హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి చెల్లించాల్సిన రెండో విడత రుణమాఫీ నిధుల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రైతులకు చెల్లించాల్సిన రూ.2,050 కోట్ల నిధులను విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేయనున్నారని సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగాలపై చర్చ జరిగింది.
వివిధ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలను ఆర్థిక శాఖ ఇప్పటికే గుర్తించి ప్రభుత్వానికి జాబితా కూడా సమర్పించింది. పోలీసు, ఆరోగ్య, ఉన్నత విద్య, ఇంజనీరింగ్ శాఖల్లో పది నుంచి పదిహేను వేల ఉద్యోగాలను ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనుంది. భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్యను సీఎం కేసీఆర్ నిర్ణయించనున్నారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా పోస్టులను నోటిఫై చేసే అంశంపై చర్చ జరిగింది. సమీక్షలో ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, కార్యదర్శులు రామకృష్ణారావు, శివ శంకర్ పాల్గొన్నారు.
నేడు ‘రెండో విడత రుణమాఫీ’ విడుదల?
Published Sat, Jul 25 2015 2:32 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM
Advertisement