నిజామాబాద్: సినిమా రేంజ్‌లో పోలీసుల ఛేజింగ్‌.. దొంగలపై కాల్పులు | TS Police Gun Fired On Thief Gang At Nizamabad District | Sakshi
Sakshi News home page

నిజామాబాద్: సినిమా రేంజ్‌లో పోలీసుల ఛేజింగ్‌.. దొంగలపై కాల్పులు

Published Mon, May 29 2023 1:58 PM | Last Updated on Mon, May 29 2023 2:05 PM

TS Police Gun Fired On Thief Gang At Nizamabad District - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌లో సోమవారం దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇందల్వాయి మండలం జాతీయ రహదారిపై దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారు పారిపోతుండగా దొంగలపై కాల్పులు జరిపారు. 

వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాపు కాశారు. ఈ క్రమంలో దొంగల ముఠా.. పోలీసుల కారును ఢీకొట్టి పారిపోయింది. దీంతో, వారిని పట్టుకునేందుకు పోలీసులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. కాగా, ఈ దొంగల ముఠా.. జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్‌ వైర్లను దొంగలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారు. 

ఇది కూడా చదవండి: పెను విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement