సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్‌రెడ్డి అక్కసుతో మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.శనివారం(డిసెంబర్21) అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై ఫైర్ అయ్యారు.
‘రుణమాఫీ చేస్తానని చెప్పి రేవంత్ మాట తప్పారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదు. వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు. సీఎం వంద శాతం రుణమాఫీ అయ్యింది అంటున్నారు. వారి ఎమ్మెల్యేలు మాత్రం 70,80 శాతం రుణమాఫీ అయ్యింది అంటున్నారు.
రేవంత్ మాటల్లో చిత్త శుద్ధి లేదు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేయలేదు. రైతులను మోసం చేశారవు. రాష్ట్రంలో 25 శాతం మాత్రమే రుణమాఫీ అయ్యింది. ఓటు నోటుకు దొంగ రేవంత్‌రెడ్డి సభలో అన్ని అబద్ధాలు చెబుతున్నాడు.
పత్తి, కంది సాగు చేసే రైతులకు రెండో పంటకు రైతు బంధు వేయరా. రాష్ట్రంలో సాగు చేయని భూముల వివరాలు ఇవ్వండని మేము అడిగితే ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదు.రైతు ఆత్మహత్యల మీద అబద్ధాలు చెప్పింది. ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం రైతు బంధు ఇచ్చిన తరువాత రైతు ఆత్మహత్యలు తగ్గాయి.
రేవంత్‌రెడ్డికి చరిత్ర తెలియదు. తెలంగాణ ఎప్పటికీ సర్ ప్లస్ స్టేట్.పదేండ్లలో లక్ష కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ,రైతు బంధు ద్వారా ఇచ్చాము.పాన్ కార్డులు, ఐటీ ఉద్యోగులు ,ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఇవ్వం అంటే ఎలా.
ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు.రైతు భరోసా మీద వేసిన కమిటీలు అన్ని కాలయాపన కోసమే. ప్రజలు కోరుకున్నది పేరు మార్పిడి కాదు. గుణాత్మకమైన మార్పు కోరుకున్నారు. కేసీఆర్ చెప్పినట్టుగా జరుగుతోంది.కాంగ్రెస్ వస్తే రైతు బంధు కట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు రైతు బంధు కట్ అయ్యింది.స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రైతులు నిలదీయాలి.
సంక్రాంతి తరువాత ఎన్నికలు అంటున్నారు ఏ సంక్రాంతి అనేది చెప్పడం లేదు. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్‌రెడ్డిని ఎర్రగడ్డకు తీసుకువెళ్లి చూపించండి. 420 హామీలు,ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు నిన్ను వదలం.ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం.ఈడీకి,మోడీకి మేము భయపడం’అని కేటీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment