హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తాను చర్చకు సిద్ధంగా ఉన్ననాని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు సవాల్ విసిరారు. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పారని, అబద్ధాల్లో ఆయన గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కుతారని ఎద్దేవా చేశారు హరీష్.
రుణమాఫీ, రైతు భరోసా, బోనస్‌లపై క్లారిటీ ఇవ్వలేదని, ఏడాది దాటినా రుణమాఫీ పూర్తి చేయలేదని విమర్శించారు. ఇక సంద్య థియేటర్ ఘటన చాలా బాధాకరమన్న హరీష్.. వాంకిడి హాస్టల్‌లో విషాహారం తిని బాలిక చనిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ సమయంలో బాలిక కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదన్నారు. ఒక వ్యక్తి సీఎం సోదరుడి కారణంగా చనిపోతే చర్యలు మాత్రం శూన్యమని మండిపడ్డారు హరీష్.
Comments
Please login to add a commentAdd a comment