
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping case) కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ద్వారా ఇంటర్ పోల్‌కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాను వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బెల్జియంలో శ్రవణ్‌రావు, కెనడాలో ప్రభాకర్‌రావు ఉన్నట్టు సమాచారం.
తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సీబీఐ సంతృప్తి చెందారు. దీంతో, కేసు దర్యాప్తులో తమ వంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐ.. ఇంటర్ పోల్‌ను కోరింది. దీంతో, సీబీఐ ద్వారా ఇంటర్ పోల్(Interpol )కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి.
అనంతరం స్పందించిన ఇంటర్ పోల్ అధికారులు.. 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనున్నారు. అయితే, ఇప్పటికే నిందితులు ఇద్దరూ అమెరికాను వీడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బెల్జియంలో శ్రవణ్‌రావు, కెనడాలో ప్రభాకర్‌రావు ఉన్నట్టు సమాచారం. కాగా, ఇంటర్ పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే ఇద్దరిని ఇండియాకు రప్పించే ప్రయత్నాల్లో హైదరాబాద్(Hyderabad) పోలీసులు ఉన్నారు.

Comments
Please login to add a commentAdd a comment