
పార్వతీపురం/కురుపాం: వివిధ సమస్యలతో బాధ పడుతున్న వారిని కురుపాం పర్యటనలో బుధవారం సీఎం జగన్ మనసున్న మారాజుగా ఆదుకున్నారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లికి చెందిన రెండేళ్ల చిన్నారి గుదే జియశ్రీకి బోన్‌మెరో ట్రాన్స్‌ప్లాంటేషన్ కారణంగా పెరుగుదల లోపించింది. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించాలని వైద్యులు సూచించారు.
ఆర్థిక పరిస్థితి అనుకూలించక పోవడంతో చిన్నారి తల్లి గుదే గౌరి సీఎంకు సమస్యను విన్నవించింది. వెంటనే స్పందించిన సీఎం.. వైద్యం కోçÜం రూ.10 లక్షలు సాయం అందిస్తామని, తక్షణ సాయంగా రూ.లక్ష అందజేయాలని కలెక్టర్ నిషాంత్‌కుమార్‌ను ఆదేశించారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న పార్వతీపురంలోని రామానందనగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బేతా హాసిని వైద్యం కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేశామని, ఆదుకోవాలని బాలిక తండ్రి శ్రీనివాసరావు సీఎం జగన్‌కు విన్నవించారు.
తక్షణ సహాయంగా రూ.3 లక్షలు అందించాలని సీఎం కలెక్టర్‌ను ఆదేశించారు. మరో 11 మంది కూడా సీఎంకు వారి సమస్యలు చెప్పుకున్నారు. వారందరి సమస్యలు ఓపికగా విన్న జగన్.. తక్షణ సాయంగా రూ.లక్ష చొప్పున మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం హామీ మేరకు బాధితులందరికీ 24 గంటలు గడవక ముందే కలెక్టర్, ప్రజాప్రతి–నిధులు చెక్కులు అందజేశారు. సీఎం ఉదారత పట్ల బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment