
చక్రధర్ ఫిర్యాదును కొట్టివేయాలని కోరిన హరీశ్
విచారణకు అనుమతించాలని హైకోర్టును కోరిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు వాదనలు వినిపించగా.. విచారణ నిలుపుదల ఆదేశాలను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఇరుపక్షాల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హాజరై వాదనలు వినిపించారు. వాదనలు పూర్తికావడంతో న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ తీర్పు రిజర్వు చేశారు.
రాజకీయ కక్షతో చక్రధర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదు చేసిన ‘ట్యాపింగ్’ కేసును కొట్టివేయాలంటూ హరీశ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలాగే ఇదే కేసులో మరో నిందితుడైన రాధాకిషన్‌రావు కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. హరీశ్ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టారు. పోలీసుల తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా గత విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనకు, హరీశ్ తరఫు న్యాయవాది దామ శేషాద్రినాయుడి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ఈ అంశాన్ని వదిలేయాలని, మెరిట్‌పై వాదనలు కొనసాగించాలని సూచించారు. ఫిర్యాదుపై దర్యాప్తు విచారణ చేపట్టే అధికారం పోలీసులకు ఉంటుందని లూథ్రా చెప్పారు. దర్యాప్తు పారదర్శకంగా సాగడం లేదని, ఇతర నిందితులను హింసించి హరీశ్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం చెప్పాలని పోలీసులు వేధిస్తున్నారని శేషాద్రి నాయుడు వాదించారు.
రాజకీయ కక్షలో భాగంగా హరీశ్‌ను అరెస్టు చేయాలని సర్కార్ భావిస్తోందని.. అందుకే, ఫిర్యాదుదారు (చక్రధర్‌గౌడ్)కు వత్తాసు పలుకుతోందన్నారు. అలాగే రాధాకిషన్‌రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌లో వాదనలను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment