traffic challan
-
సార్.. నా బైక్ పల్సర్ 150 సీసీ.. చలాన్ వచ్చింది 220 సీసీకి..
సిరిసిల్లక్రైం: తాను రోడ్డు నిబంధనలు అతిక్రమించకుండానే తన ఫోన్‌కు మెస్సేజ్ రావడంతో కంగుతిన్నాడు సిరిసిల్లకు చెందిన వ్యక్తి. తన బైక్ నంబర్‌ను మరో వాహనదారుడు తన బండికి వేసుకొని ఇష్టారీతిగా తిరుగుతుండడంతో జరిమానాల మీద జరిమానాలు వచ్చి పడుతుండడంతో అసలు యజమాని లబోదిబోమంటున్నాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన మోబిన్ తన వాహనాన్ని భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. శనివారం తన బైక్ నిబంధనలు అతిక్రమించినట్లు ట్రాఫిక్ చలాన్ వచ్చింది. దీన్ని ఓపెన్ చేసి చూడగా తంగళ్లపల్లి మండలం తాడూరు ఎక్స్ రోడ్ వద్ద హెల్మెట్ లేకపోవడంతో చలాన్ విధించినట్లు మెసేజ్ ఉంది. అసలు తాను అక్కడికి వెళ్లలేదని తన వాహనం పల్సర్ 150 సీసీ కాగా.. చలాన్ వచ్చిన వాహనం పల్సర్ 220 సీసీ అని పేర్కొన్నారు. పోకిరీలు కావాలని తన బైక్ నంబర్‌ను వారి వాహనానికి బిగించుకొని జిల్లాలో తిరుగుతున్నారని పేర్కొన్నాడు. ఇలాంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నాడు. -
చలాన్లలో ట్రిపుల్ సెంచరీ..!
బెంగళూరు:నగరంలో ఓ స్కూటరిస్టు సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ట్రిపుల్ సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు. అయితే ఈ ట్రిపుల్ సెంచరీ క్రికెట్ ఆటలో కొట్టింది కాదు.ట్రాఫిక్ ఉల్లంఘనల్లో సాధించింది.కలసిపాల్య ప్రాంతానికి చెందిన పెరియస్వామి ఏకంగా 311సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి నగరంలోనే అత్యధిక ఉల్లంఘనల చలాన్లు పొందిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు.ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేస్తున్న పెరియస్వామి స్కూటర్‌ను అతడే కాక అతడి బంధువులు ఇద్దరు ముగ్గురు తరచుగా నడపుతుంటారు.స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడడం, హెల్మెట్ లేకపోవడం, జీబ్రా క్రాసింగ్ మీద బైక్ ఆపడం లాంటి ఉల్లంఘలనకు పాల్పడ్డారు.అయితే 311 చలాన్లు జారీ చేసినప్పటికీ పెరియస్వామి నుంచి జరిమానా వసూలు చేయడంపై మాత్రం ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టలేదు.అయితే ఓ నెటిజన్ షిబమ్ పెండింగ్ చలాన్ల విషయాన్ని స్క్రీన్‌షాట్ తీసి ఎక్స్(ట్విటర్)లో పెట్టారు.దీంతో ఈ విషయం సోషల్‌మీడియా హాట్‌టాపిక్‌గా మారింది.సోషల్‌మీడియాలో ఈ వివాదంపై చర్చ మొదలవడంతో సిటీ మార్కెట్ పోలీసులు పెరియస్వామి ఆఫీసుకు వెళ్లారు. చలాన్ల విషయం చెప్పారు. దీనికి షాక్‌కు గురైన పెరియస్వామి తొలుత కొంత మొత్తం చెల్లిస్తానని, తర్వాత మిగిలిన మొత్తం చెల్లిస్తానని చెప్పారు.జరిమానాలన్నీ కలిపి లక్షా 50 వేలు దాటడంతో స్కూటర్‌ను పోలీస్‌స్టేషనలో వదిలేస్తే బెటరని పెరియస్వామికి సలహా ఇవ్వడం విశేషం. -
లడ్డూలిస్తా వదిలేయండి సార్.. చలాన్‌కు లడ్డూ లంచమా?!
ట్రాఫిక్, పోలీసులు అనగానే, ట్రాఫిక్ సిగ్నల్ జంప్, నిబంధనలను ఉల్లంఘన, చలాన్లు ఇవన్నీ గుర్తొస్తాయి కదా.. కానీ పెళ్లి, పెళ్లికూతురు, లడ్డూలు ఇలాంటివేమీ అస్సలు ఊహించం కదా. పంజాబ్‌లో ఇలాంటి అసాధారణ సంఘటన ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.పెళ్లి అంటేనూరేళ్ల పంట. ఆ అందమైనక్షణాలను కలకాలం గుర్తుండిపోయేలా పదిలపర్చుకోవాలని అందరూ భావిస్తారు. ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ దగ్గర్నుంచి హనీమూన్ దాకా ప్రతీదీ స్పెషల్‌గా ప్లాన్ చేసుకుంటారు. ఇందులో చిన్న చిన్న సర్‌ప్రైజ్‌ల వరకూ ఉంటాయి. మరికొన్ని వివాహాలలో మాంసాహారం లేదనో, వండ లేదనీ, మర్యాదలు బాగా జరగలేదు లాంటి ఆవేశకావేశాలు, కోపతాపాలు కామన్‌గా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆంచల్ అరోరాకు ఊహించని అనుభవం ఎదురైంది. పెళ్లి, హల్దీ వేడుక హడావిడిలో ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేసేసింది. ఇది కాస్త పోలీసు (పంజాబీ) అధికారుల కంటబడింది. ఊరుకుంటారా మరి.. ట్రాఫిక్ ఉల్లంఘన అంటూ కారు ఆపారు. ఇక్కడే ఆసక్తికరమైన సంఘటన జరిగింది.దీంతో హల్దీ వేడుక ముస్తాబులో ఉన్న ఆంచల్.. చిరునవ్వుతో అధికారులను పలకరిస్తూ, "మేరీ హల్దీ హై, జాన్ దో (ఇది నా హల్దీ వేడుక, దయచేసి నన్ను వెళ్లనివ్వండి.)" అని వేడుకుంది.ఇది విన్న పోలీసుల మనసు కరిగింది. సరే పెళ్లి కదా అనుకొని ఆమెను వెళ్లనివ్వాలని ఎంచుకున్నారు. చలాన్ రద్దు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి.. సరే.. కాస్త నోరు తీపి చేసి పోరాదా (ముహ్ మిథా కర్కే జానా”) అని అడిగారు సరదాగా. తప్పకుండా “లడ్డూ కా డబ్బా పక్కా” అని బదులిచ్చింది. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల పువ్వులయ్యారు. షాదీ ముబారక్ చెప్పి ఆశీర్వాదాలు అందిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయారు అధికారులు. దీనికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. అంతేకాదు అదే పెళ్లి కొడుకు అయితే పరిస్థితి వేరేలా ఉండేది అంటూ నెటిజన్లు కామెడీగా స్పందించారు. లడ్డూ లంచం అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘అదే అబ్బాయైతే.. పొట్టు పొట్టు కొట్టేవాళ్లు..("అభి లడ్కా హోతా తో నంగా కర్కే మార్తా యూజ్") పెళ్లి కొడుకైతే చలానా పక్కా ఇచ్చేవాళ్లు అంటూకే కా బ్యా హోతా తో.. పక్కా చలాన్ థా.") అంటూ కమెంట్ చేయడంతో మరికొంతమంది కూడా హా .. అవును అంటూ స్పందించడం విశేషం. View this post on Instagram A post shared by Jist (@jist.news) -
అలర్ట్: నేటి అర్ధరాత్రితో ముగియనున్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల గడువు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాహనాల పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు నేటితో(గురువారం) ముగియనుంది. రాత్రి 11.59 గంటలకు డిస్కౌంట్ ఆఫర్ గడువు ముగియనుంది. ఈ గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన విషయం తెలిసిందే. మొదట జనవరి 10ని ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్‌కు చివరి తేదీగా నిర్ణయించగా.. ఆ తరువాత జనవరి 31 వరకు, మరోసారి ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. ఆ గడువు నేటితో ముగియనుంది. అయితే మరోసారి గడువు పెంచే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కోటి 66 లక్షల పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌తో రూ.147 కోట్లు వసూలు అయినట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 కోట్ల 59 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా.. ఇప్పటిరకు కోటి 66 లక్షల కేసులు క్లియర్ అయినట్లు పేర్కొన్నారు. 47 శాతం కేసులు క్లియర్ కాగా.. ఇంకా 53 శాతం పెండింగ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. చదవండి: శివ బాలకృష్ణ సోదరుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు -
స్కూటర్‌పై రూ.3.20 లక్షల చలానాలు
కర్ణాటక: ఒక స్కూటర్‌పై వందలాది ట్రాఫిక్ చలానాలు ఉన్నాయి, మొత్తం జరిమానాలను లెక్కిస్తే రూ. 3.20 లక్షలుగా తేలింది. హెల్మెట్ లేకుండా, సిగ్నల్ జంప్, వన్‌వేలో, మొబైల్లో మాట్లాడుతూ తదితర ధిక్కారాలకు పాల్పడడం వల్ల ఈ చలానాలు పడ్డాయి. వివరాలు.. సుధామనగరవాసి వెంకటరామన్‌కు చెందిన కేఏ 05 కేఎఫ్ 7969 నంబరు కలిగిన యాక్టివా స్కూటర్ ఈ ఘనతను సాధించింది. దీనిపై 300 కు పైగా చలానాలు ఉండగా, వాటిని కట్టాలంటే రూ.3.20 లక్షలు కావాలి. స్కూటర్ వద్దు, డబ్బు కట్టు వెంకటరామన్ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఎస్ఆర్నగర, విల్సన్గార్డెన్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో యథేచ్ఛగా తిరిగేవాడు. ట్రాఫిక్ పోలీసులు అతని ఇంటికి వెళ్లి జరిమానాలను చెల్లించాలని సూచించారు. దీనికి వెంకటరామన్ ఇంత మొత్తంలో డబ్బు కట్టలేనని, స్కూటర్‌ను తీసుకెళ్లవచ్చని చెప్పాడు. మాకు స్కూటర్ వద్దు, డబ్బు కట్టు, లేదంటే కేసు పెడతామని పోలీసులు హెచ్చరించి నోటీస్ ఇచ్చారు. గతేడాది రూ.3.22 లక్షలు గతంలో ఆర్టీ.నగరలోని గంగానగరలో ఒక స్కూటీ పెప్పై 2023 డిసెంబరులో రూ.3.22 లక్షల జరిమానాలు ఉన్నట్లు తేలింది. మాలా అనే మహిళకు చెందిన స్కూటీ పై 643 చలానాలు ఉన్నాయి. రూ.50 వేల కంటే అధిక జరిమానా ఉంటే ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల ఇళ్లకు వెళ్లి జరిమానా వసూలు చేస్తున్నారు. -
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన హీరో విజయ్.. చలానా వేసిన పోలీసులు
కోలీవుడ్ స్టార్ విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడని కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. విజయ మాటతీరు, అతడి వ్యవహార శైలి కూడా ఈ పుకార్లకు ఆజ్యం పోస్తోంది. ఇటీవల తమిళనాడులో పదో తరగతి, ప్లస్ 1, ప్లస్ 2 తరగతుల్లో మెరుగైన ఫలితాలు రాబట్టిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పనైయూరులోని కార్యాలయానికి ఆహ్వానించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించి సత్కరించాడు విజయ్. ఈ సందర్భంగా ఓటుకు నోటు విధానం మంచిది కాదని సూచించాడు. తాజాగా మంగళవారం ఉదయం తన అభిమాన సంఘ నిర్వాహకులను, కార్యకర్తలను చైన్నెలోని తన కార్యాలయంలో కలిశాడు. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లోనూ జరుగుతున్న పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించినట్లు సమాచారం. అలాగే రాజకీయ పరిణామాల గురించి సైతం మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ భేటీ ముగిసిన తర్వాత విజయ్ తన కారులో ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో ట్రాఫిక్ సిగ్నల్‌ను లెక్కచేయకుండా వెళ్లిపోయాడు. రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ కారును అలాగే ముందుకు పోనివ్వడంతో ట్రాఫిక్ పోలీసులు రూ.500 చలానా వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. 'ఏంటి హీరో ఇది.. మీరే ఇలా రూల్స్ బ్రేక్ చేస్తే మీ అభిమానులు ఏం పాటిస్తారు? ఇదేనా మీరు ఫ్యాన్స్‌కు ఇచ్చే సందేశం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Just IN : Joseph Vijay fined for jumping red signal. pic.twitter.com/7sQUKNcujG — Manobala Vijayabalan (@ManobalaV) July 11, 2023 చదవండి: గ్లామర్ హీరోయిన్.. నిర్మాత ఒత్తిడితో వ్యభిచార కూపంలోకి.. చివరకు గుర్తుపట్టలేని స్థితిలో.. భర్తకు దూరంగా ఉండటంపై తొలిసారి స్పందించిన హేమమాలిని -
కొడుకు జల్సా రైడ్లు.. పెండింగ్ చలాన్లతో తండ్రి ఆత్మహత్య
వరంగల్: ట్రాఫిక్ చలాన్లు కట్టలేదని పోలీసులు వాహనాన్ని పట్టుకెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. తన తండ్రి మృతికి ట్రాఫిక్ పోలీసులే కారణమని కుమారుడు సూర్య హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మృతుడి కుటుంబసభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. మల్లారెడ్డిపల్లికి చెందిన పాలకుర్తి మొగిలి(54) నగరంలోని ఓ బట్టల షాపులో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ మల్లారెడ్డిపల్లి నుంచి బైక్‌పై వరంగల్‌కు వెళ్లి విధులు నిర్వహించి తిరిగి రాత్రి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆ బైక్‌పై 9 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు నమోదయ్యాయి. ఈ నెల 21న ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీల్లో భాగంగా చూడగా చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో వాటిని కట్టి బైక్ తీసుకెళ్లాలని చెప్పారు. దీంతె అతను మల్లారెడ్డిపల్లికి ఆటోలో వెళ్లాడు. వాహనం లేకపోవడం వల్ల విధులకు వెళ్లలేనని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు వచ్చి రూ.3వేలు ఇచ్చి వెళ్లారని బంధువులు ఆరోపించారు. -
ఐపీఎస్‌తో గొడవ.. హాట్ టాపిక్‌గా హీరోయిన్ డింపుల్ హయాతి (ఫొటోలు)
-
డింపుల్ హయాతి కేసులో ట్విస్ట్.. కారుకు వరుస చలాన్లు!
రామబాణం ఫేం డింపుల్ హయాతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వివాదం సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్‌తో పాటు తన స్నేహితుడు డేవిడ్‌పై క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును కారుతో ఢీకొట్టి ధ్వంసం చేశారని డీసీపీ డ్రైవర్ జూబ్లిహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పోలీసులకు సమర్పించాడు. (ఇది చదవండి: హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదు) అయితే ఈ వ్యవహారంలో మరో కొత్త కోణం బయటకొచ్చింది. హీరోయిన్ డింపుల్ హయాతి కారుకు పోలీసులు వరుసగా చలాన్లు విధించినట్లు తెలుస్తోంది. అయితే డీసీపీ ఉద్దేశపూర్వకంగానే చలాన్లు వేశారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ కేసుపై డింపుల్ హయాతి పరోక్షంగా స్పందించారు. అధికారాన్ని ఉపయోగించి తప్పులను కప్పిపుచ్చుకోలేరని ట్వీట్ చేసింది. Misuse of power doesn’t hide mistakes .. 😂 . #satyamevajayathe — Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023 డీసీపీ రాహుల్ హెగ్డేనే తనకున్న అధికారంతో తప్పుడు కేసులు పెట్టించారని డింపుల్ పరోక్షంగా చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: చెన్నైలో శరత్‌బాబు అంత్యక్రియలు..పిల్లలు లేకపోవడంతో) అసలేం జరిగిందంటే? హైదరాబాద్‌లోని జర్నలిస్ట్ కాలనీలో ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే నివాసం ఉటున్నారు. అదే అపార్ట్మెంట్లో డింపుల్ హయాతి తన స్నేహితుడు డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు. రాహుల్ హెగ్డేకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని ఆయన డ్రైవర్ చేతన్ కుమార్ అదే అపార్టమెంట్‌లోని సెల్లార్లో పార్కింగ్ చేశాడు. ఆ వాహనం పక్కనే డింపుల్ హయాతి కూడా తన వాహనాన్ని పార్కింగ్ చేస్తుంది. . దీనిపై వారికి పలు మార్లు గొడవైంది.అయితే తాజాగా డింపుల్ సదరు ఆఫీసర్ కారుని ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు కాలితో తంతూ గొడవ చేసింది. అక్కడున్న డ్రైవర్‌తోనూ ఆమె గొడవ పడింది. దీంతో ఐపీఎస్ ఆఫీసర్ జూబ్లీ హిల్స పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రూ.10 వేలు కట్టలేనన్నా.. కనికరించలేదు
సైదాబాద్: ట్రాఫిక్ పోలీసుల ‘చలాన్ల’ వేధింపులు ఒక హమాలీ ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కూలిపని చేసుకునే తాను చలాన్లు కట్టలేనని చెప్పినా ట్రాఫిక్ ఎస్ఐ కనికరించలేదని సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు తన బాధను వ్యక్తం చేస్తూ మృతుడు సూసైడ్ నోట్ రాశాడు. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరడిగొమ్మ గ్రామానికి చెందిన ఎ.ఎల్లయ్య (45) నగరానికి వలస వచ్చి ఐఎస్‌సదన్ డివిజన్ చింతల్‌బస్తీలో నివసిస్తున్నాడు. అతని భార్య సైదాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తుంది. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. హమాలీ పనిచేసే ఎల్లయ్య ద్విచక్రవాహనంపై మూడు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆదివారం రాత్రి భారత్‌గార్డెన్ వద్ద విధులు నిర్వహిస్తున్న మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీసులు అతని వాహనాన్ని తనిఖీ చేసి పెండింగ్ చలాన్లు ఉన్నాయని వాహనాన్ని సీజ్ చేశారు. అతను వాహనాన్ని విడిచి పెట్టాలని ఎన్నిసార్లు అడిగినా చలాన్లు చెల్లించాలని పోలీసులు తెలిపారు. చలాన్లు కట్టడానికి డబ్బులు లేకపోవడంతో మనస్థాపం చెందిన ఎల్లయ్య సోమవారం రాత్రి ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సైదాబాద్ పోలీసులు అతడి మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోస్ట్‌మార్టం అనంతరం మంగళవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే మృతుడు రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లకు తెలుపుతూ తన బాధ వ్యక్తం చేశాడు. ‘మీర్‌చౌక్ పోలీసులు రూ.పది వేలు కడితేనే నా బండి ఇస్తామంటున్నారు. కూలిపని చేసుకునే వాడినని బతిమాలినా వారు ఒప్పుకోవడం లేదు.’ అని ఎల్లయ్య సూసైడ్‌నోట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. మీర్‌చౌక్ ట్రాఫిక్ ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నాని అందులో పేర్కొన్నాడు. కాగా సైదాబాద్ పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ నడుపుతూ బీర్ తాగిన యువకుడు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు
లక్నో: ఓ యువకుడు అతిగా ప్రవర్తించాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ బీర్ తాగాడు. రహదారిపై ఇతడు చేసిన చేష్టలను స్నేహితులే వీడియో తీశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ఉత్తర ప్రదేశ్ గాజియాబాద్ పోలీసులు యువకుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. రూ.31,000 చలనా విధించారు. హెల్మెట్ ధరించకపోగా బైక్ నడుపుతూ మద్యం సేవించినందుకు ఇంత భారీమొత్తంలో జరిమానా వేశారు. ఇందుకు సంబంధించిన చలానాను సోషల్ మీడియాలో షేర్ చేశారు. #Ghaziabad DME पर बीयर पीकर रील रिकॉर्ड करने वाले इस सूरमा ने तो @Gzbtrafficpol की चालानी कार्यवाई की पोल खोल दी, DME पर 2 व्हीलर नही जा सकते यहाँ तो पूरी शूटिंग जारी है। मसूरी थाना क्षेत्र है। @ghaziabadpolice @uptrafficpolice @sharadsharma1 @bstvlive @DCPRuralGZB pic.twitter.com/Mvbj2sFZ2H — Lokesh Rai 🇮🇳 (@lokeshRlive) January 20, 2023 చదవండి: రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు -
15 రోజులు.. 1.88కోట్లు.. 30 వేల కేసులు!
సాక్షి, చెన్నై: అమల్లోకి వచ్చిన కొత్త చట్టం మేరకు చెన్నైలో 15 రోజుల్లో రూ.1.88 కోట్లను జరిమానా విధించి, వసూలు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు 30 వేల కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వివరాలు.. చెన్నై నగరంలో ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా మోటారు వాహనాల చట్టంలో సవరణలు చేసిన విషయం తెలిసిందే. గత నెల ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపేవారు, ట్రిబుల్ రైడింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహన చోదకులు, సిగ్నల్స్‌లో నిబంధనల్ని అనుసరించకుండా దూసుకెళ్లే కుర్రకారు, రాత్రుల్లో మద్యం తాగి వాహనం నడిపే వారి భరతం పట్టే విధంగా పోలీసులు దూసుకెళ్లారు. హెల్మెట్ ధరించకుంటే, రూ. 1000, ఇన్సూరె న్స్ లేని వాహనాలకు రూ. 2 వేలు అంటూ భారీ జరిమానాలు విధించారు. దీంతో గత పక్షం రోజుల్లోనే చెన్నైలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి 30,699 మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి జరిమానా రూపంలో రూ. 1.88 కోట్లు వసూలు చేశారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అతివేVýæం ప్రమాదకరమని, కుటుంబాన్ని గుర్తెరిగి వాహ నాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. చదవండి: Bear Attack Video: రెచ్చిపోయిన ఎలుగుబంటి.. బైక్‌పై వెళ్తున్న వారిపై దాడిచేసి.. -
హైదరాబాద్: ఓరి వీళ్ల వేషాలు తగలెయ్య.. నంబర్ ప్లేట్ ఏదయ్యా! (ఫొటోలు)
-
Hyderabad: మీ వాహనంపై 3 చలాన్ల కంటే ఎక్కువ ఉన్నాయా.. ఇక అంతే!
సాక్షి, హైదరాబాద్: 46 రోజుల పాటు అందుబాటులో ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రిబేట్ అవకాశాన్ని మీరు వినియోగించుకోలేదా? మీ వాహనంపై మూడు కంటే ఎక్కువ చలాన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయా? అయితే ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడైనా సరే నడి రోడ్డు మీదే మీ వాహనాన్ని ఆపేస్తారు. అక్కడికక్కడే పెండింగ్ చలాన్ సొమ్ము చెల్లిస్తేనే వాహనాన్ని వదిలిపెడతారు. ఈమేరకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత నెల 1 నుంచి ఈనెల 15 తేదీ వరకూ అందించిన ట్రాఫిక్ చలాన్ల ఈ–లోక్ అదాలత్‌ను వినియోగించుకోని వాహనదారుల ముక్కుపిండి మరీ వసూలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా పెండింగ్ చలాన్ల డిస్కౌంట్లను రాచకొండ పరిధిలో వాహనదారులు బాగానే వినియోగించుకున్నారు. 46 రోజుల ఆఫర్ సమయంలో 30,63,496 వాహనదారులు చలాన్లను క్లియర్ చేయగా.. వీటి ద్వారా రూ.31,67,79,643 పెండింగ్ సొమ్ము వసూలు అయింది. ప్రస్తుతం మల్కాజ్గిరి, ఎల్బీనగర్, భువనగిరి మూడు జోన్లలో కలిపి 10 లక్షల వాహనాల చలాన్లు, రూ.100 కోట్లు సొమ్ము పెండింగ్‌లో ఉన్నాయి. 3 చలాన్ల ఉన్న వాహనాలు లక్ష.. పెండింగ్ చలాన్లపై రిబేట్ తర్వాత రాచకొండ కమిషనరేట్ పరిధిలో మూడు, అంతకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్ ఉన్న వాహనాలు లక్ష వరకున్నాయి. వీటికి సంబంధించి రూ.50 కోట్ల చలాన్ సొమ్ము పెండింగ్‌లో ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
E Challan: అంచనాలకు మించి వసూలు.. వారిపై చర్యలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించకపోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలు రిబేటుతో చెల్లించడానికి అవకాశం కల్పించిన ఈ– లోక్ అదాలత్ శుక్రవారంతో ముగిసింది. మార్చి 1న మొదలైన ఈ పథకం తొలుత ప్రకటించిన దాని ప్రకారం అదే నెల 31తో ముగియాల్సి ఉంది. వాహన చోదకుల విజ్ఞప్తుల నేపథ్యంలో మరో 15 రోజులు పొడిగించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ– చలాన్ల బకాయిలు రూ.1,200 కోట్ల ఉండగా.. 90 నుంచి 25 శాతం వరకు రిబేట్స్ ఇవ్వడంతో ఈ– లోక్ అదాలత్ ద్వారా మొత్తం రూ.250 కోట్ల వరకు వసూలు అవుతుందని అధికారులు అంచనా వేశారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రూ.300 కోట్లకు చేరడంతో విజయవంతమైనట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అర్ధరాత్రి 11.59 గంటల వరకు సమయం ఉండటంతో మరికొంత జమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.92 కోట్ల వాహనచోదకులు వినియోగించుకున్నారు. అత్యధికంగా ద్విచక్ర వాహనాలవే.. చెల్లింపులు జరిగిన అత్యధిక చలాన్లు ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే అని అధికారులు వివరిస్తున్నారు. మొత్తం పెండింగ్ చలాన్లలో 70 శాతానికి పైగా క్లియర్ అయినట్లు స్పష్టం చేస్తున్నారు. కొన్ని వాహనాలు చేతులు మారడం, మరికొన్ని వినియోగంలో లేకపోవడం తదితర కారణాలతో 10 నుంచి 15 శాతం చలాన్లు చెల్లింపులు జరగలేదని భావిస్తున్నారు. ఈ– లోక్ అదాలత్‌లో పెండింగ్ చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించిన వారిపై సోమవారం నుంచి చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన సర్వర్‌లో పెండింగ్ చలాన్లు జాబితాను అప్డేట్ చేస్తున్నారు. ఇది క్షేత్రస్థాయి అధికారుల వద్ద ఉండే ట్యాబ్‌లకు అనుసంధానించి ఉంటుంది. రహదారులపై తనిఖీలు నిర్వహించనున్న ప్రత్యేక బృందాలు జరిమానాల బకాయి ఉన్న వారిని గుర్తించి పట్టుకుంటాయి. వీళ్లు ఎంత మొత్తం పెండింగ్‌లో ఉండే అంతా చెల్లించేలా చర్యలు తీసుకోనున్నాయి. మరోపక్క 15 చలాన్ల కంటే ఎక్కువ పెండింగ్‌లో ఉన్న వారి జాబితాలను ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల వారీగా రూపొందిస్తున్నారు. వారిపై ట్రాఫిక్ పోలీసులు న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేయనున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. మరోపక్క చలాన్ల సంఖ్య, చెల్లించాల్సిన మొత్తం ఆధారంగా టాప్ వైలేటర్స్ జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఆర్టీఏ డేటాబేస్ నుంచి ఆయా వాహన చోదకుల చిరునామాలు సంగ్రహిస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా ఏర్పాటయ్యే ప్రత్యేక బృందాలకు ఇవి అందించనున్నారు. ఆ టీమ్స్ సదరు ఉల్లంఘనుల ఇళ్లకు వెళ్లి పెండింగ్‌లో ఉన్న జరిమానా చెల్లించేలా ప్రయత్నాలు చేస్తాయి. ఫోన్ నంబర్ల డేటాబేస్ సమకూరింది ఈ– లోక్ అదాలత్ నేపథ్యంలో భారీ సంఖ్యలో పెండింగ్ చలాన్లు వసూలు కావడంతో పాటు వాహన చోదకులకు సంబంధించిన ఫోన్ నంబర్లతో కూడిన డేటాబేస్ సమకూరింది. కొన్ని వాహనాలు అనేక మంది చేతులు మారినా... ఆర్టీఏ డేటాబేస్‌లో అప్డేట్ కాని నేపథ్యంలో వారి చిరునామాలు, కాంటాక్ట్ నంబర్లు అందుబాటులో ఉండేవి కాదు. ఫలితంగా అనేక ఈ– చలాన్లు వాహనాల మాజీ యజమానులకు చేరేవి. ఈ– లోక్ అదాలత్ చెల్లింపుల నేపథ్యంలో ఓటీపీ తప్పనిసరి చేయడంతో వాహనచోదకులు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు తమ ఫోన్ నంబర్లను పొందుపరిచారు. ఈ వివరాలు సంగ్రహించిన సర్వర్ ప్రత్యేక డేటాబేస్ రూపొందించింది. ఈ నేపథ్యంలోనే ఈ– చలాన్‌ను వాట్సాప్ ద్వారా పంపే ప్రక్రియ కు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాం. ఇలా చేస్తే ప్రతి ఉల్లంఘనుడికి కచ్చితంగా ఈ– చలాన్ చేరుతుంది. – నగర ట్రాఫిక్ ఉన్నతాధికారి -
చలాన్లు క్లియర్ చేయలేదా? డిస్కౌంట్ ఆఫర్ ఎండ్ అయ్యేది ఎప్పుడో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: వాహనదారులకు తెలంగాణ సర్కార్ ప్రకటించిన పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ నేటితో ముగియనుంది. మార్చి ఒకటి నుంచి పోలీసులు ఈ ఆఫర్ ప్రకటించారు. ముందుగా మార్చి నెలాఖరు వరకే ఈ ఆఫర్ ఉండగా.. ఆ తర్వాత ఏప్రిల్ 15 వరకు దాన్ని పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో ఏప్రిల్ 16 నుంచి యథావిధిగా చలాన్ రుసుము వసూలు చేయనున్నారు. ఇప్పటి వరకు 60 శాతం వాహనదారులు చలాన్లు క్లియర్ చేసుకున్నారు. దాదాపు రూ. 250 కోట్లను ఫైన్ల రూపంలో చెల్లించారు. అయితే మరోసారి ఆఫర్ పొడిగింపు ఉండదని పోలీసులు ఇదివరకే స్పష్టం చేశారు. చదవండి: ‘అత్తమామలు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. భర్తతో మాట్లాడనీయడం లేదు’ -
ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవాలని..
బంజారాహిల్స్: ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడానికి నెంబర్ ప్లేట్‌పై మాస్క్ కప్పడమే కాకుండా ఒక నెంబర్‌పై బ్లాక్ స్టిక్కర్‌ను తగిలించిన వాహనదారుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల సమాచారం మేరకు... ఈ నెల 12న బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ శాంతి కుమార్ తాజ్‌కృష్ణా చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేస్తుండగా టీఎస్ 09 ఈవై 4858 నెంబర్ బజాజ్ పల్సర్‌పై ఓ వాహనదారుడు వెళ్తుండగా ఆపారు. వాహన నెంబర్ ప్లేట్‌పై మాస్క్ కప్పడమే కాకుండా ఓ నెంబర్‌పై బ్లాక్ స్టిక్కర్ తగిలించడంతో ఇదేమిటని ప్రశ్నించాడు. తాను ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగానే నెంబర్ ప్లేట్ ట్యాంపర్ చేసినట్లు వాహనదారుడు వెల్లడించాడు. ఈ వాహనంపై పోలీసులు ఆరా తీయగా జియాగూడ దుర్గానగర్ కాలనీకి చెందిన కరన్ కోట్ నాగేకర్ సందీప్‌గా గుర్తించారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాఫిక్ చలానా తొందరగా కట్టేయండి.. పొడిగింపు లేదు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– లోక్ అదాలత్ గడువుకు మిగిలింది మూడ్రోజులేనని మంగళవారం ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. శుక్రవారంతో ఇది ముగుస్తుందని, మళ్లీ పొడిగింపునకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. గత నెల 1న మొదలై ఈ– లోక్ అదాలత్ 31తో ముగియాల్సి ఉంది. వాహన చోదకుల విజ్ఞప్తుల నేపథ్యంలో మరో పదిహేను రోజులు పొడిగించారు. శుక్రవారం తర్వాత దీని పొడిగింపు ఉండదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంగనాథ్ కోరారు. తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలు భారీ తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ– లోక్ అదాలత్‌కు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. దీని గడువు ఏప్రిల్ 15తో ముగియనుంది. (క్లిక్: కింగ్‌కోఠి ప్యాలెస్‌పై రగడ) -
రూ.90తో మొదలై.. రూ.250 కోట్లకు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలను భారీగా తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ– లోక్ అదాలత్ ఈ నెల 1న మొదలైంది. ఆ రోజు తెల్లవారుజామున 1.24 గంటలకు ఓ వాహనదారు తన ద్విచక్ర వాహనంపై ఉన్న జరిమానా మొత్తంలో రిబేటు పోను రూ.90 చెల్లించారు. ఇదే ఈ– లోక్ అదాలత్‌కు సంబంధించిన తొలి చెల్లింపు. ఇలా మొదలైన చెల్లింపులు బుధవారం నాటికి రూ.250 కోట్లకు చేరాయి. తొలుత ప్రకటించిన దాని ప్రకారం గురువారంతో ఈ– లోక్ అదాలత్ ముగియనున్న నేపథ్యంలో మరో 15 రోజుల పాటు ప్రభుత్వం గడువు పొడిగించిందని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. మొత్తమ్మీద రాష్ట్ర వ్యాప్తంగా కొన్నేళ్లుగా పేరుకు పోయిన ఈ–చలాన్ బకాయిలు రూ.1700 కోట్ల వరకు ఉన్నాయి. బుధవారం వరకు 2.57 కోట్ల చలాన్లకు సంబంధించి రూ.250 కోట్లను వాహనచోదకులు చెల్లించారు. ఈ స్కీమ్ ప్రారంభమైన తొలినాళ్లల్లో రోజువారీ చెల్లింపులు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండగా... సోమవారం నుంచి ఇది రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ– లోక్ అదాలత్‌ను ఏప్రిల్ 15వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారానే రూ.60 కోట్లు.. ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపులు అత్యధికంగా పేటీఎం ద్వారా జరిగాయి. ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు పేటీఎం, వాలెట్, యూపీఐ, పోస్ట్‌పెయిడ్, నెట్‌బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రూ.60 కోట్ల ఈ– చలాన్ చెల్లింపులు జరిగాయి. (చదవండి: నిర్లక్ష్యం చూపారు.. నిలువెల్లా దోచారు) -
చలాన్ క్లియరెన్స్‌కు భారీ స్పందన.. నిమిషానికి 1000
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలు భారీ తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ– లోక్ అదాలత్‌కు వాహన చోదకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పోలీసులు పెట్టిన వన్‌టైమ్ డిస్కౌంట్ ఆఫర్లకు భారీగా స్పందన లభిస్తోంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఆన్లైన్లో ప్రారంభమైన ఈ విధానంలో మంగళవారం వరకు 1.29 కోట్ల చలాన్లు చెల్లించారు. 15 రోజుల వ్యవధిలో చలాన్ల రూపంలో రూ.132 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. వీటిలో 80 శాతం రాజధానిలోని మూడు కమిషనరేట్లకు సంబంధించినవే కావడం గమనార్హం. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో 56 లక్షల చలాన్లకు సంబంధించి రూ.43 కోట్లు వసూలయ్యాయి. చదవండి:హైదరాబాద్: కీలక నిర్ణయం.. ఎక్కడపడితే అక్కడ.. ‘ఫొటోలు’ తీయరిక! మార్చి 31 వరకు ఈ ఆఫర్ ఉండనుంది. నిమిషానికి వాహనాదారులు 1000 చలాన్లు క్లియర్ చేసుకుంటున్నారు. మొదటి రోజేజే 5.5 కోట్ల రూపాయలు ఫైన్లుచెల్లించారు. డిసెంబర్ 2021 వరకు 80 లక్షల పెండింగ్ చలాన్ లు ఈ–చలాన్ చెల్లింపుల కోసం ఉద్దేశించిన అధికారిక వెబ్సైట్లో కొన్ని మార్పులు చేశారు. తొలినాళ్లల్లో అక్కడ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు ఇంజన్ లేదా చాసిస్ నంబర్ ఎంటర్ చేయడం కచ్చితం చేశారు. అప్పుడే పెండింగ్ చలాన్లు కనిపించేవి. అయితే తాజాగా చేసిన మార్పులతో కేవలం వాహనం నంబర్‌తోనే ఎంటర్ కావచ్చు. ఫోన్ నంబర్ పొందుపరిచి, దానికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడం మాత్రం తప్పనిసరి. ఈ–లోక్ అదాలత్ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు జారీ అయిన ఈ–చలాన్లకు మాత్రమే ఈ రిబేటు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి జారీ చలాన్లకు మాత్రం మొత్తం చెల్లించాల్సిందేనని వివరిస్తున్నారు. చదవండి: అలా చేస్తే కిషన్‌రెడ్డిని హైదరాబాద్ నడిబొడ్డున సత్కరిస్తాం: మంత్రి కేటీఆర్ -
ట్రాఫిక్ చీఫ్ కీలక నిర్ణయం! ఇకపై అటువంటి చలాన్లు ఉండవా?
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ఉల్లంఘనులపై ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే ఈ– చలాన్ల ప్రధాన ఉద్దేశం రోడ్డు భద్రత పెంచడంతో పాటు ప్రమాదాలు, మరణాలు నిరోధించడం. ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసుల ఈ–చలాన్ జారీ విధానం ‘రోగమొక చోటైతే.. మందొక చోట’ అన్న చందంగా ఉంది. ఈ లోపాలను పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లోనే ఎక్కువగా కన్నేసి ఉంచనున్నారు. అక్కడి ఉల్లంఘనులనే ఫొటోలు తీసి ఈ–చలాన్ల పంపనున్నారు. త్వరలో ఈ విధానం ప్రారంభం కానుందని, సామాన్యులకు ఇబ్బందులు లేకుండానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. 90 శాతం హెల్మెట్ కేసులే.. లక్డీకాపూల్ అనునిత్యం ట్రాఫిక్ రద్దీతో ఉండే ప్రాంతం. ఇక్కడ సరాసరిన వాహనాల సరాసరి వేగం గంటలకు 15 కి.మీ కూడా మించదు. అలాంటి చోట హెల్మెట్ ధరించినా, ధరించకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఇలాంటి చోట్లా రోజూ వందలు, వేల సంఖ్యలో ‘వితౌట్ హెల్మెట్’ కేసులు నమోదు చేస్తూ ఈ–చలాన్లు జారీ చేస్తుంటారు. ►ఏటా జారీ అవుతున్న ఈ– చలాన్లలో 90 శాతం హెల్మెట్ కేసులే ఉంటున్నాయి. ప్రస్తుతం జారీ అవుతున్న ఈ– చలాన్ విధానంలో ఇలాంటి లోపాలు అనేకం ఉన్నాయి. వీటిని గమనించిన రంగనాథ్ కొన్నాళ్లుగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానం అమలవుతోంది. ►దీని ప్రకారం ఏ ట్రాఫిక్ పోలీసు ఉల్లంఘనులకు నేరుగా చలాన్ విధించరు. క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది తమ వద్ద ఉన్న కెమెరాలతో ఉల్లంఘనకు పాల్పడిన వాహనం ఫొటో తీస్తున్నారు. ఆర్టీఏ డేటాబేస్‌లోని వాహనం చిరునామా ఆధారంగా ఉల్లంఘనకు సంబంధించిన ఈ– చలాన్ పంపిస్తున్నారు. ఈ ఫొటోలు తీసే పోలీసులు జంక్షన్లతో పాటు కీలక ప్రాంతాల్లో ఉంటున్నారు. బ్లాక్ స్పాట్లలోనే.. ఒకే చోట ఉంటూ తమ కంటికి కనిపించిన ప్రతి ఉల్లంఘనను ఫొటో తీస్తున్నారు. ఇకపై వీళ్లు తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్ స్పాట్స్‌లోనే ఉండనున్నారు. ఇప్పటికే గడిచిన అయిదేళ్ల గణాంకాల ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు పోలీసుస్టేషన్ల వారీగా ఈ బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఉండే పోలీసులు కూడా ఏ తరహా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయో ఆ ఉల్లంఘనలకే ప్రాధాన్యం ఇస్తూ ఫొటోలు తీస్తారు. చదవండి: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన.. అసలేంటి జీవో 111? 125 ఆధునిక ట్యాబ్‌ల కొనుగోలు.. ►ఈ విధానం అమలు కోసం ట్రాఫిక్ విభాగం అధికారులు కొత్తగా 125 అత్యాధునిక ట్యాబ్స్ ఖరీదు చేశారు. కెమెరాల స్థానంలో వీటిని వినియోగిస్తూ, ప్రత్యేక యాప్ ద్వారా ఉల్లంఘనుల ఫొటోలు తీయనున్నారు. దీంతో ఆ ఫొటో తీసిన సమయం, తేదీలతో పాటు ప్రాంతం కూడా అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా నమోదవుతుంది. క్షేత్రస్థాయి పోలీసులు ఒకే చోట ఉండి ఫొటోలు తీయకుండా నిఘా ఉంచేందుకు ఇది ఉపకరించనుంది. ►మరోపక్క ప్రస్తుతం ఈ– చలాన్ల బట్వాడాకు సంబంధించి పోలీసు విభాగం పోస్టల్ శాఖకు నిర్ణీత రుసుం చెల్లిస్తోంది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఒక్కో ఈ– చలాన్‌కు రూ.15 చొప్పున పోస్టల్ శాఖకు చేరుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ఈ– లోక్ అదాలత్‌లో వచ్చిన సొమ్ము నుంచి ఇది చెల్లించాల్సిందే. ఈ ఖర్చు తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. -
కారు, స్కూటీకి ఒకే నంబర్! ఇంతకీ కారు ఎవరిది?
సాక్షి, జోగిపేట(అందోల్): ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై నిలిపిన కారుకు ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. అనంతరం చలాన్‌ను వాహనం అడ్రస్‌కు పోస్టు చేయగా, అది కారు యజమానికి కాకుండా అదే నంబర్‌తో ఉన్న స్కూటీ యజమానికి చేరిన ఘటన జోగిపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జోగిపేటకు చెందిన బండారు మహేశ్ అనే వ్యక్తికి ఈనెల 14న పోస్టు ద్వారా వచ్చిన చలాన్ చూసిన మహేశ్ ఖంగుతిన్నాడు. ఈనెల 12వ తేదిన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రోడ్డుపై నిలిపిన టీఎస్ 15 ఎఫ్ఇ 8745 నంబరుగల ఎర్టిగా వాహనానికి పోలీసులు జరిమానా విధించారు. వాహనాన్ని పరిశీలించకుండా చలాన్‌ను స్కూటీ యజమాని అడ్రస్‌కు పోస్టు చేశారు. జరిమానా రశీదు అందుకున్న మహేశ్ వెంటనే జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించగా, చలాన్ పటాన్చెరు పరిధిలో వేసినందున అక్కడికే వెళ్లాలని పోలీసులు సూచించినట్లు తెలిపాడు. ఇంతకీ కారు ఎవరిది? ఒకే నంబరుతో రెండు వాహనాలు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. స్కూటీకి కూడా ఆర్టీఏ అధికారులు అదే నంబర్ కేటాయించినట్లుగా ఆన్లైన్లో చూపిస్తుంది. కారుకు కూడా అదే నంబరు ఇచ్చారా, లేక కారు యజమాని నంబర్ మార్చాడా అనే విషయం తెలియాల్సి ఉంది. చదవండి: ఎంత జాగ్రత్తపడ్డా.. అడ్డంగా దొరికిపోతారు.. ఏమిటీ యెల్లో డాట్స్? ఎక్కడుంటాయి? -
చావు తెలివంటే ఇదే.. ట్రిపుల్ రైడింగ్.. హెల్మెట్ లేదు.. మూతికి ఉండాల్సిన మాస్కేమో!
సాక్షి, జీడిమెట్ల : పోలీస్ చలానాల నుంచి తప్పించుకోవాలంటే మూతికి ఉండాల్సిన మాస్క్‌ను బండికి పెట్టుకోవాలి. అప్పుడే ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్రూట్లలో ఇష్టం వచ్చినట్లు వెళ్లొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొంతమంది యువకులు ఇలా బైక్ నంబర్ ప్లేట్‌ను మాస్క్‌తో మూసేసి పోలీసుల కెమెరాలకు చిక్కకుండా తిరుతున్నారు. ఇలాంటి వారు ఏదైనా ప్రమాదం చేసి తప్పించుకుంటే దొరకడం కష్టంగా మారుతుంది. ఇటువంటి వాహనదారుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించకుంటే ఇది ప్రమాదమేనని ప్రజలు అంటున్నారు. చింతల్లో నంబర్ ప్లేట్‌కు మాస్కు పెట్టి యువకులు ఇలా ట్రిపుల్ రైడింగ్‌లో వెళ్తున్నారు. అసలే కోవిడ్ మహమ్మారి మరోసారి రెక్కలు విప్పేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన కొంతమంది నిర్లక్ష్యం వీడటం లేదు. ఇంకోవైపు రాష్ట్రంలో రోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలబారినపడి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా యువకులు తమకేం కాదులే అన్న విపరీత ధోరణితో అటు వైరస్‌ను , ఇటు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. చదవండి: నగరానికి నయా పోలీస్ బాస్.. సీవీ ఆనంద్ గురించి ఆసక్తికర విశేషాలు.. హైదరాబాద్ నగరంలో గతంలో దర్శనమిచ్చిన ‘మాస్కు’ నెంబర్ ప్లేట్లు.. -
పోలీసులు అవాక్కు! ఒకే బైక్‌పై 179 చలాన్లు.. అక్షరాల రూ.42,475 ఫైన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారుల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతోంది.. వాహనంపై పడిన చలాన్లను కూడా సక్రమంగా చెల్లించడం లేదు. భాగ్యనగరంలో సగానికి పైగా మంది సక్రమంగా చలాన్లను చెల్లించడం లేదు .దీంతో ట్రాఫిక్ పోలీసులు నిబంధనల ఉల్లంఘన పేరుతో వాహనదారుల నుంచి ముక్కు పిండి జరిమానాలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కాచిగూడట్రాఫిక్ పోలీసులు సోమవారం అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో వాహన తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులను చూసిన ఓ వాహనదారుడు రోడ్డుపైనే బైక్ వదిలి పారిపోయాడు. అయితే వదిలి వెళ్లిన AP 23 M 9895 హీరో హోండా ప్యాషన్ బైక్‌పై పోలీసులు చలాన్లు ఉన్నాయో లేవో అని తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. ఆ బైక్ ఏకంగా 179 చలాన్లు, 42,475 రూపాయల ఫైన్ ఉండటం చూసి పోలీసులు అవాక్కయ్యారు. భారీ చలాన్లు ఉండటంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. (చదవండి: వివాహేతర సంబంధం.. అర్ధరాత్రి ప్రియుడి ఇంట్లో ఘర్షణ..) -
చలాన్ల వేధింపులు తట్టుకోలేక బైక్‌కు నిప్పంటించాడు
సాక్షి, ఆదిలాబాద్: ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝులిపిస్తున్న పోలీసులు అన్ని నిబంధనలు పాటించిన వారిపై కూడా ఇష్టం వచ్చినట్లు చలాన్లు విధిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహానికి సంబంధించిన ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. చదవండి: బూజుపట్టిన బాదం మిల్క్.. హెరిటేజ్ స్టోర్ మూసివేత తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల చలాన్ల బాధలు భరించలేక ఓ వ్యక్తి తన మోటార్ సైకిల్‌కు నిప్పు పెట్టాడు. పంజాబ్ చౌరస్తాలో ట్రాపిక్ పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఖానాపూర్‌కు చెందిన మక్బూల్ అనే వ్యక్తి తన బైక్‌కు నిప్పు పెట్టడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. చలాన్లు కట్టిన కూడా తరుచూ కట్టాలని ట్రాఫిక్ పోలీసులు అడుగుతున్నారని, చలానాల బాధలు తట్టుకోలేకే తన బైక్‌కు నిప్పు పెట్టినట్లు మక్బూల్ అవేదన వ్యక్తం చేశారు. చదవండి: 2000 మందికి సున్నా మార్కులు.. నోరెళ్లబెట్టిన విద్యార్థులు, కారణమేంటి? -
వైరల్: కామారెడ్డి కలెక్టర్ వాహనంపై 28 చలాన్లు
సాక్షి, కామారెడ్డి: ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో అందరూ సమానులే. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. నాయకుల నుంచి సామాన్యుల వరకు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందే. ఇటీవల ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేసిన తెలంగాణ పోలీసులు రూల్స్ బ్రేక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. దొరికిన వారికి దొరికినట్టు చలానాలు విధిస్తూ హడలెత్తిస్తున్నారు.. తాజాగా కామారెడ్డి జిల్లా ట్రాఫిక్ పోలీసులు ఏకంగా కలెక్టర్ వాహనానికే చలనాలను విధించారు. చదవండి: నెహ్రూ జూలాజికల్ పార్కు: సింహాల వద్ద వజ్రాలు, బంగారం ఉంటాయని... కామారెడ్డి కలెక్టర్ వాహనం (టీఎస్ 16 ఈఈ 3366) పై భారీ మొత్తంలో ఈ-చలానాలు ఉన్నాయి. 2016 సంవత్సరం నుంచి 2021 ఆగస్టు 20 వరకు ఏకంగా 28 చలానాలు ఉన్నాయి. ఈ చలానాల ప్రకారం మొత్తం రూ.27,580 జరిమానా కట్టాల్సి ఉంది. ఇన్ని చలానాల్లో అధికంగా 24 అతివేగంగా వాహనం నడపడం వల్లే పడటం గమనార్హం. ఇక కలెక్టర్ వాహనంపైనే 28 చనాలు ఉండటంతో సదరు కలెక్టర్ గారి వాహనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ‘మాయా’ మసాజ్ సెంటర్లు.. కష్టమర్‌గా ఓ వ్యక్తిని పోలీసులు పంపడంతో.. అయితే, కలెక్టర్లు ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఇది మొదటిసారి కాదు. కామారెడ్డి కలెక్టర్ కంటే ముందు జనగామ జిల్లా కలెక్టర్ మీద కూడా ఇలాంటి చలాన్లే ఉండేవి. జనగామ కలెక్టర్ ప్రభుత్వ వాహనానికి రెండేళ్లలో (2021, ఆగస్టు 30వ తేదీ వరకు) ఏకంగా 23 సార్లు జరిమానాలు పడ్డాయి. వీటిలో 22సార్లు ఓవర్ స్పీడ్ కాగా, ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జీబ్రా క్రాసింగ్ చేసినందుకు చలానాలు విధించారు. -
డ్రంకెన్ డ్రైవ్: వారంలో రూ.కోటిన్నర జరిమానా
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణ, డ్రంకెన్ డ్రైవ్‌లు, పెండింగ్ చలాన్ల వసూళ్లపై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి 12వ తేదీ మధ్య రాచకొండ పరిధిలో 40,620 కేసులను నమోదు కాగా.. ట్రాఫిక్ ఉల్లంఘనలు, డ్రంకెన్ డ్రైవ్ కలిపి సుమారు రూ.కోటిన్నర జరిమానా విధించారు. ఇందులో అత్యధికంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 26,475 కేసులు నమోదు కాగా.. రూ.48,98,900 ఫైన్లు విధించారు. ఇద్దరికి జైలు శిక్ష రాచకొండ కమిషరేట్ పరిధిలో వారం రోజుల్లో 49 డ్రంకెన్ డ్రైవ్ కేసులను నమోదయ్యాయి. రూ.4,38,500 జరిమానా విధించారు. 176 మందిని కోర్టులో హాజరుపరచగా ఇద్దరికి జైలు శిక్ష పడింది. అత్యధికంగా వనస్థలిపురంలో 10 కేసులు నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాలదారులపై 38 కేసులు బుక్కవగా.. త్రీవీలర్స్పై 2, ఫోర్ వీలర్ వాహనాదారులపై 9 కేసులు నమోదయ్యాయి. 54 రోడ్డు ప్రమాదాలు.. 10 మంది దుర్మరణం.. కమిషనరేట్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 54 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయి. వీటిలో పది మంది దుర్మరణం చెందగా.. 50 మందికి గాయాలయ్యాయి. తీవ్రత వారీగా చూస్తే 10 కేసులు ఘోరమైన ప్రమాదాలు కాగా.. 44 సాధారణ రోడ్డు ప్రమాదాలున్నాయి. ఆయా డేటాను విశ్లేషించగా మానవ తప్పిదాలు, రహదారి ఇంజనీరింగ్ లోపాలతోనే జరిగాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, వాహనాలు వాటంతటవే ప్రమాదాలకు గురికావడం కారణాలని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ డి.శ్రీనివాస్ తెలిపారు. ఏ విభాగంలో ఎన్ని కేసులంటే.. విభాగం కేసుల సంఖ్య జరిమానా (రూపాయల్లో) హెల్మెట్ లేకుండా 26,475 48,98,900 సీట్‌బెల్ట్ లేకుండా 129 12,900 డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా 837 4,11,500 అదనపు ప్రయాణికులు 28 7,200 ఎక్స్ట్రా ప్రొజెక్షన్ 415 41,500 అతివేగం 2,023 20,23,000 సిగ్నల్ జంప్ 96 96,000 ప్రమాదకర డ్రైవింగ్ 14 14,000 సెల్‌ఫోన్ డ్రైవింగ్ 96 96,000 -
‘సాక్షి’ కథనానికి స్పందన.. తప్పుడు ట్రాఫిక్ చలాన్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: రహదారులపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనచోదకులకు ఈ–చలాన్లు విధించడంలో జరుగుతున్న పొరపాట్లపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. ‘ఈ–చలాన్ మా ఇష్టం’ పేరుతో సోమవారం కథనం ప్రచురితమైంది. దీనిని పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో ఈ–చలాన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాహనచోదకులకు ఇబ్బంది కలిగించే ఇలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు. చదవండి: మూసీపై నిర్మించనున్న వంతెనలకు కొత్త అందాలు తక్షణ చర్యలకు ఉపక్రమించిన ట్రాఫిక్ పోలీసులు పొరపాటున జారీ అయిన చలాన్లలో కొన్నింటిని తొలగించారు. మిగిలిన వాటిపై పరిశీలన చేపట్టారు. ఇకపై ఈ–చలాన్ విధింపుల్లో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ సీపీ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా తమ వాహనంపై తమ తప్పు లేకుండా చలాన్ పడిందనో, డబుల్ చలాన్ వచ్చిందనో ఫిర్యాదు చేస్తే తక్షణం దానిని పరిష్కరించాలని కమిషనర్ స్పష్టం చేశారు. చదవండి: బైక్‌పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా.. -
కేటీఆర్ వాహనానికి చలాన్.. ట్రాఫిక్ ఎస్ఐని అభినందించిన మంత్రి
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల కింద తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్యను మంత్రి కే. తారకరామారావు అభినందించారు. రాంగ్ రూట్లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకుని మరి అభినందనలు తెలిపారు కేటీఆర్. సామాన్య ప్రజలు అయినా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా.. నిబంధనలు అందరికీ ఒకటే అని, ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎల్లవేళల ముందు ఉంటానని, చలాన్ విధించిన రోజు సైతం వాహనంలో తాను లేనని కేటీఆర్ అన్నారు. (చదవండి: బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి కేటీఆర్ ఫిదా: ‘పేపర్ వేస్తే తప్పేంటి’) అయితే బాపు ఘాట్‌లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్ ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లకు శాలువా కప్పి కేటీఆర్ అభినందించిచారు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్యలాంటి అధికారులకి ఎప్పుడూ తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. (చదవండి: ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్చల్) తన వాహనానికి విధించిన చలాన్‌ను చెల్లించారు కేటీఆర్. ఈ విషయంలో తమ పార్టీ కార్యకర్తలు నాయకులకు సరైన సందేశం అందెందుకే ఈరోజు ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలని కేటీఆర్ అన్నారు. చదవండి: ఇతగాడి పెండింగ్ చలానాలను చూస్తే అవాక్కవ్వాల్సిందే.. -
ఈ-చలాన్: హైదరాబాదీలకు చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ‘వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదు’ న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రమిది. అయితే ట్రాఫిక్ పోలీసులు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఉల్లంఘనులకు చలాన్లు పడటమేమో కానీ.. ఇష్టారాజ్యంగా పంపిస్తున్న ఈ–చలాన్ల కారణంగా సాధారణ వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా వచి్చన తప్పుడు చలాన్ తీయించుకోవాలంటూ ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు, ప్రధాన కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిగరాల్సి వస్తోంది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండట్లేదని వాహనచోదకులు వాపోతున్నారు. నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంటే కారణం... ప్రస్తుతం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులకు జరిమానా విధించడం మొత్తం నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానంలో సాగుతోంది. ఒకప్పుడు ట్రాఫిక్ పోలీసులు చౌరస్తాలతో పాటు ప్రధాన రహదారులపై ఉండి ఉల్లంఘనులను పట్టుకునే వారు. వారికి చలాన్ విధించి అప్పటికప్పుడే వారి నుంచి జరిమానా మొత్తాన్ని వసూలు చేసే వారు. కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్గా పిలిచే ఈ విధానంలో వాహనచోదకులతో ఘర్షణలకు, అవినీతికి ఆస్కారం ఉంటోందని ట్రాఫిక్ అధికారులు భావించారు. దీంతో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ను పూర్తిస్థాయిలో అమలు చేశారు. ఈ విధానంలో రహదారులపై ఉంటే ట్రాఫిక్ పోలీసులు తమ వద్ద ఉన్న కెమెరాలో ఉల్లంఘనుల ఫొటోలు తీస్తారు. ఇవి పోలీసుస్టేషన్ నుంచి ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌కు చేరతాయి. సిబ్బంది వాహనం నంబర్ ఆధారంగా ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న చిరునామాకు ఈ–చలాన్ పంపుతారు. చదవండి: హైదరాబాద్: ఒక బైక్‌పై 88 చలాన్లు.. కంగుతిన్న పోలీసులు ఈ ఏడాది జూన్ 16న టీఎస్07ఈకే4800 నంబర్ కలిగిన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్ పోలీసులు రాంగ్ పార్కింగ్ ఇన్ క్యారేజ్ వే అంటూ ఈ–చలాన్ విధించారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ లిమిట్స్‌లో ఉదయం 11.33 గంటలకు, సాయంత్రం 4.08 గంటలకు ఈ ఉల్లంఘనలకు పాల్పడినట్లు చలాన్లు విధిస్తూ ఎవిడెన్స్‌గా రెండు ఫొటోలు పొందుపరిచారు. అయితే ఆ రెండూ ఒకే సందర్భంలో తీసినవి కావడం గమనార్హం. దీనికితోడు సాయంత్రం 4 గంటల సమయంలో సదరు వాహనచోదకుడు బంజారాహిల్స్‌లో తాను విధులు నిర్వర్తించే కార్యాలయంలో ఉండటం కొసమెరుపు. కనిపించక... కన్ఫ్యూజన్తో... ఇలా పోస్టు ద్వారా, ఎస్సెమ్మెస్ రూపంలో ఈ–చలాన్ అందుకునే ఉల్లంఘనుడు వానిటి చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో జరిగే పొరపాట్ల వల్లే ఈ తప్పుడు చలాన్లు విధింపు జరుగుతోందని తెలుస్తోంది. అక్కడ ఉండే సిబ్బందికి ట్రాఫిక్ పోలీసుస్టేషన్ నుంచి వచ్చిన ఫొటోలోని వాహనం నంబర్ కొన్ని సందర్భాల్లో సరిగ్గా కనిపించట్లేదు. దీంతో వాళ్లే ఓ వాహనం నంబర్ ఊహించుకుని ఆ ఈ–చలాన్ విధించేస్తున్నారు. ఒక్కోసారి వచ్చిన ఫొటోనే మరోసారి వస్తోంది. దీన్ని పరిశీలించని సిబ్బంది రెండోసారీ చలాన్ వేసేస్తున్నారు. పోలీసుస్టేషన్ల పరిధులు, అవి ఉండే ప్రాంతాలపై అవగాహన లేని సిబ్బందో, కొత్తవారో ఈ ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తుంటే తప్పుడు చలాన్లు వెళ్తున్నాయి. అరుదైన సందర్భాల్లో మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానూ ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. చదవండి: ఎవరైనా ఒక్కటే: తెలంగాణ సీఎస్ వాహనానికి ట్రాఫిక్ చలాన్ కాళ్లరిగేలా తిరగాల్సిందే... ఇలాంటి పొరపాట్లకు తావుంటుందని అనుమానించిన ఉన్నతాధికారులు ఈ–చలాన్లు కనిపించే అధికారిక వెబ్సైట్లోనే ‘రిపోర్ట్ అజ్’ను చేర్చారు. ఎవరికైనా ఇలాంటి తప్పుడు, పొరపాటు చలాన్లు వస్తే దాని ద్వారానే ట్రాఫిక్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఇలా ఫిర్యాదు చేసినప్పటికీ ట్రాఫిక్ విభాగం నుంచి ఎలాంటి స్పందన ఉండట్లేదు. నెలల తరబడి వేచి చూసినా ఫలితం శూన్యమని, ఈ లోపు రహదారిపై ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తే పెండింగ్ చలాన్లు ఉన్నాయంటూ కట్టమంటున్నారని వాహనచోదకులు వాపోతున్నారు. ఈ తప్పుడు చలాన్లపై ఫిర్యాదు చేయడానికి స్థానిక ట్రాఫిక్ పోలీసుస్టేషన్లకు వెళ్లే ప్రధాన కార్యాలయానికి వెళ్లమని చెప్తున్నారని.. అక్కడకు వెళ్తే ఠాణాకు వెళ్లి సరిచూసుకోవాలని సూచిస్తూ కాళ్లరిగేలా తిప్పుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఎంత మొత్తుకున్నా వారికి నిరాశే మిగులుతోంది తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు. ఠాణా పరిధినే మార్చేశారు ఈ ఏడాది ఆగస్టు 24న టీఎస్11ఈబీ9776 నంబర్ కలిగిన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్ పోలీసులు రూ.1000 ఈ–చలాన్ విధించారు. ఖిల్వత్ సమీపంలోని రాజేష్ మెడికల్ హాల్ వద్ద తీసిన ఫొటో పొందుపరుస్తూ వాహనచోదకుడు హెల్మెట్ ధరించని కారణంగా చలాన్ వేసినట్లు అందులో పేర్కొన్నారు. అయితే సౌత్‌జోన్ పరిధిలోని పాతబస్తీలో ఉన్న రాజేష్ మెడికల్ హాల్‌ను ట్రాఫిక్ పోలీసులు నార్త్‌జోన్‌లోని గోపాలపురం ఠాణాకు లిమిట్స్‌కు ‘మార్చేశారు’. అంతే కాదు... ఎవిడెన్స్‌గా ట్రాఫిక్ పోలీసులు పొందుపరిచిన ఫొటోలో వెనుక కూర్చున్న వాళ్లు హెల్మెట్ ధరించలేదు. దీనికి పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించలేదని చలాన్ విధించాల్సి ఉంది. ఈ ఏడాది మార్చ్ 9న టీఎస్10 ఈకే6850 నంబర్ కలిగిన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్ జంపింగ్ అంటూ రూ.1000 ఈ–చలాన్ విధించారు. తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోని హోలీ ఫ్యామిలీ చౌరస్తా వద్ద ఈ ఉల్లంఘనకు పాల్పడినట్లు పేర్కొంటూ ఓ ఫొటోను ఎవిడెన్స్‌గా పొందుపరిచారు. ఆ సమయంలో ఆ ప్రాంతానికి తాను వెళ్లలేదంటూ వాహనచోదకురాలు స్పష్టం చేస్తున్నారు. ఈ ఫొటోను ఎంత పరికించి చూసినా, ఏ స్థాయిలో పరిశీలించినా వాహనం నంబర్ కనిపించకపోవడం గమనార్హం. -
ఎవరైనా ఒక్కటే: తెలంగాణ సీఎస్ వాహనానికి ట్రాఫిక్ చలాన్
-
ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్చల్
ఆదిలాబాద్ టౌన్: వాహనాలకు ట్రాఫిక్ చలాన్ విధించే అధికారం ఎక్కడిది అంటూ ఓ సర్పంచ్ పోలీసులపై తిరగబడ్డాడు. తమ విధులకు ఆటంకం కలిగించాడని పోలీసులు ఆ సర్పంచ్‌పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్‌లో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కుమారుడు, జైనథ్ మండలంలోని ఆడ సర్పంచ్ పాయల్ శరత్. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ చలాన్ విధించడాన్ని పాయల్ శరథ్ తప్పుబట్టాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు చలాన్ విధించే అధికారం లేదంటూ తమ విధులకు పాయల్ శరథ్ ఆటంకం కలిగించారని ట్రాఫిక్ ఎస్సై రామారావు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. చదవండి: ‘సింగరేణి’పై రాజకీయ పార్టీల సిగపట్లు చదవండి: కుక్కర్లో ఇరుక్కున్న చిన్నారి తల.. డాక్టర్ ఫీజు ఒక్క రూపాయే! -
Hyderabad: బైక్‌పై చలాన్లు చూసి షాకైన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఒకటి, రెండు ఫైన్లు ఉంటేనే మనం గాబరపడిపోతుంటాం. ఫైన్ చెల్లించి జాగ్రత్త పడితే మేలని భావిస్తుంటాం. అయితే తాజాగా ఓ వ్యక్తికి వచ్చిన చలాన్లు చూసి ట్రాఫిక్ పోలీసులు సైతం షాక్ అయ్యారు. 79 చలాన్లు పెండింగ్‌లో ఉన్న బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. బుధవారం నేరేడ్మెట్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా సందీప్‌కుమార్‌కు చెందిన (ఏపీ 10 ఏడబ్లూ 2064) బైక్‌పై 79 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో బైక్‌ను సీజ్ చేసినట్లు మల్కాజిగిరి ట్రాఫీక్ సీఐ సుదీర్ కృష్ణ తెలిపారు. చదవండి: ఇతగాడి పెండింగ్ చలానాలను చూస్తే అవాక్కవ్వాల్సిందే.. -
Traffic Challan: వాహనదారులకు తీపి కబురు
సాక్షి, బనశంకరి( బెంగళూరు): వాహనదారులకు హోంశా మంత్రి ఎ.జ్ఞానేంద్ర తీపి కబురు అందించారు. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ స్పాట్ ఫైన్‌ను రద్దుచేయాలని పోలీసుశాఖను ఆయన ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు వినియోగిస్తున్న చలానా ఉపకరణాలను వారి వారి పోలీస్స్టేషన్లలో అప్పగించాలన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు నిలిపి అక్కడిక్కడే చలానాలు రాసి వసూలు చేస్తున్నారు. ఇందుకు పీడీఏ మిషన్లను ఉపయోగిస్తున్నారు. చలానాలపై ఆరోపణలు ఫైన్ చెల్లించినప్పటికీ పీడీఏ లేదా పీఓఎస్ మెషిన్లు గత జరిమానాలు పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా స్పాట్ చలానాలను రద్దు చేయాలని హోంమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్లపై డిజిటల్ కెమెరాలో రికార్డయ్యే ఉల్లంఘలనపై వాహనదారు ఇంటికి చలానా పంపిస్తారు. -
మీ వాహనంపై ట్రాఫిక్ చలానా ఉందా? అయితే, బండి సీజ్!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కొరడా ఝళిపించేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. చలానాలు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గ్రేటర్ పరిధిలో ఉన్న వాహనాలపై ఒక్క ట్రాఫిక్ చలానా పెండింగ్‌లో ఉన్నా.. వాహనాన్ని సీజ్ చేస్తామని సైబరాబాద్ పోలీసులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా గతంలో మూడు చలానాలు పెండింగ్‌లో ఉంటే వాహనం సీజ్ చేసేవారు. అయితే గతేడాది సైబరాబాద్ పరిధిలో 47.83 లక్షల కేసుల్ని నమోదు చేసిన పోలీసులు రూ.178.35 కోట్ల జరిమానా విధించారు. కానీ ఉల్లంఘనులు రూ.30.32 కోట్లు మాత్రమే చెల్లించారు. దీంతో సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ జరిమానాలు కట్టిస్తున్నారు. లేదంటే వాహనాలను సీజ్ చేస్తున్నారు. -
ఇతగాడి పెండింగ్ చలానాలను చూస్తే అవాక్కవ్వాల్సిందే..
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా ఓ ద్విచక్ర వాహనదారుడు రణదీర్ కొన్నాళ్లుగా పెండింగ్ చలానాలతో తప్పించుకు తిరుగుతూ దొరికిపోయాడు. పోలీసులు పరిశీలించగా ఈ యువకుడు నడుపుతున్న ద్విచక్ర వాహనంపై 90చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. రూ.21,510 జరిమానాలు పెండింగ్‌లో ఉండటంతో పోలీసులు వాటిని అప్పటికప్పుడే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. పెండింగ్ లిస్టు చూసి పోలీసులు ముక్కుమీద వేలేసుకున్నారు. చదవండి: 28 నెలలకే జన్మించిన శిశువు.. -
వాహనం నంబర్ తప్పు.. మరొకరికి జరిమానా
సాక్షి, మహబూబ్‌నగర్/ కోస్గి: మీ దగ్గర వాహనానికి సంబంధించి అన్ని ధ్రువపత్రాలు ఉన్నా.. వాహనంపై నంబర్ సక్రమంగానే ఉన్నా.. టైం బాగోలేక మీ వాహనం కోస్గికి రాకపోయినా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ జరిమానా విధిస్తూ ఆన్లైన్లో సమాచారం పంపించి తమదైన శైలిని ప్రదర్శిస్తున్నారు కోస్గి పోలీసులు. వరుస సంఘటనలు పరిశీలిస్తే.. ► కోయిలకొండ మండలానికి చెందిన ఓ యువకుడి సెల్‌ఫోన్‌కు మంగళవారం రాత్రి ఓ మెస్సేజ్ వచ్చింది. ఈ నెల 20న ఉదయం 11:30 సమయంలో కోస్గి పోలీస్‌స్టేషన్ పరిధిలో హెల్మెట్ లేకుండా టీఎస్ 06 ఈఎస్ 4151 నంబర్ బైక్ నడిపారని.. రూ.235 జరిమానా చెల్లించాలని పంపించారు. బైక్‌పై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న ఫొటోను సైతం అప్లోడ్ చేశారు. ఇది చూసిన సదరు యువకుడు కోస్గికి వెళ్లకుండానే జరిమానా ఎలా విధించారని ఆన్లైన్లో వాహనం ఫొటో పరిశీలించగా టీఎస్ 06 ఈఎస్ 4951 బదులు 4151గా తప్పుగా నమోదు చేసిన విషయం బయటపడింది. ఇదే విషయాన్ని సదరు యువకుడు నేరుగా కోస్గి పోలీసులను ప్రశ్నించగా వివరాలు తప్పుగా నమోదు చేసినట్లు ఒప్పుకొని వివరాలు సరి చేస్తామని సర్ది చెప్పారు. ► బైక్‌కు సంబంధించిన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవటంతో రూ.200 జరిమానా విధించినట్లు పట్టణానికి చెందిన లతీఫ్‌కు మెస్సేజ్ వచ్చింది. అన్ని కాగితాలు సరిగా ఉన్నాయి.. వాహనాన్ని తనిఖీ చేయకుండానే జరిమానా విధించడమేమిటని అవాక్కయ్యారు. తన వద్ద అన్ని కాగితాలున్నాయి.. వాహనాన్ని తనిఖీ చేయకుండానే, వివరాలు తెలుసుకోకుండా జరిమానా ఎలా విధిస్తారని పోలీసుల్ని నిలదీశారు. ఆన్లైన్లో నమోదైన తర్వాత ఏం చేయలేమంటూ పోలీసులు చేతులెత్తేసారు. పోలీసులతో మనకేందుకు గొడవ అనుకొని బయటకు చెప్పుకోలేని వాహనదారులు ఎందరో చేయని తప్పులకు జరిమానాలు చెల్లిస్తున్నారు. ఇలాంటి సంఘటనలతో స్థానిక పోలీసుల తీరును పలువురు యువకులు తమదైన శైలిలో విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకొని రహదారి నిబంధనలు ఉల్లంఘించిన వారికి మాత్రమే జరిమానాలు విధించాలని కోరుతున్నారు. తప్పులు జరగకుండా చూస్తాం ఆన్లైన్లో వాహనం నంబర్ తప్పుగా నమోదు చేయటంతో ఒకరికి బదులు మరొకరికి జరిమానా చెల్లించాలని సమాచారం వెళ్లింది. తీసిన ఫొటోను క్షుణ్ణంగా పరిశీలించి సరైన వాహనం నంబర్‌ను నమోదు చేయాలని సిబ్బందికి సూచించాం. ఇకపై తప్పులు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపాం. అవసరమైతే సంబంధం లేని వాహనదారులకు వేసిన జరిమానాలు మేమే చెల్లించేలా చూస్తాం. – నరేందర్, ఎస్ఐ, కోస్గి -
ఆరు చలాన్లు కట్టిన టాలీవుడ్ హీరో
'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' వంటి విలక్షణమైన హిట్ చిత్రాల్లో నటించి, హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అనేదానికన్నా ఎంత గుర్తింపు సంపాదించుకుందనేదాన్నే ఎక్కువగా పట్టించుకుంటాడాయన. తాజాగా అతడు సుమంత్, నందిత శ్వేతల కపటధారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ట్రాఫిక్ ఎస్సై వేషం కట్టిన శ్యామల ఇప్పటివరకు ఎన్ని చలాన్లు కట్టావంటూ కూపీ లాగింది. దీంతో అడ్డంగా దొరికిపోయిన అడివి శేష్ అసలు విషయాన్ని చెప్పక తప్పలేదు. డ్రింక్ అలవాటు లేదు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎప్పుడూ పట్టుబడలేదని, అయినా ఆరు చలానాలు పడ్డాయని తెలిపాడు. ఈ మధ్యే ఆర్ఆర్ఆర్ దగ్గర ఆపి తన ఆరు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పి కట్టించుకునేవరకు వదల్లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమా మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఇండియా నిర్మిస్తోంది. శోభితా దూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, సయీ మంజ్రేకర్, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. చదవండి: ఆయన కళ్లల్లో ప్యాషన్ కనిపించింది– అడివి శేష్ కంగనాపై రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ -
లాక్డౌన్ : స్థలం లేదు తీసుకెళ్లండి
సీజ్ చేసిన వాహనాలను సంబంధిత యజమానులకు అప్పగించేందుకు పోలీసు యంత్రాంగం నిర్ణయించింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12.30లోపు యజమానులు వారి వాహనాలను ఆయా ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో పొందవచ్చని వెల్లడించారు. సీజ్ చేస్తున్న వాహనాల సంఖ్య పెరగడం.. పార్కింగ్ చేయడానికి చాలినంత స్థలం లేకపోవడంతోనే మళ్లీ యజమానులకు వాహనాలను అప్పగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సాక్షి, చెన్నై: లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత రోడ్ల మీదకు ఇష్టానుసారంగా వచ్చే వారి సంఖ్య ఎక్కువవుతోంది. వీరి భరతం పట్టే విధంగా పోలీసులు ముందుకు సాగుతున్నారు. కేసులు, అరెస్టులు, వాహనాల సీజ్, జరిమానాలు అంటూ కొరడా ఝుళిపించారు. రోజురోజుకూ సీజ్ చేస్తున్న వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఇందులో అత్యధికంగా మోటారు సైకిళ్లు ఉన్నాయి. ♦ ఆయా పోలీసు స్టేషన్లు, వాటి పరిధిలోని ఖాళీ స్థలాల్లో సీజ్చేసిన వాహనాలు పార్క్ చేస్తున్నారు. వీటికి పోలీసు భద్రత అన్నది తప్పని సరిగా మారింది. అదే సమయంలో వాహనాల సంఖ్య క్రమంగా పెరగడంతో వాటిని పార్కింగ్ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో ఆయా వాహన యజమాలనకు మళ్లీ అప్పగించేందుకు సిద్ధమయ్యారు. వాహనాల అప్పగింత రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 24వ తేదీ నుంచి ఈ నెల 14వ తేదీ వరకు లక్షా 85 వేల కేసులు నమోదు చేశామని, లక్షా 56 వేల వాహనాలు సీజ్ చేశామని పోలీసులు చెప్పారు. వీటికి జరిమానా రూపంలో రూ. 82.32 లక్షలు వచ్చినట్టు పేర్కొన్నారు. మోటారు సైకిళ్లను సీజ్‌చేస్తూ రావడం వల్ల, ఆయా వాహనాల కోసం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరుగుతోందని, వారిని ఈ సారికి కరుణించే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు ప్రటించారు. గట్టి హెచ్చరికలు, నిబంధనల మేరకు వారికి వాహనాలు అప్పగించేందుకు నిర్ణయించామని పేర్కొన్నారు. ఆ మేరకు సీజ్ చేసిన వాహనాల్లో అత్యధికంగ మోటారు సైకిళ్లు ఉన్నాయని, ఆయా యజమానులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాటిని అప్పగిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని, ఆయా వాహనదారులకు ఈ సిబ్బంది సమాచారాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఏ రోజు, ఏ సమయంలో వాహనాలను పొందాలి అన్న సమాచారం వాహనదారుడికి చేరగానే వచ్చి తీసుకెళ్లవచ్చని సూచించారు. వాహనదారుడు లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ ఒరిజినల్‌తో పాటు నకలు తీసుకు రావాలని సూచించారు. నకలు పోలీసులు తీసుకుంటారని, ప్రతి వాహనదారుడు లాక్డౌన్ కొనసాగినన్ని రోజులు రోడ్డు మీదకు రాబోమని, ఒక వేళ వస్తే తమ వాహనాలు సీజ్ చేసుకోవచ్చని పేర్కొంటూ, లిఖిత పూర్వంగా లేఖను సమర్పించాల్సి ఉంటుందని పోలీసులు మెలికపెట్టడం గమనార్హం. ఒక్కో వాహనం పంపినీకి మధ్య అర గంట సమయం ఉంటుందని, ఈ దృష్ట్యా, రోజుకు పది వాహనాలు మాత్రమే అందజేస్తామని, పోలీసు ఇచ్చే సమాచారం, సమయంలో మాత్రమే రావాలని, ఇతర సమయాల్లో వస్తే వాహనాలు ఇవ్వబోమని హెచ్చరించారు. -
ఉల్లంఘనులు 20,080
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కనీవిని ఎరుగని రీతిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఎందుకంటే కరోనా ప్రభావంతో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లకు మంగళం పాడడంతో రోడ్లపైనే ఉండి కెమెరాలు చేతిలో పట్టుకొని ట్రాఫిక్ ఉల్లంఘనులపై దృష్టి సారించారు. ఫలితంగా శనివారం ఒక్కరోజే 22,080 ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఈ చలాన్లు జారీ చేశారు. సాధారణ రోజుల్లో అయితే 12,000 నుంచి 13,000 వరకు ఉంటే శనివారం మాత్రం అమాంతంగా ఏడు వేలకుపైగా ఈ చలాన్లు పెరిగి 20,000 దాటి రికార్డును సృష్టించాయి. రాంగ్‌రూట్ డ్రైవింగ్‌లే అధికం మాదాపూర్, బాలానగర్, శంషాబాద్ జోన్లలోని పది ట్రాఫిక్ ఠాణాల్లో రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు కెమెరాలు చేతిలో పట్టుకొని విధులు నిర్వహించారు. ఇలా ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కిన ఉల్లంఘనల్లో అత్యధికంగా రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, వితవుట్ హెల్మెట్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. పిలియన్ రైడర్లు కూడా హెల్మెట్ లేకపోవడంతో ఫొటోలు క్లిక్ మనిపించి ఈ చలాన్ వెబ్సైట్లో ఫొటోతో సహా ఉల్లంఘన ప్రాంతాన్ని కూడా నిక్షిప్తం చేశారు. సంబంధిత వాహన యజమాని సెల్‌కు సైతం ఎస్ఎంఎస్లు పంపారు. అయితే ఎక్కడా వాహనాలను ఆపి తనిఖీ చేయక పోవడంతో డ్రైవింగ్ లైసెన్స్ లేని జరిమానాలు నమోదు కాలేదు. అయితే సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం 2,497 ఈ చలాన్లను జారీ చేసిందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉల్లంఘనుల్లో 70 శాతం వరకు ద్విచక్ర వాహనదారులే ఉన్నా రని అధికారులు తెలిపారు. -
పోలీసులకు వాహనదారుల ఝలక్
పోలీసులను ద్విచక్రవాహనదారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ట్రాఫిక్ చలానా నుంచి తప్పించుకునేందుకు కొందరు నంబర్లు మార్చి రోడ్డుపై తిరుగుతున్నారు. దీంతో ఫొటోలు తీసి చలానా వేస్తుండగా అసలైన యజమాని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. సాక్షి, పాలకుర్తి(రామగుండం): రహదారిపై భద్రతా నియమాలు పాటించకుండా ట్రాఫిక్‌రూల్స్ అతిక్రమిస్తున్న వాహనదారులపై ప్రస్తుతం పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. పోలీసులు విధించే ఆన్లైన్ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. వాహనాలకు ఇతరుల వాహన నంబర్లు రాయించుకొని తిరుగుతున్నారు. పోలీసులకు పట్టుబడినపుడు వారు విధించే జరిమానాకు సంబంధించిన సమాచారం అదేనెంబర్ కలిగిన అసలు వాహనదారులకు వెళ్తుండడంతో వారు ఖంగుతింటున్నారు. దీంతో సంబంధిత వాహన యజమానులు తమ వాహనం ఆ స్టేషన్ పరిధిలో వెళ్లలేదని, తాము ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇలాంటి ఘటన ఇటీవల బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల పోలీసుల వాహన తనిఖీల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ కుక్కలగూడుర్‌కు చెందిన వ్యక్తి చిక్కాడు. పోలీసులు అతడికి జరిమానా విధిస్తూ ఆన్లైన్ రసీదు అందించారు. అయితే పోలీసులు విధించిన జరిమానా సమాచారం హైదరాబాద్‌కు చెందిన మరోవ్యక్తికి సెల్ఫోన్లో మెసేజ్ వెళ్లింది. దీంతో ఖంగుతిన్న వాహన యజమాని సంబంధిత స్టేషన్‌కు కాల్చేసి వివరాలు అడిగాడు. తాను హైదరాబాద్‌లో ఉంటానని, నా వాహనం మీ స్టేషన్ పరిధిలో ఎక్కడికి రాలేదని, తనకు జరిమానా ఎలా విధిస్తారని వాగ్వాదానికి చేశాడు. దీంతో పోలీసులు సీరియస్‌గా తీసుకొని వాహన నెంబర్ ఎంట్రీ చేయడంలో ఏదైనా పొరపాటు దొర్లిందా అని పునరాలోచనలో పడి వివరాలు సరి చూసుకున్నారు. కానీ వాహన వివరాలు కరెక్ట్‌గా ఉండడంతో విస్తుపోయారు. వాహనదారుడు అంతటితో ఆగకుండా కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశాడు. కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు మరోసారి తాము ఎంట్రీ చేసిన వివరాలు పరిశీలించారు. జరిమానా విధించిన వాహనదారుడిని స్టేషన్‌కు పిలిపించి విచారణ జరపడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తన బైక్‌కు నంబర్‌లేదని, ఫ్యాన్సీగా ఉంటుందని ఒకనంబర్ తగిలించుకుని తిరుగుతున్నానని, ఇది గత మూడేళ్లుగా చేస్తున్నానని తెలుపడంతో పోలీసులు అవాక్కయ్యారు. అతడి వాహననంబర్ ప్లేటు తొలగించి సదరు వ్యక్తితో జరిమానా కట్టించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటన బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాణాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి జరిగింది. కరీంనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాఫిక్‌రూల్స్ అతిక్రమించినందుకు జరిమానా విధించినట్లు అతడి సెల్‌కు మేసేజ్ వెళ్లింది. ఈవిధంగా నాలుగైదు సార్లు రావడంతో సంబంధిత వివరాలు పరిశీలించిన వ్యక్తికి అతడి వాహన నెంబర్‌తో కలిగిన మరో వాహనం ఫొటో కనిపించడంతో అవాక్కయ్యారు. ప్రస్తుతం ట్రాఫిక్ నిబంధనల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఆకతాయిలు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడం అటు పోలీసులను, అసలు వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. -
‘అడ్డుగా వచ్చాడని వేసుకెళ్లి పోయాడు’
ఢిల్లీ : రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి ట్రాఫిక్ సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వాహనాలకు అన్ని పత్రాలు ఉన్నాయా..? లేదా అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లేని పక్షంలో కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం భారీ జరిమానా విధిస్తున్నారు. అయితే, కొందరు కేటుగాళ్లు చలానా తప్పించుకోవడానికి ట్రాఫిక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. అవసరమైతే వారిపై దాడులకూ యత్నిస్తున్నారు. తాజాగా వైరల్ అయిన ఓ వీడియోలో.. కారు డ్రైవర్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌నే ఢీకొట్టాలని చూశాడు. అడ్డుగా వచ్చిన కానిస్టేబుల్‌ను ఏకంగా 2 కిలోమీటర్లు కారు బానెట్‌పైనే లాక్కెళ్లాడు. ఢిల్లీలోని నంగోయి చౌక్ వద్ద గత నవంబర్‌లో ఈ ఘటన జరగగా.. తాజాగా వైరల్ అయింది. సునీల్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ కారును అడ్డగించాడు. వాహన పత్రాలు చూపించాలని చెప్పాడు. అయితే, కారు డ్రైవర్ పత్రాలు ఇవ్వకపోగా.. అడ్డు తప్పుకోవాలని కానిస్టేబుల్‌నే హెచ్చరించాడు. అతను వినకపోవడంతో.. కారు ముందుకు పోనిచ్చాడు. దీంతో కానిస్టేబుల్ ఒక్క ఉదుటున బానెట్‌పైకి చేరి.. వాహనాన్ని ఆపాలని మరోసారి హెచ్చరించాడు. అయినప్పటికీ.. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా దాదాపు 2 కిలోమీటర్లు అలాగే పోనిచ్చాడు. ఇదంతా ఆ కారులోనే ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇక డ్రైవర్ నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘వెర్రి వేషాలకు ఇది పరాకాష్టా అతని పై చర్యలు తీసుకోండి’ అని డిమాండ్ చేస్తున్నారు. -
‘పాపం.. అతడి తెలివే చలానా కట్టేలా చేసింది’
ఓ వ్యక్తి ట్విటర్లో ద్విచక్ర వాహనం నెంబరు ప్లేటును షేర్ చేస్తూ.. పుణె ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేశాడు. ఇందుకు ఓ పోలీసు అధికారి చమత్కారంగా స్పందించి.. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు. వివరాలు... పుణేకు చెందిన పంకజ్ అనే ట్విటర్ యూజర్ ఇద్దరు వ్యక్తులు వెళ్తున్న తెలుపు రంగు స్కూటీ నెంబర్ ప్లేటుపై.. కిరీటం ఉన్న స్టిక్కర్‌ను గుర్తించి ట్విటర్లో షేర్ చేశాడు. అది చూసిన ఓ పోలీసు అధికారి ‘ ఈ స్కూటీ యజమానికి ఉన్న అతి తెలివి.. పాపం ఆయనను త్వరలోనే చలాన కట్టేలా చేసింది’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ఈ క్రమంలో ఈ పోస్టుకు వేలల్లో లైక్‌లు రాగా.. వందల్లో కామెంట్లు వస్తున్నాయి. కాగా మోటారు వాహన చట్టం- 1988, కేంద్ర మోటారు వాహన చట్టం 1989లోని నిబంధనల ప్రకారం.. నెంబరు ప్లేటుపై రిజిస్ట్రేషన్ నెంబరు తప్ప మరేమీ ఉండకూడదు. ఒకవేళ ఏదైనా బొమ్మలు కానీ ఇతరత్రా గుర్తులు ఉంటే నిబంధనల ఉల్లంఘన కింద వారి మీద చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే సదరు పోలీసు అధికారి పైవిధంగా స్పందించారు. His highness will unfortunately have to oblige us with a Challan soon! 📃 #TrafficRules #TrafficViolation https://t.co/rgq6OFInSF — PUNE POLICE (@PuneCityPolice) January 7, 2020 -
ప్రియాంకకు లిఫ్ట్.. రిటైర్డు ఐపీఎస్‌కు జరిమానా
-
ప్రియాంకకు లిఫ్ట్.. రిటైర్డు ఐపీఎస్‌కు జరిమానా
లక్నో : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని శనివారం లక్నో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసింది. అయితే ఆ సమయంలో కాన్వాయ్ నుంచి దిగిన ఆమె.. రిటైర్డు ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి ద్విచక్రవాహనంపై వెళ్లారు. దీనిపై ఆదివారంసీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆయన వాహనం నడుపుతున్న సమయంలో హెల్మెట్ లేదని జరిమానా విధించారు. రూ.6100 జరిమానా వేస్తున్నట్లు లక్నో ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు సీఏఏ నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో దారాపురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. కాంగ్రెస్ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే కార్యక్రమం అనంతరం పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన సందర్భంలో ఇటీవల చోటుచేసుకున్న ఆందోళనలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు ప్రియాంక బయలుదేరారు. అయితే ఆమె వెళ్లడానికి వీళ్లేదంటూ అక్కడి పోలీసులు రోడ్డుపైనే అడ్డుకున్నారు. ఈ సమయంలో తనపై అక్కడి పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై పోలీసులు చేయి చేసుకున్నారని, మెడపై చేయి వేసి పక్కకు నెట్టివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిఘటించిన తనపై దాడి కూడా చేశారని ప్రియాంక ఆరోపించారు. -
వైరల్ : ఫైన్ వేశారని నానా రభస చేశాడు
మీరట్ : ఒక వ్యక్తి తాను హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు ఫైన్ వేయడంతో బైక్‌ను కిందపడేసి నానా రభస చేసిన ఘటన శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మీరట్‌కు చెందిన ఒక వ్యక్తి బైక్‌పై వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. హెల్మెట్ ధరించనందుకు చలాన్ వేస్తున్నట్లు అతనికి తెలిపారు. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా తన బైక్‌ను కింద పడేసి రోడ్డుపై రెండు సార్లు అటూ ఇటూ దొర్లించి తర్వాత అదే బైక్‌పై కూర్చొని ఏడ్వడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. అతని వింత ప్రవర్తన అర్థంగాక పోలీసులు ఆ వ్యక్తిని సముదాయించేందుకు ప్రయత్నించారు. కాగా మొత్తం 43 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో నెటిజన్లు ఈ వీడియోనూ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ' పోలీసులు చలాన్ వేస్తే కడితే కట్టాలి లేకపోతే లేదు కానీ ఇలా చేయడం ఏంటని' కామెంట్లు పెడుతున్నారు. Agitated over traffic challan, a biker in UP's Meerut took out his anger on his motorcycle. He later sat on the fallen bike and started crying as traffic cops stood and watched the entire drama unfolding on a busy street in the city. @Uppolice pic.twitter.com/lZ8TfQYUWt — Piyush Rai (@Benarasiyaa) November 25, 2019 -
ఇంజిన్ లేని బైక్‌కు జరిమానా
సాక్షి, చెన్నై: ఇంజిన్ లేని మోటార్ బైక్‌ను తోసుకుంటూ వచ్చిన యువకుడికి ఓ ఎస్ఐ రూ.వెయ్యి జరిమానా విధించి సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారారు. దీంతో ఆ ఎస్ఐకి డీఎస్పీ మెమో ఇచ్చారు. తమిళనాడు, కడలూరు జిల్లా భువనగిరి తాలుకా సేత్తియాతోపు గ్రామానికి చెందిన శక్తివేల్ తన మోటార్ సైకిల్‌ను మరమ్మతుల నిమిత్తం బుధవారం ఉదయం మెకానిక్ షాపునకు తరలించారు. అక్కడ ఇంజిన్ భాగాన్ని మెకానిక్ విప్పేయగా, సమీపంలోని వాగులో తన మోటార్ సైకిల్‌ను శుభ్రం చేయడానికి శక్తి వేల్ నిర్ణయించాడు. ఇంజిన్ లేని ఆ మోటార్ సైకిల్‌ను తోసుకుంటూ వాగు వద్దకు వెళ్తున్న శక్తివేల్‌ను ఎస్ఐ రత్నవేల్ అడ్డుకున్నాడు. పేపర్లు చూపించాలని, హెల్మెట్ ఎక్కడ అని ప్రశ్నిస్తూ రూ.వెయ్యి జరిమానా విధించాడు. అయితే, తాను మరమ్మతులకు గురైన ఇంజిన్ లేని మోటార్ సైకిల్‌ను తోసుకొచ్చానని, జరిమానా చెల్లించబోనని చెప్పాడు. అయితే, ఎస్ఐ దూకుడు ప్రదర్శించడంతో చివరకు ఆ దృశ్యాలను తన మొబైల్ కెమెరాలో శక్తివేల్ చిత్రీకరించాడు. తనకు ఎలక్ట్రానిక్ మెషిన్ రశీదు ఇస్తే వెయ్యి చెల్లిస్తానని చెప్పేశాడు. ఆ ఎస్ఐ మరీ దూకుడుగా వ్యవహరించడంతో ఆ వీడియో దృశ్యాల్ని వాట్సాప్ ద్వారా సామాజిక మాధ్యమాల్లోకి శక్తివేల్ ఎక్కించాడు. ఇది మరింత హల్చల్ కావడంతో ఎస్ఐ తీరుపై డీఎస్పీ జవహర్లాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీంతో మెమో జారీ చేశారు. కాగా, వీరంగం ప్రదర్శించిన ఆ ఎస్ఐ మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. -
హెల్మెట్ లేదని లారీ డ్రైవర్‌కు జరిమానా!
కర్ణాటక,బొమ్మనహళ్లి: సాధారణంగా బైక్‌పై వెళ్తున్న వారు హెల్మెట్ ధరించకుంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే 409 లారీలో వెళ్తున్న డ్రైవర్ హెల్మెట్ వేసుకోలేదని సదరు డ్రైవర్‌కు జరిమానా విధించిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా కార్వార్లో చోటుచేసుకుంది. దీంతో రసీదు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తర కన్నడ జిల్లా కార్వార సమీపంలోని దాండేలి నగరంలో 409 వాహన డ్రైవర్‌గా నజీర్ ఇంటికి పోలీసులు నోటీసు పంపారు. హెల్మెట్ ధరించ లేదని జరిమానా చెల్లించాలని నోటీసు పంపారు. దీంతో పోలీసులు నోటీసు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
189 చలానాలు.. బైక్ మీరే తీసుకొండి
చండీగఢ్: కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ట్రాఫిక్ చలానా అంటే చాలు జనాలు దడుచుకుంటున్నారు. కొత్త రూల్స్ ప్రకారం ఒకటి, రెండు చలానాలు వస్తే.. చాలు.. ఆ సొమ్ము చెల్లించడానికి ఏకంగా వాహనాన్ని అమ్మల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఓ బైక్ మీద ఏకంగా 189 చలానాలు ఉండటం ఒక ఎత్తయితే.. దీని గురించి సదరు బైక్ యజమానికి ఎలాంటి సమాచారం లేకపోవడం ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం. వివరాలు.. చండీగఢ్‌కు చెందిన సంజీవ్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సెక్టార్ 33 ప్రాంతంలో రాంగ్ డైరెక్షన్లో యూ టర్న్ తీసుకున్నాడు. దాంతో ట్రాఫిక్ సిబ్బంది అతనికి రూ.300 చలానా విధించి.. జిల్లా కోర్టుకు పంపించారు. అక్కడ సంజీవ్‌కు దిమ్మతిరిగిపోయే విషయం తెలిసింది. 2017-19 మధ్య కాలంలో సంజీవ్ మీద 189 ట్రాఫిక్ చలానా నమోదయ్యాయనే విషయం వెలుగు చూసింది. దాంతో ఆశ్చర్యపోవడం సంజీవ్ వంతయ్యింది. దీని గురించి సంజీవ్ మాట్లాడుతూ.. ‘పని ఒత్తిడి కారణంగా అప్పుడప్పుడు నేను ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాను. కానీ మరి ఇంత భారీ సంఖ్యలో నా మీద చలానాలు నమోదైన సంగతి నిజంగా నాకు తెలీదు. దీని గురించి ట్రాఫిక్ సిబ్బంది కూడా నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు’ అని తెలిపాడు. అంతేకాక ‘కొత్త చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి జాగ్రత్తగానే ఉంటున్నాను. కానీ ఇన్ని చలానాలున్నాయని నిజంగానే నాకు తెలీదు. ఇప్పుడు చలానాలను చెల్లించడం కంటే బైక్‌ను ఇక్కడే వదిలేసి వెళ్లడం మంచిది’ అంటూ వాపోయాడు. గతంలో ఓ పాల వ్యాపారి బైక్ మీద కూడా 36 చలానాలున్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
దొంగను పట్టించిన ఈ–చలానా
బంజారాహిల్స్: ట్రాఫిక్ పోలీసులు పంపించిన ఈ–చలానా ఓ బైక్ దొంగను పట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడకు చెందిన కురుసం శేషు కొన్నాళ్ల క్రితం తన బైక్‌ను ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. మరుసటి రోజు ఉదయం బయటికి వచ్చి చూడగా బైక్ కనిపించకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా బాధితుడికి ట్రాఫిక్ పోలీసుల నుంచి వారం రోజుల్లో ఐదు ఈ–చలానాలు అందాయి. దీంతో అతను రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ క్రైం పోలీసులకు వివరాలు అం దజేశాడు. పోలీసులు ఈ –చలానాలు పరిశీలించగా ఒక దాంట్లో బైక్ దొంగిలించిన వ్యక్తి ఫొటో స్పష్టంగా కనిపించింది. దీంతో క్రైం ఎస్ఐ శంకర్ శ్రీకృష్ణానగర్‌లో విచారణ చేపట్టారు. ఓ పాన్‌డబ్బా వ్యాపారి సదరు వ్యక్తిని తాను చాలాసార్లు చూశానని లేబర్‌గా పని చేస్తాడని చెబుతూ కృష్ణానగర్‌లో అతడి ఇంటిని చూపించాడు. పోలీసులు నేరుగా అతడి ఇంటికి వెళ్లి నిందితుడు శ్రీశైలంను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో నేరం అంగీకరించడంతో సోమవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మీ వాహనం అమ్మేశారా..?
పెద్దశంకరంపేట(మెదక్): పాత వాహనాల అమ్మకం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అసలైన యజమానులు ఆర్థికంగా నష్టపోక తప్పదు. ఇటీవలె పెరిగిన ఈ–చలాన్లతో ఇబ్బందులు భారీగానే ఎదురవుతున్నాయి. ఆరు నెలల క్రితం పాత వాహనాన్ని అమ్మిన ఓ వాహనదారుడికి ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నాయి. పాత వాహనాన్ని అమ్మిన సమయంలో కేవలం చిన్నపాటి బాండ్‌పేపర్‌పై అమ్మక ఒప్పందాలు చేసుకొని వాహనాన్ని అమ్మేశాడు. సదరు వాహనాన్ని కొనుగోలు చేసి న వ్యక్తి వాహనాన్ని తనపేరుపై రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అలాగా నడిపిస్తుండడంతో పాత యజమానికిపై ఈ–చలాన్ భారం పడింది. ఈ విషయాన్ని సదరు అధికారులకు తెలిపినా ఫలితం లేకపోవడంతో లబోదిబోమంటున్నా డు. జిల్లా వ్యాప్తంగా నిత్యం పాత, కొత్తవాహనాల కొనుగోలు ఎప్పటికప్పుడు పెరుగుతూపోతుంది. ఇటు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల అమ్మకాలు కొనసాగుతున్నాయి. సరైన అవగాహన లేక ఇటు అమ్మకందారులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. జిల్లాలో 35 శాతం పాతవారే యజమానులు జిల్లాలో అనేక రకాల వాహనాలు కలిపి నాలుగు లక్షల వరకు ఉండగా ఇందులో దాదాపు 35 శాతం వరకు పాత వాహనాల యజమానుల వాహనాలు వినియోగించే వారున్నారు. వాహనాన్ని కొనుగోలు చేసిన వారం, పది రోజుల్లోనే యాజమాన్య హక్కులను మార్చుకుంటే ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. యాజమాని వాహన విషయంలో మార్పులు చేసుకొనే సమయాన్ని జాప్యం చేస్తే జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. పన్నుల భారం తప్పదు పాత వాహనాలు అమ్మిన వారు నూతన వాహనం కొనుగోలు చేస్తే పన్నుల రూపంలో అదనంగా నగదు చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనదారులకు 9 శాతం, కారుకు 12 శాతం జీవితకాలం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు పాత వాహన యజమాని అదనంగా మరో వాహనాన్ని కొనుగోలు చేస్తే ద్విచక్రవాహనానికి, కారుకు 14 శాతం చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది ఈ విషయంపై అవగాహన లేక అదనంగా పన్నులు చెల్లిస్తున్నారు. 29,30 ఫారాలపై సంతకాలు తీసుకోవాలి వాహనాలను కొనుగోలు చేసే సమయంలో వెంటనే ఆర్సీ, బీమా, కాలుష్యం, చిరునామా ధృవీకరణ పత్రంతో పాటు ఫారం నెంబర్ 29, 30లపై వాహనాన్ని విక్రయించిన వారి సంతకాలు, ఆధార్ జీరాక్స్‌ను తీసుకుంటే వాహన పత్రాల బదిలీ సులభమవుతుంది. -
అంత భారీ చలాన్లా? ప్రజలెలా భరిస్తారు?
ముంబై: ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతన మోటారు వాహన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు భారీమొత్తంలో పెరిగాయి. ఈ చట్టం అమలులోకి రావడంతో ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన పలువురు వాహనదారులకు ఒక్కరోజే ఏకంగా రూ. 59వేల వరకు జరిమానాలు విధించారు. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షం శివసేన ట్రాఫిక్ జరిమానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధించడంలోని ఆంతర్యమేమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఈస్థాయిలో జరిమానాలు విధిస్తే.. సామాన్య ప్రజలు ఎలా భరిస్తారని ప్రశ్నించింది. కొత్త మోటారు వాహన చట్టానికి తాను వ్యతిరేకం కాదని, కానీ జరిమానాలు సామాన్య ప్రజలు భరించలేనివిధంగా చాలా ఎక్కువగా ఉండటాని తాము వ్యతిరేకిస్తున్నామని శివసేన అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది. ‘కొత్త చట్టంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు దాదాపు పదిరెట్లు ఎక్కువగా జరిమానాలు పెంచారు. కొత్త చట్టం ఆహ్వానించదగిందే. కానీ మన దేశంలో నిరుపేదలకు అంత భారీస్థాయి జరిమానాలు భరించే స్తోమత ఉందా?’ అని సామ్నా పేర్కొంది. నితిన్ గడ్కరీ ప్రవేశపెట్టిన ఈ చట్టంలో పెద్దమొత్తంలో జరిమానాలు ప్రతిపాదించడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయని తెలిపింది. ఇప్పటికైనా కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ భారీగా పెంచిన జరిమానాలపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. రోడ్ల మీద అనేక గుంతలు ఉన్నాయని, ఆ గుంతల వల్ల ప్రమాదాలు జరుతున్నాయని, ఈ గుంతలు సరిచేసి.. రహదారులను చక్కగా తీర్చిదిద్దిన అనంతరం కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తే బాగుండేదని సామ్నా అభిప్రాయపడింది. రోడ్లను సరిచేసేవరకు కొత్త చట్టం అమలును నిలిపేయాలన్న గోవా కాంగ్రెస్ డిమాండ్‌ను ఈ సందర్భంగా ‘సామ్నా’ తన సంపాదకీయంలో ప్రస్తావించింది. -
‘కోహ్లి ట్రాఫిక్ చలాన్ కట్టావా.. ఏంటి?’
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులను ఖుషి చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా కోహ్లి పోస్ట్ చేసిన ఓ ఫోటోపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కేవలం షార్ట్ మాత్రమే ధరించి.. నేలపై కూర్చుని ఉన్న ఫోటోను.. ‘మన అంతరంగంలోకి మనం చూసుకున్నంత కాలం.. బయటి దేని గురించి మనం వెతకవలసిన అవసరం లేదు’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు కోహ్లి. ఈ ఫోటోపై కొందరు అభిమానులు సానుకూలంగా స్పందించగా.. మరికొందరు నెటిజనులు మాత్రం ‘కోహ్లి ట్రాఫిక్ చలాన్ కట్టావా.. ఏంటి’ అని కామెంట్ చేస్తున్నారు. As long as we look within, we won't need to seek anything outside. 💫 pic.twitter.com/CvUVElZwjm — Virat Kohli (@imVkohli) September 5, 2019 రెండు రోజుల క్రితం ట్రాఫిక్ అధికారులు ఆర్సీ, హెల్మెట్ లేదనే కారణంతో ఓ వ్యక్తికి రూ.23 వేల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని నెటిజన్లు ఇలా స్పందిస్తున్నారు. ‘బట్టలు వేసుకుని కూడా ఈ విషయం చెప్పవచ్చు కోహ్లి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. వెస్టిండీస్‌పై టెస్ట్ సిరీస్ విజయంతో కోహ్లి భారత అత్యుత్తమ కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. (చదవండి: ధోని రికార్డును బ్రేక్ చేసిన కోహ్లి) -
జరిమానాలు పెరగాలా?
‘భరత్ అనే నేను’ అన్న సినిమాలో అనుకోకుండా హీరో ముఖ్యమంత్రి అవు తాడు. గందరగోళంగా ఉన్న ట్రాఫిక్‌ను చూసిన అతను జరిమానాలను విప రీతంగా పెంచేస్తాడు. జరి మానాలను పెంచడం అవ సరమా? ఇప్పుడున్న పరిస్థి తులకు అనుగుణంగా, పడిపోయిన రూపాయి విలు వకు దగ్గర్లో ఈ జరిమానాలు ఉన్నాయా? అనే సందే హాలు సహజంగానే వస్తాయి. డబ్బును జప్తు చేసు కోవడమే జరిమానా. కోర్టులు విధించే జరిమానాకు గాను ముద్దాయి చెల్లించే రుసుము. ట్రాఫిక్ జరిమా నాలు నేరాలే అయినా ఆ నేరాలు చేసిన వ్యక్తులు నేర స్తులు కాదు. చట్టాన్ని ఉల్లంఘించినవారుగా వారిని పరిగణిస్తారు. జరిమానా అనేది ఆర్థికంగా నష్టం కలి గిస్తుంది కానీ అది సమాజంలో ఆ వ్యక్తిపై మచ్చగా ఉండదు. జైలుకు వెళ్లినప్పుడు కలిగే మనోవ్యథ జరిమానా చెల్లించడంలో ఉండదు. సంస్కరణ అనేది సాధ్యం కాని కేసుల్లో కోర్టులు సాధారణంగా నేర స్తులకి జరిమానాలను విధిస్తాయి. దానివల్ల ఆ వ్యక్తి మళ్లీ ఆ నేరాలు చేయకుండా ఉంటాడన్న భావనతో కోర్టులు అలా జరిమానాలు విధిస్తుంటాయి. ఇప్పుడు మనకు చాలా శాసనాలు వచ్చేశాయి. గతంలో ఉన్న శాసనం ఒక్కటే. అది భారతీయ శిక్షాస్మృతి. అది తయారు చేసినప్పుడు జరిమానా గురించి చాలా చర్చలు జరిగాయి. కొన్ని నేరాలకు జరిమానా విధించడమే సరైన శిక్ష అని వారు నిర్ధా రణకి వచ్చి, ‘‘ప్రపంచవ్యాప్తంగా జరిమానాలు విధించడం అనేది ఉంది. దాని వల్ల చాలా ప్రయో జనాలు ఉన్నాయి. అందుకని జరిమానాలని కోర్టులు విధించాలని మేం ప్రతిపాదిస్తున్నాము!’’ అని అభి ప్రాయపడ్డారు. భారత శిక్షాస్మృతి కోసం మెకాలే 1861లో గట్టి పునాదిని వేశారు. చాలా నేరాలకి జరిమానాలను ఆయన ప్రతిపాదించారు. స్వాతం త్య్రం వచ్చాక మెకాలే రూపొందించిన శిక్షాస్మృతికి కొనసాగింపుగా భారతీయ శిక్షాస్మృతి నడుస్తోంది. నేరస్తులను జైల్లో ఉంచడం వల్ల ప్రభుత్వ ఖజా నాకి నష్టం ఎక్కువ జరుగుతుంది. అందుకని కొన్ని నేరాలకి ఎక్కువ జరిమానాలు విధించడం వల్ల ఆ నేరాలు తిరిగి చేయడానికి మనుషులు వెనుకంజ వేస్తారనీ, ఇంకా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని మెకాలే భావించారు. అయితే, నేరస్తుని ఆర్థిక స్తోమతను దృష్టిలో ఉంచుకుని కోర్టులు జరి మానాలను విధించాలని ఆయన చెప్పారు. భార తీయ శిక్షాస్మృతిలోని నేరాలను గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. తాగి రోడ్డు మీద గొడవ చేస్తే 10 రూపాయల జరిమానాను కోర్టులు విధిం చాలి. స్వచ్ఛందంగా ఎవరైనా గాయపరిస్తే రూ. 500 జరిమానాని, అదే వి«ధంగా వ్యక్తుల ప్రాణాలకి, రక్ష ణకి హాని కలిగిస్తే రూ.200 జరిమానాను, ఒక మందుకు బదులు మరో మందు విక్రయిస్తే రూ.100 జరిమానాను కోర్టు విధించే విధంగా శిక్షాస్మృతిలో నిబంధనలు ఏర్పరిచారు. భారతీయ శిక్షాస్మృతిని రూపొందించింది 1860లో. అంటే 158 సంవత్స రాల క్రితం అన్నమాట. అప్పుడున్న రూపాయి విలువని పోలిస్తే ఈ జరిమానా అధ్వానంగా అనిపి స్తుంది. అందుకే 158 ఏళ్ల క్రితం నిర్ణయించిన 10 రూపాయల జరిమానాను తగ్గిన రూపాయి విలువ కారణంగా ఎంతకు పెంచాలోనని ఆలోచిస్తే కాస్త భయం వేసినా, పెంచడం అవసరమనిపిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జరిమా నాల విషయంలో అవసరమైన సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జరిమానాను విధించే సమయంలో కోర్టులు నేర తీవ్రతను, ముద్దాయి గత చరిత్రను పరిగణనలోకి తీసుకుంటాయి. జైలు శిక్షను లేదా జరిమానాను లేదా రెండింటినీ విధించే అవకాశం ఉన్న కేసులో అవసరమని భావించినప్పుడు కోర్టులు రెండు శిక్షలనూ ఖరారు చేస్తాయి. జరిమానా విధించే విషయంలో ముద్దాయి ఆర్థికస్తోమతని కూడా కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయి. అదే విధంగా ఆర్థిక నేరాలు చేసే వ్యక్తుల విషయంలో వైట్‌కాలర్ నేరాలు చేసే వ్యక్తుల విషయంలో జరి మానాలను భారీగానే విధించాల్సి ఉంటుంది. వారు మళ్లీ అలాంటి నేరాలు చేయ కుండా నిరోధించడానికి ఇది అవసరం. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఓ వ్యక్తి ఒకే సంఘ టనలో రెండు మూడు నేరాలు చేసినప్పుడు ఆ శిక్షలు ఏకకాలంలో అమలయ్యే విధంగా కోర్టులు ఆదేశించే వీలుంది. కానీ జరిమానా చెల్లించనపుడు అనుభవిం చాల్సిన శిక్ష మాత్రం వాటి తోబాటు ఏకకాలంలో అమలయ్యే అవకాశమే లేదు. నేరానికి వేసిన శిక్షలు అమలయ్యాక ఈ శిక్ష కొనసాగుతుంది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 64 ఈ విషయం చెబుతోంది. 1860లో తయారైన ఈ శిక్షా స్మృతిలో జరిమానా విష యంలో ఇంత బాగా ఆలోచించారు. మన శాసన వ్యవస్థకి ఈ జరిమానాలపై ఆలోచించే తీరుబడి లేదు. జైల్లో ఉంచితే ఆ భారం రాజ్యం మీద పడుతుందని గ్రహిస్తే మంచిది. జరిమానాలను ముద్దాయి ఆస్తి నుంచి వసూలు చేసే అవకాశం ఉంది. మంగారి రాజేందర్ వ్యాసకర్త కవి, రచయిత ‘ 94404 83001 -
45 చలానాలు.. 50 వేల జరిమానా
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనల్లో ఓ జనసేన నాయకుడు రికార్డు సృష్టించాడు. ఏకంగా 45 చలానాలకు రూ.50 వేల జరిమానాను చెల్లించాడు. ఈ సంఘటన నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ ఎస్సై కృష్ణంరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఓవర్‌స్పీడ్‌తో పోలీసులను హడలెత్తించడంతో అతనిపై ట్రాఫిక్ పోలీసులు 45 చలానాలు నమోదు చేశారు. వీటి మొత్తం జరిమానా రూ.54,773.83గా నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చెందిన బాలాజీ జనసేన పార్టీ నాయకుడు. ఏడాదిన్నర కాలంగా ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని ఉపయోగిస్తున్నాడు. అతివేగంతో వెళుతూ ఇతర వాహనాలను హడలెత్తించాడు. దీంతో చాలాసార్లు ట్రాఫిక్ పోలీసులు ఈ వాహనంపై ఓవర్‌స్పీడ్ కేసులు నమోదు చేశారు. అంతే కాదు. నో పార్కింగ్, సిగ్నల్స్‌ను జంపింగ్ వంటి కేసులు కూడా నమోదయ్యాయి. వ్యక్తిగత పనులపై నగరానికి వచ్చిన బాలాజీ తన వాహనాన్ని శనివారం హిమాయత్‌నగర్ వీధినెంబర్ 6లో పార్క్ చేశాడు. అదే సమయంలో నారాయణగూడ ట్రాఫిక్ ఎస్సై కృష్ణంరాజు నో పార్కింగ్‌లో పార్కుచేసి ఉన్న బాలాజీ వాహనం జరిమానాల పాత చిట్టాను పరిశీలించడంతో భారీ మొత్తంలో అతను జరిమానా చెల్లించాల్సి ఉన్న విషయం బయటపడింది. వాహనాన్ని సీజ్‌చేసి చార్జ్‌షీట్ వేస్తామని ట్రాఫిక్ ఎస్సై హెచ్చరించడంతో బాలాజీ అప్పటికప్పుడు జరిమానా మొత్తాన్ని డెబిట్ కార్డు ద్వారా చెల్లించాడు. ట్రాఫిక్ చలానాల విషయంలో ఇంత పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించడం ఒక రికార్డుగా చెప్పవచ్చు. -
లిఫ్ట్ ఇవ్వటం ‘మహా’ పాపం
పాపం పోనీ అని లిఫ్ట్ ఇవ్వటం ఆ వ్యక్తి పాలిటే శాపంగా మారింది. హఠాత్తుగా ఊడిపడ్డ ట్రాఫిక్ అధికారి చలాన్ రాసి చేతిలో పెట్టాడు. ముంబైకి చెందిన నితిన్ నాయర్ అనే వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్బుక్లో ఓ పోస్టు రూపంలో తెలియజేశాడు. జూన్ 18న ముంబై ఐరోలి సర్కిల్లో నితిన్ వెళ్తున్నాడు. ఆ సమయంలో వర్షం భారీగా పడుతుండటం, పైగా రవాణా సదుపాయం లేకపోవటంతో ముగ్గురు వ్యక్తులు కష్టపడుతుండటం అతని కంట పడింది. వెంటనే వారిని తన కారులో ఎక్కించుకున్నాడు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ వెంటనే నితిన్ వద్దకు వచ్చి రూ. 1500 చలాన్ రాసిచ్చాడు. అంతేకాదు నితిన్ డ్రైవింగ్ లైసెన్స్ లాక్కుని ఛలాన్ కట్టి వాహనం తీసుకెళ్లాలని సూచించాడు. అయితే ఆ టైమ్‌లోనూ నితిన్ సాయం చేయటం మానలేదు. వారిని వారి వారి గమ్యస్థానంలో వదిలి మరుసటి రోజు కోర్టుకు వెళ్లి ఫైన్ కట్టి బయటపడ్డాడు. తన అనుభవాన్ని నితిన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. నితిన్‌కు ఎదురైన చేదు అనుభవాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. సెక్షన్ 66/192 ప్రకారం అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమని, అందుకే అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ పేరుతో సాయం చేసి తనలా బుక్ కాకండని సూచిస్తూ ఆ పోస్టును పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఆటోడ్రైవరుకు హెల్మెట్ లేదని జరిమానా
సాక్షి, నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆటో కార్మికులపై ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోని ఏబీఎం కాంపౌండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బోసుబొమ్మ వరకు సాగింది. అనంతరం అక్కడ వారు రోడ్డుపై బైటాయించి ట్రాఫిక్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర అధ్యక్షుడు అజయ్‌కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఆర్టీఓ, పోలీసులు ఆటో కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆటోడ్రైవర్‌కు హెల్మెట్ లేదని జరిమానా వేసిన ఘనత నెల్లూరు ట్రాఫిక్ పోలీసులకే దక్కుతుందన్నారు. ధ్రువీకరణ పత్రాలన్నీ ఉన్నా ఓ ఆటోడ్రైవర్‌పై 5 నిమిషాల వ్యవధిలో 6 కేసులు రాయడం ఎంతవరకూ సమంజసమన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ ఓలా ట్యాక్సీలను నిర్వహిస్తుండడంతో ఆటోలను తిరగనీకుండా కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే అధికారులు 700 రెట్లు చలానా పెంచి రూ.170 కోట్లు రాష్ట్ర ఖజానాకు పంపారన్నారు. కాగా దాదాపు రెండు గంటల సేపు నిరసన చేపట్టడంతో వాహనాలు నిలిచి పోయి ప్రయాణికులు ఇబ్బంది పట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సీఐ వేమారెడ్డి ఘటనాస్థలానికి వచ్చి ఆన్లైన్ ద్వారా ఈ–చలానా రావడంతో పొరపాట్లు జరిగాయని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శి జి,నాగేశ్వరరావు ఆటోయూనియన్ జిల్లా కార్యదర్శి కె.సురేష్, నాయకులు మూలం ప్రసాద్, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
'ట్రాఫిక్ చలాన్లు రూ. 24 కోట్లు'
సాక్షి, హైదరాబాద్: గతేడాదిలో పోలిస్తే హైదరాబాద్‌లో నేరాలు తగ్గాయని నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఆయనిక్కడ గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్నాయని.. రాబోయే కాలంలో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది సైబర్ క్రైం మాత్రం పెరిగిందన్నారు. ట్రాఫిక్ చలాన్ల కింద రూ. 24 కోట్లు వసూలు చేశామని తెలిపారు. 100 నంబర్‌కు కాల్ వచ్చిన నిమిషాల్లోనే సిబ్బంది స్పందిస్తున్నారన్నారు. మరో వైపు నగరంలో సంచలనం సృష్టించిన పలు కేసులు చేధించామని పేర్కొన్నారు. -
ట్రాఫిక్ పోలీసుపై ఎమ్మెల్యే చిందులు
-
’సాక్షి’ని చూసి బ్రోకర్లు పరుగులు
-
ట్రాఫిక్ చలానా చూసుకొనేందుకు మొబైల్ యాప్
సాక్షి, సిటీబ్యూరో: మీరు ఎక్కడైనా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడ్డారా? లేదా అనేది నిర్థారించుకునేందుకు ఇక నుంచి ప్రత్యేక యాప్ ద్వారా మీ మొబైల్ ఫోన్లోనే చూసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం చలానాలపై క్యాష్‌లెస్ విధానం అమలు చేస్తున్నామని, వాహనదారులు పెండింగ్ చలానాలు బ్యాంక్ లు, నెట్ బ్యాంకింగ్, ఈ-సేవా, మీ-సేవా ద్వారా చెల్లించాలని ఆయన సూచించారు. క్యాష్‌లెస్ ఎన్ఫోర్స్మెంట్ను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ఏపీకే ఈ-చలాన్ తెలంగాణ అనే పేరుతో ఉన్న యాప్‌ను ఆడ్రాయిడ్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ యాప్ ఓపెన్ చేసి అందులో వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడ్డారా? లేదా అనే వివరాలు తెలుస్తాయన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే అందుకు సంబంధించిన ఇమేజ్ (చిత్రం)తో పాటు సమయం, తేదీ, ప్రాంతం అందులో ఉంటుందన్నారు. -
నగదు రహితంగా ట్రాఫిక్ చలానా
* ఇకపై చెల్లింపులన్నీ డెబిట్, క్రెడిట్, బ్యాంకు, ఈ-సేవ, మీ-సేవ ద్వారానే * కొత్త విధానానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల శ్రీకారం సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల నుంచి బేగంపేట ట్రాఫిక్ సిబ్బంది చలానా రాసి డబ్బులు కట్టించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు వారిని తనిఖీ చేయగా చలానా పుస్తకంలో బిల్లు కంటే సిబ్బంది జేబులో అదనంగా కొన్ని వేల రూపాయలు దొరికాయి. దీంతో ఓ ఎసై్సతో పాటు ముగ్గురు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇది రెండు నెలల కిందటి సంఘటన. ఇలాంటివి తరచుగా జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బంది వాహనదారుడి నుంచి చలానా రుసుం నగదు రూపంలో చెల్లించే విధానానికి స్వస్తి పలికారు. నిబంధనలు ఉల్లంఘించి ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన వాహనదారులు ఇక నుంచి నగదు రూపంలో చలానా రుసుము వారికి చెల్లించకూడదు. డెబిట్, క్రెడిట్, బ్యాంకు, ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల్లో మాత్రమే డబ్బులు చెల్లించాలి. ఈ కొత్త విధానం మంగళవారం నుంచి హైదరాబాద్ పరిధిలోని ట్రాఫిక్ విభాగంలో అమలులోకి వచ్చింది. అంటే ఇకపై ట్రాఫిక్ సిబ్బంది కేవలం చలానాలు రాయాలి.. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు వారి వద్ద ఉన్న పీడీఎఫ్ మిషన్‌తో స్వైప్ చేయాలి. అలా చేయడం ద్వారా నేరుగా వాహనదారుడి డబ్బులు ప్రభుత్వ ఖాతాలోకి జమ అవుతాయి. వాహనదారుడి వద్ద క్రెడిట్, డెబిట్ కార్డులు లేకుంటే పోలీసులు చలానా రసీదు రాసి ఇస్తారు. వారం వ్యవధిలో చలానాను పైన పేర్కొన్న ఏ ఒకదానిలోనైనా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే వాహనాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తారు. చలానా డబ్బులు పారదర్శకంగా ఉండేలా ఈ కొత్త విధానాన్ని దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్‌లో మొదలుపెట్టారు. గతంలో వాహనదారులు చలానా మొత్తాన్ని నగదు రూపంలోనే ట్రాఫిక్ సిబ్బందికి చెల్లించేవారు. ఇలా వసూలైన డబ్బులను ఆయా ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్లు మరుసటి రోజు ఐసీఐసీఐ బ్యాంకులోని ప్రభుత్వ ఖాతాలో జమ చేసేవారు. కొత్త విధానంతో ఇవీ లాభాలు... * ట్రాఫిక్ సిబ్బంది అవినీతికి పాల్పడేఅవకాశం ఉండదు. * డబ్బులు వసూలు చేయడం, బ్యాంకులో జమ చేసే పనిభారం సిబ్బందికి తప్పుతుంది. * చలానా డబ్బు మొత్తంలో తేడా వస్తే అధికారే బాధ్యత వహించాల్సి వచ్చేది. * ఈ కొత్త విధానంతో డబ్బు లెక్కల్లో తేడాలు రావు * వాహనదారుడి వద్ద డబ్బు లేకున్నా చలానా రసీదు తీసుకుని వెళ్లిపోవచ్చు * చలానా ఎంత రాసినా డబ్బు నేరుగా ప్రభుత్వ ఖాతాలోకే వెళుతుంది.