verdict reserved
-
స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్‌కు నిరాకరణ
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తూ.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే వాదనలు ముగిసే సమయంలో ఆయన తరపు లాయర్లు మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థించగా.. కోర్టు అందుకు నిరాకరించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట మంగళవారం వాడీవేడిగా వాదనలు సాగాయి. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అయితే వాదనల సమయంలో ప్రత్యేక కోర్టుల విచారణ అధికారం గురించి రోహత్గీ ప్రస్తావించారు. అయితే వాదనలు ముగియడంతో శుక్రవారానికి పిటిషన్‌ను వాయిదా వేసింది ధర్మాసనం. శుక్రవారం ఇరుపక్షాల లాయర్లు లిఖిత పూర్వక వాదనలు అందజేయనున్నారు. అయితే ఈ నెల 23 నుంచి 28 దాకా కోర్టుకి దసరా సెలవులు ఉన్నాయి. దీంతో.. దసరా తర్వాతే చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు వెల్లడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోహత్గీ సుదీర్ఘ వాదనలు ‘‘ఈ కేసులో 17ఏ సెక్షన్ వర్తించదు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు. 17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సెక్షన్ అవినీతిపరులకు రక్షణ ఛత్రం కాకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బందిపడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ కేసులో ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే’’ అని రోహత్గీ వాదించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుంది. అవినీతి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. అవినీతి నిరోధం కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి.. అందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. న్యాయపరిధికి సంబంధించి వివాదం లేదు.. ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయపరిధి ఉంది. రూ.వందల కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్ 422 సీఆర్పీసీ కింద క్వాష్ చేయలేం. ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్ష కూడా వేయవచ్చు’’ అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయపరిధి ఉంటుందన్నారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయపన్ను దర్యాప్తులు ఉన్నాయన్నారు. జీఎస్టీ, ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయని తెలిపారు. ‘‘నేరం జరిగిందా లేదా? ఎఫ్ఐఆర్ నమోదైందా? లేదా? అంతవరకే పరిమితం కావాలి. అవినీతి నిరోధక, సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు. ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ను ఎలా క్వాష్ చేస్తారు.మీరు అవినీతి ఆరోపణలు వర్తించవంటున్నారు.. మరి ఐపీసీ కింద పెట్టిన కేసులు ఎక్కడికి పోతాయి’’ అని రోహత్గీ వాదించారు. ‘‘మీరు కేసు పెట్టే నాటికి చట్టం అమల్లోకి వచ్చింది.. చట్టం అమల్లోకి వచ్చాక కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో పాత నేరమంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉటుంది?’’ జస్టిస్ బోస్ ప్రశ్నించారు. ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు.. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని రోహత్గీ కోరారు. వర్చువల్‌గా హరీష్ సాల్వే వాదనలు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపించారు. చట్టసవరణను ముందు నుంచి వర్తింపజేసే అంశంపై పలు తీర్పులను ఉటంకిస్తూ వాదనలు వినిపించారు. ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుంది. రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకు 17ఏ ఉంది. సెక్షన్ 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుంది. ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదు. రిమాండ్ రిపోర్టు, కౌంటరు అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయి. విపక్ష నేతలను విచారించడం తమ హక్కుగా ప్రభుత్వం భావిస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17ఏ వర్తిస్తుంది అని వాదించారు. మధ్యంతర బెయిల్‌కు నిరాకరణ 73 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారు. కోర్టు సెలవుల దృష్ట్యా దయ చేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తాం అని సాల్వే కోరారు. ఈ క్రమంలో మరో లాయర్ సిద్ధార్థ లూథ్రా సైతం న్యాయమూర్తులకు అదే విజ్ఞప్తి చేశారు. అయితే మధ్యంతర బెయిల్ ప్రస్తావన లేదన్న జస్టిస్ అనిరుద్ధ బోస్.. ప్రధాన కేసులో వాదనలు విన్నామని, తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేశారు. -
దళితబంధుపై తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: దళితబంధును ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పరిధి దాటి ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వులను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని రాష్ట్ర హైకోర్టును పిటిషనర్లు కోరారు. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లతో పాటు ఉపఎన్నిక అయ్యే వరకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. దళితబంధుపై ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత జడ్సన్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేయాలంటూ వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. దళితబంధును నిలిపివేయాలన్న ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని లక్ష్మయ్య, జడ్సన్ న్యాయవాదులు రఘునాథ్, శరత్‌కుమార్ నివేదించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కంటే ముందే ఈ పథకం అమలులో ఉందని, ఈ పథకాన్ని ఆపడంతో వెనుకబడిన వర్గాలు ఇబ్బందిపడే అవకాశం ఉందని తెలిపారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వరదలతో నష్టపోయిన వారిలో కొందరికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారని, ఎన్నికల తర్వాత నిలిపివేశారని వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్స్ సంస్థ తరఫు న్యాయవాది శశికిరణ్ నివేదించారు. హుజూరాబాద్ ఎన్నిక తర్వాత ఈ పథకాన్ని అమలు చేయడం అనుమానమేనన్నారు. హుజూరాబాద్‌లో పైలె ట్ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు ఈ పథకాన్ని వర్తింప చేస్తామని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు నివేదించారు. ఇదిలాఉండగా పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని, ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నిక ముగిసే వరకూ పథకం అమలును ఆపాలని ఉత్తర్వులు జారీచేశామని ఈసీ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఇలా నిలిపివేసే అధికారం ఈసీకి ఉందని నివేదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. -
నిర్భయ కేసులో తీర్పు రిజర్వ్..
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ కేసులో దోషుల ఉరిశిక్షపై ప్రత్యేక కోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. హైకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకూ దోషుల ఉరి నిలిపివేయనున్నారు. ఇక క్షమాభిక్ష పిటిషన్లు, క్యూరేటివ్ పిటిషన్లతో దోషులు ఉరిశిక్షను తప్పించుకునేందుకు తమ ముందున్న అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటుండంతో దోషులకు ఉరి శిక్ష అమలు వాయిదాల పర్వంతో సాగుతోంది. నిర్భయ కేసులో నలుగురు దోషులు దేశ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని ఢిల్లీ హైకోర్టుతో కేంద్రం పేర్కొంది. 2012లో ఢిల్లీలో కదులుతున్న బస్‌లో నిర్భయపై సామూహిక హత్యాచారం కేసులో దోషులుగా తేలిన వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, అక్షయ్ సింగ్‌లను శనివారం ఉరి తీయాల్సి ఉండగా, దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను క్షమాభిక్ష కోరుతూ దరఖాస్తు చేయడంతో చివరినిమిషంలో ఉరి శిక్షలో జాప్యం నెలకొంది. కాగా, శర్మ అప్పీల్‌ను రాష్ట్రపతి తోసిపుచ్చడంతో మరో దోషి అక్షయ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారు. ఇక తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ ఈ కేసులో ఉరి శిక్షను అమలు చేయరాదని పటియాలా హౌస్‌కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తమ ముందున్న అన్ని అవకాశాలను ఇప్పటికే వాడుకున్న ఇద్దరు దోషుల ఉరిశిక్షకు అభ్యంతరాలు ఏముంటాయని కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. నిందితులు జాతి సహనాన్ని పరీక్షిస్తునానరని, శిక్ష అమలులో ఇలాంటి జాప్యాలు న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి : దిశ ఘటనపై సినిమా తీస్తున్నా -
సీబీఐ వివాదం : సుప్రీంలో ముగిసిన వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ : అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో నెలకొన్న వివాదం నేపథ్యంలో తనను అకారణంగా ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ చీఫ్ అలోక్ వర్మ, ఎన్జీవో కామన్ కాజ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేశామని కోర్టు పేర్కొంది. సర్వోన్నత న్యాయస్ధానంలో ఈ కేసుపై గురువారం వాదనలు వినిపించిన కామన్ కాజ్ తరపు న్యాయవాది దుష్యంత్ దవే.. సీబీఐ చీఫ్‌గా వర్మ అధికారాలను కేంద్ర కత్తిరించడాన్ని తప్పుపట్టారు. సీబీఐ డైరెక్టర్ పదవి నిర్ణీత పదవీకాలంతో కూడుకుని ఉన్నందున దీనికి అఖిల బారత సర్వీస్ నిబంధనలు వర్తించవని కోర్టుకు నివేదించారు. అయితే అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ పరిష్కారాలను అన్వేషించాల్సి ఉంటుందని అంతకుముందు కేంద్ర విజిలెన్స్ కమిషన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అనూహ్య, అసాధారణ సందర్భాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ జోక్యం అనివార్యమైందని విజిలెన్స్ కమిషన్ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. సీబీఐలో పరిస్థితులు ఈ ఏడాది జులైలోనే గాడితప్పడం ప్రారంభించాయని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. సెలక్షన్ కమిటీని సంప్రదించకుండానే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాలను కత్తిరించే అవసరం ఎందుకొచ్చిందని కోర్టు విజిలెన్స్ కమిషన్‌ను ప్రశ్నించింది. సీబీఐ ఉన్నతాధికారులు వర్మ, ఆస్ధానాల మధ్య రాత్రికి రాత్రే వివాదం చెలరేగలేదని పేర్కొంది. సీబీఐ ఉన్నతాధికారులు కేసుల దర్యాప్తును గాలికొదిలేసి వారిద్దరి మధ్య కేసులపై విచారణ చేపడుతున్నారని మెహతా కోర్టుకు తెలిపారు. ఈ పరిణామాలను చక్కదిద్దాల్సిన పరిధి విజిలెన్స్ కమిషన్‌కు ఉందని, లేకుంటే భారత రాష్ట్రపతి, సుప్రీం కోర్టులకు సీవీసీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. సీబీఐ డైరెక్టర్‌పై విచారణ చేపట్టాలని ప్రభుత్వం నుంచి సిఫార్సు వచ్చిందని, విజిలెన్స్ కమిషన్ విచారణ ప్రారంభించినా నెలల తరబడి వర్మ సంబంధిత పత్రాలను ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. మరోవైపు ఈ కేసులో తమ క్లెయింట్ ముందస్తు హెచ్చరికలతో వ్యవస్థను మేలుకొల్పేందుకు ప్రయత్నించినా ప్రభుత్వం ఆయననూ అదే తరహాలో చూస్తోందని రాకేష్ ఆస్ధానా తరపు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహ్తగీ వాదించారు. వర్మపై సీవీసీ విచారణను ప్రభుత్వం ముందుకుతీసుకువెళ్లాలని కోరారు. ఇక రాకేష్ ఆస్ధానా సహా సీబీఐ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసులను కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు. కాగా, ఈ కేసులో వాదనలు ముగిశాయని, తీర్పును రిజర్వ్‌లో ఉంచామని సుప్రీం బెంచ్ పేర్కొంది. -
జైల్లోనే మరో రాత్రి గడపనున్న సల్మాన్
జోధ్‌పూర్ : కృష్ణజింకను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్షకు గురైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరో రోజు జైలులోనే గడపనున్నారు. సల్మాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును సెషన్స్ కోర్టు రిజర్వ్‌లో ఉంచడంతో ఆయన శుక్రవారం రాత్రి సెంట్రల్ జైల్లో గడపనున్నారు. బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో సల్మాన్ సోదరిలు అల్విర, అర్పిత, బాడీగార్డ్ షేరా.. సెషన్స్ కోర్టుకు వచ్చారు. మరోవైపు సల్మాన్ సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ త్వరలోనే జోధ్‌పూర్‌కు రానున్నారు. 1998లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌కు సెషన్స్‌కోర్టు గురువారం ఐదేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో నిన్న రాత్రి ఆయన సెంట్రల్ జైల్లోనే గడిపారు. ఆయనకు 106 ఖైదీ నెంబర్‌ను కేటాయించారు. జైలు అధికారులు సల్మాన్‌కు రోటీ, పప్పు అందించగా వాటిని తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. కాగా ఇదే కేసులో సల్మాన్ సహ నటులు సైఫ్ అలీఖాన్, సోనాలి బింద్రే, టబూ, నీలం కొఠారిలను నిర్ధోషులుగా కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ట్రిపుల్ తలాఖ్... మరో మలుపు
-
ట్రిపుల్ తలాఖ్... మరో మలుపు
ఆరు రోజుల పాటు ముమ్మరంగా విచారణ జరిపిన తర్వాత.. ట్రిపుల్ తలాఖ్ కేసుపై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో వాదనలు గురువారంతో ముగిశాయి. ఈ విషయంపై నిపుణుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత క్షుణ్ణంగా చర్చించి జూలై నెలలో తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. అంతకుముందు షయారా బానో తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అమిత్ ఛద్దా తన వాదనలు వినిపించారు. ట్రిపుల్ తలాఖ్‌ను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక పాపంగా ఆమోదించాలని ఆయన అన్నారు. అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాత్రం, ట్రిపుల్ తలాఖ్ అనేది విశ్వాసానికి, నమ్మకానికి సంబంధించిన విషయమని చెప్పారు. ఈ వాదనను షయారా బానో న్యాయవాది తిప్పికొట్టారు. అసలు ట్రిపుల్ తలాఖ్ అనే పదం గానీ, ఆ ఆచారం గానీ పవిత్ర ఖురాన్లో ఎక్కడా లేదని, అది ఆమోదయోగ్యం కాని విషయమని స్వయంగా పర్సనల్ లాబోర్డే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది పితృస్వామ్య వ్యవస్థకు నిదర్శనమని, పాపమని కూడా చాలావరకు ఇస్లాం స్కూళ్లలో చెప్పారని, అయినా దాని విషయంలో కోర్టు జోక్యం చేసుకోకూడదనడం సరికాదని ఛద్దా చెప్పారు. ఈ విషయంలో రాజ్యాంగ పరిరక్షణ వ్యవస్థ అయిన సుప్రీంకోర్టును ఆశ్రయించడమే ఏకైక మార్గమని ఆయన వాదించారు. మతం ఏం చెబుతుందో ఆర్టికల్ 25 కూడా అదే చెబుతుందని, ఈ అలవాటు ఇస్లాం ప్రకారం సరైంది కాదని, అందువల్ల ఇందులో మతాచారాలను ఉల్లంఘించినట్లు ఏమీ లేదని కూడా ఛద్దా చెప్పారు. ఈ సమయంలో జస్టిస్ నారిమన్ జోక్యం చేసుకున్నారు. ''మీరు వాదించేదాన్ని బట్టి అసలు ట్రిపుల్ తలాఖ్ అనే అలవాటు మతంలో భాగమే కాదు కదా'' అని ఆయన ప్రశ్నించగా, ఛద్దా అవునని చెప్పారు. దాంతో ఈ కేసులో వాదనలు మొత్తం ముగిసినట్లు రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టే ట్రిపుల్ తలాఖ్ ఉంటుందా.. ఉండదా అనే విషయం తేలనుంది.