సాక్షి, బనశంకరి( బెంగళూరు): వాహనదారులకు హోంశా మంత్రి ఎ.జ్ఞానేంద్ర తీపి కబురు అందించారు. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ స్పాట్ ఫైన్‌ను రద్దుచేయాలని పోలీసుశాఖను ఆయన ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు వినియోగిస్తున్న చలానా ఉపకరణాలను వారి వారి పోలీస్‌స్టేషన్లలో అప్పగించాలన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు నిలిపి అక్కడిక్కడే చలానాలు రాసి వసూలు చేస్తున్నారు. ఇందుకు పీడీఏ మిషన్లను ఉపయోగిస్తున్నారు.
చలానాలపై ఆరోపణలు
ఫైన్ చెల్లించినప్పటికీ పీడీఏ లేదా పీఓఎస్ మెషిన్లు గత జరిమానాలు పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా స్పాట్ చలానాలను రద్దు చేయాలని హోంమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్లపై డిజిటల్ కెమెరాలో రికార్డయ్యే ఉల్లంఘలనపై వాహనదారు ఇంటికి చలానా పంపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment