సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడత అమ్మఒడి కార్యక్రమం జనవరి 9న ప్రారంభమవుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, సీఎం సూచనల మేరకు జనవరి 5 వరకు అమ్మఒడి మార్పులు, చేర్పులకు అవకాశం ఉందన్నారు. (చదవండి: ‘సీఎం జగన్ చెప్పారంటే.. చేస్తారంతే’)
జనవరి 6న అమ్మఒడి అర్హుల జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు అమ్మఒడి ఇవ్వడంలేదనేది తప్పుడు ప్రచారమన్నారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ అమ్మఒడి ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. రెండో విడత అమ్మఒడి కోసం రూ.6,450 కోట్లు కేటాయించామన్నారు. గత ఏడాది అమ్మఒడి అందిన అందరూ రెండో విడతకి అర్హులేనని మంత్రి సురేష్ వెల్లడించారు.(చదవండి: ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు)
Comments
Please login to add a commentAdd a comment