
బాలుడికి సంకెళ్లు. మూడు రోజులుగా నిర్బంధం
వేటపాలెం : ప్రకాశం జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో 12 సంవత్సరాల బాలుడిని మూడు రోజులుగా పోలీస్ స్టేషన్‌లో కాళ్లకు సంకెళ్లు వేసి నిర్బంధించారు. వివరాల ప్రకారం.. ఆనంరావు అనే బాలుడు వీధుల వెంట కాగితాలు ఏరుకొని, వాటిని విక్రయించి జీవనం సాగిస్తుంటాడు. అయితే వేటపాలెం ఇందిరాకాలనీలో జరిగిన దొంగతనం కేసులో బాలునిపై అనుమానంతో మూడు రోజులుగా పోలీస్ స్టేషన్‌లో ఉంచి బాలుడిని విచారిస్తున్నారు.
దీనిపై సమాచారం అందుకున్న విలేకరులు ఎస్సై చంద్రశేఖర్‌ను వివరణ కోరగా.. బాలుడిని అదుపులోకి తీసుకుని మూడు రోజులు కాలేదని, సోమవారం మధ్యాహ్నం బాలుడు వేటపాలెం రైల్వే స్టేషన్‌లో పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.