second installment
-
మా జన్మ ధన్యమైంది
సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణమాఫీతో తమ జన్మ ధన్యమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ రైతు కుటుంబంలోనూ విషాదం ఉండకూడదని, రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ఈ మాఫీతో లక్షలాది మంది రైతుల ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు.రైతు రుణమాఫీ రెండో విడతలో భాగంగా రూ.1.50 లక్షల్లోపు రుణమున్న రైతుల రుణమాఫీ కోసం రూ.6,190 కోట్ల నిధులను మంగళవారం ఆయన విడుదల చేశారు. 5.9 లక్షల కుటుంబాలకు చెందిన 6.4 లక్షల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన చెక్కును రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. వ్యవసాయం పండుగ అని నిరూపించేందుకే ‘కార్పొరేట్లకు వేలాది కోట్ల రూపాయలను బ్యాంకులు అప్పులుగా ఇస్తే, నష్టాల పాలయ్యామంటూ తప్పుడు లెక్కలు చూపెట్టి రుణాలు ఎగ్గొట్టి దేశాలు విడిచి పారిపోతున్నారు. కానీ రైతులు మాత్రం తాను అప్పులపాలైనా పదిమందికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో రుణాలు తీసుకుంటారు. అప్పుల వాళ్లు ఇంటికొస్తే ఆత్మాభిమానం దెబ్బతిని సిరులు పండించే పొలాల్లోనే పురుగుల మందు తాగి చనిపోయిన ఘటనలు జరిగాయి. అందుకే వరంగల్ డిక్లరేషన్‌లో రైతు రుణమాఫీ ప్రకటించాం. సోనియా, రాహుల్‌గాం«దీలిచి్చన మాట మేరకు వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించేందుకు రుణమాఫీ చేస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. తొలి విడత తర్వాత రెండు వారాలు కాకుండానే.. ‘రైతులకు రుణమాఫీ చేస్తామంటే ఎలా చేస్తారని కొందరు శాపనార్థాలు పెట్టారు. కానీ మా చిత్తశుద్ధి, పరిపాలన దక్షతతో చేసి చూపించాం. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించలేరు.. ప్రణాళికలను ప్రశ్నించలేరు. తొలి విడత రైతు రుణమాఫీ చేసిన తర్వాత రెండు వారాలు కూడా కాకముందే రెండో విడత రుణమాఫీ చేస్తున్నాం.ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలలు చరిత్రలో లిఖింపదగినవి. గత ప్రభుత్వం రూ.7 వేల కోట్లు మాఫీ చేయకుండా చేతులెత్తేసింది. వారు పాలించిన 120 నెలల కాలంలో రుణమాఫీ కోసం రూ.25 వేల కోట్లు కూడా చెల్లించలేకపోయింది. మేం మాత్రం అధికారంలోకి వచి్చన 8 నెలల కాలంలోనే ఏకకాలంలో రుణమాఫీ చేసి, 12 రోజుల వ్యవధిలోనే రెండుసార్లు నిధులు విడుదల చేశాం. రైతుల కోసమే ఈ రికార్డు 75 ఏళ్ల భారత స్వాతంత్య్ర చరిత్రలో ఏ రాష్ట్రం కూడా రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయలేదు. ఇలా చేయడం ఓ రికార్డు. ఈ రికార్డు తెలంగాణ ప్రజల కోసమే. సాధారణంగా ఎన్నికలున్నప్పుడు ఓట్లడిగే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు ఇలాంటివి చేస్తుంటాయి. మేము మాత్రం రైతు ప్రయోజనాలే ధ్యేయంగా ఓట్లు లేనప్పుడు కూడా రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలబడతామనే విశ్వాసాన్ని కలిగించాం..’అని రేవంత్ చెప్పారు. మా నిబద్ధతను భట్టి అన్న నిరూపించారు ‘బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వెళ్లిపోతే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 8 నెలల్లోనే రూ.43 వేల కోట్లు పాత అప్పులు, వడ్డీలకు కట్టారు.సామాజిక పింఛన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లకు అనుమతి, అంగన్వాడీల నుంచి ఆశా వర్కర్ల వరకు వేతనాలు.. ఇలా ఏ కార్యక్రమం ఆగకుండానే రైతు రుణమాఫీకి భట్టి అన్న నిధులు సమకూర్చారు. మా నిబద్ధతను నిరూపించారు. ఇందుకు ఆర్థిక శాఖ అధికారులు సహకరించారు..’అంటూ సీఎం అభినందించారు. సంకల్ప బలమే కారణం: డిప్యూటీ సీఎం భట్టి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతు రుణమాఫీ కోసం రాష్ట్రంలోని 16.29 లక్షల రైతు కుటుంబాలకు చెందిన 17.91 లక్షల ఖాతాల్లో రూ.12,208 కోట్లు జమ చేశామని తెలిపారు. ‘రుణమాఫీ ఎప్పుడో చేస్తారులే అన్న ఊహలు పటాపంచలు చేశాం. ఇందుకు సంకల్ప బలమే కారణం. ప్రతి క్షణం ప్రజలకు మేలు చేసేందుకే మేం తపిస్తున్నాం.అందుకే ఒక్కరోజు కూడా అలస్యం కాకూడదనే ఉద్దేశంతోనే ఈనెల 15న రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసి, 18న మొదటి విడత నిధులిచ్చాం. మళ్లీ రెండు వారాలు పూర్తి కాకుండానే ఇప్పుడు రెండోవిడత నిధులు విడుదల చేశాం. రూ.2 లక్షల లోపు రుణమాఫీ ఆగస్టు నెలలో పూర్తి చేస్తాం. రైతులకిది పండుగ రోజు. బ్యాంకుల్లో ఉన్న అప్పుల భారం దిగిపోతుంటే వారు సంతోషంగా ఉన్నారు..’అని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుతూనే రైతులకు ఇచి్చన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. రుణమాఫీకి నిధులు విడుదల చేసినందుకు గాను రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలిపారు. రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి రైతు సమాచార పత్రం తీసుకుని తమ సమస్యలు తెలియజేయాలని, నెలరోజుల్లో అర్హులైన అందరు రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ చేయించే బాధ్యత వ్యవసాయ శాఖదని చెప్పారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
Telangana: నేడు రెండో విడత రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రెండో విడత రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం దాదాపు 7 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. రూ.లక్షన్నర వరకు రుణాలున్న వారి బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేస్తారు. రుణ మాఫీ మొదటి విడతలో రూ.లక్ష లోపు రుణా లకు సంబంధించి 11.50 లక్షల కుటుంబాలకు రూ.6,098.94 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా వీటిలో.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం 11.32 లక్షల కుటుంబాలకు రూ.6,014 కోట్లు జమయ్యాయి.కొన్ని సాంకేతిక కారణాలతో 17,877 ఖాతాలకు చెందిన రూ.84.94 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. కాగా రెండో విడత రుణమాఫీ చెల్లింపులకు సంబంధించి సోమవారం రాత్రి వరకు మండలాల్లోని వ్యవసాయశాఖ అధికారులకు కూడా లబి్ధదారుల జాబితా అందలేదని సమాచారం. రాత్రి పొద్దుపోయాక జాబితా అందుతుందని భావిస్తున్నారు. మొదటి విడతలో లక్ష వరకు రుణాలున్న అనేకమంది అర్హులకు రుణమాఫీ కాలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో రెండో విడత రుణమాఫీలో అలాంటి పొరపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలో రూ.2 లక్షల వరకు మాఫీ: మంత్రి తుమ్మల మంగళవారం లక్షా యాభై వేల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్న అన్ని రైతువేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ముందు నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో రూ.లక్ష వరకు జరిగిన రుణ మాఫీకి సంబంధించి సందేహాలు ఉన్న రైతులు.. అక్కడ ఉన్న అధికారులు, బ్యాంకర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం రూ.లక్షన్నర వరకు జరిగే రుణమాఫీ కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా రైతులకు విజ్ఙప్తి చేశారు. వచ్చే నెలలో రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇదీ గత ప్రభుత్వ నిర్వాకం తమ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం లేదని విమర్శించిన పెద్దలకు, గత ప్రభుత్వం అనుసరించిన అసమంజస విధానాలను గుర్తు చేయదల్చుకున్నానని మంత్రి తెలిపారు. ’ప్రతి సంవత్సరం ఒక కొత్త విధానంతో రైతాంగాన్ని ఆందోళనలోకి నెట్టడమే వారి విధానంగా ఉండేది. ఒక ఏడాది పత్తి వద్దు అన్నారు. రైతులు వారి మాటలు నమ్మి కంది పంట వేస్తే కందులు కొనే నాధుడే లేరు. మరో ఏడాది పంట కాలనీలు అని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు.తరువాత దాని ఉసే లేదు. వరి వేస్తే ఉరి అన్నారు.. ఆ మాట నమ్మి మొక్కజొన్న వేస్తే కొనుగోలు సమయానికి మొహం చాటేశారు. సన్నాల సాగు అని సన్నాయి నొక్కులు నొక్కి తీరా మార్కెటింగ్‌కు వచ్చేసరికి బోనస్ కాదు కదా మద్దతు ధర కూడా దక్కలే. ఇక రుణమాఫీ 2014 కానీ, 2018 కానీ.. అసలు రుణమాఫీ పథకాలు కావని, వడ్డీ మాఫీ పథకాలుగా ప్రతి రైతు చెబుతాడు..’అని మంత్రి దుయ్యబట్టారు. -
KNR: దళితబంధు కోసం కొత్త షరతులు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో అధికారులు కొత్త షరతు విధించారు. నిధులు దుర్వినియోగం కాకుండా కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. రెండో విడత దళితబంధు కోసం దరఖాస్తు చేసుకునే వారంతా కొటేషన్, వ్యాపారి జారీచేసే అఫిడవిట్ కలిగి ఉండాలని నిబంధన పెట్టారు. హుజూరాబాద్‌లో లబ్ధిదారులకు నిధుల మంజూరులో సమస్యలు తలెత్తాయన్న విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారని సమాచారం. అందుకే, యూనిట్లకు సంబంధించి విస్తరణ, వ్యాపారవృద్ధిలో పారదర్శకతను మరింత పెంచేలా చర్యలు చేపట్టారు. ఇకపై రెండో విడత కోసం దరఖాస్తు చేసుకునే ప్రతీ లబ్ధిదారుడు తాను సామగ్రి తీసుకునే వ్యాపారి నిజాయితీని చాటేలా అఫిడవిట్ ఇవ్వాల్సిందేనన్న రూల్ అమల్లోకి తీసుకువచ్చారు. క్షేత్రస్థాయిలో అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దళితబంధు పథకం అమలులో కొందరు నేతలు కమీషన్లు తీసుకుంటున్నారన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో కలెక్టర్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నేపథ్యమిదీ.. హుజరాబాద్ ఉప ఎన్నికకు ముందు దళితుల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు ప్రారంభించింది. పథకంలో భాగంగా అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది. ఆర్థిక అసమానతలను రూపుమాపడం ద్వారా దళితులంతా సామాజిక సమానత్వం సాధించాలన్న లక్ష్యంతో ఈ పథకానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు. నియోజకవర్గంలోని శాలపల్లి వేదికగా పథకాన్ని ముఖ్యమంత్రి లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు అందజేసి ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు రెండేళ్లకాలంలో హుజూరాబాద్, ఇల్లందకుంట, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్ (హన్మకొండ జిల్లా) మండలాల్లో లబ్ధిదారులను గుర్తించి మొత్తం 18,021 దళిత కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేశారు. ఇందులో 14,080 కుటుంబాలు కరీంనగర్ జిల్లాలో ఉండగా.. మిగిలిన 3,941 కుటుంబాలు కమలాపూర్ మండలంలో ఉన్నాయి. గోల్‌మాల్‌కు యత్నం? జిల్లాలో మొత్తం 18,021 మంది దళితబంధు కోసం దరఖాస్తు చేసుకోగా 14,080 మంది అర్హులని అధికారులు తేల్చారు. వీరిలో 10,970 కుటుంబాలకు పూర్తిస్థాయిలో రూ.10 లక్షల (రూ.9.80 లక్షల, రూ. 20 వేలు బీమా) మేర ఆర్థిక సాయం అందించారు. ఇందులో వివిధ వ్యాపారాలతోపాటు, తయారీ, ఉత్పత్తి, డెయిరీ, పౌల్ట్రీ మోటారు వాహనయూనిట్లు , మిగిలిన 3,100 మంది మాత్రం రిటైల్ యూనిట్లు ఎంచుకున్నారు. తొలివిడతగా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నిధులు డ్రాచేసుకుని వ్యాపారాలు ప్రారంభించారు. వీరిలో కొందరు రెండో విడత కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో భాగంగా యూనిట్‌కు సంబంధించిన సామగ్రి కొటేషన్ కూడా దళితబంధు యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొందరు గుర్తింపులేని సంస్థల నుంచి కొటేషన్స్ తీసుకున్న విషయాన్ని మండలాల్లోని క్లస్టర్ ఆఫీసర్లు గుర్తించారు. అలాంటి కొటేషన్లు మంజూరు చేస్తే.. నిధులు దారి మళ్లే ప్రమాదముంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే అనుమానాస్పద దరఖాస్తులను తిరస్కరించారు. దీనికితోడు కొందరు దళారులు తాము కొటేషన్లు ఇస్తామంటూ నిరక్షరాస్యులైన లబ్ధిదారుల వద్ద డబ్బులు కూడా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోయాయి. మరోవైపు గుర్తింపులేని చాలా సంస్థల వద్ద సరుకు కోసం డబ్బులు కట్టినవారు మోసపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ లీగల్ అఫిడవిట్ నిబంధనను ప్రవేశపెట్టారు. ఇవీ నిబంధనలు ♦ అఫిడవిట్ జారీ చేసే వ్యాపారి తప్పనిసరిగా జీఎస్టీ నెంబరును కలిగి ఉండాలి. ♦ సదరు జీఎస్టీ నెంబరు కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే తీసుకున్నది అయి ఉండాలి. తద్వారా నకిలీ ఇన్వాయిస్లకు అడ్డుకట్ట వేయవచ్చు. ♦ లబ్ధిదారులు హుజూరాబాద్ మండలాలైన హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట వ్యాపారుల నుంచి రా మెటీరియల్ సప్లై కోసం ఇచ్చే కొటేషన్లు ♦ తీసుకోరు. ఇటీవల ములుగు నుంచి గుర్తింపు లేని ఓ సంస్థ కొటేషన్‌ను అధికారులు గుర్తించడమే ఇందుకు కారణం. ♦ లీగల్ అఫిడవిట్ మీద వ్యాపారి వివరాలు, దళితబంధు లబ్ధిదారులకు సరఫరా చేసే సామాగ్రి వివరాలు పొందుపరిచి ఉండాలి. అంతేకాదు, తానేమైనా తప్పుడు ♦ సమాచారం ఇచ్చి ఉంటే కలెక్టర్ తీసుకునే చట్టపరమైన చర్యలకు బద్ధుడినై ఉంటానంటూ సంతకం కూడా చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ♦ లబ్ధిదారులు హుజూరాబాద్ కాకుండా హైదరాబాద్, కరీంనగర్, రాష్ట్రంలో జీఎస్టీ గుర్తింపు పొందిన ఏ వ్యాపారి వద్ద నుంచైనా కొటేషన్ తీసుకురావచ్చు. వాటిని ఎంపీడీవోలు వెరిఫై చేసి, ఉన్నతాధికారులకు పంపుతారు. పారదర్శకత కోసమే దళితబంధు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం. నిధుల మంజూరులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కొత్తగా లీగల్ అఫిడవిట్ విధానాన్ని ప్రవేశపెట్టాం. దీంతో లబ్ధిదారులకు నాణ్యమైన ముడిసరుకు లభిస్తుంది. తప్పుడు కొటేషన్లతో అటు ప్రభుత్వ అధికారులు, ఇటు లబ్ధిదారులను మోసం చేసే వీలు లేకుండా ఉంటుంది. దళారీ వ్యవస్థకు చెక్ పడనుంది. పథకం అమలులో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకత అమలు అయ్యేలా చూడటమే ప్రభుత్వ బాధ్యత. – ఆర్వీ కర్ణన్, కలెక్టర్, కరీంనగర్ -
రెండో విడత మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్
న్యూఢిల్లీ: యువతకు నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు, అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్ (ఎంజీఎన్ఎఫ్) రెండో విడతను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ఆవిష్కరించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్)లతో కలిసి ఈ రెండేళ్ల కోర్సును రూపొందించారు. దీనిలో భాగంగా విద్యార్థులు ఇటు తరగతి గదుల్లో విద్యాభ్యాసంతో పాటు క్షేత్ర స్థాయిలోనూ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు. సుశిక్షితులైన మానవ వనరులకు సంబంధించి నెలకొన్న డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం, జిల్లా స్థాయిలో ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దడం మొదలైనవి ఎంజీఎన్ఎఫ్ ప్రోగ్రాం లక్ష్యాలు. విద్య, వృత్తిపరమైన అనుభవం ఉన్న 21–30 మధ్య వయస్సు గల పురుషులు, మహిళలు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. -
4 నుంచి డిగ్రీ రెండో విడత కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా డిగ్రీ కోర్సుల్లో సీట్ల భర్తీకి అమల్లోకి తెచ్చిన ఆన్లైన్ విధానం విద్యార్థులకు ఉపయుక్తంగా మారింది. తొలివిడత కౌన్సెలింగ్ పూర్తికావడంతో ఉన్నత విద్యామండలి ఈనెల 4వ తేదీనుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఆన్లైన్ విధానంతో విద్యార్థులకు మెరిట్ ఉంటే తాము కోరుకున్న కాలేజీలో, కోర్సులో సీటు పొందే అవకాశం దక్కింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే రిజర్వుడ్ వర్గాలకు గతంలో ప్రముఖ ప్రైవేటు కాలేజీల్లో చదివేందుకు అవకాశం దక్కేది కాదు. ఇప్పుడు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు భర్తీ చేస్తుండటంతో ఆయా వర్గాల వారికి సీట్లు దక్కుతున్నాయి. విద్యార్థులు గతంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కాలేజీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంట్లో కూర్చునో, లేదంటే దగ్గర్లోని ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి ఆన్లైన్లో తమకు నచ్చిన కాలేజీల్లో, నచ్చిన కోర్సుల్లో సీటు కోసం ఆప్షన్ ఇచ్చి సీట్లు పొందుతున్నారు. (చదవండి: ఘరానా మోసం: మరణించినట్లుగా నమ్మించి..) విద్యార్థులకు అందుబాటులో కాలేజీల సమాచారం రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల పరిధిలో ప్రభుత్వ, ప్రయివేటు ఎయిడెడ్, ప్రయివేట్ అన్ ఎయిడెడ్.. మొత్తం 1,301 కాలేజీల్లో వివిధ కోర్సులకు సంబంధించి 4,95,956 సీట్లున్నాయి. కాలేజీలో ఉన్న కోర్సులు, సదుపాయాలు, ల్యాబ్‌లు, లెక్చరర్లు, న్యాక్ గుర్తింపు వంటి అన్ని వివరాలను ఉన్నత విద్యామండలి.. వెబ్ కౌన్సెలింగ్ కోసం ఏర్పాటుచేసిన హెచ్‌టీటీపీఎస్://ఓఏఎండీసీ.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో జిల్లాల వారీగా ఉంచింది. ఈ వివరాలు పరిశీలించిన విద్యార్థులు తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చారు.(చదవండి: బడి 'రెడీ': నేటి నుంచి ప్రైమరీ స్కూళ్లు) గతనెల 6వ తేదీనుంచి 21వ తేదీవరకు తొలివిడత కౌన్సెలింగ్‌ను నిర్వహించి 24వ తేదీన 1,95,645 సీట్లను కేటాయించారు. విద్యార్థుల ఫోన్లకు ఏ కాలేజీలో ఏ కోర్సులో సీటు వచ్చిందో సమాచారం పంపించారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో చిత్తూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి విడతలో సీట్లు రానివారికోసం, తాము అనుకున్న కాలేజీలో, కోర్సులో సీట్లు పొందలేని వారికోసం రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనుంది. -
11న రెండో విడత అమ్మఒడి..
సాక్షి, నెల్లూరు: ఈ నెల 11న నెల్లూరులో రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సారి గతంలో కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకి ఇస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైనవారందరికీ కచ్చితంగా ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. కార్పొరేట్ స్కూళ్ల మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు ఆర్ఐవోను బెదిరించిన నారాయణ కాలేజి డైరెక్టర్‌పై కేసు నమోదుకు ఆదేశించామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. (చదవండి: ఏపీలో 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు) -
జనవరి 9న రెండో విడత అమ్మఒడి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడత అమ్మఒడి కార్యక్రమం జనవరి 9న ప్రారంభమవుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, సీఎం సూచనల మేరకు జనవరి 5 వరకు అమ్మఒడి మార్పులు, చేర్పులకు అవకాశం ఉందన్నారు. (చదవండి: ‘సీఎం జగన్ చెప్పారంటే.. చేస్తారంతే’) జనవరి 6న అమ్మఒడి అర్హుల జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు అమ్మఒడి ఇవ్వడంలేదనేది తప్పుడు ప్రచారమన్నారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ అమ్మఒడి ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. రెండో విడత అమ్మఒడి కోసం రూ.6,450 కోట్లు కేటాయించామన్నారు. గత ఏడాది అమ్మఒడి అందిన అందరూ రెండో విడతకి అర్హులేనని మంత్రి సురేష్ వెల్లడించారు.(చదవండి: ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు) -
రెండోదశ పరిషత్ నామినేషన్లు షురూ
సాక్షి, హైదరాబాద్: రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల దాఖలు పర్వం శుక్రవారం మొదలైంది. వచ్చే నెల 10న జరగనున్న రెండో విడత ఎన్నికల్లో 180 మండలాల్లోని 180 జెడ్పీటీసీ సీట్లకు, 1,913 ఎంపీటీసీ సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. దీనిలో భాగంగా తొలిరోజు ఎంపీటీసీ స్థానాలకు 2,682 మంది అభ్యర్థులు 2,765 నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్–1,292, కాంగ్రెస్–816, బీజేపీ–217, సీపీఎం–38, టీడీపీ–36, సీపీఐ–17, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు–10, ఇండిపెండెంట్లు–353 నామినేషన్లు సమర్పించారు. ఇక జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 370 మంది అభ్యర్థులు 381 నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్–157, కాంగ్రెస్–126, బీజేపీ–41, టీడీపీ–10, సీపీఐ, సీపీఎం చెరో 5, ఇండిపెండెంట్లు–32, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపుపొందిన, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన పార్టీ లు–5 నామినేషన్లు వేశాయి. ఈ నెల 28న సాయంత్రం 5కి రెండో దశ ఎన్నికల నామినేషన్ల సమర్పణ గడువు ముగియనుంది. సోమవారం సాయంత్రం 5 వరకు నామినేషన్ల పరిశీలన, 5 గంటల తర్వాత చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబి తా ప్రచురణ, 30న సాయంత్రం 5 వరకు తిర స్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లకు అవకా శం ఇస్తారు. మే 1న సాయంత్రం 5లోపు అప్పీళ్లను పరిష్కరిస్తారు. 2న సాయంత్రం 3లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించా రు. అదేరోజు 3 గంటల తర్వాత పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రచురిస్తారు. మే 10న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 27న ఉదయం 8 నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. -
రెండో విడతా గులాబీదే
సాక్షి, హైదరాబాద్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా చాటింది. తొలివిడతలో సింహభాగం పంచాయతీలను కైవసం చేసుకున్న గులాబీ పార్టీ రెండో విడతలోనూ అదేజోరును ప్రదర్శించింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 4,135 గ్రామ పంచాయతీలకు గాను 4,130 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఐదు పంచాయతీలకు నామినేషన్లు రాకపోవడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికలు జరిగిన వాటిలో టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు 2,865 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నారు. 770 పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. టీడీపీ 39 పంచాయతీల్లో, 43 పంచాయతీల్లో బీజేపీ, 12 పంచాయతీల్లో సీపీఐ, 22 పంచాయతీల్లో సీపీఎం పార్టీలు పాగా వేశాయి. మరో 379 గ్రామ పంచాయతీల్లో స్వతంత్రులు విజేతలుగా నిలిచారు. నామినేషన్లు రాని కారణంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు గ్రామ పంచాయతీలు ఆదిలాబాద్, ఖమ్మం, జయశంకర్భూపాలపల్లిలో ఒక్కో పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక్కోవార్డు స్థానాల లెక్కింపుపై అస్పష్టత నెలకొనడంతో వాటి ఫలితాలు నిలిపివేశారు. ఈనెల 30న తుది విడత ఎన్నికలతో పాటు ఈరెండు వార్డుల ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘యాదాద్రి భువనగిరి’లో 93% పోలింగ్ గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో 88.26 శాతం పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 93.71 శాతం ఓటింగ్ నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 92.82 శాతం, మెదక్ 92.52 శాతం, సిద్దిపేట 92.34 శాతం, నల్లగొండ జిల్లాలో 92.01 శాతం, ఖమ్మం 91.91 శాతం, మహబూబాబాద్ 91.05 శాతం, జనగామ 90.52 శాతం, నాగర్‌కర్నూల్ 90.17 శాతం, కామారెడ్డి జిల్లాలో 90.04 శాతం ఓటింగ్ నమోదైంది. జగిత్యాల జిల్లాలో అత్యల్పంగా 80.23 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగ్గా... మొత్తం 37,76,797 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వీరిలో 19,08,889 మంది మహిళలు, 18,67,898 మంది పురుషులున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రూ.33 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. -
ఎదురుచూపులే..
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఖరీఫ్ సీజన్ పూర్తి కావచ్చింది. నవంబర్ నుంచి యాసంగి సాగు పనులు జోరందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందించే పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రెండవ విడత రైతుబంధు చెక్కుల పంపిణీని ఈ నెలలోనే చేపట్టాలని అంతా సిద్ధం చేసింది. అయితే ముందస్తు అసెంబ్లీఎన్నిల షెడ్యూల్ వెలువడడంతో కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు చెక్కుల పంపిణీకి నిలిపివేసింది. ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలని ఆదేశించింది. దీంతో ఎకరాకు రూ.4వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వ్యవసాయ అధికారులు బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. రెండవ విడతలో మొత్తం అర్హులైన రైతులు 1,16,557 మందికి గాను రూ.166.80 కోట్లు వరకు అందాల్సి ఉంది. ఇప్పటివరకు 65,220 మంది ఖాతాల వివరాలు తీసుకోగా, ఇందులో 51,337 మంది రైతుల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఇందులో 13,400 మంది రైతుల ఖాతాల్లో రూ.14 కోట్ల వరకు నగదు పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరు వరకు ఖాతాల వివరాలు సేరించనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. మొదట ఈనెల 25వ తేదీ వరకు గడువు విధించగా, గత పదిహేను రోజులుగా మండల వ్యవసాయ కార్యాలయ వద్ద రైతుల సందడి నెలకొంది. పూర్తి స్థాయిలో రైతులు ఖాతా వివరాలు అందజేయకపోవడంతో మరో వారం రోజులు గడువు పెంచారు. కోటపల్లి, తాండూర్, దండేపల్లి, జన్నారం మండలాల్లో 80 శాతం వివరాలు సేకరించారు. మిగతా మండలాల్లో 50 నుంచి 70 శాతం పూర్తయ్యింది. రైతుల ఇంటి వద్దకు వెళ్లి వివరాలు సేకరించాల్సి ఉండగా, వ్యవసాయ అధికారులు కార్యాలయాల్లో కూర్చొని పని కానిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండడంతో రైతులు సమయానికి కార్యాలయాలకు వచ్చి వివరాలు అందించలేకపోతున్నారు. దీనికి తోడు సేకరించిన రైతుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో కొంత వరకు సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పెంచిన గడువులోగా అయినా పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల వివరాలు తీసుకుంటే నగదు జమ అయ్యే అవకాశం ఉంటుంది. మొదటి విడత రైతులకే.. గత ఖరీఫ్‌లో రైతుబంధు చెక్కులు పొందిన రైతులకే రెండవ విడత యాసంగి పెట్టుబడి సాయం అందుతుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రెండవ విడత చెక్కులు పంపిణీ చేయకుండా మొదటి విడత చెక్కులు తీసుకున్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఈ నెల 10వ తేదీ నుంచి రైతుల ఖాతాల వివరాలు సేకరణ పనిలో పడ్డారు. ఖాతాలో ఆప్‌లోడ్ అయిన కొద్ది రోజులకు రైతుల సెల్‌కు ఖాతాలో నగదు జమ అయినట్లు మెసేజ్ వస్తోంది. అయితే ఇప్పటివరకు సాయం పొందాల్సిన రైతులకు సంబంధించిన ఖాతాల దరఖాస్తులు 65 శాతం రాగా.. ఇందులో 52 శాతం ఆన్లైన్లో అప్లోడ్ అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైతులు సహకరిస్తే పెట్టుబడి సాయం పూర్తిస్థాయిలో అందేందుకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం లేదని వ్యవసాయ అధికారులు అంటున్నారు. నెలాఖరు వరకు గడువు : వీరయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రైతుల వివరాల సేకణరకు తొలుత ఈ నెల 25వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించింది. వివరాల సేకరణలో ఆలస్యం కావడంతో గడువును నెలాఖరు వరకు పెంచడం జరిగింది. రైతులు ఆలస్యం చేయకుండా ఖాతాల వివరాలు అందజేస్తే సత్వరమే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం. ఇప్పటివరకు 80 వేల మంది రైతుల వరకు ఖాతాల వివరాలు సేకరించాం. ఇందులో 62వేల మంది రైతుల వివరాలను ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేశాం. జిల్లాలో ఇప్పటివరకు రూ.14 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. -
నేటినుంచి ‘రైతుబంధు’
నల్లగొండ అగ్రికల్చర్ : నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కానుంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కోసం అమలుచేస్తున్న రైతుబంధు రెండో విడత చెక్కుల పంపిణీకి బదులు రైతుల ఖాతాల్లో నగదును జమచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10నుంచి వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వద్దను నుంచి వారి బ్యాంకుఖాతా నంబర్లను సేకరించే పనిలో తలమునకలయ్యారు. రబీ రైతుబంధు పథకం పెట్టుబడి సాయం అందుకోనున్న రైతులు జిల్లా వ్యాప్తంగా 3,59,496 మంది ఉన్నారు. అయితే ఈ నెల 22 నాటికి రైతుల నుంచి వ్యవసాయ విస్తరణాధికారులు 42 వేల ఖాతాలను సేకరించాలని జిల్లా వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించింది. ఈ ప్రక్రియ వేగవంతంగా సాగడంతో ఇప్పటి వరకు 77,821 ఖాతానంబర్లు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్ నంబర్లను సేకరించడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేసి రాష్ట్ర వ్యవసాయ శాఖకు అనుసంధానం చేశారు. దీని ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో సోమవారం నుంచి నగదు జమ చేయనుంది. ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండో దశ పెట్టుబడి సాయం రైతులకు అందునున్న నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రైతుల ఖాతా నంబర్లను దశల వారీగా సేకరించి రైతుల ఖాతాల్లో రబీ పెట్టుబడి సాయాన్ని జమచేయడానికి జిల్లా వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఏఈఓలు లక్ష్యానికి మించి రైతుల నుంచి వివరాలు సేకరించడంపై జిల్లా వ్యవసాయాధికారి జి.శ్రీధర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచిసేకరించిన వివరాలు ఇలా.. మిర్యాలగూడ మండలంలో 17,306 మంది రైతులకు గాను 4,709 ఖాతాలు, దేవరకొండలో 11,930 మందికి 4,248, చింతపల్లిలో 13,132కు 4205, మునుగోడులో 13,562కు 3,704, పెద్దవూరలో 13,380కి 3,639, నల్లగొండలో 16,740కి 3,607, కనగల్‌లో 14,122కు 3,329, నిడమనూరులో 14,316కు 3,122, అడవిదేవులపల్లిలో 4,063కు 3,088, చండూరులో 12,713కు 2,953, నార్కట్‌పల్లిలో 12,943కు 2,664, వేములపల్లిలో 8,469కు 2,606 ఖాతాలను సేకరించారు. గుర్రంపోడులో 16,414కు 2,603, కట్టంగూరులో 11,507కు 2,592, తిరుమలగిరి(సాగర్)లో 9,782కు 2,530, దామరచర్లలో 8,500కు 2,423, కొండమల్లెపల్లిలో 8,074కు 2,358, పీఏపల్లిలో 11,157కు 2,344, నకిరేకల్‌లో 8,448కు 2,322, శాలిగౌరారంలో 12,912కు 2,155, అనుములలో 11,188కు 2,106, చిట్యాలలో 13,035కు 2,065, మర్రిగూడలో 11,715కు 1,976, తిప్పర్తిలో 10,696కు గాను 1,794 రైతుల ఖాతాలను సేకరించారు. కేతేపల్లిలో 9,106కు 1,590, మాడుగులపల్లిలో 10,969కు 1,540, గుండ్లపల్లిలో 11,648కి 1,362, నాంపల్లిలో 15,070కి 1,224, చందంపేటలో 9,083కు 944, త్రిపురారంలో 12,042కు 925 మంది రైతులనుంచి ఖాతాలను సేకరించారు. వీరందరికీ సోమవారం నుంచి ఆన్లైన్ ప్రక్రయ ద్వారా రబీ పెట్టుబడి సాయం డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాగానే వెంటనే ఆ బ్యాంకు నుంచి రైతుల మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. అనిరంతరం కొనసాగుతుంది రైతులందరికీ రబీ పెట్టుబడి సాయం ఖాతాల్లో జమచేసే వరకు ఖాతా నంబర్ల సేకరణ, ఆన్లైన్ ద్వారా డబ్బులు వేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రతి రైతు విధిగా తమ పాస్‌పుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా జిరాక్స్‌ను వ్యవసాయ విస్తరణాధికారులను అందించాలి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొదటిదశలో వచ్చిన వారందరికీ ఖాతాల్లో డబ్బు జమచేస్తారు. జి.శ్రీధర్‌రెడ్డి, జేడీఏ -
‘రెండో’ చెక్కు రెడీ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండో విడత రైతుబంధు చెక్కుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. వ్యవసాయాధికారులు మండలాలవారీగా రైతులకు చెక్కులు అందజేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయానికి పెట్టుబడి అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి.. మొదటి విడతగా రైతులకు చెక్కులు పంపిణీ చేసిన విషయం విదితమే. అందులో కొన్ని లోటుపాట్లు జరగగా.. ఈసారి పకడ్బందీగా పంపిణీ చేసేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయాధికారులు.. కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు చెక్కుల పంపిణీపై వివరించారు. పాలనాపరమైన అనుమతుల కోసం సంబంధిత అధికారులు వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఆయా బ్యాంకులకు రైతులకు సంబంధించిన చెక్కులు అందుతుండగా.. వీటిని వ్యవసాయాధికారులు పరిశీలించే పనిని ప్రారంభించారు. జిల్లాలోని 379 రెవెన్యూ గ్రామాల పరిధిలో దాదాపు 2,85,348 మంది రైతులు ఉన్నారు. వారికున్న భూముల ఆధారంగా ఖరీఫ్‌లో రూ.275.01కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రబీలో కూడా ఇదే మొత్తంలో చెక్కుల రూపంలో రైతులకు అందించనుంది. దీనికి సంబంధించి గ్రామాల్లో ముందస్తుగా టమకా వేయించాల్సి ఉంటుంది. ఏఓలు, ఏఈఓల ద్వారా రైతులకు తెలియజేసి.. నిర్ణయించిన తేదీల్లో చెక్కులు అందజేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. బ్యాంకులకు చేరుతున్న చెక్కులు రబీ సీజన్ ప్రారంభమవుతుండడంతో రైతుబంధు చెక్కులను రైతులకు పంపిణీ చేయనున్నారు. ఐదు మం డలాలకు చెందిన చెక్కులు ఆంధ్రా బ్యాంకుకు చేరాయి. ఖమ్మం రూరల్ మండలానికి రూ.12.99కోట్ల విలువైన 13,436 చెక్కులు, నేలకొండపల్లికి సంబంధించి రూ.13.26కోట్ల విలువైన 16,203 చెక్కులు, తల్లాడకు సంబంధించిన రూ.12.31కోట్ల విలువైన 12,688 చెక్కులు, వేంసూరుకు సంబంధించి రూ.15.09కోట్ల విలువైన 15,227 చెక్కులు, ఎర్రుపాలెంకు సంబంధించి రూ.13.51కోట్ల విలువైన 13,439 చెక్కులు ఆంధ్రా బ్యాంకుకు చేరాయి. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు కూడా చెక్కులు చేరుతున్నాయి. మధిరకు సంబంధించి 16,407, ముదిగొండ 15,404, సత్తుపల్లి 11,004, తిరుమలాయపాలెం 16,774, ఖమ్మంకు సంబంధించి 10,975 చెక్కులు ఐఓబీకి చేరాయి. ఆయా చెక్కులను వ్యవ సా య శాఖ శుక్రవారం నుంచి పరిశీలిస్తోంది. క్షేత్రస్థాయి లో చెక్కులు మంజూరైన రైతులకు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఖరీఫ్‌లో పంపిణీ కాని 20,274 చెక్కులు గత ఖరీఫ్‌లో 379 రెవెన్యూ గ్రామాల్లోని రూ.15.63కోట్ల విలువైన 20,274 చెక్కులు పంపిణీ కాలేదు. మొత్తం 2,83,756 చెక్కులను పంపిణీకి సిద్ధం చేయగా.. వాటిలో 674 చెక్కులలో తప్పులు దొర్లాయి. 2,68,499 చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. అలాగే అటవీ భూములకు సంబంధించి 5,691 చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. ఇక పంపిణీ కాని 20,274 చెక్కులలో మరణించిన రైతులు.. రెండు ఖాతాలున్నవి.. తమకు సాయం అవసరం లేదని వెనుకకు ఇచ్చినవి.. ప్రభుత్వ భూమికి సంబంధించినవి.. భూ వివాదాలు నెలకొన్నవి.. భూమి లేకపోయినా చెక్కులు జారీ అయినవి.. పట్టాదార్ పాస్ పుస్తకాల్లో తప్పులు దొర్లినవి.. చెక్కులలో తప్పులు ఉన్నవి.. ఉన్న భూమి కంటే ఎక్కువ నిధులతో ఉన్న చెక్కులు.. సాగులో లేని భూమికి వచ్చిన చెక్కులు.. ఆధార్ లేని చెక్కులు.. గ్రామాల్లో లేని రైతుల చెక్కులు.. విదేశాల్లో ఉంటున్న రైతులకు సంబంధించినవి.. అమ్మిన భూములకు సంబంధించిన చెక్కులు.. ఆర్ఓఎఫ్ఆర్ పెండింగ్ ఉన్న చెక్కులను పంపిణీ చేయలేదు. విదేశాల్లోని రైతులకూ.. గత ఖరీఫ్‌లో విదేశాల్లో ఉన్న రైతులకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేయలేదు. అయితే ప్రభుత్వం వీరికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆయా రైతులకు కూడా చెక్కులు పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటి పంపిణీ కూడా కొనసాగనున్నది. జిల్లాలో మొత్తం 744 చెక్కులకు సంబంధించి రూ.60లక్షలు రైతులకు అందజేయాల్సి ఉంది. చాలా సంతోషం.. తెలంగాణ ప్రభుత్వం అందించే వ్యవసాయ పెట్టుబడి రెండో విడత చెక్కులు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. మొదటి విడతలో నాకు రూ.14వేలు వచ్చాయి. రెండో విడత కూడా రూ.14వేలు వస్తాయి. ప్రస్తుతం వ్యవసాయం పనులకు చాలా ఉపయోగపడతాయి. – ఎనికె జానకిరామయ్య, రైతు, అప్పలనర్సింహాపురం రైతుకు భరోసా.. ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు పెట్టుబడి పథకం ఇవ్వడం భరోసా కల్పించింది. నాకు మూడున్నర ఎకరాలకు పెట్టుబడి అందింది. వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా సాగు చేశాను. ఇప్పుడు వ్యవసాయ పనులకు సరైన సమయంలో రైతుబంధు ఇస్తుండడం మంచి పరిణామం. – అమరగాని వెంకయ్య, రైతు, చెరువుమాదారం పంపిణీకి చర్యలు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతుబంధు చెక్కుల పంపిణీకి సంబంధించి చర్యలు చేపట్టాం. గతంలో ఖరీఫ్‌లో నిర్వహించిన విధంగానే చెక్కుల పంపిణీ చేపడతాం. ఇప్పటికే చెక్కులు బ్యాంకులకు చేరుతున్నాయి. వచ్చిన చెక్కులను సంబంధిత మండలాల అధికారులతో పరిశీలించే పనిని చేపట్టాం. – ఎ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారిణి -
పట్టాలు సరే భూములేవి!
నాగిరెడ్డిపేట(నిజామాబాద్): భూమిలేని నిరుపేదలకు ఒక్కో కుటుంబానికి మూడెకరాల భూమి ని అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న భూ పంపిణీ పథకం లక్ష్యం.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతోంది. లబ్ధిదారులకు మూడెకరాల చొ ప్పున భూమిని పంపిణీ చేయాల్సి ఉం డగా.. నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో మాత్రం పట్టాలు మాత్రమే ఇచ్చి భూముల విషయం మరిచారు. దీంతో లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. అసలేం జరిగింది... భూ పంపిణీ పథకం కింద మాల్తుమ్మెద గ్రామంలో మొదటి విడతలో షెడ్యూల్కులాలకు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేశారు. రెండోవిడతలో మరో ఎనిమిది మందిని ఎంపికచేసిన అధికారులు.. వారికి భూమిని పంపిణీ చేయడానికి అవసరమైన భూమిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ఇదే గ్రామానికి చెందిన 16 మంది రైతులను సంప్రదించారు. గ్రామస్తుల సమక్షంలో పలుమార్లు వారితో చర్చలు జరిపిన అనంతరం వారి భూములను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. సుమారు 23 ఎకరాల 35 గుంటల భూమిని కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తుల సమక్షంలో అప్పటి జాయింట్ కలెక్టర్ సత్తయ్య సమావేశాలు నిర్వహించారు. ఎకరాకు రూ. 4.80 లక్షల చొప్పున చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. 16 మంది పట్టాదారులలో ఇద్దరికి సంబంధించిన భూమి సాగుకు అనుకూలంగా ఉండడంతో వారికి మాత్రం ఎకరాకు రూ. 5లక్షల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. అయితే బడ్జెట్ లేకపోవడంతో పట్టాదారులకు డబ్బుల చెల్లింపులో జాప్యం జరిగింది. మరోవైపు పట్టాదారులకు డబ్బులు చెల్లించకుండానే భూ పంపిణీ పథకానికి ఎంపికచేసిన ఎనిమిది మంది పేరిట అంబేద్కర్ జయంతి రోజున జిల్లాకేంద్రంలో కలెక్టర్ చేతులమీదుగా పట్టాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులలో ఎవరెవరికి ఏ ఏ సర్వేనంబర్లలో ఎంతెంత భూమి ఉందో పట్టా సర్టిఫికెట్లలో వివరంగా పేర్కొన్నారు. లబ్ధిదారులకు పట్టాలను మాత్రమే పంపిణీ చేసిన అధికారులు వారికి భూములను మాత్రం చూపలేదు. తమకు డబ్బులు చెల్లించేవరకు తమ భూముల్లోకి లబ్ధిదారులను రానిచ్చేదిలేదని పట్టాదారులు స్పష్టం చేశారు. భూమి కోసం లబ్ధిదారులు తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సాగుకు నోచుకోక బీళ్లుగా... లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఎంపికచేసిన మాల్తుమ్మెద గ్రామశివారులోని వ్యవసాయ భూముల్లో ఎలాంటి పంటలూ సాగు చేయడం లేదు. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉందన్న కారణంతో ఆ భూముల్లో ఎలాంటి పంటలు వేయవద్దని భూములను విక్రయించాడని ముందుకు వచ్చిన రైతులకు అధికారులు సూచించారు. దీంతో వారు పంటలు వేయడం లేదు. మరోవైపు తమకు డబ్బులు ఇచ్చేంతవరకు భూములపై హక్కు వదులుకునేది లేదని పట్టాదారులు పేర్కొంటున్నారు. దీంతో భూములు బీళ్లుగానే ఉంటున్నాయి. భూములను విక్రయించేందుకు విముఖత గతంలో తమ భూములను విక్రయించేందుకు ముందుకు వచ్చిన రైతుల్లో ఐదుగురు ప్రస్తుతం భూమిని ఇచ్చేందుకు విముఖత చూపుతున్నారు. వీరికి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. తీర్మానం చేసిన సమయంలో నిర్ణయించిన ధరకంటే ప్రస్తు తం తమ భూముల ధరలు పెరిగాయంటున్నారు. మరోవైపు మాల్తుమ్మెద గ్రామంలో భూ పంపిణీకి ఎంపికైన లబ్ధిదారులు కటిక పేదరికంలో మగ్గుతున్నారు. ఈ క్రమంలో అధికారులు మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేస్తామని చెప్పడంతో వారిలో ఆశలు రెకెత్తాయి. కానీ పట్టాలు ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్నా భూములు చూపకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఊళ్లో పనిదొరక్క వలస వెళ్తున్నారు. ఐదుగురు లబ్ధిదారులు హైదరాబాద్, ఆర్మూర్ ప్రాంతానికి వలస వెళ్లారు. పట్టాలు ఇచ్చి భూములను మరిసిండ్రు మూడు ఎకరాల భూమి ఇస్తామం టే మాకు ధైర్యం వచ్చింది. బతుకు మీద భరోసా కలిగింది. కానీ ఇప్పుడు ఊట్టి కాగితాలే ఉన్నయి. మాకు ఇంకా భూములు సూపట్టలేదు. మాకు భూములను పంచుతామని చెప్పిన అధికారులు పట్టాలను ఇచ్చి భూములను మరిసినట్టుండ్రు. – నీరుడి రణీల, లబ్ధిదారు, మాల్తుమ్మెద ఊట్టి కాగితాలే ఇచ్చిండ్రు మూడెకరాల భూమి ఇస్తమని చెప్పిన సార్లు ఊట్టి కాగితాలే చేతిల పెట్టిండ్రు. మాకు ఇచ్చిన భూమి యాడున్నదో తెలుస్తలేదు. భూముల పైసలు ఇయ్యలేదని వాటి పట్టాదార్లు మమల్ని ఆ భూములళ్లకు రానిస్తలేరు. పెద్దసార్లు దయసూపి మాకు భూములు సూపెట్టాలే. – రాజిపేట లక్ష్మి, లబ్ధిదారు, మాల్తుమ్మెద కలెక్టర్‌కు నివేదిక అందించాం మాల్తుమ్మెదలో భూ పంపిణీ పథకానికి రెం డోవిడతగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు సం బంధించి ఇటీవలే కలెక్టర్‌కు నివేదికను పంపా ను. భూమిని కొనుగోలు చేయకుండా లబ్ధిదారులకు పట్టాలెలా ఇచ్చారో నాకు కూడా అర్థం కావడంలేదు. భూమిని విక్రయించేందుకు ముందుకు వచ్చిన పట్టాదారుల్లో కొంతమంది రైతులు అప్పుడు నిర్ణయించిన ధరలకు వారి భూములను అమ్మదానికి ప్రస్తుతం ముందుకు రావడంలేదు. దీంతో ముందుగా ఎంపికచేసిన లబ్ధిదారులకు భూ పంపిణీ సమస్యగా మారింది. కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. – సయ్యద్ అహ్మద్ మస్రూ, తహసీల్దార్, నాగిరెడ్డిపేట -
‘రెండో విడత’పై అయోమయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ నిలిచిపోయింది. అఖిల భారత కోటా సీట్లకు జరిగిన రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాలు ప్రకటించకపోవడంతో ఆ ప్రభావం ఇక్కడి కౌన్సెలింగ్‌పై పడింది. రెండో విడత కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారో అయోమయం నెలకొనడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. బుధవారం నుంచే ఎంబీబీఎస్, బీడీఎస్ తరగతులు ప్రారంభం కానుండటంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది. పెరిగిన అవకాశాలు ‘నీట్’ప్రవేశ పరీక్ష ఆధారంగానే దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశాలకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. అలాగే నేషనల్ పూల్‌లో 15 శాతం ప్రభుత్వ సీట్లు వచ్చి చేరా యి. మరోవైపు డీమ్డ్ వర్సిటీలకూ ఒకే దరఖాస్తు కావ డంతో విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి. అఖిల భారత కోటా రెండో విడత కౌన్సెలింగ్‌పై కొందరు కోర్టుకు వెళ్లడంతో వాటి ఫలితాలు నిలిచిపోయాయి. దీంతో తెలంగాణలో రెండో విడతకు అడ్డంకులు ఏర్పడ్డాయి. అఖిల భారత సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ మాత్రమే ఉంటుంది. తర్వాత కౌన్సెలింగ్‌లు నిర్వహించరు. కాబట్టి ఆ తర్వాత రాష్ట్రంలో కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తే ఎక్కడికక్కడ విద్యార్థులు చేరిపోతారు. ఈ నేపథ్యంలో అక్కడ రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాలు వచ్చాకే రాష్ట్రంలో రెండో విడత నిర్వహించనున్నారు. కాగా, అఖిల భారత సీట్ల రెండో విడత ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారో తమకు తెలియదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. నేటి నుంచి ఎంబీబీఎస్ తరగతులు ఎంబీబీఎస్, బీడీఎస్ మొదటి సంవత్సరం తరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో సిద్దిపేట మెడికల్ కాలేజీ ఈ ఏడాది నుంచి ఉనికిలోకి వచ్చింది. ప్రైవేటుకు సంబంధించి అయాన్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభమైంది. ఇప్పటివరకు అన్ని కేటగిరీల తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేతృత్వంలో కన్వీనర్ కోటాలోని 1,800 ఎంబీబీఎస్.. 590 బీడీఎస్ సీట్ల భర్తీ పూర్తయింది. అక్కడక్కడ కొన్ని సీట్లు మిగిలాయి. 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,100 ఎంబీబీఎస్ సీట్లుండగా వాటిలో బీ కేటగిరీ 676, సీ కేటగిరీ సీట్లు 319 ఉన్నాయి. వీటికి తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. బీ కేటగిరీ సీట్లలో దాదాపుగా అందరూ చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. సీ కేటగిరీలో ఇంకా 120 సీట్లు భర్తీ కాలేదు. దీంతో ఆ సీట్లు భర్తీ అవుతాయో లేదోనని కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. 90 శాతం చేరికలు ఇప్పటివరకు 90 శాతం సీట్లలో విద్యార్థులు చేరారని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ మొదటి ఏడాది తరగతులను ఏటా ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభించాలి. అప్పుడే వైద్య విద్యా సంవత్సరం సక్రమంగా జరుగుతుంది. ఈసారి అనేక మంది తెలంగాణ విద్యార్థులు దేశంలోని ప్రముఖ మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించినట్లు చెబుతున్నారు. -
నేడు ‘రెండో విడత రుణమాఫీ’ విడుదల?
హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి చెల్లించాల్సిన రెండో విడత రుణమాఫీ నిధుల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రైతులకు చెల్లించాల్సిన రూ.2,050 కోట్ల నిధులను విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేయనున్నారని సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగాలపై చర్చ జరిగింది. వివిధ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలను ఆర్థిక శాఖ ఇప్పటికే గుర్తించి ప్రభుత్వానికి జాబితా కూడా సమర్పించింది. పోలీసు, ఆరోగ్య, ఉన్నత విద్య, ఇంజనీరింగ్ శాఖల్లో పది నుంచి పదిహేను వేల ఉద్యోగాలను ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనుంది. భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్యను సీఎం కేసీఆర్ నిర్ణయించనున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టులను నోటిఫై చేసే అంశంపై చర్చ జరిగింది. సమీక్షలో ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, కార్యదర్శులు రామకృష్ణారావు, శివ శంకర్ పాల్గొన్నారు.