
నిజామాబాద్: కారులో డెడ్ బాడీని తీసుకెళ్తున్న ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారు ఆపకుండా ముందుకు వెళ్లిపోయింది. అది కూడా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ పోలీసులను దాటేసిందా కారు. అయితే అసలు కారును ఆపకుండా వెళ్లిపోవడంపై పోలీసులకు అనుమానం వచ్చింది.
దీంతో ఆ కారును ఛేజ్ చేశారు. కారును వెంబడించి దాస్ నగర్ శివారులో నిజాం సాగర్ కెనాల్ పద్ద పట్టుకున్నారు. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని అనుమానించి ఆరా తీశారు. ఎంతకీ పెదవి విప్పకపోవడంతో కారు డిక్కీని ఓపెన్ చేసి చూసిన పోలీసులు షాక్ అయ్యారు. డిక్కీలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని రాజేష్ గా గుర్తించిన పోలీసులు.. మృతురాలు కమలగా గుర్తించారు.