Assembly winter session
-
వాగ్వాదాలు.. వాకౌట్లు
సాక్షి, హైదరాబాద్: వారం పాటు సాగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరోపణలు– ప్రత్యారోపణలు, సవాళ్లు–ప్రతి సవాళ్లు, వాగ్వాదాలు, నిరసనలు, ఉద్రిక్తతల మధ్య శనివారం ముగిశాయి. ఈ సమావేశాల్లో ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ విచారణ, ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పులపై తీవ్రస్థాయిలో చర్చ జరగ్గా.. ప్రధానమైన భూ భారతితోపాటు మొత్తం 8 బిల్లులు ఆమోదం పొందాయి.ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ ప్రారంభమైన తొలి రోజు నుంచి అడుగడుగునా అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు యతి్నంచింది. అధికార పక్షం కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పదేళ్ల పాలన రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని, వాటిని సరిచేయడానికే సరిపోతోందని చెప్పింది. ప్రశ్నోత్తరాలు, బిల్లులు, వాయిదా తీర్మానాలు, స్వల్పకాలిక చర్చ కోసం ప్రతిపాదించిన అంశాలపై పలు సందర్భాల్లో అధికార, విపక్ష సభ్యులు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. సమావేశాల చివరి రోజు శనివారం రైతుభరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. కేటీఆర్ కూడా రైతు రుణమాఫీ అంశంలో రేవంత్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందంటూ మాటల దాడికి దిగారు. రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామంలోనైనా రుణమాఫీ సంపూర్ణంగా జరిగిందని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు చేశారు.మిషన్ భగీరథ, నల్లగొండ జిల్లాకు సాగునీరు అంశాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హరీశ్‌రావు నడుమ కూడా సవాళ్ల పర్వం నడిచింది. ఇన్నాళ్లూ తమ మిత్రపక్షంగా చెప్పుకున్న ఎంఐఎం విమర్శలు చేయడం బీఆర్ఎస్ను ఇరుకున పెట్టింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు చేయగా, కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ ప్రభుత్వ అప్పులపై జరిగిన చర్చలో అధికార పక్షం వాదనను పూర్తిగా సమరి్థంచింది. మరిన్ని అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలని సూచించింది. రోజుకో రచ్చ.. కొత్త రూపంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, అదానీతో రేవంత్ ఫొటోలు, ఆటో డ్రైవర్ల సమస్యలు, లగచర్ల రైతులకు బేడీలు, ప్రభుత్వ అప్పులు, గురుకుల విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, భూ భారతి బిల్లు, ఫార్ములా ఈ, రైతు భరోసా, సభా ఉల్లంఘన నోటీసులు, ప్రతిపక్ష నేత కేసీఆర్ సమావేశాలకు గైర్హాజరు వంటి అంశాలు కేంద్రంగా అసెంబ్లీ సమావేశాలు సాగాయి. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ కేవలం ఒక రోజు మాత్రమే సమావేశమై తిరిగి 16వ తేదీకి వాయిదా పడింది. 16న స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ భేటీలో సభ నిర్వహణ తేదీలు, ఎజెండాపై స్పష్టత ఇవ్వకపోవడంతో సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి. రాష్ట్ర పర్యాటక విధానం, గురుకుల విద్యా సంస్థల్లో మౌలిక వసతులు, ప్రభుత్వ అప్పులు, రైతు భరోసా అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మండలిలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ చేపట్టకుండానే సమావేశాలు ముగిసినట్లు ప్రకటించారు. ప్రస్తుత సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి శాసనమండలి భేటీకి హాజరు కాలేదు. ఆమోదం పొందిన 8 బిల్లులు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీలు (సవరణ), జీఎస్టీ (సవరణ), వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు, అనర్హతల తొలగింపు (సవరణ), భూ భారతి (ఆర్వోఆర్), మున్సిపాలిటీ (సవరణ), జీహెచ్ఎంసీ (సవరణ), పంచాయతీరాజ్ (సవరణ) బిల్లులు. -
సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్‌రెడ్డి అక్కసుతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.శనివారం(డిసెంబర్21) అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై ఫైర్ అయ్యారు.‘రుణమాఫీ చేస్తానని చెప్పి రేవంత్ మాట తప్పారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదు. వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు. సీఎం వంద శాతం రుణమాఫీ అయ్యింది అంటున్నారు. వారి ఎమ్మెల్యేలు మాత్రం 70,80 శాతం రుణమాఫీ అయ్యింది అంటున్నారు. రేవంత్ మాటల్లో చిత్త శుద్ధి లేదు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేయలేదు. రైతులను మోసం చేశారవు. రాష్ట్రంలో 25 శాతం మాత్రమే రుణమాఫీ అయ్యింది. ఓటు నోటుకు దొంగ రేవంత్‌రెడ్డి సభలో అన్ని అబద్ధాలు చెబుతున్నాడు.పత్తి, కంది సాగు చేసే రైతులకు రెండో పంటకు రైతు బంధు వేయరా. రాష్ట్రంలో సాగు చేయని భూముల వివరాలు ఇవ్వండని మేము అడిగితే ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదు.రైతు ఆత్మహత్యల మీద అబద్ధాలు చెప్పింది. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం రైతు బంధు ఇచ్చిన తరువాత రైతు ఆత్మహత్యలు తగ్గాయి. రేవంత్‌రెడ్డికి చరిత్ర తెలియదు. తెలంగాణ ఎప్పటికీ సర్ ప్లస్ స్టేట్.పదేండ్లలో లక్ష కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ,రైతు బంధు ద్వారా ఇచ్చాము.పాన్ కార్డులు, ఐటీ ఉద్యోగులు ,ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఇవ్వం అంటే ఎలా.ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు.రైతు భరోసా మీద వేసిన కమిటీలు అన్ని కాలయాపన కోసమే. ప్రజలు కోరుకున్నది పేరు మార్పిడి కాదు. గుణాత్మకమైన మార్పు కోరుకున్నారు. కేసీఆర్ చెప్పినట్టుగా జరుగుతోంది.కాంగ్రెస్ వస్తే రైతు బంధు కట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు రైతు బంధు కట్ అయ్యింది.స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రైతులు నిలదీయాలి.సంక్రాంతి తరువాత ఎన్నికలు అంటున్నారు ఏ సంక్రాంతి అనేది చెప్పడం లేదు. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్‌రెడ్డిని ఎర్రగడ్డకు తీసుకువెళ్లి చూపించండి. 420 హామీలు,ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు నిన్ను వదలం.ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం.ఈడీకి,మోడీకి మేము భయపడం’అని కేటీఆర్ అన్నారు. -
‘వాళ్ల చేతులకు బేడీలేవీ?.. నిరసనల్లోనూ దురహంకారమేనా?’
హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీలో ఇవాళ నల్ల దుస్తులు, చేతులకు బేడీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లోనూ బీఆర్ఎస్లో సమానత్వమే లేదని అన్నారామె. అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్, హరీష్ రావుల దొరతనం మరోసారి బయటపడింది. నిరసనల్లోనూ వాళ్లు తమ దురహంకారాన్ని ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారే తప్ప వాళ్లు వేసుకోలేదు. కనీసం వాళ్ల నిరసనల్లోనూ సమానత్వం లేదనే విషయం బయటపడింది’’ అని అన్నారామె. అలాగే.. లగచర్ల రైతుకు బేడీల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. కానీ, బీఆర్ఎస్ హయాంలో కనీసం పదిసార్లు అయినా రైతులకు బేడీలు వేసి ఉంటారు. ఆ టైంలో అధికారులపై కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ఆ లెక్కన ఇప్పుడు రైతులకు బేడీలు వేశారంటూ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ లేనేలేదు. గతంలో.. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా వెల్‌లోకి వెళ్తే సభ నుంచి సస్పెండ్ చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లు కాలరాస్తున్నారు. అయినా సభలో వాళ్ళు పెట్టిన రూల్స్ పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటో? అని సీతక్క అన్నారు. -
బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే బిల్లులకు ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ నేడు వాడివేడిగా సాగుతోంది. టూరిజం పాలసీపై చర్చిద్దామని ప్రభుత్వం ప్రతిపాదించగా.. బలవంతపు భూసేకరణ, లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపైనే మొదట చర్చించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పట్టింది. సభకు బీఆఎస్ ఎమ్మెల్యేలు బేడీలు వేసుకునిరావడం గమనార్హం. -
నేడు అసెంబ్లీ పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం పునఃప్రారంభం కానున్నాయి. శాసనసభతోపాటు మండలి కూడా ఉదయం 10:30 గంటలకు భేటీ కానున్నాయి. ఈనెల 9వ తేదీన ప్రారంభమైన శీతాకాల సమావేశాలు తొలిరోజు భేటీ అనంతరం సోమవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండోరోజు ఎజెండాలో భాగంగా రెండు సభల్లోనూ తొలుత ప్రశ్నోత్తరాలు ఉంటాయి. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతి, ఊకె అబ్బయ్య, డి.రామచంద్రారెడ్డిల మృతి పట్ల అసెంబ్లీలో సంతాప తీర్మానాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది.వీరికి సంతాపం తెలిపిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వర్సిటీ, తెలంగాణ విశ్వవిద్యాలయాల బిల్లు(సవరణ)–2024ను ప్రవేశపెడతారు. ఈబిల్లులపై చర్చించి ఆమోదం తెలిపిన అనంతరం ‘తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక విధానం’పై స్వల్పకాలిక చర్చ ఉంటుంది. శాసనమండలిలోనూ ప్రశ్నోత్తరాల అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఎన్.ఇంద్రసేనారెడ్డి మృతి పట్ల సంతాప తీర్మానం, అనంతరం పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. ఈ మేరకు సోమవారం ఎజెండాను అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు విడుదల చేశారు. పలు కీలక ప్రశ్నలు: అటు అసెంబ్లీ, ఇటు మండలిలో పలు కీలక ప్రశ్నలపై రాష్ట్ర ప్రభు త్వం సమాధానం ఇవ్వనుంది. గ్రామ పంచాయతీల్లో బీటీ రోడ్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల క్రమబద్దీకరణ, స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ముదిరెడ్డిపల్లి చెరువులో నీటి కాలుష్యం, రాష్ట్రంలో నూతన టీజీఐఐసీ పార్కుల ఏర్పాటు, పర్యాటకానికి ప్రోత్సాహం, ఓయూలో బీఈ విద్యార్థుల డిటెన్షన్, రాష్ట్రంలోని బెల్టుషాపుల మూసివేత, ఐవీఎఫ్ కేంద్రాలు, జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలపై సభ్యులు అడిగే పలు ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం సమాధానం ఇవ్వడంతోపాటు ఈ అంశాల్లో అనుసరించే విధానాలను వెల్లడించనుంది. మండలిలో రాష్ట్రంలో టైగర్ రిజర్వుల అభివృద్ధి, ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవనాల నిర్మాణం, కొత్త రేషన్‌కార్డుల జారీ, తేనెటీగలు, పట్టు పురుగల పరిశోధన కేంద్రం ఏర్పాటు, వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ, రేషన్ డీలర్ల గౌరవ వేతనం, చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం, తెలంగాణలో టీటీడీ ఆస్తులు, కొత్త బీసీ గురుకులాల ఏర్పాటు, జిల్లాల పునర్వ్యవస్థీకరణలపై ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. సమావేశాలు ఎప్పటివరకు?అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఎప్పటివరకు కొనసాగించాలన్న దానిపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ చాంబర్లో జరిగే సభా వ్యవహారాల సలహా కమిటీ భేటీలో సభను ఏఏ రోజుల్లో, ఎన్ని రోజుల పాటు నడిపించాలన్న దానిపై చర్చించిన అనంతరం అధికారికంగా ప్రకటిస్తారు. శీతాకాల సమావేశాలు ఈ వారం మొత్తం సాగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిపై బీఏసీలో తుది నిర్ణయం జరగనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు కొత్త ఆర్వోఆర్ చట్టం, కులగణన, రైతు భరోసా తదితర అంశాల ఎజెండాగా కొనసాగుతుందని తెలుస్తోంది. -
Watch Live: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
అసెంబ్లీలో ‘చంద్రన్న భజన’.. పడి పడి నవ్విన సీఎం జగన్
సాక్షి, అమరావతి : పోలవరం సందర్శన పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. చంద్రన్న భజన చేయడం కోసం ఏకంగా రూ.83 కోట్లు ఖర్చు పెట్టారని సభలో పేర్కొన్నారు. ప్రజాధనాన్ని ఉపయోగించి చంద్రబాబు ఎలా భజన చేయించున్నారో ఓ వీడియో వేసి చూపించారు. అందులో పోలవరం సందర్శన వచ్చిన కొంతమంది టీడీపీ మహిళా కార్యకర్తలు చంద్రబాబును పొగుడుతూ భజన పాట పాడారు. చంద్రబాబు కృషి వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని భజన చేశారు. ఈ వీడియో చూసి సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మిగిలిన సభ్యులు పడి పడి నవ్వారు. నవ్వు ఆపుకోలేకపోయిన సీఎం జగన్ మధ్యలోనే ఆ వీడియోను ఆపేయించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇలా ప్రజల సొమ్ముతో బస్సులు పెట్టించి చంద్రబాబు భజన చేయించుకున్నారని విమర్శించారు. ఇక వీడియో చూసిన స్పీకర్ తమ్మినేని.. అప్పట్లో ఇన్ని నేరాలు.. ఘోరాలు జరిగాయన్నమాట అంటూ ఘోల్లున నవ్వారు. ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించం: సీఎం జగన్ పోలవరం నిర్మాణంలో ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించబోమని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా 45.72 మీటర్ల ఎత్తు కచ్చితంగా నిర్మిస్తామన్నారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని సభకు వివరించారు. ఎట్టి పరిస్థితిల్లో ప్రాజెక్టు ఆపబోమన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడ 100 అడుగుల వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ మరోసారి పునరుద్ఘాటించారు. -
30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాలపై నోటిఫికేషన్ గురువారం విడుదలయ్యింది. డిసెంబర్ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే నిర్ణయంపై స్పష్టత రానుంది. (చదవండి: వాటికి తొలి ప్రాధాన్యత: సీఎం జగన్) ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఎర్రచందనం, డ్రగ్స్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటి వరకు కేవలం అక్రమ ఇసుక, మద్యం అమ్మకాలకు మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిమితమైంది. ఇకపై గ్యాంబ్లింగ్, ఆన్ లైన్ బెట్టింగ్, డ్రగ్స్, ఎర్రచందనం, ఇతర నిషేధిత పదార్ధాలు ఏస్ఈబి పరిధిలోకి తీసుకువచ్చింది.(చదవండి: పన్నులపై రెండు పత్రికల దుష్ప్రచారం) -
‘అసెంబ్లీ’కి సిద్ధమవుతున్న టీఆర్ఎస్!
-
‘అసెంబ్లీ’కి సిద్ధమవుతున్న టీఆర్ఎస్!
- నేడు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ భేటీ - అధికారపక్ష సభ్యులకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసుకునేందుకు టీఆర్ఎస్ శాసనసభా పక్షం భేటీ కానుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన తరుణంలో జరుగుతున్న సమావేశాలు కావడంతో.. ఆ పార్టీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సమావేశాల్లో విపక్షాలు ఏ డిమాండ్లు చేస్తాయి, ఏ ప్రశ్నలు సంధిస్తాయన్న అంశాలపై దృష్టి పెట్టడం కంటే.. రెండున్నరేళ్ల స్వల్ప సమయంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ఏం చేశామో చెప్పుకోవడానికే ప్రాధాన్యమివ్వాలన్న వ్యూహంతో అధికార పార్టీ ఉందని నేతలు చెబుతున్నారు. విపక్షాల ప్రశ్నలతో సంబంధం లేకుండా ఆయా శాఖల వారీగా పూర్తి వివరాలను సభ ముందుంచే వ్యూహంతో ఉందని అంటున్నారు. మంత్రులను ఏ, బీ కేటగిరీలుగా విభజించడం, ఆయా సభ్యులు వారికి పట్టున్న సబ్జెక్టులపై అసెంబ్లీలో మాట్లాడేలా సిద్ధం చేసి బాధ్యతలు అప్పగించడం వంటి వాటిపై టీఆర్ఎస్ ఎల్పీ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈసారి ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, ఫీజు రీయింబర్స్మెంట్, రుణ మాఫీ, ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నందున ఈ అంశాలపై సీఎం సభ్యులకు వివరించే వీలుంది. ఇక నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు తీసుకున్న చొరవ తదితర అంశాలనూ భేటీలో సీఎం తమ సభ్యులకు తెలియజేస్తారని సమాచారం. మొత్తంగా శీతాకాల సమావేశాలను అర్థవంతంగా ముగించేందుకు అధికార పక్ష సభ్యులుగా నిర్వహించాల్సిన బాధ్యతపై దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. -
'తన పాపం బయట పడుతుందనే ఇలా.. '
-
గళం విప్పారు..
సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లాకు సంబంధించిన పలు సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకువెళ్లి, నియోజకవర్గ ప్రజల గొంతును వినిపించడంలో పలువురు శాసన సభ్యులు కృతకృత్యులయ్యారు. హైదరాబాద్‌లో ఐదు రోజులపాటు సాగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ సమావేశా సందర్భంగా అధికార టీడీపీకి దీటుగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జిల్లా సమస్యలపై గళం విప్పారు. మాట్లాడే అవకాశాన్ని అడుగడుగునా హరించే యత్నం జరిగినా.. పట్టుబట్టి మరీ ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ విషయంలో తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉత్సాహం కనబరిచారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ముసురుమిల్లి ప్రాజెక్టు గురించి వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టును విస్తరిస్తే 4 వేల ఎకరాలకు ప్రయోజనం కలుగుతుందని సభ దృష్టికి తీసుకువెళ్లారు. గిరిజనులు అధికంగా ఉన్న, వెనుకబడిన ప్రాంతమైన మొల్లేరు, మల్లవరం తదితర గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుని నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన దాడిశెట్టి రాజా తనకు కేటాయించిన మూడు నిమిషాల సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. చీటికీమాటికీ వైఎస్సార్సీపీపై నోరు పారేసుకుంటున్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీరును అసెంబ్లీ సాక్షిగా రాజా ఎండగట్టారు. మంత్రి సోదరుడు యనమల కృష్ణుడు చేస్తున్న అరాచకాన్ని నియంత్రించకుండా, నీతివాక్యాలు వల్లిస్తున్న యనమలను ఎండగట్టేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. సముద్ర తీరంలో హేచరీల నుంచి యనమల కృష్ణుడు అనధికార వసూళ్లు చేస్తున్న విషయాన్ని సభలో ప్రస్తావించారు. రంపచోడవరం నుంచి తొలిసారి ఎమ్మె ల్యే అయిన వంతల రాజేశ్వరి.. పోలవరం ముంపు మండలాల ప్రజలకు ప్రభుత్వ సేవ లు అందని అంశాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్లారు. సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచీ సభలో మాట్లాడేందుకు యత్నించగా చివరి రోజు ఆమెకు అవకాశం లభించింది. తూర్పు గోదావరిలో విలీనమైన నాలుగు పోలవరం ముంపు మండలాల సమస్యలతో పాటు, ఏజెన్సీలో నెలకొన్న పలు సమస్యలను ప్రస్తావించారు. గిరిజనుల సమస్యలను పూర్తిస్థాయిలో శాసనసభ దృష్టికి తీసుకురావడంతో రాజేశ్వరి శాయశక్తులా కృషి చేశారు. ఇదిలా ఉండగా అధికార పక్షం నుంచి పలువురు శాసనసభ్యులు జిల్లాకు చెందిన పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లగా, మరికొందరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయారు. విపత్తుల శాఖను కూడా చూస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప.. హుద్‌హుద్ తుపాను, కరవు పరిస్థితులపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కరవు, నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. రంగంపేట మండలంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి చోటు చేసుకున్న అంశాన్ని అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఇతర శాఖల నుంచి తనిఖీ అధికారులుగా నియమించాలని కోరారు. కోనసీమలో చమురు సంస్థల కార్యకలాపాలు, కాలుష్యంతో పంట దిగుబడి తగ్గిపోతోందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సభలో చెప్పారు. గోదావరి వరదల సమయంలో మేట వేసిన ఇసుకను తీసుకునే అవకాశం రైతులకు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వ అనుమతితోనే విగ్రహాలు ఏర్పాటు చేయాలని పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి సభలో ప్రస్తావించారు. అచ్చంపేటలోని ఏయూ పీజీ సెంటర్‌ను మహిళా యూనివర్సిటీగా మార్చాలని, కాకినాడ రూరల్ మండలంలో మత్స్యశాఖ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సభ దృష్టికి తీసుకువెళ్లారు. అంతర్వేది దేవస్థానం నుంచి కేశవదాసుపాలెం వరకూ ఆర్అండ్బీ రోడ్డు వెంబడి ప్రధాన పంట కాలువకు రిటైనింగ్ వాల్ నిర్మించాలని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ప్రస్తావించారు. బీజేపీ తరఫున జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ, పుష్కరాల సందర్భంగా రాజమండ్రి రోడ్ కం రైలు వంతెనకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కోరారు. 2014లో శంకుస్థాపన చేసిన ట్రిపుల్ ఐటీ ఏమైందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న తెలుగు సాహిత్య పీఠం ఆస్తులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభ దృష్టికి తీసుకువచ్చారు. కాగా ముమ్మిడివరం, రాజానగరం, రామచంద్రపురం, పిఠాపురం, మండపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పలుకే బంగారం అన్నట్టుగా వ్యవహరించారు. వీరికి మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు సోదరుడి కుమారుడు సుబ్బారాయుడు మృతితో మొదటి మూడు రోజులూ సమావేశాలకు వెళ్లలేకపోయిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సోమ, మంగళవారాల్లో జరిగిన సమావేశాల్లో ప్రధాన సమస్యలపై మాట్లాడేందుకు గట్టిగా పట్టుపట్టారు. కానీ అవకాశం ఇవ్వకుండా తన నోరు నొక్కేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక రీచ్‌ల వ్యవహారాన్ని ప్రస్తావించేందుకు సహచర ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌తో పాటు నోటీసు ఇచ్చినప్పటికీ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. విలీన మండలాల్లో ప్రభుత్వ సేవలు దూరం ఖమ్మం జిల్లా నుంచి తూర్పు గోదావరిలో కలిసిన నాలుగు మండలాల్లో ప్రభుత్వ సేవలు అందడం లేదు. ఈ మండలాల్లో ప్రభుత్వ ఉద్యోగులను పూర్తి స్థాయిలో నియమించాలి. తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఎక్కువ మంది ఉండడంతో.. వారు ప్రభుత్వ సేవలు అందించేందుకు నిరాకరిస్తున్నారు. అటువంటివారిని తెలంగాణకు పంపించాలి. అత్యవసర సర్వీసులైన వైద్యం, విద్యుత్, మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీ ఏడు మండలాలు, విలీనమైన నాలుగు మండలాల్లో పింఛన్లు అందక అనేకమంది ఇబ్బంది పడుతున్నారు. అర్హులైనవారి పింఛన్లను అనేక కారణాలతో రద్దు చేశారు. వాటిని పునరుద్ధరించాలి. కులధ్రువీకరణ పత్రాలు పొందేందుకు 1958 నాటి రికార్డులు తీసుకురావాలంటూ గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారు. నిరాక్షరాస్యులైన గిరిజనులు వాటిని భద్రపరచుకోలేని పరిస్థితి ఉంది. అనేకమంది విద్యార్థులకు కులధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏడు మండలాల పరిధిలో అనేకచోట్ల అటవీ శాఖ అభ్యంతరాలతో మధ్యలోనే రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. వీటికి అనుమతులు ఇచ్చి వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు par తీసుకోవాలి.ఙ- వంతల రాజేశ్వరి, ఎమ్మెల్యే, రంపచోడవరం అడిగిన డబ్బులు ఇవ్వకపోతే దాడులా? ‘అధికారాన్ని ప్రజాసంక్షేమం కోసం కాకుండా ధనార్జన కోసం ఉపయోగిస్తున్న మీ తమ్ముడు యనమల కృష్ణుడిని కంట్రోల్ చేయలేని మీరు (ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు) శాసనసభలో నీతివాక్యాలు వల్లిస్తారా? నియోజకవర్గంలో అరాచక పాలన సాగిస్తున్నారు. పోలీసులు సైతం ఏమీ చేయలేక ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. యనమల సొంత మండలం తొండంగిలోని సముద్రతీర ప్రాంతంలో నడుస్తున్న హేచరీల నుంచి యనమల కృష్ణుడు అనధికార వసూళ్లు చేస్తున్నారు. దీనికి నిరాకరించిన హేచరీపై దాడులు చేయించడం వాస్తవం కాదా? ‘షాడో మంత్రిగా వ్యవహరిస్తున్న మీ (యనమల) సోదరుడిని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మీ అధికారాన్ని అడ్డుపెట్టుకునే చేస్తున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారో సూటిగా సమాధానం par ఇవ్వాలి’ఙ- దాడిశెట్టి రాజా, తుని ఎమ్మెల్యే అధికార పార్టీ తప్పులను కప్పిపుచ్చుకోడానికే సమావేశాలు అధికార పార్టీ నేతల తప్పులను కప్పి పుచ్చుకుని, చేయనిదానిని చేసినట్టు చూపించుకోవడానికే అన్నట్టుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్టుంది. సభలో కస్టోడియన్‌గా ఉండవలసిన గౌరవ స్పీకర్ వ్యవహార శైలి ఇబ్బందికరంగా ఉంది. సామాజిక కార్యకర్తలను అధికార పార్టీ కమిటీల్లో భాగస్వాములుగా చేయడం ద్వారా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసినట్టయింది. దీనిపై సభలో ప్రస్తావించాను. కేవలం పచ్చచొక్కాలకు అవకాశం కల్పించేందుకే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కమిటీల్లో సామాజిక కార్యకర్తలకు స్థానం par కల్పించారు.ఙ- జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత రాజధాని కోసం చట్టాన్ని మీరుతున్నారు రాజధాని భూసేకరణ విషయంలో సంబంధిత చట్టాన్ని మీరి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం రైతులు ఒకటికంటే ఎక్కువ పంటలు పండించే భూములను సేకరించకూడదు. అత్యవసర పరిస్థితుల్లో సేకరించాల్సి వస్తే తక్కువగా మాత్రమే తీసుకోవాలి. కానీ ప్రభుత్వ వైఖరి న్యాయపమైన చిక్కులు తెచ్చి పెట్టేదిగా ఉంది. మంగళగిరి ప్రాంతంలో సుమారు 16 వేలకు పైగా ఎకరాల ప్రభుత్వ భూములున్నా, కేవలం తుళ్లూరు ప్రాంతంలోనే భూసేకరణ చేస్తామనడం వెనుక ఆంతర్యమేమిటి? ల్యాండ్ పూలింగ్, లేదా బలవంతంగా సేకరణ పేరుతో రైతుల పొట్ట కొట్టవద్దు. అటవీ భూములను డీనోటిఫై చేసేందుకు కేంద్రం కూడా వీలు కల్పించింది. రాజధాని బిల్లు ముందుగా ఉభయ సభల్లో ఆమోదం పొంది చట్టం అయిన తర్వాత మాత్రమే ఒప్పందాలు కుదుర్చుకోవాలి, కానీ ఇంకా చట్టం కాకుండానే సింగపూర్ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం చట్టసభలను అవమానపరచడమే. రాజధాని అంశంలో ప్రభుత్వం ఏ దశలోనూ నిబంధనలు పాటించడంలేదు. రైతు రుణమాఫీ అంశంలో కూడా ప్రభుత్వం దగా చేసింది. వాగ్దానం చేసినట్టు కాకుండా రోజుకో మాట చెప్పి, చివరకు రూ.50 వేలు అన్నారు. తీరా అది కూడా పూర్తిగా అమలు జరగలేదన్నారు. బొబ్బిలిలో ఒక రైతుకు తీసుకున్న రూ.50 వేల రుణానికి రూ.3.16 రుణమాఫీ లభించిందంటే పరిస్థితి అర్థం par చేసుకోవచ్చు.ఙ- ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్సీ (వైఎస్సార్సీపీ) -
సజావుగా సాగేనా..
నేటి నుంచి నాగపూర్‌లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సాక్షి, ముంబై: రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ఈ సమావేశాలు సోమవారం నుంచి నాగపూర్‌లో ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగడం ఇదే ప్రథమం. దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వివిధ అంశాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే బీజేపీ, దాని మిత్రపక్షమైన శివసేన నాయకులు కూడా వారికి దీటుగా సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇరిగేషన్‌తోపాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు, పత్తికి కనీస గిట్టుబాటు ధర, స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ), టోల్ ప్రణాళిక తదితన అంశాలపై నాగపూర్‌లో జరిగే సమావేశాల్లో ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని విపక్షాలు ఇరుకున పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ మహారాష్ట్రకు చెందిన నాయకులు నిధులను దారి మళ్లించి కొంత కాలంగా తమకు అన్యాయం చేస్తున్నారని విదర్భ ప్రాంత నాయకులు నిలదీయనున్నారు. అంతటితో ఊరుకోకుండా రోడ్లు, విద్య, ఇతర మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేసిన విజయ్ కేల్కర్ కమిటీ గురించి కూడా నిలదీసే ఆస్కారముంది. దీంతో ఈ సమావేశాల్లో పై రెండు అంశాలపై పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ ప్రాంత ప్రజా ప్రతినిధుల మధ్య మాటల యుద్ధం జోరుగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో వీటిపై చర్చించేందుకు ఫడ్నవిస్ ప్రభుత్వం అంగీకరించే అవకాశాలున్నాయి. దీంతో ఇరు ప్రాంతాలకు సాధ్యమైనంత ఎక్కువ నిధులు మంజూరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విదర్భ-మరాఠ్వాడాలో వరుసగా మూడేళ్ల నుంచి కరువు తాండవిస్తోంది. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఈ అంశాలపై సైతం ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నడుం బిగిస్తున్నాయి. రైతులకు సాధ్యమైనంత ఎక్కువ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేయనున్నాయి. అదేవిధంగా విద్యుత్ వినియోగదారులపై భారం పడకుండా గత కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిలోని డీఎఫ్ ప్రభుత్వం అమలుచేసిన సబ్సిడీని ఫడ్నవిస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై కూడా కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు ఫడ్నవిస్ ఫడ్నవిస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం విదర్భలో పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా, క్వింటాల్‌కు రూ.7,500 గిట్టుబాటు ధర కల్పించాలని సభలో విపక్షాలు డిమాండ్ చేయనున్నాయి. ప్లానింగ్ కమిషన్‌కు ప్రత్యామ్నాయం అవసరం: సీఎం ముంబై: అందరికీ సంక్షేమ ఫలాలు అందేందుకు ప్రస్తుతమున్న ప్లానింగ్ కమిషన్ బదులు నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్స్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సూచించారు. ఢిల్లీలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఫడ్నవిస్ ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు సీఎం కార్యాలయవర్గాలు పేర్కొన్నాయి. ముంబై అభివృద్ధికి ‘గ్లోబల్ కమర్షియల్ హబ్’ను ఏర్పాటుచేయాలని కోరారని, అలాగే రాష్ట్రంలో కరువు ప్రాంతాలను ఆదుకునేందుకు తగిన ప్యాకేజీని అందజేయాలని, అలాగే పత్తి, చెరకు పంటలకు తగిన మద్దతు ధర ఇవ్వాలని ప్రధానికి విన్నవించారని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. -
వారంతా పార్టీకంటే పెద్దవారు
అందుకే సమావేశానికి హాజరుకాలేదు శాసనసభా పక్ష సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలపై కుమార వ్యంగాస్త్రం బెంగళూరు : ‘వారంతా పార్టీకంటే పెద్దవాళ్లుగా ఎదిగిపోయారు. పార్టీ సమావేశానికి వస్తే ఎక్కడ తమ హోదా తగ్గిపోతుందో అని సమావేశానికి హాజరుకాలేదు’ అంటూ జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలపై ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఈ సమావేశానికి జేడీఎస్‌కి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు హాజరుకాలేదని, వారి గురించి తానిప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. గురువారమిక్కడి ఓ ప్రైవేటు హోటల్లో జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ...‘సమావేశంలో పాల్గొంటే ఎక్కడ తమ హోదా తగ్గుతుందో అని కొందరు రాలేదు. ఇక హనుమాన్ జయంతి సందర్భంగా తాము సమావేశంలో పాల్గొనలేకపోతున్నామని కొందరు, అత్యవసర పనుల కారణంగా రాలేకపోతున్నామని మరికొందరు ముందుగానే నాకు సమాచారం అందించారు. అందువల్ల ఈ విషయంపై పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యం.... బెళగావిలో జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ముఖ్య అజెండాగా జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశం సాగింది. ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి ఒక్క సభ్యుడు ప్రశ్నలను సంధించాలని ఈ సందర్భంగా కుమారస్వామి శాసనసభ్యులకు సూచించారు. అంతేకాక అసెంబ్లీ సమావేశాలకు ప్రతి ఒక్కరు తప్పక హాజరుకావాలని కుమారస్వామి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని సమస్యలు, చెరకు మద్దతు ధర, రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారని సమాచారం. ఈ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు హెచ్.ఎస్.శివశంకర్, డాక్టర్ శ్రీనివాస మూర్తి, భీమా నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కిరణ్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీ-ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో బుధవారం సాయంత్రం గందరగోళం రేగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగం మొదలు పెట్టగానే టీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. విభజన బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని సీఎం ప్రకటింగానే సభలో గందరగోళం మొదలయింది. చరిత్రను వక్రీకరిస్తూన్నారని ఆరోపిస్తూ సీఎం ప్రసంగానికి టీ-ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సీఎం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే సభా నాయకుడి హోదాలో బిల్లును వ్యతిరేకిస్తున్నా లేక వ్యక్తిగతంగా చెప్పారా అనేది స్పష్టం చేయాలని జానారెడ్డి కోరారు. మరోవైపు టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవడం సమంజసం కాదంటూ స్పీకర్ నాదండ్ల మనోహర్ నచ్చచెప్పినా వారు పట్టువీడలేదు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. జానారెడ్డి మరోసారి కలుగ జేసుకోవడంతో పరిస్థితి సద్దు మణిగింది. తర్వాత సీఎం ప్రసంగం కొనసాగించారు. -
'ఒక్కోప్రాంతానికి ఒక్కో మాట మాట్లాడిస్తున్నారు'
హైదరాబాద్: విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడిఉన్నానని రాష్ట్ర మంత్రి బాలరాజు తెలిపారు. రాష్ట్రాన్ని విభజించేముందు సీమాంధ్రులకు ఏం కావాలో అడిగితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్కోప్రాంతానికి ఒక్కో మాట మాట్లాడిస్తున్న చంద్రబాబుది రాజకీయ కాంక్ష కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. తాము రెండు రాష్ట్రాలకూ సుముఖంగా ఉన్నామని చంద్రబాబు లేఖ ఇచ్చారని గుర్తు చేశారు. విభజన ప్రకటన వెలువడగానే కొత్త రాష్ట్రానికి చంద్రబాబు రూ. 5 లక్షల కోట్లు అడిగారంటే ఆయన విభజనకు అంగీకరించినట్టు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అడుగుతున్న న్యాయం ఏంటో చెప్పాలని బాలరాజు డిమాండ్ చేశారు. -
విభజన వెనుక రాజకీయ కుట్ర: బాబురావు
-
విభజన వెనుక రాజకీయ కుట్ర: బాబురావు
హైదరాబాద్: తెలంగాణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. విభజన వెనుక రాజకీయ కుట్ర దాగివుందని ఆరోపించారు. టీ-బిల్లును కేంద్రం హడావుడిగా శాసనసభకు పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలుగుజాతి వల్లే యూపీఏకు రెండుసార్లు అధికారం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తెలుగుజాతిని యూపీఏ ప్రభుత్వం రెండు ముక్కలు చేస్తోందని మండిపడ్డారు. -
సభా పర్వం
* నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం * రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై కొనసాగనున్న చర్చ * ‘సవరణలపై’ మరోసారి బీఏసీ! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయుం తొమ్మిది గంటల నుంచి జరిగే ఈ సమావేశాల్లో ఇతర ఎజెండా ఏదీ లేకుండా నేరుగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చను చేపడతారు. బిల్లుపై చర్చ వుుగిసేవరకు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఈనెల ఏడో తేదీన జరిగిన సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సవూవేశంలో నిర్ణరయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సభ ప్రారంభం కాగానే టీ బిల్లుపై చర్చ కొనసాగనుంది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ తరఫున ఇద్దరు, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐల పక్షాన ఒక్కొక్కరు మాట్లాడారు. పార్టీలవారీగా చూస్తే సభలో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఎం, లోక్‌సత్తా పార్టీల సభ్యులు మాట్లాడాల్సి ఉంది. అసెంబ్లీలో ముందుగా సమైక్య తీర్మానం చేయాలని, ఆ తరువాత చర్చను చేపడితే తాము అందులో భాగస్వాములం అవుతావుని వైఎస్సార్ కాంగ్రెస్ ముందునుంచీ చెబుతున్నా ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పట్టించుకోకుండా చర్చను చేపట్టింది. ఇలావుండగా బిల్లుపై సభ్యులు ప్రతిపాదించిన సవరణలను అసెంబ్లీ అధికారులు క్రోడీకరించి నివేదికను స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు సవుర్పించారు. నాలుగువేలకు పైగా వచ్చిన ఈ సవరణలపై స్పీకర్ శుక్రవారం సభలో ప్రకటన చేసే అవకాశముంది. అనంతరం సవరణలకు సంబంధించి సభ ఎలాంటి చర్య తీసుకోవాలి? చర్చను చేపట్టాలా? వద్దా? అనే అంశాలపై ఆయూ పార్టీల సభాపక్ష నేతలనుంచి అభిప్రాయాలు తీసుకొనే అవకాశది. విభజన బిల్లుతో పాటు, క్లాజుల వారీగా సభ్యులు ప్రతిపాదించిన సవరణలపైనా చర్చ జరపాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుబడుతుండడంతో స్పీకర్ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ విషయమై స్పీకర్ మరోసారి బీఏసీని సవూవేశపర్చవచ్చని తెలుస్తోంది. బిల్లుపై సాధారణ చర్చ పూర్తయ్యాక సవరణలపై చర్చను చేపట్టాల్సి ఉంటుందని అంటున్నారు. సాధారణ చర్చలో ఇంకా కొన్ని పార్టీల సభ్యులతోపాటు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుుడు, సభా నాయుకుడు కిరణ్‌కువూర్‌రెడ్డి మాట్లాడాల్సి ఉంది. శుక్రవారం ప్రారంభమయ్యే సభ ఈనెల 23వ తేదీవరకే జరగనుంది. ఏఐసీసీ సమావేశాల పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పలువురు ఢిల్లీకి వెళ్లడంతో శుక్రవారం సభలో ఆపార్టీ సభ్యుల హాజరు చాలావరకు తగ్గిపోనుంది. -
టీ గరంగరం!
గొంతు విప్పుతాం బిల్లు ఆమోదం పొందేలా చూస్తాం అవసరమైతే అన్ని పార్టీల సహకారం ‘సాక్షి’తో జిల్లా శాసనసభ్యులు నేటినుంచే అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ’ ప్రధాన ఎజె ండాగా అసెంబ్లీ వేడెక్కనుంది. గత నెల 12న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లుపై చర్చ ప్రస్తావనకు వచ్చినా గందరగోళం నడుమ సభ వాయిదా పడింది. 19న వాయిదా పడిన సభ తిరిగి శుక్రవారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో అందరి దృష్టి అసెంబ్లీ సమావేశాలపైనే ఉంది. డ్రాఫ్టు బిల్లుపై అసెంబ్లీలో చర్చించే విషయంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలు నిట్టనిలువునా చీలిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేతలు ‘తెలంగాణం’ వినిపిస్తామని చెప్తున్నారు. - సంగారెడ్డి, సాక్షి ప్రతినిధి చర్చ ప్రారంభమైంది రాష్ట్ర పునర్విభజన బిల్లుపై మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే చర్చ ప్రారంభించారు. ప్రస్తుత సమావేశాల్లో చర్చను కొనసాగించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ స్ఫూర్తికి ఎవరూ విరుద్ధంగా వ్యవహరించొద్దు. ఇతర అంశాలను చర్చకు తెచ్చే ప్రయత్నం చేయొద్దు. సీమాంధ్ర ప్రాంత సభ్యులు అక్కడి ప్రజల మనోభావాలు చర్చల ద్వారా వెల్లడించాలి. - టి.హరీష్‌రావు(టీఆర్ఎస్), ఎమ్మెల్యే, సిద్దిపేట తెలంగాణ ఎవరూ ఆపలేరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరు. బిల్లు అసెంబ్లీ వరకు వచ్చిన తర్వాత చర్చను అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వం. రెండు రాష్ట్రాలు ఏర్పడితేనే సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని అసెంబ్లీలో చర్చ సందర్భంగా నొక్కి చెప్తా. ఇప్పటికే రెండు ప్రాంతాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. - మైనంపల్లి హన్మంతరావు (టీడీపీ), ఎమ్మెల్యే, మెదక్ ఐక్యతతో ముందుకు సాగుతాం ఆరు దశాబ్దాలుగా సాగుతున్న తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో డ్రాఫ్టు బిల్లు అసెంబ్లీకి చర్చకు వచ్చింది. రాష్ట్ర ఏర్పాటుతోనే తెలంగాణ ప్రాంతంలో అన్ని వర్గాలకు న్యాయం దక్కుతుంది. సీనియర్ సభ్యుడిగా అసెంబ్లీలో బిల్లు చర్చకు వచ్చేలా ఒత్తిడి చేస్తాం. ఈ దిశగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలనూ కలుపుకుపోతాం. - చెరుకు ముత్యంరెడ్డి (కాంగ్రెస్), ఎమ్మెల్యే, దుబ్బాక త్వరగా పూర్తయ్యేలా చూస్తాం అసెంబ్లీలో త్వరగా తెలంగాణ డ్రాఫ్టు బిల్లుపై చర్చ పూర్తయ్యేలా ఒత్తిడి తెస్తాం. చర్చ సందర్భంగా సమస్యలు తలెత్తకుండా చూస్తాం. బిల్లు ఆమోదం పొందేలా చూడటమే అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మా ముందున్న లక్ష్యం. అధిష్టానం సూచనల మేరకు బిల్లుపై చర్చ సజావుగా సాగుతుందని భావిస్తున్నా. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి ఎలాంటి అడ్డంకులూ ఉండబోవు. - టి.నందీశ్వర్ గౌడ్ (కాంగ్రెస్), ఎమ్మెల్యే, పటాన్చెరు చర్చించేలా చూస్తాం తెలంగాణ బిల్లుపై చర్చ మొదలయ్యే సమయంలో సహచర మంత్రి శ్రీధర్‌బాబు శాఖను మార్చడం అప్రజాస్వామి కం. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని నిరసిస్తూ గవర్నర్‌ను కలిసి మా అభిప్రాయాలు చెప్పాం. ఈ నెల 23లోపు డ్రాఫ్టు బిల్లుపై చర్చ ముగియాల్సి ఉన్నందున సమావేశాలు సజావుగా సాగేలా తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. - సునీతా లక్ష్మారెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తొలగింపుపై నిరసన తెలుపుతాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన డ్రాఫ్టు బిల్లుపై చర్చ జరిగేలా అసెంబ్లీలో పట్టుబడతాం. మంత్రి శ్రీధర్‌బాబు శాఖను మార్పిడి చేయడంపై నిరసన తెలుపుతాం. బిల్లు చర్చకు రావద్దనే దురుద్దేశంతోనే శ్రీధర్ బాబు శాఖ మార్పిడి జరిగినట్లు స్పష్టమవుతోంది. పార్లమెం టులో బిల్లు ఆమోదం పొందే వరకు పట్టు వదిలేది లేదు. - పి. కిష్టారెడ్డి (కాంగ్రెస్), ఎమ్మెల్యే, నారాయణఖేడ్ కుట్రలు చేస్తే అడ్డుకుంటాం అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చేలా చూస్తాం. సీమాంధ్ర ప్రాంత ప్రతినిధుల అభిప్రాయాలు వినిపించాలని కోరుతాం. అసెంబ్లీలో బిల్లుపై చర్చను అడ్డుకునే కుట్రలపై అప్రమత్తంగా ఉంటూ అడ్డుకుంటాం. అన్ని పార్టీల ప్రతినిధులను కలిసి చర్చ జరిగేలా చూడాలని నిర్ణయించాం. - టి. నర్సారెడ్డి(కాంగ్రెస్), ఎమ్మెల్యే, గజ్వేల్ -
టీ-బిల్లుపై చర్చించాలి..
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లుపై చర్చ జరపాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. పట్టణంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్లో సోమవారం సీపీఎం జిల్లా విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రపతి అసెంబ్లీకి పంపిన తెలంగాణ బిల్లుపై అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించడానికి చర్చ జరగాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీలు వారి అభిప్రాయాలు చెప్పకుండా అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 2014 ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశాలకు అడ్డుపడుతోందని ఆరోపించారు. బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవడాన్ని సీపీఎం వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతతోనే బీజేపీ గెలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పనున్నారని అన్నారు. రానున్న ఎన్నికలకు సీపీఎం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యకర్తల్లో మనోధైర్యం పెంచేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు సాయిబాబు, లంకా రాఘవులు, పార్టీ జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సభను వాయిదా వేస్తే ఊరుకోం: హరీష్‌రావు
హైదరాబాద్: వాయిదాలతో శాసనసభ నడపటం అప్రజాస్వామికమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. టీడీపీ డబుల్ గేమ్ ఆడటం సరైందికాదన్నారు. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్‌లో విభజన బిల్లుపై రెండ్రోజుల్లోనే చర్చ ముగించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించడానికి 42 రోజులు అవసరమా అని ప్రశ్నించారు. నెలాఖరులోగా చర్చ పూర్తిచేసి బిల్లు రాష్ట్రపతికి పంపాలని డిమాండ్ చేశారు. బిల్లుపై చర్చ పూర్తిచేయించే బాధ్యత తెలంగాణ మంత్రులదే అన్నారు. బిల్లుపై చర్చ జరగనీయకుండా సభను వాయిదా వేస్తే ఊరుకోబోమని హరీష్‌రావు హెచ్చరించారు. బిల్లులో తమకు కూడా కొన్ని అభ్యంతరాలున్నాయని తెలిపారు. వాయిదాలు వేసి తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని కోరారు. స్పీకర్ ఒత్తిడికి గురికావొద్దని సూచించారు. చర్చను అడ్డుకునే సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలను ఆయ పార్టీల నాయకులు కట్టడి చేసుకోవాలన్నారు. -
9 నుంచి 11 గంటల వరకు ఉద్రిక్తత
-
9 నుంచి 11 గంటల వరకు ఉద్రిక్తత
హైదరాబాద్: గందరగోళం నడుమ తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బిల్లు ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ ఎమ్మెల్యేలు స్వాగతించగా, సీమాంధ్ర సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీలో ఈ ఉదయం 9 నుంచి 11 గంటలకు వరకు చోటు చేసుకున్న సంఘటనల వరుస క్రమమిది. * ఈ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం * సభ ప్రారంభంకాగానే ఇరు ప్రాంతాల సభ్యుల నినాదాలు * స్పీకర్ పోడియం వద్ద సీమాంధ్ర, తెలంగాణ సభ్యుల ఆందోళన * సభను గంట పాటు వాయిదా వేసిన స్పీకర్ * 10 గంటలకు తిరిగి సమావేశమయిన అసెంబ్లీ * గందరగోళం నడుమ విభజనను బిల్లును సభలో ప్రవేశపెట్టిన స్పీకర్ * బిల్లును శాసనసభ వెబ్సైట్లో పెట్టినట్టు వెల్లడించిన స్పీకర్ * బిల్లును చదివి వినింపించిన అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం * తర్వాత సభను అర గంట వాయిదా వేసిన స్పీకర్ * బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో సభలో లేని సీఎం, చంద్రబాబు * సభ వెలుపల మీడియా పాయింట్ వద్ద ఉద్రికత్త * బిల్లు ప్రతులను చించేసిన టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ * ఉమను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల యత్నం * బిల్లు ప్రతులను తగులబెట్టిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు * వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై పోలీసుల సాక్షిగా టీఆర్ఎస్ నేతల దాడి * మీడియా పాయింట్ వద్ద ఆందోళన కొనసాగించిన వైఎస్సార్ సీపీ సభ్యులు -
అసెంబ్లీ : ప్రారంభమైన BAC సమావేశం
-
అసెంబ్లీ సమావేశాలకు గట్టి భద్రత
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు. ఏర్పాట్లపై సోమవారం స్పీకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించామన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ‘అవసరమైన స్థాయిలో ఇతర విభాగాలు, బయట జిల్లాల నుంచి బలగాలను మోహరిస్తున్నాం. శాసనసభకు రెండు కిలోమీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. ఆ ప్రాంతంలో సభలు, సమావేశాలు, ధర్నా, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం’ అన్నారు. భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై తన కార్యాలయంలో ఆయన మంగళవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అదనపు కమిషనర్ నుంచి అదనపు డీసీపీ స్థాయి అధికారుల వరకు పాల్గొన్నారు. మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో మధ్యాహ్నం బందోబస్తు ఏర్పాట్లపై రిహార్సల్స్ నిర్వహించారు. వీటిని పర్యవేక్షించిన డీసీపీ మార్పుచేర్పుల్ని సూచించారు. అసెంబ్లీ చుట్టపక్కల 10 ప్లటూన్లు (దాదాపు 300) మంది పోలీసులు విధుల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ చుట్టూ ఉన్న మార్గాల్లో బారికేడ్లు, పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. శాసనసభ ప్రతి గేటుకు ఐపీఎస్ అధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తారు. అధీకృత పాస్‌లున్న వారిని మినహా మరెవ్వరినీ అసెంబ్లీ పరిసరాల్లోకి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కీలక ప్రాంతాల్లో కేంద్ర పారా మిలటరీ బలగాల్ని మోహరిస్తున్నారు. ట్రాఫిక్ సర్వైలెన్స్ కెమెరాలు, ప్రత్యేక వాహనాలు, హ్యాండీక్యామ్లతో నిఘా ఉంచనున్నారు. మోహరింపు ఇలా... అదనపు ఎస్పీలు: ఆరుగురు డీఎస్పీలు: 16 మంది ఇన్స్పెక్టర్లు: 40 మంది ఎస్సైలు: 80 మంది హెడ్-కానిస్టేబుల్/కానిస్టేబుళ్లు: 450 ఏపీఎస్పీ ప్లటూన్లు: 26 అవసరమైన స్థాయిలో కేంద్ర పారామిలటరీ బలగాలు