సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో అరెస్టయి తమ కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును మూడోరోజు మంగళవారం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్‌ను పోలీసులు విచారిస్తోంది.
ట్యాపింగ్ కేసుకు సంబంధించి గతంలో ఎస్‌బీఐ అధికారులు ఎవరెవరు సహకరించారన్నదానిపై పోలీసులు ప్రణీత్ నుంచి కూపీ లాగుతున్నారు. సహకరించిన వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ధ్వంసం చేసిన ప్రణీత్‌రావు కంప్యూటర్‌ల హార్డ్ డిస్క్‌లు ఎక్కడ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హార్డ్ డిస్క్‌లు దొరికిన తర్వాత వాటి నుంచి డేటా పునరుద్ధరిస్తే ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేశారు, ఎందుకు చేశారనే కీలక విషయాలు బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. కేవలం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ చెప్పిన నెంబర్లు మాత్రమే ప్రణీత్‌రావు ట్యాప్ చేయలేదని.. పలువురు రాజకీయ నేతలు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు చెప్పిన నెంబర్లను సైతం ప్రణీత్‌రావు ట్యాప్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బేగంపేట ఎస్‌ఐబీలోని కీలకమైన లాగర్ రూంను ఇందుకు వినియోగించుకున్నారని.. అలాగే అక్కడి సిబ్బందిని ప్రమోషన్ ఆశ చూపించి రహస్యాలేవీ బయటకు రాకుండా జాగ్రత్తపడ్డట్లు తేలింది. ప్రస్తుతం ప్రణీత్‌రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న స్పెషల్ టీం.. అతని డైరీలో దొరికిన వందల నెంబర్లపై ప్రశ్నలు గుప్పిస్తూ మరింత సమాచారం రాబట్టేందుకు యత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment