
హైదరాబాద్: రాష్ట్రంలోని చేనేత కార్మికుల కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు రూ. 33 కోట్ల రుణమాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో కార్మికుడికి రూ. లక్ష వరకూ రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు రుణాల మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం రుణమాఫీ జీవో విడుదల చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.
కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు 2017 వరకు రుణమాఫీ చేసింది. జిల్లా సహకార బ్యాంకుల నుంచి, జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ స్థాయిలో వస్త్ర వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ తయారీ రంగం కూడా ఉంది. సుమారు ఈ ఉమ్మడి జిల్లాలో సుమారు 20 వేల మంది వరకూ చేనేత కార్మికులు ఉంటారు. పోచంపల్లి, గట్టుప్పల్, పుట్టపాక, సంస్థాన్ నారాయణపురం, భువనగిరి, చండూరు, మునుగోడు తదితర ప్రాంతాల నుంచి చీరల వ్యాపారం అధికంగా సాగుతూ ఉంటోంది. ఇక్కడ సుమారు 40 పైగా సొసైటీలు ఉండగా, వాటిల్లో వేలాది మంది చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment