కురుపాంలో పండుగ వాతావరణం నెలకొంది. ► ఇక గత నాలుగేళ్లలో నాలుగేళ్లలో విద్యా రంగంపై సీఎం జగన్ ప్రభుత్వం రూ.66,722.36 కోట్లను వెచ్చించారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుకతో అడుగడుగునా పిల్లల చదువులకు అండగా నిలుస్తున్నారు. ► తాజాగా విడుదల చేయబోయే నిధులతో కలిపి.. ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని లబ్ధిదారులకు చేకూర్చినట్లయ్యింది జగనన్న ప్రభుత్వం. ► కురుపాం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి అమ్మ ఒడి నిధులు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ► పార్వతీపురం మన్యం పర్యటన కోసం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయల్దేరిన సీఎం జగన్ మోహన్ రెడ్డి. ► జగనన్న అమ్మ ఒడి 2023 నిధుల విడుదల కోసం.. తాడేపల్లి తన నివాసం నుంచి పార్వతీపురం మన్యం కురుపాంకు బయల్దేరారు సీఎం జగన్. ► పార్వతీపురం మన్యం కురుపాం బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. అమ్మ ఒడి నిధుల్ని సీఎం జగన్ విడుదల చేస్తారు. ► వరుసగా నాలుగో ఏడాదీ 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’ అమలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. పది రోజులపాటు పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించి 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. ఇందుకోసం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంను వేదికగా ఎంచుకున్నారు. ఇదీ చదవండి: వృత్తి నిపుణుల జాబితాలోకి రైతులు! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
4వ విడత జగనన్న అమ్మఒడి
-
విద్యార్థుల తల్లిద్రండ్రులకు గుడ్ న్యూస్
-
10వ తరగతిలో 586 మార్కులు సాధించాను. నాడు-నేడు, అమ్మఒడి, విద్యాకానుక పథకాలు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
-
సీఎం వైఎస్ జగన్ నాడు నేడు, అమ్మ ఒడి పథకాలతో విప్లవాత్మకమైన మార్పు
-
ఈనెల 28న అమ్మఒడి పథకం అమలు
-
అమ్మ ఒడి పథకం చాలా మంచిది: టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న అమ్మ ఒడి పథకాన్ని టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసించారు. అమ్మ ఒడి పథకం చాలా మంచిది అంటూ కామెంట్స్ చేశారు. వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకాన్ని ప్రశంసించారు. అమ్మ ఒడి పథకం చాలా మంచిది. దీన్ని నేరుగా తల్లుల ఖాతాల్లోకే నగదు జమ అవుతుందన్నార. దీని ద్వారా ఏ స్కూల్ బాగుంటుందో చూసుకుని చదివించుకొనే అవకాశం ఉందన్నారు. -
AP Budget 2023-24: విద్యా రంగానికి పెద్దపీట.. ఎన్ని కోట్లు కేటాయించారంటే!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన బడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎమ్‌ఎఫ్), పాఠశాల నిర్వహణ నిధి(ఎన్.ఎమ్, ఎఫ్), సమీకృత పాఠ్యాంశ, పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను, విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరిచి రాష్ట్ర విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక దృశ్య మాధ్యమ తరగతులు, విద్యా పునాదిని వేసే ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం ఆమెదం తెలిపింది. ఉపాధ్యాయులకు 60,000 ట్యాబ్‌లను, కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు(సీబీఎస్ఈ) సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10 వతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 4.6 లక్షల ట్యాబ్‌లను పంపిణీ చేసింది. జగనన్న అమ్మ ఒడి. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది. ఈ పథకం కింద 2019-20 సంవత్సరం నుంచి 44 లక్షల 50 వేల మంది తల్లులకు.. 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సూమారు రూ. 19,618 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ రావడం జరుగుతోంది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి పథకం కోసం రూ.6,500 కోట్లు కేటాయించింది. మన బడి నాడు-నేడు మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు,మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు, వంట శాలలను అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తుంది సీఎం జగన్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కింద మొదటి, రెండవ దశలలో మొత్తం 22,344 పాఠశాలలో పనులు చేపట్టారు. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి మన బడి నాడు-నేడు కార్యక్రమం కిందరూ. 3,500 కోట్లు కేటాయించింది. జగనన్న విద్యాకానుక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్‌లు, బూట్లు, సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, స్కూల్ బెల్ట్, మాస్క్‌ల సెట్లతో కూడిన ‘టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్’ను విద్యార్థి కిట్ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కిద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటి వరకు రూ. 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ►2023-24 బడ్జెట్లో జగనన్న విద్యాకానుక కోసం రూ.560 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం కింద 9,249 కోట్ల రూపాయలను పంపీణి చేశారు ►2013-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యాదీవెన పథకం కోసం రూ. 2.841 కోట్లు కేటాయించింది. ►జగనన్న వసతి దీవెన పథకం కోసం రూ. 2,200 కోట్ల కేటాయింపు జరిగింది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం రూ. 29,690 కోట్ల రూపాయలు కేటాయించింది. ►ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయించింది. -
తుది తీర్పునకు లోబడే 25% కోటా సీట్ల ఫీజు చెల్లింపు వ్యవహారం
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటా కింద ఉచిత సీట్లు పొందే పిల్లల తల్లిదండ్రులు అమ్మఒడి పథకం చెల్లించే మొత్తం నుంచే ఫీజులు చెల్లించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 24ను సవాలు చేస్తూ ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) అధ్యక్షుడు కోగంటి శ్రీకాంత్, యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫెడరేషన్(యుపీఈఐఎఫ్) చైర్మన్ గొల్లపూడి మోహనరావు హైకోర్టును ఆశ్రయించారు. 25 శాతం కోటా కింద భర్తీ చేసే సీట్ల ఫీజులను తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా పాఠశాలలకు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. 25 శాతం కోటా సీట్ల ఫీజులను ప్రభుత్వం సరైన రీతిలో నిర్ణయించలేదని వారు కోర్టుకు నివేదించారు. ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా పాఠశాలల ఖాతాలో సొమ్ము జమ చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఫీజు చెల్లింపు వ్యవహారం ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు నోటీసులిచ్చారు. తదుపరి విచారణను 15కి వాయిదా వేశారు. -
Andhra Pradesh: బాలికల ఓటు చదువుకే
అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, స్వేచ్ఛ, ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడు, డిజిటల్ తరగతులు, బైజూస్ కంటెంట్, సీబీఎస్ఈ, కరిక్యులమ్‌లో మార్పులు, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలు, కార్యక్రమాలు రాష్ట్రంలోని బాలికల్లో చదువుకోవాలన్న ఆలోచనను రెట్టింపు చేస్తున్నాయి. ఫలితంగా అమ్మాయిలందరూ బడిబాట పడుతున్నారు. పాఠశాలల స్థాయిలోనే ఆగిపోకుండా కళాశాలలో సైతం అడుగు పెడుతున్నారు. మంచి ఉద్యోగమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రతి బాలిక కనీసం పదో తరగతి వరకు అయినా చదవాలన్న తపన, తాపత్రయంతో ప్రభుత్వం ‘కళ్యాణమస్తు’ కార్యక్రమానికి పదో తరగతి అర్హత పెట్టింది. ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలవడంతో తల్లిదండ్రులు సైతం బాలికల చదువుకు ఊకొడుతున్నారు. ఫలితంగా ఏడాదికేడాది పాఠశాలలు, కళాశాలల్లో వీరి చేరికలు పెరుగుతున్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి దశలోనూ అండగా నిలవడంతో విద్యా రంగంలో అమ్మాయిలు దూసుకెళ్తున్నారు. ఒకప్పుడు చదువుల్లో వెనుకబడిన ఆడపిల్లలు నేడు అన్ని అడ్డంకులను అధిగమించి పోటాపోటీగా దూసుకుపోతున్నారు. తల్లిదండ్రులు కూడా బాలికల చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో యుక్త వయసు రాక ముందే ఆడ పిల్లల పెళ్లిళ్లపై దృష్టి సారించే తల్లిదండ్రులు.. నేడు ఆ ఆలోచనను వాయిదా వేసి, వారి చదువులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత చదువుల వరకు స్కూళ్లు, కాలేజీల్లో ఆడపిల్లల చేరికలు భారీగా పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన ఏన్యువల్ స్టాటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసర్), ఆలిండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఐష్) నివేదికల్లోని గణాంకాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. బాలికల చేరికల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మరింత అధికమని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అనేక విద్యాభివృద్ధి పథకాలు, కార్యక్రమాలతో తల్లిదండ్రులు ఆడపిల్లలను బడులకు పంపిస్తున్నారు. పాఠశాల స్థాయి అనంతరం.. ఇంటర్మీడియెట్ చదవులకు వీలుగా బాలికల కోసం ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలను అందుబాటులోకి తెస్తోంది. ఉన్నత కోర్సుల్లో చేరే వారికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటుతోపాటు వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల వరకు అందిస్తోంది. విద్యకు సంబంధించిన భారమంతా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుండటంతో ఆడపిల్లల చేరికలు బాగా పెరిగాయి. ఏటా పెరుగుదల రాష్ట్రంలో 2020–21లో టెన్త్‌లో 3,19,193 మంది బాలికలు ఉండగా, 2021–22లో వారిలో 2,37,530 (75 శాతం) మంది ఇంటర్లో చేరారు. అంతకు ముందు ఏడాది.. అంటే 2019–20లో టెన్త్‌లో 3,20,227 మంది ఉండగా, అందులో 2,24,943 (70 శాతం) మంది 2020–21లో ఇంటర్లో చేరినట్లు యూడైస్ గణాంకాలు వివరిస్తున్నాయి. ఏటేటా బాలికల చేరికల శాతం పెరుగుతోందనేందుకు ఈ గణాంకాలే తార్కాణం. ఉత్తీర్ణతలోనూ బాలికలే పైచేయి సాధిస్తున్నారు. 2022 ఇంటర్ ఫలితాల్లో 68 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులవ్వగా బాలురు 32 శాతమే ఉత్తీర్ణులయ్యారు. జాతీయ స్థాయితో పోల్చితే రాష్ట్రంలో బాలికల చేరికలు మరింత మెరుగ్గా ఉన్నాయి. జాతీయ స్థాయిలో బాలికల జీఈఆర్ పెరుగుదల 2.28 శాతం మాత్రమే ఉండగా రాష్ట్రంలో 11.03 శాతానికి పెరిగిందని ఐష్ గణాంకాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా తగ్గిన డ్రాపవుట్లు గతంలో దేశ వ్యాప్తంగా చాలా కాలంగా 7 లేదా 8వ తరగతి తర్వాత ఆడపిల్లల డ్రాపవుట్లు చాలా ఎక్కువగా ఉండేవి. ఇటీవలి కాలంలో క్రమేణా ఆ పరిస్థితి మారుతోంది. 14–16 వయసు బాలికలు బడికి వెళ్లకుండా ఇంటిలోనే ఉండిపోయే వారి శాతం 2018 నాటికి 13.5 శాతం వరకు ఉన్నట్లు అసర్ గత నివేదికలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం ఆ శాతం 7.9 శాతానికి తగ్గినట్లు 2022 నివేదిక పేర్కొంది. 11 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న బాలికల్లో బడులకు వెళ్లని వారి శాతం 4.1 శాతం నుంచి 2 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. ఇంటర్లో పెరిగిన చేరికలు గతంలో టెన్త్ తర్వాత బాలికల చదువు ముందుకు సాగడానికి చాలా సమస్యలు ఉండేవి. అయితే కాలేజీల అందుబాటు, వివిధ వనరుల కల్పనతో భద్రతాపరమైన చర్యలు పెరగడం, తల్లిదండ్రులు కూడా పిల్లలను కాలేజీల్లో చేరేలా ప్రోత్సహిస్తుండడంతో హయ్యర్ సెకండరీ, ఇంటర్మీడియెట్ స్థాయిల్లోనూ బాలికల చేరికలు బాగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో విడుదల చేసే దేశ వ్యాప్త గణాంకాల ప్రకారం 2021–22లో పదో తరగతిలో 89,66,648 మంది బాలికలు ఉండగా.. ఇందులో ఇంటర్లో 73,36,609 (82 శాతం) మంది చేరారు. 2020–21 గణాంకాల ప్రకారం టెన్త్‌లో 91,64,940 మంది ఉండగా, వారిలో ఇంటర్లో 65,80,132 (72 శాతం) మంది చేరారు. అంటే పది శాతం మేర బాలికల చేరికలు పెరిగినట్లు యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ – యూడైస్+ (యూడీఐఎస్+) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉన్నత విద్యలోనూ బాలికల పెరుగుదల ► ఇంటర్మీడియెట్ అనంతరం ఉన్నత చదువుల్లోనూ బాలికల చేరికలు గణనీయంగా పెరుగుతున్నట్లు ఐష్ పేర్కొంది. 2020–21 నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్నత చదువుల్లో చేరికలు 2019–20లో 3.85 కోట్లు ఉండగా, 2020–21లో అది 4.13 కోట్లకు చేరినట్లు తెలిపింది. అంటే 28.80 లక్షల మంది పెరిగారు. ► 2018–19లో 2.7 శాతం ఉండగా, 2019–20లో 3 శాతం మేర, 2020–21లో 7.4 శాతం మేర పెరిగాయని ఆ నివేదిక తెలిపింది. వీరిలో బాలికల చేరికలు 2019–20లో 1.89 కోట్లు కాగా, 2020–21లో 1.96 కోట్లుగా ఉంది. 2021–22, 2022–23 అధికారిక గణాంకాలు ఖరారైతే ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది. ► ఏపీ విషయానికి వస్తే యూడైస్ గణాంకాల ప్రకారం 2018–19లో టెన్త్ బాలికల్లో 70 శాతం మంది ఇంటర్ ఫస్టియర్‌లో చేరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2019–20లో అమ్మ ఒడి తదితర కార్యక్రమాలతో 78 శాతం మంది ఇంటర్లో చేరారు. ► 2020–21లో కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లో చేరికలు 70 శాతంగా ఉన్నా, మళ్లీ 2021–22 నాటికి బాలికల చేరికల శాతం 75 శాతానికి చేరుకుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఇంటర్లో బాలికల చేరికలు 2021–22లో ఏపీలో 75 శాతంగా ఉండగా బీహార్‌లో 56 శాతం, కర్ణాటకలో 73 శాతం, తెలంగాణలో 74 శాతంగా ఉన్నాయి. -
విద్యాశాఖలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు: సెర్ప్‌తో షేర్
ఒంగోలు: విద్యాశాఖలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ ఎంఈఓలు నిర్వహిస్తున్న విధుల్లో కొన్నింటిని సెర్ప్ విభాగంలో పనిచేస్తున్న ఏపీఎంలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎంలు ప్రస్తుతం సెర్ప్‌లో స్వయం సహాయక సంఘాలు, స్త్రీ నిధి తదితర బ్యాంకు లింకేజీ స్కీములను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యాశాఖకు కేటాయించిన ఏపీఎంలు నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ వంటి వాటిని పర్యవేక్షిస్తారు. మండల విద్యాశాఖ అధికారికి వీటి నుంచి మినహాయింపు ఇవ్వడంతో పనిభారం తగ్గుతుంది. తద్వారా వారు పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. పాఠశాలల తనిఖీలు, పాఠశాలల్లో సిలబస్ నిర్ణీత సమయానికి పూర్తిచేస్తున్నారా, హాజరు ఎలా ఉంది, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. పనులు వేగవంతం అయ్యేందుకు ఉపయోగం సెర్ప్‌లోని అదనపు ప్రాజెక్టు మేనేజర్లను ఎంఈవో బాధ్యతల్లో కొన్నింటిని పర్యవేక్షించేందుకు ఇవ్వడం వలన పనులు వేగవంతం అవుతాయి. సాధారణంగా ఎంఈవోలకు చాలా బాధ్యతలు ఉన్నాయి. వాటన్నింటిని సమన్వయం చేసుకునే సమయంలో విద్యాప్రమాణాల పెంపుదలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఏపీఎంలను ఉపయోగించుకోవడం ద్వారా అటు విద్యా ప్రమాణాల మెరుగుదల, మరో వైపు నాడు–నేడు వంటి పనుల పర్యవేక్షణ వేగవంతం అవుతాయి. – బి.విజయభాస్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి -
బాధ్యత వద్దు, విషప్రచారం ముద్దు
విద్య ప్రభుత్వ బాధ్యత కాదన్నది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట. ‘విద్య ప్రభుత్వ బాధ్యత. అది పవిత్రమైన పెట్టుబడి, యువత భవిష్యత్తుకు అది బంగారు పెట్టుబడి’.. ఇది ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట. వీరిద్దరిలో ఎవరు రైట్? ఎవరు రాంగ్? చంద్రబాబు విద్యారంగంపై చేసిన వ్యాఖ్య చాలా తీవ్రమైనది. ఆయన రాసుకున్న పుస్తకంలో కూడా ఉన్న సంగతే ఇది. విద్యారంగానికి ప్రైవేటు రంగం బాధ్యత వహించాలనీ, కార్పొరేట్లు దాన్ని చేపట్టాలనీ అనడం ద్వారా ప్రభుత్వానికి దానితో సంబంధం అంతంత మాత్రమే అని చెప్పకనే చెప్పారు. నిజానికి ప్రభుత్వాలు నిర్వహించవలసిన ముఖ్యమైన కర్తవ్యాలలో విద్య ప్రధానమైనది. ఆ తర్వాత వైద్యం, తదుపరి వ్యవసాయం వస్తాయి. మొత్తం రాష్ట్ర ప్రజలందరి జీవితాలనూ ప్రభావితం చేసే విషయాలివి. అందువల్లే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కానీ, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి కానీ, ఆయా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున స్కూళ్లు స్థాపించాయి. టీచర్ల నియామకానికి బాధ్యత తీసుకున్నాయి. స్కూళ్లకు భవనాలు, మైదానాలు సమ కూర్చాయి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ధోరణిలో మార్పు వచ్చింది. కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రముఖంగా మారాయి. విద్య వ్యాపారంగా మారిపోయింది. అందువల్ల 1998లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించినా, ఆ తర్వాత ఏదో సాకుతో ఆ పరీక్షలలో ఉత్తీర్ణులైనవారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. జనం కూడా క్రమంగా ప్రభుత్వ స్కూళ్లనూ, కాలేజీలనూ వదలి, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలవైపు చూడడం ఆరంభించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రవేశపెట్టిన ‘ఫీజు రీయింబర్స్మెంట్’ స్కీమ్ గేమ్ ఛేంజర్‌గా మారింది. అంతవరకు ఆర్థికంగా స్థితిమంతులకూ, ఎక్కువ భాగం అగ్రవర్ణాలకే పరిమితం అయిన ఉన్నత విద్య, ఈ స్కీమ్‌తో పేదలకూ, బలహీన వర్గాలకూ కూడా అందుబాటులోకి వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఏకంగా ప్రైవేటు రంగంలోనే విద్యారంగం ఉండాలని అధికారిక కార్యక్రమాలలోనే చెప్పడం ద్వారా తన ప్రభుత్వ వైఖరి తెలియచెప్పారు. దాంతో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు అంత ప్రాధాన్యత లేకుండా పోయింది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ చాలా నిర్దిష్టంగా విద్యా రంగానికి విశేష ప్రాధాన్యం ఇచ్చారు. ‘అమ్మ ఒడి’ పేరుతో వినూత్న స్కీమ్‌ను ప్రవేశ పెట్టి పిల్లలను బడులకు పంపించే తల్లులకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వడం ఆరంభించారు. అది పేదలకు, మధ్య తరగతి పిల్లలకు వరంలా మారింది. స్కూళ్లను ‘నాడు–నేడు’ పథకం కింద బాగు చేయాలని సంకల్పించి చకచకా పనులు ప్రారంభించారు. వాటి రూపురేఖలను మార్చడం మొదలుపెట్టారు. రంగులు వేయడం, పైకప్పులు బాగు చేయడం, స్కూల్ కాంపౌండ్‌ను ఆహ్లాద కరంగా తయారు చేయడం, అన్నిటికన్నా ముఖ్యంగా టాయిలెట్లకు ప్రయారిటీ ఇవ్వడం వంటి చర్యలతో ప్రభుత్వ ప్రాధాన్యతలలో ముఖ్యమైనవాటిలో విద్య ఒకటి అని తెలియచెప్పారు. ఇక ‘జగనన్న విద్యా దీవెన’, ‘గోరు ముద్ద’... ఇలా వివిధ స్కీములు కూడా అమలు చేస్తున్నారు. ఫలితంగా ప్రజలలో జగన్ పట్ల సానుకూల అభిప్రాయం ఏర్పడింది. దీంతో తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, తదితర మీడియా సంస్థలు కానీ తడబాటుకు గురయ్యాయి. ఇది ఇలాగే సాగితే ప్రజలలో జగన్ పలుకుబడిని దెబ్బతీయలేమని భావించి, రకరకాల వ్యతిరేక ప్రచారాలు ఆరంభించారు. అందులో భాగంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ‘అమ్మ ఒడి, నాన్న బుడ్డి’ అంటూ అవహేళనగా సభలలో మాట్లాడుతున్నారు. బైజూస్ టెక్నాలజీని ప్రభుత్వం తీసుకు వస్తే, దానిని ‘జగన్ జ్యూస్’ అంటూ చంద్రబాబు తన వయసు కూడా మర్చిపోయి అసహ్యకరమైన వ్యాఖ్య చేశారు. విద్యార్థులకు లోటుపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహిస్తే, లీకేజీలను అరికడితే, రెండు లక్షల మంది పిల్లలు పాస్ కాలేదనీ, ఇది ప్రభుత్వ వైఫల్యం అంటూ చిత్రమైన వాదన కూడా వీరు చేశారు. ఇలా ఒకటికాదు, ఏ అవకాశం వస్తే దానిని వారు వినియోగించుకుని విషం చిమ్మినంత పనిచేశారు. అందువల్లే జగన్ ఏకంగా చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5లను దుష్టచతుష్టయంగా ప్రకటించి... వారికి దత్తపుత్రుడు తోడుగా ఉన్నారని విమర్శలు చేస్తున్నారు. ఇలా విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్న తరుణంలో కొన్ని ప్రశ్నలు సహజంగానే ముందుకు వస్తాయి. తెలుగుదేశం పార్టీ, వారి అనుబంధ మీడియా ఒక వైపు రాష్ట్రం నాశనం అయిందని ప్రచారం చేస్తున్నాయి. అదే సమయంలో అమ్మ ఒడి లేదా ఇతర సంక్షేమ స్కీములలో ఇన్ని వేల మందికి, లక్షల మందికి ప్రభుత్వం కోత పెడుతూ అన్యాయం చేస్తోందని ద్వంద్వ ప్రమాణాలతో వార్తలు ఇస్తోంది. ఇంకో వైపు స్కూళ్ల విలీనం చేస్తున్నారంటూ రగడ సృష్టించే యత్నం చేస్తున్నారు. నిజంగానే ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం సర్దుకోవడం తప్పుకాదు. కానీ అదే పనిగా ఈ మీడియా... వ్యతిరేక కథనాలు ఇస్తుండడంతో అవి విశ్వసనీయత కోల్పోతున్నాయి. రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని చంద్రబాబు, ఆయన వర్గం మీడియా చెబుతుంటారు. అదేమిటో వివరించరు. అంటే అమ్మ ఒడి స్కీమ్ అమలు చేసి, పేదలకు మేలు చేస్తే రాష్ట్రం నాశనం అవుతున్నట్లా? ప్రభుత్వ బడులను బాగుచేస్తే ప్రభుత్వం రాష్ట్రాన్ని పాడు చేస్తున్నట్లా? పోనీ తాము అధికారంలోకి వస్తే అమ్మఒడి, నాడు–నేడు వంటి వాటిని రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టగలుగుతుందా? లేక ఎప్పటి మాదిరి ప్రజలను మాయచేయడంలో భాగంగా అమ్మ ఒడి పేరు మార్చి మరింత ఎక్కువ మొత్తం ఇస్తామని ప్రకటిస్తుందా అన్నది చర్చనీయాంశమే. ఇందులో ఏది చేసినా టీడీపీకి చికాకే. రద్దు చేస్తామని అంటే పేదలెవరూ ఒప్పుకోరు. ఇంకా ఎక్కువ సాయం చేస్తామని అంటే ఇన్నాళ్లుగా చేస్తున్న ప్రసంగాలకు విరుద్ధం కనుక ఎవరూ నమ్మరు. ఈ నేపథ్యంలో అధికార పక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఇది ఫ్లాగ్ షిప్ కార్యక్రమంగా మారింది. తెలుగుదేశం పార్టీకి అయోమయ పరిస్థితిని సృష్టించినట్లయింది. ఆయా ముఖ్యమంత్రులు చేపట్టిన వివిధ కార్యక్రమాలలో కొన్నిటినే ప్రజలు గుర్తుంచుకుంటారు. అందువల్లే గతంలో ఇందిరాగాంధీ, ఆ తర్వాత ఎన్టీఆర్, తదుపరి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేసే స్కీములను ప్రవేశ పెట్టి ప్రజాదరణ చూరగొన్నారు. చంద్రబాబు తనకంటూ ఒక బ్రాండ్‌ను ఎస్టాబ్లిష్ చేసుకోలేక పోయారు. వీటన్నిటినీ పరిశీలిస్తే జగన్ చెప్పినట్లు విద్యే పిల్లల భవిష్యత్తుకు అత్యంత కీలకం. అదే సంపద. మానవ వనరులపై పెట్టే పెట్టుబడి పవిత్రమైనదని భావించవచ్చు. అందువల్లే జగన్ సభలో ఒక చిన్నారి చక్కటి ఆంగ్లంలో ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రులు చరిత్రలో భాగం అవుతుంటారు; కానీ జగన్ చరిత్రను సృష్టిస్తుంటారు అని చెప్పినప్పుడు ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల నుంచి విశేష స్పందన కనిపించింది. చివరిగా ఒక మాట. ముఖ్యమంత్రిగా జగన్ ప్రసంగిస్తున్న ప్రతి సందర్భంలోనూ ఆ సభలో పాల్గొన్న ప్రజలు కానీ, విద్యార్థులు కానీ స్పందిస్తున్న తీరును గమనిస్తే జగన్ నిజంగానే చరిత్రను సృష్టించినట్లు అర్థమవుతుంది. కనుకే ప్రతిపక్ష టీడీపీకి గుండెల్లో రైళ్లు పరుగు పెడుతున్నట్లుగా ఉంది. (క్లిక్: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది?) - కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
జనం కోసం అమ్మ ఒడి డబ్బు ఖర్చు
వెదురుకుప్పం: తల్లిదండ్రుల కమిటీ మాజీ చైర్మన్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ప్రజోపకరమైన పనులు చేస్తోన్న ఆ సామాజిక కార్యకర్త ఈ సారి జగనన్న అమ్మ ఒడి డబ్బులతో శ్మశానానికి రోడ్డు వేసేందుకు సంకల్పించాడు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని బలిమొండివెంగనపల్లె గ్రామానికి చెందిన కొత్తపల్లె జాకబ్ కుమార్తె వర్షిత స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో 5 పూర్తి చేసింది. ఇదే పాఠశాలకు జాకబ్ చైర్మన్‌గా వ్యవహరించారు. వర్షితకు జగనన్న అమ్మ ఒడి పథకం కింద రూ.13 వేలు తల్లి సుకన్య ఖాతాలో జమ అయ్యింది. బలిజమొండివెంగనపల్లె దళితవాడ నుంచి శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించిన జాకబ్ తన భార్యకు వచ్చిన అమ్మ ఒడి సొమ్ముతో మంగళవారం జేసీబీ సాయంతో రహదారిని మరమ్మతు చేయించాడు. జాకబ్ మాట్లాడుతూ..చెప్పిన మాటకు కట్టుబడి పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
మీరు అధికారంలో ఉంటే బీసీలకు జడ్పీ చైర్మన్ వచ్చుండేదా?: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: పనికిమాలిన 420లు అంతా అమ్మఒడి పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్పొరేట్స్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ను తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి మూడేళ్లలోనే రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిన సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారా? అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ.. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ నిర్వహణకోసం రూ.2 వేలు తీసుకుంటున్నాం. 75% హాజరు ఉన్న ప్రతి విద్యార్ధికి అమ్మ ఒడి అందించాం. చంద్రబాబుకి సిగ్గూ శరం లేదు. చంద్రబాబు నీ జీవితంలో రూ.18 లక్షలైనా ఖర్చు చేశావా. రామోజీరావు, బీఆర్ నాయుడు, దత్తపుత్రుడికి కళ్లు కనిపించడం లేదా?. చంద్రబాబు 14 ఏళ్లలో ఏడాదికి ఒకటి మెడికల్ కాలేజీ చొప్పున కట్టినా జిల్లాకొకటి ఉండేది. జగన్ సీఎం అయిన తర్వాత 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రూ.20 వేల కోట్లు పిల్లలకు ఖర్చు చేస్తుంటే.. దీన్నే మంటారు మీ పిండాకూడా అంటూ మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మంచి చేస్తుంటే ఈ 420లు అంతా కలిసి వెనుక గోతులు తవ్వుతున్నారు. సామాజిక న్యాయం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్థానం కల్పించారు. తెలుగుదేశం అధికారంలో ఉంటే బీసీలకు జడ్పీ చైర్ పర్సన్ వచ్చుండేదా. టీడీపీ ఏనాడూ సీఎం జగన్ ప్రభుత్వం మాదిరి సంక్షేమాన్ని అందించలేదు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చదవండి: (YSRCP Plenary 2022: కొడాలి ఒక బ్రాండ్.. దెబ్బకు బాబుకు నిద్ర పట్టడం లేదు) చంద్రబాబును కుప్పంలోనూ ఓడించి తీరుతాం ఎన్టీఆర్ వారసుడిగా జగన్ బీసీ, వెనుకబడిన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చాడు. ఇచ్చామంటే ఇచ్చాం అని కాకుండా కీలక శాఖలను వెనుకబడిన వర్గాలకు ఇచ్చారు. జగన్‌ను ఎదిరించలేక టీడీపీ మీడియా డిబేట్లు పెడుతుంది . డిబేట్లు పెట్టేవాడు.. మాట్లాడేవాడు హైదరాబాద్‌లోనే ఉంటారు. దమ్ముంటే టీడీపీ ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదు?. చంద్రబాబు చవట దద్దమ్మ. మమ్మల్ని చంద్రబాబు ఓడిస్తాడట. 2019లో నీ దత్త పుత్రుడిని రెండు చోట్ల తుక్కు తుక్కుగా ఓడించాం. నీ సొంత కుమారుడిని మంగళగిరిలో ఓడించాం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలోనూ ఓడించి తీరుతాం. 2024లో నేను మళ్ళీ గెలుస్తాను అని కొడాలి నాని అన్నారు. ఆ పార్టీని కూకటి వేళ్లతో పీకి పడేస్తా ఎన్టీఆర్ మా ఆస్తి.. మాకోసం పార్టీ పెట్టిన దేవుడు ఎన్టీఆర్. నువ్వెవడివిరా.. చంద్రబాబు. అన్నగారికి వెన్నుపోటు పొడిచి.. పార్టీలాక్కున్న నీచుడు, 420 చంద్రబాబు. చంద్రబాబును, ఆ పార్టీని కూకటి వేళ్లతో పీకి పడేస్తా. చంద్రబాబు, రామోజీరావు, బీఆర్ నాయుడు, రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. వైఎస్సార్ బ్రతికి ఉంటే ఈ రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడేవాడు. వైఎస్ వారసుడిగా మనకు మంచి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి మనం అండగా నిలవాలి. చావైనా.. బ్రతుకైనా జగన్ వెంటే ఉంటానని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. -
ఈ అమ్మఒడి భవితకు పెట్టుబడి
‘చదువుల మీద ఖర్చు పెట్టే ప్రతి పైసా పవిత్రమైన పెట్టుబడి. పిల్లల తలరాతలు, భవిష్యత్తును మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. నిజమైన ఆస్తి అదే. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా బతకగలిగే శక్తి చదువు ద్వారానే సమకూరుతుంది. అలాంటి నాణ్యమైన చదువులు మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లోనూ వెల్లివిరియాలి’ – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను చదివించలేని పరిస్థితి ఎవరికీ రాకూడదనే సంకల్పంతో విద్యార్థుల చదువులకు అడుగడుగునా అండగా నిలుస్తూ మూడేళ్లుగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తు బాగుండాలనే తపనతో నాణ్యమైన విద్యా బోధన దిశగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తల్లులు తమ పిల్లల చదువులను ఒక తపస్సులా భావించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో వరుసగా మూడో ఏడాది అమ్మ ఒడి పథకం కింద రూ.6,595 కోట్లను నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. చదువొక హక్కుగా.. విద్యాధికులున్న దేశాల్లో ప్రజల తలసరి ఆదాయం మనకన్నా ఎక్కువగా ఉండటానికి కారణం చదువులే. ఏ ప్రభుత్వమైనా చదువుల మీద వెచ్చించే ఒక్క పైసా కూడా వృథా చేస్తున్నట్లు కాదు. పిల్లల తలరాతలు, భవిష్యత్తును మార్చే గొప్ప పెట్టుబడిని విమర్శించడం సరికాదు. రాష్ట్రంలో ప్రతి బిడ్డకూ మంచి చదువులను ఒక హక్కుగా, బాధ్యతగా అందిస్తున్నాం. పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటూ మూడో ఏడాదీ అమ్మ ఒడి అమలు చేస్తున్నాం. అమ్మ ఒడి నాకెంతో సంతోషాన్నిచ్చే కార్యక్రమం. ఇవాళ మూడో విడత కింద రూ.6,595 కోట్లు అందజేస్తున్నాం. దీని ద్వారా 43,96,402 మంది తల్లులకు, దాదాపు 80 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుంది. ఒక్క అమ్మ ఒడి ద్వారానే మూడేళ్లలో రూ.19,618 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని స్కూల్ ఏదైనా.. పిల్లలను బాగా చదివించండి. మీకు తోడుగా నేనున్నా. బడికి పంపితే చాలు. అది ప్రైవేట్ స్కూల్ అయినా, ఎయిడెడ్ అయినా, ప్రభుత్వ స్కూలైనా.. ఎక్కడ చదివించినా జగన్ మామకు అభ్యంతరం ఉండదు. పిల్లలు చదవడం మాత్రమే ముఖ్యం. బడికి పంపితే ఏటా రూ.15 వేలు అమ్మ ఒడి ద్వారా అందిస్తాం. ఎంత ఎక్కువ మంది తల్లులకు అమ్మ ఒడి అందితే నాకు అంత ఆనందం. పిల్లలు బడికి వెళ్తేనే చదువు వస్తుంది. అందుకే కనీసం 75 శాతం హాజరు కచ్చితంగా ఉండాలని జీవో ఇచ్చే రోజే నిబంధన పొందుపరిచాం. కోవిడ్ తదితర కారణాలతో రెండేళ్లు మినహాయింపు ఇచ్చినా గత సెప్టెంబర్ నుంచి బడులన్నీ యథావిధిగా నడుస్తున్నందున హాజరు నిబంధన అమల్లోకి వచ్చింది. బాధాకరమైనా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా.. 2021–22లో దాదాపు 51 వేల మంది తల్లులు అమ్మ ఒడి లబ్ధి అందుకోలేకపోయారు. 44,47,402 మంది తల్లులకు గాను ఒక్క 51 వేల మంది తల్లులకు మాత్రం ఇవ్వలేకపోయాం. దీన్ని మరోరకంగా చెప్పాలంటే 43,96,402 మంది తల్లులకు అమ్మ ఒడి పథకాన్ని అందించగలిగా>ం. 1.14 శాతం మందికి మాత్రమే ఇవ్వలేకపోయాం. ఆ తల్లులకు ఇవ్వలేకపోవడం చాలా బా«ధాకరమైనప్పటికీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా 75 శాతం హాజరుతో అడుగులు ముందుకు వేయాల్సి ఉంది. ఇక్కడొక బృహత్తర యజ్ఞం జరుగుతోంది. పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపే బాధ్యతను అక్కచెల్లెమ్మలు తీసుకోవాలని కోరుతున్నా. ఎప్పటికీ అలాగే ఉండేలా... నాడు – నేడుతో రూపురేఖలు మారిపోయిన పాఠశాలలు ఎప్పటికీ అలాగే ఉండేందుకు, పరిశుభ్రమైన టాయిలెట్ల కోసం టాయిలెట్ మేనేజ్మెంట్ ఫండ్ (టీఎంఎఫ్) ఏర్పాటు చేసి అమ్మ ఒడిలో కాస్త సొమ్ము కేటాయిస్తున్నాం. పాఠశాలలు నిరంతరం బాగుండాలంటే మరమ్మతులు ఎప్పటికప్పుడు వెంటనే చేపట్టాలి. అందుకనే అమ్మ ఒడి సొమ్ములో కాస్త సొమ్మును స్కూళ్ల నిర్వహణ కోసం ఎస్ఎంఎఫ్ కింద కేటాయిస్తున్నాం. స్కూళ్ల బాగోగుల కోసం ప్రతి అక్కచెల్లెమ్మ రూ.2 వేలు కేటాయించడం వల్ల ప్రశ్నించే అవకాశం వారికి ఒక హక్కుగా వస్తుంది. దీనిపై విమర్శలు చేసే ఏ ఒక్కరైనా చదివించే తల్లికి ఒక్క రూపాయైనా ఇచ్చారా? ఏనాడూ రూపాయి ఇవ్వనివారు ఇవాళ సంక్షేమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఎగ్గొట్టే ప్రభుత్వమైతే ఇంత చేస్తుందా? ఇది ఎగ్గొట్టే ప్రభుత్వమే అయితే అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 95 శాతం హామీలు అమలు చేస్తామా? మేనిఫెస్టోను భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావిస్తూ ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. డబ్బులు ఎగ్గొట్టాలనుకుంటే పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తపిస్తామా? దేశంలో అతి పెద్ద ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం చేసుకుంటామా? ఏటా రూ.24 వేలు ఖర్చు కానీ అందుబాటులోకి రాని బైజూస్ యాప్ ఇవాళ పేద పిల్లలకు ఉచితంగా అందుబాటులోకి వస్తున్న విషయం వాస్తవం కాదా? 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు 8వ తరగతిలోకి అడుగుపెట్టే ప్రతి విద్యార్థికి ఈ సెప్టెంబర్ నుంచే రూ.12 వేల ఖరీదైన ట్యాబ్‌ను ఉచితంగా ఇస్తాం. రూ.500 కోట్లతో 4.7 లక్షల ట్యాబ్‌లను అందచేస్తాం. విద్యా కానుకతో పాటు ట్యాబ్ అందిస్తాం. వీరంతా 2025లో పదో తరగతి పరీక్షలు సీబీఎస్ఈ నమూనాలో రాస్తారు. ప్రతి తరగతి గదిలోటీవీ లేదా డిజిటల్ బోర్డు నాడు – నేడు ద్వారా సమకూరుస్తున్నాం. బైజూస్ యాప్ ద్వారా నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకూ కంటెంట్ ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి ఇదే కంటెంట్‌ను పాఠ్యపుస్తకాల్లో అనుసంధానిస్తున్నాం. ఇవన్నీ మన పిల్లలు పోటీ ప్రపంచంలో నెగ్గాలని, తలరాతలు, బతుకులు మారాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం. విద్యారంగంపై రూ.55 కోట్ల వ్యయం విద్యా రంగంపై మూడేళ్లలో పెద్ద ఎత్తున వ్యయం చేశాం. అమ్మ ఒడి కింద రూ.19,618 కోట్లు, విద్యా దీవెనకు రూ.8 వేల కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,329 కోట్లు ఖర్చు చేశాం. గోరుముద్ద కోసం రూ.3200 కోట్లు ఖర్చు చేశాం. విద్యాకానుక ద్వారా రూ.2324 కోట్లు వ్యయం చేశాం. నాడు పేదపిల్లల చదువుకి చంద్రబాబు సర్కారు ఏదో ముష్టి వేసినట్లుగా ఏడాదికి రూ.120 కోట్లు ఖర్చు చేసి చేతులు దులుపుకొంది. నాడు–నేడు కింద 15,715 స్కూళ్లను తొలిదశలో రూ.4 వేల కోట్లు వెచ్చించి రూపురేఖలు మార్చాం. రెండో దశలో మరో 22,344 స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమం రూ.8 వేల కోట్లుతో కొనసాగుతోంది. టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజన పథకానికి 8 నెలల పాటు బకాయిలు పెట్టి ఆయాలకు కనీసం జీతాలు చెల్లించలేదు. కూరగాయలు, సరుకుల బిల్లులు కట్టలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ బకాయిలను చెల్లించాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద మేం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే చంద్రబాబు హయాంలో రూ.500 కోట్లు కూడా ఇవ్వలేదు. టీడీపీ సర్కారు విద్యార్థులకు రూ.1,778 కోట్లు ఫీజుల బకాయిలు పెట్టి దిగిపోయింది. జగనన్న ప్రభుత్వమే ఆ మొత్తమంతా తీర్చింది. ఇన్ని మంచి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఫలితంగా 2018–19లో టెన్త్‌లోపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల సంఖ్య 37.21 లక్షలు కాగా 2021–22లో 44.30 లక్షలకు పెరిగింది. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో 7 లక్షల మందికిపైగా విద్యార్థులు పెరిగారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆయనకు ఎన్నడూ ఇలాంటి ఆలోచనలు రాలేదు. చంద్రబాబుకుగానీ, దుష్ట చతుష్టయంలోని రామోజీరావు, టీవీ 5, ఏబీఎన్కుగానీ ఏనాడైనా నిజాలు చెప్పే ధైర్యం ఉందా? జగనన్న అమ్మ ఒడి పథకం నిధులు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీ ఆశీస్సులుండగా వెంట్రుక కూడా పీకలేరు.. మంచి చేసే ప్రభుత్వం మీద, మీ జగన్ మామయ్య మీద, మీ జగన్ అన్నపైన విమర్శలు చేసేవారు ఎలాంటివారో ఒకసారి గమనించాలి. యుద్ధం ఇవాళ నేరుగా జరగడం లేదు. కుయుక్తులు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నాం. మారీచులతో, దుష్ట చతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబుతోనే కాదు ఈనాడుతో, టీవీ–5తో, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం. వీరికి తోడు ఓ దత్తపుత్రుడు. వీరందరితో ఒకే ఒక్క జగన్ పోరాటం చేస్తున్నాడు. మీ జగన్‌కు.. ఈనాడు తోడు లేకపోవచ్చు.. ఆంధ్రజ్యోతి, టీవీ–5, రామోజీరావు తోడు లేకపోవచ్చు. కానీ మీ జగన్‌కు మీమీద నమ్మకం ఉంది. మీ ఆశీస్సులు ఉన్నంత వరకూ వారంతా కలిసినా మీ జగన్ వెంట్రుక కూడా పీకలేరు. వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మకండి. మన ప్రభుత్వం ద్వారా మన ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే చూడండి. చేసిన మేలును కొలబద్ధగా తీసుకోండి. జగనన్న వల్ల మంచి జరిగిందనుకుంటే మద్దతు ఇవ్వండి. దేవుడి దయతో ఇంకా మంచి జరగాలి. మీరంతా ఆశీస్సులివ్వాలి. సిక్కోలుపై వరాల జల్లు ► శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్ వరాలు జల్లు కురిపించారు. వేదికపై మంత్రి ధర్మాన ప్రసాదరావు, పలువురు ప్రజాప్రతినిధుల విన్నపాలపై స్పందించి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ► టీడీపీ హయాంలో ధ్వంసం చేసిన కోడి రామ్మూర్తి స్టేడియం బాగు చేసేందుకు రూ.10 కోట్లు ► ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ పూర్తి చేసేందుకు అదనంగా రూ.69 కోట్లు ► శ్రీకాకుళం–ఆమదాలవలస నాలుగు లైన్ల రహదారి పనుల భూసేకరణ, యుటిలిటీ కింద అదనంగా రూ.18 కోట్లు ► గొట్టా బ్యారేజీ వద్ద లిప్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు రూ.189 కోట్లు మంజూరు. ► మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనుల రివైజ్డ్ ఎస్టిమేట్‌గా రూ.855 కోట్లు మంజూరు. యుద్ధ ప్రాతిపదికన పనులు ► వంశధార ఫేజ్ 2లో రెండో దశ పనుల పూర్తికి అంచనా వ్యయం రూ.1616.23 కోట్ల నుంచి రూ. 2,407.79 కోట్లకు పెంపు. ప్రాజెక్టు పూర్తి చేసి డిసెంబర్లో జాతికి అంకితం. ► ఉద్దానంలో మంచినీటి ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు 70 శాతం పూర్తి. ప్రాజెక్టు పరిధిలోకి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలతో పాటు పాతపట్నంలోని మూడు మండలాలు. ప్రాజెక్టుకు అదనంగా మరో రూ.265 కోట్లు మంజూరు. దాదాపు రూ.1000 కోట్లతో కిడ్నీ ప్రభావిత గ్రామాలకు వంశధార నుంచి నీళ్లిచ్చేలా పనులు. ఆంగ్లంలో నిహారిక ఆహా శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గురుగుబిల్లి నిహారిక ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. అమ్మ ఒడితో పాటు పలు పథకాల ద్వారా తన లాంటి లక్షల మంది విద్యార్థులకు చేకూరుతున్న లబ్ధి గురించి వివరించింది. ‘జగన్ మావయ్యా.. మీరు రాజన్నకి పుత్రుడు. రైతన్నకి మిత్రుడు. అక్కచెల్లెమ్మలకు అన్నదమ్ముడు. మాలాంటి పిల్లలకు విద్యాదేవుడు’ అంటూ కృతజ్ఞతలు తెలియచేసింది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన బాలిక ప్రతిభకు సీఎం జగన్‌తో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ముగ్దులయ్యారు. -
శ్రీకాకుళంలో ‘అమ్మఒడి’: వరుసగా మూడో ఏడాది అమలు
సాక్షి, అమరావతి: పిల్లల చదువులకు పేదరికం అడ్డంకి కాకుండా, సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మ ఒడి పథకాన్ని వరుసగా మూడో ఏడాది (2021–22 విద్యా సంవత్సరానికి) అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు అమ్మ ఒడితో లబ్ధి చేకూరుస్తూ 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం శ్రీకాకుళంలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేయనున్నారు. తాజాగా ఇచ్చే సొమ్ముతో కలిపి ఇప్పటివరకు జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం మొత్తం దాదాపు రూ.19,618 కోట్లు అందించినట్లు కానుంది. సంపూర్ణ ప్రయోజనం చేకూరేలా.. అమ్మ ఒడి ద్వారా 2019 –20లో రాష్ట్ర ప్రభుత్వం 42,33,098 మంది తల్లులకు రూ.6,349.53 కోట్లు అందించింది. 2020– 21లో 44,48,865 మందికి రూ.6,673 కోట్లకుపై సాయంగా ఖాతాల్లో జమ చేసింది. పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ను గణనీయంగా తగ్గించాలనే సదుద్దేశంతో అమ్మ ఒడి పథకానికి కనీసం 75 శాతం హాజరు ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. 2019లో పథకం ప్రవేశపెట్టినప్పుడు జీవోలోనే ఆ నిబంధనలు ఉన్నాయి. అయితే పథకం ప్రారంభించిన తొలిఏడాది కావడంతో 2019 –20లో, కోవిడ్ కారణంగా 2020 –21లో కనీసం 75 శాతం హాజరు నిబంధన నుంచి మినహాయింపు కల్పించింది. గత సెప్టెంబర్ నుంచి విద్యాసంస్ధలు యధావిధిగా పని చేస్తున్నందున 75 శాతం హాజరు నిబంధన అమలు కానుంది. దీనివల్ల 2021–22లో 51,000 మంది అమ్మ ఒడి అందుకోలేకపోతున్నారు. ఈ విషయం బాధాకరమైనప్పటికీ భవిష్యత్‌లో ఇలాంటి పరిస్ధితి తలెత్తకుండా పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి కనీసం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా తల్లులే బాధ్యత తీసుకోవాలని, అప్పుడే ప్రభుత్వం అమలుచేస్తున్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, విద్యాకానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, సీబీఎస్ఈ విధానం, బైజూస్‌తో ఒప్పందం తదితరాలతో విద్యార్థులకు పూర్తి ప్రయోజనం చేకూరి ప్రపంచంతో పోటీ పడగలిగే పరిస్ధితి వస్తుందని మనస్పూర్తిగా విశ్వసిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. మన బడి నాడు నేడు ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలు చిరకాలం విద్యార్ధులకు అందాలన్న తపనతో, చిన్న చిన్న మరమ్మతులను తక్షణమే చేపట్టే లక్ష్యంతో స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ (ఎస్ఎంఎఫ్)కోసం రూ.వెయ్యి చొప్పున జమ చేస్తున్నారు.అలాగే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్‌కు కూడా రూ.వెయ్యి చొప్పున జమ చేస్తారు. నేడు సీఎం జగన్ పర్యటన ఇలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 గంటలకు శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అమ్మ ఒడి పథకం లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం సీఎం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు తిరిగి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
విద్యారంగంలో జగన్ జైత్రయాత్ర
విద్యా రంగంలో వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. చదువుల మీద ఒక ముఖ్యమంత్రిగా ఆయన పెడుతున్న శ్రద్ధ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా పెట్టలేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్షణక్షణానికీ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఊహించని స్థాయికి చేరుతున్న విజ్ఞానాన్ని రేపటి తరం పిల్లలు అందిపుచ్చుకోవాలన్న ఆయన సంకల్పం కొనసాగుతోంది. ఉన్నవారితో సమానంగా లేనివారి పిల్లలకూ అన్నీ అందాలన్న ఆయన దృఢ నిశ్చయం కళ్లముందు కనిపిస్తోంది. పేద కుటుంబాల తలరాతలే కాదు, ఒక ప్రజాస్వామ్య దేశంగా, ఉత్తమ విలువలతో కూడిన సమాజంగా వర్థిల్లాలంటే అది కేవలం చదువుల ద్వారానే సాధ్యమనే బలంగా విశ్వసించిన ఆయన, విద్యారంగంలో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. చదవండి: ఎల్లో హెచ్చులు ఢిల్లీ దాకా! నిరక్షరాస్యతకు చరమాంకం: 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 67.35 శాతం మాత్రమే. మహిళల అక్షరాస్యత 59.96 శాతం. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత, గత జనాభా లెక్కలు నాటికి ఆ 55 ఏళ్ల సంవత్సరాల్లో కూడా నూటికి నూరుశాతం అక్షరాస్యతను సాధించలేకపోయాం. ప్రగతికి ఇదో పెద్దలోటు. 2019లో వచ్చిన దృఢ సంకల్పంతో కూడిన రాజకీయ నాయకత్వం ఈ పరిస్థితులను మార్చడానికి కంకణం కట్టుకుంది. పుట్టిన ప్రతి పిల్లాడు కూడా బడికిపోవాలన్న సదుద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకం ప్రారంభమైంది. పిల్లల చదువుల కోసం ఏ పేదింటి తల్లీ భయపడవద్దని, కేవలం బడికి పంపితే చాలు రూ.15 వేల ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తుచ తప్పక అమలు చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం.. మేనిఫెస్టోలో కేవలం బడికి వెళ్లే పిల్లలకు మాత్రమేనంటూ ఈ పథకాన్ని పేర్కొన్నా తర్వాత దాన్ని ఇంటర్మీడియట్ చదువుతున్న వారికీ వర్తింపుచేశారు. 2019-2020 విద్యా సంవత్సరంలో 42,33,098 మంది తల్లులకు రూ.6,349.53 కోట్ల రూపాయలను చిత్తూరులో 2020, జనవరి 9న ముఖ్యమంత్రి బటన్ నొక్కి జమచేశారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 44,48,865 మంది తల్లులకు రూ.6,673 కోట్లను నెల్లూరులో 2021,జనవరి 11న సీఎం బటన్ నొక్కి జమ చేశారు. మొదటి ఏడాదిలో పథకం అప్పుడే ప్రారంభం అయిన దృష్ట్యా వారి పిల్లలను బడికి పంపేలా తల్లులను ఉత్సాహపరిచేలా ఎలాంటి హాజరు శాతాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం లబ్ధిదారులు అందరికీ కూడా అమ్మ ఒడిని జమ చేసింది. రెండో ఏడాది కూడా కోవిడ్ కారణంగా పాఠశాలలు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులకు అందరికీ కూడా పిల్లల హాజరుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం వర్తింపచేసింది. ఈ ఏడాది మాత్రం 75 శాతం హాజరును పరిగణలోకి తీసుకుంది. పథకం ఉద్దేశం నీరు గారకుండా, లక్ష్యాన్ని సాధించేందుకు నిర్ణయించిన హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకుని పథకాన్ని వర్తింపుచేస్తామని నేరుగా ముఖ్యమంత్రే చిత్తూరు ‘అమ్మ ఒడి’ సభలో స్పష్టం చేశారు. మొత్తంగా మూడేళ్ల కాలంలో కేవలం అమ్మ ఒడి పథకానికే రూ.19,617.53కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కొత్తగా అమ్మ ఒడి పరిధిలోకి 5,48,329 మంది 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా అమ్మఒడి పరిధిలోకి 5,48,329 మంది తల్లులు వచ్చారు. పథకం స్థిరంగా, సమగ్రంగా కొనసాగుతుందనేందుకు ఇదొక ఉదాహరణ. వీరంతా కూడా ఒకటో తరగతిలో చేరిన పిల్లల తల్లులు. 75శాతం హాజరు నిబంధనను వీరు సంతృప్తికరంగా పూర్తి చేయడం మంచి పరిణామం. మొత్తంగా 43,96,402 మంది తల్లులకు సుమారు రూ.6,595 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి బటన్‌నొక్కి జమచేయనున్నారు. తద్వారా 82,31,502 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. వివక్షలేదు... అవినీతి లేదు.. అంతా పారదర్శకం: పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తోంది. ఏ పథకం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు దరఖాస్తులు తీసుకుంటారు? ఆ దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి? దాఖలు ఎక్కడ చేయాలి? ఇలాంటి ప్రశ్నలు గత ప్రభుత్వాల్లో కోకొల్లలు. వీటికి తావులేకుండా మొత్తం ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటోంది. కుటుంబాల వారీగా ఉన్న వాలంటీర్లు అర్హులైన వారిని గుర్తించి వారిచేత దరఖాస్తు చేయిస్తున్నారు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచుతున్నారు. సామాజిక తనిఖీ సమయంలో అర్హత ఉండి పేరులేకపోతే మళ్లీ అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా గ్రామస్థాయిలోనే కచ్చితమైన తనిఖీలతో ముందుకు సాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి దశలోనూ జవాబుదారీతనం కనిపిస్తోంది. అందుకనే ఇన్ని లక్షలమందికి లబ్ధి చేకూర్చే ఈ పథకం ఇంత సజావుగా అమలవుతోంది. అమ్మ ఒడి అద్భుత ఫలితాలు: పిల్లలను బడికి పంపేందుకు తీసుకున్న చర్యల కారణంగా 2018–19 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 37.21 లక్షలుగా ఉన్న అడ్మిషన్ల సంఖ్య దాదాపు రూ.7 లక్షలు పెరిగింది. 2021–22 నాటికి 44.30 లక్షలకు చేరుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య 2 లక్షలు పెరిగి, 72.7 లక్షలకు చేరుకుంది. మరో వైపు కోవిడ్ లాంటి విపత్తు సమయంలో పిల్లల చదువులకు అందిస్తున్న డబ్బు వారికి ఎంతగానే మేలు చేసింది. విపత్తు సమయంలో ఈ పథకాలు ఒక రక్షణ కవచంలా ఈ పథకాలు నిలిచాయనడంలో ఎలాంటి సందేహంలేదు. మనబడి-నాడు నేడు: విద్యారంగంలో వైఎస్ జగన్ జైత్రయాత్రలో మరో ఘన విజయం మనబడి నాడు-నేడు. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను ఈ ప్రభుత్వం సమూలంగా మార్చేస్తోంది. బ్లాక్‌బోర్డ్, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్, కాంపౌండ్‌వాల్ ఇలా పదిరకాల సౌకర్యాలను కల్పించేందుకు భారీ మొత్తంలో ఖర్చుచేస్తున్నారు. తొలిదశలో 15,715 స్కూళ్లలో సుమారు రూ.3,669 కోట్లు ఖర్చుచేశారు. మరో 22,344 స్కూళ్లలో రూ.8 వేల కోట్ల ఖర్చుతో రెండో దశ పనులు జరుగుతున్నాయి. తల్లిదండ్రులతో ఏర్పడిన విద్యా కమిటీల భాగస్వామ్యంతో, వారి పర్యవేక్షణలో ఈ పనులన్నీ జరుగుతున్నాయి. స్కూళ్లలో పరిశుభ్రత – సమర్థ నిర్వహణ: వేల కోట్ల పెట్టి పాఠశాలల్లో సౌకర్యాలను, సదుపాయాలను కల్పించుకోవడమే కాదు.. వాటిని కాపాడుకోవడం, సమర్థవంతంగా నిర్వహించుకోవడం కూడా అందరి బాధ్యత. ఇదే వాతావరణం తర్వాత వచ్చే పిల్లలకు కూడా నిరంతరం అందేలా ఈ చర్యలు చేపట్టింది. తల్లిదండ్రుల భాగస్వామ్యంతో రెండు కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టాయిలెట్ మెయింటినెన్స్ ఫండ్‌కు వేయి రూపాయల చొప్పున జమచేస్తున్నారు. అమ్మ ఒడి నుంచి అందించిన డబ్బు ద్వారా రూ.430 కోట్ల టాయిలెట్ మెయింటినెన్స్ నిధి సమకూరింది. తల్లిదండ్రుల కమిటీలు ద్వారా దీన్ని ఖర్చు చేస్తున్నారు. ప్రతి 300 విద్యార్థులకు ఒక ఆయా ఉండేలా చూస్తున్నారు. వీరికి నెలకు రూ.6 వేల రూపాయలు అందిస్తున్నారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడం దీని ముఖ్య ఉద్దేశం. తద్వారా ఆడపిల్లలు బడిమానేయాల్సిన పరిస్థితులకు లేకుండా చూస్తున్నారు. దీంతోపాటు స్కూళ్లను సమర్థవంతంగా నిర్వహించడానికి, ఎప్పుడు ఏ మరమ్మత్తుగా వచ్చినా వెంటనే బాగుచేసేందుకు వీలుగా స్కూలు మెయింటినెన్స్ నిధిని కూడా తల్లిదండ్రుల భాగస్వామ్యంతో నిధిని పెడుతున్నారు. అమ్మ ఒడి నుంచి వేయిరూపాయలను దీనికి జమచేస్తున్నారు. దీనిపై పర్యవేక్షణ బాధ్యత తల్లిదండ్రుల కమిటీలదే. విద్యాకానుక, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్ఈ, బైజూస్: పిల్లలకు విద్యాకానుక ద్వారా ప్రతిఏటా వైఎస్.జగన్ సర్కార్ మరికొన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. 3 జతల యూనిఫారంతోపాటు షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, ఇంగ్లిషు నిఘంటువు అందిస్తోంది. విద్యాకానుక కోసం 2020-21లో రూ.648.11 కోట్లు ఖర్చుచేస్తే, 2021-22లో రూ.789.21 కోట్లు ఖర్చుచేసింది. మొత్తంగా రెండేళ్లలో రూ.1,437.32 కోట్లు ఖర్చుచేసింది. ఈఏడాది కూడా భారీ ఖర్చుకు సిద్ధమైంది. మొత్తంగా మూడేళ్లలో రూ.2,324 కోట్లు ఖర్చుచేసింది. పిల్లలను బడికి రప్పించడం, వారు చక్కగా చదువుకునేలా మంచి సౌకర్యాలను, వాతావరణాన్ని కల్పించడం ఒక వైపు చేస్తుంటే... మరోవైపు నాణ్యమైన విద్యను అందించడంపైన కూడా ఈ వైయస్.జగన్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం గట్టిచర్యలు తీసుకుంది. ప్రపంచస్థాయిలో ఎదురయ్యే పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా మన పిల్లలను తయారుచేసేందుకు ఇంగ్లిషు మీడియంలోనే బోధన ప్రారంభించారు. పిల్లలు అర్థంచేసుకునేందుకు వీలుగా పాఠ్యపుస్తకాలను ద్విభాషల్లో ముద్రించారు. స్కూళ్లన్నింటినీ కూడా సీబీఎస్ఈకు అనుసంధానం చేస్తున్నారు. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న పిల్లలు 2025 నాటికి సీబీఎస్ఈలో పరీక్షలు రాస్తారు. వీరిని మరింత సుశిక్షితులుగా తయారుచేయడానికి వీలుగా బైజూస్‌తో ఒప్పందం కదుర్చుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకూ బైజూస్ కంటెంట్ ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. సెప్టెంబరులో 4.7లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా అందుబాటులోకి వస్తాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి తరగతి గదిలోకూడా టీవీలు వస్తాయి. దీంతో బోధన మరింత సులభంగా ఉంటుంది. పిల్లలకూ సంగ్రహణ శక్తి పెరుగుతుంది. ఇక్కడితో జగన్ జైత్రయాత్ర ఆగిపోలేదు. జగనన్న విద్యాదీవెన (ప్రతి త్రైమాసికానికీ పూర్తి ఫీజు రియింబర్స మెంట్‌చెల్లింపు కింద రూ.7678.12 కోట్లు), జగనన్న వసతి దీవెన (వసతి, భోజన ఖర్చుల కింద పిల్లలకు రూ. 3,329.05 కోట్లు), జగనన్న గోరుముద్ద (మెరుగైన, నాణ్యమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం కింద రూ.3,087 కోట్లు), పాఠశాలల్లో నాడు–నేడు (ఇప్పటికే రూ.3,669 కోట్లు ఖర్చు చేయగా మరో రూ.8వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు), వైయస్సార్ సంపూర్ణ పోషణ(రూ.4,895కోట్లు) ఈ కార్యక్రమంలో అన్నింటికింద రూ.52,600.65 కోట్లు ఖర్చుచేశారు. -పూడి శ్రీహరి, ఏపీ సీఎం సీపీఆర్వో -
CM YS Jagan: శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఇలా..
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా సీఎం అదనపు పీఎస్ కె.నాగేశ్వరరెడ్డి టూర్ షెడ్యూల్‌ను వివరిస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం ఉదయం 9 గంటలకు ఆయన నివాసం నుంచి బయల్దేరి 9.20 గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుతారు. 9.30 గంటలకు విమానంలో బయల్దేరి విశాఖపట్నంకి 10.15కు చేరుకుంటారు. 10.25కు హెలీకాప్టర్‌లో విశాఖపట్నం నుంచి బయలుదేరి 11గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 నుంచి 11.15 వరకు ప్రజలు, అధికారులతో మాట్లాడుతారు. ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఉన్న హెలీప్యాడ్ నుంచి బయల్దేరి కోడి రామ్మూర్తి స్టేడియానికి 11.25కు చేరుకుంటారు. 11.25 నుంచి 11.45 వరకు సభావేదికపైన అతిథుల ప్రసంగం ఉంటుంది. 11.45 నుంచి 11.55 వరకు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడతారు. 11.55 నుంచి 12.40 వరకు సీఎం ప్రసంగిస్తారు. 12.40 నుంచి 12.45 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమ్మఒడి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు బటన్ నొక్కుతారు. 12.45కి బయలుదేరి ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద హెలీప్యాడ్‌కు చేరుకుంటా రు. మధ్యాహ్నం 1 గంటకు హెలీకాప్టర్‌లో బయల్దేరి 1.35కు విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం 1.45కు విశాఖపట్నం నుంచి విమానంలో బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు 2.30గంటలకు చేరుకుంటారు. అనంతరం సీఎం నివాసానికి 2.40 గంటలకు చేరుకుంటారు. చదవండి: (గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవో విడుదల) -
అమ్మ ఒడికి రూ.6,594.60 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్కరి చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో నవరత్నాల్లో భాగంగా జగనన్న అమ్మఒడి పథకం కింద ఈ ఏడాది 43,96,402 మంది తల్లులకు లబ్ధి చేకూర్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో 54 శాతం మంది బీసీలు, 21 శాతం మంది ఎస్సీలు, 6 శాతం మంది ఎస్టీలు, 19 శాతం మంది ఓసీలు ఉన్నారు. ఈ పథకం కింద ఈ నెల 27న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.6,594.60 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేయనున్నారు. ఈ ఏడాది కొత్తగా అమ్మ ఒడి పరిథిలోకి 5,48,329 మంది తల్లులు వచ్చారు. ఈ పథకం ద్వారా 82,31,502 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలను సమాచార, బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నాణ్యమైన విద్య దిశగా మరో ముందడుగు ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర విద్యా రంగంలో మరో భారీ కార్యక్రమం అతిపెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా కొందరికే పరిమితమైన ఎడ్యు–టెక్ విద్య ప్రభుత్వ స్కూళ్లలోని పేద పిల్లలకు అందుబాటులోకి రానుంది. ► ఏటా రూ.20 వేల నుంచి రూ.24 వేలు పైబడి చెల్లిస్తేకాని లభించని బైజూస్.. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకు అందుబాటులోకి వస్తోంది. తెలుగు – ఇంగ్లిష్ మాధ్యమాల్లో సమగ్రంగా నేర్చుకునేందుకు వీలు కల్పించేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ► 2025లో సీబీఎస్ఈ నమూనాలో పరీక్షలు రాయనున్న ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులను సుశిక్షితులుగా మార్చేందుకు ప్రభుత్వం ఇంకొన్ని అడుగులు వేస్తోంది. ఈ విద్యార్థులకు సిలబస్‌తోపాటు అదనంగా ఇంగ్లిష్ లెర్నింగ్ యాప్, నేర్చుకునేందుకు ట్యాబ్‌లు ఇవ్వనుంది. ► దాదాపు 4.7 లక్షల మంది పిల్లలకు ఈ సెప్టెంబర్‌లో ట్యాబ్‌లు ఇస్తున్నాం. దీనికోసం ప్రభుత్వం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రతి ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌లు ఇస్తుంది. వీళ్లు 9వ తరగతిలోకి వెళ్లేసరికి ఆ తరగతి పాఠాలకు సంబంధించి కంటెంట్ డౌన్లోడ్ చేసి సిద్ధం చేస్తుంది. అలాగే 10వ తరగతిలోనూ కంటెంట్‌ను సమకూరుస్తుంది. ► వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌ను పొందుపరిచి పాఠ్యపుస్తకాలను ముద్రించనుంది. వీడియో కంటెంట్ ద్వారా పిల్లలు నేర్చుకునేందుకు నాడు – నేడు కింద ప్రతి తరగతి గదిలో టీవీలు ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న మంత్రులు వచ్చే నెలలో సంక్షేమ క్యాలెండర్ అమలు ► 2022 సంక్షేమ క్యాలెండర్లో భాగంగా జూలైలో అమలు చేయనున్న నాలుగు పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూలై 5న జగనన్న విద్యా కానుక, జూలై 13న వైఎస్సార్ వాహన మిత్ర, జూలై 22న వైఎస్సార్ కాపు నేస్తం, జూలై 26న జగనన్న తోడు పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ► వివిధ సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి.. మిగిలి పోయిన లబ్ధిదారులకు జూలై 19న ఆ పథకాల కింద ప్రయోజనం చేకూర్చడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ► వంశధార ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు అదనపు పరిహారంగా రూ.216.71 కోట్ల పంపిణీకి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను మంత్రివర్గం ఆమోదించింది. వర్శిటీ, కార్పొరేషన్, సొసైటీ ఉద్యోగులకు పీఆర్సీ ► యూనివర్సిటీలు, కార్పొరేషన్, సొసైటీ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేస్తూ గతంలో మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ► 70 ఏళ్లు పైబడ్డ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 2019 జూలై 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేయకూడదనే ప్రతిపాదనకు ఆమోదం. పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ మరణిస్తే అంతిమ సంస్కారాల ఖర్చుల కింద ఇచ్చే మొత్తాన్ని రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ► అర్జున అవార్జు గ్రహీత, ప్రముఖ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నంకు గ్రూప్–1 సర్వీసు కింద డిప్యూటీ కలెక్టర్ పోస్టులో నియామకానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. కొత్త వైద్య కళాశాలల్లో 3,530 పోస్టుల భర్తీ ► విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నిర్మిస్తున్న కొత్త వైద్య కళాశాలల్లో ఒక్కో కళాశాలలో 706 ఉద్యోగాల చొప్పున, మొత్తంగా 3,530 కొత్త పోస్టుల భర్తీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్. ► వైద్య విధాన పరిషత్‌కు సంబంధించిన ఆస్పత్రుల్లో పడకల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని ఉంచేందుకు వీలుగా అదనంగా మరో 2,558 పోస్టులు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం. ఆక్వా రైతులకు పెద్ద ఊరట ► ఆక్వా సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం విద్యుత్ చార్జీలలో రాయితీ ఇస్తోంది. ఇప్పటికే 5 ఎకరాలలోపు సాగు చేస్తున్న రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంటు అందిస్తోంది. ఇప్పుడు పది ఎకరాలలోపు ఆక్వా సాగు చేస్తున్న రైతులకు కూడా దానిని వర్తింప చేయడానికి ఆమోదం. ► రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ రూ.500 కోట్ల రుణాలకు సంబంధించి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు అనుమతి. ► ఆదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు 3,700 మెగావాట్ల హైడ్రో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు ఆమోదం. దీనివల్ల రైతులకు ఎకరాకు లీజు రూపేణా రూ.30 వేలు నికర ఆదాయం లభిస్తుంది. ► ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పునర్ వ్యవస్థీకరణ, కొత్త పోస్టుల నియామకం, ఎగ్జిక్యూటివ్ కేడర్ బలోపేతం వంటి ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్. జగనన్న స్మార్ట్ టౌన్షిల్లలో పైవేటుకూ భాగస్వామ్యం ► జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో ఏంఐజీ లే ఔట్స్‌లలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధికి సంబంధించి విధి, విధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న భూసేకరణ విధానాలకు అదనంగా మరో కొత్త విధానం ప్రవేశ పెట్టందుకు అంగీకారం. ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసే లేఔట్స్‌లో 40 శాతం ఫ్లాట్లను ప్రభుత్వం నిర్దేశించిన వారికి, 60 శాతం ఫ్లాట్లను ప్రైవేటు సంస్థ విక్రయించుకోవచ్చు. ► మానసిక, శారీరక దివ్యాంగులకు, అనాథలకు, నిరుపేదలకు సేవలు అందిస్తున్న వివిధ ఛారిటబుల్ సంస్థలకు ఇచ్చిన స్థలం లీజు కాలాన్ని పొడిగించేందుకు ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు అనుమతి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. గండికోటలో ఇంటిగ్రేటెడ్ టూరిజం ప్రాజెక్టు ► వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటిగ్రేటెడ్ టూరిజం ప్రాజెక్టు కోసం పర్యాటక శాఖకు 1,131.39 ఎకరాల స్థలం కేటాయింపునకు ఆమోదం. ► టూరిజం పాలసీ 2020–25కు అనుగుణంగా తిరుపతిలో నొవొటెల్ బ్రాండ్ కింద హోటల్ నిర్మాణానికి లీజు విధానంలో భూమి కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్. ► హరే కృష్ణా మూవ్మెంట్, దేవదాయ శాఖ మధ్య భూమి లీజు ఒప్పందం విషయంలో స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు ఆమోదం. ► 2018 అక్టోబర్‌లో తిత్లీ తుపాను కారణంగా దెబ్బతిన్న 90,789 మంది రైతుల పంటలకు రూ.182,60,06,490 అదనపు ఇన్పుట్ సబ్సిడీ అందజేసేందుకు కేబినెట్ ఆమోదం. మరిన్ని కీలక నిర్ణయాలు ఇలా.. ► జిల్లాల పునర్విభజన నేపథ్యంలో 13 పాత జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీ చైర్మన్లనే 26 జిల్లాలకు కొనసాగిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను చట్టంగా తెచ్చేందుకు ఆమోదం. ► బద్వేలులో కొత్తగా ఏర్పాటు చేసిన సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 26 పోస్టుల నియామకాలు. ► సత్యసాయి జిల్లా ధర్మవరంలో రెండో పట్టణ పోలీసు స్టేషన్ ఏర్పాటు. ► వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు 3,148.68 ఎకరాలను ప్రభుత్వ ఈక్విటీగా పరిగణన. ► ఈ నెల 22న స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం. ► తిరుపతి ఏపీఐఐసీలో ఈఎంసీ–2లో వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎకరా రూ.38.44 లక్షల చొప్పున 75 ఎకరాల కేటాయింపు. ► ప్రభుత్వ, ఎయిడెడ్ పాలిటెక్నిక్ సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిబంధనల మేరకు పే స్కేల్స్ వర్తింపు. ► హైకోర్టు ఆదేశాల మేరకు డిసిఫ్లీనరీ ప్రొసీడింగ్స్ ట్రిబ్యునల్ రద్దు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉన్న డిసిప్లీనరీ ప్రొసీడింగ్స్ ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యులను నియమించని పరిస్థితి. మూడు నెలల్లో కేసులు పరిష్కారించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు.. వాటిని పరిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయం. ఇందులో భాగంగా ఇప్పటిదాకా పెండింగ్‌లో ఉన్న 789 కేసులను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కి బదలాయించాలని ఆదేశం. ► గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో 100 కొత్త పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఈ మేరకు సర్వీసు రూల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశం. ఇక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా.. ► కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాల విభజనకు సంబంధించి సవరణలు, మార్పులు, చేర్పులుతో కూడిన తుది నోటిఫికేషన్‌ను ఆమోదించింది. ► కొత్తగా ఏర్పాటు చేసిన బద్వేలు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కొత్తగా 20 పోస్టులు మంజూరు. ► నెల్లూరు జిల్లా కనుపూరులో మైసూరుకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్ట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ సంస్థ ఏర్పాటు చేస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ స్టడీస్ ఇన్ క్లాసికల్ తెలుగు కోసం 5 ఎకరాల స్థలం. ► సత్యసాయి జిల్లా పెనుకొండలో 63.29 ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయింపు. ► ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ యాక్ట్ 1971కు సవరణలతో కూడిన డ్రాప్ట్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్. ► వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం ఇందుకూరులోని సర్వారాయ సాగర్ రిజర్వాయర్ పేరును కమ్యూనిస్టు యోధుడు నర్రెడ్డి శివరామిరెడ్డి రిజర్వాయర్‌గా మార్పు చేస్తూ.. జల వనరుల శాఖ చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం. -
‘అమ్మ ఒడి’పైనా విషం
ఆలూ లేదు..చూలూ లేదు.. కొడుకు పేరు రామోజీరావు అనే తీరులో ఉంది ‘ఈనాడు’ కథనం. ‘అమ్మ ఒడి’ పథకంలో తుది జాబితాలు ఖరారు కాకముందే... ‘1.29 లక్షల మందికి కోత’ ‘మరో లక్షన్నర మంది తల్లుల ఈ–కేవైసీ పెండింగ్’ అంటూ ఎడాపెడా గుండెలు బాదేసుకున్నారు రామోజీరావు. వాస్తవాలన్నీ దాచిపెట్టి... ఇంతటి బృహత్తర పథకంపై కూడా విషపు రాతలతో రెచ్చిపోయారు. పిల్లల్ని స్కూలుకు పంపి చదివించేలా తల్లుల్ని ప్రోత్సహిస్తూ నేరుగా వారి ఖాతాల్లోకే ఏటా రూ.15 వేలు జమచేస్తున్న ఇలాంటి పథకం నభూతో అన్న రీతిలో దేశంలో ఎక్కడా లేదు. చదువుకునే పిల్లల సంఖ్యలో గణనీయమైన మార్పు తెచ్చిన ఈ బృహత్తర పథకానికి కేంద్రం, ఇతర రాష్ట్రాలు సైతం జై కొడుతున్నాయి. ముఖ్యమంత్రి జనాదరణను దెబ్బతీయటానికి ప్రతిరోజూ తప్పుడు రాతలతో చెలరేగిపోతున్న ‘ఈనాడు’కు మాత్రం ఇందులోనూ రంధ్రాలు కనిపించడం విచిత్రమేమీ కాదనే అనుకోవాలి. అసలు నిజంగా ఈ సంవత్సరం తగ్గిన లబ్ధిదారులెందరు? ఎందుకు తగ్గారు? ‘ఈనాడు’ రాతల్లో నిజమెంత? ఒకసారి చూద్దాం... పిల్లలంటే భవిష్యత్... అన్న రీతిలో విద్యా రంగంలో ఊహించని మార్పులను విజయవంతంగా అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ‘అమ్మ ఒడి’ కూడా ఆయన ఆలోచనల్లోంచి పురుడుపోసుకున్నదే. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే వారికే పరిమితం చేయాలని సూచనలొచ్చినా... చదువే ముఖ్యం కనక ప్రైవేటు స్కూళ్లలోని వారికీ వర్తింపజేశారు. గరిష్ట సంఖ్యలో తల్లులకు లబ్ధి కలిగించి... వారంతా తమ పిల్లలను బడిబాట పట్టించాలనేది జగన్ ఆలోచన. కాకపోతే ఏ పథకంలోనైనా అర్హులకు కొన్ని నిబంధనలుంటాయి కనక దీన్లో పిల్లలకు స్కూల్లో 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన పెట్టారు. గడచిన రెండేళ్లూ కోవిడ్ మూలాన స్కూళ్లకు సెలవులెక్కువ వచ్చాయి కనక అప్పట్లో ఈ నిబంధనను కూడా పట్టించుకోలేదు. ఈ సంవత్సరం ఈ నిబంధన ప్రకారం తగ్గింది ఎంత మందో తెలుసా? 1.2 శాతం!!. గతేడాది 44,48,865 మందికి అమ్మ ఒడి పథకం అందగా... ఈ ఏడాది హాజరు నిబంధనతో 52,463 మంది తగ్గి... 43,96,402 మందిని ప్రస్తుతానికి ఖరారు చేశారు. అంటే తగ్గిన వారి శాతం కేవలం 1.2. కానీ ‘ఈనాడు’ మాత్రం నోటికొచ్చిన లెక్కలతో కథనం వండి వార్చేసింది. విధివిధానాలు తెలియవా రామోజీ? ప్రతి పేద తల్లీ తన పిల్లలను తప్పనిసరిగా స్కూలు, కాలేజీకి పంపించి చదివించే లక్ష్యంతో 1 నుంచి 12 తరగతులకు వర్తించేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం... అర్హులకు కొన్ని నిబంధనలు నిర్దేశించింది. దానిప్రకారం లబ్ధిదారు ఇంట్లో చదువుకునే పిల్లలు ఎందరున్నా ఏటా రూ.15వేలు అందిస్తారు. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలే దీనికి అర్హులు. ఎక్కువ మందికి పథకం అందజేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ దీన్ని సవరించి... ఆదాయ, ఇతర పరిమితులను పెంచారు కూడా. పైపెచ్చు కరోనా సమయంలో గత రెండేళ్లలో 75 శాతం హాజరును పూర్తిగా మినహాయించి అర్హులైన విద్యార్థుల తల్లులందరికీ అమ్మ ఒడిని అందించారు. ఈ ఏడాది స్కూళ్లు తెరిచినా... అతి తక్కువ హాజరున్న వారిని మాత్రమే అమ్మ ఒడి నుంచి మినహాయించేలా అధికారులకు తగు సూచనలిచ్చారు. ఫలితం... 43,96,402 మందిని అర్హులుగా విద్యాశాఖ గుర్తించింది. ఈ లెక్కన గత ఏడాది కన్నా తల్లుల సంఖ్య 52,463 వరకు తగ్గుతోంది. అంటే దాదాపు 1.2 శాతం. మరోవంక పథకానికి ఎంపిక కాకపోవడంలో పొరపాటు జరిగి ఉంటే సరిచేయడానికి కూడా ప్రభుత్వం అవకాశమిచ్చింది. వారికి మళ్లీ గడువిచ్చి దరఖాస్తు చేస్తే... పరిశీలించి అర్హులైతే గతంలో మాదిరిగానే పథకాన్ని అందిస్తారు. ఇదీ జరిగింది. తుది జాబితాలు ఖరారు కాకముందే..! ‘ఈనాడు’కు తొందరెక్కువ!. ఏదో ఒక వ్యతిరేక వార్త రాసి... ఆ రోజు గడిచేలా చూసుకోవటం దానికి అలవాటైపోయింది. ఎందుకంటే విద్యాశాఖ ఈ జాబితాలను సోషçల్ ఆడిట్ కోసం స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, గ్రామ, వార్డు సచివాలయాలకు పంపింది. అక్కడ పరిశీలించాక తుది జాబితా ప్రకటిస్తారు. పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే వాటిని సరిచేస్తారు కూడా. ఈ ప్రక్రియ పూర్తయ్యాకనే విద్యాసంవత్సరంలో ఎంత మందికి అమ్మ ఒడి అందిందో తేలుతుంది. రామోజీ మాత్రం ఇప్పుడే 1.29 లక్షల మందికి పథకం అందటం లేదని అచ్చేసేశారు. ఆ పత్రికే తెలుగు పాఠకులు చేసుకున్న ఓ పాపం మరి!. నిర్వహణ నిధిపైనా అక్కసే... కార్పొరేట్లకు చంద్రబాబునాయుడు తాకట్టు పెట్టేసిన విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలనుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి... ‘నాడు– నేడు’ పేరిట స్కూళ్ల ముఖ చిత్రాన్ని మార్చేశారు. దీనికోసం తొలి దశలో 15,713 స్కూళ్ల కోసం రూ.4 వేల కోట్లు ఖర్చుచేశారు. రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇన్ని కోట్లతో ఏర్పాటు చేసే మౌలిక వసతులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవసరం వస్తే మరమ్మతు చేయించాలి. దీనికోసమే అమ్మ ఒడిని అందుకుంటున్న తల్లులు ఆయా స్కూళ్లలోని టాయిలెట్ల నిర్వహణకు రూ.1,000 చొప్పున అందిస్తున్నారు. స్కూళ్లలోని ఇతర పరికరాల నిర్వహణ, మరమ్మతుల కోసం మరో రూ.1000 ఇవ్వాలని విద్యాశాఖ అభ్యర్థించింది. ప్రభుత్వమిచ్చే నగదులోంచి ఆ మొత్తాన్ని ఇవ్వటానికి వారికెలాంటి ఇబ్బందీ లేదు. దానివల్ల వారి పిల్లలకే కాక... ప్రభుత్వ బడులలోని 32 లక్షల మంది విద్యార్థులకు చక్కని సౌకర్యాలు సమకూరుతాయి. పైపెచ్చు తాము డబ్బులిస్తున్నాం కనక నిర్వహణ బాగుండాలని స్కూళ్లను అడిగే అవకాశం వారికొస్తుంది. స్కూళ్ల జవాబుదారీ తనం, నిర్వహణలో పారదర్శకత పెరుగుతాయి. కానీ వ్యవస్థ ఇంత సాఫీగా నడవటం రామోజీకి సుతరామూ నచ్చటం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది చంద్రబాబు కాదు. బాబు హయాంలో ఏ స్కూల్లోనూ కనీసం టాయిలెట్లు లేకున్నా ‘ఈనాడు’ ప్రశ్నిస్తే ఒట్టు!. కొన్ని స్కూళ్లలో టాయిలెట్లు ఉన్నా... వాటిని వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. నీళ్లు లేక... గోడలు లేక.. నిర్వహణ అంటే ఏంటో తెలియక మొత్తంగా స్కూళ్లు దయనీయ పరిస్థితికి చేరుకున్నాయి. అయినా ‘ఈనాడు’ అప్పట్లో స్కూళ్లు బాగులేవని కానీ, చంద్రబాబు దీనిపై దృష్టిపెట్టాలని కానీ ఎలాంటి వార్తలూ రాయలేదు. ఎందుకంటే అలా చేస్తే తమ మిత్రుల కార్పొరేట్ స్కూళ్లు ‘నారాయణా..’ అంటాయేమోనని వారి భయం. అందుకే ప్రభుత్వ స్కూళ్లకు దేవుడే దిక్కు అనే రీతిలో వదిలేశారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవటంతో... దుష్ప్రచారానికి దిగారు. ప్రభుత్వం నిర్వహణ ఫీజుల పేరిట కోత కోసేస్తున్నారంటూ తప్పుడు రాతలు అచ్చేశారు. పేద పిల్లలు చదువుకొనే ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్ స్కూళ్లకు, కాలేజీలకు దీటుగా ప్రభుత్వం వేలకోట్ల నిధులు వెచ్చించి అన్ని సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. రూ.12వేల కోట్లకు పైగా ఇందుకోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇప్పటికే తొలివిడతలో 15713 స్కూళ్లను రూ.4000 కోట్లతో అభివృద్ధి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఇలా అభివృద్ధి చేసిన స్కూళ్లలో రన్నింగ్ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, మంచినీరు సదుపాయంతో పాటు విద్యుత్తు సదుపాయం, ఫ్యాన్లు, లైట్లు, కిచెన్షెడ్లు ఇలా ఏర్పాటుచేయించింది. వీటిని సరైన రీతిలో నిర్వహించకపోతే గతంలో మాదిరిగానే ఆయా స్కూళ్లు, కాలేజీలు మళ్లీ అధ్వాన్నంగా మారే పరిస్థితి వస్తుంది. గతంలో అన్ని స్కూళ్లలో మరుగుదొడ్లు కట్టినట్లు రికార్డుల్లో ఉన్నా నిర్వహణ లోపం వల్ల శిధిలమైపోయాయి. అలా కాకుండా ఉండేందుకు ప్రభుత్వం టాయిలెట్ మెయింటెనెన్సు ఫండ్‌ను ఏర్పాటుచేసింది. విద్యార్థుల తల్లిదండ్రులను దీనిలో భాగస్వామ్యం చేసింది. తద్వారా పాఠశాలల్లో సదుపాయాలపై వారికి ప్రశ్నించే అధికారాన్ని కల్పించింది. అమ్మ ఒడి కింద వారందుకొనే రూ.15వేల నుంచి రూ.1000 చొప్పున వారు ఈ నిధికి స్వచ్ఛందంగా జమచేస్తున్నారు. ఇలా రూ.430 కోట్లు ఈ నిధికి చేరాయి. ఈ నిధులతో ఆయా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను అనుసరించి గరిష్టంగా నలుగురు ఆయాలను నియమించేలా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 48,139 మందిని పేరెంట్సు కమిటీల ద్వారా నియమించింది. వీరికి నెలకు రూ. 6 వేల చొప్పున గౌరవ భృతిని అందిస్తోంది. గతంలో నిర్ణయించిన భృతిని మార్పు చేసి ఈ మొత్తాన్ని ఇస్తోంది. టాయిలెట్ల నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఈ నిధి ద్వారా వారికి అందిస్తోంది. గడచిన మూడేళ్లుగా.. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ పథకానికి సంబంధించిన జీవో తెచ్చేనాటికే విద్యా సంవత్సరం ప్రారంభమైపోయింది. అయినా సరే ఆ ఏడాది నుంచే ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. తొలి ఏడాది 42,33,098 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.15వేలు చొప్పున జమ చేయించారు. 2020–21లో కరోనా సమయంలో స్కూళ్లు నడిచే పరిస్థితి లేకున్నా... పేద తల్లులకు అండగా నిలవాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ముందుకెళ్లారు. ఏకంగా 44,48,865 మంది తల్లులకు ఆర్థిక సాయం అందించారు. 2021–22కి సంబంధించి గత ఏడాదిలోని 44,48,865 మంది తల్లుల జాబితాను పరిశీలన చేపట్టింది. ఇంటర్ పూర్తయి వెళ్లేవారు... ఒకటిలోకి కొత్తగా చేరేవారు... వీరందరినీ సోషల్ ఆడిట్, ఆరంచెల పరిశీలన ప్రక్రియ అనంతరం లెక్క తేల్చి అర్హులందరికీ పథకాన్ని అందిస్తారు. ఆ ప్రక్రియ ఇంకా పూర్తికాకముందే... 1,46,572 మందికి ఈ కేవైసీ పూర్తి కాలేదని తప్పుడు సమాచారంతో ‘ఈనాడు’ రెచ్చిపోయింది. -
Fact Check: 'ఆ పథకాల రద్దు అవాస్తవం.. ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదు'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో 2022 జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర అనే రెండు సంక్షేమ పథకాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా రద్దు చేయడం జరిగిందనే ప్రచారం వాస్తవంకాదని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ మరియు ఎక్స్ అఫిషియో సెక్రెటరీ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు. చదవండి: ‘ఏసీబీ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్.. యాప్ ఎలా పనిచేస్తుందంటే? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అసలు మనుగడలోనే లేని సమాచార, సాంకేతిక, ప్రసారాల శాఖ అనే తప్పుడు పేరుతో ఇలాంటి ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం. దీని వెనుక ఎంతటివారున్నప్పటికి ఉపేక్షించేది లేదని, ఇటువంటి ఫేక్ వార్తలను, పుకార్లను పుట్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి మరీ ఏ నెలకు ఆ నెల సంక్షేమ పథకాల లబ్ధిని డైరెక్ట్‌గా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్న దుష్ప్రచారాన్ని, అవాస్తవాలను ప్రజలెవరూ నమ్మొద్దని విజ్జప్తి చేశారు. కరోనా ఆర్థిక ఇబ్బందుల్లో కూడా సంక్షేమ పథకాల అమలు జరిగిందని, ప్రజలకు లబ్ధి చేకూర్చే ఏ సంక్షేమ పథకం ఆగదని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరపున ఓ ప్రకటనలో తెలిపారు. -
సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం.. సీఐడీ కేసు నమోదు
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ వాహన మిత్ర పథకాలను ఈ ఏడాది నిలిపివేస్తున్నట్టు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఫేక్ పోస్టులతో దుష్ప్రచారం చేసిన వారిలో ఇప్పటివరకు ఐదుగురిని గుర్తించి నోటీసులు జారీ చేశారు. కాగా వారిలో ముగ్గురిని సీఐడీ అధికారులు మంగళవారం విచారించారు. భారత జాతీయ చిహ్నం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నాలను ముద్రించి మరీ ప్రభుత్వ అధికారిక ప్రకటన విడుదల చేసినట్టుగా ఫేక్ పోస్టులు సృష్టించినట్టు సీఐడీ దృష్టికి వచ్చింది. జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ వాహన మిత్ర పథకాల లబ్ధిదారులను గందరగోళానికి గురిచేసి, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకే ఈ పోస్టులు సృష్టించినట్లు విచారణలో వెల్లడైంది. దాంతో మంగళగిరిలోని సీఐడీ విభాగంలోని సైబర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారత జాతీయ చిహ్నం, రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాల దుర్వినియోగ నివారణ చట్టం, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆ ఫేక్ పోస్టులను వైరల్ చేసిన 12 సోషల్ మీడియా ఖాతాలను ఇప్పటివరకు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఐదుగురికి 41ఏ నోటీసులు జారీ చేశారు. వారిలో ముగ్గురు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పరుచూరి రమ్య, బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన కోగంటి శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా బుర్రిపాలేనికి చెందిన దాసరి కోటేశ్వరరావులను మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విచారించారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. మళ్లీ విచారణకు పిలిస్తే రావల్సి ఉంటుందని చెప్పారు. నోటీసులు జారీ చేసినవారిలో మరో ఇద్దరు విచారణకు హాజరుకావల్సి ఉంది. కాగా మరికొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నట్టు దుష్ప్రచారం చేసిన మరికొందరిపై కూడా సీఐడీ అధికారులు దృష్టి సారించినట్టు తెలిసింది. -
అమ్మ ఒడి, వాహన మిత్ర రద్దు ప్రచారం పూర్తిగా అవాస్తవం
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మ ఒడి, వాహన మిత్ర పథకాలను ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2022 ఏడాదికి గాను ప్రభుత్వం రద్దు చేసిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో ఈ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అటువంటి శాఖ అసలు మనుగడలోనే లేదని పేర్కొన్నారు. ప్రజల్లో గందరగోళం నెలకొల్పి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావటమే లక్ష్యంగా ఇలాంటి ఫేక్ వార్తలను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీని వెనుక ఎంతటివారున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్ వార్తలను, పుకార్లను పుట్టించే వారిపైనా, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి దుష్ప్రచారం చేసే వారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి మరీ ఏ నెలకు ఆ నెల సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్న దుష్ప్రచారాన్ని, అవాస్తవాలను ప్రజలెవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. -
జనమే సాక్షి - జగనన్న పథకాలు.. మా జీవితాల్లో వెలుగులు
-
‘జగనన్నే నా ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నారు’
జగనన్నే నా ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నారు. ఆడపిల్లలను నా చేతిలో పెట్టి నా భర్త పదేళ్ల క్రితమే కాలం చేశాడు. ఇద్దరిని చదివించడం నా శక్తికి మించిన పని. జగనన్న చలువతో నా పెద్ద కూతురు ప్రియాంక బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది. విద్యా దీవెన కింద ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.2,875 లెక్కన ఇప్పటికి ఐదు పర్యాయాలు అందించింది. వసతి దీవెన కింద రూ.10 వేలు వంతున అందిస్తోంది. నా రెండో కూతురు మనీషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అమ్మ ఒడి నగదుతో ఈ అమ్మాయిని చదివిస్తున్నాం. -కుమార్తె ప్రియాంకతో తల్లి ప్రభావతి, పుత్తూరు నేను వ్యవసాయ కూలీని. నా కుమార్తె దీప్తి చిత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. ప్రభుత్వ సాయంతోనే బిడ్డను చదివించుకోగలుగుతున్నాం. పాపకు విద్యాదీవెన నగదు అందుతోంది. పేద పిల్లల చదువుకు భరోసా ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. జీవితాంతం ఆయన వెంట నడుస్తాం. -శివయ్య. జంగాలపల్లె, ఐరాల మండలం మాది వైఎస్సార్ జిల్లా బద్వేలు. మేము ఐదుగురు అక్కచెల్లెళ్లం. మా నాన్న వ్యవసాయ కూలీ. ఇల్లు గడవడమే కష్టం. మమ్మల్ని పదోతరగతి వరకు చదివించేందుకు నానా అవస్థలు పడ్డారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా చదువు కోసం దిగులు తప్పింది. అమ్మ ఒడి నగదుతో మా చెల్లెలు, విద్యాదీవెన పథకం ద్వారా నేను మా అక్క చక్కగా చదువుకుంటున్నాం. ప్రస్తుతం నేను తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నా. జగనన్న అందిస్తున్న పథకాలతో మా చదువును కొనసాగించగలమనే భరోసా వచ్చింది. – వి.దీప్తి, విద్యార్థిని, శ్రీపద్మావతి డిగ్రీ కళాశాల, తిరుపతి చదువుకు పేదరికం అడ్డంకిగా మారకూడదు.. ఆర్థిక స్థోమత లేక ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదు.. పిల్లల కలలు సాకారం చేసుకునేందుకు ఉన్నతంగా చదువుకోవాలి.. ఆధునిక సమాజంలో అత్యున్నతంగా ఎదగాలి.. పోటీ ప్రపంచంలో దీటుగా రాణించాలి. మేలైన అవకాశాలు అందుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి’’.. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యావిప్లవానికి తెరతీశారు. అందులో భాగంగా పేద పిల్లల ఉన్నత చదువుల కోసం జగనన్న విద్యాదీవెన పథకం ప్రారంభించారు. ఏటా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ నగదును జమ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి దీవెన సొమ్మును లబ్ధిదారులకు అందించేందుకు శ్రీకారం చుట్టనున్నారు. సాక్షి, చిత్తూరు కలెక్టరేట్/తిరుపతి అర్బన్: ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. విద్యాదీవెన పథకంతో సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తూ భరోసా కల్పిస్తోంది. అందులో భాగంగా 2021–22 విద్యాసంవత్సరంలో జనవరి– మార్చికి సంబంధించి నగదు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు తిరుపతి వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ విద్యాదీవెన పథకం కింద లబ్ధి చేకూర్చనున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా.. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నప్పటికీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకం వర్తింపజేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సకాలంలో నిధులను తల్లుల ఖాతాల్లో జమచేస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి నగదును నేరుగా అందించడం ద్వారా పిల్లల చదువులు, కళాశాలల్లో మౌళిక వసతులను తల్లిదండ్రులు పరిశీలించే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. కళాశాలల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలిగేలా అవకాశముంటుందని వెల్లడిస్తున్నారు. కాలేజీ యాజమాన్యాల్లో జవాబుదారీతనం, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ రెండూ జరుగుతోందని వివరిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం నగదు జమ గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తి నిర్వీర్యం చేశారు. పిల్లల ఫీజు కట్టేందుకు తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన దుస్థితి కల్పించారు. విద్యార్థులను ఆయా కళాశాల యాజమాన్యాలు నానా అవస్థలు పెట్టిన తర్వాత అరకొరా ఫీజు చెల్లించి చేతులు దులుపుకునేవారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. వీటన్నింటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పెండింగ్ లేకుండా ఫీజురీయింబర్స్ విడుదల చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.452.52 కోట్లు విద్యాదీవెన కింద లబ్ధిదారులకు అందించింది. చివరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ దీవెన పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. మూడేళ్లుగా ఈ ప్రాంతానికి చెందిన సుమారు 17,900 మంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేసింది. మా ఇంట్లో ఇద్దరికీ లబ్ధి మా నాన్న జయకృష్ణ చిరువ్యాపారి. నా చెల్లెలు కావ్య బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. నేను ప్రస్తుతం బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నా. మా ఇంట్లో ఇద్దరికీ విద్యాదీవెన పథకం కింద ఆర్థిక సాయం అందుతోంది. ఇదివరకు మమ్మల్ని చదివించేందుకు నాన్న ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ప్రభుత్వ భరోసాతో వారిపై భారం తగ్గింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకోలేం. – కిషోర్, విద్యార్థి, గోవిందపురం, వి.కోట మండలం జగనన్న మేలు..జన్మలో మరువలేం నేను వ్యవసాయ కూలీని. ముగ్గురు పిల్లలు. ఒకమ్మాయికి పెళ్లి చేశా. మరో ఇద్దరిని చదివించేందుకు నానా అవస్థలు పడేవాడిని. ఫీజు కట్టేందుకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనేవాడిని. ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న నగదు సాయంతో ఫీజుల బాధ తప్పింది. ముఖ్యమంత్రి జగనన్న చలువ వల్ల నా కుమారుడు హరికృష్ణ కుప్పంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. రెండో అమ్మాయి ఇంటర్ సెకండియర్ చదువుతోంది. జగనన్న మేలును జన్మలో మరువలేను. – కుమారుడు హరికృష్ణతో వేమన్న, కణ్ణమ్మ దంపతులు అర్హులందరికీ అందిస్తాం అర్హులైన విద్యార్థులందరికీ విద్యాదీవెన పథకం వర్తింపజేశాం. సచివాలయాల ద్వారా పథకంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. గురువారం కలెక్టరేట్లో కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, కాపు, బీసీ, ఈబీసీ, క్రిస్టియన్ మైనారిటీ శాఖల ద్వారా ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం. – హరినారాయణన్, చిత్తూరు కలెక్టర్ -
6.27 లక్షల మందికి ప్రయోజనం.. ‘అమ్మ ఒడి’కి చేరేలా..
సాక్షి, మచిలీపట్నం: ఉమ్మడి కృష్ణా జిల్లాలో విద్యార్థుల్లో అర్హులందరికీ అమ్మ ఒడి పథకం అందేలా కసరత్తు జరుగుతోంది. 2022–23 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుతున్న సుమారు 6.27 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వేసవి సెలవులు అనంతరం బడులు తెరిచిన వెంటనే ఒక్కొక్క విద్యార్థికి రూ.15 వేల చొప్పున వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన ఏ ఒక్క విద్యార్థికీ లబ్ధి చేకూర లేదనే మాట రాకుండా విద్యాశాఖ అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. సచివాలయాల్లో జాబితాలు చైల్డ్ ఇన్ఫోతో అనుసంధానమై ఉన్న అమ్మ ఒడి పథకం లబ్ధిదారుల జాబితాను అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. వీటిని విద్యార్థుల తల్లిదండ్రులు పరిశీలించుకునే అవకాశం కల్పించారు. పాఠశాల హెచ్ఎం లాగిన్‌లో కూడా జాబితాలు ఉంచారు. ఆధార్ కార్డుతో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతా ఉంటేనే, నేరుగా దానిలో డబ్బులు పడే అవకాశం ఉంది. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా సచివాలయ విద్యా కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు. వెబ్సైట్లో ఉన్న జాబితాలను పరిశీలన చేసి, అన్నీ సవ్యంగా ఉన్నాయా లేదా అనేది ధ్రువీకరించాలని విద్యాశాఖాధికారులు ఆదేశించారు. ఆధార్ కార్డు వేర్వేరు బ్యాంకు అకౌంట్లతో అనుసంధానమై ఉంటే సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ కారణాల వల్లనే గతంలో చాలా మందికి సకాలంలో డబ్బులు జమ కాలేదు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సచివాలయ విద్యాకార్యదర్శులు దీనిపై జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అర్హులకే అమ్మ ఒడి విద్యార్థుల చదువులకు తోడ్పాటు అందించాలనే ఉన్నతాశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే కొంత మంది అనర్హులు కూడా పథకం ద్వారా ప్రయోజనం పొందారనే ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రత్యేక అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా, ఫిర్యాదులు వాస్తవమేనని తేలింది. సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారు, ఆదాయ పన్నులు చెల్లిస్తున్న వారు, సొంత కార్లు ఉన్న వారికి సైతం పథకం అందిందని గుర్తించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇలా 36,917 మంది లబ్ధిదారుల పేర్లుపై నిశిత పరిశీలన చేసి, వాస్తవికతను ధ్రువీకరిస్తున్నారు. అన్ని రకాలుగా అర్హులైన వారికి మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం అందించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు ప్రభుత్వ పథకాల పారదర్శకత కోసం అర్హుల జాబితాలు సచివాలయంలో ఎప్పడూ అందుబాటులో ఉంటాయి. వీటిని ఎవరైనా పరిశీలించుకోవచ్చు. జాబితాలో పేర్లు తొలగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్నదంతా తప్పుడు ప్రచారం. విద్యార్థులు తల్లిదండ్రులు అటువంటి ప్రచారాన్ని విశ్వసించొద్దు. అర్హులైన విద్యార్థులు అందరికీ అమ్మ ఒడి పథకం మంజూరవుతుంది. – తాహెరా సుల్తానా, ఉమ్మడి కృష్ణా జిల్లా నోడల్ అధికారి -
Jagananna Amma Vodi: అమ్మ ఒడిపై ‘ఎల్లో’ విషం
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న అమ్మ ఒడి పథకంపై టీడీపీ నేత చంద్రబాబు, నారా లోకేశ్ ఎల్లో మీడియా ద్వారా విషం చిమ్ముతూ లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. ఈ పథకానికి మార్పులు చేస్తూ సర్క్యులర్ జారీ చేశారనేది టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం మాత్రమేనని, నిజంగా ఆ సర్క్యులర్ ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. శుక్రవారం హైదరాబాద్ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పథకం కింద రెండుసార్లు పిల్లల తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున, దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసిందన్నారు. కరోనా మహమ్మారితో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా నిరుపేద కుటుంబాలకు మేలు ఆగకూడదన్న సంకల్పంతో సీఎం ఈ పథకాన్ని అమలు చేశారన్నారు. టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నట్టు ఈ పథకంలో అర్హతలకు సంబంధించి కొత్తగా నియమావళి రూపొందించలేదని, గతం కంటే ఇంకా ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు గతేడాది అర్హత నియమాలు సవరించినట్లు చెప్పారు. మరింత ఎక్కువ మందికి అందేలా.. ఈ పథకంలో అర్హత కోసం కుటుంబ నెలవారీ ఆదాయం 2019–20లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,250 ఉంటే.. దాన్ని 2020–21లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలకు ప్రభుత్వం పెంచిందని మంత్రి తెలిపారు. ఆ కుటుంబాల భూకమతాలకు సంబంధించి 2019–20లో 2.5 ఎకరాల పొలం మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారిని అర్హులుగా పరిగణిస్తే.. 2020–21లో దాన్ని 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారికి కూడా వర్తింపచేసినట్టు తెలిపారు. ఇంకా 2019–20లో నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వారినే అర్హులుగా పరిగణిస్తే.. 2020–21లో దాన్ని 300 యూనిట్లకు పెంచినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అర్హులు కారని, అయితే కొత్తగా శానిటరీ వర్కర్లకు పథకాన్ని వర్తింపజేశామన్నారు. ఫోర్‌వీలర్ రూల్‌ను సవరించి ట్యా క్సీలు, ట్రాక్టర్లు, ఆటో కలిగి ఉన్న వారికి కూడా ఇస్తున్నామన్నారు. పట్టణాల్లో గతంలో 700 చదరపు అడుగుల ఇల్లున్న వారు మాత్రమే అర్హులు కాగా.. ఇప్పుడు 1000 చదరపు అడుగుల ఇల్లున్న వారికి కూడా వర్తింప చేస్తున్నామని వివరించారు. 2 లక్షలకు పైగా పెరిగిన లబ్ధిదారులు 2019–20లో ఈ పథకంలో 42,33,098 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తే.. 2020–21లో ఆ సంఖ్య 44,48,865కు పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. అంటే 2,15,767 మంది తల్లులకు అదనంగా పథకంలో ఆర్థిక సహాయం చేశామని తెలిపారు. విద్యార్థుల హాజరుకు సంబంధించి కొత్తగా నియమావళి ఏం మార్చలేదని, 75 శాతం హాజరు ఉండాలని తొలి జీవో 63లో నిర్దేశించినట్లు తెలిపారు. హాజరు 75 శాతం ఉండాలన్న నిబంధన అమలు చేస్తూ ఈ ఏడాది పథకాన్ని జనవరి నుంచి జూన్‌కు మార్చామని స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే నారా లోకేశ్‌తో పాటు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. -
సరస్వతీ నమస్తుభ్యం!
కోవిడ్ మహమ్మారి సాగించిన ఆర్థిక విధ్వంసంపై రకరకాల కథనాలు వస్తున్నాయి. అధ్యయనాలు వెల్లడవుతున్నాయి. సమస్త జీవన రంగాల్లోని ఏ పాయనూ అది వదిలిపెట్టలేదు. మెజారిటీ ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ఆక్స్‌ఫామ్ అధ్యయనం ప్రకారం మన దేశంలో 84 శాతం మంది ప్రజలు నష్టపోయారు. వారిలో పేదవాళ్లు మరింత ఎక్కువ నష్టపోయారు. బాగా బలిసినవాళ్లు తెగ బలిశారు. దేశంలోని సూపర్ రిచ్ కుబేరుల సంపద కేవలం ఇరవై మాసాల్లో రెట్టింపయ్యింది. వీళ్లంతా అల్లావుద్దీన్లయితే కోవిడ్ వాళ్ల చేతుల్లో వండర్ ల్యాంప్‌గా మారింది. 2020 మార్చిలో ఈ నూరుగురు కుబేర పుత్రుల ఉమ్మడి సంపద విలువ 23 లక్షల కోట్లు. నవంబర్ 21 నాటికి అది 53 లక్షల కోట్లకు లాంగ్‌జంప్ చేసింది. దేశ జీడీపీలో ఇది రమారమి మూడో వంతు. ఆక్స్‌ఫామ్ లెక్క ప్రకారమే అదే సమయంలో దేశంలో 4.6 కోట్లమంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోయారు. కోవిడ్ వచ్చిన మొదటి సంవత్సరం ఉపాధి హామీ పథకంలో 11 కోట్లమందికి పైగా నమోదయ్యారు. అంతకుముందు సంవ త్సరంలో పోలిస్తే ఇది 4 కోట్లు ఎక్కువ. ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరుగుతుందట. సుప్రసిద్ధ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ఈ పరిణామాలపై ఒక ఆసక్తికరమైన పోలికను తీసుకొచ్చారు. 1940ల నాటి దారుణమైన బెంగాల్ క్షామం రోజుల్లో నిరుపేదలను ఎవరూ పట్టించుకోలేదు. అట్లాగే ఇప్పటి కోవిడ్ పరిణామాల్లో కూడా అత్యంత నిరుపేదలు అతి దారుణంగా దెబ్బతిన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం, నేటి భారత ప్రభుత్వం నిరుపేదల విష యంలో ఒకేరకంగా వ్యవహరించాయన్నారు. తనతో మాట్లాడిన సందర్భంలో అమర్త్యసేన్ ఈ వ్యాఖ్యలు చేశారని సీఎన్‌బీసీ న్యూస్ యాంకర్ మిథాలీ ముఖర్జీ ఒక వ్యాసంలో వెల్లడించారు. మొదటి లాక్డౌన్ సమయంలో మండుటెండల్లో నడిరోడ్లపై నెత్తురోడుతూ కదిలిన కోట్లాది మాంసపు ముద్దల మహాప్రస్థాన దైన్యాన్ని ఈ దేశం స్వయంగా వీక్షించింది కూడా! ‘ఊరు మీద ఊరు పడ్డా కరణం మీద కాకి వాలదు’ అనే సామెత ఉండేది. అదేవిధంగా ఏ సంక్షోభం ముంచుకొచ్చినా ఐశ్వర్యవంతుణ్ణి ఏమీ చేయలేదు. దరిద్ర నారాయణుడిని మాత్రం ఏ మహమ్మారీ వదిలిపెట్టదు. అతడు రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం లాగా వెంటాడుతూనే ఉంటుంది. కోవిడ్ వల్ల ఎక్కువగా దెబ్బతిన్న రంగాల్లో ప్రముఖమైనది విద్యారంగం. ఈ రంగంలో కూడా అతి ఎక్కువగా నష్టపోయినవారు పేదింటి బిడ్డలే. ఇప్పటికే మన విద్యావ్యవస్థలో ప్రమాణాల రీత్యా ధనిక – పేద అంతరం కొనసాగుతూ వస్తున్నది. ఈ రెండేళ్లలో అంతరం మరింత విస్తరించింది. వసతులున్న పిల్లలు ఆన్లైన్ ద్వారా అంతో ఇంతో మేకప్ చేసుకోగలిగారు. ఏ ఆదరువూ లేని పిల్లలు చదువులకు దూరమై డ్రాపవుట్ అంచున నిలబడ్డారు. భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరినీ సమస్కంధు లుగా, సమాన వాటాదారులుగా ప్రకటించినప్పటికీ ఇంకా ఇన్ని కోట్లమంది ప్రజలు నిస్సహాయులుగా నిరుపేదలుగా మిగిలి పోవడానికి కారణం ఏమిటి? అందరికీ సమాన స్థాయిలో నాణ్యమైన విద్యను అందివ్వలేకపోవడమే అందుకు కారణమని విద్యావేత్తలు, ఆర్థిక నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పుడు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పేదరికంపై విజయం సాధించ గలిగే ధనుర్బాణాలను విద్యారంగమే సమకూర్చుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. విద్యారంగం మీద జీడీపీలో కనీసం 6 శాతం ఖర్చుపెడితే తప్ప ప్రజలందరికీ నాణ్యమైన విద్యను అందించలేమని జాతీయ విద్యావిధానంపై వెలువడిన కమిటీ రిపోర్టులన్నీ నొక్కి చెప్పాయి. ఆ లెక్కన గడిచిన బడ్జెట్లో కనీసం 10 లక్షల కోట్లయినా విద్యారంగం పద్దులో పెట్టాలి. కానీ కేంద్రం 99 వేల కోట్లను మాత్రమే కేటా యించింది. వాంఛిత కేటాయింపులో ఇది కేవలం పది శాతం. ఇందులో కూడా వాస్తవానికి ఎంత ఖర్చు చేశారో తెలియాలంటే సవరించిన అంచనాలు రావాలి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధిం చిన దగ్గర్నుంచీ విద్యారంగానికి చేసిన బడ్జెట్ కేటాయింపుల కథాకమామీషు ఇదే మాదిరిగా ఉన్నది. తొలిరోజుల్లో విద్యాగంధం ఉన్న కుటుంబాల్లోని పిల్లలు తల్లిదండ్రుల శ్రద్ధ వలన సహజంగానే ముందడుగు వేశారు. వీరికి తోడుగా బడి చదువుతోపాటు ట్యూషన్లు చెప్పించుకునే స్థోమత కలిగిన వాళ్లు మాత్రమే స్కూల్ ఫైనల్ గడప దాటేవాళ్లు. నిరక్షరాస్య కుటుంబాల్లోని పేద పిల్లలు మాత్రం ఆ గడపకు ఆవలనే డ్రాపవుట్లుగా మిగిలిపోయేవారు. ఆర్థిక సంస్కరణలు, గ్లోబలైజేషన్ల తర్వాత ఈ సామాజిక దుర్నీతి మరింత క్రూరంగా తయారైంది. ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు వెళ్లగలిగిన పిల్లలు ముందడుగు వేశారు. ప్రభుత్వ స్కూళ్లను ఉద్దేశపూర్వకంగా పాడుపెట్టారు. తొలిదశ ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యే నాటికే ఉమ్మడి రాష్ట్ర పాలనా పగ్గాలను తస్కరించిన చంద్రబాబు నాయకత్వంలో ఈ సామాజిక విధ్వంసం యథేచ్ఛగా సాగిపోయింది. పేద పిల్లలు వెళ్లగలిగే ప్రభుత్వ బడుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దేశంలోని మరే రాష్ట్రంలో కూడా ప్రభుత్వ బడులను ఈ స్థాయిలో నిర్లక్ష్యం చేయలేదు. ఇదే సమయంలో ఐటీ విప్లవం ఇబ్బడి ముబ్బడిగా ఉపాధి అవకాశాలను సృష్టించింది. ఇంగ్లిష్ మీడియంలో చదువు కొనుక్కోలేకపోయిన యువతరం ఆ అవకాశాలను అంది పుచ్చుకోవడంలో విఫలమైంది. పేదవర్గాల్లోని ఒక తరం కలలు విద్యావ్యాపారం రథచక్రాల కింద నలిగిపోయాయి. పేదవర్గాల ప్రజలు నాణ్యమైన విద్యకు మూడు దశాబ్దాల పాటు దూరం కావడానికి కారణమైన బాధ్యుల్లో ఒకటో నెంబర్ ముద్దాయిగా చంద్రబాబునే నిలబెట్టవలసి వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ ఆయన విద్యారంగం పట్ల తన పాత విధానాలనే కొనసాగించారు. 2019 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని ఘోరంగా ఓడించి అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సరిగ్గా చెప్పాలంటే ఆయన విప్లవ శంఖం పూరించారు. విద్యార్జనలో పెరిగిన ధనిక – పేద అంతరాలు, సామాజిక– ఆర్థిక హోదాల ప్రాతిపదికపై పిల్లలు వేర్వేరు బడుల్లో చదవడానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం చేశారు. ఈ దుష్పరిణామాలను పరిహరించి కుల మత ప్రాంత లింగ వివక్ష లేకుండా, ధనిక పేద తారతమ్యం లేకుండా పిల్లలంతా ఒక్కటిగా కలివిడిగా చదువుకునే ఒక ప్రణాళికను ఏపీ ముఖ్యమంత్రి తయారు చేసుకున్నారు. వెంటనే దాన్ని దశల వారీగా అమలుచేసే కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యారంగంలో ముఖ్యమంత్రి చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల్లో మొదటిది – ‘అమ్మ ఒడి’ పిల్లల్ని స్కూలుకు/ కాలేజీకి పంపించే ప్రతి అర్హురాలైన తల్లికి ఏటా పదిహేను వేల రూపాయలను ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తున్నది. దీనివల్ల రెండు ప్రయోజనాలు కలుగుతున్నాయి. పేదరికం కారణంగా పిల్లల్ని బడికి పంపించలేని దుఃస్థితి తొలగిపోవడం మొదటిది. రెండవది మహిళా సాధికారతకు సంబంధించిన అంశం. అమ్మ చేతిలో డబ్బున్న కారణంగా పిల్లల చదువుకు సంబంధించిన కీలక నిర్ణయాధికారం ఆమెకే ఉంటుంది. సంస్కరణల్లో రెండో ముఖ్యాంశం 16 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన ‘నాడు–నేడు’ అనే బృహత్తర కార్యక్రమం. కేవలం టాయిలెట్ వసతి లేని కారణంగా ఆడపిల్లలు చదువులు మానేసే దౌర్భాగ్య పరిస్థితి మొన్నటిదాకా మన విద్యావ్యవస్థలో రాజ్యమేలింది. పెచ్చు లూడుతున్న సీలింగ్, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గది గోడలు, విరిగిన కుర్చీలు – బెంచీలు, పగుళ్లుబారిన ఫ్లోరింగ్, కాంపౌండ్ వాల్ లేక పశువులకు ఆవాసంగా మారిన ఆవరణ, పిచ్చిమొక్కలతో విషపురుగుల విహారం, శిథిలాలయాలకు రాలేక సెలవులతో నెట్టుకొచ్చే పంతుళ్లూ... ఇది మొన్నటివరకు ప్రభుత్వ బడి దృశ్యం. ఇప్పుడు కళ్లతో చూస్తే తప్ప నమ్మలేనంతగా ఆధునిక హంగులతో ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే 16 వేల స్కూళ్లు కార్పొరేట్‌కు దీటుగా సింగారించు కున్నాయి. ఇప్పుడు పేద పిల్లల్నే కాదు స్థితిమంతుల పిల్లల్ని కూడా అవి రా రమ్మని పిలుస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు యూనిఫామ్, షూ, బెల్ట్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ ‘జగనన్న విద్యా కానుక’ పేరుతో లభిస్తున్నాయి. ఇంగ్లిష్ మాధ్యమం సులభంగా అర్థమయ్యే విధంగా రెండు భాషల్లో ఉండే పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు. ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో పౌష్టికాహారాన్ని నిత్యం 40 లక్షలమందికి అందజేస్తున్నారు. నాణ్యమైన సీబీఎస్ మూల్యాంకన విధానాన్ని కూడా దశల వారీగా ప్రవేశ పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల అధ్యయనం తర్వాత ప్రకటించిన ‘నూతన విద్యావిధానం–2020’లో పొందుపర్చిన అంశాల్లో అనేకం ఏడాది ముందుగానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించడం ఒక విశేషం. నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ‘నీతి ఆయోగ్’ ప్రశంసించింది. పేద కుటుంబాల జీవితాల్లో గేమ్ ఛేంజర్ లాంటి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రాథమిక స్థాయి నుంచే అమలుచేయడం ప్రారంభించారు. వైఎస్ జగన్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయానికి తొలిదశలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కానీ, పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వం నిర్ణయం వెనుక దృఢంగా నిలవడంతో రాజకీయ ప్రతిపక్షాలు జడుసుకొని నోరు మూసు కున్నాయే తప్ప కుట్రలను మాత్రం ఆపలేదు. ప్రభుత్వం చేపట్టిన పలురకాల చర్యల వలన స్థోమత కలిగిన పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. అన్నివర్గాల పిల్లలూ కలిసి మెలిసి చదువుకోవడం వల్ల సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది. దేశ సమగ్రత బలపడుతుంది. పేదరిక నిర్మూలనకు, కులమత తారతమ్యాలను అంతం చేయడానికి ఉపయోగపడే ఈ నాణ్యమైన విద్యాయజ్ఞాన్ని పూర్తిచేయడం అంత సులభసాధ్యమైనదేమీ కాదు. యాగ భంగానికి మారీచ సుబాహులు పొంచివున్నారు. కుల మతాలకు అతీతంగా పేదవర్గాల ప్రజలందరూ యాజ్ఞికునికి అండగా నిలబడవలసిన తరుణమిది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంగ్లిషు మీడియాన్ని ప్రకటించడమే గాక సర్కారు బళ్ల రూపురేఖల్ని మార్చే కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఇక స్పందించవలసినది కేంద్ర ప్రభుత్వమే! విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ఆర్థిక వనరులన్నీ కేంద్రం గుప్పెట్లోనే ఉన్నాయి. నూతన విద్యావిధాన ప్రకటన అభిలషించినట్లుగా 6 శాతం జీడీపీని విద్యా పద్దు కింద ఈ బడ్జెట్లో కేటాయిస్తారో లేదో చూడాలి. విద్యారంగానికి ఆయా దేశాలు చేస్తున్న కేటాయింపుల జాబితాను చూస్తే బాధ కలుగుతుంది. 198 దేశాలున్న జాబితాలో మనది 144వ స్థానం. ప్రపంచం మొత్తంలో ఉన్న పేదల్లో సగంమంది మన దేశంలోనే ఉన్నారు. వీరిని పేదరికం నుంచి బయటపడేసే బ్రహ్మాస్త్రం నాణ్యమైన విద్య. అందువల్ల అన్ని దేశాల కంటే ఎక్కువ కేటాయింపులు చేయవలసిన అవసరం మన దేశంలో ఉన్నది. కనీసం ఈ రంగంలో ప్రగతిబాటలో పయనిస్తున్న రాష్ట్రాలకైనా ప్రోత్సాహకాలను ప్రకటించడం అత్యవసరం. ఈ దేశ ప్రత్యేక అవసరాల దృష్ట్యా, కోవిడ్ మహమ్మారి కలిగించిన విపరి ణామాల దృష్ట్యా ఈ బడ్జెట్లో విద్యారంగానికి పెద్దయెత్తున కేటాయింపులుంటాయని ఆశిద్దాం. ఈ ఆశ నెరవేరినట్లయితే ఈ దేశ పేదింటి బిడ్డలు ప్రభుత్వాన్ని సరస్వతీ దేవిగా భావించి, పూజిస్తారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
‘అమ్మఒడి’పై సినిమా.. ప్రధానోపాధ్యాయుడి పాత్రలో ఎమ్మెల్యే
పాడేరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నవరత్నాల్లోని అమ్మఒడి పథకం పేరు మీద శ్రీదత్తాత్రేయ క్రియేషన్స్ ఓ చలనచిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే వెండితెర మీదకు రానున్న ఈ చిత్రంలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ప్రధానోపాధ్యాయుడి పాత్ర పోషిస్తున్నారు. పాడేరు మండలంలోని దిగుమోదాపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. తహసీల్దార్ ప్రకాష్‌రావు ఎమ్మెల్యేకు క్లాప్ కొట్టారు. షూటింగ్ అనంతరం ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి ఎంతో పారదర్శకంగా అందిస్తున్న సంక్షేమ పథకాలలో అమ్మఒడి ఒకటని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు పేరుతో ఊహించని రీతిలో అభివృద్ధి చేశారని కొనియాడారు. అమ్మఒడి పథకంపై చలనచిత్రం నిర్మించడం గొప్ప విషయమని చిత్ర నిర్మాత, దర్శకులను అభినందించారు. ఈ చిత్రానికి త్రినాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: Rythu Bharosa: ఆర్బీకే సేవలకు కేంద్ర మంత్రులు ఫిదా) -
విప్లవంలా.. మహిళా సాధికారత: సీఎం వైఎస్ జగన్
ఎకనామికల్లీ బ్యాక్ వర్డ్ కమ్యూనిటీ (ఈబీసీ) వారికి కూడా మంచి చేయాలని వచ్చే జనవరి 9 నుంచి.. అంటే నా పాదయాత్ర ముగిసిన రోజు నుంచి ఈబీసీ నేస్తం అనే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నాం. –సీఎం జగన్ సాక్షి, అమరావతి: మహిళా సాధికారతను రాష్ట్రంలో ఒక ఉద్యమంగా, విప్లవంగా చేపట్టినట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఈ దిశగా ఈ రెండున్నరేళ్లు ఒక సువర్ణాధ్యాయమని.. అక్క చెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా సగర్వంగా తెలియజేస్తున్నానని స్పష్టం చేశారు. రాజకీయాలకు తావు లేకుండా మహిళలను మహరాణులుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం తమదన్నారు. మహిళా సాధికారతపై గురువారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 44.50 లక్షల మంది తల్లులకు, వారి ద్వారా 85 లక్షల మంది పిల్లలకు కోసం జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. ఇందులో ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా ఈ రెండున్నరేళ్లలో అక్కచెల్లెమ్మలకు రూ.13,023 కోట్లు ఇచ్చామన్నారు. తద్వారా పిల్లలను బడులకు పంపించే గొప్ప విప్లవానికి నాంది పలికామని వివరించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నాడు పింఛన్ల బిల్లు రూ.400 కోట్లు.. నేడు రూ.1500 కోట్లు ► గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 44 లక్షల పింఛన్లు. నెలకు కేవలం రూ.400 కోట్లు పింఛన్ బిల్లు వచ్చేది. ఈ రోజు పింఛన్లు 61.73 లక్షలు. తొలి రోజు నుంచి రూ.2,250 ఇస్తున్నాం. ఈ రోజు ప్రతి నెలా పింఛన్ల బిల్లు రూ.1,500 కోట్లకు పైగా ఉంది. ► 61.73 లక్షల మందిలో 36.70 లక్షల మంది అవ్వలు, అక్కలు ఉన్నారు. రూ.21,899 కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టాం. ప్రతి నెలా ఒకటో తారీఖున వలంటీర్ ద్వారా వారి చేతుల్లో పెడుతున్నాం. వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీతో పొదుపు సంఘాలకు ఆక్సిజన్ ► వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 78.86 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్ల కాలంలో జరిగే మేలు రూ.25,517 కోట్లు. ఈ రెండేళ్లలో రూ.12,758 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. ► సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపుగా కోటి మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,354 కోట్లు ఇచ్చాం. ఎన్నికల వేళ గత పాలకులు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేస్తే.. పొదుపు సంఘాల గ్రూపుల ఎన్పీయేల శాతం 18.36కు పోయింది. ఏ గ్రేడ్ సంఘాలు సీ, డీ గ్రేడ్లకు దిగజారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్ ఆసరా పథకం వాటికి ఆక్సిజన్‌గా నిలిచింది. వ్యాపారాలకు ఊతం ► వైఎస్సార్ చేయూత ద్వారా రెండేళ్లుగా ఏటా రూ.18,750 చొప్పున (మొత్తం నాలుగు దఫాలు) ఇస్తున్నాం. 24.56 లక్షల మంది 45 నుంచి 60 ఏళ్ల మధ్యలోనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు అందించాం. ఇప్పటికి రెండు విడతలుగా రూ.8,944 కోట్లు ఇచ్చాం. ► బ్యాంకర్లతో, రిలయెన్స్, ఐటీసీ, అమూల్, హిందుస్తాన్ లీవర్, పీ అండ్ జీ వంటి పెద్ద పెద్ద సంస్థలతో అనుసంధానం చేసి 1.10 లక్షల మందితో రిటైల్ షాపులు పెట్టించాం. ఆవులు, గేదెలు కొనుక్కుని 1,34,103 మంది లబ్ధి పొందారు. మేకలు, గొర్రెలు ద్వారా 82,556 మందికి మేలు జరిగింది. కుప్పంలో దేవుడు మొట్టికాయలు వేశారు ► రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల పంచాయతీలు ఉంటే, 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీలు ఉన్నాయి. 31 లక్షల ఇళ్ల పట్టాలు అందించాం. అంటే దాదాపు కోటి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టించే కార్యక్రమం ఇది. ► 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణం పూర్తయితే ప్రతి అక్క, చెల్లెమ్మ చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తి చేతిలో పెట్టినట్లవుతుంది. మొత్తంగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద వాళ్ల చేతిలో పెట్టినట్లవుతుంది. ఇలాంటి మంచి పథకాన్ని కోర్టుల ద్వారా అడ్డుకోవాలని చూస్తున్నందుకు దేవుడు కుప్పంలో మొట్టికాయలు వేశారు. పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువే ► జగనన్న విద్యా దీవెన ద్వారా 18.51 లక్షల మంది తల్లులకు రూ.5,573 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. ► బోర్డింగ్ ఇతర ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన ద్వారా 15.57 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.2,270 కోట్లు జమ చేశాం. పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువే అని.. మనసా, వాచా ఒక గొప్ప ఉద్యమానికి నాంది పలికాం. గర్భిణులు, బాలింతలు, చిన్నారులపై శ్రద్ద ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలందరికీ పౌష్టికాహారాన్ని అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నాం. ఈ పథకాల ద్వారా 33.44 లక్షల మందికి మేలు జరుగుతుంది. రూ.2,972 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వారు అన్ని విధాలా నిలదొక్కుకోవాలని.. ► నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. కేబినెట్లో హోంమంత్రిగా ఒక చెల్లికి, ఉప ముఖ్యమంత్రిగా మరో ఎస్టీ మహిళకు స్థానం కల్పించాం. ఎమ్మెల్సీలుగా ఇద్దరు మైనార్టీ మహిళలను, ఒక బీసీ మహిళను తీసుకొచ్చాం. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా అధికారిని నియమించాం. ► కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లలో మహిళలకు 51 శాతం పదవులిచ్చాం. మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాల్టీలు, నగర పంచాయతీల చైర్మన్లు, మేయర్ పదవులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో సగభాగానికి పైగా వారికే ఇచ్చాం. 2.50 లక్షల మంది వలంటీర్లలో 53 శాతం మంది నా చెల్లెమ్మలే. 13 జెడ్పీ చైర్మన్లలో ఏడుగురు అక్కచెల్లెమ్మలే. వైస్ ఛైర్మన్లు 26 మందిలో 15 మంది వారే. మహిళా భద్రతే ముఖ్యం ► దిశా చట్టం చేసి, కేంద్రానికి ఆమోదం కోసం పంపాం. ఇవాళ దిశ యాప్ ద్వారా దాదాపు 90 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు 6,880 మంది రక్షణ పొందారు. ► పలు చర్యల ద్వారా మద్య నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసు ఉన్నారు. దోషులకు త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నాం. ► స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 10,388 పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో టీనేజ్ బాలికలకు బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ను ఉచితంగా ఇస్తున్నాం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. 97 శాతం ఆశీర్వాదం ► నిన్న 12 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో కౌంటింగ్ ముగిసింది. ఇందులో ఒక్కచోట మాత్రమే టీడీపీ వచ్చింది. కొండపల్లిలో టై. మిగిలిన అన్నీ క్లీన్ స్వీప్. దాని అర్థం 97 శాతం వైఎస్సార్సీపీని ఆశీర్వదించారు. (గ్రాఫ్ ప్రదర్శించారు) ► మనం అధికారంలోకి వచ్చినప్పుడు 50 శాతం ఓట్ షేర్ వస్తే, ఇప్పుడు 55.77 శాతం వచ్చింది. అచ్చెన్నాయుడు బీఏసీలోకి వచ్చినప్పుడు, చంద్రబాబునాయుడు కూడా వస్తారేమోనని కాస్త ఆలస్యం చేశాం. మహిళా సాధికారత మీద చర్చ జరుగుతున్నప్పుడు తాను (చంద్రబాబు) కూడా ఉంటే బాగుంటుందని వేచి చూశాం. ఇక్కడే ఉన్నారు.. వస్తారని అన్నారు.. వేచి చూసినప్పటికీ రాలేదు. ఆయనకున్న కష్టమేమిటో తెలియదు. మా వాళ్లందరూ కుప్పం ఎఫెక్ట్ అంటున్నారు. ఈ సమయంలో ఇక్కడ ఉండి ఉంటే బావుండేది. ఇక్కడ లేకపోయినా టీవీలో చూస్తుంటారని, ఇకపై అయినా బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నా. -
విద్యార్థుల హాజరుకు బయోమెట్రిక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థుల్లో సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. విద్యార్థులు పాఠశాలలకు రోజూ హాజరయ్యేలా చర్యలు చేపడుతోంది. ఏడాదిలో కనీసం 75 శాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ప్రభుత్వం మనబడి – నాడు–నేడు కింద కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు విద్యార్థుల తల్లులకు జగనన్న అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు, జగనన్న విద్యాకానుక కింద 3 జతల యూనిఫామ్, షూ, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌బుక్స్, డిక్షనరీ అందిస్తోంది. విద్యార్థులకు జగనన్న గోరుముద్ద కింద రుచికరమైన పౌష్టికాహారం అందిస్తోంది. వీటన్నిటి అంతిమ లక్ష్యం.. విద్యాప్రమాణాల పెంపే. 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి విద్యా ప్రమాణాలను పెంచాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే విద్యార్థులు రోజూ పాఠశాలలకు హాజరుకావాలి. ఈ నేపథ్యంలో వారి హాజరును పెంచేందుకు వీలుగా ‘అమ్మఒడి’ పథకానికి హాజరును అనుసంధానం చేస్తోంది. 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకాన్ని వర్తింప చేయనుంది. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు అమ్మఒడిని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం రూపొందించిన బయోమెట్రిక్ హాజరు యాప్‌ను ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తోంది. ఇందులో ఏవైనా లోపాలు తలెత్తితే.. వాటిని పరిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేనుంది. 82 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో 61 వేలకు పైగా ఉన్న పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 72 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో 6.49 లక్షల మంది, రెండో తరగతిలో 58 వేలకుపైగా చేరారు. వీరిలో 90 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరడం గమనార్హం. మొత్తం మీద ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది 6.5 లక్షల మంది వరకు విద్యార్థులు అదనంగా చేరారు. వీరు క్రమబద్ధంగా పాఠశాలలకు హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేపడుతోంది. బయోమెట్రిక్ వల్ల విద్యార్థులకు క్రమశిక్షణ బయోమెట్రిక్ హాజరుపెట్టడం వల్ల విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుంది. పిల్లలు పాఠశాలకు వెళ్లారో, లేదో తెలుస్తుంది. పారదర్శకత కోసం ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు ప్రవేశపెట్టడం మంచి పరిణామం. – గట్టెం అశోక్ కుమార్, విద్యార్థి తండ్రి, పెదపాడు, పశ్చిమ గోదావరి డ్రాపవుట్లు తగ్గుతాయి బయోమెట్రిక్ హాజరుతో డ్రాపవుట్లు తగ్గుతాయి. పాఠశాలకు ఎవరు రాలేదో వెంటనే తెలుస్తుంది. తద్వారా వారి తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించవచ్చు. ఖచ్చితమైన హాజరు తెలియడంతో మధ్యాహ్న భోజన పథకంలో పారదర్శకత ఏర్పడుతుంది. – తోట ప్రసాద్, ఉపాధ్యాయుడు,మండల ప్రాథమిక పాఠశాల, పెదపాడు, పశ్చిమ గోదావరి -
అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి: పేర్ని నాని
-
Andhra Pradesh: 6.53 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక పరిజ్ఞానం అందించడం, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఇంటి నుంచే ఆన్లైన్ అభ్యసనం కొనసాగించడానికి వీలుగా ప్రభుత్వం వారికి ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటికే టెండర్లపై జ్యుడీషియల్ ప్రివ్యూ పరిశీలన కూడా పూర్తయ్యింది. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన కింద లబ్ధి పొందుతున్న విద్యార్థులకు ఆ పథకాలకు ప్రత్యామ్నాయంగా ల్యాప్‌టాప్‌లను అందించనుంది. విద్యార్థుల అభీష్టం మేరకు ఆ పథకాల కింద నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయనుంది. తమకు ల్యాప్‌టాప్‌లు కావాలని 6.53 లక్షల మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. 2021–22 విద్యా సంవత్సరంలో 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్న 6,53,144 ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏపీటీఎస్‌కు నోడల్ ఏజెన్సీగా బాధ్యతలు అప్పగించింది. జగనన్న అమ్మఒడి కింద 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు 5,42,365 బేసిక్ వెర్షన్ ల్యాప్‌టాప్‌లు అందిస్తారు. ఇక ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ చదివే విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద ఇస్తారు. వీరికోసం ఒక రకం కాన్ఫిగరేషన్‌తో 19,853 ల్యాప్‌టాప్‌లను, వేరే కాన్ఫిగరేషన్‌తో మరో 90,926 ల్యాప్‌టాప్‌లను అందిస్తారు. చదవండి: (తిరుపతి కేంద్రంగా ‘జియో నెక్ట్స్’.. ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ..) బ్రాండెడ్ కంపెనీల ల్యాప్‌టాప్‌లు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి జగనన్న అమ్మఒడి కింద 44.48 లక్షల మంది తల్లులు లబ్ధి పొందుతున్నారు. వీరికి ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో 5.42 లక్షల మందికిపైగా నగదుకు బదులు తమ పిల్లలకు ల్యాప్‌టాప్‌లు కావాలని ఆప్షన్ ఇచ్చారు. ఇక జగనన్న వసతి దీవెన కింద ఏటా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ.15 వేలు, డిగ్రీ విద్యార్థులకు రూ.20 వేలు ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం కింద 15.50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ల్యాప్‌టాప్‌ల్లో సమస్యలు వస్తే కంపెనీలు వారంలో వాటిని పరిష్కరించేలా ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించింది. విద్యార్థులు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు అందించాలి. లెనోవో, హెచ్‌పీ, డెల్, ఏసర్ వంటి బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ప్రభుత్వం అందించనుంది. హైస్కూల్ విద్యార్థులకు అందించే ల్యాప్‌టాప్‌ల ప్రత్యేకతలు.. 4జీబీ రామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్, విండోస్ 10 (ఎస్డీఎఫ్ మైక్రోసాఫ్ట్), ఓపెన్ ఆఫీస్ (ఎక్సెల్ వర్డ్, పవర్ పాయింట్) కాన్ఫిగరేషన్లతో మూడేళ్ల వారెంటీతో అందిస్తారు. గ్రామీణ విద్యార్థులకు ఎంతో మేలు 9వ తరగతి నుంచే ల్యాప్‌టాప్‌లు అందించడం వల్ల విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా పొందొచ్చు. ప్రపంచ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతో మేలు. – ఇమంది పైడిరాజు, హెచ్ఎం, జెడ్పీ హైస్కూల్, అడవివరం, విశాఖపట్నం జిల్లా కరోనా వంటి సమయాల్లో చదువులకు ఇబ్బంది ఉండదు కరోనా సమయంలో స్కూళ్లు ఆన్లైన్ పాఠాలను అందించినా ల్యాప్‌టాప్‌లు లేక వాటిని అందిపుచ్చుకోలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు ఇస్తుండడంతో ఇబ్బందులు తప్పుతాయి. – వి.సునీత, పేరెంట్, జెడ్పీ హైస్కూల్, చంద్రంపాలెం, చినగదిలి, విశాఖపట్నం జిల్లా డిజిటల్ పాఠాలు అందుబాటులోకి వస్తాయి ల్యాప్‌టాప్‌ల వల్ల మాకు డిజిటల్ పాఠాలు అందుబాటులోకి వస్తాయి. ఆన్లైన్లో పాఠాలను అందించినప్పుడు ఫోన్లలో కంటే ల్యాప్‌టాప్‌లే అనువుగా ఉంటాయి. – సీహెచ్ జ్యోత్స్న, జెడ్పీహెచ్ఎస్ అనంతవరం డిగ్రీ విద్యార్థులకు అందించే రెండు రకాల మోడళ్ల ప్రత్యేకతలు.. మోడల్–1.. ప్రాసెసర్: ఇంటెల్ పెంటియమ్ సిల్వర్ సిరీస్, ఏఏండీ అథ్లాన్ (3000 సిరీస్) లేదా సమానమైన 4 జీబీ డీడీఆర్ రామ్ ►500 జీబీ హార్డ్ డ్రైవ్ ►14 అంగుళాల హై–డెఫ్ డిస్ప్లే (1366 గీ 768) ►వై–ఫై, బ్లూటూత్ ►వెబ్‌క్యామ్ (0.3 ఎంపీ/వీజీఏ సమానమైనది) ►విండోస్ 10 ఓఎస్ ►ఆఫీస్ 365 స్టూడెంట్ ప్యాక్ ►మూడేళ్ల వారంటీ (ల్యాప్‌టాప్, బ్యాటరీ, అడాప్టర్, యాంటీ వైరస్ రక్షణ) ►ఎండీఎం సాఫ్ట్వేర్ ►బ్యాక్‌ప్యాక్/క్యారీ బ్యాగ్ మోడల్–2.. ప్రాసెసర్: ఇంటెల్ కోర్ ఐ3, ఏఏండీ రైజెన్ 3 (3250) లేదా సమానమైనది. ►8 జీబీ డీడీఆర్ ర్యామ్ ►500 జీబీ లేదా అంతకంటే ఎక్కువ హార్డ్ డ్రైవ్ ►14 అంగుళాల హై–డెఫ్ డిస్ప్లే (1366 గీ 768) ►వై–ఫై, బ్లూటూత్ ►వెబ్‌క్యామ్ (0.3 ఎంపీ/వీజీఏ సమానమైనది) ►విండోస్10 ఓఎస్ ►ఆఫీస్ 365 స్టూడెంట్ ప్యాక్ ►మూడేళ్ల సమగ్ర వారంటీ (ల్యాప్‌టాప్, బ్యాటరీ అడాప్టర్, యాంటీ వైరస్ రక్షణ) ►ఎండీఎం సాఫ్ట్వేర్ ►బ్యాక్‌ప్యాక్/క్యారీ బ్యాగ్ -
AP: బడితోనే అమ్మఒడి
సాక్షి, అమరావతి: పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే ‘అమ్మ ఒడి’ పథకం ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా తల్లులు, పిల్లలను చైతన్యం చేయడానికి అమ్మ ఒడి పథకాన్ని తెచ్చామని, విద్యాకానుకను కూడా అమలు చేస్తున్నామని, వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి తొలివిడతలో 15 వేలకుపైగా పాఠశాలలను మౌలిక వసతులతో తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి తెలిపారు. అమ్మ ఒడి పథకం స్ఫూర్తి కొనసాగేలా పిల్లలంతా బడి బాట పట్టాలన్నారు. పాఠశాలల నిర్వహణ, విద్యార్ధుల హాజరు, అమ్మ ఒడి, విద్యా కానుక పథకాలపై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో విస్త్రృత స్థాయి సమీక్ష నిర్వహించారు. జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్ధులకు ఇవ్వనున్న స్పోర్ట్స్ డ్రస్, రెగ్యులర్ డ్రస్, షూలను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. అమ్మ ఒడి పథకానికి విద్యార్ధుల హాజరు అనుసంధానం, సీబీఎస్ఈ అఫిలియేషన్, ఎయిడెడ్ స్కూల్స్, సోషల్ ఆడిట్‌పై సీఎం జగన్ పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. కోవిడ్ వల్లే అమలు కాలేదు.. అమ్మ ఒడి పథకం అమలు సందర్భంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో 75% హాజరు ఉండాలన్న నిబంధన గతంలోనే విధించామని, అయితే కోవిడ్ వల్ల ఇన్నాళ్లూ అమలు చేయలేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చెప్పారు. రెండేళ్లుగా కరోనాతో పాఠశాలలు సరిగా పని చేయని పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. 2020 జనవరిలో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించగా మార్చి చివరి వారంలో కోవిడ్ మొదలైందన్నారు. పథకం అమల్లోకి వచ్చిన 2 – 3 నెలలు తిరగకముందే కోవిడ్ ప్రారంభం కావడంతో స్కూళ్లు మూసివేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. తిరిగి 2020 నవంబరు, డిసెంబరులో పాఠశాలలు తెరిచి జనవరి 2021లో మళ్లీ అమ్మ ఒడి ఇచ్చామని తెలిపారు. అయితే కోవిడ్ రెండో వేవ్ రావడంతో పరీక్షలే నిర్వహించలేని పరిస్థితులు తలెత్తాయన్నారు. ఈ ఏడాది కూడా జూన్‌లో ప్రారంభం కావాల్సిన స్కూళ్లను ఆగస్టు 16 నుంచి ప్రారంభించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 75 % హాజరు.. జూన్‌లోనే అమ్మ ఒడి, కానుక 2022 నుంచి ‘అమ్మ ఒడి’ పథకానికి విద్యార్ధులహాజరును అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పిల్లలను చదువుల బాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ఉద్దేశమని, ఈ స్ఫూర్తిని కొనసాగించాలనే 75 శాతం హాజరు ఉండాలని ఇదివరకే మనం నిర్దేశించుకున్నామని స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరం (2021–22)లో 75 శాతం హాజరు నిబంధనను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సాధారణంగా స్కూళ్లు జూన్‌లో ప్రారంభమై ఏప్రిల్ వరకూ కొనసాగుతాయి కాబట్టి విద్యాసంవత్సరంలో పిల్లల హాజరును పరిగణలోకి తీసుకోవాలన్నారు. హాజరును పరిగణలోకి తీసుకుని జూన్‌లో పిల్లల్ని స్కూల్‌కు పంపే సమయంలో విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అమ్మ ఒడిని అందించాలని సూచించారు. అమ్మ ఒడి, విద్యాకానుక రెండూ పిల్లలు జూన్‌లో స్కూల్‌కి వచ్చేటప్పుడు ఇవ్వాలని ఆదేశించారు. అన్ని స్కూళ్లకూ సీబీఎస్ఈ అఫిలియేషన్ అన్ని స్కూళ్లకూ సీబీఎస్ఈ అఫిలియేషన్ లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 2024 నాటికి పిల్లలు సీబీఎస్ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ప్రతి హైస్కూల్‌కు కచ్చితంగా ప్లే గ్రౌండ్ ఉండాలని, దీనిపై మ్యాపింగ్ చేసి ప్లే గ్రౌండ్స్ లేని చోట భూ సేకరణ చేసి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాలక్రమేణా ప్రీ హైస్కూల్ స్థాయి వరకూ ప్లే గ్రౌండ్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబర్ నాటికి విద్యా కానుక వర్క్ ఆర్డర్ డిసెంబర్ నాటికి విద్యా కానుక వర్క్ ఆర్డర్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లేనాటికి విద్యాకానుకను వారికి అందించాలని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ డ్రస్, షూలను పరిశీలించిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ప్రతీ స్కూల్ నిర్వహణకు రూ.లక్ష ప్రతి స్కూల్‌కు నిర్వహణ ఖర్చుల కింద కనీసం రూ.లక్షను వారికి అందుబాటులో ఉంచాలని, దీనివల్ల మరమ్మతులతో పాటు ఏ సమస్య వచ్చినా తీర్చుకునే అవకాశం వారికి ఉంటుందని, ఈమేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ మార్పులు తెచ్చినా టీచర్లతో మాట్లాడాలి స్కూళ్ల పనితీరుపై సోషల్ ఆడిట్ ద్వారా ర్యాంకింగ్‌లు ఇస్తామంటూ అధికారులు ప్రతిపాదించగా ఇలాంటి ఏ మార్పులు ప్రవేశపెట్టినా ముందుగా టీచర్లతో మాట్లాడాలని సీఎం స్పష్టం చేశారు. చిరునవ్వుతో వారిని ఆహ్వానించి అభిప్రాయాలు తెలుసుకోవాలని, అయోమయానికి, గందరగోళానికి దారితీసేలా ఉండకూడదన్నారు. లేదంటే దీనివల్ల అపోహలు పెరుగుతాయని, వాటిని రెచ్చగొట్టి పక్కదోవ పట్టించే ప్రయత్నాలకు ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఎలాంటి సంస్కరణలు, మార్పులు తేవాలనుకున్నా దాని వెనక ఉద్దేశాలను టీచర్లకు స్పష్టంగా చెప్పాలని సూచించారు. భాగస్వాములందరూ కలిసి ముందుకు సాగితేనే విజయవంతం అవుతుందన్నారు. ర్యాంకింగ్‌లు ఎందుకు ఇస్తున్నామో వారికి స్పష్టంగా చెప్పాలని సీఎం సూచించారు. వెంటనే టీచర్ల మ్యాపింగ్ టీచర్ల మ్యాపింగ్‌ను వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధించే విధానాన్ని వీలైనంత త్వరగా తేవాలని సూచించారు. ఈ నెలాఖరు నాటికి మ్యాపింగ్ పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. పాఠ్యప్రణాళికను మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలని, దీనిపై తర్వాత సమావేశంలో వివరాలు అందించాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ వెనుకబడ్డామో తెలుసుకునేలా సోషల్ ఆడిట్ ఎక్కడ వెనకబడి ఉన్నామో తెలుసుకోవడమే లక్ష్యంగా సోషల్ ఆడిట్ విధానం ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి విధానాలు టీచర్లను తొలగించడానికో లేదా వారిని అభద్రతా భావానికి గురి చేయడానికో కావనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని అధికారులను ఆదేశించారు. తప్పులు వెతకడానికి, ఆ తప్పులకు బాధ్యులను చేయడానికీ ఈ విధానాలు కావనే విషయాన్ని పదేపదే చెప్పాలన్నారు. స్కూళ్లను నడిపే విషయంలో, విద్యార్థులకు బోధన అందించే విషయంలో, నాణ్యతను పాటించే విషయంలో ఎక్కడ వెనుకబడి ఉన్నామనే విషయాన్ని తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ సోషల్ ఆడిటింగ్ ఉండాలని సీఎం ఆదేశించారు. ఎయిడ్ స్కూళ్లపై బలవంతం లేదు ఎయిడెడ్ స్కూళ్లను ఎవరూ బలవంతం చేయడం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎయిడెడ్ యాజమాన్యాలు విద్యాసంస్థను అప్పగిస్తే ప్రభుత్వమే నడుపుతుందని, లేదా వాళ్లే నడపాలనుకుంటే వారే నిర్వహించుకోవచ్చనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. ఇందులో ఎలాంటి బలవంతం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని, ఇది స్వచ్ఛందం అనే విషయాన్ని చెప్పాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 91 % హాజరు కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరుపైనా ఆరా తీశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పాఠశాలలపై కరోనా ప్రభావం పెద్దగా లేదని అధికారులు తెలిపారు. టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తైనందున చురుగ్గా విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో కలిపి ఆగస్టులో పిల్లల హాజరు 73 శాతం ఉండగా సెప్టెంబరులో 82 శాతానికి పెరిగిందని, అక్టోబరులో ఇప్పటిదాకా 85 శాతం నమోదైందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91 శాతం ఉందని వెల్లడించారు. ► విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ,ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ (దిశ స్పెషల్ ఆఫీసర్) కృతికా శుక్లా, ఎండీఎం అండ్ శానిటేషన్ డైరెక్టర్ బీఎం దివాన్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (ఎస్సీఈఆర్టీ) బి.ప్రతాప్ రెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
9, 10 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి పథకం కింద ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్యుయెల్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 ఇంచ్‌ల స్క్రీన్, విండోస్ 10 (ఎస్టీఎఫ్ మైక్రోసాఫ్ట్), ఓపెన్ ఆఫీస్ (ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్)ల కాన్ఫిగరేషన్‌తో ల్యాప్‌టాప్‌లు అందించనుంది. వీటికి మూడేళ్ల వారెంటీ ఉంటుంది. అమ్మఒడి ఆర్థిక సాయానికి బదులు తమకు ల్యాప్‌టాప్‌లు కావాలని కోరుకునే విద్యార్థులకు వీటిని అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లకు మెయిన్టెనెన్స్ సమస్యలు ఎదురైతే ఫిర్యాదు ఇచ్చిన వారంలోపు పరిష్కరించేలా సదరు కంపెనీకి షరతు విధిస్తున్నారు. ఫిర్యాదులను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాల్సి ఉంటుంది. -
‘అయ్యన్న వ్యాఖ్యలు అర్థరహితం.. అమ్మ ఒడి సొమ్ము భద్రం’
ఆరిలోవ(విశాఖ తూర్పు): డీఈవో జాయింట్ అకౌంట్లోని అమ్మఒడి సొమ్ము రూ.3.42 కోట్లు భద్రంగా ఉందని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఖాతా నుంచి రూ.30 లక్షలు విత్‌డ్రా చేసి దుర్వినియోగం చేశారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అమ్మ ఒడి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చేపట్టినప్పటి నుంచి వరుసగా రెండేళ్ల పాటు జిల్లాలో అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. 2019–20లో పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ, ఇతర అవసరాల కోసం విద్యార్థుల తల్లులు స్వచ్ఛందగా రూ.1000 చొప్పున అందజేశారని తెలిపారు. ఈ మొత్తాన్ని డీఈవో జాయింట్ అకౌంట్లో జమ చేశామన్నారు. ప్రస్తుతం ఆ నగదు రూ.3.42 కోట్లు పదిలంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఖాతా నుంచి రూ.30 లక్షలు విత్‌డ్రా చేసి దుర్వినియోగం చేశారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఈ నగదు నిల్వపై ఇంతవరకు ఎలాంటి ఆడిట్ జరగలేదన్నారు. ప్రస్తుతం నాడు–నేడు నిధులతో జిల్లాలోని పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పథకంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు. దీంతో ప్రత్యేకంగా ఎక్కడా అమ్మ ఒడికి సంబంధించిన డబ్బులు వినియోగించలేదని స్పష్టం చేశారు. ఎప్పుడైనా వాటి అవసరం వస్తే ప్రభుత్వం ఆదేశాల మేరకు.. విత్ డ్రా చేసి పాఠశాలల్లో పనులు జరిపిస్తామన్నారు. దీనికి సంబంధించిన వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ మంత్రి అధికారులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. చదవండి: భావోద్వేగాలను రెచ్చగొట్టడం తగదు -
ప్రతి పల్లెకు ఇంటర్నెట్తో ‘వర్క్ ఫ్రమ్ హోం’: సీఎం జగన్
తాడేపల్లి: ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ ఏర్పాటు, అమ్మఒడి పథకంలో భాగంగా ఆప్షన్‌గా ఇవ్వాల్సిన ల్యాప్‌టాప్‌లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేశారు. మంత్రి బాలినేని, ఏపీ ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. అన్ని గ్రామాలకు అపరిమితంగా ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉండాలని, సీఎంఏ స్పీడ్ కనెక్షన్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. అన్ని గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు ఉండాలని చెప్పారు. స్వగ్రామంలోనే వర్క్ ఫ్రం హోం సదుపాయం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లోనూ ఇంటర్నెట్ కనెక్షన్లు ఉండాలని తెలిపారు. నిర్ణీత వ్యవధిలోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి 9న ల్యాప్‌టాప్‌లు అందించాలి అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌లు కోరుకున్నవారందరికీ జనవరి 9వ తేదీన అందించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ల్యాప్‌టాప్‌లతో పాటు గ్యారెంటీ, వారంటీ కార్డులివ్వాలని తెలిపారు. ల్యాప్‌టాప్ చెడిపోతే సర్వీస్ సెంటర్‌కు పంపి వారంలో తిరిగి ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటివరకు 307 మండలాల్లోని 3,642 గ్రామాల్లో 14,671 కిలో మీటర్ల మేర ఏరియల్ కేబుల్ వేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఎం.గిరిజాశంకర్ సీఎంకు వివరించారు. మరోవైపు 690 చదరపు అడుగుల విస్తీర్ణంతో వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు నిర్మిస్తున్నట్లు, ఒక్కో లైబ్రరీకి రూ.16 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ప్రతి లైబ్రరీలో 20 సీట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశానికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, ఏపీ ఫైబర్‌నెట్ సంస్థ ఎండీ మధుసూధన్‌రెడ్డి, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
‘అమ్మ ఒడి’ నగదు బదులు ల్యాప్ టాప్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద 2021–22 విద్యా సంవత్సరం నుంచి అర్హులైన 9–12 తరగతుల విద్యార్థుల తల్లులు కోరుకున్నట్లయితే వారి పిల్లల విద్యా వికాసం కోసం నగదు బదులు ల్యాప్‌టాప్‌లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అర్హులైన తల్లులందరికీ తెలియచేసి, వారి ఆమోదం మేరకు నగదు లేదా ల్యాప్‌టాప్స్‌ను అందించనున్నారు. తల్లుల అభీష్టం తెలుసుకొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా బుధవారం వారికి లేఖ రాశారు. ఈ లేఖను 9–12 తరగతుల విద్యార్థుల తల్లులందరికీ అందించి వారి అభీష్టం తెలుసుకొని తిరిగి ప్రభుత్వానికి తెలియ చేయాలని పాఠశాల విద్యా శాఖ ప్రాంతీయ విద్యాశాఖాధికారులు, జిల్లా విద్యాధికారులకు విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. సీఎం రాసిన లేఖ ప్రతి కాపీని వారందరికీ పంపించి, తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకునేందుకు స్పష్టమైన విధానాన్ని సూచించింది. ► సీఎం రాసిన లేఖను డీసీఈబీల ద్వారా ఏప్రిల్ 10వ తేదీలోపు ముద్రించాలి. ► ఆ లేఖను మండల విద్యాధికారుల ద్వారా ప్రభుత్వ, ప్రయివేటు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, కళాశాలల ప్రిన్సిపాళ్లకు విద్యార్థుల సంఖ్య మేరకు ఏప్రిల్ 15లోపు అందించాలి. ► ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు 9–12 తరగతుల విద్యార్థులతో ఏప్రిల్ 19న సమావేశమై సీఎం లేఖలోని అంశాలను వివరించాలి. విద్యార్థులు ఆ లేఖను ఇళ్లకు తీసుకువెళ్లి తమ తల్లులు లేదా సంరక్షకులకు చూపించి వారి అభీష్టాన్ని లేఖపైన రాయించాలి. తిరిగి ఆ లేఖను ఏప్రిల్ 22న ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు అందించాలి. ► విద్యార్థులు అందించిన అంగీకార పత్రంలోని అంశాలను ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ఏప్రిల్ 26వ తేదీలోగా ‘అమ్మ ఒడి’ వెబ్సైట్లో పొందుపరచాలి. అనంతరం ఆ అంగీకార పత్రాలను పాఠశాల, కళాశాలల రికార్డుల్లో భద్ర పరచాలి. అక్కచెల్లెమ్మలకు నమస్కారం.. ‘జగనన్న అమ్మఒడి’ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుకున్న, అందుకోనున్న ప్రతి అక్క, చెల్లెమ్మకు హృదయ పూర్వకంగా నమస్కరిస్తూ ఈ ఉత్తరం రాస్తున్నాను. మన రాష్ట్రంలో నిరుపేద తల్లులు పిల్లలను చదివించుకోడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం నేరుగా అందజేస్తే కష్టాలు కొంత వరకైనా తీరతాయని, మీ కలలు నెరవేరుతాయని భావించాను. అందుకోసం నవరత్నాలులో భాగంగా ‘అమ్మఒడి’ పథకం ప్రారంభించి ఆదుకుంటానని మాట ఇచ్చాను. ఆ మాట నిలుపుకుంటూ గత రెండు సంవత్సరాలుగా ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు అర్హులైన, చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.15,000 చొప్పున ఎలాంటి ఆటంకం లేకుండా నేరుగా బదిలీ చేసిన సంగతి మీకు తెలుసు. ఈ పథకం రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశంలోనూ అందరి దృష్టిని ఆకర్షించింది. పుట్టిన ప్రతి బిడ్డకు అమ్మ ఒడి శ్రీరామరక్ష అయితే చదువులమ్మ బడిలో ఎదిగే పిల్లలకు ‘అమ్మఒడి’ పథకం శ్రీరామరక్ష లాంటిది. అమ్మఒడి ఒక్కటే కాకుండా ‘జగనన్న గోరుముద్ద’, ‘మనబడి నాడు – నేడు’, ‘జగనన్న విద్యా కానుక’ వంటి వినూత్న పథకాలు ప్రవేశ పెట్టి రాష్ట్రంలో ప్రతి పేదబిడ్డ తలరాత మార్చే దిశగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న సంగతి కూడా మీకు తెలుసు. అయితే, కోవిడ్ మహమ్మారి లాంటి సమయంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తే, ప్రభుత్వ బడులలో చదివే పేదింటి పిల్లలు చదువుకు దూరం కావడాన్ని మనమంతా చూస్తున్నాం. ఈ పరిస్థితి మారాలని, ఈ తరం పిల్లలు ఇంగ్లిష్ మీడియం, కంప్యూటర్ల వాడకానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో వచ్చే ఏడాది నుంచి 9 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మీరు కోరుకుంటే నగదు బదులు ల్యాప్‌టాప్ ఇవ్వాలని నిర్ణయించాం. దీంతో పాటు గ్రామ గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నాం. పదేళ్ల తర్వాత ప్రపంచం మరింత ముందుకు పోనున్నది. మారబోయే ప్రపంచంలో ఈ పిల్లలు వెనక బడకూడదనే బాధ్యతతో మీ పిల్లలకు మేనమామగా మీకు ఈ సూచన చేస్తున్నాను. బ్రాండెడ్ ల్యాప్టాప్స్ డ్యూయెల్ కోర్ (దానికి సమానమైన ప్రాసెసర్), 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 ఇంచుల తెర (స్క్రీన్), విండోస్ 10 (ఎస్టీఎఫ్), మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఆఫీస్, 3 సంవత్సరాల వారంటీతో ఉంటుంది. అవసరమైతే 7 రోజులలోనే రీప్లేస్మెంట్ లేదా రిపేర్ బాధ్యత గ్రామ సచివాలయం ద్వారా సంబంధిత కంపెనీ వారే చేస్తారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ (మొబైల్ డివైస్ మేనేజ్మెంట్) ఇన్స్టాల్ చేసి ఇవ్వడం ద్వారా చెడు / హానికర వెబ్‌సైట్స్‌ను నిరోధించి వాటి ప్రభావం పిల్లలపై పడకుండా ఉండేలా చేయడం జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో ల్యాప్ టాప్స్ కొనుగోలు చేస్తున్నందున మార్కెట్లో దాదాపు రూ.25 వేలు – రూ.27 వేలు ఉన్న బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.18,500కే అందించడం జరుగుతుంది. ఈ బ్రాండెడ్ ల్యాప్ టాప్స్‌తో మీ పిల్లలు ఈ కింది విధమైన పనులు చేసుకోవచ్చు. ► ఆన్లైన్లో పాఠాలు వినొచ్చు. ► ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో చదువుకు సంబంధించి వీడియోలు చూసుకోవచ్చు. ► డిజిటల్ రూపంలో ఉన్న పుస్తకాలు చదువుకోవచ్చు. ► ఇంటర్నెట్లో చదువుకు సంబంధించి అపారంగా సమాచారాన్ని వెతకొచ్చు. ► ఈ మెయిల్ ఇవ్వవచ్చు. పొందవచ్చు. ► మైక్రోసాఫ్ట్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటి వాటితో ప్రాజెక్టు పనులు చేయవచ్చు. కాబట్టి మీ బిడ్డకు ‘అమ్మఒడి’ పథకంలో నగదు బదులు ల్యాప్‌టాప్ కోరుకున్నట్లయితే మీ అంగీకారాన్ని ప్రధానోపాధ్యాయుల ద్వారా తెలియజేయవలసినదిగా కోరుతున్నాను. - మీ ఆత్మీయ వైఎస్ జగన్ (వైఎస్ జగన్మోహన్రెడ్డి) ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ -
Jagananna Amma Vodi: ‘అమ్మ ఒడి’ పిలిచింది
సాక్షి, కామారెడ్డి (తెలంగాణ): కొన్నేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని తెలంగాణకు వలస వచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తాపీ మేస్త్రీలు, కూలీలు, కార్మికులను ‘అమ్మ ఒడి’ పథకం ఆకర్షిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగ అభివృద్ధికి తీసుకున్న విప్లవాత్మక చర్యలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వారి పిల్లలను సొంతూరిలో చదివించేలా చేస్తున్నాయి. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వైఎస్సార్, కర్నూలు, ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన తాపీ మేస్త్రీలు, సెంట్రింగ్ వర్కర్లు, కూలీలు, ఇతర వృత్తులకు చెందిన వేలాది కుటుంబాలు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్నాయి. చాలా మంది భార్య, పిల్లలతో కలసి అద్దె ఇళ్లల్లో ఉంటూ పనులు చేసుకుని బతుకుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని వీరు ఇంత కాలం తాము పని చేస్తున్న చోట పిల్లలను ప్రైవేటు బడుల్లో చేర్పించి, రూ.వేలల్లో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చింది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే రీతిలో బడులను తీర్చిదిద్దింది. దీనికి తోడు పిల్లలను బడికి పంపితే ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15 వేలు జమ చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది మేస్త్రీలు, కూలీలు తమ పిల్లలను సొంతూళ్లకు తీసుకెళ్లి అక్కడి బడుల్లో చేర్పించారు. ఒక్క కామారెడ్డి ప్రాంతంలోనే దాదాపు 180 మంది మేస్త్రీలు, వర్కర్లు తమ పిల్లల్ని సొంతూళ్లలో చేర్పించారు. నానమ్మ దగ్గరో, అమ్మమ్మ దగ్గరో వాళ్లను ఉంచి బడులకు పంపుతున్నారు. ఫీజులు కట్టే భారం తగ్గింది మాది ప్రకాశం జిల్లా పనులూరు మండలం యాంపాడు గ్రామం. నేను, నా భార్య శ్యామల, పిల్లలతో కలసి కామారెడ్డిలో ఉంటున్నాం. నా కొడుకు బన్నీ ఇప్పుడు ఏడో తరగతి చదువుతున్నాడు. కామారెడ్డిలో ప్రైవేటు బడిలో చదివించాను. ఏడాదికి రూ.16 వేల నుంచి రూ.18 వేల ఫీజు కట్టాను. మా దగ్గర సీఎం జగన్ అమ్మ ఒడి పథకం తీసుకురావడంతో పాటు అక్కడ స్కూళ్లల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో నా కొడుకును వెంగళాపూరం స్కూల్లో చేర్పించాను. వాళ్ల అమ్మమ్మ ఇంట్లో ఉండి రోజూ వెళ్లి వస్తున్నాడు. అమ్మ ఒడి ద్వారా రూ.15 వేలు నా భార్య ఖాతాలో జమ అయ్యాయి. ప్రైవేటులో ఫీజులు కట్టే భారం తగ్గింది. సీఎం జగన్ చేసిన మేలు మరిచిపోలేం. – గడిపూడి బ్రహ్మయ్య, తాపీ మేస్త్రి, కామారెడ్డి ఇద్దరు కూతుళ్లను చేర్పించా మాది ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం గరుగుపాలెం గ్రామం. పిల్లల చదువులకు ఇక్కడ వేలకు వేలు ఖర్చయ్యేవి. ఏపీ సీఎం జగన్ అమ్మ ఒడి పథకం తీసుకువచ్చిన తర్వాత నా ఇద్దరు కూతుళ్లు మాలశ్రీ, మాధురిలను లింగసముద్రంలోని హాస్టల్లో చేర్పించాను. పిల్లలిద్దరు బాగా చదువుతున్నారు. ఏడాదికి రూ.15 వేలు అమ్మ ఒడి కింద ఇస్తున్నారు. పండుగల సమయంలో ఇంటికి వెళ్లినపుడు పిల్లలను కలిసి వస్తున్నాం. సీఎం జగన్ చేస్తున్న సాయం ఎంతో ఉపయోగపడుతోంది. – బుగ్గవరపు కొండయ్య, తాపీ మేస్త్రి, కామారెడ్డి చదువు విషయంలో మంచి నిర్ణయాలు మాది ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం గంగపాలెం గ్రామం. నేను, నా భార్య వెంకాయమ్మ, పిల్లలతో కలసి కామారెడ్డిలో ఉంటున్నాం. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ స్కూళ్లల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో మా కొడుకు చంద్రమాధవ్‌ను తిమ్మారెడ్డిపాలెంలోని మోడల్ స్కూల్లో చేర్పించాను. చదువు చాలా బాగా చెబుతున్నారు. ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. ఇక్కడ చదివిస్తే అధికంగా ఫీజులు కట్టాల్సి వచ్చేది. సీఎం జగన్ చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. – దేవూరి వెంకట్రావ్, తాపీ మేస్త్రి, కామారెడ్డి చదువు బాగా చెబుతున్నారు మాది ప్రకాశం జిల్లా లింగారెడ్డిపల్లి. నేను.. నా భార్య, కొడుకు, కూతురుతో కలసి కామారెడ్డిలో ఉంటున్నా. ఇక్కడ ప్రైవేటు బడిలో చదివించడానికి డబ్బు బాగా ఖర్చయ్యేది. ఏపీలో అమ్మ ఒడి పథకం తీసుకువచ్చిన తర్వాత అక్కడ స్కూళ్లు మెరుగయ్యాయని తెలిసి నా కొడుకు నవదీప్‌ను తీసుకువెళ్లి మా ఊరి స్కూల్లో 2వ తరగతిలో చేర్పించా. మా అమ్మా, నాన్న దగ్గర ఉంటున్నాడు. మొన్న అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి. ప్రభుత్వ స్కూల్ అయినా చదువు బాగానే చెబుతున్నారు. – సీలం లక్ష్మీనారాయణ, సెంట్రింగ్ మేస్త్రి, కామారెడ్డి స్కూళ్లు బాగు చేసి మేలు చేశారు మాది ప్రకాశం జిల్లా మండాదివారిపల్లి గ్రామం. నేను, నా భార్య సుధాహాసిని, పాప వైష్ణవితో కలసి కామారెడ్డిలో ఉంటున్నాం. మా పాపను ఇక్కడ ప్రైవేటు స్కూల్లో చదివించాను. ఏడాదికి రూ.15 వేలకు పైగా ఖర్చయ్యేవి. ఏపీలో సీఎం జగన్ స్కూళ్లు బాగు చేశారు. అమ్మ ఒడి కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నారని తెలియగానే మా పాపను వాళ్ల అమ్మమ్మ ఊరు కంచర్లవారిపల్లిలోని ప్రభుత్వ బడిలో చేర్పించాను. ఇప్పుడు నాలుగో తరగతి చదువుతోంది. రూ.15 వేలు అమ్మ ఒడి డబ్బులు నా భార్య ఖాతాలో జమ అయ్యాయి. – పాలకొల్లు చిన్న వెంకటేశ్వర్లు, సెంట్రింగ్ మేస్త్రి, కామారెడ్డి -
గ్రామాలకు నిరంతరాయంగా ఇంటర్నెట్
అమ్మఒడి, వసతి దీవెన లబ్ధిదారుల్లో 9 నుంచి 12వ తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థుల్లో ఆప్షన్‌గా కోరుకున్న వారికి ల్యాప్‌టాప్ అందించడంపై దృష్టి సారించాలి. ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్యలను అభ్యసిస్తున్న వారి అవసరాలు తీర్చేలా మరిన్ని స్పెసిఫికేషన్లతో కూడిన ల్యాప్‌టాప్‌లు ఇచ్చేలా ఆలోచించాలి. పంచాయతీ నుంచి గ్రామంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి సరైన వ్యవస్థ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలి. గ్రామాల్లో నెట్వర్క్ పాయింట్ వద్ద ఇంటర్నెట్ లైబ్రరీ ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాలి. తద్వారా సొంత గ్రామాల్లోనే ఉంటూ ఇంటి నుంచే పని చేసే (వర్క్ ఫ్రం హోం) అవకాశం ఉంటుంది. ల్యాప్‌టాప్ చెడిపోతే.. దాన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో ఇస్తే, వారం రోజుల్లో మరమ్మతు చేసి ఇవ్వాలి. లేదా రీప్లేస్ చేయాలి. ఇందుకోసం కంపెనీ నిర్వహణను ఏడాది కాకుండా మూడేళ్లు పెట్టాలి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని గ్రామాలకు అంతరాయం లేని అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం లక్ష్యంగా నెట్వర్క్ వ్యవస్థ ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామంలో నెట్వర్క్ పాయింట్ నుంచి ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని, వినియోగదారులు ఏ సామర్థ్యం కనెక్షన్ కావాలన్నా ఇచ్చేలా ఉండాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు, అమ్మ ఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల పంపిణీపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ‘అమ్మ ఒడి’ చెల్లింపుల నాటికి కోరుకున్న వారికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలన్నారు. ప్రతి గ్రామానికీ అన్ లిమిటెడ్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోయి.. అవాంతరాలు వచ్చే పరిస్థితి ఉండకూడదని, అలాంటి సమస్యలను అధిగమించేలా ఆ వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. ‘వైఎస్సార్ జగనన్న కాలనీల్లోకి కూడా ఇంటర్నెట్ నెట్వర్క్ తీసుకు రావాలి. ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలి. హెచ్‌టి లైన్ నుంచి సబ్‌స్టేషన్ వరకు, సబ్‌స్టేషన్ నుంచి పంచాయతీల వరకు అండర్ గ్రౌండ్ కేబుల్ తీసుకెళ్లే ఆలోచనతో ముందుకు సాగాలి. గ్రామ పంచాయతీ వరకు అన్ లిమిటెడ్ నెట్‌వర్క్‌ను తీసుకెళ్లాలి’ అని చెప్పారు. ఈ సమీక్షలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ ఎన్.శ్రీకాంత్, ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఛైర్మన్ పి.గౌతంరెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఎండీ ఎం.మధుసూదన్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అమ్మ ఒడి లబ్ధిదారుల్లో బీసీలే అత్యధికం
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారుల్లో వెనుకబడిన వర్గాలకు (బీసీ) చెందిన తల్లులే అత్యధికంగా ఉన్నారు. జనాభాలో ఎక్కువ శాతం బీసీ వర్గాలే. అందుకు అనుగుణంగానే అమ్మ ఒడి లబ్ధిదారులు కూడా ఉన్నారు. కులమతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీంతో బీసీల తర్వాత ఎక్కువగా ఓసీల్లోని పేద వర్గాలు అమ్మ ఒడి లబ్ధిదారులుగా ఉన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో బీసీలు 23.48 లక్షల మంది ఉండగా.. 9.29 లక్షల మంది ఓసీలు ఉన్నారు. 8.84 లక్షల మంది ఎస్సీలు, 2.86 లక్షల మంది ఎస్టీలు ఉన్నారు. -
ఇళ్ల పట్టాలకు రాక్షసుల్లా అడ్డుతగులుతున్నారు..
తాడేపల్లి: రాష్ట్రంలోని దుష్ట శక్తులన్ని ఏకమై ప్రజా సంక్షేమానికి అడ్డు తగులుతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రారంభించే సమయంలో దేవాలయాలపై జరుగుతున్నదాడుల వెనుక భారీ కుట్ర కోణం దాగివుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. సున్నితమైన అంశాలను రెచ్చగొట్టడం ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్మోహన్రెడ్డిపై బురద చల్లే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబే ఈ కుట్రలకు నాయకత్వం వహిస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుంటే కొందరు రాక్షసుల్లా అడ్డుతగులుతున్నారని సజ్జల దుయ్యబట్టారు. ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా 31 లక్షల అడపడుచుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం జరుగుతంటే, వాటిని చీకటితో చెరిపేసే ఉద్దేశంలో చంద్రబాబు అండ్ కో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో భక్తిని, మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ వినకుండా దేవుళ్ళతో ఆటలాడుకోవాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. విగ్రహాలు ధ్వంసం వెనుక దాగివున్న కుట్రను త్వరలో ఛేదిస్తామని, ప్రభుత్వం దానిపై సిట్ వేసిందని సజ్జల పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత అమ్మఒడి పథకానికి అడ్డు తగిలేందుకు చంద్రబాబు తన అనుంగ అనుచరుడైన నిమ్మగడ్డ రమేష్ ను మరోమారు తెరమీదకు తెచ్చారని, కానీ వారి పాచికలు పారలేదని సజ్జల పేర్కొన్నారు. ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించిన నిమ్మగడ్డకు కోర్టు అక్షింతలు వేసిందని అన్నారు. ఈ వరుస పరిణామాలన్ని గమనిస్తే ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబే కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారన్న విషయం స్పష్టమవుతోందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటే చంద్రబాబు నాయకత్వంలోని దుష్టశక్తులు కుట్రలకు పాల్పడుతూ ప్రజాసంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. -
‘అమ్మ ఒడి’లో ల్యాప్‌టాప్
‘‘పుట్టిన ప్రతి బిడ్డకు అమ్మ ఒడి శ్రీరామరక్ష అయితే చదువులమ్మ బడిలో ఎదిగే పిల్లలకు అమ్మ ఒడి పథకం శ్రీరామరక్ష లాంటిది’’ కోవిడ్ సమయంలో పెద్ద స్కూళ్లు, కాలేజీలు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తే.. ప్రభుత్వ బడుల్లో చదివే పేదింటి పిల్లలు చదువుకు దూరం కావడాన్ని మనమంతా చూస్తున్నాం. ఈ పరిస్థితి మారాలని, ఈ తరం పిల్లలు ఇంగ్లిష్ మీడియం, కంప్యూటర్ల వాడకానికి దూరం కారాదనే ఉద్దేశంతో వచ్చే ఏడాది నుంచి అమ్మ ఒడి ద్వారా మీరు కోరుకుంటే నగదుకు బదులుగా ల్యాప్‌టాప్ ఇవ్వాలని నిర్ణయించాం. పదేళ్ల తర్వాత మారిన తరంలో ఈ పిల్లలు వెనుకబడకూడదనే బాధ్యతతో ఒక అన్నగా, తమ్ముడిగా, మీ పిల్లలకు మేనమామగా ఇది చేస్తున్నా – సీఎం వైఎస్ జగన్ సాక్షి , నెల్లూరు: రాష్ట్రంలో చదువుల విప్లవాన్ని తెచ్చి 19 నెలల్లో విద్యారంగంపై రూ.24 వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బడి వయసు పిల్లలంతా వంద శాతం చదువుకునేలా వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పిల్లలకు ఓటు హక్కు లేదని గత పాలకులు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. పిల్లలకు ఓటు హక్కు లేకపోయినా ఒక మేనమామగా వారి మంచి చెడులను చూడడం తన బాధ్యతని స్పష్టం చేశారు. సోమవారం నెల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం రెండో ఏడాది నగదు జమ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. అమ్మ ఒడి ద్వారా 84 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలిగేలా 44.48 లక్షల మందికిపైగా తల్లుల ఖాతాల్లో రూ. 6,673 కోట్ల నగదును బటన్ నొక్కడం ద్వారా నేరుగా జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే ఏడాది నుంచి అమ్మ ఒడి కింద నగదుకు బదులుగా తల్లులు కోరుకుంటే ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించారు. పథకంలో కొత్త ఆప్షన్‌ను చేర్చి 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు దీన్ని వర్తింప చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్ యాదవ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలివీ... నెల్లూరు సభలో అమ్మ ఒడి నగదును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రైవేట్ స్కూళ్ల నుంచి 4 లక్షల మంది సర్కారు బడులకు.. స్కూలు ఫీజులు కట్టలేక తమ పిల్లలను కూలి పనులకు పంపుతున్న పరిస్థితులను 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో చూశా. ఇలాంటి పరిస్థితులను మార్చేందుకే అమ్మఒడి పథకాన్ని తెచ్చాం. 42.33 లక్షల మంది పేద తల్లులకు గతేడాది రూ.6,400 కోట్లు ఇచ్చాం. ఈ సంవత్సరం 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,673 కోట్లు అమ్మఒడి కింద ఇస్తున్నాం. గతేడాది 82 లక్షల మంది పిల్లలకు లాభం కలిగితే ఈ ఏడాది 84 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతోంది. మరో రెండు లక్షల మందికి ఈ పథకం ద్వారా మేలు జరుగుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో గతంలో దాదాపు 38 లక్షల మంది విద్యార్థులుంటే ఇప్పుడు 42 లక్షల మంది ఉన్నారు. నాలుగు లక్షల మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. కోవిడ్ సమయంలో కూడా అమ్మఒడి పారదర్శకంగా ఇస్తుండటంతో తమ పిల్లలను వారి మేనమామ చూసుకుంటాడన్న నమ్మకం అక్కచెల్లెమ్మల్లో పెరిగింది. బడికి రాకపోతే వెంటనే మెసేజ్.. ఇక నుంచి పిల్లలు బడికి రాకపోతే వెంటనే తల్లిదండ్రుల ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. మూడో రోజు వలంటీర్ నేరుగా ఇంటికి వచ్చి పిల్లల యోగ క్షేమాలను విచారిస్తారు. పిల్లలను బడికి పంపే బాధ్యత తల్లిదండ్రులదైతే తీసుకొచ్చే బాధ్యతను గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఉన్న ఉద్యోగులు, వలంటీర్లు, పేరెంట్స్ కమిటీతో పాటు టీచర్ల మీద పెడుతున్నాం. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ –1, వైఎస్సార్ప్రీ ప్రైమరీ – 2, వైఎస్సార్ ప్రీ ఫస్ట్ క్లాస్‌గా మార్చి ఇంగ్లిష్ మీడియంకు శ్రీకారం చుడుతున్నాం. అంగన్వాడీల రూపు రేఖలు మార్చడానికి మరో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సంపూర్ణ పోషణ పథకం కోసం ఏటా రూ.1,870 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఏటా రూ.550 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. టాయిలెట్స్ లేక చదువులు మానేస్తున్న దుస్థితి.. బడుల్లో సరైన టాయిలెట్స్ లేకపోవడం వల్ల 12 నుంచి 23 శాతం వరకు ఆడ పిల్లలు చదువు మానేస్తున్నారని యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. టాయిలెట్స్ మీద మనం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి మీద రూ.34 ఫలితం వస్తుందని ప్రపంచ బ్యాంకు నివేదికలు చెబుతున్నాయి. అందుకే అమ్మ ఒడి ద్వారా మార్పు కోసం శ్రీకారం చుట్టాం. మేం రూ.వెయ్యి ఇచ్చాం, టాయిలెట్లు ఎందుకు బాగాలేవని హెడ్మాస్టర్లను ప్రశ్నించవచ్చు. సక్రమంగా నిర్వహించకుంటే 1902కు డయల్ చేస్తే సీఎం ఆఫీస్ రంగ ప్రవేశం చేస్తుంది. పుస్తకాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. అమ్మఒడి ద్వారా ఇస్తున్న సొమ్మును తమ పిల్లల కోసం మరింత మెరుగ్గా వినియోగించుకునేలా వచ్చే ఏడాది నుంచి ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక ఆప్షన్ ఇస్తున్నాం. 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల తల్లులు కావాలంటే నగదుకు బదులుగా ల్యాప్‌టాప్ తీసుకోవచ్చు. బయట మార్కెట్లో రూ.25 వేల నుంచి రూ.27 వేల వరకు ఉండే ఈ ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లకు ప్రభుత్వం పెద్ద కంపెనీలతో చర్చలు జరిపింది. హెచ్‌పీ, డెల్, లెనోవా, ఏసర్, ఎంఐ, ఫాక్స్‌కాన్ లాంటి కంపెనీలతో చర్చలు జరపడంతో 18 శాతం జీఎస్టీ కలుపుకుని రూ.18,500కే ల్యాప్‌టాప్ ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. టెండర్లు పిలిచి రివర్స్ టెండరింగ్ జరపడం వల్ల రేటు ఇంకా తగ్గే అవకాశం ఉంది. 4 గిగాబైట్ ర్యామ్, 500 గిగా బైట్ స్టోరేజీ, ఇంటెల్ ఏఎండీ లేదా సమానమైన ప్రాసెసర్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు విండోస్ 365 స్టూడెంట్ వెర్షన్ స్పెసిఫికేషన్లు కలిగిన ల్యాప్‌టాప్‌లకు టెండర్లు పిలుస్తాం. వసతి దీవెన కింద ఆర్థిక సాయం పొందుతున్న విద్యార్థులకు కూడా ల్యాప్‌టాప్‌లు పొందే ఆప్షన్ ఇస్తాం. మూడేళ్ల పాటు వాటి వారెంటీ కూడా సంబంధిత కంపెనీపైనే పెడుతున్నాం. ఒక వేళ ల్యాప్‌టాప్ పాడైతే 7 రోజుల్లో బాగు చేసి ఇవ్వాలి. లేదంటే రీప్లేస్ చేసి ఇవ్వాలి. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. కేవలం అండర్ గ్రౌండ్స్ కేబుల్ వేయడానికే రూ.5,900 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. నిర్వహణ వ్యయం కూడా ఉంటుంది. అయినా సరే ఇది చేస్తున్నాం. ప్రతిపక్షాలకు కడుపు మంట.. రేపు బడుల మీద పడతారేమో! రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం కాబట్టి ప్రతిపక్షానికి చోటు లేకుండా పోతోందనే కడుపు మంట కనిపిస్తోంది. అది ఏ స్థాయిలో ఉందంటే.. ఎవరూ లేని చోట, రాత్రి పూట విగ్రహాలను ఎవరు ధ్వంసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ధ్వంసమైన విగ్రహాలను పరిశీలిస్తామంటూ మళ్లీ అక్కడకు వారు ఎందుకు వెళ్తున్నారో అర్థం చేసుకోండి. రథాలు ఎందుకు తగలబెడుతున్నారో, ఆ తర్వాత రథయాత్రలు ఎందుకు చేయబోతున్నారో ఆలోచించండి. మనం ప్రజలకు మంచి చేసే ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా సరిగ్గా ఒకటి రెండు రోజులు అటు ఇటుగా చీకట్లో వెళ్లి గుడులను గోపురాలను టార్గెట్ చేస్తున్నారు. వీరంతా రేపు బడుల మీదా పడతారేమో.. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. మన కుటుంబాలు ఎదుగుతుంటే, సమాజంలో మంట పెట్టడానికి వస్తున్న వారికి బుద్ధి చెప్పాలని కోరుతున్నా. బడికి వచ్చే పిల్లలు ముఖ్యంగా ఆడ పిల్లలు, మహిళా టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో టాయిలెట్లను నిర్మించడమే కాకుండా నిర్వహణ కోసం అమ్మ ఒడిలో ఇచ్చే రూ.15 వేలల్లో రూ.1,000 మినహాయిస్తున్నాం. ఇంత డబ్బు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి ఈ వెయ్యి రూపాయలు ఎక్కువ కాకపోయినా పిల్లల చదువుకునే బడి, పరిశుభ్రతను వారి డబ్బుతోనే నిర్వహిస్తే జవాబుదారీతనం, పరిస్థితులు మెరుగు పడతాయనే ఉద్దేశంతో మినహాయిస్తున్నాం. దైవ భక్తి లేని వారు.. దేవాలయ భూములు కాజేసిన వారు.. పట్టపగలు గుడులను కూల్చిన వారు.. చివరికి అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసిన వారు ఇవాళ ఉన్నట్లుండి కొత్త వేషాలు కడుతున్నారు. దేవుడి మీద ప్రేమ ఉన్నట్లు డ్రామాలాడుతున్నారు. కోవిడ్‌కు భయపడి ప్రతి పక్షనేత, ఆయన కుమారుడు హైదరాబాద్‌లో దాక్కుంటున్నారు. సామాన్య ప్రజలు చస్తే ఎంత? బతికితే ఎంత? అని ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్న బాబు కోవర్టులు పదవుల్లో ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. పేదలకు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తే అడ్డు తగులుతూ ఏకంగా దుర్మార్గపు ఆర్డర్లు ఇస్తున్న పరిస్థితిని గమనించాలని కోరుతున్నా. మామ మనసు చాలా గొప్పది.. దేశంలోనే అద్భుతమైన పథకం అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏటా రూ.15 వేలు జగన్ మామ జమ చేస్తున్నారని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గిద్దలూరు హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న టి.ఆశ్రిత ఆనందం వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాలను సీఎం జగన్ ప్రవేశ పెట్టారని గుర్తు చేసింది. ఇంగ్లిష్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టి పేదల పట్ల జగన్ మామ గొప్ప మనసును చాటుకున్నారని పేర్కొంది. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చక్కటి సదుపాయాలు సమకూర్చారని, బ్లాక్ బోర్డులు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ బాగు చేశారని, తమ కుటుంబంలో నాలుగు పథకాల ద్వారా లబ్ధి పొందామని తెలియచేస్తూ జగన్ మామకు కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి సీఎం ఉంటే నేనూ చదివేదాన్ని.. ఇళ్లలో పనులు చేసుకుంటూ పొట్ట పోషించుకునే నేను మా అమ్మాయిని ప్రైవేట్ స్కూల్లో చేర్చి ఎనిమిదేళ్లు ఫీజులు కట్టలేక అల్లాడిపోయాను. ఇక నావల్ల కాదని భావించి నాతోపాటు పనికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా. ఆ సమయంలో అమ్మఒడి ద్వారా నా కోరిక నెరవేరింది. జగనన్న విద్యాకానుక ద్వారా ఇచ్చిన వస్తువులు బయట కొనాలంటే రూ.7 వేలు అయ్యేవి. ఆ వస్తువులు రూ.10 వడ్డీతో ప్రైవేట్ స్కూళ్లలో కొనుగోలు చేయాల్సి వచ్చేది. నా చిన్నప్పుడు ఇలాంటి సీఎం ఉంటే నేనూ చదువుకునేదాన్ని. – వెంకట రమణమ్మ, విద్యార్థిని తల్లి, గుమ్మళ్లదిబ్బ, కోవూరు మండలం, నెల్లూరు జిల్లా అమ్మ ఒడిని అడ్డుకోవాలని చూశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటిల, నీచ రాజకీయాలతో జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూశారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. జగనన్న అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమంలో అనిల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించగా.. చంద్రబాబు కోర్టులో కేసు వేయించారన్నారు. ఇప్పుడు పేద విద్యార్థుల చదువు కోసం అమలు చేస్తున్న అమ్మఒడి సాయంతో మహిళలు మహా సంక్రాంతి జరుపుకుంటుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. అమ్మ ఒడి కార్యక్రమానికి ప్రతిపక్షం ఎన్నో అడ్డంకులు సృష్టించినా.. కుట్రల్ని ఛేదించుకుని పథకాన్ని మరింత ఎక్కువ మందికి వర్తింప చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్సార్ సంక్షేమంలో పది అడుగులు వేస్తే.. ఆయన బిడ్డగా సీఎం జగన్ వంద అడుగులు ముందుకు వేస్తున్నారన్నారు. -
పేద బిడ్డలకు పెద్ద చదువులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : గత ప్రభుత్వ హయాంలో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ బడులన్నింటిని నిర్వీర్యం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం నెల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం రెండో ఏడాది నగదు జమ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. ‘గత సర్కారు హయాంలో జూన్‌లో బడులు తెరిస్తే అక్టోబర్‌లో పుస్తకాలు ఇచ్చే దుస్థితి. మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ లేకపోగా బిల్లులు, ఆయాల జీతాలు 8 నెలలు పెండింగ్‌లో పెట్టేవారు. ఇంగ్లిష్ మీడియం కేవలం ప్రైవేట్ బడుల్లోనే ఉండేది. అక్కడ ఫీజులు ఎక్కువ కావడంతో చదివించాలంటే స్థోమత లేని పరిస్థితి. ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం మాత్రమే ఉండేది. బాత్రూమ్లు దారుణంగా ఉండేవి. వీటన్నింటితో ప్రభుత్వ బడులు శిథిలావస్థకు చేరుకున్న దుస్థితి. మరోవైపు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు విపరీతంగా పెంచేందుకు అనుమతులిచ్చి పేద పిల్లలను చదువుకు దూరమయ్యే పరిస్థితి కల్పించారు. ఈ రోజు ఆ పరిస్థితిని మార్చే పనిచేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్ర వర్ణాల్లో పేద కుటుంబాలకు చెందిన ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకుండా వారి మేనమామ పరిపాలన చేస్తున్నాడని సగర్వంగా చెబుతున్నా’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. నాడు–నేడు ద్వారా మొత్తం బడుల రూపురేఖలు మార్చేస్తున్నామని దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో తొలిదశలో 15,715 బడుల రూపు రేఖలు మార్చే పనులు ఇప్పటికే మొదలై చకాచకా జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి అక్కా, చెల్లి తనను నమ్మారని, తమ బిడ్డలను వారి మేనమామ చూసుకుంటాడనే నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నారని, అందుకే గతంలో 38 లక్షలు ఉన్న విద్యార్థుల సంఖ్య ఈ రోజు 42 లక్షలకు చేరిందన్నారు. . రాష్ట్ర మహిళలు గర్వించేలా... జగనన్న అమ్మఒడి దాదాపు 45 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఈరోజు అందుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 30.75 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రెండు వారాలుగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. విద్యా దీవెన కింద 18.52 లక్షల మందికి రూ.4,101 కోట్లు, వసతి దీవెన కింద 15.56 లక్షల మందికి రూ.1,221 కోట్లు, ఆసరా తొలి విడత కింద 87.74 లక్షల మందికి, రూ.6,792 కోట్లు, చేయూత కింద 24.55 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,604 కోట్లు, పొదుపు సంఘాలకు 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద రూ.1,400 కోట్లు, కాపు నేస్తం కింద 3.28 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.491 కోట్లు ఇచ్చాం. ఇలా ఏ కార్యక్రమం చూసినా వివక్ష, అవినీతికి తావులేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఇంటి స్థలమైనా, ఇంటి నిర్మాణమైనా అక్క చెల్లెమ్మల పేరుతోనే చేపడుతున్నాం. మహిళలు సామాజికంగా, రాజకీయంగా ఎదిగేలా అన్ని నామినేట్ పనులు, పదవుల్లో 50 శాతం వారికే ఇస్తున్నాం. ఇందు కోసం చట్టాలు చేశాం. భారతీయ మహిళా చరిత్రను ఆంధ్రప్రదేశ్‌లో తిరగరాస్తున్నామని గట్టిగా చెబుతున్నా. 19 నెలల్లో విద్యారంగంపై రూ.24 వేల కోట్లు ఖర్చు 19 నెలల ప్రభుత్వ పాలనలో పిల్లల చదువుల కోసం అక్షరాల రూ.24 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మనది. ఒక్క జగనన్న అమ్మఒడి పథకం ద్వారానే రూ.13 వేల కోట్లు, విద్యా దీవెన ద్వారా 18.51 లక్షల మంది పిల్లలకు రూ.4,101 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా రూ.1,221 కోట్లు, సంపూర్ణ పోషణ కింద రూ.1,863 కోట్లు, జగనన్న విద్యా కానుక కింద దాదాపు రూ.648 కోట్లు, జగనన్న గోరుముద్ద ద్వారా రూ.1,456 కోట్లు ఖర్చు చేస్తున్నా. పాఠశాలల్లో నాడు-నేడు కింద మొదటి దశలో రూ.2,600 కోట్లు ఖర్చు చేసి మొత్తంగా రూ.24,600 కోట్లు ఖర్చు చేశాం. పేదింటి పిల్లలంతా చదువుల బడికి వెళ్లి గొప్ప చదువులు చదవాలని అమ్మఒడికి శ్రీకారం చుట్టాం. పేద పిల్లలందరూ చదువుకోవాలి, వాళ్ల తలరాతలు మారాలి. చదువుల రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురావాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ 19 నెలల పరిపాలన సాగిందని సగర్వంగా చెబుతున్నా. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ఏడాది రెండో విడత ఇస్తున్నాం. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయంగా అందిస్తున్నాం. ప్రతి పిల్లవాడిలో ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా కాన్వెంట్ బడులకు వెళ్తున్నప్పుడు ఉండే ఆత్మ స్థైరం మాదిరిగా విద్యాకానుక ఇచ్చాం. పౌష్టికాహారం.. ఇంగ్లీషు మీడియం.. ప్రతి పిల్లవాడికి ఆరో సంవత్సరం వచ్చే సరికి 85 శాతం బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. అలాంటి సమయంలోనే గట్టి పునాదులు పడతాయని, అందుకే మంచి పౌష్టికాహారంతో పాటు ఇంగ్లిష్ మీడియంలో పునాదులు కూడా పడాలని ఖర్చుకు వెనుకాడకుండా అమలు చేస్తున్నాం. విద్యాకానుక ద్వారా ఇచ్చే స్కూల్ కిట్ల నాణ్యతను నేను స్వయంగా బూట్లు పట్టుకుని పరిశీలించా. ఈసారి మరింత నాణ్యతతో ఉండాలని అధికారులకు చెప్పా. నాడు-నేడుతో స్కూళ్లను సమూలంగా మారుస్తున్నాం. మధ్యాహ్న భోజనం మెనూ మార్చి రోజుకో వెరైటీతో జగనన్న గోరుముద్ద పథకాన్ని తెచ్చాం. కంటి వెలుగు పథకం ద్వారా పరీక్షలు చేయిస్తున్నాం. ఇంటర్ తర్వాత పిల్లల చదువులు ఆగి పోకూడదని పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు విద్యాదీవెన, హాస్టల్ ఖర్చుల కోసం వసతి దీవెన ద్వారా ఏటా ప్రతి పిల్ల వాడికి రూ.20 వేలు ఇస్తున్నాం. కరిక్యుకులమ్‌లో మార్పులు చేసి చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు వచ్చేలా అప్రెంటీస్‌షిప్‌ను అమలు చేస్తున్నాం. 8వ తరగతి నుంచే కంప్యూటర్ లిటరసీ కోర్సు కూడా ప్రవేశ పెడుతున్నాం. డబ్బున్న వారి పిల్లలతో పోటీ పడి చదువుకునే పరిస్థితి కల్పిస్తున్నాం. చీకటి పనులు చేసేవారు.. చీకటి పనులు చేసేవారు, వెన్నుపోట్లు తెలిసిన వారు, దొంగ దెబ్బతీసే వారు, వ్యవస్థలో కోవర్టులు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు... మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఎలా దెబ్బతీయాలా అని ఆరాట పడుతున్న రాజకీయ శక్తులను గమనించమని ప్రజలను కోరుతున్నా. ఇలాంటి రాజకీయ శక్తులతో మనం ఇవాళ పోరాటం చేస్తున్నాం. -
రెండో ఏడాది చెల్లింపులు కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్
-
ప్రతిపక్షాల్లో కడుపుమంట: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు: నవరత్నాల హామీల్లో అత్యంత కీలకమైన ‘జగనన్న అమ్మ ఒడి’ రెండో ఏడాది చెల్లింపులను నెల్లూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదవాలన్నదే లక్ష్యమని తెలిపారు. అమ్మఒడి పథకం ద్వారా 45 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతి బిడ్డకు అమ్మఒడి శ్రీరామరక్ష అని, 19 నెలల పాలనలో చదువుల విప్లవం తీసుకొచ్చామని సీఎం పేర్కొన్నారు. ఆ పరిస్థితులను పాదయాత్రలో చూశా.. ‘‘చదివించే స్తోమత లేక తమ పిల్లలను కూలి పనులకు పంపించే పరిస్థితులను నా పాదయాత్రలో చూశా. అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపిస్తే రూ.15వేలు సాయం అందించాం. వరుసగా రెండో ఏడాది కూడా అమ్మఒడి పథకం అమలు చేస్తున్నాం. అమ్మఒడి రెండో విడత ద్వారా రూ.6,673 కోట్లు అందిస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. అదనంగా 4 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు అందజేస్తున్నాం. గోరుముద్ద పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని’’ సీఎం జగన్ చెప్పారు. (చదవండి: ఆరోగ్య పథకాల 'అమలులో ఏపీ టాప్') పరిస్థితులను మార్చేందుకే ‘నాడు-నేడు’ గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాయని, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పేరుతో దోపిడీ జరిగేదన్నారు. పరిస్థితులను మార్చేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. పాఠశాలకు విద్యార్ధి రాకపోతే మొదటి రోజు ఫోన్లో మెసేజ్.. వరుసగా రెండు రోజులు రాకుంటే వాలంటీర్ నేరుగా ఇంటికొచ్చి విద్యార్ధి యోగక్షేమాలు తెలుసుకుంటారని వెల్లడించారు.పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చే బాధ్యత తల్లిదండ్రుల కమిటీలతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు, వాలంటీర్లపై ఉందన్నారు. రాబోయే మూడేళ్లలో వంద శాతం పిల్లలు బడిబాట పట్టేలా చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. పాఠశాలల్లో టాయిలెట్లు శుభ్రంగా లేకపోతే 1902 నంబర్‌కు ఫోన్ చేయొచ్చని, గ్రామ సచివాలయాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని సీఎం సూచించారు. అమ్మఒడి పథకంలో వినూత్నమైన మార్పు.. అమ్మఒడి పథకానికి టెక్నాలజీని సీఎం అనుసంధానం చేశారు. విద్యార్ధులకు కంప్యూటర్ స్కిల్స్ పెంచేందుకు ల్యాప్‌టాప్ ఆఫర్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి 9 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు ఈ ఆఫర్ ప్రకటించారు. అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్‌టాప్ ఇస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్‌డిస్క్, విండోస్ 10 ఓఎస్ ఫీచర్స్‌తో ల్యాప్‌టాప్ ఉంటుందన్నారు. మూడేళ్ల వారంటీతో కూడిన ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు అందిస్తాం. రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సేవలు అందిచడంతో పాటు అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ కేబుల్‌ను ఏర్పాటు చేస్తాం. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నాం. వైఎస్ఆర్ పీపీ-1, పీపీ-2, ప్రీ ఫస్ట్ క్లాస్‌గా కొనసాగుతాయని’’ సీఎం పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ప్రతిపక్షాల్లో కడుపుమంట.. రాష్ట్రాభివృద్ధిని చూసి ప్రతిపక్షాల్లో కడుపుమంట కనిపిస్తోందని సీఎం అన్నారు. దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, ఆ తర్వాత దేవాలయాల సందర్శన అంటున్నారని మండిపడ్డారు. రథాలను తగలబెట్టి రథయాత్రలు చేస్తున్నారు.. సంక్షేమ పథకాల మంచి ప్రజలకు తెలియకూడదనే.. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని సీఎం జగన్ ధ్వజమెత్తారు. దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు.. ‘‘దేవుడిపై భక్తి లేనివారు, ఆలయాల భూములను కాజేసిన వారు.. ఆలయాల్లో క్షుద్రపూజలు చేసినవారు. ఇప్పుడు దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు. కోవిడ్‌కు భయపడి చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లో దాక్కుంటారు. సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా ఎన్నికలు నిర్వహించాలంటారు.. పేదింటి మహిళలకు ఇళ్ల స్థలాలు అందకుండా కేసులు వేస్తున్నారు. వ్యవస్థలో ఉన్న కోవర్టులు కూడా ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. ఆలయాల్లో విగ్రహాలు పగలగొట్టారు.. రాబోయే రోజుల్లో బడులపై విధ్వంసం చేస్తారేమో. విద్రోహ శక్తుల పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలని’’ సీఎం జగన్ తెలిపారు. అంతకు ముందు శ్రీవేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన `అమ్మఒడి` పథకం ప్రారంభోత్సవ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఓ చిన్నారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. పాదయాత్రలో చెప్పిన ప్రతిమాటను అక్షరాలా చేసి చూపిస్తున్న సీఎం జగన్ వరుసగా రెండో ఏడాది కూడా విజయవంతగా సంక్షేమపథకాలను అమలు చేస్తున్నారు. ఈ ఏడాది మరింత మందికి ప్రయోజనం కలిగేలా... ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా ఈ ఏడాది నిబంధనలు సడలించిన ప్రభుత్వం... కోవిడ్ 19 పరిస్ధితుల్లో విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధనను మినహాయింపు నిచ్చింది. కుటుంబ ఆదాయ పరిమితి గతంలో గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.5వేలు, పట్టణాల్లో రూ.6250 ఉంటే, ఈ ఏడు గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు చేశారు. గతంలో రెండున్నర ఎకరాల మాగాణి, మెట్టభూమి 5 ఎకరాలలోపు పరిమితి ఉండగా, ఈ యేడు మగాణి 3 ఎకరాలు, మెట్ట భూమి 10 ఎకరాలుగా మార్పు చేశారు. విద్యుత్ వినియోగానికి సంబంధించి నెలకు గతంలో 200 యూనిట్లలోపు వాళ్లను అర్హులుగా గుర్తిస్తే..ఈ దఫా 300 యూనిట్ల వినియోగమున్నవాళ్లను కూడా అర్హులుగా గుర్తించారు.(చదవండి: అశోక్‌బాబుకు ఏపీ ఉద్యోగుల జేఏసీ కౌంటర్) గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఫెన్షనర్లకు పథకాన్ని వర్తింపజేయలేదు, ఈ దఫా పారిశుద్ధ్య కార్మికులను అందులో నుంచి మినహాయించారు. దీంతో పారిశుద్ధ్య కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఈ ఏడాది అమ్మఒడి వస్తుంది. గతంలో ఫోర్ వీలర్ ఉన్న కుటుంబాల్లో టాక్సీ కలిగి ఉన్నవారికే మాత్రమే మినహాయింపు నివ్వగా,ఈ దఫా ట్రాక్టర్లు, ఆటోలున్నవారినీ ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారు. గతంలో మున్సిపాల్టీలలో 750 చదరపు అడుగుల లోపు స్ధిరాస్ధి ఉన్న వారికి పథంలో అర్హులగా గుర్తించగా, ఈ దఫా 1000 చదరపు అడుగుల స్ధలం ఉన్నవారిని కూడా పథకంలో అర్హులుగా గుర్తిస్తున్నారు. దీంతో ఈ దఫా అమ్మఒడి ద్వారా 44 లక్షల 48 వేల 865 మంది తల్లులకు లబ్ధి చేకూరనుంది. -
నేడు రెండో ఏడాది జగనన్న అమ్మ ఒడి
సాక్షి, అమరావతి: ‘నేను విన్నాను.. నేను చూశాను.. నేను ఉన్నాను..’ అంటూ పాదయాత్రలో చెప్పిన ప్రతిమాటను అక్షరాలా అమలు చేసి చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా రెండో ఏడాది కూడా విజయవంతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మాట ఇచ్చారంటే నెరవేర్చడమే లక్ష్యంగా ప్రతి అడుగూ ముందుకేస్తున్నారు. నవరత్నాల హామీల్లో అత్యంత కీలకమైన జగనన్న అమ్మ ఒడి రెండో ఏడాది చెల్లింపులను సోమవారం నెల్లూరులో ప్రారంభించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి అకౌంట్లో ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకాన్ని ముందుగా 1–10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా, అనంతరం ఇంటర్ వరకూ వర్తింపజేశారు. మొత్తంగా గతేడాది జనవరి 9న దాదాపు 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో సుమారు రూ.6336.45 కోట్లు జమ చేశారు. ఈ ఏడాది మరింత మందికి ప్రయోజనం – ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా ఈ ఏడాది ప్రభుత్వం నిబంధనలు సడలించింది. కోవిడ్–19 పరిస్థితుల్లో విద్యార్థులకు 75 శాతం హాజరు నిబంధనకు మినహాయింపు ఇచ్చింది. – కుటుంబ ఆదాయ పరిమితి గతంలో గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.5 వేలు, పట్టణాల్లో రూ.6,250 ఉంటే, ఈ ఏడాది గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు చేశారు. – గతంలో రెండున్నర ఎకరాల మాగాణి, మెట్ట భూమి 5 ఎకరాలలోపు పరిమితి ఉండగా, ఈ ఏడాది మాగాణి 3 ఎకరాలు, మెట్ట భూమి 10 ఎకరాలుగా మార్పు చేశారు. – విద్యుత్ వినియోగానికి సంబంధించి నెలకు గతంలో 200 యూనిట్లలోపు వాడే వాళ్లను అర్హులుగా గుర్తిస్తే.. ఈ దఫా 300 యూనిట్ల వినియోగమున్నవాళ్లను కూడా అర్హులుగా గుర్తించారు. – గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పథకాన్ని వర్తింపజేయలేదు. ఈ దఫా పారిశుద్ధ్య కార్మికులను అందులో నుంచి మినహాయించారు. దీంతో పారిశుద్ధ్య కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఈ ఏడాది అమ్మఒడి వస్తుంది. – గతంలో ఫోర్ వీలర్ (కారు) ఉన్న కుటుంబాల్లో టాక్సీ కలిగి ఉన్న వారికే మాత్రమే మినహాయింపు నివ్వగా, ఈ దఫా ట్రాక్టర్లు, ఆటోలున్నవారినీ ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారు. – గతంలో మున్సిపాల్టీలలో 750 చదరపు అడుగుల లోపు స్థిరాస్థి ఉన్న వారిని పథకంలో అర్హులుగా గుర్తించగా, ఈ దఫా 1,000 చదరపు అడుగుల స్థలం ఉన్న వారిని కూడా అర్హులుగా గుర్తిస్తున్నారు. – వీటన్నింటి దృష్ట్యా ఈ ఏడాది అమ్మఒడి ద్వారా 44 లక్షల 48 వేల 865 మంది తల్లులకు లబ్ధి చేకూరనుంది. నెల్లూరులో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కడం ద్వారా తల్లుల ఖాతాల్లో రూ.6,673 కోట్లు జమ చేయనున్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు – కోవిడ్ విపత్తు నేపథ్యంలో అమ్మఒడి పేదల పాలిట కవచంలా నిలిచింది. రాష్ట్రంలో సుమారు 43 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం రూ.15 వేలు చొప్పున జమ చేయడం ద్వారా ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపింది. – కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత రాష్ట్రంలో నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. 9, 10 తరగతులకు నవంబర్ 23 నుంచి.. 7, 8 తరగతులకు డిసెంబర్ 14 నుంచి తరగతులు మొదలయ్యాయి. – జనవరి 18 నుంచి ఆరో తరగతి విద్యార్థులకు తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పటి పరిస్థితులను బట్టి ఒకటో తరగతి నుంచి 5 వరకు తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే విద్యార్థులకు వివిధ రకాల ఆన్లైన్ ఫ్లాట్‌ఫాంల సహకారంతో పాఠ్యాంశాల బోధనకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. మనబడి నాడు–నేడు – పాఠశాలల్లో విద్యా వాతావరణాన్ని సమూలంగా మార్పు చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం మనబడి నాడు–నేడుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్లు, 55,607 అంగన్వాడీ కేంద్రాల రూపు రేఖలు మూడేళ్లలో సమూలంగా మారనున్నాయి. – ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.14 వేల కోట్లు ఖర్చు చేయనుంది. తొలివిడతలో భాగంగా 15,715 స్కూళ్లలో నాడు–నేడు కింద గత నవంబర్ 14న పనులు ప్రారంభించింది. – రన్నింగ్ వాటర్ సౌకర్యంతో పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ట్యూబులైట్లు, ఫ్యాన్లతో విద్యుదీకరణ, మంచినీటి సరఫరా.. ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు ఫర్నిచర్, పాఠశాలకు పూర్తి స్థాయిలో పెయింటింగ్, అన్ని రకాల మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డ్స్, ఇంగ్లిష్ ల్యాబ్, పాఠశాల చుట్టూ ప్రహరీ, కిచెన్ షెడ్స్‌ను ఏర్పాటు చేస్తారు. పాఠశాల విద్యా కమిటీలు ఈ పనులన్నింటినీ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాయి. – ఫలితంగా ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో అదనంగా 6 లక్షల మంది విద్యార్థులు చేరారు. మొత్తంగా విద్యార్థుల సంఖ్య 84 లక్షలకు చేరింది. ఇంగ్లిష్ మీడియం విద్య పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో రాణించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్ధాయి నుంచి ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన దిశగా అడుగులు వేసింది. జగనన్న గోరుముద్ద – ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45,484 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు 37 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం, ప్రతిరోజూ మెనూ మార్చి రుచికరమైన, ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం అందిస్తోంది. – కోవిడ్ సమయంలో కూడా వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే డ్రై రేషన్ పంపిణీ చేశారు. గత ప్రభుత్వం ఏటా దాదాపు రూ.520 కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ ప్రభుత్వం రూ.1,456 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా కానుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి బడులు తెరిచే సమయానికి కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫారాలు, స్కూల్ బ్యాగ్, టెక్టŠస్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్, సాక్స్, షూస్ అందించింది. పాఠశాలల్లో పారిశుద్ధ్యం – నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పించిన ప్రభుత్వం టాయిలెట్ల నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించింది. – ఇందులో భాగంగా అమ్మ ఒడి లబ్ధిదారులకు అందించే రూ.15 వేలు నుంచి రూ.1,000ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని టాయిలెట్ నిర్వహణ ఫండ్‌కు జమ చేస్తుంది. ఈ సామ్ము ఆయా పాఠశాలల్లో టాయిలెట్ నిర్వహణ ఫండ్ కోసం వాడతారు. వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అంగన్వాడీలు ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 55,607 అంగన్వాడీల్లో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, ప్రీ ఫస్ట్ క్లాసు తరగతులు ఉంటాయి. పౌష్టికాహారం, ఆట పాటలు.. ఇంగ్లిష్ మీడియంలో బోధనతో 8.5 లక్షల మంది చిన్నారుల మానసిక వికాసానికి గట్టి పునాది వేయనున్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన – పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా డిగ్రీ, మెడిసిన్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనార్టీ, పేద విద్యార్థులకు రూ.4,101 కోట్ల వ్యయంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తోంది. – ఈ విద్యార్థులందరి వసతి, భోజనం కోసం ఒక్కొక్కరికి రూ.20 వేల వరకు జగనన్న వసతి దీవెన పథకం కింద ఏటా రూ.2,300 కోట్లు ఖర్చు చేస్తోంది. ఏడాదిగా విద్యా రంగంపై చేసిన వ్యయం – జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 44,48,865 మంది లబ్ధిదారులకు రూ,13,023 కోట్లు – జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 18,51,043 లబ్ధిదారులకు రూ.4,101 కోట్లు – జగనన్న వసతి దీవెన ద్వారా 15,56,956 మంది లబ్ధిదారులకు రూ.1,220.99 కోట్లు – జగనన్న విద్యా కానుక ద్వారా 42,34,322 మంది లబ్ధిదారులకు రూ.647.85 కోట్లు – జగనన్న గోరుముద్ద ద్వారా 36,88,618 మంది లబ్ధిదారులకు రూ.1,456 కోట్లు – పాఠశాలల్లో నాడు–నేడు తొలిదశ కింద ఇప్పటి వరకు రూ.2,248 కోట్లు – వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద 30,16,000 మంది లబ్ధిదారులకు రూ.1863.13 కోట్లు మొత్తంగా 1,87,95,804 మంది లబ్ధిదారులకు గత 12 నెలల కాలంలో జగన్ ప్రభుత్వం రూ.24,559.97 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఏటా బకాయిలు పెడుతూ.. మొత్తంగా ఖర్చు చేసిన వ్యయం కేవలం రూ.3,875.93 కోట్లు మాత్రమే. -
‘జగనన్న అమ్మ ఒడి’ యథాతథం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘జగనన్న అమ్మఒడి’ పథకం రెండో విడత కార్యక్రమం ఈనెల 11న యథాతథంగా జరుగుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి శుక్రవారమే జీఓ–3ను విడుదల చేశామని ఆయన తెలిపారు. ఈ పథకం అమలుచేస్తున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం, కోడ్ పేరిట ఈ పథకం అమలును నిలిపివేయాలని చూడడం దురదృష్టకరమన్నారు. వరుస సెలవులతోనే 11కి వాయిదా ఈ ఏడాది కూడా రెండో విడతను 9వ తేదీనే ఇవ్వాలని అనుకున్నప్పటికీ రెండో శనివారం, ఆదివారం సెలవుల వల్ల 11వ తేదీకి వాయిదా వేశామని మంత్రి చెప్పారు. నెల్లూరులో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి నిధులు నేరుగా జమ అవుతాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1,76,589 మంది తల్లులు కొత్తగా లబ్ధిపొందనున్నారని మంత్రి సురేష్ చెప్పారు. పోయిన ఏడాది 42,24,302 మందికి ఇవ్వగా ఈ ఏడాది 44,00,891మందికి అమ్మఒడి అమలవుతోందన్నారు. అమ్మఒడి పథకం అమలు చేయనున్న తరుణంలో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడం దారుణమని మంత్రి మండిపడ్డారు. పథకాలతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని.. వాటిని ఆపాలని చూడడం అన్యాయమన్నారు. నెల్లూరు అర్బన్ ప్రాంతంలో ఈ పథకం కార్యక్రమం జరుగుతుంది కనుక కోడ్ పరిధిలోకి రాదన్నారు. టాయిలెట్ల నిర్వహణకు రూ.వెయ్యి ఇదిలా ఉంటే.. జగనన్న అమ్మఒడి పథకం కింద రూ.15 వేలు తల్లులకు అందించనున్నారు. ఈ మొత్తంలో రూ.1,000ని టాయిలెట్ల నిర్వహణ నిధికి జమచేసి మిగిలిన రూ.14,000ను తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేస్తారు. -
11న నెల్లూరుకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11న నెల్లూరు వెళ్లనున్నారు. అక్కడ ఆయన అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో నెల్లూరుకు పయనం అవుతారు. 11.10 గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరులోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. 11.40కి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శిస్తారు. అనంతరం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకొని అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రజలనుద్ధేశించి మాట్లాడతారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లికి బయలుదేరుతారు. -
అర్హురాలైన ప్రతి తల్లికీ అమ్మ ఒడి
సాక్షి, అమరావతి / వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): అర్హురాలైన ప్రతి తల్లికీ అమ్మ ఒడి పథకం అమలు చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కులం, మతం, పార్టీ అనేది చూడకుండా, కేవలం అర్హతే ప్రామాణికంగా ఈ పథకాన్ని వర్తింపచేయాలని, అర్హత ఉన్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. పిల్లలను బడికి పంపించే అర్హులైన తల్లులందరికీ ఈ పథకం అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారన్నారు. ఈ నెల 11న నెల్లూరులో రెండో విడత అమ్మ ఒడి పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారన్నారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, సీఎం అమ్మ ఒడి కార్యక్రమాన్ని తెచ్చారన్నారు. వేర్వేరు సమస్యల వల్ల అర్హులు కాని వారి విషయంలో మరింత పకడ్బందీగా పరిశీలించాలని సీఎం సూచించారన్నారు. ఎంత మంది అర్హులు ఉంటే అంతమందికీ లబ్ధి చేకూరుస్తామని, గత ఏడాది కన్నా ఈసారి ఎక్కువ మంది లబ్ధిదారులుంటారని భావిస్తున్నామని చెప్పారు. ఈ పథకం దేశం మొత్తానికి ఆదర్శంగా మారిందని, నూతన జాతీయ విద్యా విధానంలోనూ ఇదే అంశాన్ని కేంద్రం ప్రస్తావించిందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కడుపు మంటతో చేస్తున్నవేనని కొట్టిపారేశారు. నాడు–నేడు కింద పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం తర్వాత వాటి నిర్వహణ కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఇందుకోసం శాశ్వత ప్రాతిపదికన ఒక నిధి ఏర్పాటుకు సీఎం యోచన చేశారని చెప్పారు. తల్లులకు అమ్మ ఒడి కింద ఇచ్చే రూ.15 వేలల్లో టాయిలెట్ల నిర్వహణ నిధి కోసం రూ.1000 మినహాయించి తక్కిన మొత్తాన్ని వారి అకౌంట్లలో జమ చేస్తామని మంత్రి వివరించారు. సాంకేతికతతో అసమానతల తొలగింపు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సమాజంలో అసమానతలను తొలగించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏపీ సమగ్ర శిక్ష, పాఠశాల విద్య సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు జరిగే ‘దీక్ష – కీ రిసోర్స్ పర్సన్’ శిక్షణ శిబిరాన్ని బుధవారం స్థానిక కేబీఎన్ కళాశాల ఆవరణలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆన్లైన్ విద్య ద్వారా సామాజిక అసమానతలను తొలగించగలుగుతామన్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించినప్పుడే అత్యుత్తమ విద్యా ప్రమాణాలు సాధించగలమన్నారు. నైపుణ్యాల విషయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందంజలో ఉన్నారని చెప్పారు. జిల్లా విద్యా శిక్షణా సంస్థల ద్వారా నిరంతరం శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
‘అమ్మఒడి’కి నేటి వరకు గడువు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/పొగతోట (నెల్లూరు): జగనన్న అమ్మఒడి పథకానికి అర్హులైన వారి పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే మంగళవారం వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. అవసరమైతే ఈ అవకాశాన్ని మరో రెండురోజులు పొడిగిస్తామన్నారు. అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ఈనెల 11న నెల్లూరులో ప్రారంభిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌తో కలిసి నెల్లూరులో అధికారులతో సమీక్షించారు. తమ ప్రభుత్వానికి ప్రజల ఆదరణ చూసి కడుపు మంటతో ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులతోపాటు సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సభాస్థలిని పరిశీలించారు. -
11న రెండో విడత అమ్మఒడి..
సాక్షి, నెల్లూరు: ఈ నెల 11న నెల్లూరులో రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సారి గతంలో కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకి ఇస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైనవారందరికీ కచ్చితంగా ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. కార్పొరేట్ స్కూళ్ల మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు ఆర్ఐవోను బెదిరించిన నారాయణ కాలేజి డైరెక్టర్‌పై కేసు నమోదుకు ఆదేశించామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. (చదవండి: ఏపీలో 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు) -
జనవరి 9న రెండో విడత అమ్మఒడి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడత అమ్మఒడి కార్యక్రమం జనవరి 9న ప్రారంభమవుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, సీఎం సూచనల మేరకు జనవరి 5 వరకు అమ్మఒడి మార్పులు, చేర్పులకు అవకాశం ఉందన్నారు. (చదవండి: ‘సీఎం జగన్ చెప్పారంటే.. చేస్తారంతే’) జనవరి 6న అమ్మఒడి అర్హుల జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు అమ్మఒడి ఇవ్వడంలేదనేది తప్పుడు ప్రచారమన్నారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ అమ్మఒడి ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. రెండో విడత అమ్మఒడి కోసం రూ.6,450 కోట్లు కేటాయించామన్నారు. గత ఏడాది అమ్మఒడి అందిన అందరూ రెండో విడతకి అర్హులేనని మంత్రి సురేష్ వెల్లడించారు.(చదవండి: ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు) -
జనవరి 9న అమ్మఒడి అందజేస్తాం
సాక్షి, తిరుపతి : ఈ నెల 26లోపు అమ్మ ఒడి లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల్లో అభ్యర్థుల జాబితా పెడతామని, అందులో పేరులేని అర్హులైనవారు మళ్లీ నమోదు చేసుకోవచ్చని అన్నారు. 30న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. జనవరి 9న ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమ్మ ఒడి నగదును తల్లుల ఖాతాలో వేస్తామన్నారు. (చదవండి: ‘43 లక్షల మంది తల్లులకు అన్నయ్య అయ్యారు’) ప్రయివేటు స్కూల్ విద్యార్థులకు కూడా అమ్మ ఒడిని ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దమనసుతో ప్రకటించారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ప్రతి స్కూల్ యాజమాన్యం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అమ్మ ఒడి డబ్బులను ఫీజులకు ముడిపెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతేడాది ఫీజు 70శాతం మాత్రమే తీసుకోవాలన్నారు. అమ్మ ఒడి డబ్బును ఫీజులతో ముడి పెట్టటం ఆక్షేపణీయమని, ఇలాంటి పని ఏ స్కూల్ యాజమాన్యం చేసినా ఒప్పుకునేది లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. -
ఆన్లైన్లో ‘అమ్మఒడి’ లబ్ధిదారుల ప్రాథమిక జాబితా
ఒంగోలు అర్బన్: జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను ఆన్లైన్లో విడుదల చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. సోమవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలసి ఆయన ఈ జాబితాను ఆన్లైన్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శనకు ఉంచుతామని, వీటిపై అభ్యంతరాలను పరిశీలించి ఈ నెల 30వ తేదీన తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఎవరికైనా అర్హత ఉండి జాబితాలో పేరు లేకుంటే తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పెరిగిన లబ్ధిదారుల సంఖ్య రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 72,74,674 మంది, 11, 12 తరగతులకు సంబంధిం«చి 10,97,580 మంది విద్యార్థులు అమ్మ ఒడి పథకానికి ఎంపికయ్యారని మంత్రి సురేశ్ తెలిపారు. 61,317 పాఠశాలలు, 3,116 కాలేజీలకు చెందిన మొత్తం 83,72,254 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. జనవరి 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు అమ్మ ఒడి నగదు జమవుతుందన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది లబ్ధిపొందే విద్యార్థుల సంఖ్య పెరిగిందని వివరించారు. -
జనవరి 9న జగనన్న అమ్మఒడి సాయం
సాక్షి, అమరావతి: ప్రస్తుత విద్యా సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఆర్థిక సాయం జనవరి 9వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేయనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే పాఠశాలల్లో అర్హులైన విద్యార్థుల తల్లులు, సంరక్షకుల పేర్లు నమోదు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు వర్తింపజేస్తామని తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ షెడ్యూల్‌ను మంత్రి వివరించారు. ఇదీ షెడ్యూల్ ► ఈ నెల 16వ తేదీన అర్హులైన లబ్ధిదారుల జాబితాలను అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ► 19వ తేదీ సాయంత్రం వరకు ఆ జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన. ► 26న సవరించిన లబ్ధిదారుల జాబితాలను తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రదర్శిస్తారు. 27, 28 తేదీలలో గ్రామ, వార్డు సభలు నిర్వహించి, ఆ జాబితాలపై సామాజిక మదింపు (సోషల్ ఆడిట్) జరిపి, గ్రామ సభల అనుమతి తీసుకుంటారు. ► 30న డీఈవోలు, కలెక్టర్లు ఆమోదం తెలపడంతో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది. ► 2019–20 విద్యా సంవత్సరం(గత ఏడాది)లో 43,54,600కు పైగా లబ్ధిదారులకు సాయం అందింది. -
విప్లవాత్మక పథకం అమ్మఒడి: మంత్రి వనిత
-
‘అభాసుపాలై పరువు పోగొట్టుకోవద్దు’
సాక్షి, విజయవాడ: అమ్మఒడి నిధులకు సంబంధించి బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అమ్మఒడి నిధులపై రాష్ట్ర బీజేపీ నేతల ఆరోపణలు సరికాదు. పరిజ్ఞాన లోపంతో కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్ధన్‌రెడ్డి ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌లోని అమ్మఒడి లబ్దిదారులకి రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులు కేటాయించారు. ఆలయాల హుండీలు, భక్తుల కానుకల నుంచి నిధులిచ్చారనటం అవివేకం. బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ శాఖలో భాగం అయినంత మాత్రాన నిందలు సరికాదు. సమగ్ర సమాచారం తెలుసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. అరకొర సమాచారంతో మాట్లాడి అభాసుపాలై మరోసారి పరువు పోగొట్టుకోవద్దు' అంటూ బీజేపీ నాయకులకు మల్లాది విష్ణు సూచించారు. (ఓటేసిన జనమే టీడీపీ ఎమ్మెల్యేని ఛీ కొట్టారు..) -
మీ భవిష్యత్‌కు ఇదే నా పెట్టుబడి
-
నాకు మా అమ్మ కావాలి సార్..
సాక్షి, విజయవాడ/అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా నేడు విద్యారంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాఠశాలల్లో నాడు-నేడు, ఇంగ్లిష్ మీడియం విద్య, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించారు. కార్యక్రమంలో భాగంగా విజయవాడకు చెందిన రమ్య అనే 10వ తరగతి విద్యార్థిని మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కదిలించాయి. కృష్ణా జిల్లా కానూరు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న యు. రమ్య అనే విద్యార్థిని తనకు అందుతున్న పథకాలకు సంబంధించిన విషయాలను చక్కగా వివరించింది. తన తల్లికి ఆరోగ్యం బాలేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ను మామయ్య అని సంబోధిస్తూ .. 'నాకు మా నాన్న లేరు సార్.. మా అమ్మ నన్ను కూలీ పని చేస్తూ చదివిస్తోంది. నేను సీఐడీ ఆఫీసర్ కావాలనే లక్ష్యం ఉండేది.. కానీ పేదవాళ్లం కావడంతో అది నెరవేరుతుందనే నమ్మకం లేదు. కానీ మీరు నాకు మామయ్యలాగా అండగా ఉంటూ నా చదువుకు భరోసా కల్పించారు సార్.. దీంతో నేను లక్ష్యాన్ని చేరుకుంటాననే నమ్మకం వచ్చింది సార్.. మీలాంటి వ్యక్తి మాకు ముఖ్యమంత్రిగా రావడం నిజంగా అదృష్టం సార్.. వీ ఆర్ లక్కీ అండర్ యువర్ రూల్ సార్.. ఒక మామయ్యగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా సార్.. నా తల్లి ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదు.. ఆమె ఎప్పుడు చనిపోతుందో కూడా నాకు తెలియదు. ఒక వారం ఉంటుందో.. నెల ఉంటుందో తెలియదు కానీ.. నాకు మా అమ్మ కావాలి సార్.. ఎలాగైనా ఆమెను బతికించండి సార్' అంటూ కన్నీటి పర్యంతమైంది. రమ్య మాటలకు చలించిపోయిన సీఎం జగన్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి రమ్య తల్లిని ఆసుపత్రికి తరలించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో తక్షణమే స్పందించిన హెల్త్ ఆఫీసర్ వైద్య సిబ్బందితో రమ్య ఇంటికి చేరుకొని ఆమె తల్లిని ఆసుపత్రికి తరలించారు. తన తల్లిని ఆస్పత్రికి తరలించడానికి సీఎం జగన్‌కు రమ్య కృతజ్ఞతలు తెలిపింది. (సీఎం జగన్ పండుగలా దిగివచ్చారు)