Ts police
-
లగచర్ల దాడి కేసు.. మరో ఎనిమిది మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లగచర్ల ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది. కలెక్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.లగచర్ల దాడి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, పలువురు లగచర్ల గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పీఎస్‌కు తరలించారు. ఎనిమిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.ఇక, లగచర్ల ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటకే 17 మందిని అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు. మరోవైపు.. డీజీ మహేస్ భగవత్ కూడా లగచర్ల ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు సమాచారం. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు మొదటిసారి స్పందించారు. ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటిసు జారీపై కోర్టులో వాదనలు జరిగాయి. తన వాదనలను అఫిడవిట్ ద్వారా ప్రభాకర్‌రావు వివరించారు. తాను అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ల పర్యవేక్షణలో పనిచేశానన్నారు.‘‘నేను ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదు. నేను కూడా కేసీఆర్ బాధితుడినే. కారణం లేకుండానే నన్ను నల్లగొండ నుంచి బదిలీ చేశారు. చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. కేసీఆర్‌ది, నాది ఒకే కులం అయినందున నన్ను నిందిస్తున్నారు. క్యాన్సర్ చికిత్స కోసం నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నా.. చికిత్స పూర్తయ్యాక ఇండియాకు వస్తా’’ అని ప్రభాకర్ రావు తెలిపారు.కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుతో పాటుగా మరో ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక, ప్రభాకర్ రావుతో పాటుగా సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు తేల్చారు.మరోవైపు.. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, ప్రభాకర్ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎస్ఐటీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావునే ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు.కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుతో పాటుగా మరో ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక, ప్రభాకర్ రావుతో పాటుగా సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు తేల్చారు.మరోవైపు.. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, ప్రభాకర్ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఆ ధైర్యసాహసాలకు సలాం కొట్టాల్సిందే (ఫొటోలు)
-
ట్యాపింగ్‌కు సహకరించిందెవరు? ప్రణీత్‌రావుపై ప్రశ్నల వర్షం
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో అరెస్టయి తమ కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును మూడోరోజు మంగళవారం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్‌ను పోలీసులు విచారిస్తోంది. ట్యాపింగ్ కేసుకు సంబంధించి గతంలో ఎస్బీఐ అధికారులు ఎవరెవరు సహకరించారన్నదానిపై పోలీసులు ప్రణీత్ నుంచి కూపీ లాగుతున్నారు. సహకరించిన వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ధ్వంసం చేసిన ప్రణీత్‌రావు కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లు ఎక్కడ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హార్డ్ డిస్క్‌లు దొరికిన తర్వాత వాటి నుంచి డేటా పునరుద్ధరిస్తే ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేశారు, ఎందుకు చేశారనే కీలక విషయాలు బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేవలం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ చెప్పిన నెంబర్లు మాత్రమే ప్రణీత్‌రావు ట్యాప్ చేయలేదని.. పలువురు రాజకీయ నేతలు, రియల్ఎస్టేట్ వ్యాపారులు చెప్పిన నెంబర్లను సైతం ప్రణీత్‌రావు ట్యాప్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బేగంపేట ఎస్ఐబీలోని కీలకమైన లాగర్ రూంను ఇందుకు వినియోగించుకున్నారని.. అలాగే అక్కడి సిబ్బందిని ప్రమోషన్ ఆశ చూపించి రహస్యాలేవీ బయటకు రాకుండా జాగ్రత్తపడ్డట్లు తేలింది. ప్రస్తుతం ప్రణీత్‌రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న స్పెషల్ టీం.. అతని డైరీలో దొరికిన వందల నెంబర్లపై ప్రశ్నలు గుప్పిస్తూ మరింత సమాచారం రాబట్టేందుకు యత్నిస్తోంది. ఇదీ చదవండి.. ఇబ్రహీంపట్నంలో పరువు హత్య -
కేసీఆర్ అన్న కొడుకుపై కేసు నమోదు.. కారణం ఇదే..
సాక్షి, ఆదిభట్ల: తెలంగాణలో భూ కబ్జాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుతో పాటు మరో 38 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. దీంతో, ఈ భూ కబ్జా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అధిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు, అతడి గ్యాంగ్ ప్రయత్నించినట్టు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ అంశంపై ఓఎస్ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో కన్నారావుతో పాటు 38 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారు. ఇక, బాధితుల ఫిర్యాదులో తమ భూమి ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్ళు పెట్టినట్టు పేర్కొన్నారు. దీంతో, కన్నారావుతో పాటు అతని అనుచరులు బీఆర్ఎస్ నాయకులు 38 మందిపై 307,447,427.,436,148,149 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. 38 మందిలో ముగ్గురని పోలీసులు రిమాండ్‌లోకి తీసుకోగా మరో 35 మంది పరారీలో ఉన్నట్టు తెలిపారు. కాగా, కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కన్నారవు బెంగుళూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. -
TS: కరెంట్ షాక్‌తో కానిస్టేబుల్ మృతి.. సీఎం రేవంత్ విచారం
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసు శాఖకు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఏ. ప్రవీణ్ కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. ఇక, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లాలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ కూంబింగ్ డ్యూటీలో ఉన్నాడు. నస్తుర్‌పల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తలు సంచరిస్తున్నారనే సమాచారంతో రావడంతో గాలించేందుకు టీమ్ అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో కూంబింగ్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో, ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, స్థానికులు వన్యప్రాణులను వేటాడేందుకు, వాటి నుంచి రక్షణ కోసం అక్కడ కరెంట్ తీగలను ఏర్పాటు చేసినట్టు సమాచారం. అది గమనించకుండా ఈ తీగలను తాకి ప్రవీణ్ మృతిచెందాడు. ఇక, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. -
TS: డ్రగ్స్ బాధితుల లిస్ట్‌లోకి యువతులు.. జాబితా ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డ్రగ్స్ బాధితుల లిస్ట్‌లో యువతులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా డ్రగ్స్ తీసుకుంటున్న యువతుల సంఖ్య పెరిగింది. దీంతో, పోలీసులు సైతం ఈ అంశంపై దృష్టిసారించారు. కాగా, నగర యువతులు డ్రగ్స్‌కు అడిక్ట్ అవుతున్నారు. డ్రగ్స్ వాడుతూ అమ్మాయిలు పోలీసులకు దొరికిపోతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో డ్రగ్స్ వాడుతూ దొరికిపోయిన అమ్మాయిల లిస్ట్ ఇదే.. ►కొద్ది రోజుల క్రితం నార్సింగ్ పోలీసులకు హెరాయిన్‌తో పట్టుబడ్డ లావణ్య ►తాజాగా డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు యువతులు ►గచ్చిబౌలి పోలీసుల అదుపులో మిథున, కొనగాల ప్రియ ►డ్రగ్స్‌కు బానిసగా మారి పెడ్లర్ టార్చర్ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన మరో యువతి ►రాజేంద్ర నగర్ పోలీసులకు పట్టుబడ్డ అనురాధ ►సంతోష్ నగర్లో ఎండీఎంఏ డ్రగ్స్‌తో పోలీసులకు పట్టుబడ్డ అయోష ఫిర్దోస్ ►నిజామాబాద్‌లో అల్ట్రాజోలం అమ్ముతూ పట్టుబడ్డ సావిత్రి ►ఐటీ ఇంజనీర్లకు గంజాయి అమ్ముతూ బోయిన్పల్లి పోలీసులకు పట్టుబడ్డ మాన్షి ►న్యూ ఇయర్ సమయంలో డ్రగ్స్‌తో పట్టుబడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సంధ్య -
TS: చలాన్ల చెల్లింపులపై భారీ స్పందన.. రూ. 67 కోట్లు వసూలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు ప్రభుత్వం భారీగా డిస్కౌంట్ ఇచ్చిన నేపథ్యంలో వాహనాదారులు చలాన్లను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 76లక్షలకు పైగా చలాన్లను క్లియర్ చేసుకున్నారు. రాష్ట్రంలో మూడు కోట్ల 59 లక్షల పెండింగ్ చలాన్స్ కట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 77 లక్షల చలాన్లు క్లియర్ చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వ ప్రసాద్ తెలిపారు. ఈ చలాన్లకు సంబంధించి శనివారం వరకు రూ. 67 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు. హైదరాబాద్ కమిషరేట్‌లో రూ. 18 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్‌లో రూ. 14 కోట్లు, రాచకొండ కమిషనరేట్‌లో రూ. 7.15 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. ట్రాఫిక్ చలాన్ల వెబ్సైట్లో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఫేక్ చలాన్ వెబ్సైట్లను నిలిపివేశామని తెలిపారు. మరోవైపు.. చలాన్ల పెండింగ్‌పై వాహనదారుల స్పందనను గమనించిన ప్రభుత్వం.. చలాన్ల చెల్లింపులపై మరింత వెసులుబాటు కల్పించింది. ఈనెల పదో తేదీ వరకు డిస్కౌంట్‌తో చలాన్లను చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. -
ఏపీ పోలీసులపై FIR నమోదు చేసిన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్
-
Telangana Assembly Elections 2023: ఎన్నికల ఎఫెక్ట్‌తో తెలంగాణవ్యాప్తంగా కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు (ఫోటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలు
-
ప్రవల్లిక కేసు: హెచ్ఆర్సీని ఆశ్రయించిన శివరాం కుటుంబం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్ అభ్యర్థి ప్రవల్లిక ఆత్మహత్య తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ప్రవల్లిక లేఖలో పేర్కొనగా.. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రవల్లిక ఆత్మహత్యకు శివరాం రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, శివరాం ఆచూకీ తెలపాలని అతడి కుటుంబ సభ్యులు తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తమను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. శివరాం ఆచూకీ గురించి వివరాలు తెలపాలని పోలీసు స్టేషన్‌కు పిలిపించి మానసికంగా మనోవేదనకు గురిచేస్తున్నారని అతడి కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శివరాం ఆచూకీ తెలపకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించినట్టు తెలిపారు. శివరాం ఆచూకీ తెలుసుకోవాల్సిన పోలీసులు.. తమను ఇబ్బందులకు గురిచేసి ఎక్కడున్నాడని అడగడం దారుణమన్నారు. అతడి గురించి ఏ విషయం తెలిసినా పోలీసులు వెంటనే చెబుతామన్ని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చిక్కడపల్లి పోలీసుల నుంచి ప్రాణభయం ఉందని, వారికి రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని శివరాం బంధువు సంతోష్ రాథోడ్ వేడుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసు.. శివరామ్ అరెస్ట్? -
ప్రేమ వల్లే ప్రవల్లిక మృతి.. రేవంత్ రియాక్షన్ ఇదే..
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇక, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కాగా, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో భావోద్వేగంతో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకోవద్దు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రెండు నెలలు ఓపిక పట్టండి. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని సీరియస్ అయ్యారు. అలాగే, డిసెంబరు 9 నుంచి యువత జీవితాల్లో వెలుగులు తెస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు ఉండకూడదంటే కేసీఆర్ గద్దె దిగాలి. 32 లక్షల మంది యువత ఆందోళనలో ఉన్నారు. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు అమ్మడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా?. సింగరేణిలో నియామకాల విషయంలోనూ సరిగా వ్యవహరించలేదు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల రద్దుతో అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారు. జరిగిన పరిణామాలకు టీఎస్పీఎస్సీ అధికారులను బాధ్యులను చేయడం లేదు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థిని శుక్రవారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంటే.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మరో విధంగా ప్రచారం చేస్తున్నారు. విద్యార్థిని రాసిన లేఖలోనే ఆత్మహత్యకు కారణం స్పష్టంగా పేర్కొంది. చనిపోయిన విద్యార్థినిపై అబాండాలు వేయడం సరికాదు. విద్యార్థులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. అన్ని సమస్యలకు పరిష్కారం కేసీఆర్ గద్దె దిగడమే అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రవల్లిక మృతిపై డీసీపీ వెంకటేశ్వర్లు సంచలన కామెంట్స్ చేశారు. ప్రవల్లిక ఆత్మహత్య ఉదంతం కేసుపై డీసీపీ వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రవల్లిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్నారు. ఆమె 15 రోజుల కిందటే హాస్టల్లో చేరింది. శివరామ్ రాథోడ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఆ సంగతి ఆమె తల్లిదండ్రులకు తెలుసు. కానీ, అతను ఆమెను మోసం చేశాడు. వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అది తెలిసి ప్రవళిక డిప్రెషన్లోకి వెళ్లింది. వాట్సప్ ఛాటింగ్, సీసీటీవీ ఫుటేజీలతో ఈ వ్యవహారం బయటపడింది. అది తట్టుకోలేక ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది తెలిపారు. శివరామ్‌తోనే ఆమె చివరిసారిగా కాల్ మాట్లాడింది. పూర్తి దర్యాప్తు తర్వాత అతనిపై చర్యలు ఉంటాయని డీసీపీ స్పష్టం చేశారు. ప్రవళిక మృతికి.. పరీక్ష వాయిదాకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటివరకు ప్రవళిక ఎలాంటి పోటీ పరీక్షకు హాజరు కాలేదని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ.. రేపే కీలక ప్రకటన -
గాంధీభవన్, ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అవమానకరంగా చిత్రీకరించారంటూ కాంగ్రెస్ నేతుల నిరసనలు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో, పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. గాంధీ భవన్ వద్దకు భారీ పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, పోలీసులు మధ్య వాగ్వాదం తోపులాట చోటుచేసుకుంది. అనంతరం, గాంధీ భవన్ గేటుకు భారీకేడ్లు వేసి పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు.. ఇందిరా పార్క్ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఎన్ఎంలు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా పార్క్ వద్దకు చేరుకుని.. వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో, తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్బంగా పలువురు ఏఎన్ఎంలకు గాయాలయ్యాయి. మహిళా ఏఎన్ఎంలు ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. అయితే, గత కొంతకాలంగా వారిని పర్మినెంట్ చేయాలని ఏఎన్ఎంలు ఆందోళన చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హంగు కాదు.. బీజేపీ డకౌట్ అవుతుంది: హరీష్ రావు -
కానిస్టేబుల్‌కు అభినందన
ఆసిఫాబాద్‌అర్బన్: ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ గోపిని మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీ సు కార్యాలయంలో ఎస్పీ సురేశ్‌కుమార్ ప్ర త్యేకంగా అభినందించారు. జిల్లా పోలీస్ స్పె షల్ పార్టీ విభాగానికి చెందిన పొట్ట గోపి పంజాబ్‌లో ఇటీవల నిర్వహించిన ఆల్ ఇండి యా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో సెపక్ టక్ర క్రీడలో పాల్గొని రెండు కాంస్య పతకాలు సాధించాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సా ధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. అడ్మిన్ ఆర్ఐ పెద్దన్న, సిబ్బంది పాల్గొన్నారు. -
సోషల్ మీడియాపై పోలీస్ నిఘా!
హైదరాబాద్: గ్రేటర్లో పాలక, ప్రతిపక్ష పార్టీల సమావేశాలతో ఎన్నికల వాతావరణం నెలకొంది. దీనికి తోడు గణేశ్ నవరాత్రులు, నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ, దసరా, దీపావళి ఇలా వరుస పండుగలు వస్తున్నాయి. దీంతో గ్రేటర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే పోస్టులపై పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టింది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై నిఘా పెట్టారు. సైబర్ పెట్రోలింగ్, హైదరాబాద్‌లో సోషల్ మీడియా యాక్షన్, స్క్వాడ్ ఆఫ్ హైదరాబాద్ (స్మాష్) పేరిట రంగంలోకి దిగారు. ► సామాజిక మాధ్యమాలతో రెప్పపాటులోనే ప్రపంచం నలువైపులా భావోద్వేగాలను రెచ్చగొట్టే పరిస్థితి వచ్చింది. ఇది శాంతి భద్రతల సమస్యకు కారణమవుతోంది. ► సామాజిక మాధ్యమాలలో ఎవరైనా అశ్లీల, అసభ్యకర, రెచ్చగొట్టే పోస్టులు, విద్వేష ప్రసంగాలు, వందతులు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను పెడితే వాటిపై ఫిర్యాదులు వచ్చి..చర్యలు తీసుకునేలోపే అనర్థం జరుగుతోంది. ►దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు సైబర్ పెట్రోలింగ్, స్మాష్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక టూల్ సహాయంతో పోలీసులు వీటిని గుర్తిస్తారు. ► సాధారణ రోజుల్లో 4–5 వేల సామాజిక ఖాతాలను పరిశీలిస్తే.. ఇలాంటి కీలకమైన సమయాల్లో రోజుకు 10 వేలకు పైగా సోషల్ అకౌంట్లను విశ్లేషిస్తుంటారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలను గుర్తించగానే పోలీసు విభాగాలన్నీ అప్రమత్తమవుతారు. ఆ పోస్టు చేసిన వ్యక్తి లేదా సంస్థలను నిమిషాల వ్యవధిలోనే గుర్తించి, వీరిపై ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. ► వదంతులు వ్యాప్తి చేసే వారి ఫోన్ ఐఎంఈఐ నంబర్లు, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా క్రియేటర్లను పోలీసులు గుర్తిస్తారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. -
వైఎస్ షర్మిల హౌజ్ అరెస్ట్.. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత!
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో లోటస్ పాండ్‌లోని ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో, అక్కడ ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వైఎస్ షర్మిలను పోలీసులు శుక్రవారం ఉదయం హౌజ్ అరెస్ట్ చేశారు. అయితే, షర్మిల నేడు సిద్దిపేటలోని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. కాగా, జగదేవ్‌పూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో షర్మిల పర్యటించాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయమే పోలీసులు ఆమె నివాసానికి చేరుకున్నారు. అనంతరం, జవదేవ్‌పూర్ వెళ్లకుండా షర్మిలను హౌజ్ అరెస్ట్ చేశారు. కాగా, దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయని ఇటీవల తీగుల్ గ్రామ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈనేపథ్యంలో వారిని కలిసేందుకు షర్మిల ప్లాన్ చేసుకున్నారు. దీంతో, పోలీసులు వైఎస్ షర్మిలను అడ్డుకున్నారు. ఇది కూడా చదవండి: వర్షాలపై అప్రమత్తంగా ఉండండి: హైకోర్టు ఆదేశాలు -
HYD: ట్రాఫిక్ నియంత్రణకు కొత్త ప్లాన్.. కార్ పూలింగ్ విధానం!
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది. ఐటీ ఉద్యోగులు వరుసుగా ఆఫీసులకు రావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు. కాగా, ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా కార్ పూలింగ్ విధానం అమలు చేయాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశమయ్యారు. టీసీఎస్, డెలాయిట్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, జేపీ మోర్గాన్, విప్రో, ఐసిఐసిఐ, హెచ్ఎస్బీసీతో పాటు పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీపీ భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఐటీ కారిడార్‌లో కార్ పూలింగ్ విధానంపై వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీపీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఐటీ కంపెనీలు సొంత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా పోలీసులు మరో ప్రతిపాదన చేశారు. ఐటీ ఉద్యోగులంతా ఒకేసారి రోడ్లపైకి రాకుండా పనివేళల్లో మార్పులపై సూచనలు తెలియజేశారు. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పరిశీలించాలని కూడా పోలీసులు కోరారు. కార్ పూలింగ్ విధానం.. ఒకరి కంటే ఎక్కువ మంది కారు వినియోగించుకుంటే ట్రాఫిక్ కొంత వరకు తగ్గుతుంది. కాలుష్యం కూడా ఆదుపులో ఉంటుంది. దీనిపైనే ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. చాలా మంది ఉద్యోగులు సొంత కార్లలోనే ప్రయాణం చేస్తున్నారు. కేవలం ఒకరి కోసం కూడా కారును బయటకు తీస్తున్నారు. వ్యక్తిగతంగా ఉపయోగించే కార్లలో దాదాపు 75 శాతం వరకు ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నారు. దీంతో కారు పూలింగ్ విధానంతో సమస్యకు చెక్ పెట్టవచ్చన్నది ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. ఈ విధానం ఎక్కువగా విదేశాల్లో అమలవుతోంది. హైటెక్‌సిటీలో కారు పూలింగ్ చేపడితే సగానికి సగం సమస్య తీరినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో వ్యవస్థ రద్దు! -
బోనాల వేళ చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్.. పోలీసుల దెబ్బకు పరారీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన లాల్‌దర్వాజ బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్ ప్రదర్శించిన విషయం తెలిసిందే. చికోటి ప్రవీణ్ లాల్ దర్వాజ ఆలయంలోకి ప్రైవేటు సెక్యూరిటితో వెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ప్రైవేటు సెక్యూరిటీని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, వీరి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, రిమాండ్ రిపోర్టు ప్రకారం.. చికోటి ప్రవీణ్ పరారీలో ఉన్నాడు. ప్రవీణ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు. ఈ కేసులో చికోటి ప్రవీణ్‌ను పోలీసులు ఏ1గా చేర్చారు. లాల్ దర్వాజ బోనాల్లో టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడ్డ ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది వద్ద లైవ్ రౌండ్స్, మూడు తుపాకులు స్వాధీనం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో చికోటి సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు అయ్యింది. చీటింగ్ సహా ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. సాయుధ వ్యక్తిగత గార్డులుగా కొనసాగేందుకు అధికారం లేదు. లైసెన్స్ లేకుండా అక్రమంగా చికోటీ ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ముగ్గురు నిందితులు సిఆర్ఫీఎఫ్ నుండి రిటైర్ అయ్యి.. ఎలాంటి లైసెన్స్ లేకుండానే సెక్యూరిటీ ఉద్యోగం చేసుకుంటున్నారని తెలిపారు. తమకు వచ్చే జీతం సరిపోకపోవడంతో చికోటిని ఆశ్రయించిన ముగ్గురు ప్రైవేట్ గన్ మెన్‌గా ఉంటామని ఆయన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. పర్సనల్ సెక్యూరిటీ కోసం చికోటి దగ్గరికి వెళ్లిన ఈ ముగ్గురు తాము వెపన్స్ ఉపయోగించకూడదు అని చికోటికి చెప్పినా అతను పట్టించుకోలదని చెప్పారు. అదంతా తాను చూసుకుంటానని.. ఎక్కడ లైసెన్స్ క్యారీ చేయద్దు అని చికోటి వారికి చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిసిందని వెల్లడించారు. అయితే, ప్రవీణ్ ప్రస్తుతం గోవాలో తలదాచుకున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతి త్వరలోనే చీకోటి ప్రవీణ్‌ను ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: పొలిటికల్ అలర్ట్.. తెలంగాణలో చక్రం తిప్పిన కాంగ్రెస్! -
ఏళ్ల తరబడి నమ్మకంగా పనిచేస్తూ దోపిడీ.. 5కోట్ల సొత్తు స్వాధీనం
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ సింధీ కాలనీలో జరిగిన భారీ దొంగతనం కేసును తెలంగాణ పోలీసులు చేధించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారి నుంచి సుమారు రూ.5.5 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లో జవహర్‌నగర్ కాలనీలోని పీజీ టవర్స్ వ్యాపారవేత్త రాహుల్ గోయల్ నివాసం ఉంటున్నారు. అయితే, 9వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా గ్రీన్ ఫీల్డ్ రిసార్ట్స్‌కు వెళ్లారు. అనంతరం.. 10వ తేదీన ఇంటికి తిరిగి వచ్చారు. అయితే, ఇంటికి వచ్చే సరికి మెయిన్ డోర్ లాక్ పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. లాకర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. అందులో ఉన్న నాలుగు కిలోల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలు, వజ్రాలు, రూ. 49 లక్షల నగదు కనిపించలేదు. రూ.5కోట్ల విలువ.. దీంతో, రాహుల్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్బంగా చోరీకి గురైన సొత్తు విలువ దాదాపు ఐదు కోట్ల వరకు ఉంటుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. రాహుల్ ఇంటికి కాపాలాగా ఉన్న కమల్, అతడి కుటుంబ సభ్యులపై ఫోకస్ పెట్టారు. దర్యాప్తు సమయానికి వారు కనిపించకపోవడంతో ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని బాధితుడు పోలీసులకు వెల్లడించాడు. నేపాలీ గ్యాంగ్.. కాగా, వారంతా నేపాల్‌కు చెందిన వారు కావడంతో పక్కా ప్లాన్‌తో దోపిడీకి పాల్పడే అవకాశం ఉన్నదని, ఆ దిశగా పోలీసలు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం.. ముంబైలో తొమ్మిది మంది నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, వీరిని ముంబైకి చెందిన ఒక ఏజెన్సీ వారిని పనిలో పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుల నుంచి సుమారు రూ.5.5 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇది కూడా చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్ విచారణలో సంచలన నిజాలు! -
ఖమ్మంలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్!
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. భూదాన్ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో, ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. వెలుగుమట్లలో 147, 148,149 సర్వే నంబర్లలో భూదాన్‌కు సంబంధించిన 62 ఎకరాలు భూమి ఉంది. ఈ క్రమంలో 2014లోనే ఈ భూములకు సంబంధించి స్థానికులు దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం భూములను ఇవ్వలేదు. దీంతో, పోరాటం కొనసాగుతోంది. తాజాగా, పేదలు అక్కడ వేసుకున్న గుడిసెలను అధికారులు కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. బీఆర్ఎస్ రావాలా: కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
TS: ‘గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్స్’.. పోలీసుల వినూత్న కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గతేడాది 19,456 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 6,746 మంది మరణించగా.. 18,413 మంది క్షతగాత్రులయ్యారు. మరణించిన వారిలో 50% మంది గోల్డెన్ అవర్‌లో ప్రథమ చికిత్స అందించకపోవటం వల్లే మృత్యువాత పడ్డారు. గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు వైద్య సహాయం అందించగలిగితే 90 శాతం వరకు ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో గోల్డెన్ అవర్‌కు ఉన్న ప్రాధాన్యత, ఆ సమయంలో ప్రథమ చికిత్స ఆవశ్యకతను తెలంగాణ ట్రాఫిక్ పోలీసు విభాగం విశ్లేషించింది. రోడ్డు ప్రమాదాలలో క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ‘గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్‌ల’పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాధితులకు అవసరమైన ప్రథమ చికిత్స అందించి, స్థానిక ఆసుపత్రికి తరలించడమే ఈ గ్రూప్‌ల లక్ష్యం. గోల్డెన్ అవర్ అంటే.. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’గా పిలుస్తారు. అంబులెన్స్ చేరుకొని, ఆసుపత్రికి తరలించే లోపు క్షతగాత్రులకు వైద్య సహాయం అందించినట్లయితే ప్రమాద తీవ్రతను బట్టి గాయాల తీవ్రత తగ్గేందుకు, ప్రాణాపాయం తప్పేందుకు అవకాశం ఉంటుంది. మన దేశంలో గోల్డెన్ అవర్‌కు మోటారు వాహన చట్టం–1988లోని సెక్షన్ 2 (12 ఏ) కింద చట్టపరమైన గుర్తింపు కూడా ఉంది. గుడ్ సామరిటన్స్కు శిక్షణ ఒంటరిగా వాహనంపై వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై గాయపడితే.. తనంతట తానుగా లేచి ప్రథమ చికిత్స చేసుకొని, ఆసుపత్రికి వెళ్లలేని స్థితిలో ఉంటాడు. ఇలాంటి సమయంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా క్షతగాత్రుడికి సహాయం చేసేవాళ్లను ‘గుడ్ సామరిటన్స్’గా పిలుస్తారు. అయితే కొన్ని సందర్భాలలో ‘గుడ్ సామరిటన్స్ అందించే ప్రథమ చికిత్స వల్ల క్షతగాత్రుడికి మరింత ఇబ్బందులు, కొన్ని సందర్భాలలో ప్రాణాపాయం కూడా జరుగుతున్నాయి. దీనికి పరిష్కారంగా గుడ్ సామరిటన్స్కు రోడ్డు ప్రమాద బాధితులకు అందించాల్సిన ప్రథమ చికిత్సలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కొన్నిచోట్ల శిక్షణ ప్రారంభమైంది. అలాగే ఎస్పీలు, డీసీపీల ఆధ్వర్యంలో గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి ఈ గుడ్ సామరిటన్స్ను సభ్యులుగా చేర్చుకుంటున్నారు. గ్రూప్‌లో ఎవరెవరుంటారు? రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సాధారణంగా ఆ చుట్టుపక్కలవారే స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రోడ్ల వెంబడి దాబాలు, హోటళ్లు, పంక్చర్ షాపులు, మెడికల్ షాపులు, పెట్రోల్ బంక్‌లు, కిరాణా దుకాణాలు, టీ స్టాళ్ల నిర్వాహకులు, ఎన్జీవోలకు చెందిన వారిని గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులుగా పరిగణనలోకి తీసుకుంటారు. స్థానిక ట్రాఫిక్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) వీరి ఎంపిక బాధ్యత తీసుకుంటారు. సైబరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (టీటీఐ), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్తంగా ఇప్పటివరకు 800కు పైగా గుడ్ సమారిటన్స్కు శిక్షణ ఇచి్చనట్లు ఓ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలపై అవగాహన కలి్పంచడంతో పాటు బీఎల్ఎస్ (బేసిక్ లైఫ్ సపోర్ట్), సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) వంటి ప్రథమ చికిత్సలపై శిక్షణ ఇస్తున్నామని వివరించారు. వీరు ఏం చేస్తారంటే.. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి క్షతగాత్రులకు అధిక రక్తస్రావం కాకుండా కట్టుకట్టడం, సీపీఆర్ వంటి ప్రథమ చికిత్స అందిస్తారు. పోలీసులు, బాధితుల కుటుంబాలకు సమాచారం అందించి, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్చుతారు. అలాగే ఏదైనా వాహనం అతివేగంగా వెళ్తున్నట్లు గుర్తిస్తే.. వెంటనే ఆ ప్రాంతం, వాహనం నంబరు వివరాలను గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తారు. స్థానిక పోలీసులు వెంటనే స్పందించి ఆ వాహనాన్ని నిలువరించేందుకు చర్యలు తీసుకుంటారు. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్.. రాహుల్, ఖర్గే ఏం చెప్పారు? -
TS: పోలీసు శాఖలో పదోన్నతులు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా, దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా పోలీసులకు గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. పోలీసు శాఖలో పదోన్నతులకు ప్రభుతవం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 18 మంది అడిషనల్ ఎస్పీలకు ఎస్పీలకు పదోన్నతి కల్పించింది. 37 మంది డీఎస్పీలను అడిషనల్ ఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: తెలంగాణలో వారందరికీ గుడ్‌న్యూస్.. పెన్షన్ 4వేలకు పెంపు -
TSPSC Case: ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్.. ఏముందంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీ కేసును కేసీఆర్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. దీంతో, దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. కాగా, ఈ కేసులో సిట్ తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అయితే, సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ప్రకారం.. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు రూ.1.63కోట్ల లావాదేవీలు జరిగాయి. పేపర్ లీక్ కేసులో ఇప్పటికి 49 మంది అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో 16 మంది మధ్యవర్తులుగా వ్యవహరించారు. మరో నిందితుడు ప్రశాంత్ రెడ్డి న్యూజిలాండ్‌లో ఉన్నాడు. ఎనిమిది మంది అభ్యర్థులకు డీఏఓ పేపర్ లీకైంది. ఏఈ పేపర్ 13 మందికి, గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ నలుగురికి లీకైంది. ఏఈఈ పేపర్ ఏడుగురు అభ్యర్థులకు లీకైంది. ఏఈఈ పరీక్షలో మరో ముగ్గురు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్స్, ఇతర పరికరాలను రామాంతపూర్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించామని సిట్ పేర్కొంది. ఇది కూడా చదవండి: బీజేపీ బిగ్ ప్లాన్.. ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు! -
నిజామాబాద్: సినిమా రేంజ్లో పోలీసుల ఛేజింగ్.. దొంగలపై కాల్పులు
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లో సోమవారం దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇందల్వాయి మండలం జాతీయ రహదారిపై దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారు పారిపోతుండగా దొంగలపై కాల్పులు జరిపారు. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాపు కాశారు. ఈ క్రమంలో దొంగల ముఠా.. పోలీసుల కారును ఢీకొట్టి పారిపోయింది. దీంతో, వారిని పట్టుకునేందుకు పోలీసులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. కాగా, ఈ దొంగల ముఠా.. జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్లను దొంగలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారు. ఇది కూడా చదవండి: పెను విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి -
ఐపీఎస్‌తో గొడవ.. హాట్ టాపిక్‌గా హీరోయిన్ డింపుల్ హయాతి (ఫొటోలు)
-
డింపుల్ హయాతి కేసులో ట్విస్ట్.. కారుకు వరుస చలాన్లు!
రామబాణం ఫేం డింపుల్ హయాతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వివాదం సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్‌తో పాటు తన స్నేహితుడు డేవిడ్‌పై క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును కారుతో ఢీకొట్టి ధ్వంసం చేశారని డీసీపీ డ్రైవర్ జూబ్లిహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పోలీసులకు సమర్పించాడు. (ఇది చదవండి: హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదు) అయితే ఈ వ్యవహారంలో మరో కొత్త కోణం బయటకొచ్చింది. హీరోయిన్ డింపుల్ హయాతి కారుకు పోలీసులు వరుసగా చలాన్లు విధించినట్లు తెలుస్తోంది. అయితే డీసీపీ ఉద్దేశపూర్వకంగానే చలాన్లు వేశారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ కేసుపై డింపుల్ హయాతి పరోక్షంగా స్పందించారు. అధికారాన్ని ఉపయోగించి తప్పులను కప్పిపుచ్చుకోలేరని ట్వీట్ చేసింది. Misuse of power doesn’t hide mistakes .. 😂 . #satyamevajayathe — Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023 డీసీపీ రాహుల్ హెగ్డేనే తనకున్న అధికారంతో తప్పుడు కేసులు పెట్టించారని డింపుల్ పరోక్షంగా చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: చెన్నైలో శరత్‌బాబు అంత్యక్రియలు..పిల్లలు లేకపోవడంతో) అసలేం జరిగిందంటే? హైదరాబాద్‌లోని జర్నలిస్ట్ కాలనీలో ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే నివాసం ఉటున్నారు. అదే అపార్ట్మెంట్లో డింపుల్ హయాతి తన స్నేహితుడు డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు. రాహుల్ హెగ్డేకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని ఆయన డ్రైవర్ చేతన్ కుమార్ అదే అపార్టమెంట్‌లోని సెల్లార్లో పార్కింగ్ చేశాడు. ఆ వాహనం పక్కనే డింపుల్ హయాతి కూడా తన వాహనాన్ని పార్కింగ్ చేస్తుంది. . దీనిపై వారికి పలు మార్లు గొడవైంది.అయితే తాజాగా డింపుల్ సదరు ఆఫీసర్ కారుని ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు కాలితో తంతూ గొడవ చేసింది. అక్కడున్న డ్రైవర్‌తోనూ ఆమె గొడవ పడింది. దీంతో ఐపీఎస్ ఆఫీసర్ జూబ్లీ హిల్స పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం.. పోలీసులు సీపీఆర్ చేయడంతో..
సాక్షి, నాగర్ కర్నూల్: పోలీసుల అప్రమత్తతో ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆత్మహత్య చేసుకున్న మహిళకు సమయానికి పోలీసలు సీపీఆర్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో, పోలీసులను కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రశంసించారు. వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్లోని రాంనగర్ కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో, కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. అపస్మారక స్థితిలో ఉన్న మహిళకు పోలీసులు సీపీఆర్ చేరారు. దీంతో, మహిళ స్పృహలోకి వచ్చింది. అనంతరం, ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మహిళను రక్షించిన పోలీసులపై కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఇది కూడా చదవండి: థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. 90 మంది భారతీయులు కూడా! -
వైఎస్ షర్మిలకు జ్యూడిషియల్ రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
బంజారాహిల్స్ (హైదరాబాద్): వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతోపాటు ఆమె డ్రైవర్‌ను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి సోమవారం షర్మిల లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయం నుంచి బయలుదేరుతుండగా.. పోలీసులు అక్కడకు చేరుకుని పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. బయటకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ షర్మిలను అడ్డుకోవడంతో ఆమెకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆమె కారులో ఉన్న డ్రైవర్‌ను పోలీసులు బలవంతంగా కిందికి దింపేశారు. ఈ పరిణామంతో షర్మిల, పోలీసులమధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ ఠాణాకు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న తనపై షర్మిల చేయి చేసుకున్నారని, నేమ్ ప్లేట్‌ను చించేశారని, తమ కానిస్టేబుల్ గిరిబాబు కాలు పైకి బలవంతంగా కారు ఎక్కించారని ఎస్సై రవీందర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా షర్మిల తదితరులపై కేసు నమోదు చేశారు. ఏ1గా షర్మిల, ఏ2గా ఆమె కారు డ్రైవర్ బాబు, ఏ3గా మరో డ్రైవర్ జాకబ్‌లను చేర్చారు. షర్మిల, బాబులను అరెస్టు చేయగా.. జాకబ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో షర్మిల, బాబులకు వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మే 8 వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, పోలీసులు షర్మిలను చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసుల తీరు సరిగాలేదు: షర్మిల ‘సిట్ అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దౌర్జన్యంగా వ్యవహరించారు. ఒక పార్టీ అధ్యక్షురాలి పట్ల పోలీసుల తీరు సరిగాలేదు. ఈ విధుల్లో మహిళా కానిస్టేబుల్‌ను నియమించలేదు. పోలీసులు ప్రవర్తించిన తీరుకు నిరసనగానే రోడ్డుపై బైఠాయించా’అని షర్మిల మీడియాతో పేర్కొన్నారు. కాగా, జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో షర్మిలను పరామర్శించేందుకు భర్త అనిల్, తల్లి వైఎస్ విజయమ్మ వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. కాగా, అరెస్ట్‌ను నిరసిçస్తూ వైఎస్సార్టీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. షర్మిలపై కక్ష సాధింపు చర్యలు వైఎస్ విజయమ్మ ధ్వజం వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంపై వైఎస్ విజయమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం షర్మిలను ఎందుకు అడ్డుకుంటోందని గట్టిగా నిలదీశారు. సోమవారం ఆమె తన నివాసంలో మీడియా తో మాట్లాడుతూ.. షర్మిలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై కోర్టుకు వెళ్తామని తెలిపారు. తాను షర్మిలను చూడటానికి పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్తోంటే పోలీసులు అనుమతించలేదన్నారు. ‘నా కూతురుని చూసి పోతానన్నా పోలీసులు ఒప్పుకోలేదు. షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారని అడిగితే పోలీసుల దగ్గర సమాధానం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక వ్యక్తి షర్మిల కాబట్టి ప్రభుత్వం ఇంతటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది’అని విజయమ్మ చెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్‌కు ఫిర్యాదు చేసేందుకు ఒంటరిగా వెళ్తున్న షర్మిలను ఎందుకు అరెస్టు చేశారన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించిన అంశాలకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం ఇలా వ్యవహరించడమేంటని మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడుతున్న ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు సాకారం చేయడానికి ఎంతో కష్టపడుతోందని చెప్పారు. ‘అంతమంది పోలీసులు కనీస గౌరవం లేకుండా ఒక మహిళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటే ఆవేశం రాదా? పది మంది మహిళా పోలీసులు నాపై పడు తూ కార్లో ఎక్కించబోతే నాకు కూడా ఆవేశం వచ్చింది. పోలీసులు షర్మిల డ్రైవర్, గన్మెన్లను కొట్టారు. చివరికి మీడియా వాళ్లను కూడా కొట్టారు. మీడియాకు చేతులెత్తి అభ్యర్థిస్తున్నా.. ప్రజల తరఫున నిలబడి నిజాలు చూపించండి. చిన్నచిన్న విషయాలను పెద్దగా చూపించడం కాదు.. ప్రజల కోసం పని చే యాలి’అని చెప్పారు. -
ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి ముట్టడికి NSUI యత్నం
-
పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. ఈటలకు బిగ్ షాక్!
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో పేపర్ లీకేజీల వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పలు ట్విస్టుల మధ్య బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా ఈ కేసులో నోటీసులు ఇచ్చారు పోలీసులు. వివరాల ప్రకారం.. పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈటల స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. కాగా, ప్రశాంత్ అనే వ్యక్తి పేపర్‌ను మొదట ఈటలకు వాట్సాప్‌లో పంపించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈటలకు నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, బండి సంజయ్‌కు పేపర్ పంపే కంటే ముందే.. ఈటలకు ప్రశాంత్ పేపర్ పంపించాడని అన్నారు. అంతకుముందు.. ఈటలకు కూడా ఈ పేపర్లను పంపించారని వరంగల్ సీపీ వ్యాఖ్యానించారు. -
HYD: శ్రీరాముడి శోభాయాత్ర.. ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో శ్రీరామనవమి సందర్బంగా పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్దలతో ఆలయాలకు క్యూ కట్టారు. ఇక, భద్రాద్రిలో సీతారామ కళ్యాణ వేడుకలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. కాగా, శ్రీరామనవమి సందర్బంగా శోభాయాత్ర జరగనుంది. నేడు(గురువారం) మధ్యాహ్నం 1 గంటలకు శోభాయత్ర ప్రారంభం కానుంది. శ్రీరాముని శోభాయాత్ర మొత్తం 6 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్ర నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో దారిమళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రధానంగా గోషామహల్, సల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు మల్లేపల్లి చౌరస్తా, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు బోయిగూడ కమాన్, గౌలిపుర చౌరస్తా, ఘోడే కి ఖబర్, సాయంత్రం 4 నుంచి 5 వరకు పురానాపూల్ ఎక్స్ రోడ్, ఎంజే బ్రిడ్జ్, లేబర్ అడ్డా, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అలాస్కా టి జంక్షన్, ఎస్ఏ బజార్ యూ టర్న్, ఎంజే మార్కెట్, సాయంత్రం 4 నుంచి 6 వరకు అఫ్జల్ గంజ్ జంక్షన్ వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు రంగమహల్ టీ జంక్షన్, పుల్లిబౌలి చౌరస్తా, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్స్, డీఎం అండ్ హెచ్ఎస్ ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్ చౌరస్తా, చాదర్ ఘాట్ చౌరస్తా. రాత్రి 7 నుంచి 9 వరకు కాచి గూడ ఐనాక్స్, జీపీఓ అబిడ్స్, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు బొగ్గులకుంట చౌరస్తాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. In view of Sri Rama Navami shobha yatra traffic diversions will be imposed in Hyderabad City on 30-3-2023 శ్రీరామ నవమి శోభ యాత్ర దృష్ట్యా 30-3-2023న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు విధించబడతాయి.#sriramvavami2023 #TrafficDiversions #hyderabadcity pic.twitter.com/m4CBwmcC8C — Hyderabad City Police (@hydcitypolice) March 29, 2023 -
కొండగట్టు చోరీ కేసు: ఛేదనలో పోలీస్ డాగ్ ప్రధాన పాత్ర
సాక్షి, కరీంనగర్: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో చోరీచేసింది కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన దొంగలని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు పాల్గొన్నారని గుర్తించారు. అందులో ముగ్గురిని అరెస్ట్ చేసి, వారినుంచి 5 కేజీల వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగతావారి కోసం మూడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ మేరకు జగిత్యాల ఎస్పీ భాస్కర్ కొండగట్టు చోరీ, నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు. దొంగల ముఠా కర్ణాటక నుంచి కొండగట్టుకు మోటార్ సైకిళ్లపై ఫిబ్రవరి 2న రాత్రి చేరుకుంది భక్తుల మాదిరిగా తెలుపు, కాషాయ వస్త్రాలు ధరించి అదేరోజు రాత్రి అంజన్నను దర్శించుకుంది. మరుసటిరోజు (ఫిబ్రవరి 23)న మరోసారి స్వామివారిని దర్శించుకుంది. ఈ సమయంలోనే పరిసరాలపై రెక్కీ నిర్వహించింది. అదేరోజు అర్ధ రాత్రి(శుక్రవారం వేకువజామున) దాటాక ఆలయం వెనకాల అటవీ ప్రాంతం నుంచి ఆలయంలోకి ప్రవేశించింది. స్వామివారిపై ఉన్న మకర తోరణం, కిరీటం, ఆలయంలోని రెండు శఠగోపాలు, ఒకవెండి గొడుగు, రామరక్ష. ద్వారాలకు ఉన్న కవచ ముఖాలు దొంగిలించింది. ఆ తర్వాత మళ్లీ మోటార్ సైకిళ్లపైనే కర్ణాటకకు బయలుదేరి వెళ్లింది. దాదాపు రూ.3 లక్షల విలువైన 15 కేజీల వెండి అభరణాలు చోరీకి గురైనట్టు పూజారులు మల్యాల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇటీవల కొండగట్టు ఆలయానికి సీఎం కేసీఆర్ వచ్చి వెళ్ళిన తరవాత దొంగతనం జరగడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. జగిత్యాల ఎస్పీ భాస్కర్.. డీఎస్పీ ప్రకాశ్ ఆధ్వర్యంలో 10 పోలీసు బృందాలను నియమించారు.దొంగలను పట్టుకునేందుకు గాలింపులు తీవ్రతరం చేశారు. అంతకుముందే ఫింగర్ ప్రింట్, డాగ్ స్క్వాడ్ ఆధునిక శాస్త్ర, సాంకేతిక సాయంతో 24 గంటల్లోనే దొంగలపై అవగాహనకు వచ్చారు. కర్ణాటకకు చెందిన దొంగల ముఠా పనేనంటూ, వారిని పట్టుకునేందుకు ఆ రాష్ట్రంలో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏడుగురు నిందితుల్లో ఎ-1 బాలాజీ కేశవ రాథోడ్, ఎ-5 నర్సింగ్ జాదవ్ ఏ-7 విజయ్ కుమార్ రాథోడ్ ను అదుపులోకి తీసుకున్నారు.. వారినుంచి 3.50 లక్షల విలువైన 5 కిలోల వెండి ఆభరణాలు (వెండి శఠగోపం, ఒకవెండి గొడుగు. ఒకవెండి పెద్ద రామరక్ష, రెండు ద్వారాలకు గల కవచం ముఖాలు, మోటార్ సైకిల్, రెండు సెల్ ఫోన్ల)ను స్వాధీనం చేసుకున్నారు. ఎ-2 రామరావు జాదవ్, ఎ-3 రాంశెట్టి జాదవ్, ఎ-4 విక్రమ్ జాదవ్, ఎ-6 దేవిదాస్ జాదవ్ ఆచూకీ కోసం మూడు. పోలీసు బృందాలు కర్ణాటక రాష్ట్రంలో గాలింపు చేస్తున్నాయి.. పోలీస్ డాగ్ది ప్రధాన పాత్ర కొండగట్టు దొంగల పట్టుకోవడంలో పోలీసు డాగ్ పాత్ర ప్రధానం అని చెప్పాలి.. దొంగలు కొండగట్టు ఆలయానికి భక్తుల్లాగా వచ్చి రెక్కీ నిర్వహించారు.. బస్టాండ్ ప్రాంతం నుంచి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని చుట్టుపక్కల కలియ తిరిగారు. గుడిలోకి ఏవి ధంగా ప్రవేశించవచ్చనే విషయమై క్షుణ్నంగా పరిశీలించారు. ఆలయానికి వచ్చేది.. వెళ్లేది.. రెక్కీ నిర్వహించే దృశ్యాలన్ని సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. వాటన్నింటిని పోలీసులు సేకరించారు. దొంగలు చోరీ చేసిన అనంతరం ఆలయం వెనకవైపు వెళ్లి మద్యం సేవించారు.. పోలీసు జాగిలం ఆలయం నుంచి వెనకవైపు పడేసిన ఖాళీ బీరు సీసాల వరకూ వెళ్లి గుర్తించింది.. పోలీసులు వాటిపై వెలిముద్రలను సేకరించారు. వాటి ఆధారంగా ఆధార్ కార్డును గుర్తించేసరికి అసలు నిందితుల ఆచూకీ దొరికింది. వెంటనే కర్ణాటక రాష్ట్రం బీదర్ వెళ్లి ఏడుగు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకు పట్టుకొచ్చారు. ఆలయంలో చోరీ చేసిన నిందితులు కేవలం వెండి వస్తువులు, ఆభరణాలు మినహా బంగారం, ఇతర వస్తువులు ముట్టుకోలేదు.. నిందితులు అంతా రక్త సంబంధీకులు కావడం మరో చెప్పుకోదగ్గ విషయం. ఏడుగురూ రక్త సంబంధీకులే కొండగట్టు చోరీ చేసిన ఏడుగురు రక్త సంబంధీకులు కావడం చెప్పుకోదగ్గ విషయం. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా ఔరద్ తాలుకా హులియట్ తండాకు చెందిన బాలాజీ కేశవ రాథోడ్, రామరావు జాదవ్, రాంశెట్టి జాదవ్, విక్రమ్ జాదవ్, నర్సింగ్ జాదవ్, దేవిదాస్ జాదవ్, విజయ్ కుమార్ రాథోడ్ ఒకే. ప్రాంతానికి చెందిన రక్తసంబంధీకులు. వీరు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో దొంగతనాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఇప్పటికే మహారాష్ట్రలోని పండరీపురం, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని చాముం డేశ్వరి తదితర ఆలయాల్లో చోరీచేశారు.. కొండగట్టు ఆలయంలో జరిగిన చోరీలోనూ వీరు పాల్గొన్నారు. ఇందులో తండ్రీకొడుకులు కూడా ఉండటం గమనార్హం. 24 గంటల్లోనే దొంగలను గుర్తించిన పోలీసులు కొండగట్టు చోరీ కేసును చాలెంజ్‌గా తీసుకుని, 24 గంటల్లోనే దొంగలను గుర్తించి, నాలుగైదు రోజుల్లోనే ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ భాస్కర్ అభినందించారు. ఆపరేషన్ లో పాల్గొన్న 27 మంది పోలీసులకు ప్రభుత్వం తరఫున రివార్డులు అందించనున్నట్లు చెప్పారు. -
కొండగట్టు ఆలయంలో చోరీ.. దొంగలు ఎవరంటే?
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో ప్రముఖ ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. కాగా, చోరీ కేసును పోలీసులు చేధించారు. ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. సదరు దొంగను కర్నాటకలోని బీదర్‌లో పట్టుకున్నారు. వీరంతా మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ సమీపంలోని ఓ తండాకు చెందిన గ్యాంగ్‌గా గుర్తించారు. వివరాల ప్రకారం.. కొండగట్టు ఆలయంలో గత శుక్రవారం దొంగతనం జరిగింది. తొమ్మిది లక్షల విలువైన మకర తోరణం శఠగోపాలు, వెండి తొడుగు, వెండి వస్తువులు మొత్తం 15 కిలోల వెండి అపహరించారు. కాగా, ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. చోరీ కోసం దొంగలు.. శుక్రవారం అర్ధరాత్రి 1.20 గంటలకు ఆలయం వెనుక నుంచి గుడిలోకి వెళ్లి దొంగతనం చేసి.. ఆ తర్వాత వెనుక వైపు నుంచి గుట్ట కిందకు దిగి వెళ్లిపోయినట్టు గుర్తించారు. అనంతరం, మెయిన్‌రోడ్డుకు వెళ్లి బైకులపై కోరుట్ల, మెట్పల్లి మీదుగా కామారెడ్డి, నారాయణ్ ఖేడ్ నుండి బీదర్ వెళ్లినట్టు పోలీసులు ట్రాక్ చేశారు. ఇక, ఈ దొంగతనానికి ఎనిమిది ఉన్న ఓ గ్యాంగ్ ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ప్రస్తుతానికి వారి వద్ద నుంచి 60 శాతం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆభరణాలు మొత్తం రికవరీ అయ్యాక ఈ ఘటన గురించి పోలీసులు వివరాలు తెలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
చిన్న ఐడియా.. 670 కొలువులు! పోలీసు అభ్యర్థులకు లబ్ధి
‘ఒక చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది..’ అన్నది చాలాసార్లు నిరూపితమైనదే. అలాంటి ఓ ఆలోచన పోలీస్ రిక్రూట్మెంట్లో ఇబ్బందులను పోగొట్టింది. ముందు నుంచే ఉన్న ఇబ్బందిపై సరిగా దృష్టిపెట్టకపోవడంతో సమస్యగా మారితే.. ఒక చిన్న మార్పుతో దాన్ని సరిచేసి వందల మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం కల్పించగలిగారు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు. సమస్య ఏమిటి? పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ వేసిన ప్రతీ సారి కూడా ఎస్సై, కానిస్టేబుళ్ల నియామకాలు చేపడుతుంది. అభ్యర్థుల్లో తక్కువ మంది మాత్రమే కేవలం ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేస్తారు. నూటికి 99% మంది ఎస్సైతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగాలకూ పోటీపడుతుంటారు. వారిలో ప్రతిభావంతులు రెండు పరీక్షల్లోనూ పాసవుతారు. అయితే ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచీ తొలుత కానిస్టేబుల్ సెలక్షన్స్, తరువాత ఎస్సై సెలక్షన్స్ జరిగేవి. దీనివల్ల మొదట కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికై, శిక్షణకు వెళ్లినవారు కూడా.. తర్వాత ఎస్సై పోస్టుకు ఎంపికైతే కానిస్టేబుల్ పోస్టును వదులుకునేవారు. ఇలా వందలాది పోస్టులు ఖాళీ అయ్యేవి. అప్పటికే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయి, ఖాళీ పోస్టులను డీజీపీకి సరెండర్ చేసి ఉండేవారు. పరీక్షల్లో అర్హత సాధించినవారు ఎందరో ఉన్నా ఈ ఖాళీల్లో భర్తీ చేసే అవకాశం ఉండేది కాదు. ఆ పోస్టులను తర్వాతి రిక్రూట్మెంట్లోనే భర్తీ చేయాల్సి వచ్చేది. దీనివల్ల చాలా మంది అభ్యర్థులు వయసు పెరగడం, శారీరక ఇబ్బందులతో పోటీపడే అవకాశం కోల్పోయేవారు. ఏం మార్పులు చేశారు? ఈ లోపాన్ని గుర్తించిన టీఎస్ఎల్ పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావు.. విషయాన్ని అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డికి వివరించారు. ఆయన ఆమోదంతో గత రిక్రూట్మెంట్ సందర్భంగా ముందుగా ఎస్సై సెలక్షన్స్ చేపట్టారు. ఎస్సై ట్రైనీలతో సమావేశం నిర్వహించి.. వారిలో 670 మంది కానిస్టేబుల్ పోస్టులకు అర్హత సాధించారని గుర్తించారు. ముందే ఎస్సై పోస్టులో చేరుతున్నందున కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరబోమంటూ అండర్ టేకింగ్ (నిరభ్యంతర పత్రం) తీసుకున్నారు. తర్వాత చేపట్టిన కానిస్టేబుల్ సెలక్షన్స్ జాబితా నుంచి ఆ 670 మందిని తొలగించారు. దీంతో ఇదే సంఖ్యలో ఇతర అభ్యర్థులు ఎంపికయ్యారు. ఖాళీలేమీ ఏర్పడలేదు. మరోవైపు ట్రాఫిక్ అఫెన్స్‌లు, తెలిసీ తెలియని చిన్న నేరాలకు సంబంధించిన కేసులు ఉన్న 350 మందికిపైగా అభ్యర్థులపై వేగంగా దర్యాప్తు పూర్తి చేయించి.. ఉద్యోగ అవకాశం లభించేలా చేశారు. చదవండి: ధర తక్కువ.. డిమాండ్ ఎక్కువ..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియాలోనే ఇల్లు కావాలి! -
కాసేపట్లో పెళ్లి.. నాకిప్పుడే పెళ్లి వద్దు సార్ అంటూ పోలీసులకు వీడియో!
సాక్షి, సిటీబ్యూరో: ‘సార్.. నా వయసు 17 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు ఇష్టం లేకపోయినా 30 ఏళ్ల యువకుడితో పెళ్లి చేసేందుకు మా ఇంట్లో సిద్ధమయ్యారు. ఇప్పుడే పెళ్లొద్దని ఎంత వారిస్తున్నా.. పట్టించుకోవట్లేదు. పెళ్లి చేసుకోవాల్సిందేనని లేకపోతే చచి్చపోతామని బెదిరిస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మీరే నాకు హెల్ప్ చేయాలి. ఎలాగైనా నా పెళ్లి ఆపించండి ప్లీజ్’.. ఇదీ ఓ మైనర్ బాలిక ఆవేదన. మరికొన్ని గంటల్లో వివాహం ఉందనగా నూతన వస్త్రధారణలో ఉన్న ఓ పెళ్లి కూతురు వివాహ పత్రిక, ఆధార్ కార్డు, ముహూర్తం, పెళ్లి జరిగే ప్రాంతం తదితర వివరాలను వీడియో తీసి రాచకొండ పోలీసులకు పంపించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పెళ్లి మండపానికి చేరుకొని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలికను వనస్థలిపురంలోని సఖి కేంద్రానికి తరలించారు. ఇరు పక్షాల కుటుంబ పెద్దలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటన గురువారం హయత్‌నగర్ పోలీసు స్టేషన్లో పరిధిలో చోటు చేసుకుంది. రాచకొండ పోలీసు కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్.. హయత్‌నగర్ ఠాణా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్ నిరంజన్, ఎస్ఐ ఎన్ సూర్య, షీ టీమ్ ఏఎస్ఐ రాజేందర్ రెడ్డి, మహిళా కానిస్టేబుల్ అనుష్క, చైల్డ్ హెల్ప్‌లైన్ కో–ఆర్డినేటర్ నరేష్‌లను అప్రమత్తం చేసి ఘటనా స్థలానికి పంపించి బాల్య వివాహానికి అడ్డుకట్ట వేయడంతో కథ సుఖాంతమైంది. ఫోన్ చేస్తే అలర్ట్ అవుతారని.. వీడియో వచి్చన నంబరుకు ఫోన్ చేస్తే అమ్మాయి తల్లిదండ్రులు అప్రమత్తమవుతారని ముందుగానే గ్రహించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా పెళ్లి జరిగే చోటుకు చేరుకున్నారని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. కాగా.. మండపం నుంచి పోలీసులు వెళ్లిపోయే వరకూ పెళ్లి కూతురును బయటికి రానివ్వకుండా 2–3 గంటల పాటు గదిలోనే బంధించారు. భయభ్రాంతులకు గురి చేయడంతో పోలీసులు మైనర్‌ను ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం అధికారులు పెళ్లి కూతురితో ఏకాంతంగా మాట్లాడగా.. అసలు విషయం బయటకు చెప్పింది. -
TS: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వారందరికీ మరోసారి ఈవెంట్స్!
సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీసెస్ కొలువుల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షల్లో బహుళ సమాధాన ప్రశ్నల (మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్)కు సమాధానాలు రాసిన అభ్యర్థులకు మార్కులు కలపాలని, ఈ మేరకు అర్హులైన వారికి మరోమారు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలుచేస్తూ వచ్చే నెల 15 నుంచి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలా అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లను సోమవారం www.tslprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు. దరఖాస్తులు నింపండి.. ఇప్పుడు మార్కులు కలపడంతో అర్హత సాధించే అభ్యర్థులు ఆన్లైన్లో పార్ట్–2 దరఖాస్తును నింపాలని టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది. వీటిని నింపేందుకు ఫిబ్రవరి 1 ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు సమయం ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షల్లో (ఎస్సై లేదా కానిస్టేబుల్) అర్హత సాధించి, బోర్డు తాజా నిర్ణయంతో రాతపరీక్షలో అర్హత సాధించే అభ్యర్థులు కూడా మళ్లీ పార్ట్–2 దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షలకు హాజరై అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు.. ఇప్పుడు కొత్తగా మార్కులు కలపడం వల్ల రాతపరీక్షలో ఉత్తీర్ణులైనప్పటికీ వారికి మరో అవకాశం ఇచ్చేది లేదని పోలీస్ బోర్డు స్పష్టం చేసింది. వీరికి మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్ గతంలో దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనని, ఇప్పుడు మార్కులు కలిపితే కొత్తగా అర్హత సాధించే అభ్యర్థులకు మాత్రమే ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాసరావు వెల్లడించారు. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్‌ల్లో నిర్వహించనున్న ఈ ఫిజికల్ ఈవెంట్స్‌ను పదిరోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. వీటి అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 8 ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి 12 గంటల వరకు టీఎస్ఎలీ్పఆర్బీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలుంటే 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించవ్చని చెప్పారు. -
అందుకే రేవంత్‌రెడ్డి ముందస్తు ప్రచారం: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌కు తెలంగాణ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, తన పాదయాత్రను ఆపడమే వాళ్ల ఉద్దేశమని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 28న పాదయాత్ర పునఃప్రారంభిస్తానని ఆమె ప్రకటించారు. పాదయాత్ర ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచే ప్రారంభిస్తా. ఫార్మాలిటీ ప్రకారం పోలీసుల అనుమతి కోరతాం. ఒకవేళ అనుమతి ఇవ్వకున్నా యాత్ర చేస్తా అని ప్రకటించారామె. అలాగే టీపీసీసీ రేవంత్‌రెడ్డిపైనా వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి. పబ్లిసిటీ కోసమే రేవంత్ ముందస్తు ప్రచారం చేసుకుంటున్నారని షర్మిల అభిప్రాయపడ్డారు. ముందస్తు పేరు చెబితేనే పీసీసీ పదవి కాపాడుకోవచ్చనేది రేవంత్ ఆలోచన అని ఆమె ఆరోపించారు. అలాగే.. ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని వైఎస్ షర్మిల తెలిపారు. ఇక బీజేపీతో పొత్తుపై స్పందిస్తూ.. ‘బీజేపీతో మాకు చాలా వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి, పొత్తు ప్రస్తావనే లేదు అని ఆమె స్పష్టం చేశారు. -
HYD: కి‘లేడీ’ ప్లాన్.. హోం డెలివరీ పేరిట మహిళ హనీ ట్రాప్
సాక్షి, హైదరాబాద్: నగరంలో హనీ ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. తెలంగాణ పోలీసులు హనీ ట్రాప్ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా ఓ మహిళతో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. హోమ్ డెలివరీ పేరిట ఓ మహిళ నగరంలో కొందరు వ్యక్తులను హనీ ట్రాప్ చేస్తోంది. ఈ క్రమంలో యువకులతో పరిచయం పెంచుకున్న సదరు మహిళ.. వారితో సన్నిహితంగా ఫొటోలు దిగుతోంది. ఇలా వారిలో ఫొటోలు దిగిన మరుసటి రోజే.. సదరు మహిళతో పాటు వారి గ్యాంగ్ యువకుల ఇంటి వద్ద ప్రత్యక్షమవుతున్నారు. యువకులు.. ఆమెతో ఫొటోలు దిగి మహిళను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఇంటిపై దాడి చేసి హంగామా సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో మహిళ గ్యాంగ్.. బాధిత యువకుల వద్ద రూ. లక్షలు వసూలు చేస్తోంది. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జోన్ పరిధిలోని పోలీసులు వారిపై ఆరు కేసులు నమోదు చేశారు. అనంతరం, హనీ ట్రాప్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. -
నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్.. కవర్ చేస్తే కటకటాలే!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంచరిస్తున్న ట్రాఫిక్ ఉల్లంఘనులు నానాటికీ రెచి్చపోతున్నారు. జరిమానాలు తప్పించుకోవడానికి నిఘా నేత్రాలు, ట్రాఫిక్ కెమెరాలకు తమ నంబర్ ప్లేట్లు చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్’ చేస్తున్నారు. దీనికోసం మాసు్కలు తదితరాలు తొడగటం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ఉల్లంఘనుల్లో మార్పు రాకపోవడం, నేరగాళ్లు సైతం ఇదే బాటపట్టడంతో ట్రాఫిక్ కాప్స్‌తో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్స్ మూసేసిన వారిపై పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నంబర్ ప్లేట్‌ను మాసు్కతో కవర్ చేసిన యువకుడిని రెయిన్‌బజార్ పోలీసులు రెండు రోజుల క్రితం పట్టుకున్నారు. ఇతడికి న్యాయస్థానం ఎనిమిది రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. చలాన్లు తప్పించుకోవడానికే.. - నంబర్ ప్లేట్లు మూసేయడం అనేది ప్రధానంగా ఈ–చలాన్లను తప్పించుకోవడానికే అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్ కెమెరాలతో ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలను నంబర్ ప్లేట్లతో సహా చిత్రీకరిస్తున్నారు. వీటితో పాటు సీసీ కెమెరాల ద్వారా సేకరించిన ఫొటోల ఆధారంగా కమాండ్ అండ్ కంట్రోల్ సిబ్బంది ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. - ఈ విధానంలో వాహనాల నంబర్, దాని ఆధారంగా సేకరించే చిరునామా కీలకం. తమ వాహనాలకు సంబంధించిన నంబర్ ప్లేట్లను వివిధ రకాలుగా కవర్ చేయడం, వంచేయడం, విరిచేయడం చేస్తున్న వాహనచోదకులు వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు ట్రాఫిక్ కెమెరాలకు చిక్కుకుండా చేస్తున్నారు. కొందరు నేరగాళ్లు సైతం నంబర్ ప్లేట్లు కనిపించకుండా చేసి నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడానికి పోలీసులు అనేక వ్యయప్రయాసలకోర్చాల్సి వస్తోంది. వాహనం వెనుకవే ఎక్కువగా.. వాహనాల నంబర్ ప్లేట్స్ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్ చేయడం అనేది తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. రోడ్లపై ఈ తరహా నంబర్ ప్లేట్‌ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయతి్నస్తే బైక్స్ మాదిరిగా తేలికపాటి వాహనాలు తప్పించుకునిపోలేవు. ఈ నేపథ్యంలోనే వీళ్లు ఆ తరహా చర్యల జోలికి వెళ్లట్లేదు. ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నంబర్ ప్లేట్‌కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు. సాధారణంగా ఉల్లంఘనల్ని వాహనం వెనుక నుంచే ఫొటోలు తీస్తుండటంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు. మాస్క్ మాటున మస్కా కొట్టాలని.. ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన వాహన చోదకుడిపై కొన్నాళ్లుగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. రెయిన్‌బజార్ పోలీసులు పెట్టిన కేసులో మాత్రం వాహన చోదకుడికి ఎనిమిది రోజుల శిక్షపడింది. నంబర్ ప్లేట్ ఉల్లంఘనలో ఇంత శిక్షపడటం ఇదే తొలిసారి అని ఇన్స్పెక్టర్ నైని రంజిత్‌కుమార్ గౌడ్ ‘సాక్షి’కి తెలిపారు. బాలాపూర్‌నకు చెందిన సయ్యద్ షోయబ్ అక్తర్ అలీకి ఈ శిక్షపడిందని వివరించారు. ఈ తరహా ఉల్లంఘనులపై పోలీసులు ఐపీసీలోని 420 (మోసం), 186 (ప్రభుత్వ అధికారుల విధులు అడ్డుకోవడం) సహా మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్ ఈ నెల 2 నుంచి 9 వరకు చేపట్టిన డ్రైవ్‌లలో నంబర్ ప్లేట్ సరిగా లేకపోవటం, టాంపరింగ్, స్పష్టత లేకుండా చేయడం వంటి 2,925 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశామని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 27,467 విత్ అవుట్ హెల్మెట్ కేసులు, 509 మందిపై 39 (బీ) పెట్టీ కేసులు, 264 మందిపై 41 సీపీ యాక్ట్ (వెహికిల్ లిఫ్టింగ్), 441 మంది వాహనదారులై ట్రిపుల్ రైడింగ్ కేసులు నమోదు చేశామని వివరించారు. -
ప్రగతి భవన్ ముట్టడికి ‘డీవైఎఫ్ఐ’ యత్నం.. ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్, ఎస్సై నియామకాల్లో అవకతవకలు జరిగాయాంటూ ప్రగతి భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల నేతలు సోమవారం యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు నియామకాల్లో అవకతవకలు జరిగాయని డీవైఎఫ్ఐ ఆరోపించింది. నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేసింది. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. దీంతో నిరసనలకు దిగిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక స్టేషన్లకు తరలించారు. ఇదీ చదవండి: ఖమ్మం బీఆర్ఎస్కు ఒకేసారి భారీ షాకులు?.. తుమ్మలతో పాటు పొంగులేటి.. షాతో చర్చలు?? -
TS Police: ఈవెంట్స్ కంప్లీట్.. ఫైనల్ పరీక్షలకు బస్తీమే సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తి చేసి క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిజికల్ ఫిటెనెన్ టెస్టుల్లో పాల్గొన్నారు. కాగా, దేహదారుఢ్య పరీక్షలు సైతం పూర్తయ్యాయి. డిసెంబర్ 8వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు ఈవెంట్స్ జరిగాయి. ఈ పరీక్షలకు 2.07 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటిలో అర్హత సాధించినవారికి మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ మూడో వారం వరకు మెయిన్స్ నిర్వహిస్తారు. కాగా, 554 ఎస్సై పోస్టులకు 52,786 మంది అభ్యర్థులు మెయిన్స్ రాయనున్నారు. 15644 కానిస్టేబుల్ పోస్టులకుగాను 90,488 మంది, 614 ఆబ్కారీ కానిస్టేబుల్ పోస్టులకు 59,325 మంది అభ్యర్థులు మెయిన్స్ రాయనున్నారు. కాగా, ఈవెంట్స్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ చేశామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ పేర్కొంది. లాంగ్ జంప్, షాట్ ఫుట్ ఈవెంట్స్‌కి ఒక్కొక్కరికి మూడుసార్లు చాన్స్ ఇచ్చినట్టు బోర్డ్ తెలిపింది. ఈ రిక్రూట్మెంట్లో 53.7 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఇక, 2018-19 నోటిఫికేషన్లో 48.5 శాతం అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్‌లో క్వాలిఫై అయనట్టు బోర్టు అధికారులు వెల్లడించారు. -
మాములోడు కాదు.. ఎస్ఐ డేంజర్ ప్లాన్ తెలిసి పోలీసు శాఖ అలర్ట్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపడుతుండగా.. అదేశాఖలో పనిచేసే ఓ అధికారి మావోయిస్టుల తరహాలో దళాన్ని ఏర్పాటు చేసేందుకు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. తాడ్వాయి అడవుల్లో ట్రయల్ కూడా నిర్వహించినట్లు సమాచారం. సదరు వ్యక్తులు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. వరంగల్‌లో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపించి మావోయిస్టులు ఉన్నారనే భ్రమ కల్పించాలని పక్కా స్కెచ్ వేసినట్లు సమాచారం. ఈ కుట్ర వెనుక ములుగు జిల్లాలో పనిచేసే ఓ ఏఆర్ ఎస్ఐ కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. పకడ్బందీగా జరిగిన ఈ కుట్రకోణాన్ని పసిగట్టిన హైదరాబాద్‌లోని పోలీస్ నిఘా విభాగం.. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆధారాలతో కూడిన కొన్ని వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ మేరకు ములుగు పోలీస్ అధికారుల సహకారంతో రంగంలోకి దిగిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ బృందం.. సదరు ఏఆర్ ఎస్ఐతో పాటు మరో ఇద్దరిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. ఈ విచారణలో సాయుధ దళం ఏర్పాటుతోపాటు వరంగల్‌లో హెడ్‌కానిస్టేబుల్ హత్యకు సంబంధించిన వివరాలను సేకరించి.. సదరు హెడ్‌కానిస్టేబుల్‌ను సైతం అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలాఉండగా ఈ కుట్రకోణం వెనుక భారీ ప్రణాళిక దాగి ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. సాయుధ దళం ఏర్పాటు చేసి.. ఆ సభ్యులతో యాక్షన్లు చేయించి.. తిరిగి వారిని ఎన్కౌంటర్ పేరిట హతమార్చి పోలీస్‌శాఖలోనూ పేరు తెచ్చుకోవాలన్న మరో కోణం దాగి ఉన్నట్లు కూడా ప్రచారంలో ఉంది. వరంగల్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపే యాక్షన్‌టీమ్ తనను కలిసేందుకు ములుగు ప్రాంతానికి వచ్చే క్రమంలో ఎన్కౌంటర్ చేయాలన్న కుట్ర పన్నినట్లు సమాచారం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు.. ఇటు హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపి మావోయిస్టులు ఉన్నట్లు భ్రమలు కల్పించడంతోపాటు మరోవైపు ఎన్కౌంటర్ చేసి పోలీసు అధికారులు మెప్పు పొందవచ్చని భావించి ఈ కుట్రకు తెర లేపినట్లు సమాచారం. ముందే ఈ వివరాలన్నీ సేకరించి విచారిస్తున్న ప్రత్యేక నిఘా విభాగం.. వీటన్నింటిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. -
మందుబాబులకు హెచ్చరిక..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ఎంతో జోష్‌తో జరుపుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకనున్నారు. ఈ సందర్భంగా వేడుకలపై తెలంగాణ పోలీసులు నిఘా పెట్టారు. అటు ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం వేడుకలపై ఫోకస్ పెట్టారు. న్యూ ఇయర్ వేడుకలపై మందుబాబులపై ఎక్సైజ్ శాఖ నిఘా పెట్టి 26 స్ట్రైకింగ్ టీమ్‌లను ఏర్పాటు చేశారు అధికారులు. ఈవెంట్లలో డ్రగ్స్ సరఫరాపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచారు. ఇక, డిసెంబర్ 31 సందర్బంగా రాత్రి 12 గంటల వరకు వైన్స్, ఒంటి గంట వరకు బార్లకు అనుమతి ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కూడా మందుబాబులను హెచ్చరించారు. పోలీసులు నెక్లెస్‌రోడ్, కేబీఆర్ పార్క్‌రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 10, సికింద్రాబాద్, మెహదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రేసులు, డ్రంకన్ డ్రైవింగ్ పైనా కన్నేసి ఉంచుతారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం నిషిద్ధం. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు తప్పవు. వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్ చేయడం వంటిని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ... కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ పైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను శనివారం రాత్రి మూసి ఉంచుతారు. ఓఆర్ఆర్, వంతెనలు బంద్ నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేలపై వాహనాలకు అనుమతి లేదు. నేడు రాత్రి 11 గంటల నుంచి 1న ఉదయం 5 గంటల వరకు ఈ అంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. విమాన టికెట్, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు చూపించిన ప్రయాణికులను మాత్రమే ఆయా మార్గాల్లో అనుమతి ఇస్తారు. అలాగే దుర్గం చెవురు కేబుల్ బ్రిడ్జి, శిల్పా లైఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడ్రైవర్సిటీ, షేక్‌పేట్, మైండ్‌స్పేస్, రోడ్ నం–45, సైబర్ టవర్, ఫోరంమాల్–జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాబు జగ్జీవన్‌రామ్ ఫ్లైఓవర్లు రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు పూర్తిగా బంద్ ఉంటాయి. అలాగే నాగోల్, కామినేని ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్, చింతలకుంట అండర్‌పాస్‌లు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి లేదు. -
అర్ధరాత్రి వైఎస్ షర్మిల దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ దీక్షను శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించారు. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె శుక్రవారం లోటస్‌పాండ్ వద్ద దీక్షకు దిగిన విషయం తెలిసిందే. కాగా షర్మిల దీక్ష శనివారం రెండోరోజు కూడా కొనసాగింది. దీక్ష చేస్తున్న షర్మిలను వైఎస్ విజయమ్మ కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. ‘ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ పతనానికి నాంది. న్యాయస్థానమంటే ఆయనకు గౌరవం లేదు..’ అని విమర్శించారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేయడమే కాకుండా వారిపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా పార్టీ కార్యాలయం చుట్టూ బారికేడ్లు పెట్టారు. సామాన్యులను కూడా రానివ్వడం లేదు. వచి్చన వాళ్లందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు..’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ దేశమంతా రాజకీయాలు చేసుకోవచ్చు. ఆయనకు మాత్రం అన్ని పరి్మషన్లు వస్తాయి. కానీ, ప్రజల కోసం కొట్లాడే మా పార్టీపై మాత్రం దాడులా?..’అని మండిపడ్డారు. షర్మిల ప్రాణాలకు ప్రమాదం: వైద్యులు శనివారం సాయంత్రం వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. షరి్మల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, ఆమె 30 గంటలుగా మంచినీళ్లు సైతం తీసుకోవడం లేదని డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వైద్య పరీక్షలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్టేట్ లెవెల్స్ బాగా పెరిగాయని, యూరియా, బీపీ, గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె వెంటనే ఆసుపత్రిలో చేరకపోతే ప్రాణాలకు ప్రమాదమని చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పోలీసులు ఆమెను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. -
నందకుమార్‌కు బెయిల్ మంజూరు.. లాస్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు సంచలన ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ మరోసారి హైలైట్ అయ్యారు. మరోవైపు, తెలంగాణ పాలిటిక్స్‌లో నందకుమార్.. అన్ని పార్టీల నేతలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. నాంపల్లి కోర్టు నందకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో నమోదైన ఫోర్జరీ కేసులో బెయిల్ మంజూరైంది. ఇదిలా ఉండగా, మరో కేసులో నందకుమార్‌పై పీటీ వారెంట్ ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో, నందకుమార్‌పై ఎన్ని కేసులు నమోదు అయ్యాయో వివరాలు ఇవ్వాలని పోలీసులను కోర్టు కోరింది. ఇక, ఎమ్మెల్యేలకు ఎర కేసు కేవలం టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే నడుస్తుందని భావించిన కాంగ్రెస్ పెద్దలను నందకుమార్ చాటింగ్ జాబితా టెన్షన్‌కు గురిచేస్తోంది. ఈ జాబితాలో తమ పార్టీ నేతల పేర్లు ఉండటంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. ఎమ్మెల్యేలతో సహా! నందు చాటింగ్ జాబితాలో తమ పార్టీ కీలక నేతలుండటం టీపీసీసీ వర్గాలను ఉలికిపాటుకు గురిచేస్తోంది. పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంథని, భద్రాచలం, సంగారెడ్డి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లాంటి నేతల పేర్లున్న నేపథ్యంలో పార్టీలో ఎంత మందిని టార్గెట్ చేశారనేది ఆసక్తికరంగా మారింది. వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ పార్టీ విధేయులేనని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడే ఆలోచన ఉన్న వారు కాదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అలాంటి నేతల పేర్లు కూడా నందు లిస్ట్‌లో ఉండటం చూస్తే పార్టీ కుంభస్థలాన్ని కొట్టేందుకే కొందరు కుట్రలు చేస్తున్నారనే అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. మొత్తంమీద నందు చిట్టా ఏ పరిణామాలకు దారితీస్తుందో, పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ముందస్తు నష్ట నివారణ చర్యలకు టీపీసీసీ పూనుకుంటుందో లేదో అన్న సందేహాలు కాంగ్రెస్ కేడర్‌లో తలెత్తుతున్నాయి. -
మునావర్ కామెడీ షో: ప్రోగ్రామ్ 5 గంటలకే ప్రారంభం.. నో సెల్ ఫోన్స్
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో.. తెలంగాణలో టెన్షన్‌కు క్రియేట్ చేసింది. మునవార్ షోకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫారూఖీ షోను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. షో విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మునావర్ కామెడీ షోను నిర్వాహకులు శనివారం సాయంత్రం 5 గంటలకే శిల్పకళా వేదికలో ప్రారంభించారు. కాగా, శిల్పకళా వేదిక గేట్లు సాయంత్రం 4:45కే మూసివేశారు. అలాగే, మునావర్ షోకు వచ్చే వారు షో టికెట్‌తో పాటుగా తమ వెంట ఆధార్ కార్డును కూడా తీసుకు రావాలని సూచించారు. కాగా, షోకు ఆహార పదార్ధాలు, వాటర్ బాటిల్స్, సెల్ ఫోన్స్ అనుమతిని నిరాకరించారు. ఇక, శిల్పకళా వేదిక వద్ద పోలీసులతో కొందరు వాదనకు దిగడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: తెలంగాణలో చలాన్ల బాదుడు.. వామ్మె ఇన్ని వేల కోట్లా? -
తనిఖీలు గాయబ్! స్వేచ్ఛగా అసాంఘిక శక్తులు
సాక్షి, సిటీబ్యూరో: రియల్ ఎస్టేట్ వివాదాల నేపథ్యంలో మాదాపూర్‌లోని నీరూస్ జంక్షన్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఇస్మాయిల్‌ను హత్య చేసిన జిలానీతో పాటు ముజాహిద్‌లు ఆదివారం రాత్రి 11.30 నుంచి సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకు అక్రమ ఆయుధంతో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో సంచరించారు. కనీసం ఒక్క చోటైనా వాహనాల తనిఖీలు జరిగి ఉంటే నాటు పిస్టల్‌తో కారులో తిరుగుతున్న వీళ్లు పట్టుబడటమో, పోలీసుల భయంతో తమ పథకం అమలును వాయిదా వేయడమో చేసే వాళ్లు. ఇస్మాయిల్ ప్రాణాలు పోవడం వెనుక తనిఖీలు, సోదాలు గాయబ్ కావడమూ ఓ కారణంగానే కనిపిస్తోంది. అటకెక్కిన ఆ విధానాలు.. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఒకప్పుడు విస్తృత స్థాయిలో తనిఖీలు, సోదాలు జరిగేవి. దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో వాహనాల తనిఖీలో, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లే కనిపించేవి. ఫలితంగా అనేక మంది నేరగాళ్లు, అనుమానిత వ్యక్తులు, చోరీ.. సరైన పత్రాలు లేని వాహనాలు దొరుకుతుండేవి. గడిచిన కొన్నాళ్లుగా మాత్రం ఈ విధానాలన్నీ అటకెక్కాయి. ఎన్నికల సీజన్ లేదా సున్నితమైన పండగలు, ఇతర ఘట్టాలు ఉన్నప్పుడు మాత్రమే లా అండ్ ఆర్డర్ పోలీసులు రోడ్ల పైకి వస్తున్నారు. మిగిలిన రోజుల్లో కేవలం ట్రాఫిక్ పోలీసులు మాత్రమే రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. పగటి పూట పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్ల కోసం, రాత్రి వేళల్లో డ్రంక్ డ్రైవింగ్ చేస్తున్న వారిని పట్టుకోవడానికి మాత్రమే వీటిని నిర్వహిస్తున్నారు. వీరి దృష్టి ఈ రెండు అంశాలపై కాకుండా మరో దానిపై ఉండట్లేదు. చలాన్ కోసమో, మద్యం తాగాడా? లేదా? అనేది తనిఖీ చేయడానికో ఓ వాహనచోదకుడిని ఆపినప్పుడు వీళ్లు ఇతర అంశాలు పట్టించుకోరు. ఆ వాహనంలో అనుమానాస్పద, నిషేధిత వస్తువులు ఉన్నాయా? సదరు చోదకుడు వీటిని కలిగి ఉన్నాడా? తదితర అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం యాంత్రికంగా తమ పని పూర్తి చేసేస్తుంటారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో ఉన్న వారిలో అనేక మంది గతంలో శాంతిభద్రతల విభాగం, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌లో పని చేసిన వాళ్లే. అయినప్పటికీ ఒంటిపైకి తెల్లచొక్కా వచ్చేసరికి అసలు పోలీసింగ్‌ను మర్చిపోతుంటారు. పగటిపూట రహదారుల్లో వాహన తనిఖీలు చేయడానికి ట్రాఫిక్ జామ్స్ సహా అనేక ఇబ్బందులు ఉంటాయి. అదే రాత్రి వేళల్లో వీటిని చేపట్టినా పెద్దగా ఇబ్బంది రాదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ కోణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇతర విభాగాల విధులతో తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించకుండా ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం అధికారులు తనిఖీలు, సోదాల్లో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. చదవండి: మాదాపూర్‌లో కాల్పుల కలకలం.. రియల్టర్ మృతి -
అభ్యర్థులకు అలర్ట్: టీఎస్‌లో ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల తేదీలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్ పరీక్షలను రెండు దఫాల్లో నిర్వహించనున్నట్టు బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్ఐ రాత పరీక్షను ఆగస్టు 7వ తేదీన, కానిస్టేబుల్ పరీక్షను 27 తేదీల్లో నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ రాత పరీక్ష హాల్‌టికెట్లను www.tslprb.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూలై 30వ తేదీ నుంచి ఎస్ఐ, ఆగస్టు 10వ తేదీ నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు హాట్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. కాగా, ఈ పరీక్షలకు సుమారు 8.95 లక్షల మంది హాజరుకానున్నారు. -
బీజేపీ సమావేశాలు.. తెలంగాణ పోలీస్ అత్యుత్సాహం
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రెండో రోజు(ఆదివారం) కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నేడు మొత్తం మూడు అంశాలపై తీర్మానాలు చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు నిఘా వేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ పోలీసు.. బీజేపీ మీటింగ్ ఎజెండా బుక్‌ను ఫొటోతీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రభుత్వం మా ప్రైవసీని దెబ్బతీయాలని చూస్తోంది. ఇంటెలిజెన్స్ పోలీసుల పేరుతో సమావేశంలో పత్రాలను ఫొటో తీశారు. మా తీర్మానాల కాపీలను ఫొటో తీశారు. బీజేపీ సమావేశాల్లోకి తెలంగాణ పోలీసు అధికారి ఎందుకు వచ్చారో చెప్పాలి. ఇంటెలిజెన్స్ పేరుతో బీజేపీ తీర్మానాల కాపీలను ఫొటో తీశారు. ఫొటో తీసిన పోలీసు అధికారిని కమిషనర్‌కు అప్పగించాము’’ అని అన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సభ: అప్పటి వరకు మెట్రో సేవలు బంద్ -
బోయిగూడ అగ్ని ప్రమాదం.. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యక్ష సాక్షి ప్రేమ్ ఏం చెప్పాడంటే..
సాక్షి, హైదరాబాద్: బోయిగూడలో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షి.. బీహార్‌కు చెందిన ప్రేమ్ కుమార్ బుధవారం పోలీసులకు కీలక విషయాలను వెల్లడించారు. ప్రేమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. స్క్రాప్ గోడౌన్ యజమాని నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నాడు. రెండేళ్ల నుంచి స్క్రాప్ గోడౌన్లో పనిచేస్తున్నట్టు తెలిపాడు. నిన్న రాత్రి తనతో పాటుగా మరో 11 మంది రెండు గదుల్లో నిద్రపోతున్నామని చెప్పాడు. ఓ చిన్న రూమ్‌లో తనతో పాటు బిట్టు, సంపత్ ఉండగా.. మరో తొమ్మిది మంది వేరే గదిలో నిద్రపోతున్నారని తెలిపాడు. కాగా, రాత్రి 3 గంటల సమయంలో గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అన్నాడు. దీంతో కార్మికులందరూ బయటకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో తాను ఎంతో కష్టంతో కిటీకీలో నుంచి బయటకి దూకి ప్రాణాలను కాపాడుకున్నట్టు తెలిపాడు. కానీ, మిగిలిన వారంతా మంటల్లోనే సజీవ దహనమయ్యారని ఆవేదన చెందాడు. ఈ క్రమంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారని.. అనంతరం తనను గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ప్రేమ్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్తో స్క్రాప్ గోదాం ఓనర్ సంపత్ పై కేసు నమోదు పోలీసులు వెల్లడించారు. సంపత్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, మృతులను సికిందర్(40), బిట్టు కుమార్ రామ్(20), సత్యేందర్ కుమార్(30), చెట్టిలాల్ రామ్(28), దామోదర్(27), శింటు కుమార్(27), దుర్గా రామ్(35), రాకేష్(25), దీపక్ కుమార్ రామ్(26), పంకజ్(26), దరోగా కుమార్(35)గా గుర్తించారు. ప్రేమ్(25) ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. -
అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ రాకెట్ బ్లాస్ట్: రూ.2.21 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం ఫోటోలు
-
e- pass: కావాలా.. ఇలా అప్లై చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ అమలు నేపథ్యంలో అత్యవసర ప్రయాణాల నిమిత్తం పోలీసులు ఈ–పాసులు జారీ చేస్తున్నారు. https://policeportal.tspolice.gov.in వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ సూచించిన విధంగా వివరాలు నమోదు చేసి తగిన ఆధారాలు/డాక్యుమెంట్లు సమర్పించాలి. అయితే అత్యవసరాలు, వైద్యసేవలు, వివాహాలు, మరణాలకు మాత్రమే తక్షణం పాసులు జారీ చేస్తున్నారు. కారణాలు సహేతుకంగా లేకున్నా, డాక్యుమెంట్లు సరిగా లేకున్నా తిరస్కరిస్తున్నారు. విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు చేసేవారు ఎలాంటి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణవాసులైతే ఇలా.. https://policeportal.tspolice.gov.inవెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో ముందుగా మీరు కంటైన్మెంట్ జోన్లో లేనని, తాను కంటైన్మెంట్ ప్రాంతానికి ప్రయాణించడంలేదని, తనకు కోవిడ్ అనుమానిత లక్షణాలు ఏమీ లేవని, తాను సమర్పించే అన్ని వివరాలు నిజమైనవేనని స్వయం ధ్రువీకరణ ఇవ్వాలి. తర్వాత అందులోని ఒక్కో కాలమ్‌ను నింపాలి. పేరు చిరునామా, వాహనం వివరాలు, దాని సీటింగ్ సామర్థ్యం, ప్రయాణం తేదీ, తిరుగు ప్రయాణం తేదీ, ఏ రూట్లో వెళ్లి వస్తారు తదితర అన్ని వివరాలు నింపాలి. ఆఖర్లో నిర్దేశించిన మూడు కీలకమైన కాలమ్స్‌లో మీ ఫొటో (80కేబీ), ఆధార్ (500కేబీ), తరువాత ఏ కారణం వల్ల ప్రయాణం చేస్తున్నామో సంబంధిత ధ్రువీకరణ పత్రం (500కేబీ, ఆసుపత్రి, వివాహం, మెడికల్ ఎమర్జెన్సీ, డెత్ సర్టిఫికెట్) తదితరాలు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ఇతర రాష్ట్రాల వారికి.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి కూడా మార్గదర్శకాలు దాదాపుగా ఒకటే. ఈ సదుపాయాన్ని మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. కాకపోతే, ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారు? నివాస పూర్తి చిరునామా, తెలంగాణలోని ఏ జిల్లా, ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వెళ్తున్నారు? ఆ చిరునామా? ఏ రూట్లో వచ్చి వెళతారు? తదితర వివరాలు అదనంగా జోడించాల్సి ఉంటుంది. మిగిలిన ధ్రువీకరణ పత్రాలు యథావిధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు 1,24,225 పాసులు జారీ చేశారు. -
Lockdown: ఫుడ్ డెలివరీపై కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌ను కఠినతరం చేస్తూ పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర దుమారం చెలరేగడంతో ఆదివారం పోలీసులు వెనక్కి తగ్గారు. విద్యుత్ శాఖ ఉద్యోగులపై లాఠీచార్జి విషయమై ఆ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి డీజీపీతో మాట్లాడగా.. తలసేమియా రుగ్మతకు సంబంధించిన వారిని అడ్డుకోవడంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ కూడా స్పందించడంతో పోలీసులు దిగివచ్చారు. శనివారం అర్ధరాత్రి డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలతో సమీక్ష నిర్వహించి ఫుడ్ డెలివరీ సేవలకు అంతరాయం కలగించరాదని ఆదేశించారు. అదే విధంగా తలసేమియా రుగ్మత గలవారిని, విద్యుత్ ఉద్యోగులను అడ్డుకోరాదని సూచించారు. దీంతో ఆదివారం పోలీసులు వారికి ఇబ్బందులు కలిగించలేదు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు మూసివేశారు. జాతీయ రహదారులు మినహా రాష్ట్ర రహదారులను మూసివేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాలనీ రోడ్ల నుంచి రాకపోకలు సాగించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు లాఠీలు ఝుళిపించడం, తనిఖీలు ముమ్మరం చేయడంతో రోడ్ల మీద జనసంచారం పూర్తిగా అదుపులోకి వచ్చింది. దీనికితోడు సరుకు రవాణా వాహనాలను నగరాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే అనుమతించడంతో రోడ్లపై వాహనాలు తగ్గిపోయాయి. అత్యవసర విభాగాలు, మెడికల్, ఫార్మా, విద్యుత్, వ్యవసాయ తదితర అనుమతి ఉన్న రంగాల ఉద్యోగులను పోలీసులు ఐడీలు చూసి అనుమతించారు. ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్రతోపాటు అన్ని జిల్లాల సీపీలు, ఎస్పీలు దగ్గరుండి పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. అన్ని నగరాల్లో డ్రోన్ల ద్వారా గల్లీలు, కాలనీలను పర్యవేక్షించారు.కాగా, పాసులు కావాల్సిన వారు https://policeportal.tspolice. gov.in దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు. మార్కెట్లలో రద్దీ లాక్డౌన్ మినహాయింపు సమయమైన ఉదయం 6 నుంచి 10 గంటల వరకు జనాల తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. ఆదివారం కావడంతో మటన్, చికెట్, చేపల మార్కెట్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. ఎక్కడా సామాజిక దూరం పాటించలేదు. అయితే, పోలీసుల ఆదేశాల మేరకు కూరగాయలు, ఇతర విక్రయదారులు ఉదయం 10 గంటలకన్నా ముందే వ్యాపార సముదాయాలు మూసివేసి ఇళ్లకు కదిలారు. అయితే, కొందరు ఆకతాయిలు మాత్రం 10 గంటల వరకు ఏదో కారణంతో కరోనా నిబంధనలు తుంగలోతొక్కి రోడ్లపై సంచరించారు. -
Lockdown: నో పాస్.. నో ఎంట్రీ
కోదాడ రూరల్/అలంపూర్: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సడలింపు సమయంలోనైనా తెలంగాణలోకి ప్రవేశించాలంటే ఈ–పాస్ తప్పనిసరి. దీంతో పాస్ లేని వాహనాలన్నింటినీ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు అయిన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్‌లు లేకుండా వచ్చిన వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోకి అనుమతించలేదు. కోదాడ డీఎస్పీతో పాటు ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, ఇద్దరు ఎంవీఐలతో పాటు 60 మంది పోలీసు సిబ్బంది చెక్‌పోస్టులో విధులు నిర్వహిం చారు. రాష్ట్రంలో ఉదయం 6–10 గంటల వరకు లాక్డౌన్ మినహాయింపు ఉండటంతో రాష్ట్రంలోకి ప్రవేశిం చేందుకు ఏపీ నుంచి వందల సంఖ్యలో వాహనాలు తెల్లవారుజామున 4 గంటలకే రామాపురం చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న వాడపల్లి, మట్టపల్లి, పులిచింతల, సాగర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో శనివారం రాత్రి నుంచి వాహన రాకపోకలను నిషేధించారు. కోదాడ వైపు ఉన్న రామాపురం చెక్‌పోస్టు నుంచి మాత్రమే అనుమతి ఉండటంతో అక్కడకు వాహనాలు భారీగా చేరుకున్నాయి. పోలీసులు ముందుగా ఈ–పాస్‌లు ఉన్న వాహనాలను అనుమతించారు. అనుమతి లేని వాటిని వెనక్కి పంపే క్రమంలో ఏపీ వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి మధ్యాహ్నం 12 గంటల వరకు భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. లాక్డౌన్ మినహాయింపు సమయం ఉంది కదా తమను ఎందుకు అనుమతించరు.. అంటూ కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. పాస్‌లు లేని వాహనాలను అనుమతించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. దీంతో వాహనదారులు చేసేదేమీ లేక వెనుదిరిగిపోయారు. అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ వాహనాలను మాత్రం ఎలాంటి తనిఖీలు చేయకుండానే అనుమతించారు. అప్పటికప్పుడు ఆయా జిల్లాల నుంచి ఈ–పాస్ అనుమతి తీసుకున్న వారిని కూడా అనుమతించారు. ఇదిలా ఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద కూడా అనుమతి లేని వాహనాలను పోలీసులు ఆపడంతో ఆదివారం ఉదయం ట్రాఫిక్‌జామ్ అయింది. ఈ–పాస్ ఉన్న వాహనాలను అనుమతించి, మిగతా వాటిని దారి మళ్లించారు. -
విద్యుత్ ఉద్యోగులపై పోలీసుల ప్రతాపం
సాక్షి ప్రతినిధి నల్లగొండ/హైదరాబాద్: ‘మేం విద్యుత్ ఉద్యోగులం, డ్యూటీకి వెళ్తున్నాం’అని చెప్పినా వినిపించుకోకుండా పోలీసులు వారిపై లాఠీలు ఝళిపించారు. మరో ఇద్దరు మహిళా ఉద్యోగులతో అనుచితంగా మాట్లాడారు. నల్లగొండలో చోటు చేసుకున్న ఈ ఘటనలపై ఉద్యోగులు ఆందోళన చేశారు. అదే సమయంలో పట్టణంలోని రామగిరి ప్రాంతంలోని రెండు ఫీడర్ల బ్రేక్‌డౌన్ కావడంతోపాటు పోలీస్ హెడ్‌క్వార్టర్స్, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వివరాలు.. నాంపల్లిలో పని చేసే విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ ప్రభు విధినిర్వహణలో భాగంగా శుక్రవారం రాత్రి నల్లగొండలోని డివిజన్ ఆఫీసుకు వెళ్లి వస్తుండగా రామగిరిలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శనివారం ఉదయం 10 గంటల తర్వాత ఈఆర్వో కార్యాలయానికి విధుల నిమిత్తం వెళ్తున్న అరుణను వెంకటేశ్వర కాలనీ వద్ద, జానకిని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకొని అనుచితంగా మాట్లాడారు. మనస్తాపం చెందిన ఉద్యోగులు ఈ విషయాన్ని ఎస్ఈకి ఫిర్యాదు చేశారు. అదేసమయంలో 11 గంటల ప్రాంతంలో రెండు ఫీడర్లు డౌన్ కావడంతో వాటికి మరమ్మతులు నిర్వహించేందుకు స్థానిక విద్యుత్ సిబ్బంది నిరాకరించారు. ఈ విషయాన్ని ఎస్ఈ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అనంతరం విద్యుత్ సిబ్బంది మరమ్మతులు నిర్వహించి సరఫరాను పునరుద్ధరించారు. పోలీసుల దురుసు ప్రవర్తనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ శాఖ సేవలకు అడ్డుపడొద్దు: మంత్రి ఈ ఘటనలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సీరియస్ అయ్యారు. వెంటనే డీజీపీ మహేందర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ఎస్పీతో కూడా ఫోనులో మాట్లాడారు. విద్యుత్‌శాఖ అత్యవసర సర్వీస్ కిందికి వస్తుందని, ఆ శాఖ సేవలకు ఆటంకం కలిగించొద్దని మంత్రి సూచించారు. రాత్రింబవళ్లు పనిచేస్తున్న విద్యుత్ సిబ్బందిపై లాఠీచార్జ్ చేయడం సరి కాదని, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని, అదే సందర్భంలో లాక్డౌన్ నిబంధనలు కూడా కఠినంగా పాటించాలన్నారు. మితిమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి సీరియస్ కావడంతో ఎస్పీ రంగనాథ్ స్పందించి విద్యుత్ ఉద్యోగులను ఆపొద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. తీవ్రంగా ఖండిస్తున్నాం... 24 గంటలు పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులను విచక్షణారహితంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని 1104 జిల్లా కార్యదర్శి నిమ్మచెట్ల వెంకటయ్య అన్నారు. తమను ప్రభుత్వం ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించిందని చెప్పారు. -
Manchu Lakshmi: పోలీసులకు ‘మంచు’ లంచ్
బంజారాహిల్స్ (హైదరాబాద్): లాక్డౌన్ సమయంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు తనవంతు సాయం చేసేందుకు ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి ముందుకు వచ్చారు. ఫిలింనగర్‌లోని సీవీఆర్ న్యూస్ చౌరస్తా చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంచు లక్ష్మి వారంరోజుల నుంచి లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న 50 మంది పోలీసులకు లంచ్ పంపిస్తున్నారు. ఇంట్లో వంట మనిషితో 50 మందికి సరిపడా భోజనాన్ని తయారు చేసించి తన సిబ్బంది ద్వారా పంపిస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు, ట్రాఫిక్ పోలీసులు మంచు లక్ష్మి పంపించిన భోజనాన్ని తింటున్నారు. డ్యాన్సర్ల కోసం కదిలిన దంపతులు.. సినిమా, ఈవెంట్, ఇతర షోలలో పనిచేసే సుమారు వందమంది డ్యాన్సర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్‌తో పాటు ఆయన భార్య జ్యోతిరాజ్ ముందుకు వచ్చారు. వీరిద్దరు కలసి నిధుల సేకరణకు నడుం బిగించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ ప్రయత్నంలో తమకు సాయం చేయడమేకాక సంపూర్ణ మద్దతు ఇచ్చారని ఈ సందర్భంగా వారు తెలిపారు. కరోనా రోగుల కోసం రేణుదేశాయ్.. సినీనటి రేణుదేశాయ్ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలసి కరోనా రోగులకు తనవంతు సాయం చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు, కరోనా రోగులకు ఆహారం, మందులు తదితర అవసరాల కోసం ఆమెకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వివరాలు పంపిస్తే సహాయం చేస్తున్నారు. రోగి పేరు, ఆస్పత్రి పేరు, ఏ నగరం, ఎలాంటి సాయం కావాలో తెలుపుతూ ఫోన్ నంబర్లు పంపిస్తే చాలు.. ఆమె హైదరాబాద్, బెంగళూరు, చెన్నైనగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో తనవంతు సాయం అందిస్తున్నారు. గురువారం ఒక్కరోజే ఆమెకు 200 వినతులు వచ్చాయి. వాటన్నింటినీ పరిశీలించి ఎవరికి ఏం అవసరమో వాటిని జాబితా రూపొందించి సంబంధిత ఎన్జీవోలకు పంపిస్తుంటానని.. ఆయా సంస్థలవారు బాధితులకు సాయం అందజేస్తారని ఆమె తెలిపారు. -
20 వేల పోస్టుల భర్తీకి పోలీసు శాఖ సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: త్వరలో భర్తీ చేయబోయే కొలువుల కోసం పోలీసుశాఖ క్షేత్రస్థాయి ఏర్పాట్లు మొదలుపెట్టింది. శిక్షణ సమయంలో గతేడాది ఉత్పన్నమైన మైదానాల కొరతతో పాటు ఇతర సమస్యలను ఈసారి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) 2018లో 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 16,925 కానిస్టేబుల్ పోస్టులు, 1,503 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులున్నాయి. ఇందులో 9,213 మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు, 1,162 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లుకు జనవరి 17 నాటికి శిక్షణ ప్రారంభమైంది. కానీ, దాదాపు 4 వేల మంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కానిస్టేబుళ్ల శిక్షణలో తీవ్ర జాప్యం జరిగింది. ఈసారి అలాంటివి లేకుండా రాష్ట్ర పోలీసు శాఖ ముందుగానే పొరుగు రాష్ట్రాలపైన ఏపీ, కర్ణాటకతో సంప్రదింపులు మొదలుపెట్టింది. మన వద్ద పరిస్థితి ఇదీ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో పోలీసు శిక్షణ కోసం ఉన్న వనరులు కేవలం 6 వేల మందికి మాత్రమే సరిపోయేవి. కానీ, 2018 నోటిఫికేషన్ నాటికి వాటి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. ఏకంగా 12 వేలకుపైగా అభ్యర్థులకు ఒకేసారి శిక్షణ ఇచ్చేలా మౌలిక సదుపాయాలు కల్పించడంలో పోలీసుశాఖ సఫలీకృతమైంది. ఈసారి మైదానాలు, మౌలిక సదుపాయాల విషయంలో రాజీ పడకుండా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కర్ణాటక, ఏపీతో సంప్రదింపులు జరుపుతున్నా.. ఏపీ వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయి. ఈసారి 20 వేల పోస్టుల నేపథ్యంలో ఎలాగైనా ఏపీని ముందే సిద్ధం చేయాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. -
‘చలో రాజ్‌భవన్’ భగ్నం
సాక్షి, హైదరాబాద్: రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చేపట్టిన ‘చలో రాజ్‌భవన్’కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం రాజ్‌భవన్ వద్ద ధర్నా చేసేందుకుగాను పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ చేరుకున్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తోందంటూ కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిల నేతృత్వంలో నిరసనకు దిగారు. గాంధీభవన్ బయట పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించి ఉండటంతో నేతలు, కార్యకర్తలు గాంధీభవన్ ఆవరణలోనే చాలాసేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వీరంతా రాజ్‌భవన్ వె ళ్లేందుకు బయలుదేరి గాంధీభవన్ వెలుపల కు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు భట్టి, రేవంత్‌లతో పాటు మాజీ ఎంపీ వి.హనుమంతరావు, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యా దవ్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఫిరోజ్‌ఖాన్, టి.కుమార్‌రావ్, హర్క ర వేణుగోపాల్, ప్రేమ్‌లాల్, కిషన్, ఉజ్మా షాకేర్ తదితరులను అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఎం, డీజీపీలదే బాధ్యత... ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్ని స్తోందని విమర్శించారు. కర్ణాటక, మధ్యప్ర దేశ్ తరహాలోనే రాజస్తాన్‌లో కూడా ప్రజలె న్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నిస్తూ ప్రజాస్వామ్యాన్ని అçపహాస్యం చేస్తున్నారన్నారు. దీన్ని నిరసి స్తూ తమ పార్టీ దేశమంతటా ఆందోళనలు చేస్తోందని, కానీ మన రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోవడం దురదృష్టకరమన్నా రు. విపక్ష నేతలకు కేసీఆర్ కరోనాను అం టించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. -
వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి ఘటనపై కేసు
మేడిపల్లి: వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి సంఘటనలో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చెంగిచర్ల శ్రీనివాసకాలనీకి చెందిన అంగోతు హౌలీ కుమార్తె అంగోతు బేబీ (6) శనివారం ఉదయం ఇంటిముందు ఆడుకుంటుండగా కాలనీకి చెందిన వీధి కుక్కలు ఒక్కసారిగా దాడిచేసి తీవ్రంగా గాయపర్చాయి. కుటుంబసభ్యులు, స్థానికులు గాయపడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నగరంలోని నిలోఫర్ చిన్నారుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు ఆదివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పో లీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హత్యాచారం చేసింది ఆ నలుగురే
-
దిశ : చీకట్లోనే ఎదురు కాల్పులు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, నలుగురు నిందితుల ఎన్కౌంటర్ కేసులో ఎన్హెచ్ఆర్సీ బృందానికి షాద్‌నగర్, శంషాబాద్ పోలీసులు మంగళవారం పూర్తి వివరాలతో నివేదిక సమర్పించారు. నవంబర్ 27 నుంచి ఈ నెల 6 వరకు అసలేం జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు, ఆధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టుతో పాటు సమర్పించారు. ఇక నలుగురు నిందితులది నేరస్వభావమని, తమపై దాడి చేసి కాల్చబోయారని, దీంతో ఆత్మరక్షణ కోసం వారివైపు చీకట్లోనే ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పోలీసులు నివేదికలో పలు కీలక విషయాలు పొందుపరిచారు. గత నెల 27న రాత్రి 9.40 గంటలకు శంషాబాద్ (తొండుపల్లి) టోల్గేట్ వద్ద దిశను అపహరించిన మహమ్మద్ ఆరిఫ్, నవీన్, శివ, చింతకుంట చెన్నకేశవులు హత్యాచారం చేసినట్లు వివరించారు. ఘటన జరిగిన రోజు బాధితురాలితో మాట్లాడిన టోల్గేట్ సిబ్బంది, నిందితులు మాట్లాడిన పంక్చర్ షాపు, వైన్‌షాపు యజమానులు, లారీ ఓనర్ శ్రీనివాస్‌రెడ్డి, కొత్తూరు, నందిగామ పెట్రోల్ బంకు సిబ్బంది వంటి ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన వివరాలను పొందుపరిచారు. పోస్టుమార్టం నివేదికలు, సీసీ ఫుటేజ్‌లు దిశపై అత్యాచారం జరిగిందని నిరూపించేందుకు కావాల్సిన ఫోరెన్సిక్ రిపోర్టు, లారీలో సేకరించిన రక్తం నమూనాలు, ఇతర స్రావాలు, వెంట్రుకలు, నిందితుల డీఎన్ఏ ప్రొఫైలింగ్ రిపోర్టును పోలీసులు నివేదికకు జతపరిచారని సమాచారం. నిందితులు దిశను లారీలో తరలిస్తుండగా సేకరించిన వీడియో ఫుటేజ్‌లని కూడా పోలీసులు ఎన్హెచ్ఆర్సీ బృందానికి సమర్పించారు. ఇటు నిందితుల పోస్టుమార్టం రిపోర్టును కూడా జత చేశారు. కాల్పులు వచ్చిన వైపు ఫైరింగ్ చేశాం.. నలుగురు నిందితుల్లో ఇద్దరు మాత్రమే కాల్పులకు తెగబడితే నలుగురిపై ఎందుకు కాల్పులు జరిపారన్న విషయంపైనా పోలీసులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దిశ వస్తువులు చూపిస్తామంటూ చటాన్‌పల్లి వద్దకు తీసుకెళ్లిన తర్వాత ఆరిఫ్, చెన్నకేశవులు పోలీసుల వద్ద పిస్టళ్లు లాక్కుని శివ, నవీన్ తో కలసి బ్రిడ్జికి తూర్పువైపు పరుగులు తీశారన్నారు. తమపై నిందితులు కాల్పులు జరుపుతూ పరుగులు పెట్టారని తెలిపారు. తాము ఆత్మరక్షణ కోసం వారివైపు చీకట్లోనే ఎదురు కాల్పులు జరిపామన్నారు. నిందితుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాక.. తెల్లవారుజామున గాలించగా సమీపంలోని పొలంలో నలుగురు మరణించినట్లు గుర్తించామని, అంతే తప్ప ఎవరినీ గురి చూసి కాల్చలేదని వివరించారని తెలిసింది. ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు పోలీసులను ఎన్హెచ్ఆర్సీ బృందం సోమవారమే విచారించిన విషయం తెలిసిందే. పెట్రోల్ బంకు సిబ్బంది వాంగ్మూలం.. దిశ హత్యాచారం ఘటన జరిగిన 27వ తేదీ అర్ధరాత్రి ఆమె మృతదేహాన్ని తగులబెట్టేందుకు పెట్రోల్ కోసం కొత్తూరు, నందిగామ బంకుల వద్ద కు నిందితులు శివ, నవీన్ వెళ్లారు. దీనిపై సదరు బంకు సిబ్బందిని కూడా ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యులు విచారించారు. పెట్రోల్ కోసం ఎవరెవరు వచ్చారు? వచ్చింది వీరేనా? అని ఫొటోలు చూపించి ధ్రువీకరించుకున్నట్లు తెలిసింది. ఘటనా స్థలానికి విదేశీ మీడియా షాద్‌నగర్‌టౌన్ : దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి మంగళవారం విదేశీ మీడియా ప్రతినిధులు వచ్చారు. అమెరికాకు చెందిన ది న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులు షాద్‌నగర్ చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన దిశ దహనం, హంతకుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ది న్యూయార్క్ టైమ్స్ పత్రికకు చెందిన సౌత్ ఏసియా ప్రతినిధి జెఫ్రే గెటిల్‌మెన్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులు ఘటనా స్థలాలను పరిశీలించారు. ఘటనాస్థలి వద్ద వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. -
శాంతి భద్రతలు అదుపు తప్పాయి : భట్టి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పిందని, పోలీసు యంత్రాంగం ప్రజల కోసం పనిచేయడం లేదని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఒక్క హైదరాబాద్‌లోనే రెండేళ్లలో వేలమంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, రోజుకు ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. భట్టి అధ్యక్షతన గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలసి భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. దిశ ఘటన తమను తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆసిఫాబాద్, వరంగల్‌లో మహిళలపై జరిగిన ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న నిందితులకు ఉరిశిక్ష పడాలని అభిప్రాయపడ్డారు. మహిళలపై దాడులకు మద్యమే ప్రధానకారణంగా కనిపిస్తోందన్నారు. మద్యాన్ని నియంత్రించాలి మద్యం నియంత్రణ కోసం శనివారం ట్యాంక్‌బండ్ నుంచి రాజ్‌భవన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఆర్టీసీకి రూ.1000 కోట్లు కేటాయిస్తామని చెప్పి చార్జీల పెంపు పేరుతో ఆ భారాన్ని ప్రజలపై ఎందుకు మోపారో అర్థం కావడం లేదన్నారు. సీఎల్పీ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), పొడెం వీరయ్య (భద్రాచలం)లు గైర్హాజరయ్యారు. భట్టితో పాటు శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. -
ఘటనాస్థలికి ‘దిశ’ నిందితులు!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసులో బుధవారం సాయంత్రం నుంచి అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. ఇప్పటికే పోలీసుల నిర్లక్ష్యం జరిగిందంటూ విమర్శలు రావడంతో నిందితులను షాద్‌నగర్ కోర్టు కస్టడీకి ఇచ్చిన విషయాన్ని లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ విషయంలో షాద్ నగర్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, డీజీపీ కార్యాలయాలు అత్యంత గోప్యత పాటిస్తున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలు, ప్రచారంపై పోలీసులు ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు. నలుగురు నిందితుల కస్టడీపై తమకు కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. మొబైల్‌ను తవ్వి తీయించారు అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చర్లపల్లి జైలు నుంచి రహస్యంగా పోలీసులు తరలించారు. తొలుత తొండుపల్లి టోల్గేట్ ప్రాంతంలో ఘటనాస్థలానికి నిందితులను తీసుకెళ్లారు. అక్కడ లారీ నిలిపిన స్థలం, మద్యం తాగిన ప్రాంతాలను పరిశీలిం చారు. దిశను ముందు చూసిందెవరు? అత్యాచారం ఆలోచన ముందు ఎవరికి వచ్చింది?.. తదితర వివరాలు తెలుసుకున్నారు. పంక్చర్ చేసిందెవరు? స్కూటీ బాగు చేయించేందుకు ఏ షాప్‌కు వెళ్లారు? దిశను ఎత్తుకెళ్లిన ప్రాంతాన్ని నిందితులు పోలీసులకు చూపించారు. అత్యా చారం జరిగిన ప్రాంతానికి సమీపంలో పాతి పెట్టిన దిశ మొబైల్‌ను నిందితులతోనే తవ్వి తీయించారు. అక్కడి నుంచి దిశ మృతదేహాన్ని క్యాబిన్లో ఎలా వేసుకుని వెళ్లారు? ఎవరెవరు సాయం చేశారు? నవీన్, శివ పెట్రోల్ కొన్న బంకులు కూడా చూపించారు. ఇక షాద్‌నగర్ వైపు వెళ్లిన తర్వాత వెనక్కి రావడం, చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద మృతదేహాన్ని దహనం చేసేవరకు జరిగిన ఉదంతాన్ని నిందితులు పోలీసులకు కళ్లకు కట్టారు. శవాన్ని ఈడ్చుకెళ్లిన దుండగులు.. చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద లారీని నిలిపిన నిందితులు మృతదేహాన్ని క్యాబిన్ నుంచి దించారు. వారే మోసుకెళ్లి బ్రిడ్జి కింద ఒక మూలకు ఈడ్చుకెళ్లినట్లు పోలీసులకు వివరించినట్లు తెలిసింది. తొండుపల్లి వద్ద ఘటనాస్థలంలోనే దిశ చనిపోయినా.. ఇంకా దిశ బతికే ఉండొచ్చన్న అనుమానంతో ఆనవాళ్లు కూడా దొరక్కుండా వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో పాటు, లారీ నుంచి డీజిల్ తీసి దహనం చేసిన విధానాన్ని చూపారు. ఆ మంటల్లోనే దిశ సిమ్ కార్డులు వేసినట్లు వివరించారు. మరోసారి లారీ పరిశీలన చటాన్‌పల్లి నుంచి నేరుగా క్లూస్ టీం షాద్‌నగర్‌లో ఉన్న లారీ వద్దకు వెళ్లి మరోసారి ఆనవాళ్లు సేకరించింది. స్థానిక ఆర్టీసీ డిపోలో నిలిపి ఉంచిన లారీ క్యాబిన్లో ఆధారాలు సేకరించింది. రక్తపు మరకలు, వెంట్రుకలు, వేలిముద్రలు, బ్లాంకెట్ పోగులు తదితర ఆనవాళ్లు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో మొత్తం 50 మంది పోలీసులు పాలుపంచుకుంటున్నట్లు వినికిడి. మొత్తం 7 బృందాలను సీపీ సజ్జనార్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నలుగురు అదనపు ఎస్పీ స్థాయి అధికారులు ఈ బృందాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విభజించి దర్యాప్తు.. 20 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేయాలన్న గడువు విధించుకోవవడంతో.. కేసును విభజించి దర్యాప్తు చేస్తున్నారు. డీఎన్ఏ, శరీర స్రావాల విశ్లేషణ, ప్రత్యేక సాక్షుల నుంచి వివరాల సేకరణ, సాంకేతిక ఆధారాలైన సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఫుటేజీ, లారీ, వాహనాల టైర్ల మార్కుల సేకరణ, లీగల్ ప్రొసీడింగ్స్ ఇలా ప్రతి పనిని విభజించి ఆయా బృందాలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ ఏడు బృందాలకు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. కేసు వివరాలను ఎప్పటికపుడు సజ్జనార్ తెలుసుకుంటున్నారని సమాచారం. పైకోర్టుకు వెళ్లినా.. ఉరి పడాల్సిందే ఈ కేసులో ప్రత్యక్ష సాక్షుల కన్నా.. సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలే కీలకం కానున్నాయి. ఘటన జరిగిన ప్రాంతంలో మనుషుల సంచారం లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఘటనను నేరుగా చూసిన వారు లేకపోవడంతో ఈ కేసులో నిందితుల పాత్ర నిరూపించడం పోలీసులకు సవాలుగా మారింది. దిశ కేసు నేపథ్యంలో దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తుతుండటంతో తెలంగాణ పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దీంతో నిందితులకు ఉరిశిక్ష పడేలా.. పైకోర్టుకు వెళ్లినా.. శిక్షలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోకుండా అత్యంత పకడ్బందీగా సాక్ష్యాలు సేకరిస్తున్నారు. వరంగల్ కేసులా కాకుండా.. వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై లైంగికదాడి, హత్య కేసులో కూడా ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. కానీ, కేసులో నిందితుడి పాత్ర నిరూపించడంలో పోలీసులు సఫలమయ్యారు. తొలుత ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. అయితే నిందితుడు పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన కోర్టు.. అత్యంత అరుదైన కేసుల్లోనే ఉరి శిక్ష విధించాలంటూ.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ.. తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ‘దిశ’కేసును దర్యాప్తు చేస్తున్న బృందం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వరంగల్ పోలీసుల సలహాలు తీసుకున్నట్లు సమాచారం. దిశ కేసు అత్యంత అరుదైనది కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులు పైకోర్టుకు వెళ్లినా.. శిక్షలో మార్పు లేకుండా చూడాలన్న పట్టుదలతో పోలీసులు పనిచేస్తున్నారు. గొర్రెల కాపరి, కానిస్టేబుల్ సమయ స్ఫూర్తి.. బాధితురాలి మృతదేహం కాలిపోతుండగా చూసిన గొర్రెల కాపరి, అతడిచ్చిన సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి వెళ్లిన కానిస్టేబుల్ వెంటనే స్పందించడంతోనే పోలీసులు బాధితురాలిని గుర్తించడం సాధ్యమైంది. ఆధారాల సేకరణ కూడా వేగంగా జరిగింది. ఈ ఇద్దరూ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే దర్యాప్తు సాఫీగా సాగుతోందని చెప్పుకోవచ్చు. మాకెలాంటి ఆదేశాలు రాలేదు.. దిశ కేసు దర్యాప్తు విషయంలో గురువారం ఉదయం నుంచే రకరకాల కథనాలు, విశ్లేషణలు జరుగుతున్నా.. పోలీసులు మాత్రం తమకు కోర్టు నుంచి ఇంకా కస్టడీ ఆదేశాలు రాలేదని స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఈ విషయంలో వివరణ అడిగేందుకు మీడియా ప్రతతినిధులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. -
పోకిరీల లెక్కతీయండి..
సాక్షి, హైదరాబాద్ : గ్రామాల్లో జులాయిగా తిరిగే పోకిరీల డేటా పోలీసుల వద్దకు చేరనుంది. అమ్మాయిలను వేధించే ఆకతాయిల జాబితా ఇకపై ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ‘దిశ’ఘటన దరిమిలా మహిళల భద్రత, రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పోకిరీల డేటా సేకరించనున్నారు. పట్టణాలతో పా టు గ్రామాల్లో పనీపాటా లేకుండా తిరిగేవారిపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. మహిళలపై వేధింపులకు సంబం ధించిన కేసుల్లో అధిక శాతం నిందితులు పనీపాటా లేనివారే కావడం గమనార్హం. ఎస్‌హెచ్‌జీలకు శిక్షణ... మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు.. సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం స్వయం సహాయక గ్రూపు(ఎస్‌హెచ్‌జీ)ల్లోని మహిళకు చట్టాలు, సైబర్ క్రైమ్, లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, పోలీసులను ఎలా సంప్రదించాలి.. తదితర సమస్యలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వీరు పాఠశాలలు, కాలేజీల్లో మహిళా రక్షణపై విద్యార్థులను చైతన్యం చేయనున్నారు. వీరికి షీటీమ్స్, పోలీసు కళాబృందాలు తోడవనున్నాయి. విద్యాసంస్థలే కాదు, కార్యాలయాలు, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించనున్నారు. పాఠ్యాంశాల్లోనూ మార్పులు.. మహిళా భద్రత కోసం సమాజం ఆలోచ నల్లో మరింత మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాలికలపై వివక్షను రూపుమాపడం, లింగ సమా నత్వం సాధించడానికి స్కూలు పాఠ్యాంశాల్లో కొత్త అంశాలు చేర్చాలని నిర్ణయించారు. అమ్మాయిలను వేధిస్తే తలెత్తే పరిణామాలు, చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడతాయో వివరించేలా పాఠ్యాంశాలు రూపొందించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ మేరకు మార్పులు చేయాలని భావిస్తోంది. -
నెట్ లేకున్నా ఎస్ఓఎస్..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర పోలీసు విభాగం హాక్–ఐలో కీలక మార్పు చేసింది. మొబైల్ డేటా అందుబాటులో లేని/ఆన్‌లో లేని సందర్భాల్లో ఎస్ఓఎస్ను సమర్థంగా వినియోగించుకునేలా డయల్–100కు అనుసంధానం చేసింది. ఈ అప్డేటెడ్ ఆండ్రాయిడ్ వెర్షన్ బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిందని పోలీసు విభాగం పేర్కొంది. హాక్–ఐ యాప్ వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు పోలీసులు సోషల్ మీడియా, ఎస్ఎంఎస్లు, పలు క్యాబ్‌లపై ఉంటున్న ప్రకటన బోర్డుల్నీ వాడుతున్నారు. ఫలితంగా దీన్ని ప్రజలు భారీ సంఖ్యలో డౌన్లోడ్ చేసుకున్నారు. ఆఫ్‌లైన్‌లో ఇలా... బుధవారం నుంచి అందుబాటులోకొచ్చిన ఈ వెర్షన్ ప్రకారం.. మొబైల్ డేటా లేనప్పు డు బాధితులు ఎస్ఓఎస్ బటన్ నొక్కితే అది ఫోన్ కాల్‌గా మారి ‘డయల్–100’కు చేరుతుంది. అక్కడి సిబ్బంది సదరు బాధితురాలు/బాధితుడు ఉన్న ప్రాంతాన్ని తెలుసుకుంటారు. ప్రతి గస్తీ వాహనానికీ జీపీఎస్ ఉండటంతో ‘100’ సిబ్బందికి ఏ వాహనం ఏ ప్రాంతంలో ఉందో కంప్యూటర్ తెరపై కచ్చితంగా తెలుస్తుంది. దీంతో బాధితుడు ఉన్న ప్రాంతానికి సమీపంలో ఉన్న వాహనానికే నేరుగా ఆ ఫోన్‌కాల్‌ను డైవర్ట్ చేస్తారు. ఈ వ్యవహారం మొత్తం కొన్ని సెకన్ల వ్యవధిలో పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. -
రౌడీషీటర్లపై ‘నయా’ నిఘా
సాక్షి, సిటీబ్యూరో: ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న నగర పోలీసులు రౌడీషీటర్ల కదలికలపై సరికొత్త పర్యవేక్షణ వ్యవస్థను గురువారం అందుబాటులోకి తీసుకొచ్చారు. టీఎస్‌కాప్ అప్లికేషన్లో చేర్చిన ‘రౌడీ షీటర్స్ మాడ్యూల్’ బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. ఠాణాల వారీగా రౌడీషీటర్ల పేర్లతో కూడిన డేటాను ప్రతి పోలీసు అధికారికి అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఫీల్డ్ ఆఫీసర్లు తమ యూజర్‌నేమ్‌తో లాగిపై రౌడీ షీటర్ల డాటాను తనిఖీ చేయవచ్చని, వారి ఫొటో లు కూడా అందుబాటులో ఉండటంతో ఏ సందర్భంలోనైనా గుర్తించే అవకాశం ఉందన్నారు. వారి నేరచరిత్ర పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటు ందని తెలిపారు. ఈ రౌడీషీటర్స్ మాడ్యూల్ వల్ల పెట్రోల్ కార్లు, బ్లూకోల్ట్స్ వారు ఉంటున్న చిరునామాలకు వెళ్లడంతో పాటు వారి కదలికలపై నిఘా ఉంచి వారి జియో–టాగ్ లోకేషన్ మ్యాప్‌లో పొందుపరచవచ్చన్నారు. జోన్లు, పోలీసు స్టేషన్ల వారీగా నివేదికలు పొందుపరిచిన టీఎస్‌కాప్ డ్యాష్‌బోర్డును సీనియర్ పోలీసులు పర్యవేక్షించవచ్చని సీపీ పేర్కొన్నారు. కంప్యూటర్లు, ప్రింటర్ల పంపిణీ... నగర పోలీసు కమిషనరేట్ వ్యాప్తంగా ఈ–గవర్నెన్స్ అమలు చేస్తుండటంతో పోలీసు స్టేషన్లకు కంప్యూటర్లు, ప్రింటర్లను సీపీ అంజనీకుమార్ ఆయా అధికారులకు పంపిణీ చేశారు. ఆయా విభాగ సిబ్బంది ప్రతిపాదనల మేరకు 157 కంప్యూటర్లు, 35 ప్రింటర్లను అందజేశారు. ఈ 157 కంప్యూటర్లలో లా అండ్ అర్డర్ పోలీసు స్టేషన్లకు 65, ఏసీపీలకు 14, మెయిన్ పీసీఆర్‌కు 10 కంప్యూటర్లు అందించారు. మిగిలిన కంప్యూటర్లను ట్రాఫిక్, సిటీ సెక్యూరిటీ వింగ్, కార్ హెడ్‌క్వార్టర్స్, సీసీఎస్, స్పెషల్ బ్రాంచ్‌లకు అందించారు. కార్యక్రమంలో క్రైమ్స్ అండ్ సిట్ అడిషనల్ సీపీ శికా గోయల్, లా అండ్ అర్డర్ అడిషనల్ సీపీ డీఎస్ చౌహన్, ఎస్బీ జాయింట్ సీపీ తరుణ్ జోషి, అన్ని జోన్ల డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
డేటా చోర్‌పై నిఘా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల ప్రజల వ్యక్తిగత డేటా చోరీలో కీలక సూత్రధారిగా ఉన్న డాకవరం అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన వెలుగు చూసిన రెండు నెలల నుంచి అతను అజ్ఞాతంలోనే ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ సిట్ బృందం అశోక్ జాడను గుర్తించడం కోసం రంగంలోకి టీమ్‌లు దింపిన క్రమంలో అతని స్వస్థలం అల్లూరులో మళ్లీ అలజడి రేగింది. అశోక్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో అతని మూలాలపై జిల్లాలో చర్చ సాగుతోంది. అనతి కాలంలలో బడా వ్యక్తిగా ఎదగడం వెనుక రాజకీయంగా జిల్లాలో ఎవరి సహకారం ఉంది. స్థానికంగా సహకరిస్తున్నది ఎవరనే దానిపై జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ప్రజల ఆధార్ కార్డులతో పాటు వ్యక్తిగత డేటా చోరీ చేసిన డాకవరం అశోక్ కావలి నియోజకవర్గం అల్లూరుకు చెందిన వ్యక్తి. సాధారణ రైతు కుటుంబం నుంచి అనతి కాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తాడు. ముఖ్యంగా అశోక్ ఆర్థికంగా స్థిరపడిన తర్వాత జిల్లాలో పొలాలు భారీగా కొనుగోలు చేశాడు. అశోక్ తల్లిదండ్రులు, కుటుంబ నేపథ్యం, బీద సోదరులతో ఉన్న సంబంధాలు తదితర అంశాలపై చర్చ సాగుతోంది. రాష్ట్రంలోని ఓటర్ల ఆధార్ డేటాతో పాటు వ్యక్తిగత వివరాల డేటాను నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా లిమిటెడ్ తస్కరించిదనితెలంగాణ సిట్ బృందం నిర్ధారించి కేసు నమోదు చేశారు. దాదాపు రెండు నెలల క్రితం కేసు నమోదైంది. ఎన్నికల నోటిఫికేషన్ రావడ, ఎన్నికల ప్రక్రియ జరగటంతో పోలీసులు కేసును పక్కన పెట్టారు. తాజాగా ఎన్నికలు ముగిసిపోవడంతో ఆధార్ డేటా వ్యవహారం తెరపైకి రావడంతో అశోక్ కోసం అన్వేషణ మొదలైంది. ముఖ్యంగా అశోక్ గడిచిన నాలుగు నెలల కాలంలో జిల్లాకు వచ్చారా? అనే దానిపై పోలీసుల నుంచి ప్రాథమిక సమాచారం సేకరించినట్లు సమాచారం. వాస్తవంగా గతంలో అశోక్ ఏటా మూడు నాలుగు సార్లు అల్లూరుకు వచ్చి వెళ్తుండేవాడు. గడిచిన నాలుగు నెలలుగా జిల్లాకు రాలేదని ప్రాథకంగా నిర్ధారించారు. అల్లూరులో అశోక్ బంధువులు, సన్నిహితులు ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. బీద టూ నారా లోకేష్ అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన బీద సోదరుల సహకారంతో సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్‌కు అశోక్ సన్నిహితుడుగా మారాడు. టీడీపీకి సంబంధించిన సేవా మిత్ర యాప్‌ను అశోక్ సంస్థే రూపొందించింది. అల్లూరుకు చెందిన డాకవరం బుజ్జయ్య కుమారుడు అశోక్. కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా గెలిచిన బుజ్జయ్య మండలంలో ఉప్పు సాగు చేసే సాధారణ రైతు. ఆర్థికంగా నష్టపోయాడు. ఈక్రమంలో బుజ్జయ్య కుమారుడు అశోక్ కు టీడీపీ నాయకులైన బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రతో సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో బుజ్జయ్య కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరాడు. అశోక్ అల్లూరులో ఇంటర్మీడియట్, కర్ణాటకలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. కొత్త టెక్నాలజీ పేరుతో బీద రవిచంద్ర ద్వారా సీఎం చంద్రబాబునాయుడ్ని, ఆయన కుమారుడు లోకేష్‌ను కలిశారు. తద్వారా కొద్ది నెలలకే వారికి సొంత మనిషిగా మారిపోయాడు. దీనికి టీడీపీ నేతలుగా ఉన్న బీద సోదరులు వారధిగా నిలిచారు. పదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ‘ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థను ప్రారంభించాడు. లోకేష్ మంత్రిత్వ శాఖలోని విభాగాలకు సంబంధించి సాంకేతిక సహకారం అందించే యాప్‌లను కూడా ఇదే సంస్థ డెవలప్ చేసింది. ప్రధానంగా ఏపీ ప్రభుత్వ యాప్, పంచాయతీరాజ్ విభాగం, డ్రిప్ ఇరిగేషన్, గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్య విభాగం తదితర ప్రభుత్వ వైబ్‌సైట్లతో పాటు వాటికి సంబంధించి సాంకేతిక సహకారం వీరే అందిస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీకి ‘సేవామిత్ర’ అనే యాప్‌ను తయారు చేసి, ఈ యాప్‌ను టీడీపీ నాయకుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లలో పని చేసే విధంగా సాంకేతికతను తయారు చేశారు. -
బీ అలర్ట్ ; సకల నేరస్తుల సమగ్ర సర్వే రేపే..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే గుర్తుందికదా! ఎక్కడెక్కడి జనం ఆయా ఊళ్లకు తరలివెళ్లగా, అధికారులు వచ్చి పేర్లు, వివరాలు నమోదుచేసుకుని, టెక్నాలజీ సాయంతో భద్రపర్చారు. సరిగ్గా అలాంటి సర్వేనే నేరస్తుల కోసం ప్రత్యేకంగా చేపట్టనుంది రాష్ట్ర పోలీసు శాఖ. ‘సకల నేరస్తుల సమగ్ర సర్వే’ పేరుతో జనవరి 18న(గురువారం) ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ సహా 31 జిల్లాల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు : జనవరి 18న జరుగనున్న సకల నేరస్తుల సమగ్ర సర్వేలో డీజీపీ నుంచి కానిస్టేబుల్ దాకా అన్ని హోదాల్లో పనిచేస్తున్నవారు భాగంపంచుకుంటారని పోలీస్ బాస్ చెప్పుకొచ్చారు. ఆయా స్టేషన్ల పరిధిలో 10ఏళ్ల నాటి నేరస్తుల పూర్తి వివరాలను సేకరించనున్నారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడంలో భాగంగా వారి తాజా ఫోటోలతోపాటు వేలిముద్రలను తీసుకోనున్నారు. అంతేకాదు, వారు నివసిస్తోన్న ఇళ్లను పోలీస్ శాఖ వెబ్‌సైట్‌కు జియోట్యాగింగ్ చేయనున్నారు. ఎందుకీ సర్వే?: తెలంగాణను నేరరహిత (క్రైమ్ ఫ్రీ) రాష్ట్రంగా మార్చాలనే తలంపుతో ప్రభుత్వం పలు ప్రణాళికలను రూపొందించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవడం అందులో ఒకటి. గ్రేటర్ సహా ఆయా జిల్లాల్లో నేరస్తుల కదలికలపై నిఘా ఉంచితే.. కొంతమేరలో కొత్త నేరాలకు అడ్డుకట్టవేయొచ్చన్నది పోలీసుల భావన. అందులో భాగంగానే తెలంగాణ పోలీస్ శాఖ జనవరి 1న టీఎస్-కాప్ యాప్‌ను ప్రారంభించింది. ఆ యాప్‌లో అనేక విషయాలకు సంబంధించిన ఆప్లికేషన్స్ పొందుపర్చారు. గురువారం చేపట్టనున్న సర్వేలో వెల్లడయ్యే అంశాలను కూడా యాప్‌లో పొందుపరుస్తారు. -
తెలంగాణ పోలీసు శాఖకు ఐదు అవార్డులు
హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకమైన ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఫిక్కీ నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర పోలీసు శాఖ చేస్తున్న పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు స్మార్ట్ వెరిఫికేషన్ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఫిక్కీ చైర్మన్ వైకే మోడీ చేతుల మీదుగా డీజీపీ అనురాగ్ శర్మ గురువారం అందుకున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు కీలక కృషి చేస్తున్న హైదరాబాద్ కమిషనరేట్‌లోని సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మరో అవార్డు దక్కింది. ఈ అవార్డును సైబర్ క్రైం ఏసీపీ రఘువీర్ అందుకున్నారు. స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ కేటగిరీ కింద హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డికి దక్కింది. ఈ అవార్డును హైదరాబాద్ అదనపు కమిషనర్ మురళీ కృష్ణ స్వీకరించారు. రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తానికి స్మార్ట్ ఇన్నొవేటివ్ పోలీసింగ్ కింద స్పెషల్ జ్యూరీ అవార్డు, ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ అండ్ నెట్వర్క్ సిస్టం ప్రాజెక్ట్‌కు సూర్యాపేట ఎస్పీ పరిమళ హనా నూతన్ మరో అవార్డు సొంతం చేసుకున్నారు. కార్యక్రమానికి శాంతి భద్రతల ఇన్చార్జి ఐజీ రమేశ్‌రెడ్డి హాజరయ్యారు. ఏపీ పోలీస్ శాఖ కూడా రెండు అవార్డులు సొంతం చేసుకున్నట్లు ఫిక్కీ తెలిపింది.