interrogation
-
నేటి నుంచి కవితను విచారించనున్న సీబీఐ
-
సీబీఐ కస్టడీలో కవిత.. డే-1 ఇంటరాగేషన్
Updates ► సీబీఐ కస్టడీలో కవిత విచారణ కొనసాగుతోంది. సీబీఐ కేంద్ర కార్యాలయంలో ఇంటరాగేషన్ జరుగుతోంది. రూమ్ నంబర్ 302లో విచారణ సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవితను సీబీఐ మహిళా అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసి అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది. ► సీబీఐ కస్టడీలో ఉన్న కవిత ఇంటరాగేషన్ సీబీఐ కేంద్ర కార్యాలయంలో కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసి అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాఫ్ చాట్‌పై సీబీఐ కవితను ప్రశ్నిస్తోంది. ► మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవి పర్యవేక్షణలో సీబీఐ కవితను ప్రశ్నిస్తోంది. సీబీఐ కస్టడీలో కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు జరగనున్నాయి. సీబీఐ కస్టడీలో ప్రతి రోజు సాయంత్రం 6-7 గంటల మధ్య కవితను కలిసేందుకు న్యాయవాది, సభ్యులకు అనుమతి ఉంది. కవిత భర్త అనిల్, కేటీఆర్, పీఏ శరత్ న్యాయవాది మోహిత్ రావు కలిసేందుకు అనుమతి ఉంది. ఢిల్లీ, సాక్షి: లిక్కర్ పాలసీ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేటి నుంచి విచారణ చేపట్టనుంది. ఈ కేసులో అనూహ్యరీతిలో సీబీఐ ఆమెను అరెస్ట్ చేయగా.. రౌస్ అవెన్యూ కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ఇవాళ(శనివారం) తొలిరోజు కవిత ఇంటరాగేషన్ ప్రారంభం కానుంది. సాక్ష్యాలను ముందు పెట్టి సీబీఐ అధికారులు కవితను విచారణ చేయనున్నట్లు సమాచారం. బుచ్చిబాబు-కవిత మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఆధారంగా ఇంటరాగేషన్ జగరనున్నట్లు తెలుస్తోంది. అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవ, దినేష్ అరోరా శరత్ చంద్రారెడ్డితో పాటు అభిషేక్ బోయినపల్లి అశోక్ కౌశిక్ వాంగ్మూలాలను చూపించి సీబీఐ కవితను ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇక.. నిన్న( శుక్రవారం) కవితను మూడు రోజుల కస్టడీకి కోర్టు అప్పగించిన విషయం తెలిసిందే. ఈనెల 15 వరకు కవిత సీబీఐ కస్టడీలో ఉండనుంది. సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో కవిత విచారణ జరగనుంది. కవితను సీబీఐ కస్టడీలో కలిసేందుకు సోదరులు కేటీఆర్, భర్త అనిల్, కవిత పిల్లలు, పీఏ శరత్ కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా కస్టడీలో కవితకు ఇంటిభోజనం, జపమాల, పుస్తకాలు, బెడ్లను కోర్టు అనుమతించింది. కవిత రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ విషయాలు కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు కస్టడీ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి.. కవిత జాగృతి సంస్థకు రూ. 80లక్షల ముడుపులు చెల్లించారు. డబ్బులకోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సిబిఐ తెలిపింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని కవిత శరత్ చంద్రారెడ్డిని బెదిరించారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించినట్లు సీబీఐ పేర్కొంది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌కు పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు 80లక్షలు శరత్ చంద్రారెడ్డి చెల్లించారన్న సిబిఐ. మహబూబ్‌నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తను రూ.14కోట్లు ఇవ్వలేనన్న శరత్ చంద్రారెడ్డి. రూ.14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు సీబీఐ పేర్కొంది. ఒక్కో రిటైల్ జోన్ కి రూ.5 కోట్లు చెప్పున 5 రిటైల్ జోన్లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత 50 కోట్లు డిమాండ్ చేశారు. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారన్నసీబీఐ. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్కి కవితే రూ.100కోట్లు చెల్లించారు. ఇండో స్పిరిట్‌లో 65శాతం వాటా పొందారు. గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారు. ఈ డబ్బును కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడు. ఈ విషయాలన్నింటి పైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదు అని సీబీఐ పేర్కొంది. అందుకే ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాలని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది. కవిత అరెస్టు అక్రమం.. కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. ‘కవిత అరెస్టు అక్రమం. కవితను కస్టడీలో ఉంచాలనేది సీబీఐ ధ్యేయంగా కనబడుతోంది. కవిత ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ. జాతీయ రాజకీయ పార్టీలో కవిత మాస్ లీడర్. త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో అరెస్ట్ చేయడమనేది కీలకం. కవిత ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అరెస్టులో నిబంధనలు పాటించలేదు. దర్యాప్తుకు సహకరించకపోవడం అరెస్టుకు కారణంగా ఉండొద్దని సుప్రీం కోర్టు గతంలోనే చెప్పింది. సెక్షన్ 41 దుర్వినియోగం చేశారు’అని అన్నారు. -
సీబీఐ ఇంటరాగేషన్.. కవిత పిటిషన్‌పై నేడు విచారణ
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన తనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఇంటరాగేషన్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కోర్టు కవితను తీహార్ జైల్లోనే విచారించేందుకు సీబీఐకు ఏప్రిల్ 5వ తేదీన ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే.. ఆమెను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా కోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో.. గడువు ఇస్తూ పిటిషన్‌పై విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్టైన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని ప్రశ్నించాలంటే కోర్టు అనుమతి అవసరం. అలా తీహార్ జైల్లో ఉన్న కవితను కోర్టు అనుమతితో సీబీఐ బృందం ప్రశ్నించాలనుకుంది. ఇప్పటికే.. శనివారం తీహార్ జైలుకు వెళ్లిన దర్యాప్తు సంస్థ అధికారులు కవితను ప్రశ్నించినట్లు సమాచారం. -
ట్యాపింగ్‌కు సహకరించిందెవరు? ప్రణీత్‌రావుపై ప్రశ్నల వర్షం
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో అరెస్టయి తమ కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును మూడోరోజు మంగళవారం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్‌ను పోలీసులు విచారిస్తోంది. ట్యాపింగ్ కేసుకు సంబంధించి గతంలో ఎస్బీఐ అధికారులు ఎవరెవరు సహకరించారన్నదానిపై పోలీసులు ప్రణీత్ నుంచి కూపీ లాగుతున్నారు. సహకరించిన వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ధ్వంసం చేసిన ప్రణీత్‌రావు కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లు ఎక్కడ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హార్డ్ డిస్క్‌లు దొరికిన తర్వాత వాటి నుంచి డేటా పునరుద్ధరిస్తే ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేశారు, ఎందుకు చేశారనే కీలక విషయాలు బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేవలం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ చెప్పిన నెంబర్లు మాత్రమే ప్రణీత్‌రావు ట్యాప్ చేయలేదని.. పలువురు రాజకీయ నేతలు, రియల్ఎస్టేట్ వ్యాపారులు చెప్పిన నెంబర్లను సైతం ప్రణీత్‌రావు ట్యాప్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బేగంపేట ఎస్ఐబీలోని కీలకమైన లాగర్ రూంను ఇందుకు వినియోగించుకున్నారని.. అలాగే అక్కడి సిబ్బందిని ప్రమోషన్ ఆశ చూపించి రహస్యాలేవీ బయటకు రాకుండా జాగ్రత్తపడ్డట్లు తేలింది. ప్రస్తుతం ప్రణీత్‌రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న స్పెషల్ టీం.. అతని డైరీలో దొరికిన వందల నెంబర్లపై ప్రశ్నలు గుప్పిస్తూ మరింత సమాచారం రాబట్టేందుకు యత్నిస్తోంది. ఇదీ చదవండి.. ఇబ్రహీంపట్నంలో పరువు హత్య -
ఇంట్రాగేషన్ లో లిషి గణేష్ వెన్నకి తగ్గిన క్రిష్.. డ్రగ్స్ కేసులో వాస్తవాలు
-
నారా లోకేష్‌కు మళ్లీ సీఐడీ నోటీసులు
సాక్షి, విజయవాడ: అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు విచారణ ముగిసింది. మంగళవారం ఆరు గంటలపాటు విచారించిన ఏపీ సీఐడీ.. విచారణలో సహకరించకపోవడంతో మళ్లీ నోటీసులు జారీ చేసింది. రేపు కూడా విచారణకు రావాలంటూ ఆయన్ని అధికారులు నోటీసుల్లో కోరారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసుకు సంబంధించి ఇవాళ నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ అధికారులు 50 దాకా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంటరాగేషన్‌లో లోకేష్ కీలక అంశాలకు సమాధానం ఇవ్వలేదు. చాలా ప్రశ్నలకు ఆయన నీళ్లు నమిలినట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆరు గంటలపాటు సాగిన విచారణలో.. చాలా ప్రశ్నలకు లోకేష్ తెలియదనే సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు.. చాలా ప్రశ్నలకు ఆయన పదే పదే లాయర్ల దగ్గరికి వెళ్లినట్లు తెలుస్తోంది. సీఐడీ విచారణలో.. హెరిటేజ్ బోర్డు మీటింగ్ నిర్ణయాలపై లోకేష్‌ను అధికారులు ప్రశ్నించగా.. తనకు తెలియదనే ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో.. లోకేష్ హాజరై స్వయంగా సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు సీఐడీ అధికారులు చూపించడంతో ఆయన ఖంగుతిన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. హెరిటేజ్ భూములు ఆ ప్రాంతంలోనే ఎందుకు కొన్నారని సీఐడీ ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం ఇచ్చారని, కీలక అంశాలపై దాటవేత ధోరణిని ప్రదర్శించారు కాబట్టే.. మరోసారి ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని ఏపీ సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్చారన్నది నారా లోకేష్‌పై ఉన్న ప్రధాన అభియోగం. లోకేశ్ పాత్రకు సంబంధించి కీలకమైన 129 ఆధారాలను ఏపీ సీఐడీ సిట్ బృందం గుర్తించి, జప్తు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఏ1గా, మాజీ మంత్రి నారాయణ ఏ2గా, హెరిటేజ్ సంస్థ ఏ6గా, నారా లోకేష్‌ను ఏ14గా చేర్చింది ఏపీ సీఐడీ. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ పిటిషన్ వేయగా.. ఏపీ హైకోర్టు దానిని కొట్టేసింది. విచారణకు సహకరించాలని లోకేష్‌కు సూచిస్తూనే.. మరోవైపు 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని సీఐడీ పోలీసులకు తెలిపింది. దీంతో.. ఢిల్లీకి వెళ్లి మరీ లోకేష్‌ను నోటీసులు ఇచ్చి వచ్చారు. ఈ క్రమంలో కోర్టు నుంచి స్వల్ప ఊరట పొందిన లోకేష్‌ను ఇవాళ ఏపీ సీఐడీ విచారణ చేపట్టింది. -
ఇంటరాగేషన్‌లో ముద్దాయికి 50 ప్రశ్నలు!
సాక్షి, తూర్పు గోదావరి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ప్రథమ ముద్దాయి.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడి తొలిరోజు సీఐడీ కస్టడీ విచారణ Interrogation ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బాబును.. శనివారం మొత్తంగా ఏడు గంటలపాటు ప్రశ్నించింది సీఐడీ డీఎస్పీ ధనుంజయుడి నేతృత్వంలోని బృందం. అలాగే.. కోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణీత సమయంలోనే విచారణ ముగించిన సీఐడీ.. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన్స్ హాల్లో చంద్రబాబు విచారణ కొనసాగింది. శనివారం ఉదయం, మధ్యాహ్నాం రెండు దఫాలుగా ప్రశ్నించారు అధికారులు. ఫస్ట్ హాఫ్‌లో దాదాపు గంటన్నరపాటు చంద్రబాబును ప్రశ్నించారు అధికారులు. భోజన విరామంతో పాటు విచారణలో మొత్తం నాలుగుసార్లు బ్రేకులు ఇచ్చారు. బాబు వయసు రీత్యా ఒక వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచారు. మొత్తం 120 ప్రశ్నలతో విచారణకు వెళ్లిన సీఐడీ.. యాభై ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది. సీమెన్స్ ఒప్పందం, లావాదేవీలపైనే ప్రధానంగా చంద్రబాబును ప్రశ్నించింది సీఐడీ. స్కిల్ స్కాంలో కుట్ర కోణం, నిధుల విడుదల, షెల్ కంపెనీలు.. సాక్ష్యాధారాల మాయంపైనా సీఐడీ ప్రశ్నల వర్షం గుప్పించినట్లు తెలుస్తోంది. డీపీఆర్ లేకుండా ఎందుకు ప్రాజెక్టు ఓకే చేయించారు?. ఫైనాన్స్ సెక్రటరీ వద్దన్నా.. నిధులు ఎందుకు విడుదల చేశారు?. యూపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను డిప్యూటీ సీఈవోగా ఎందుకు చేశారు?.. లాంటి ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం. సుమన్ బోస్‌తో చంద్రబాబు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా?. ఆయనతో గంటా సుబ్బారావుకు జరిగిన ఈమెయిల్స్ వివరాలేంటి?. సుబ్బారావుకు నాలుగు పదవులు కట్టబెట్టడం వెనుక మతలబేంటి?. ఈ స్కామ్‌లో బాబుతో పాటు అచ్చెన్నాయుడి పాత్ర ఏంటి?. మూడు వేల కోట్ల రూపాయల గ్రాంట్ ఇన్ ఎయిడ్.. డిస్కౌంట్‌గా ఎందుకు మారింది?. రూ. 3 వేల కోట్ల గురించి అడగొద్దని అధికారుల్ని ఎందుకు దబాయించారు? లాంటి ప్రశ్నలూ సంధించినట్లు సమాచారం. అయితే వాటిని ఆయన ఎలాంటి ప్రశ్నలు సంధించారనేది సీఐడీ కోర్టుకు నివేదిక సమర్పించిన తర్వాతే తెలిసేది. బాబు తరపు లాయర్లు దమ్మలపాటి శ్రీనివాస్, సుబ్బారావుల సమక్షంలో.. చంద్రబాబు స్టేట్మెంట్ను పకడ్బందీగా రికార్డ్ చేశారు సీఐడీ అధికారులు. మరోవైపు విచారణ నేపథ్యంలో సెంట్రల్ జైలు దగ్గర పోలీసుల అలర్ట్ అయ్యారు. విచారణ జరిగాక.. స్థానిక గెస్ట్‌హౌజ్‌కి వెళ్లింది సీఐడీ అధికారుల బృందం. రేపు(సెప్టెంబర్ 24, ఆదివారం) కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో చంద్రబాబును విచారించనుంది సీఐడీ. ఇదీ చదవండి: ఫస్ట్ టైం.. ‘బ్లూజీన్’తో కోర్టులో హాజరైన చంద్రబాబు -
చంద్రబాబుని సీఐడీ అడిగే ప్రశ్నలు ఇవే..
-
ఆ పాయింట్ మీదే A1 రామోజీ విచారణ!
-
చట్టాన్ని గౌరవించి విచారణకు వచ్చా: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గడువు కావాలని కోరుతూ చేసిన అభ్యర్థనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తిరస్కరించడంతో విచారణకు హాజరయ్యారు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్జి. రోహిత్ రెడ్డి లేఖను తిరస్కరిస్తూ మధ్యాహ్నం 3 గంటలకు కచ్చితంగా హాజరుకావాలని స్పష్టం చేసింది ఈడీ. దీంతో తాను విచారణకు హాజరైనట్లు చెప్పారు రోహిత్‌రెడ్డి. చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ‘నేను చట్టాన్ని గౌరవిస్తాను. విచారణకు పూర్తిగా సహకరిస్తా. అయ్యప్ప దీక్షలో ఉన్నందుకు సమయం కోరాను. కానీ అందుకు ఈడీ నిరాకరించింది. కచ్చితంగా హాజరుకావాలని చెప్పడంతో వచ్చాను. చట్టాన్ని గౌరవించి విచారణకు వచ్చాను ఏ కేసులో విచారణకు పిలిచారో తెలియదు.’ అని పేర్కొన్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది. ఇదీ చదవండి: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ షాక్! -
శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా
న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణలో రోజురోజుకు షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా తాను మత్తు పదార్థాలకు బానిసైనట్లు విచారణలో చెప్పాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రద్ధ హత్య జరిగిన రోజు(మే 18) ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అనంతరం బయటకు వెళ్లిన అఫ్తాబ్ గంజాయి తాగి తిరిగి ఇంటికి వచ్చి ఆమెను గొంతునులుమి హత్య చేసినట్లు విచారణలో చెప్పుకొచ్చాడని తెలుస్తోంది. తరచూ గంజాయి తాగుతున్నందుకు శ్రద్ధ తనను తిట్టేదని అఫ్తాబ్ విచారణలో పేర్కొన్నాడు. హత్య జరిగిన రోజు ఖర్చుల విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందని వివరించాడు. డబ్బులు లేక ఇద్దరం ఇబ్బందిపడ్డామని, ముంబై నుంచి తమ లగేజ్ ఢిల్లీకి ఎలా తీసుకురావాలని రోజంతా పోట్లాడుకున్నామని తెలిపాడు. గొడవ అనంతరం గంజాయి మత్తులోనే శ్రద్ధను తాను చంపానని, కావాలని హత్య చేయలేదని అఫ్తాబ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మే 18 రాత్రి 9నుంచి 10 గంటల సమయంలో శ్రద్ధను హత్య చేసిన తర్వాత రాత్రంగా గంజాయి సిగరెట్ తాగుతూ మృతదేహం పక్కనే ఉన్నట్లు అఫ్తాబ్ వివరించాడు. హత్య అనంతరం శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలు చేసిన అఫ్తాబ్ వాటిని 300 లీటర్ల ఫ్రిజ్‌లో దాచాడు. తర్వాత శరీర భాగాలను సమీపంలోని అడవితో పాటు మరికొన్ని ప్రదేశాల్లో పడేశాడు. ఢిల్లీ మెహ్రౌలీలో జరిగిన శ్రద్ధ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిందితుడు అఫ్తాబ్ పోలీస్ కస్టడీని కోర్టు గురువారం మరో ఐదు రోజులు పొడిగించింది. నార్కో టెస్టుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో శ్రద్ధ శరీర భాగాలు ఇంకా అన్నీ దొరకలేదు. ఆమెను ముక్కలు చేసేందుకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. దీనికి ఇంకా చాలా రోజులు పడుతుందని పోలీసులు చెబుతున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను చంపి గుండెపోటుగా చిత్రీకరణ.. మూడు నెలల తర్వాత.. -
కస్టడిలో వ్యక్తి మృతి.. రాత్రి సమయంలో విచారణ చేయొద్దు..
సాక్షి, చెన్నై: రాత్రి సమయాల్లో ఖైదీలను విచారణ చేయవద్దని.. పోలీసులకు రాష్ట్ర డీజీపీ శైలేంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం ఆరు గంటలలోపు వారిని జైలుకు తరలించాలని పేర్కొన్నారు. విఘ్నేష్(25) అనే వ్యక్తి కస్టడీలో మరణించిన కొన్ని రోజుల తర్వాత ఆ ఆదేశాలు వెలువడ్డాయి. కాగా గత కొన్ని రోజులకు ముందు చెన్నై కెల్లిస్ కూడలి వద్ద సందేహాస్పదంగా వస్తున్న ఆటోను పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అందులో గంజాయి, కత్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని ఆటోలో వచ్చిన విఘ్నేష్, అతని స్నేహితుడిని పోలీస్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేశారు. ఆ సమయంలో విగ్నేష్‌కు ఫిట్స్ వచ్చినట్లు అతని కీల్పాక్కమ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ మృతి చెందాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీనికి సంబంధించి ముగ్గురు పోలీసులను విధుల నుంచి తొలగించడం జరిగింది. ఈ కేసును సీబీసీఐడీ విచారణ చేస్తోంది. ఈ క్రమంలో డీజీపీ శైలేంద్ర బాబు ఓ ప్రకటన జారీ చేశారు. అందులో ఖైదీలను రాత్రి సమయంలో విచారణ చేయవద్దని స్పష్టం చేశారు. చదవండి: యూపీలో దారుణం.. అత్యాచార బాధితురాలిపై పోలీస్ లైంగిక దాడి -
అసదుద్దీన్ ఒవైసీని అందుకే చంపాలనుకున్నా
లక్నో: ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన నిందితుడు సచిన్ పండిట్ నేరం అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. ఒవైసీని చంపాలన్న ఉద్దేశంతో కాల్పులు జరిపినట్టు విచారణలో అతడు వెల్లడించాడని తెలిపారు. బుల్లెట్లు తగిలే ఉంటాయనుకున్నా ‘నేనో పెద్ద రాజకీయ నాయకుడిని కావాలనుకున్నాను. కానీ ఒవైసీ రెచ్చగొట్టే ప్రసంగాలు విని కలత చెందాను. అందుకే నా స్నేహితుడు శుభమ్‌తో కలిసి ఒవైసీ హత్యకు పథకం వేశాను. నేను ఒవైసీపై కాల్పులు జరిపినప్పుడు ఆయన వంగిపోయాడు. దీంతో కిందకు కాల్పులు జరిపాను. ఒవైసీకి బుల్లెట్లు తగిలే ఉంటాయని అనుకున్నాను. తర్వాత అక్కడి నుంచి పారిపోయాన’ని పోలీసుల విచారణలో సచిన్ వెల్లడించాడు. దాడికి చాలాసార్లు ట్రైచేశా ఒవైసీపై దాడికి చాలా రోజులు నుంచి ప్రణాళిక తయారు చేసినట్టు చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా ఎంపీ కదలికలను తెలుసుకునేవాడినని, దాడి చేయడానికి పలుమార్లు ఒవైసీ సమావేశాలకు కూడా వెళ్లినట్టు తెలిపారు. అయితే సమావేశాలకు జనం భారీ సంఖ్యలో రావడంతో దాడి చేయడం సాధ్యపడలేదని అన్నాడు. ‘ఒవైసీ మీరట్ నుంచి ఢిల్లీకి వెళతారని తెలుసుకుని.. నేను ఆయన కంటే ముందే టోల్గేట్ వద్దకు చేరుకున్నాను. ఒవైసీ కారు రాగానే కాల్పులు జరిపాన’ని పోలీసుల విచారణలో సచిన్ చెప్పినట్టు సమాచారం. పిస్టల్ ఇచ్చింది అతడే ఒవైసీపై కాల్పులకు సంబంధించి ఇప్పటివరకు సచిన్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు హాపూర్ అడిషినల్ ఎస్పీ తెలిపారు. సచిన్ నుంచి 9 ఎంఎం పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడికి పిస్టల్ సమకూర్చిన మీరట్‌కు చెందిన తలీమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సచిన్ ఉద్దేశం గురించి అతడికి తెలియదని విచారణలో తేలింది. కాగా, సచిన్ పండిత్ బీజేపీ నాయకులతో కలిసివున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: ఆంక్షలతో బతకలేను, చావుకు భయపడను) -
‘కార్వీ’ చుట్టూ ఈడీ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ఆ సంస్థ చైర్మన్ సి.పార్థసారథితోపాటు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్‌సింగ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జి.కృష్ణహరి, కంపెనీ సెక్రటరీ వై.శైలజలను ప్రశ్నించింది. హైదరాబాద్, సైబరాబాద్‌ల్లోని మూడు బ్యాంకుల నుంచి దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర రుణాలు తీసుకుని మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ రెండు కమిషనరేట్లలో నాలుగు కేసులు నమోదయ్యాయి. రూ.35 కోట్ల మేర మోసం చేశారంటూ సికింద్రాబాద్‌కు చెందిన మరికొందరు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్‌లో మరో కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు నుంచి ఈడీ అధికారులు ప్రత్యేక అనుమతి తీసుకుని పార్థసారథిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉండటంతో చంచల్‌గూడ జైల్లోనే విచారిస్తున్నారు. వారంపాటు పార్థసారథిని ప్రశ్నించడానికి అనుమతి కోరగా మూడు రోజులకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆది, సోమవారాల్లో ఆయనను ప్రశ్నించిన అధికారులు మంగళవారం కూడా విచారించనున్నారు. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అధికారుల నుంచి సేకరించిన ఎఫ్ఐఆర్లను బట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. పవర్ ఆఫ్ అటార్నీని అనువుగా మార్చుకొని... కార్వీ ద్వారా డీమ్యాట్ ఖాతాలు తెరిచేందుకు మదుపరులు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని పార్థసారథి తనకు అనువుగా మార్చుకుని భారీ స్కామ్‌కు తెగబడ్డారు. మదుపరుల అను మతి లేకుండా వారి డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నారు. అవన్నీ తమవే అంటూ చూపించి వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదించి కొలట్రల్ సెక్యూరిటీ(తనఖా)గా పెట్టి దాదాపు రూ.వెయ్యి కోట్లు అప్పు గా తీసుకున్నారు. ఈ మొత్తాలను రుణం పొందిన సంస్థల్లోనే ఉంచి, వాటి అభివృద్ధి–విస్తరణలకు వినియోగించాల్సి ఉంది. అయితే దీనికి భిన్నంగా కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ సంస్థల్లోకి మళ్లించి భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది. దానికి సంబంధించిన వివరాల కోసమే పార్థసారథిని ప్రశ్నించి సమగ్ర వాంగ్మూలం నమోదు చేస్తోంది. కోర్టు అనుమతితో మిగిలిన నిందితుల విచారణ పూర్తయిన తర్వాత కార్వీ సంస్థలతోపాటు నిందితుల ఆస్తుల వివరాలు సేకరించి తాత్కాలికంగా జప్తు చేయనుంది. -
నకిలీ టీకాల కలకలం.. 2 వేల మందికి ఉప్పు నీటితో వ్యాక్సినేషన్?
ముంబై: ఓ వైపు కరోనాతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే మరో వైపు కొందరు మాత్రం ఈ పరిస్థితులను క్యాష్ చేసుకుంటున్నారు. ముంబైలో నకిలీ వాక్సిన్ ఉదంతం బయటపడింది. నగరంలోని ఓ హౌజింగ్ సొసైటీలో సుమారు 300 పైగా వ్యాక్సిన్ తీసుకున్నాక ఏ లక్షణం లేకపోవడంతో అనుమానంతో ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు సంబంధించి 10 మందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో నకిలీ వ్యాక్సిన్లు..ఉప్పునీరు లేదా సెలైన్? నిందితులు ప్రజలకు ఉప్పునీటి లేదా సెలైన్‌ను వ్యాక్సిన్‌గా ఇచ్చినట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే నిందితుల దగ్గర నుంచి రూ.12.40 లక్షలు రికవరీ చేసి, ప్రధాన నిందితులైన మనీష్ త్రిపాఠి, మహేంద్ర సింగ్ బ్యాంకు ఖాతాలు బ్లాక్ చేశామని పోలీసులు తెలిపారు. నగరంలో 9 నకిలీ వ్యాక్సిన్ క్యాంపులు జరిగినట్లు తెలిపారు. కాగా ముంబైలోని కందివాలిలోని హౌసింగ్ సొసైటీ వారు ఫిర్యాదు చేయడంతో గత వారం ఈ కుంభకోణం బయట పడింది. హిరానందాని హెరిటేజ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లోని నివాసితుల ప్రకారం.. నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సిబ్బందిమంటూ కొంతమంది వ్యాక్సిన్ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ మోసానికి పాల్పడినట్లు వారు చెప్తున్నారు. "మాకు వాస్తవానికి కోవిషీల్డ్ ఇంజెక్ట్ చేశారా లేదా గ్లూకోజ్ అనే సందేహాలు ఉన్నాయని’ నివాసితులలో ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. సినీ నిర్మాత రమేష్ తౌరానీ కూడా ఇదే విధమైన ఫిర్యాదు చేశారు. తను మే 30, జూన్ 3 న 365 మంది ఉద్యోగులకు టీకా శిబిరం ఏర్పాటు చేశానని, అయితే ఎవరికీ ధృవీకరణ పత్రాలు రాలేదని తెలిపారు. కాగా పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం.. 2 వేల మందికి పైగా ప్రజలకు ఈ ముఠా నకిలీ వ్యాక్సిన్లు వేసినట్లు గుర్తించారు. చదవండి: భర్త ప్రశ్న.. భార్య ఆత్మహత్య -
నువ్వే సరిగా లేవు
నిజం చెప్పించడానికే ఇంటరాగేషన్. ఎవర్నుంచి నిజం? నిందితుల నుంచి. బాధితులకు ఇంటరాగేషన్ ఉండదు. అడగడం వరకే... స్టేట్మెంట్ వరకే. అత్యాచారాల్లో మాత్రం ఇది రివర్స్. ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరు... అన్నీ విచారణకు కావలసిన ప్రశ్నలే. బాధితురాలికి మాత్రం.. ఇంటరాగేషన్ చేసినట్లే ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్రాబ్లమ్... వాళ్ల బిహేవియర్ మీద తీర్పులు! ఇటీవలి రెండు రేప్ కేసులు ఇవి. కర్ణాటకదొకటి.. బిహార్‌ది మరొకటి. ఆమె అతడిపై కేస్ పెట్టింది. అతడు ముందస్తు బెయిలుకు పిటిషన్ పెట్టుకున్నాడు. ‘బెయిల్ గ్రాంటెడ్’ అంది కోర్టు! ‘ఇలాంటి వ్యక్తికి బెయిల్ ఇస్తే సమాజం సురక్షితంగా ఉండలేదు మిలార్డ్’ అన్నాడు ఆమె తరఫు లాయర్. జడ్జి ఆ లాయర్ వైపు చూశారు. ‘అతడికి బెయిల్‌ను నిరాకరించేందుకు తగిన కారణమేదీ ఆమె దగ్గర కనిపించడం లేదు’ అన్నారు! రేప్ కేసు అది. జడ్జిగారు అడిగిన ఏ ప్రశ్నకూ బాధితురాలు సంతృప్తికరంగా సమాధానం చెప్పలేకపోయింది. ‘‘రాత్రి పదకొండు గంటలకు మీరు ఆఫీస్‌కు ఎందుకు వెళ్లవలసి వచ్చింది?’’ ‘‘ఆయన మా బాస్. ఫోన్ చేసి పిలిస్తే కాదనలేకపోయాను’’ ‘‘ఆయనతో కలిసి ‘డ్రింక్స్’ ఎందుకు తాగవలసి వచ్చింది?’’ ‘‘ఆయన ఆఫర్ చేశారు. వద్దంటే బాగోదనీ..’’ ‘‘తెల్లవారుజాము వరకు ఆఫీస్‌లోనే ఎందుకు ఉన్నారు?’’ ‘‘ఈ టైమ్‌లో బయటికి వెళ్లడం మంచిది కాదు. ఉండిపొమ్మన్నారు.’’ ‘‘ఆయన మీపై అత్యాచారం చేసిన మర్నాడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు?’’ ‘‘నేను కదిలే స్థితిలో లేను. తెలియకుండానే మగతలోకి జారిపోయాను’’ జడ్జిగారు ఇంకేమీ ప్రశ్నలు వెయ్యలేదు. అతడికి బెయిల్ ఇస్తూ ఆమె గురించి ఒక మాట అన్నారు. ‘‘అత్యాచారం జరిగినప్పుడు భారతీయ స్త్రీకి నిద్రపట్టదు. ఈమె మాత్రం తను నిద్రపోయానని చెబుతోంది. వినేందుకే ‘అన్బికమింగ్’ గా ఉంది’’ అన్నారు. అన్బికమింగ్ అంటే ‘తగని విధంగా’, ‘సమ్మతించలేనిదిగా’ అని. అయితే కేసులోని తీవ్రతను గమనించి అతడికి బెయిలును తిరస్కరించవలసిందిగా ఆమె లాయరు జడ్జి గారికి విన్నవించుకున్నారు. ‘‘కేసులోని తీవ్రత మాత్రమే నిందితుడి స్వేచ్ఛను నిరాకరించడానికి ప్రాతిపదిక అవదు’’ అన్నారు జడ్జి. జూన్ నాలుగో వారంలో కర్ణాటక హైకోర్టుకు వచ్చిన ఒక కేసు ఇది. ప్రతి రెండు, నాలుగు శనివారాల్లో బెంగళూరులోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సంతకాలు పెట్టి వస్తున్నాడు అతడు. ఉద్యోగం పోయి, ఇంకోచోట ఉద్యోగం రాక తిప్పలు పడుతోంది ఆమె. ఆమె వారిపై కేసు పెట్టింది. ఆమెపై సామూహిక అత్యాచారం చేసినవారు ఆ నలుగురూ. జూలై 6న అత్యాచారం జరిగింది. మర్నాడు ఆమె మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తెలిసిన మనిషే, బైక్ నేర్పిస్తానంటే వెనుక కూర్చుంది. సాయంత్రం అది. నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. ఆక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. మరో ముగ్గురిని ఫోన్ చేసి పిలిచి ఆమెను ఆప్పగించి వెళ్లిపోయాడు. స్పృహలేని స్థితిలో ఆమె ఎలాగో తప్పించుకుని వచ్చేసింది. జూలై 10న జడ్జిగారి ఎదుట స్టేట్మెంట్ ఇవ్వడానికని ఆమెను పిలిపించారు. ఆమెకు చదువురాదు. కల్యాణి, తన్మయి అనే ఇద్దరు సామాజిక కార్యకర్తల్ని వెంటబెట్టుకుని వెళ్లింది. వాళ్లిద్దరూ ‘జన జాగరణ శక్తి సంఘటన’ అనే ఎన్జీవో సభ్యులు. స్టేట్మెంట్ కాగితం మీద సంతకం పెట్టమని అడిగారు జడ్జిగారి దగ్గర ఉండే అధికారి. చదివించుకుని సంతకం పెడతానంది బాధితురాలు. అధికారి ఒప్పుకోలేదు. ‘స్టేట్మెంట్లో ఏమున్నదీ తనకు తెలియాలి కదా. మేము చదివి వినిపిస్తాము. మాకు ఇవ్వండి’ అని అడిగారు ఆ ఇద్దరు మహిళలు. ‘‘బాధితురాలి స్టేట్మెంట్లో ఏ విధంగానైనా వేరొకరి జోక్యాన్ని చట్టం అంగీకరించదు’’ అని అన్నారు అధికారి. ‘‘దయచేసి ఇవ్వండి’’ అని అడిగారు వీళ్లు. ఇదంతా చూస్తున్న జడ్జిగారు ఆగ్రహించారు. ‘‘ఏంటీ మిస్‌బిహేవియర్’’ అంటూ.. బాధితురాలికి, ఆమెతో పాటు వచ్చిన వాళ్లకు జైలు శిక్ష విధించారు. వాళ్లున్నది అరేరియా డిస్ట్రిక్ట్ కోర్టు పరిధిలో. వాళ్లను పంపించింది అక్కడికి 225 కి.మీ. దూరంలోని సమస్తిపూర్ జైలుకు! న్యాయం కోసం వెళితే శిక్షపడింది! ప్రస్తుతం ఈ ముగ్గురూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. న్యాయ సిబ్బంది విధులకు అడ్డు తగిలారన్న నేరంపై స్వయంగా జిల్లా మేజిస్ట్రేటే వారిపై ఎఫ్.ఐ.ఆర్. రాయించారు. ఐపీసీ సెక్షన్ 353 (దాడి లేదా విధులలో ఉన్న ప్రభుత్వోద్యోగిని అడ్డుకోవడం), సెక్షన్ 228 (అవమానించేందుకు ప్రయత్నించడం, న్యాయ ప్రక్రియకు అంతరాయం కలిగించడం), సెక్షన్ 188, 180, 120బి (కోర్టు ధిక్కారం) ల కింద కేసు నమోదు చేయించారు. ఆ ముగ్గురు మహిళల మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌లో జరిగిన ఈ సామూహిక అత్యాచారం కేసులో బాధితురాలిని, ఆమె తనకు సహాయంగా తెచ్చుకున్న ఇద్దరి మహిⶠలను జైలుకు పంపడంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. మంచి పరిణామమే. ఇప్పటికే ప్రసిద్ధ సీనియర్ అడ్వొకేట్లు ఇందిరా జైసింగ్, ప్రశాంత్ భూషణ్, ఇంకా మరికొందరు.. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈ విషయమై లేఖ రాశారు. అత్యాచార బాధితురాలికి ఉండే మానసిక క్షోభ రీత్యా ఈ కేసులో సున్నితంగా వ్యవహరించేలా చూడమని వారు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. అరెస్టయిన జన జాగరణ శక్తి సంఘటన సభ్యులు కూడా తమ స్టేట్మెంట్లో ఇదే చెప్పారు. ‘‘ఆమె భయాన్ని కోర్టు వారు ధిక్కారంగా అపార్థం చేసుకున్నారు’’ అని. కోర్టులు సున్నితంగా ఆలోచిస్తాయి. ‘రేప్’ అనేది మరింత సున్నితంగా ఆలోచించవలసిన కేసు. అయితే దురదృష్టవశాత్తూ కర్ణాటక కేసులో జడ్జికి బాధితురాలు ‘అన్బికమింగ్’గా అనిపించింది. బిహార్ కేసులో జడ్జికి బాధితురాలి భయం ‘మిస్ బిహేవియర్’గా కనిపించింది. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేవి నేరమూ–శిక్షలో ఎప్పుడూ ముఖ్యమైన విచారణాంశాలే. అయితే అత్యాచార బాధితురాలికి జరగాల్సిన న్యాయానికి ఇవేవీ అడ్డొచ్చే అంశాలు కాకుండా ఉంటేనే.. ‘దేవుడున్నాడు..’ అన్నంత ధైర్యంగా.. ‘న్యాయస్థానం ఉంది’ అన్నంత ధీమా ఉంటుంది. -
చిదంబరంను విచారించనున్న ఈడీ
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం తీహార్ జైళ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిదంబరాన్ని నవంబర్ 22,23 వ తేదిలలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. కాగా,ఐఎన్ఎక్స్ మీడియా కేసులో పి చిదంబరాన్ని విచారించాలని కోరుతూ ఈడీ గురువారం రోజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు తన బెయిల్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మరోపక్క నవంబర్ 15న జస్టిస్ సురేశ్ కైట్ ఇచ్చిన తీర్పులో లోపాలున్నాయంటూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఈడీ చేసిన దరఖాస్తులో నవంబర్ 15న జస్టిస్ కైట్ ఇచ్చిన తీర్పులో 2017లో సుప్రీంకోర్టు జారీ చేసిన నాలుగు పేరాగ్రాఫ్‌ల సారాంశాన్ని చదివి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాది రోహిత్ టాండన్‌తో పాటు చిదంబరానికి బెయిల్ తిరస్కరించారు. దీనిని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు చిదంబరాన్ని విచారించేందుకు ఈడీని అనుమతిస్తున్నట్లు తెలిపింది.అయితే డీమోనిటైజేషన్ సంబంధిత మనీలాండరింగ్ కేసులో 2016లో రోహిత్ టాండన్‌ను అరెస్టు చేశారు. 2007లో కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉండగా ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అందుకునేందుకు తన శాఖలోని ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా ఆయన అనుమతి ఇప్పించారన్న ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 16న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అంతకు ముందే 2017 మే 15 న సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : చిదంబరం బెయిల్: ఈడీకి సుప్రీం నోటీసులు) -
రవిప్రకాశ్ సమాధానాల్లో వాస్తవాలు వెలికితీస్తాం
-
ఇంటరాగేషన్ పేరుతో దారుణం..
జకర్తా : ఇండోనేషియా పోలీసులు తమ కండ కావరాన్ని ప్రదర్శించారు. చోరీ కేసులో అరెస్టైన ఓ వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు. అప్పటికీ అతడు నేరాన్ని అంగీకరించకపోవడంతో చేతులు కట్టేసి ఓ బతికున్న భారీ సైజు పామును నిందితుడిపై వదిలారు. ఈ సంఘటన పపువాలో చోటుచేసుకుంది. తనను వదిలేయమని అతను ప్రాధేయపడినా కనికరించలేదు. అంతటితో ఆగకుండా మరో పోలీసుల అధికారి పామును నిందితుడి నోట్లో, లోదుస్తుల్లోకి పంపాలని అనడం వీడియోలో రికార్డయింది. అక్కడే ఉన్న పోలీసు పాము తోకను నిందితుడి నోట్లో పెట్టడానికి ప్రయత్నించాడు. ఇప్పటి వరకు ఎన్ని చోరీలు చేశావని అడగ్గా, అతను రెండు చోరీలు మాత్రమే చేశానని నేరాన్ని అంగీకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మలేషియా పోలీసులు క్షమాపణ చెప్పారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించారు. విచారణ అధికారి ప్రొఫెషనల్‌గా వ్యవహరించలేదని పేర్కొన్నారు. -
నిందితుడిపై పాములను వదిలి ఇంటరాగేషన్
-
నిష్క్రమణం
నార్జిస్ కటకటాల వెనుక నుంచి తల్లిని చూసింది. ఆమె పండిన జుత్తునీ, ధారాపాతంగా కురుస్తున్న కన్నీటినీ చూసింది. ఆమె పక్కనే నిల్చుని ఉన్న సోదరుణ్ణి చూసింది. అతని తల విషాదంతో అవనతమై ఉండటాన్ని చూసింది. అయినా నార్జిస్‌కు అతని ఖిన్న వదనం స్పష్టంగానే కనపడింది. నార్జిస్‌తో పాటు జైల్లో పెరుగుతున్న ఆమె కొడుకు మెహెదీ అమాయకంగా నవ్వుతున్నాడు. చప్పట్టు కొడుతూ మేనమామ వైపు చాక్లెట్ కోసం చెయ్యి చాచాడు. అప్పుడతను వొంచిన తల ఎత్తాడు. కటకటాల లోంచే పిల్లవాడి చేతుల్ని తన చేతిలోకి తీసుకున్నాడు. మామయ్య కన్నీరు మేనల్లుడి చేతిలో పడ్డది. మురికి తుడుస్తున్నట్టు నటిస్తూ ఆ చేతుల్ని తుడిచాడు. ఈ దృశ్యం నార్జిస్ జ్ఞాపకాల పెన్నిధిలో ముద్రితమైపోయింది. ఆమెలో ఒక ఉపశమన భావం కలిగింది. ప్రస్తుతం వార్ధక్యంలో ఉన్న తల్లి చనిపోయిన తర్వాత కూడా మెహెదీని చూసుకోవడానికి తన సోదరుడు ఉన్నాడనే భరోసా నార్జిస్‌కు కలిగింది. అతడు ఈ పిల్లవాణ్ణి పెంచగలడు. విద్యాబుద్ధులు చెప్పించగలడు. వాడి జీవితానికి మార్గదర్శి కాగలడు.క్షమాభిక్ష కోసం అర్జీపై సంతకం పెట్టమని ఆమె సోదరుడు ఎంతో ఒత్తడి చేశాడు. కానీ నార్జిస్ సుతరామూ ఇష్టపడలేదు. మిలటరీ పాలనలో నేరమేమీ చెయ్యకుండానే కేవలం ఆలోచనా విధానానికే ఉరిశిక్ష విధిస్తారు.అటువంటి స్థితిలో క్షమాభిక్ష అర్థించడం అనవసరమని నార్జిస్ దృఢంగా విశ్వసించింది. అభ్యర్థన సమర్పించడానికి గడువూ ముగిసిపోయింది. ఇప్పుడామె మృత్యు ముఖద్వారం వద్ద వేచి ఉన్నది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించడానికి చేయూతనిచ్చినట్టు ఆమె తల్లి నార్జిస్ చెయ్యి పట్టుకుంది. నార్జిస్‌కు తన వారితో ఇదే చివరి సమాగమం. ఇక ఈ క్షణంలో వారు విడిపోవడమంటే శాశ్వతంగా వీడ్కోలు చెప్పుకోవడమే. ఈ క్షణం దుర్భరమైనదీ, అత్యంత దుఃఖభరితమైనదీ. ఈ క్షణంతోనే ఆమెకు అందమూ అనాకారితనమూ, మంచీ చెడూ, ప్రేమా ద్వేషమూ మిళితమై ఉన్న బాహ్యప్రపంచంతో సంబంధం తెగిపోనున్నది. పసివాడు మెహెదీ నవ్వుతూ తన మామతో ఏదో మాట్లాడేస్తున్నాడు. ఊచల మధ్య నుంచి తల దూర్చి మామని ముద్దు పెట్టుకున్నాడు. తన చిన్ని చేతివేళ్లని అమ్మమ్మ పండు జుత్తులో చొప్పించాడు. ‘‘అమ్మా! ఇక మెహెదీకైనా స్వేచ్ఛ లభిస్తుంది. సంతోషించు. ఈ ఇనుప గొలుసులు, చేతి సంకెళ్లూ, నిర్బంధాలు ఇవే వాడి ప్రపంచమైపోయాయి. వాడూ ఈ బ్యారెక్స్‌లోనే పుట్టాడు. ఇంతవరకు ఇక్కడే పెరిగాడు. ఇక వాడు విడుదలవుతాడు. బడికి వెళ్లగలడు. బజారుకెళ్లగలడు. పార్కులో ఆడుకోగలడు. తమ్ముడూ! ఇక ముందు వీడిని పెంచే బాధ్యత నీదే.’’ ‘‘అక్కా! అక్కా! అలా మాట్లాడకు.’’ అంటూ నార్జిస్ సోదరుడు ఒక్కసారిగా భోరుమన్నాడు. అప్పుడామె మౌనం వహించింది. తల్లి వేదనా సోదరుడి దుఃఖం అర్థమయ్యాయి. కాని ఇతరులకు జీవితాన్ని ఇవ్వడానికి వేరొకరు మరణాన్ని ఆహ్వానించక తప్పదని, వారికి వివరించలేకపోయింది. సంపూర్ణమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సాధించాలంటే కొన్ని జీవితాలు ఉరికంబానికి బలి చెయ్యక తప్పదని వారికి విశదీకరించలేకపోయింది. నార్జిస్, ఆమె భర్త హుస్సేన్ ఒకేసారి అరెస్టయ్యారు. అప్పటికే ఆమె గర్భిణి. ఇంటరాగేషన్ సమయంలో హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నాడని పుకార్లు పుట్టించారు. మిలటరీ నిర్బంధంలో ఇవన్నీ సర్వసాధారణం. చిత్రహింసలు తట్టుకోలేక చనిపోయిన వారి శవాల్ని కుటుంబాలకు అప్పగించరు. కనీసం తెలియజెయ్యరు. మిలటరీ వారే పూడ్చిపెట్టేస్తారు. ఆ హత్యలని ఆత్మహత్యలుగా ప్రచారం చేస్తారు.హుస్సేన్‌పై ఆమెకు గల విశ్వాసం రవ్వంత కూడా చలించలేదు. ఆమెలానే అతడు కూడా అంతరాత్మ గల వ్యక్తి. అటువంటి ఖైదీలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కారు. వారు క్షమాభిక్షనూ అర్థించరు.ఈ చివరిచూపుల పర్వం ముగియగానే నార్జిస్ తల్లి ఒకవిధమైన నిర్వేదంలో పడిపోయింది. సోదరుడు కటకటాల్లోంచే ఆమె చేతిని ముద్దాడాడు. జుత్తు నిమిరాడు. తర్వాత వాళ్లు వెళ్లిపోయారు. కాదు, వారైవెళ్లలేదు. వారిని బయటకు తీసుకుపోయారు. నార్జిస్ ఒక్కసారి సోదరుణ్ణి దగ్గరకు తీసుకోవాలనుకుంది. కౌగిలించుకోవాలనుకుంది. కానీ ఇద్దరి మధ్య కఠినాతి కఠినమైన కటకటాలు అడ్డు నిలిచాయి. జైలు నియమాలను మనుషులే తయారు చేస్తారు. కానీ వాటిలో కాస్తంత కూడా మానవత్వం పాలు ఉండదు. తన మామ అటు వెళ్లగానే మెహెదీ బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. అమ్మ చెప్పిన కథల్లోని లోకాలనూ స్థలాలనూ చూడాలని వాడు కలలు కంటున్నాడు. కానీ అమ్మ ఎక్కడికీ వెళ్లనివ్వడం లేదు. ‘‘నువ్వు రేపు వెళ్దువుగాని నాన్నా! మామయ్య నిన్ను రేపు బయటకు తీసుకెళ్తాడు.’’ అని నెమ్మదిగా అంటూనే నార్జిస్ మెహెదీ బుగ్గల్ని ముద్దు పెట్టుకుంది.జైలు వార్డెన్ మరియమ్ తల్లీ కొడుకుల వైపు ఒక్కసారి చూసింది. తర్వాత చూడలేక తన కళ్లను కిందకు దించుకుంది. ‘ఈమె ఎటువంటి మహిళ? ఉరిశిక్ష రద్దు కోసం క్షమాభిక్ష అర్జీనైనా పెట్టుకోలేదు. రేపు ఉదయం శిక్ష అమలు చేస్తారని తెలిసినా ఒక్క కన్నీటి బొట్టు కూడా విడువలేదు. ఏడవలేదు. భగవంతుడిని తిట్టుకోవడం లేదు. కనీసం జైలరునైనా తూలనాడటం లేదు’ అనుకుంది. నిజానికి నార్జిస్ ఒక విచిత్రమైన మహిళ. ఆమె చేతికి ఖురాన్ ఇచ్చినా, ఆమె దాన్ని కళ్లకు అద్దుకుని పక్కన పెట్టేసింది. తన పిల్లవాడ్నే ముద్దులతో ముంచెత్తింది. మౌల్వీ ప్రార్థన చేయించడానికి వచ్చాడు. సర్వవ్యాపి అయిన దయామయుడైన దేవుడిని తన పాపాలను ప్రక్షాళనం చేయమని కోరమన్నాడు. కాని ఆమె చిన్న చిరునవ్వే నవ్వింది. ఆ చిరునవ్వులో నేనేమీ చెయ్యలేదు అన్న అర్థం దాగి ఉంది. మౌల్వీ అటు వెళ్లగానే ప్రార్థనాసనమైన చాపని దిండు కింద పెట్టుకుంది. తన తలని దిండు మీద పెట్టుకుంది. పసివాడికి కథలు చెప్పడం మొదలుపెట్టింది.మహిళా వార్డులో అనేక రకాలైన నేరాలు ఆరోపించబడిన వారూ, నేరాలు నిరూపించబడిన వారూ ఉన్నారు. కానీ వారెవ్వరూ నార్జిస్‌ను తమతో పాటుగా ఒక దోషి అని పరిగణించలేదు. గత నాలుగేళ్లలో ఈ ‘చెడ్డ’ స్త్రీలంతా ఆమె పట్ల మంచిగా ప్రవర్తించారు.నార్జిస్ ఎవరి జుత్తు గానీ, ముక్కుగానీ కొయ్యలేదు. ఎవరి పశువుల్నీ సంపదనీ దొంగిలించలేదు. గంజాయిలాంటి మాదకద్రవ్యాలనీ అమ్మలేదు. ఎవర్నీ గాయపరచలేదు. హత్య చెయ్యలేదు. మరి ఇటువంటితీవ్రమైన శిక్షకు ఎందుకు గురి అవుతున్నదో ఆ స్త్రీలెవరికీ అర్థంకావడం లేదు.‘‘బీబీ! మిమ్మల్ని తప్పించలేదా?’’ ‘మృత్యుక్రమం’లోనికి నార్జిస్‌ని మార్చిన కొద్ది రోజుల్లోనే వార్డెన్ మరియమ్ అడిగింది. ‘‘దేని నుంచి తప్పించాలి?’’ నార్జిస్ కంఠంలో ఒక పవిత్రత ధ్వనించింది. ‘‘మరణం నుంచి’’‘‘లేదు. చావు మీద ఎవరికైతే నియంత్రణ ఉంటుందో వారు దాని నుంచి తప్పించుకోరు. అంతేకాదు, మెహెదీ ఉన్నాడు.నా తర్వాత వాడు జీవిస్తాడు. నేను వాడిలో జీవిస్తాను. వాడి తర్వాత వాడి పిల్లల్లో జీవిస్తాను.’’ఆ తర్వాత మరియమ్ మరే ప్రశ్నలూ వేయలేదు. ‘మరణ క్రమం’లో ఉన్న బీబీ ఒక గొప్ప తత్వవేత్త అని బ్యారెక్స్‌లో వ్యాపించిపోయింది. మరణం తర్వాత కూడా ఆమె పునరుత్థానం చెందుతుందనీ జీవావిష్కరణ పొందుతుందనీ అందరూ చెప్పుకున్నారు. ఆమెను గొప్ప మనోబలం గల వ్యక్తిగా అందరూ భావించారు. ఆ సంఘటన తర్వాత ఆమె వద్దకు వార్డెన్ ఎవరు వచ్చినా వినయంతో కిందకు చూసి నడుస్తుంటారు. జైలు సూపరింటెండెంట్ వచ్చినా వెంటనే ఆమె గది నుంచి పారిపోతాడు. ప్రతిరోజూ ఆమెనురెండుసార్లు గది నుంచి వెలుపలికి తీసుకు వెళ్లేటప్పుడు ఒక హఠాత్ నిశ్శబ్దం చుట్టూ ఉన్న వారిలో వ్యాపిస్తుంది. అప్పటి వరకు అరుస్తూ పోట్లాడుకుంటున్న స్త్రీలు కూడా ఒక్కసారిగా మౌనం వహిస్తారు. ఆమెను ప్రత్యేక వ్యక్తిగా చూస్తారు. నార్జిస్ ఊర్ధ్వలోకం నుంచి ఊడి వచ్చినట్టుగా గౌరవిస్తారు.ఆ చివరి భోజనం ఒక పండుగ విందు మాదిరిగా జరిగింది. ‘ది లాస్ట్ సప్పర్’ గొప్ప చిత్రకారుడు లియొనార్డో డావిన్సీ చిత్రపటం ఆమెకు గుర్తుకొచ్చింది. ఆ భోజనంతో మెహెదీ ఎంతో ఆనందపడిపోయాడు. ‘‘అమ్మా! తిండి బాగుందమ్మా!’’ అంటూ ఆమె మెడ చుట్టూ చేతులేశాడు.‘‘ఔను నాన్నా! నీ మాట నిజం!’’ నార్జిస్ అతడి నోటిలో ముద్ద పెడుతూ దుఃఖాన్ని దిగమింగుకుంటూ చూపు మరల్చుకున్నది. ఆమె కన్నీరు ఆ చిన్నవాడి కంటపడటం ఆమెకు ఇష్టం లేదు. రాత్రి అయింది. మెహెదీ నిద్రలో మునిగిపోయాడు. కానీ నార్జిస్ వాడితో గుండె నిండుగా కబుర్లు చెప్పుకోవాలనుకుంది. వాడి మాటలు వినాలనుకుంది. బాగా పొద్దు పోయే వరకు వాడిని మెలకువగా ఉంచాలనుకుంది. ఉదయాన్నే ఆమెను తీసుకుపోవడానికి వారు వచ్చేసరికి వాడు గాఢనిద్రలో మునిగి ఉండాలనుకుంది.నార్జిస్ వాడి కళ్ల వైపు చూసింది. వాడి అందమైన నుదుటి వైపు చూసింది. వాడి కళ్లు హుస్సేన్ కళ్లలా ఉంటాయి. వాడి నుదురు హుస్సేన్ నుదురులాగా విశాలంగా ఉంటుంది. వాడి శరీరం కూడా హుస్సేన్ శరీరపు పరిమళమే వేస్తుంది. ఆ సుగంధంలో పుష్పాల సౌందర్యమూ, అనంతమైనజీవేచ్ఛా ఉంటాయి.హుస్సేన్! ఇప్పుడు ఇక్కడ నువ్వు లేవు. ఇంకా ఎక్కడో ఉన్నావా? భూమ్యాకాశాల మధ్య సంచరిస్తున్నావా? లేక నీ జీవకణాలను పంచుకు పుట్టిన ఈ నీకుమారుడిలోఉన్నావా? నార్జిస్ రక్తం ఒక్కసారిగా ఉప్పొంగింది. మెహెదీని ఆప్యాయంగా పెనవేసుకుంది.‘‘అమ్మా! నాకు నిద్రొస్తుంది’’ అన్నాడు మెహెదీ.‘‘నాన్నా! మరికొద్ది సేపే మెలకువగా ఉండు.ఆతర్వాత నిద్రపోదువుగాని. ఇంకాసేపు నాతో మాట్లాడు నాన్నా!’’ నార్జిస్ గొంతులో చిన్న కంపం చోటు చేసుకుంది. ‘‘రేపు మావయ్య నిన్ను ఇంటికి తీసుకెళ్తాడు. కథలు చెబుతాడు. బజార్నీ చూపిస్తాడు.వెళ్తావు కదా!’’‘‘తప్పకుండా వెళ్తావమ్మా! నువ్వు కూడా మాతో బజారుకు వస్తావు కదా!’’ మెహెదీ నిద్ర మరచి కూర్చున్నాడు.‘‘నేను మీతో రాలేను నాన్నా!’’‘‘అయితే నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావా?’’‘ఉండను నాన్నా! నీకోసం సీతాకోక చిలుకల్ని పట్టుకోవడానికి వెళ్తాను.’’వరండాలో ఏదో శబ్దం వినబడింది. నార్జిస్ పైకి చూసింది. వార్డెన్ మరియమ్ కటకటాలు పట్టుకొని కబుర్లు చెప్పకొంటున్న తల్లీబిడ్డల వైపు చూస్తోంది. ఆమె అశ్రునయనాలతో ఉంది.‘‘మా అమ్మ రేపు నాకోసం సీతాకోక చిలుకల్ని పట్టుకోవడానికి వెళ్తోంది’’ అంటూ మెహెదీ ఉత్సాహంగా మరియమ్‌తో చెప్పాడు. వాడెప్పుడూ సీతాకోక చిలుకల్ని చూడలేదు. కాని తల్లి వాడికి వాటిని గురించి చాలా కథలు చెప్పింది. ‘‘ఔను రాజా! నువ్వు మీ అమ్మతో ఎక్కువ సేపు మాట్లాడు. ఆమెకు కుప్పలు తెప్పలుగా కౌగిలింతలూ ముద్దులూ ఇవ్వు’’ మరియమ్ స్వరం బొంగురుపోయింది. వెంటనే వెనుదిరిగి వెళ్లిపోయింది.‘‘అమ్మానువ్వు సాయంత్రానికి తిరిగి వచ్చేస్తావు కదా!’’‘‘లేదు నాన్నా! సీతాకోక చిలుకలు చాలా వేగంగా ఎగురుతుంటాయి. నేను వాటిని వెంబడిస్తున్న కొద్దీ మరింత దూరం పోతుంటాయి. కాబట్టి వాటి కోసం నేను చాలా చాలా దూరం పోతాను.’’‘‘అమ్మా! నువ్వు ఎలాంటి సీతాకోకచిలుకల కోసం చూస్తావు?’’నార్జిస్ ఒక్క క్షణం ఆగింది. ‘‘నేనా? స్వేచ్ఛా స్వాతంత్య్రం అనే సీతాకోక చిలుకల కోసం చూస్తాను నాన్నా!’’ ఆమె కుమారుడి జుత్తుని ముద్దుపెట్టుకుంది.నిజానికి వాడికి ఆ మాటలకు అర్థం తెలీదు. ‘‘స్వేచ్ఛా స్వాతంత్య్రం ఏ రంగులో ఉంటాయమ్మా!’’‘‘హరివిల్లుకుండే అన్ని రంగుల్లోనూ ఉంటాయి.’’‘‘హరివిల్లు ఎలా ఉంటుంది?’’‘‘ఈసారి వర్షం కురిసినప్పుడు హరివిల్లుని చూపించమని మావయ్యని అడుగు.’’‘‘అప్పుడు నేను కూడా హరివిల్లు రంగుల సీతాకోక చిలుకల కోసం వెళ్తాను.’’‘‘నువ్వు వెళ్లొద్దు నాన్నా! ఆ సీతాకోక చిలుకలు వాటికవే నీ వద్దకు వస్తాయి. నేను వాటి కోసమే పైకి వెళ్లి వెతుకుతాను. కాబట్టి మరి నువ్వు వెళ్లనవసరం లేదు.’’ నార్జిస్‌లో చిన్న వొణుకు ప్రారంభమైంది. మనఃపూర్వకంగా తీవ్రమైన అనురాగంతో మెహెదీ మురికిపట్టని మెడని గట్టిగా ముద్దుపెట్టుకుంది.ఈ వారంలో మొదటిసారిగా ఆమె కన్నుల్లో నీరు ఉబికి ప్రవహించసాగింది. మెహెదీ నిద్రపోయిన తర్వాత నార్జిస్ వాడిని పైకి ఎత్తి తన గుండెపై పడుకోబెట్టుకుంది. వాడిలో ఆమెకొక ఆశాకిరణం కనబడింది. ఈ ఆశే ఆమెలో హిమాలయమంత ఎత్తుకు ఎగురుతోంది. భవిష్యత్తులో తన జీవ చైతన్యాన్ని వాడు కొనసాగించగలడని, ఒక ఆవిష్కరణా భావం ఆమెకు కలుగుతోంది.చుట్టుపక్కల బ్యారెక్స్ నుంచి ప్రార్థనా గీతాలు వినిపించడం మొదలైంది. ఎవరో ఒకామె ‘నూరా రెహమాన్’ అంటూ శ్రావ్యంగా ఆలపిస్తోంది. ఈ రోజు బీబీ శాశ్వత నిష్క్రమణం అని వారికి తెలుసు. అందకోసమే ఈ సన్నద్ధత.నార్జిస్ గుండెలో ఏదో పోటు మొదలైంది. జైలు ప్రధాన ద్వారం వెలుపల తన సోదరుడు మట్టిలో ధూళిలో కూర్చుని వేచి ఉంటాడు. అతడు స్టాటిస్టిక్స్‌లో పెద్ద డిగ్రీ తీసుకున్నాడు. కాని ఆ గణిత జ్ఞానంతో తన అక్క అస్తమయానికి ఇంకా మిగిలి ఉన్న నిమిషాలను లెక్కించవలసి వస్తుందని అతడు ఏనాడూ ఊహించి ఉండడు. తమ తల్లి కన్న ఇద్దరిలో తనొక్కడే మిగిలిపోతాడని భావించి ఉండడు. తన మేనల్లుణ్ణి పెంచి పెద్దచేసే బరువు బాధ్యతలు తన మీదనే పడతాయని యోచించి ఉండడు.నార్జిస్ మనస్సులో చాలా ముఖాలు, ప్రియమైనవీ అప్రియమైనవీ, దయగలవీ క్రూరమైనవీ, బాగా పరిచయమైనవీ కానివీ పరిభ్రమించసాగాయి. తన అంతిమయాత్ర బాధారహితంగా సాగడానికి తమ నిద్రను త్యాగం చేసి ప్రార్థనాగీతాలను ఆలపిస్తున్న వారి పట్ల ఆపుకోలేని ప్రేమాభిమానాలు కలిగాయి. వారందరికీ మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొంది. ఆయా గొంతుల వారితో ఒక వారం క్రితం తనకు కలిసే ఉండేది. కాని వారెప్పుడూ తనని అర్థం చేసుకోలేదు. అంతేకాదు, వారికి తన గురించి ఏమీ తెలీదు. క్షమాభిక్ష కోసం అర్థించే గడువు దాటిన తర్వాత ఆ వార్త బయటికి పొక్కింది. జైలు అధికారులు ఆమెను బ్యారెక్స్ నుంచి ‘మరణక్రమం’లోనికి మార్చడానికి వచ్చారు. పరిసరాల్లో భయంకరమైన నిశ్శబ్దం అలముకుంది. నార్జిస్‌తో పాటు మెహెదీ కూడా బ్యారెక్స్‌ని వీడేటప్పుడు కొందరు స్త్రీలు తలలు వంచుకుని కళ్లు తుడుచుకోవడం ఆమెకు కనపడింది. ఈ స్త్రీల ఏ చిన్న గడబిడ సన్నివేశానికైనా ఒకర్నొకరు తిట్టుకుంటారు. దుస్తులు చించుకుంటారు. దాంతో వారిని మ్యాట్రన్, వార్డెన్ బలవంతంగా విడదీస్తుంటారు. ఈరోజు వారి ప్రవర్తన భిన్నంగా ఉంది.నార్జిస్‌కు ఒక తాత్కాలికమైన నిద్రమత్తు వంటిది ఆవహించింది.ఆమె హృదయం కృంగిపోనారంభించింది. గుండె ఒక తీవ్రమైన అనునాదంతో కొట్టుకుంటోంది. ఈ హృదయ స్పందనే మృత్యు ముఖద్వారం వద్ద ఆమె ఘనవిజయంగా నిలుస్తుంది. ఆమె మరణం తర్వాత జీవిస్తుందా? మరి జీవచైతన్యం అంటే ఏమిటి? శరీరాన్ని వీడిన తర్వాత అది ఎక్కడకు పోతుంది? హుస్సేన్ ఎక్కడున్నాడు? ఎక్కడా లేడు. లేనే లేడు. అంతా సర్వనాశనమైంది. నాశనమంటే అర్థమేమిటి? ఆ మాటకు భాషాపరమైన అర్థం మాత్రమే ఆమెకు తెలుసు. మరికొద్ది సేపట్లో తనే ఆ అనుభవాన్ని పొందనుంది.‘‘బీబీ’’ మరియమ్ కటకటాల వద్దకు వచ్చి మృదువుగా పిలిచింది. ‘‘చెప్పమ్మా!’’‘‘బీబీ! ఆ చిన్నరాజుని పరుపు మీదనే ఉంచండి. వాళ్లు వచ్చేస్తున్నారు.’’ మరియమ్ మాట తడబడుతోంది.ఒక్క క్షణం నార్జిస్‌కు తన పాదాల కింద నేల ప్రకంపిస్తున్నట్లు అనిపించింది. కానీ నిలదొక్కుకుంది. తన మెడ చుట్టూ ఉన్న మెహెదీ చేతుల్ని నెమ్మదిగా విడిపించుకుంది. వాడిని ఆ కఠినమైన పరుపు మీదనే వదిలి పెట్టింది. ‘వాడు నా ముఖాన్ని గుర్తుంచుకోలేడు. వాడి జ్ఞాపకాలలో కేవలంనా పేరు, నా ఊహ, నా స్మృతి మాత్రమే మిగులుతాయి.’‘‘నన్ను క్షమించండి బీబీ! కటకటాలకు తాళాలు వేసి తీసే నా ఈ చేతులే నాకు తిండి పెడుతున్నాయి.’ మరియమ్ ఊచలపై తలపెట్టుకునిఏడవనారంభించింది.నార్జిస్ నులక మంచం మీద నుంచి లేచింది. కటకటాల్లోంచి మరియమ్ భుజాల మీద చేతులేసింది. మాటలకు నిర్వచనాలు లేవు.బరువైన అడుగుల చప్పుడు వినపడింది. నార్జిస్ మరియమ్ మోచేతిని నెమ్మదిగా తట్టింది. మరియమ్ తలెత్తి తన కన్నీటి తెరలలోంచే నార్జిస్‌ను చూసింది. తన కళ్లని తెల్లని మస్లిన్ దుపట్టాతోతుడుచుకుంది. ‘ఎటెన్షన్’లో నిలబడింది.తాళంలో చెవిని తిప్పి వీలైనంత నెమ్మదిగా తలుపు తెరిచింది. జైలు సూపరింటెండెంటు ఇనుప తలుపుని గట్టిగా గోడకు తగిలి పెద్దగా ధ్వని వచ్చేటట్టు తీశాడు.‘‘సర్! పిల్లవాడు నిద్రపోతున్నాడు. మేల్కొనగలడు’’ మరియమ్ నమ్రంగానే అంది. ‘‘నోర్ముయ్యి! వాడు నీ పిల్లవాడు కాడు’’ సూపరింటెండెంట్ అసహనంతో అన్నాడు.‘‘సర్! బిగ్గరగా మాట్లాడవద్దు. ప్లీజ్’’ యువ మేజిస్ట్రేట్ నిద్రపోతున్న మెహెదీ వైపు చూస్తూ, కనుబొమలు తుడుచుకుంటూ అన్నాడు.సూపరింటెండెంట్ భృకుటి ముడివేస్తూ చిరాగ్గా చూశాడు. ‘ఈ కొత్త ఆఫీసర్లు తమ గురించి ఏమనుకుంటారు?’ అనుకుంటూ పొంగి వస్తున్న కోపాన్ని అణచుకున్నాడు. తన అధికారిక విధానాన్ని మెదలుపెట్టాడు. మొదట నార్జిస్‌ని ఫొటోతోనూ పుట్టుమచ్చలతోనూ సరిపోల్చి గుర్తించాడు. యధావిధిగా ఒక పత్రాన్ని తెరిచి, దాన్ని బిగ్గరగా చదివాడు: ‘‘నేను.. క్షేమకరుడూ.. దయామయుడూ అయిన అల్లా పేరున ప్రారంభిస్తున్నాను..’ అని మొదలుపెట్టి ఇలా ముగించాడు. ‘‘మరణం ధ్రువీకరించబడేంత వరకు నేరస్తురాలిని ఉరితియ్యాలి.’’మెడికల్ ఆఫీసర్ ముందుకు వచ్చాడు. నార్జిస్ నాడినీ, గుండె కొట్టుకోవడాన్నీ పరీక్షించాడు. నిశ్శబ్దంగా తల ఊపాడు. సూపరింటెండెంట్ అతని చేత కొన్ని కాగితాలపై సంతకాలు పెట్టించాడు. యువ మేజిస్ట్రేట్ ఆ సంతకాలను ధ్రువీకరించాడు. సూపరింటెండెంట్ గదిని విడిచి వెళ్లాడు.డిప్యూటీ సూపరింటెండెంట్ మరియమ్‌కు సంజ్ఞ చేశాడు. ఆమె ముఖం కంచులా కఠినంగా ఉన్నట్లనిపించింది. ఆమె కళ్లు నేలవైపు చూస్తున్నాయి. నార్జిస్ చేతుల్ని వెనక్కు వంచి ఒక చర్మపు తాటితో కట్టింది. మరియమ్ వేళ్ల వెచ్చదనం నార్జిస్‌కు తగిలింది. ఆమె ఒంటరిగా లేదు. లోపలా బయటా చాలామందే ఉన్నారు.సాయుధులైన రక్షకులు బ్యారెక్స్‌ని ఈసరికే కాపలా కాస్తుంటారు ప్రధాన ద్వారం వద్ద పన్నెండు మంది వార్డెన్లు ఈసరికే వారి వారి స్థానాల్లో ఉంటారు ప్రతివారి తుపాకీలోనూ పది బుల్లెట్లు ఉంటాయి నార్జిస్ సోదరుడు జైలు గోడల వెలుపల బయలులో కూర్చొని ఉంటాడు. నార్జిస్‌కు మెహెదీ ముఖం కనపడుతోంది. ఆమె వాడినే కన్నార్పకుండా చూస్తోంది. మేట్రన్ నుంచి సంజ్ఞ అందుకుని మరియమ్, నార్జిస్‌ను ‘‘పద బీబీ’’ అంది.నార్జిస్ ఒక్క అడుగు ముందుకు వేసింది వెనక్కు తిరిగి మెహెదీ వైపు చూసింది. వాడు నిద్రలోనే కదిలాడు. చిన్నగా మూలిగాడు వాడికేదో పీడకల వచ్చి ఉంటుంది. నార్జిస్ గుండెను ఏదో పిండేసినట్లయింది. ఆమె తన కళ్లలో ఉబుకుతున్న కన్నీటిని అతి ప్రయాస మీద ఆపుకుంది. ఆమె తన ఆశల్నీ తనవంటి వారి ఆశయాల్నీ భగ్నం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లూ చేసిన వారి ముందుంది. కాని ఆమె ఓటమిని అంగీకరించలేదు. ఈ చివరి క్షణాల్లో తాము గెలిచిన సంతృప్తి వారికెందుకివ్వాలి?యువ మేజిస్ట్రేట్ కళ్లు ఆమె దృష్టిని వెంబడించాయి. ‘‘ఆ పిల్లవాడు ఎక్కడుంటాడు?’’ అని మేట్రన్‌ని అడిగాడు. నార్జిస్‌కు తన ఊపిరి తోడివేసినట్లయింది. తన సోదరుణ్ణి అగ్నిపరీక్షకు గురిచేస్తోంది.మేజిస్ట్రేట్ కనుబొమలు ముడిపడ్డాయి. నార్జిస్ వైపు పరీక్షగా చూశాడు. వరండాలో ఉన్న వార్డెన్‌ను పిలిచాడు. ‘‘సర్’’ అంటూ వార్డెన్ ముందుకొచ్చాడు.‘‘ఆ పిల్లవాణ్ణి జాగ్రత్తగా ఎత్తుకో’’ అన్నాడు.‘‘సర్. నేను వాడిని ఎత్తుకోవచ్చా?’’ అంది మరియమ్.‘‘సరే, వాణ్ణి బీబీతో పాటు అక్కడి వరకు తీసుకురా...’’‘‘కానీ, సర్! జైలు మాన్యువల్ అందుకు అంగీకరించదు’’ డిప్యూటీ సూపరింటెండెంట్ కలగజేసుకున్నాడు.‘‘నీ జైలు మాన్యువల్ తగలబెట్టు’’ అంటూ యువ మేజిస్ట్రేట్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మరియమ్ ముందుకొచ్చి మెహెదీని ఎత్తుకుంది. వాడు కదిలాడు. త్వరలోనే తిరిగి గాఢనిద్రలోకి జారుకున్నాడు.డిప్యూటీ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఉరి ఖైదీ బిడారు బయల్దేరింది. ఇద్దరు పోలీసులు దారి చూపుతున్నారు. మరో ఇద్దరు వెంబడిస్తున్నారు. నార్జిస్ మధ్యలో ఉంది. ఆమెకు కుడివైపున ఒక వార్డెన్, రెండోవైపున మరియమ్ ఉన్నారు. మరియమ్ భుజాన మెహెదీ ఉన్నాడు.నార్జిస్ చూపు మెహెదీపై స్థిరంగా ఉంది. అందరూ ముందుకు నడిచారు. ఆరుబయట అందమైన చల్లని రాత్రి నిష్క్రమించనుంది. నింగీనేలా కలసిన సుదూర తీరంలో ఉదయభానుడు ప్రభవించనున్నాడు. వెలిసిపోతున్న వెన్నెలలో వధ్యశిలా వేదిక నార్జిస్ కంటబడింది. పైకి దారితీసే మెట్లు కూడా స్పష్టంగా కనపడసాగాయి. మరణం భూమి లోతుల్లోనికి కృంగిపోతోంది. అధఃపాతాళాన్ని చేరడానికి పైవైపు మెట్లని ఎందుకెక్కాలో ఆమెకు అర్థం కాలేదు. ఉరిశిక్ష అమలు చేసే తలారివైపు చూసింది. అతడి పిల్లలు ఈరోజు ఉరివల్ల తండ్రి తెచ్చిన రాబడితో సంతోషిస్తారు. ఒక ఉరికి పది రూపాయలు చెల్లిస్తారు. నిజంగా అది వారికి ఎక్కువ మొత్తమే. ఆ డబ్బుతో చాలా కొనుక్కోవచ్చు.‘‘మరియమ్!’’ నార్జిస్ గొంతు ఆ నీరవ నిశ్శబ్దంలో ఒక మెరుపులా మెరిసింది. ‘‘బీబీ! మీ సేవలోనే ఉన్నాను.’’ వార్డెన్ మరియమ్ గొంతు కన్నీటితో గద్గదమైంది.ఇక్కడ ఈ స్థితిలో యజమాని ఎవరో, సేవకులెవరో చెప్పడం కష్టం. మృత్యువు అందర్నీ ఒకే పంక్తిలో నిలుపుతుంది. నార్జిస్ మరియమ్‌ను దగ్గరగా రమ్మని సంజ్ఞ చేసింది. మరియమ్ ముందుకు వంగింది. ఆమె భుజం మీద నిద్రపోతున్న మెహెదీ ఉన్నాడు. నార్జిస్ బంధనాలున్న చేతులతోనే మెహెదీని తాకే వ్యర్థ ప్రయత్నం చేసింది. అంతలోనే ఆగిపోయింది.మెహెదీ నిద్రలోనే నవ్వుకుంటున్నాడు. బహుశా దేవతా కన్యలతో ఆడుకుంటున్నాడు. నార్జిస్ తన జీవనఫలం, తన ప్రతిమ అయిన మెహెదీ వైపు నీరు నిండిన కళ్లతో చూసింది. వాడి నుదుటినీ, బుగ్గల్నీ ముద్దాడటానికి వంగింది.ఒక జీవితం మరో జీవితానికి వీడ్కోలు చెబుతోంది. నార్జిస్ వధ్య శిల మెట్లు ఎక్కింది. తలారి ఆమె ముందు వంగాడు. ఆమె కాళ్లను బంధించాడు. ఆమె ఛిద్రమవుతున్న ప్రపంచ దృశ్యాన్ని కడసారి చూపు చూసింది. దాన్ని మనసులోనే పదిలపరచుకుంది.కళ్లు మూసుకుంది. ఆ దృశ్యం ఆమెలో ముద్రించబడింది.చంద్రుడు అస్తమించిపోతున్నాడని ఆమెకు తెలుస్తోంది. ధ్రువనక్షత్రం ఆకాశంలో ప్రకాశిస్తోందని తెలుస్తోంది. మెహెదీ దేవతా కన్యలతో ఆడుకుంటున్నాడని తెలుస్తోంది. సూర్యుడు ఉదయించబోతున్నాడని తెలుస్తోంది.దేవుడి పవిత్రమైన పేరు మీద నిర్దేశించబడిన నిర్ణయం అమలు కాబోయే క్షణం ఆసన్నమైంది. ఉర్దూ మూలం : జహీదా హీనా, పాకిస్తాన్ అనువాదం: టి.షణ్ముఖరావు -
షాకింగ్ ట్విస్ట్
మనుషులు ఉచ్చు పన్నుతుంటారు.అందులో వేటను పడుతూ ఉంటారు.కాని ఒక్కోసారి విధి కూడా ఉచ్చు పన్నుతూ ఉంటుంది.అందులో చిక్కుకునేది ఎవరు?దోషా? నిర్దోషా?2011. అక్టోబర్. వరంగల్ జిల్లా పాకాల.సాయంత్రం 6.ఓ మహిళ హడావుడిగా పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చి లోపలికి రావాలా? వద్దా? అన్న సందిగ్ధంలో గేటు వద్దే తటపటాయిస్తోంది అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆమె వైపు అనుమానంగా చూసి ‘ఏం కావాలి?’ అన్నాడు.‘దొరని కలవాలి’ అంది.లోపలికి వెళ్లు’ అన్నాడు.భయంభయంగా లోపలికి వచ్చింది. 30 ఏళ్లు ఉంటాయి. గిరిజన మహిళ. బహుశా పోలీస్ స్టేషన్‌కు రావడం అదే కొత్త. బిత్తరచూపులు చూస్తోంది. కానిస్టేబుల్ దారి చూపించాడు..ఎస్.ఐను చూసి ‘దండాలు దొరా’ అంటూ వంగి నమస్కరించింది. ఏదో ఫైల్ చూస్తున్న ఎస్.ఐ ‘ఎవరమ్మా నువ్వు? ఎందుకు వచ్చావు?’ అన్నాడు.‘సార్.. నా పేరు మంగ్లీ. నా పెనిమిటి ఆలూ నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు’ అంది.‘ఏమయ్యాడు’‘నిన్న రాత్రి పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు దొరా! మామూలుగా వెంటనే వచ్చేస్తాడు.ఇప్పటిదాకా రాలేదు. నాకెందుకో గుబులైతోంది. నా పెనిమిటిని ఎతకండి దొరా.. మీ కాళ్లు పట్టుకుంటా.. పిల్లలు, నేనూ రాత్రంతా నిద్రపోలేదు’... అంటూ రెండు కాళ్లు పట్టుకుంది..వెంటనే ఆమెను లేపాడు ఎస్.ఐ.స్టేషన్ బయటకు చూశాడు. చలికాలం. అప్పటికే బాగా చీకటైపోయింది. ‘ఏం భయం లేదమ్మా. రేపు ఉదయం వెతుకుతాం. నువ్వెళ్లి కానిస్టేబుల్‌కి మీ ఆయన వివరాలు చెప్పు’ అని ఆమెను పంపాడు.కేసు గురించిన ఆలోచనలు అతడిలో మొదలయ్యాయి. ఉదయం నలుగురు పోలీసులతోపాటు బయలు దేరాడు ఎస్.ఐ. మొదట తండాకు వెళ్లి మంగ్లీని ఎక్కించుకున్నాడు.‘మీ పొలం ఎక్కడా?’‘అడవిలో కిలోమీటరు లోపల ఉంటుంది దొరా’ అని చెప్పింది మంగ్లీ.అడవి మొదలు వరకు జీపు వెళుతుంది. ఆ తర్వాత నడిచే వెళ్లాలి. పగలే చీకటి ఉండే అడవి అది. మంగ్లీ చెప్పిన దాన్నిబట్టి ఆలూ పోడు వ్యవసాయం చేస్తాడు. శత్రువులెవరూ లేరు. మరి రెండు రోజులైనా ఇంటికి రాలేదంటే ఏమై ఉంటుంది? అడవిలో ఏదైనా జంతువు తినేసిందా? లేక ఎక్కడైనా ప్రమాదంలో చిక్కుకున్నాడా? ఎవరైనా చంపేశారా? ఎస్సై మనసులో ఆలోచనలు రేగుతుండగా వారికి దారి చూపుతూ నడుస్తోంది మంగ్లీ. ఆలూ పొలం వచ్చింది. పొలంను మార్క్ చేసిన ఎస్.ఐ పొలం మడుల్లో నీరు నిండుగా ఉండటం గమనించాడు. అంటే ఆలూ ఇక్కడికి వచ్చాడు. నీళ్లు పెట్టాడు. తరువాతే అతను మామయ్యాడు.‘వెతకండి’ అన్నాడు ఎస్.ఐ.పోలీసులు చుట్టుపక్కల అరకిలోమీటరు వరకు జాగ్రత్తగా వెదికారు. జంతువు తిరిగిన ఆనవాళ్లు కానీ, ఆలూ కాలిముద్రలుగానీ ఏమీ దొరకలేదు. మరి ఆలూ ఏమైనట్లు? ఈసారి వచ్చిన దారిన కాకుండా సమాంతర దారిలో వచ్చారు. ఆ దారిలో నడుస్తున్న ఎస్.ఐ హఠాత్తుగా ఆగిపోయాడు.ఆ దారిలో ఇరువైపులా పైరు శుభ్రంగా ఉంది. కాని ఒక పొలంలో మాత్రం తొక్కుడుకి గురై ఉంది.‘ఇది పశువులు తొక్కిన పైరులా లేదు కదూ’ అన్నాడు ఎస్.ఐ దానినో క్లూగా తీసుకుంటూ.దగ్గరగా వెళ్లి పరిశీలించాడు. ఎవరో పెనుగులాడినట్లు ఆనవాళ్లు కనిపించాయి. జాగ్రత్తగా పరిశీలించిన ఎస్.ఐకి ఒకచోట ఏదో మెరుస్తూ కనిపించింది.తాయత్తు. దాన్ని మంగ్లీకి చూపాడు. ‘ఇది మా ఆయనదే’ అంది మంగ్లీ. తన భర్తకు ఏం ఆపద వచ్చిందోనని ఏడుపు మొదలెట్టింది. ఎస్.ఐ ఆ ఏడుపుకు చెదరకుండా పరిసరాల మీద దృష్టి పెట్టాడు.అక్కడే చిన్న వైరు ముక్క కనిపించింది. పొలాల్లో ఉచ్చు కోసం ఉపయోగించే వైరు ముక్క. దానిని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ‘చెప్పండి.. ఆలూని చివరిసారిగా ఎవరు చూశారు?’ తండాలో అందరినీ పోగేసి అడిగాడు ఎస్.ఐ.‘మా తమ్ముడు పొలం వెళుతుండగా నేను చూశాను’ అన్నాడు ఆలూ అన్న సోమ్లా. ‘మీరొకసారి స్టేషన్‌కి రండి’ అన్నాడు.మరునాడు స్టేషన్‌కి వచ్చిన సోమ్లాని ఎస్.ఐ ఇంటరాగేషన్ చేశాడు. ఈ హడావుడికి గ్రామంలో దాదాపు 20 మంది యువకులు భయపడి పారిపోయారు. వారంతా మరునాడు మళ్లీ తండాకు వచ్చారు ఇద్దరు యువకులు తప్ప!పాకాల చెరువు.మంగ్లీని తీసుకొని అక్కడకు చేరుకున్నారు పోలీసులు. మంగ్లీకి విషయం అర్థమైంది– తన భర్త ప్రాణాలతో లేడని.గజ ఈతగాళ్లు చెరువును జల్లెడ పడుతున్నారు. 24 గంటలు గడిచాయి. మంగ్లీ పిల్లలతో చెరువు ఒడ్డునే రోదిస్తోంది. మరో 12 గంటలు గడిచాక ఆలూ శవం దొరికింది. శవానికి పెద్ద బండరాళ్లు కట్టిఉన్నాయి.చెరువు మధ్యలో దాన్ని పడేసి, రాళ్లు కట్టారు. ‘ఎవరు సార్? ఈ పని చేసింది ఎవరు సార్..’ అంటూ ఎస్.ఐ వద్దకు వచ్చి దయనీయంగా అడగసాగింది మంగ్లీ. ‘నా మరదలు అడుగుతుంటే నోరు తెరవరేమిసార్.. నా తమ్ముడిని పొట్టనబెట్టుకుంది ఎవరు?’ అంటూ కోపంగా అడిగాడు సోమ్లా.‘ముందు అంత్యక్రియలు చేయండి.. చంపిందెవరన్నది త్వరలోనే చెబుతాం’ అంటూ వెళ్లిపోయాడు ఎస్.ఐ. ప్రశాంతంగా ఉన్న తండాలో రయ్..రయ్‌మని రెండు పోలీసు జీపులు వెళ్లాయి. అంతా అటువైపే పరిగెత్తుతున్నారు. గుడిసెలో ఉన్న మంగ్లీతో ఆలూని చంపినవాళ్లను పోలీసులు పట్టుకున్నారు అని ఓ కుర్రాడు వచ్చి ఆయాసంగా చెప్పి తిరిగి పరుగు అందుకున్నాడు.ఆ కుర్రాడు చెప్పింది వినగానే.. కోపంతో మంగ్లీ కళ్లు చింతనిప్పుల్లా మారాయి. లేని శక్తిని కూడదీసుకుని తానూ వెళ్లింది. పోలీసులు ముఖానికి ముసుగులు వేసిన ఇద్దరు యువకులను జీపు నుంచి దించారు. వారి ముసుగులు తీశారు. అంతా షాక్.. వారెవరో కాదు. ఆలూ అన్న సోమ్లా కొడుకులు.ఏం జరిగిందో వారి చేతే చెప్పించారు పోలీసులు.ఆ రోజు రాత్రి ఆలూ కంటే ముందే సోమ్లా ఇద్దరు కొడుకులు మోంగియా, మోహన్‌లు పొలానికి వెళ్లారు. ఆలూ పొలానికి ఫర్లాంగు దూరంలో సోమ్లా పొలం ఉంటుంది. అక్కడ అడవి పందులకు కరెంటు ఉచ్చులు బిగించారు. కానీ, అనుకోకుండా అదే ఉచ్చులో సాక్షాత్తూ తమ బాబాయే ఇరుక్కుంటాడని అనుకోలేకపోయారు. అడవి జంతువులను వేటాడటం నేరమని తెలిసీ ఉచ్చుబిగించారు. అందుకు మూల్యం చెల్లించుకున్నారు. కానీ తెల్లారితే ఈ విషయం ఊరంతా తెలుస్తుందన్న భయంతో ఆ శవానికి రాళ్లు కట్టి పాకాల చెరువు మధ్యలో తీసుకెళ్లి పడేశారు. అదీ జరిగింది. ఇద్దరు యువకుల నిర్లక్ష్యం మంగ్లీకి భర్తను, ఇద్దరు పిల్లలకు తండ్రిని దూరం చేసింది. తమ్ముడే ప్రాణంగా బతికిన సోమ్లాకు అటు తమ్ముడు దూరమై కొడుకులు జైలుపాలై తీవ్ర వేదన మిగిలింది. – అనిల్‌కుమార్ భాషబోయిన -
చిక్కినా చిక్కులే!
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణతో పాటు మహారాష్ట్రలో ఒకే పంథాలో వరుస మోసాలకు పాల్పడుతున్న ‘గ్రేట్ చీటర్’ అఫ్తాబ్ అహ్మద్ షేక్ చిక్కడం ఒక ఎత్తయితే... అతడిని విచారించడం మరో ఎత్తు. ఇంటరాగేషన్ చేయడానికి ప్రయత్నించే పోలీసులకు చుక్కలు చూపిస్తుంటాడు. మరోపక్క ఈ ఘరానా నేరగాడు అనేక సందర్భాల్లో ‘ప్లీడెడ్ గిల్టీ’ విధానం అనుసరించినట్లు పోలీసులు తెలిపారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ మాదిరిగా తయారయ్యే అఫ్తాబ్ ఎదుటి వారిని బురిడీ కొట్టించడానికి ముందు వారి మానసిక స్థితి, ఆర్థిక పరిస్థితి, అవసరాలను అధ్యయనం చేసిన తర్వాతే టార్గెట్‌ను ఎంపిక చేసుకుంటాడు. మాటలతో గారడీ చేసి తన ‘పని’ పూర్తి చేసుకుంటాడు. ఈ పంథాలో రెచ్చిపోయే అఫ్తాబ్‌ను పట్టుకోవడం సైతం పోలీసులకు సవాలే. పాతబస్తీలోని రెయిన్‌బజార్ ప్రాంతంలో ఇతడి నివాసం ఉన్నప్పటికీ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో? ఎవరిని మోసం చేస్తాడో? తెలియని పరిస్థితి. కొన్ని రోజుల పాటు అతడి ఇంటి వద్ద కాపుకాస్తే తప్ప పట్టుకోలేరు. రమ్మంటే రక్తం వస్తుంది... ఇంత కష్టపడిన పోలీసులు అఫ్తాబ్‌ను పట్టుకున్నప్పటికీ అతడిని పూర్తిస్థాయిలో విచారించడం, కాజేసిన డబ్బు/సొత్తు రికవరీ చేయడం అంత తేలికకాదు. శరీర అవయవాలతో పాటు రక్తం కూడా అతడి ‘చెప్పు చేతల్లోనే’ ఉండటం దీనికి ప్రధాన కారణం. పోలీసులు ఇంటరాగేషన్ ప్రారంభించిన వెంటనే తాను చేసిన నేరాల చిట్టా విప్పుతాడు. రికవరీ కోసం సిద్ధమవుతున్నారనే సరికి అఫ్తాబ్‌కు ‘అనారోగ్యం’ వచ్చేస్తుంది. తొలుత కళ్లు తేలేయడంతో పాటు ఏదో ఒక చేతికి పక్షవాతం వచ్చినట్లు వంచేస్తాడు. ఆపై నోరు, చెవి నుంచి రక్తం కారేలా చేస్తాడు. దీనిని చూసిన పోలీసులు ఏదో జరుగుతోందనే భయంతో సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్తారు. అతడికి ఏం జరిగిందనేది గుర్తించడానికి వైద్యులు అనేక పరీక్షలు చేయాల్సి ఉంటుందంటారు. అంత ఖర్చు పెట్టడం సాధ్యం కాని నేపథ్యంలో పోలీసులు ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం అతడు కోలుకున్నాక జైలుకు తరలించేస్తారు. గత ఏడాది ఓ ప్రత్యేక విభాగానికి చిక్కినప్పుడు అఫ్తాబ్ ఇదే పంథా అనుసరించి రికవరీలు ఇవ్వకుండా తప్పించుకున్నాడు. తాజాగా సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కినప్పుడూ ఇదే ‘మంత్రం’ ప్రయోగించాడు. దీంతో అధికారులు ఇతగాడిని పాతబస్తీలో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అసలు విషయం గుర్తించి చెప్పడంతో తమదైన శైలిలో విచారించిన టాస్క్‌ఫోర్స్ మొత్తం 18 తులాల బంగారం రికవరీ చేయగలిగింది. లాయర్ ఖర్చులు, ఎన్బీడబ్ల్యూలు నో... సాధారణంగా ఏదైనా కేసులో అరెస్టయిన నిందితులు ప్రాథమికంగా ఓ లాయర్‌ను ఏర్పాటు చేసుకుంటారు. ఆయన ద్వారా బెయిల్ తీసుకుని కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఇలా హాజరుకాకుంటే ఆ నిందితుడిపై న్యాయస్థానం నాన్–బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేస్తుంది. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో నేరాలు చేసి అక్కడి పోలీసులకు చిక్కే అఫ్తాబ్ కోర్టు వాయిదాలకు హాజరు కావడం, లాయర్‌ను ఫీజులు చెల్లించడం ఇబ్బందికరంగా భావిస్తాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే ప్లీడెడ్ గిల్టీ కోసం ప్రయత్నిస్తాడు. అంటే.. ఆయా కేసుల్లో దర్యాప్తు పూర్తయి, చార్జ్షీట్లు దాఖలయ్యే వరకు జైల్లోనే ఉంటాడు. ఆపై న్యాయమూర్తి ఎదుట తాను చేసిన నేరాన్ని అంగీకరించేస్తాడు. దీనినే సాంకేతికంగా ప్లీడెడ్ గిల్టీ అంటారు. దీంతో కోర్టు అతడికి శిక్ష విధించేస్తుంది. అది పూర్తి చేసుకున్న తర్వాతే జైలు నుంచి బయటకు వస్తుంటాడు. ఇది సాధ్యం కాని సందర్భాల్లో మాత్రమే బెయిల్ తీసుకుంటాడని పోలీసులు పేర్కొన్నారు. అనేక కేసుల్లో సాక్షులు, ఫిర్యాదుదారులకు సైతం తన ‘అనారోగ్యం’ చూపించి రా>జీ కోసం ప్రయత్నాలు చేస్తుంటాడని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అఫ్తాబ్ 2007 నుంచి నగరంలో నేరాలు చేస్తున్నప్పటికీ ఒక్క కేసులోనూ ఎన్బీడబ్ల్యూ జారీ కాలేదని వివరిస్తున్నారు. ఇతగాడి నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న నిజామాబాద్ పోలీసుల పీడీ యాక్ట్ ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
షమీని విచారించిన కోల్‌కతా పోలీసులు
భారత క్రికెటర్ మొహమ్మద్ షమీని కోల్‌కతా పోలీసులు మూడు గంటల పాటు విచారించారు. అతని భార్య హసీన్ జహాన్ ఈ పేస్ బౌలర్‌పై గృహహింస తదితర కేసులు పెట్టింది. దీనిపై కోర్టు అతనికి సమన్లు జారీ చేయగా...షమీ బుధవారం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీకి ఆడుతున్న అతను 16న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ ముగిశాక జట్టుతో పాటు బెంగళూరు (తదుపరి మ్యాచ్ వేదిక)కు బయల్దేరలేదు.విచారణ నిమిత్తం అక్కడే ఉన్నాడు. విచారణకు షమీ సహకరించాడని, అతను తిరిగి జట్టుతో కలిసేందుకు అనుమతించినట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) ప్రవీణ్ త్రిపాఠి చెప్పారు. -
జీఎస్టీ కేసు.. వర్మ ల్యాప్‌టాప్ సీజ్!
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల వివాదాస్పద గాడ్ సెక్స్ ట్రూత్ (జీఎస్టీ) అనే వెబ్ సిరీస్ తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను సీసీఎస్ పోలీసులు శనివారం మూడుగంటపాలు విచారించారు. పోలీసుల విచారణ ముగిసిన అనంతరం వర్మ మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. జీఎస్టీ వెబ్‌సిరీస్‌లో మహిళలను కించపరిచారని, సామాజిక కార్యకర్త దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై వర్మను సీసీఎస్ పోలీసులు విచారించారు. వర్మపై దేవి చేసిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. వర్మను 25 నుంచి 30 ప్రశ్నలు అడిగామని, అతని ల్యాప్‌ట్యాప్‌ను సీజ్ చేశామని సీసీఎస్ అడిషనల్ డీసీపీ రఘువీర్ మీడియాకు తెలిపారు. సామాజిక కార్యకర్త దేవిపై ఉద్దేశపూర్వకంగా ఏ వ్యాఖ్య చేయలేదని, టీవీ చర్చలో భాగంగా ఆవేశంలో, ఉద్వేగపూరితంగానే వ్యాఖ్యలు చేశానని వర్మ వివరణ ఇచ్చినట్టు తెలిపారు. వారం తర్వాత వచ్చే శుక్రవారం విచారణకు రావాలని వర్మను ఆదేశించినట్టు తెలిపారు. ‘వర్మపై నమోదైన కేసు ప్రకారమే విచారణ జరిపాం. టెక్నికల్, లీగల్ అంశాలపై వర్మని ప్రశ్నించాం. జీఎస్టీ అనే వీడియోని ఏ దేశంలో పోస్టు చేసి విడుదల చేశారో ప్రశ్నించాం. జీఎస్టీని పోలాండ్, యూకేలో తీశామని వర్మ చెప్పారు. వెబ్‌లో విడుదల చేసిన మియా మల్కోవా నగ్న ఫోటోలను ఎక్కడ తీశారో ప్రశ్నించాం. ఆ ఫోటోలు తను వేరే చిత్రం షూటింగ్లో ఉన్నప్పుడు కలిసి తీసుకున్నానని వర్మ తెలిపారు. ఆ ఫోటోలను, సినిమా వీడీయోకి సంబంధించిన ఆధారాలను ఎఫ్ఎస్ఎల్ కి పంపించాం’ అని ఆయన వివరించారు. వర్మ పాస్‌పోర్ట్ వెరీఫై చేస్తామని, అతను నిజంగానే ఇతర దేశాలకి వెళ్లి జీఎస్టీని తీశాడా లేదా ఇక్కడే ఉండి తీశాడా అన్నది విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఇంకా మిగతా టెక్నికల్ ఆధారాలకి సంబంధించి మూడు రోజుల సమయం కావాలని వర్మ కోరారని, ఈ విషయంలో లీగల్ సలహా తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.