Circle Inspector Himself Dragged The Vehicle 20 Meters In Karnataka - Sakshi
Sakshi News home page

పోలీస్‌ బాహుబలి.. మెకానిక్‌ షాపు వరకు జీపును లాక్కెళ్లాడు

Published Sat, Jun 26 2021 8:58 AM | Last Updated on Sat, Jun 26 2021 12:21 PM

Circle Inspector Himself Dragged The Vehicle 20 Meters In Karnataka - Sakshi

సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు

సాక్షి బళ్లారి: మరమ్మతులకు గురైన జీపును ఒక సీఐ స్వయంగా మెకానిక్‌ షెడ్‌ వద్దకు లాక్కెళ్లి నెటిజన్ల నుంచి బాహుబలిలా ప్రశంసలు అందుకున్నారు. కర్ణాటకలోని కొప్పళ జిల్లా యలబుర్గి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు రెడ్డి శుక్రవారం ఓ కేసు విచారణ నిమిత్తం స్కార్పియో వాహనాన్ని స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.

తిరిగి బయల్దేరుతుండగా వాహనం స్టార్ట్‌ కాలేదు. దీంతో 20 మీటర్ల దూరంలోని మెకానిక్‌ షెడ్‌ వద్దకు స్వయంగా వాహనాన్ని లాక్కొని వెళ్లారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. పోలీస్‌ బాహుబలి అంటూ సందేశాలు పోస్టు చేశారు. శారీరక దృఢత్వంతో ఇలాంటి సాహసాలు చేయవచ్చని పేర్కొన్నారు.

చదవండి: నకిలీ టీకా క్యాంపులపై సీబీఐ దర్యాప్తు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement