Handcuffs
-
‘అవును.. సంకెళ్లు, గొలుసులతో బంధించే తీసుకొచ్చారు!’
న్యూఢిల్లీ: అక్రమ వలసదారులపై ఉక్కు పాదం మోపే విషయంలో ట్రంప్ కఠిన వైఖరిని వీడడం లేదు. భారత్‌తో ఎంత దగ్గరి సంబంధాలు ఉన్నా.. ఈ విషయంలో మినహాయింపు లేదని పరోక్షంగా సంకేతాలిచ్చారు కూడా. ఈ క్రమంలో బుధవారం తొలిబ్యాచ్ భారత్‌కు చేరుకోగా.. వాళ్ల పట్ల యూఎస్ ఎంబసీ వ్యవహరించిన తీరు ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. అమెరికా నుంచి భారత్‌కు చేరుకునేంత వరకు.. తమ కాళ్లు చేతులకు బంధించే ఉంచారని వాపోయారు వాళ్లు. ‘‘అమెరికాలో మమ్మల్ని ఓ క్యాంప్‌లో ఉంచారు. అక్కడి నుంచి మమ్మల్ని మరో క్యాంప్‌నకు తరలిస్తారని భావించాం. కానీ, అలా జరగలేదు. ఓ పోలీస్ అధికారి వచ్చి ఇండియాకు తిరిగి పంపించేస్తున్నామని చెప్పారు. అయితే విమానం ఎక్కాక చేతులకు సంకెళ్లు వేసి.. కాళ్లను గొలుసులతో కట్టేశారు. అమృత్‌సర్‌లో దిగేంత వరకు మమ్మల్ని అలాగే ఉంచారు’’ అని పంజాబ్‌కు ెందిన 36 ఏళ్ల జస్పాల్ సింగ్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.అయితే.. అలాంటిదేం జరగలేదని, అదంతా తప్పుడు ప్రచారం ఇంతకు ముందు కేంద్రం కొట్టిపారేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటోను కూడా ఫ్యాక్ట్ చెక్ ద్వారా అబద్ధంగా తేల్చేసింది. అది గ్వాటెమాలకు సంబంధించిన అక్రమ వలసదారుల చిత్రమని స్పష్టం చేసింది. అయితే.. తాజాగా వలసదారుల వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులను అవమానకరరీతిలో వెనక్కి పంపించారని కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2013లో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగఢేను ఇలాగే అవమానిస్తే.. అప్పటి యూపీఏ ప్రభుత్వం తీవ్రంగా స్పందించని, దీంతో అమెరికా ప్రభుత్వం దిగివచ్చి విచారం వ్యక్తం చేసిందని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది.ట్రంప్ అధికారం చేపట్టాక.. అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిచేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో తరలింపు కోసం ఎలాంటి సౌకర్యాలు లేని యుద్ధవిమానాలను ఉపయోగించడం, పైగా వాళ్లకు బేడీలు వేసి మరీ లాక్కెళ్తూ అమానుషంగా ప్రవర్తిస్తుండడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథజస్పాల్తో పాటు మరికొందరు భారతీయులు జనవరి 24వ తేదీన మెక్సికో సరిహద్దు వద్ద అక్రమంగా అమెరికాలో చొరబడుతున్న టైంలో పట్టుబడ్డారట. ఓ ఏంజెట్ చేసిన మోసం వల్లే తాను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని జస్పాల్ కంటతడి పెట్టాడు. హర్విందర్ అనే యువకుడు మాట్లాడుతూ.. తనను ఏజెంట్ ఖతార్, బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా, ఇలా.. అంతటా తిప్పి మెక్సికోకు చేర్చాడని, అయితే అక్కడి నుంచి అమెరికా వెళ్లే క్రమంలో తమ బోటు ప్రమాదానికి గురైందని వివరించాడు. ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా.. తనతోపాటు కొందరు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకొచ్చాడు. పంజాబ్‌కే చెందిన మరో వ్యక్తి.. తన బట్టలను ఎవరో దొంలించారని చెబుతున్నాడు. కొండలు దాటి, కిలో మీటర్లు ప్రయాణించి అమెరికాలోకి ప్రవేశించేందుకు వాళ్లు చేసిన ‘డంకీ’ కష్టాల గురించి వాళ్లంతా మీడియాకు వివరించారు. దారి పొడవునా శవాలను దాటుకుంటూ.. అత్యంత కష్టతరమైన పరిస్థితుల నడుమ తాము ప్రయాణించామని చెబుతున్నారు వాళ్లు. వాళ్లను కదిలిస్తే.. ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఆర్థిక సమస్యలతోనే తాము దొడ్డిదారిన అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించామని చెబుతున్నారు.డంకీ అంటే మరోదేశంలోకి అక్రమంగా చొరబడడంఇక.. తొలి బ్యాచ్‌లో 104 అక్రమ వలసదారులు రాగా.. 33 మంది హర్యానా, గుజరాత్ 33, పంజాబ్ 30 మందిని, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ నుంచి ముగ్గురు చొప్పున, ఛండీగఢ్ నుంచి ఇద్దరు ఉన్నారు. అలాగే 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు. నాగేళ్ల పిల్లాడు, ఐదు..ఏడేళ్ల వయసున్న అమ్మాయిలూ ఉన్నారు. ఇక.. అమృత్‌సర్‌లో దిగిన వలసదారులతో పంజాబ్ మంత్రి కుల్దీప్ మాట్లాడారు. ఎలాంటి కేసులు ఉండబోవని, గుర్తింపులను ధృవీకరించుకున్నాక స్వస్థలాలకు పంపిస్తామని వాళ్లకు ఆయన భరోసా ఇచ్చారు. -
‘వాళ్ల చేతులకు బేడీలేవీ?.. నిరసనల్లోనూ దురహంకారమేనా?’
హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీలో ఇవాళ నల్ల దుస్తులు, చేతులకు బేడీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లోనూ బీఆర్ఎస్లో సమానత్వమే లేదని అన్నారామె. అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్, హరీష్ రావుల దొరతనం మరోసారి బయటపడింది. నిరసనల్లోనూ వాళ్లు తమ దురహంకారాన్ని ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారే తప్ప వాళ్లు వేసుకోలేదు. కనీసం వాళ్ల నిరసనల్లోనూ సమానత్వం లేదనే విషయం బయటపడింది’’ అని అన్నారామె. అలాగే.. లగచర్ల రైతుకు బేడీల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. కానీ, బీఆర్ఎస్ హయాంలో కనీసం పదిసార్లు అయినా రైతులకు బేడీలు వేసి ఉంటారు. ఆ టైంలో అధికారులపై కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ఆ లెక్కన ఇప్పుడు రైతులకు బేడీలు వేశారంటూ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ లేనేలేదు. గతంలో.. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా వెల్‌లోకి వెళ్తే సభ నుంచి సస్పెండ్ చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లు కాలరాస్తున్నారు. అయినా సభలో వాళ్ళు పెట్టిన రూల్స్ పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటో? అని సీతక్క అన్నారు. -
లగచర్లకు చెందిన రైతు ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం
-
ఆర్థిక నేరగాళ్లకు బేడీలు వేయొద్దు
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి బేడీలు వేయరాదని, హత్య, అత్యాచారం వంటి నేరాలకు పాల్పడిన వారితో కలిపి జైలులో ఉంచరాదని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. బేడీలు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు తప్పించుకోకుండా నిరోధించడానికి, అరెస్ట్ సమయంలో పోలీసు అధికారులు, సిబ్బంది భద్రత కోసమే పరిమితమని వివరించింది. అలాగే, నిందితులను అరెస్టయిన తర్వాత 15 రోజులకు మించి పోలీస్ కస్టడీలో ఉంచరాదన్న భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్)లో నిబంధనపై సవరణలను సూచించింది. -
పార్టీలో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించాలంటే ఇవి ట్రై చేయండి
పార్టీలో అందరినీ ఆకట్టుకోవాలంటే ఏదైనా ప్రత్యేకత చూపాల్సిందే అనుకుంటోంది నవతరం. ఇక వెస్ట్రన్ స్టైల్ పార్టీలో అయితే ఆ హంగామా మామూలుగా ఉండదు. ప్లెయిన్ డ్రెస్సులకు స్పెషల్ అట్రాక్షన్‌గా యంగ్‌స్టర్స్‌ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి డిటాచబుల్ హ్యాండ్ కఫ్స్. పార్టీలోనే కాదు క్యాజువల్ వేర్‌గానూ వీటిని ధరించవచ్చు. చూసినవారు థంబ్స్ అప్ ఇవ్వకుండా ఉండలేరు. ఎంబ్రాయిడరీ కఫ్స్... కాంబినేషన్ లేదా పూర్తి కాంట్రాస్ట్‌లో ఉండే డిటాచబుల్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ కఫ్స్ ఏ ప్లెయిన్ డ్రెస్‌కైనా నప్పుతాయి. స్పెషల్ లుక్‌తో ఆకట్టుకుంటాయి. ట్రైబల్, మిషన్, మిర్రర్ ఎంబ్రాయిడరీ వీటిలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఎంబ్రాయిడరీ డిజైన్‌ను బట్టి ధర ఉంటుంది. జ్యువెలరీ కఫ్స్.. సంప్రదాయ వేడుకలు ముఖ్యంగా పెళ్లి వంటి వేడుకలలో ధరించడానికి అనువైన జ్యువెలరీ హ్యాండ్ కఫ్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇమిటేషన్ జ్యువెలరీ నుంచి డైమండ్ హ్యాండ్ కఫ్స్ వరకు ఉన్నాయి. ఫ్లోరల్ కఫ్స్ టీనేజర్స్, పిల్లలు ముచ్చట పడి ధరించేందుకు వీలుగా ఫ్లోర్ హ్యాండ్ కఫ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు లేస్, క్రోచెట్ అల్లికల హ్యాండ్ కఫ్స్‌ను కూడా తమ ప్రాధాన్యతలను బట్టి ఎంచుకోవచ్చు. ట్రావెల్ కఫ్స్ ప్రయాణాలలో ఫోన్‌తో పాటు కొంత డబ్బు కూడా అదీ ఎలాంటి బ్యాగ్ అవసరం లేకుండా వెంట తీసుకెళ్లాలంటే ఈ ట్రావెల్ హ్యాండ్ కఫ్స్ మంచి ఉపయుక్తంగా ఉంటాయి. -
వాళ్లసలు రైతులే కాదు.. యాదాద్రి పోలీసుల వివరణ!
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతులకు బేడీలు వేసి మరీ భువనగిరి సెషన్స్ కోర్టుకు తీసుకొచ్చిన ఉదంతంపై రాజకీయంగానూ విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో యాదాద్రి భువనగిరి పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. అసలు వాళ్లు రైతులే కాదంటూ ప్రకటించారు డీసీపీ రాజేష్ చంద్ర. అరెస్ట్ అయినవాళ్లలో రైతులు ఎవరూ లేరు. ఆ నలుగురూ జమ్మాపూర్‌లోని ఓ కంపెనీలో కార్మికులుగా పని చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కోసం 20 గుంటల భూమి కొనుగోలు చేశారు. ఇంతకుముందు వాళ్లను అరెస్ట్ చేసినప్పుడు మాపై దాడి చేసి వాహనం ధ్వంసం చేశారు. అంతేకాదు గతంలో కలెక్టరేట్‌లోకి వెళ్లి లోపల నిప్పు పెట్టారు. మంత్రి కాన్వాయ్ కు అడ్డుపడి కాన్వాయ్ పై దాడి చేసినందుకు అరెస్టు చేశాం. కోర్టుకు తీసుకొచ్చే సమయంలో ఎస్కార్ట్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ల ప్రవర్తన సరిగా లేకనే ముందస్తు జాగ్రత్త కోసం బేడీలు వేయాల్సి వచ్చిందని డీసీపీ వివరణ ఇచ్చారు. మీడియాలో వస్తున్న అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని బందోబస్తులో ఉన్న పోలీస్ ఇంచార్జ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారాయన. అయితే.. ఇది సబబేనా? ఈ పరిణామంపై సాక్షి టీవీతో ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు మాట్లాడారు. కొండంత తీసుకొని గోరంత నష్టపరిహారం ఇస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. అరే ఎకరం, ఎకరం, రెండు ఎకరాలు ఉన్న రైతుల భూములు పూర్తిస్థాయిలో కోల్పోవాల్సి వస్తోంది. బడా నాయకుల భూములను కాపాడుకోవడం కోసమే అలైన్మెంట్ మార్చారు. మోటకొండూరు నుంచి ఉన్నటువంటి అలైన్మెంట్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది?. రైతే రాజు అని చెప్పుకునే ప్రభుత్వం సంకెళ్లు ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పాలి?.. అని నిలదీశారు. అధికారులకు, నాయకులకు న్యాయం చేయాలని ఎన్నిసార్లు వినిపించుకున్న ఫలితం లేకుండా పోయిందని, రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, రైతులమైన తమపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు వాళ్లు. ఒక రాజకీయంగానూ ఈ పరిణామంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రౌడీల మాదిరి బేడీలు వేస్తారా? రీజినల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘భూములు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద రైతులంటే కేసీఆర్ కు అంత చులకనెందుకు?. నిర్వాసితులైన రైతులకు న్యాయం చేయాల్సింది పోయి దొంగలు, రౌడీల మాదిరిగా బేడీలు వేస్తారా?. ఆ రైతులు చేసిన తప్పేంది?. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తే జైల్లో వేస్తారా?. కేసీఆర్ సర్కార్ కు పోయే కాలం దగ్గర పడింది. ప్రజాకోర్టులో కేసీఆర్‌కు శిక్ష తప్పదు అని బండి సంజయ్ విమర్శించారు. బాధితుల తరపున కాంగ్రెస్ పోరాడుతుంది ఇక భువనగిరి కోర్టు పరిణామంపై కాంగ్రెస్ సీనియర్, మాజీ ఎంపీ వీహెచ్ స్పందించారు. ‘‘భువనగిరి RRR భూ నిర్వాసితులు ఆరుగురు పై కేసులు పెట్టారు. గతంలో మిర్చి రైతులకి సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్‌ది. ఇప్పుడు RRR నిర్వాసితులకు సంకెళ్లు వేశారు. రియల్టర్లు దగ్గర డబ్బులు తీసుకొని భువనగిరి రైతులకి అన్యాయం చేస్తున్నారు. రైతుల దగ్గర Ak 47 గన్స్ ఉన్నాయా చెప్పండి?. అన్నం పెట్టె రైతులకి సంకేళ్లు వేస్తారా? వారి నాన్ బెయిల్ కేసులు పెడతారా?. అన్నం పెట్టే రైతులకి సంకేళ్లు వేసే ఏకైక ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వం. రియల్టర్ల తో బిఆర్ఎస్ నేతలు కుమ్మక్కై కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు . భువనగిరి రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని వీహెచ్ ప్రకటించారు. ఇదీ చదవండి: అసలు ఆ మీటింగ్‌ల వెనుక ఎవరున్నారు? -
యాదాద్రి జిల్లా రాయగిరి రైతులకు సంకెళ్లు
సాక్షి, యాదాద్రి భువనగిరి : యాదాద్రి జిల్లా రాయగిరి ఆర్ఆర్ఆర్ రైతులకు పోలీసులు సంకెళ్లు వేశారు. రైతులకు బేడీలు వేసి భువనగిరి కోర్టుకు తీసుకెళ్లారు. 14 రోజుల రిమాండ్ పూర్తికావడంతో రైతులను నల్గొండ జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పందగా మారింది.నలుగురు రైతులను కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా సంకెళ్లు వేయడంపై రాయగిరి ట్రిపుల్ ఆర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం కొట్లాడితే సంకెళ్లు వేస్తారా అని నిలదీశారు రైతులకు సంకెళ్లు వేయడం పట్ల కాంగ్రెస్, బీజేపీ, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా గత నెల 30న ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని యాదాద్రి కలెక్టరేట్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌కు వచ్చిన మంత్రి జగదీష్‌రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నలుగురిని అదే రోజు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో చూపించారు. నాలుగో తేదీ వరకు భువనగిరి జైళ్లో ఉంచిన పోలీసులు.. రాజకీయ నేతల పర్యటనలు, ఇతర కారణాలతో రాయగిరి రైతులను నల్గొండ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బాధితులు పిటిషన్లు దాఖలు చేయగా.. నలుగురికి బెయిల్ మంజూరు అయ్యింది. ఇదే క్రమంలో 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ ముగియడంతో మరోసారి వారిని కోర్టుకు తీసుకొచ్చారు. ఇప్పటికే బెయిల్ మంజూరు అయినందున కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. అనంతరం బెయిల్‌పై బయటకు రానున్నారు రైతులు. చదవండి: రంగంలోకి డీకే శివకుమార్.. ట్రబుల్ షూటర్‌తో రేవంత్ రెడ్డి భేటీ -
అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసులతో ఘర్షణ.... మహిళలకు సంకెళ్లు వేసి నేలపై కూర్చొబెట్టి...
Clashed With Police Women Handcuffed: బిహార్‌లోని గయా జిల్లాలో ఇసుక గనుల వేలంలో ప్రభుత్వ అధికారులకు సహకరిస్తున్న పోలీసు అధికారులతో ఘర్షణ పడిన నిత్య గ్రామస్తులను అరెస్టు చేశారు. గ్రామస్తులు వారిపై రాళ్లు రువ్వడం ప్రారంభించడంతో, గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో కొందరికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పురుషులు, మహిళలకు సంకెళ్లు వేసి నేలపై కూర్చొని ఉన్న వీడియో ఆన్లైన్లో దుమారం రేపింది. రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలను పరిష్కరించడానికి, బీహార్ స్టేట్ మైనింగ్ కార్పొరేషన్ ఈ నెల ప్రారంభంలో అన్ని ఇసుక మైనింగ్ సైట్లలో పర్యావరణ తనిఖీని నిర్వహించే ప్రక్రియను ప్రారంభించింది. కసరత్తు చేసేందుకు నిమగ్నమైన ప్రైవేట్ సంస్థలు, ఇసుక బంకులను తనిఖీ చేయడానికి సాంకేతిక, డ్రోన్లను ఉపయోగించనున్నారు. -
123 రోజులు సంకెళ్లతో.. ప్రపంచంలో ఏ జంట ఈ పని చేసుండదు?
కీవ్(ఉక్రెయిన్): మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలకాలం అనురాగంతో సాగిపోవాలంటే.. నిజాయతీ తోడు కావాలి. పరిస్థితులను బట్టి సర్దుకుపోగలగాలి. ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆ బంధం మరింత బలపడుతుంది. దంపతులమధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు. వస్తే అది విడిపోవడానికి దారితీస్తుంది. తాజాగా ఉక్రెయిన్ చెందిన ఓ జంట తమ బంధాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నంలో ప్రేమికుల దినోత్సవం రోజున చేతికి సంకెళ్లు వేసుకుని ఓ వినూత్న ప్రయోగం చేశారు. అయితే ఎట్టకేలకు ఈ జంట తమ చేతి సంకెళ్లను ఉక్రెయిన్‌కు చెందిన ఓ టీవీ న్యూస్ ఛానల్ ముందు తొలగించారు. అలెగ్జాండర్ కుడ్లే(33), విక్టోరియా పుస్టోవిటోవా(29) అనే ఉక్రెయిన్ యువ దంపతులు 123 రోజుల పాటు తమ చెరో చేతికి సంకెళ్లు వేసుకుని గడిపారు. కిరాణా షాపింగ్ నుంచి బాత్రూమ్, షవర్ చేసుకోవడం ప్రతిదీ కలిసే చేశారు. అయితే ఈ ప్రయోగం వల్ల కొన్ని అసౌకర్యాలను ఎదుర్కొన్నట్లు వారు తెలిపారు. ఈ విధంగా కలిసి ఉండటం వల్ల తన ప్రియుడు తనపై అంత శ్రద్ధ చూపలేదని ఆమె పేర్కొంది. తమ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ఇలా చేసినందుకు చింతిస్తున్నట్లు అలెగ్జాండర్ చెప్పాడు. కొన్నిసార్లు అనుకోకుండా విక్టోరియాకు కోపం వచ్చేదని అన్నాడు. అంతేకాకుండా ఇలాంటి ప్రయోగం ఉక్రెయిన్, విదేశాలలో ఉండే జంటలు చేయకపోవడం మంచిదని సలహా ఇచ్చారు. కాగా ఈ జంట తమ చేతి సంకెళ్లను ఆన్లైన్ వేలంలో విక్రయించి, ఆ డబ్బులో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కాగా, ఈ మొత్తం సమాచారాన్ని ఉక్రేనియన్ టెలివిజన్, సోషల్ మీడియాలో డాక్యుమెంట్ చేశారు. ప్రపంచంలో ఏ జంట కూడా ఇలాంటి ఘనత సాధించలేదని ఉక్రేనియన్ రికార్డ్ బుక్కు చెందిన ఓ ప్రతినిధి ప్రశంసించారు. చదవండి: బాబోయ్ కుళ్లిన శవం వాసన.. సెల్ఫీలకు క్యూ కట్టిన జనం -
మా జవాన్‌కు సంకెళ్లు వేస్తారా?
న్యూఢిల్లీ/బనశంకరి: సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు(సీఆర్పీఎఫ్), కర్ణాటక పోలీసుల మధ్య లాక్డౌన్ చిచ్చు రాజేసింది. తమ జవాన్‌పై కర్ణాటక పోలీసులు లాఠీలతో దాడికి పాల్పడ్డారని, బేడీలు వేసి, పోలీసు స్టేషన్ దాకా నడిపించుకుంటూ తీసుకెళ్లారని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఆరోపిస్తున్నారు. బాధిత జవాన్‌కు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్‌కు లేఖ రాశారు. అసలేం జరిగింది? సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా దళంలో సచిన్ సావంత్ జవాన్‌గా పనిచేస్తున్నాడు. అతడి స్వస్థలం కర్ణాటకలోని ఎగ్జాంబా గ్రామం. ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. 23న సావంత్ తన ఇంటి ముందు బైక్‌ను క్లీన్‌చేస్తుండగా పోలీసులు అటుగా వచ్చారు. లాక్డౌన్ అమల్లో ఉంది, ఇంట్లో ఉండకుండా బయట ఎందుకు ఉన్నావంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా మాస్కు ఎందుకు ధరించలేదని నిలదీశారు. సావంత్ కూడా గట్టిగా బదులిచ్చారు. దీంతో పోలీసులు ఆగ్రహంతో అతడిపై దాడికి పాల్పడ్డారు. చేతికి బేడీలు వేశారు. పోలీసు స్టేషన్‌కు తరలించారు. లాకప్‌లో గొలుసులతో బంధించారు. అతడిపై కేసు నమోదు చేశారు. ఈ దృశ్యాలన్నీ స్థానికుడొకరు తన సెల్ఫోన్లో బంధించాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. -
ఔరా ! బేడీలు ఇలా కూడా వాడొచ్చా?
దొడ్డబళ్లాపురం :మామూలుగా పోలీసులు బేడీలను ఎందుకు ఉపయోగిస్తారో మనందరికీ తెలుసు...వేస్తే ఖైదీలకు వేస్తారు. లేదంటే స్టేషన్లో ఒకచోట తగిలిస్తారు. అంతకుమించి ఏ విధంగానూ బేడీలు ఉపయోగించరాదు..అయితే విజయపుర రిజర్వ్ పోలీసులు తమ కార్యాలయం మెయిన్‌గేట్‌కు తాళం బదులు బేడీలు వేసి అవాక్కయ్యేలా చేశారు. ఈ దృశ్యాలను చూసి కొందరు నవ్వుకుంటుంటే మరికొందరు పోలీసుల ఈ వైఖరిపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఈమె జగత్ కి'లేడీ'.. వైరల్ వీడియో!
-
ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా సిబ్బందితో అనుచితంగా, వికృతంగా ప్రవర్తించే ప్రయాణికులకు చెక్ పెట్టేందుకు నిర్ణయించింది. ప్రయణీకుల భద్రతే ముఖ్యమైనప్పటికీ, వేధింపులకు దిగిన ప్రయాణికులకు సంకెళ్లు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల సిబ్బందిపై వేధింపుల ఉదంతాలు చోటుచేసు కోవడంతో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటివరకూ అంతర్జాతీయ విమానాల్లో మాత్రమే అనుమతి ఉన్న రిస్ట్రెయినర్స్ ను ఇక మీదట జాతీయ, అంతర్జాతీయ విమానాల్లోకూడా తీసుకెళ్లనున్నట్టు నివేదికలుచెబుతున్నాయి. ఇకమీదట దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులను నియంత్రించేందుకుగాను ప్లాస్టిక్ సంకెళ్లను తీసుకెళ్లనున్నట్టు ఎయిర్ ఇండియీ అధ్యక్షుడు అశ్విన్ లోహాని తెలిపారని రిపోర్ట్ చేశాయి. విమానం, ప్రయాణీకుల భద్రత విషయంలో ఎలాంటి రాజీలేదని తెలిపారు. అదే సందర్బంగా తమ సిబ్బంది రక్షణ కూడా ముఖ్యమే అన్నారు. విమానాల్లో దుష్ప్రవర్తన ఇటీవల కాలంలో బాగా పెరుగుతోందని, తమ పైలట్లు పూర్తి అసహనంతో ఉంటున్నా, లైంగిక వేధింపులు లాంటివి చోటు చేసుకున్నాయని ఆశ్విన్ చెప్పారు. అయితే పూర్తిగా నియంత్రణ కోల్పోయినపుడు మాత్రమే ప్లాస్టిక్ సంకెళ్ల ద్వారా వారిని నియంత్రిస్తామని తెలిపారు. అనంతరం వారిని దర్యాప్తు ఏజెన్సీలకు అప్పగిస్తామన్నారు.కాగా జనవరి 2 న మస్కట్-ఢిల్లీ విమానంలో ఎయిర్ హోస్టెస్ పై లైంగిక దాడి, డిసెంబర్ 21 న ముంబై-న్యూయార్క్ విమానంలో సహ-ప్రయాణీకుడి అనుచిత ప్రవర్తన నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్టుతెలుస్తోంది. -
బాలుడికి సంకెళ్లు. మూడు రోజులుగా నిర్బంధం
వేటపాలెం : ప్రకాశం జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్లో 12 సంవత్సరాల బాలుడిని మూడు రోజులుగా పోలీస్ స్టేషన్లో కాళ్లకు సంకెళ్లు వేసి నిర్బంధించారు. వివరాల ప్రకారం.. ఆనంరావు అనే బాలుడు వీధుల వెంట కాగితాలు ఏరుకొని, వాటిని విక్రయించి జీవనం సాగిస్తుంటాడు. అయితే వేటపాలెం ఇందిరాకాలనీలో జరిగిన దొంగతనం కేసులో బాలునిపై అనుమానంతో మూడు రోజులుగా పోలీస్ స్టేషన్లో ఉంచి బాలుడిని విచారిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న విలేకరులు ఎస్సై చంద్రశేఖర్‌ను వివరణ కోరగా.. బాలుడిని అదుపులోకి తీసుకుని మూడు రోజులు కాలేదని, సోమవారం మధ్యాహ్నం బాలుడు వేటపాలెం రైల్వే స్టేషన్లో పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.