
సభా పర్వం
* నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం
* రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై కొనసాగనున్న చర్చ
* ‘సవరణలపై’ మరోసారి బీఏసీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయుం తొమ్మిది గంటల నుంచి జరిగే ఈ సమావేశాల్లో ఇతర ఎజెండా ఏదీ లేకుండా నేరుగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చను చేపడతారు. బిల్లుపై చర్చ వుుగిసేవరకు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఈనెల ఏడో తేదీన జరిగిన సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సవూవేశంలో నిర్ణరయించిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు సభ ప్రారంభం కాగానే టీ బిల్లుపై చర్చ కొనసాగనుంది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ తరఫున ఇద్దరు, టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐల పక్షాన ఒక్కొక్కరు మాట్లాడారు. పార్టీలవారీగా చూస్తే సభలో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఎం, లోక్‌సత్తా పార్టీల సభ్యులు మాట్లాడాల్సి ఉంది. అసెంబ్లీలో ముందుగా సమైక్య తీర్మానం చేయాలని, ఆ తరువాత చర్చను చేపడితే తాము అందులో భాగస్వాములం అవుతావుని వైఎస్సార్ కాంగ్రెస్ ముందునుంచీ చెబుతున్నా ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పట్టించుకోకుండా చర్చను చేపట్టింది. ఇలావుండగా బిల్లుపై సభ్యులు ప్రతిపాదించిన సవరణలను అసెంబ్లీ అధికారులు క్రోడీకరించి నివేదికను స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు సవుర్పించారు.
నాలుగువేలకు పైగా వచ్చిన ఈ సవరణలపై స్పీకర్ శుక్రవారం సభలో ప్రకటన చేసే అవకాశముంది. అనంతరం సవరణలకు సంబంధించి సభ ఎలాంటి చర్య తీసుకోవాలి? చర్చను చేపట్టాలా? వద్దా? అనే అంశాలపై ఆయూ పార్టీల సభాపక్ష నేతలనుంచి అభిప్రాయాలు తీసుకొనే అవకాశది. విభజన బిల్లుతో పాటు, క్లాజుల వారీగా సభ్యులు ప్రతిపాదించిన సవరణలపైనా చర్చ జరపాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుబడుతుండడంతో స్పీకర్ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ విషయమై స్పీకర్ మరోసారి బీఏసీని సవూవేశపర్చవచ్చని తెలుస్తోంది. బిల్లుపై సాధారణ చర్చ పూర్తయ్యాక సవరణలపై చర్చను చేపట్టాల్సి ఉంటుందని అంటున్నారు.
సాధారణ చర్చలో ఇంకా కొన్ని పార్టీల సభ్యులతోపాటు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుుడు, సభా నాయుకుడు కిరణ్‌కువూర్‌రెడ్డి మాట్లాడాల్సి ఉంది. శుక్రవారం ప్రారంభమయ్యే సభ ఈనెల 23వ తేదీవరకే జరగనుంది. ఏఐసీసీ సమావేశాల పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పలువురు ఢిల్లీకి వెళ్లడంతో శుక్రవారం సభలో ఆపార్టీ సభ్యుల హాజరు చాలావరకు తగ్గిపోనుంది.