Heroine Dimple Hayathi Car Gets Three Traffic Challans Last Week, Deets Inside - Sakshi
Sakshi News home page

Dimple Hayathi: డింపుల్‌ హయాతిపై కేసు.. కారుపై ట్రాఫిక్ చలాన్లు!

Published Tue, May 23 2023 3:12 PM | Last Updated on Tue, May 23 2023 4:18 PM

Heroine Dimple Hayathi Car Gets Three Traffic Challans Last Week - Sakshi

రామబాణం ఫేం డింపుల్‌ హయాతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వివాదం సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్‌తో పాటు తన స్నేహితుడు డేవిడ్‌పై క్రిమినల్‌ కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును కారుతో ఢీకొట్టి ధ్వంసం చేశారని డీసీపీ డ్రైవర్ జూబ్లిహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పోలీసులకు సమర్పించాడు.

(ఇది చదవండి: హీరోయిన్‌ డింపుల్‌ హయాతిపై క్రిమినల్‌ కేసు నమోదు)

అయితే ఈ వ్యవహారంలో మరో కొత్త కోణం బయటకొచ్చింది. హీరోయిన్ డింపుల్ హయాతి కారుకు పోలీసులు వరుసగా చలాన్లు విధించినట్లు తెలుస్తోంది. అయితే డీసీపీ ఉద్దేశపూర్వకంగానే చలాన్లు వేశారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.  ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ కేసుపై డింపుల్‌ హయాతి పరోక్షంగా స్పందించారు. అధికారాన్ని ఉపయోగించి తప్పులను కప్పిపుచ్చుకోలేరని ట్వీట్‌ చేసింది.

డీసీపీ రాహుల్‌ హెగ్డేనే తనకున్న అధికారంతో తప్పుడు కేసులు పెట్టించారని డింపుల్‌ పరోక్షంగా చెప్పుకొచ్చింది. 

(ఇది చదవండి: చెన్నైలో శరత్‌బాబు అంత్యక్రియలు..పిల్లలు లేకపోవడంతో)

అసలేం జరిగిందంటే?

హైదరాబాద్‌లోని  జర్నలిస్ట్ కాలనీలో ఐపీఎస్‌ అధికారి రాహుల్ హెగ్డే నివాసం ఉటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో డింపుల్‌ హయాతి తన స్నేహితుడు డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు. రాహుల్ హెగ్డేకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని ఆయన డ్రైవర్‌ చేతన్‌ కుమార్‌ అదే అపార్టమెంట్‌లోని సెల్లార్‌లో పార్కింగ్‌ చేశాడు. ఆ వాహనం పక్కనే డింపుల్‌ హయాతి కూడా తన వాహనాన్ని పార్కింగ్‌ చేస్తుంది. . దీనిపై వారికి ప‌లు మార్లు గొడ‌వైంది.అయితే తాజాగా డింపుల్ స‌ద‌రు ఆఫీస‌ర్ కారుని ఉద్దేశ‌పూర్వ‌కంగా ఢీ కొట్ట‌డంతో పాటు కాలితో తంతూ గొడ‌వ చేసింది. అక్క‌డున్న డ్రైవ‌ర్‌తోనూ ఆమె గొడ‌వ ప‌డింది. దీంతో ఐపీఎస్ ఆఫీస‌ర్ జూబ్లీ హిల్స పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement