హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీలో ఇవాళ నల్ల దుస్తులు, చేతులకు బేడీలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లోనూ బీఆర్‌ఎస్‌లో సమానత్వమే లేదని అన్నారామె. అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ..
‘‘కేటీఆర్, హరీష్ రావుల దొరతనం మరోసారి బయటపడింది. నిరసనల్లోనూ వాళ్లు తమ దురహంకారాన్ని ప్రదర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారే తప్ప వాళ్లు వేసుకోలేదు. కనీసం వాళ్ల నిరసనల్లోనూ సమానత్వం లేదనే విషయం బయటపడింది’’ అని అన్నారామె. అలాగే..
లగచర్ల రైతుకు బేడీల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. కానీ, బీఆర్‌ఎస్ హయాంలో కనీసం పదిసార్లు అయినా రైతులకు బేడీలు వేసి ఉంటారు. ఆ టైంలో అధికారులపై కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ఆ లెక్కన ఇప్పుడు రైతులకు బేడీలు వేశారంటూ మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్ లేనేలేదు.
గతంలో.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా వెల్‌లోకి వెళ్తే సభ నుంచి సస్పెండ్ చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లు కాలరాస్తున్నారు. అయినా సభలో వాళ్ళు పెట్టిన రూల్స్ పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటో? అని సీతక్క అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment