cancel
-
పలు కుంభమేళా రైళ్లు రద్దు.. టిక్కెట్ బుక్ చేసుకుంటే నగదు వాపస్
న్యూఢిల్లీ: యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వెళుతున్న భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా అక్కడక్కడా ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీనిని గమనించిన రైల్వేశాఖ ప్రయాగ్‌రాజ్ వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంది.తాజాగా దుర్గ్(ఛత్తీస్‌గఢ్) నుండి చాప్రా(బీహార్) వరకూ, అలాగే చాప్రా నుండి దుర్గ్ వరకు నడిచే సారనాథ్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ మూడు రోజుల పాటు రద్దు చేసింది. ఈ దుర్గ్-చాప్రా సారనాథ్ ఎక్స్‌ప్రెస్‌ను ఫిబ్రవరి 19 నుండి ఫిబ్రవరి 21 వరకు రద్దు చేశారు. ఈ రైలు ప్రయాగ్‌రాజ్ మీదుగా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. దీంతో ప్రయాగ్‌రాజ్‌కు వెళదామనుకున్న ప్రయాణికులు నిరాశకు గురవుతున్నారు. కాగా ఈ రైలు ద్వారా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వారి డబ్బును రైల్వేశాఖ వారి ఖాతాకు బదిలీ చేయనున్నట్లు సమాచారం. ప్రయాగ్‌రాజ్‌లో భారీ రద్దీని తగ్గించడానికి రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నదని సంబంధిత అధికారులు తెలిపారు.ఇదేవిధంగా రైలు నంబర్ 55098/55097 గోరఖ్‌పూర్-నర్కటియగంజ్ ప్యాసింజర్ రైలును ఫిబ్రవరి 23 వరకు రద్దుచేశారు. అలాగే రైలు నంబర్ 15080 గోరఖ్‌పూర్-పాటిలీపుత్ర ఎక్స్‌ప్రెస్ కూడా ఫిబ్రవరి 22 వరకు రద్దు చేశారు. మహాశివరాత్రికి ప్రయాగ్‌రాజ్ వెళ్లాలనుకున్న భక్తులకు ఈ వార్త షాక్‌లా తగిలింది. మరోవైపు జయనగర్ నుండి ప్రయాగ్‌రాజ్ మీదుగా న్యూఢిల్లీకి వెళ్లే స్వతంత్ర సేనాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు రూట్‌ను మార్చారు. ఈ రైలు ఫిబ్రవరి 28 వరకు ప్రయాగ్‌రాజ్ మీదుగా వెళ్ళదు. బీహార్, ఛత్తీస్‌గఢ్‌ల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళుతున్నారు. దీంతో రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది.ఇది కూడా చదవండి: రిస్క్‌లో కుంభమేళా మోనాలిసా? -
గూగుల్ పేలో ఆటోపే.. సింపుల్‌గా క్యాన్సిల్ చేయండిలా
ఆన్లైన్ లావాదేవీలు వచ్చిన తరువాత.. దాదాపు చాలామంది గూగుల్ పే, ఫోన్ పే వంటివి విరివిగా ఉపయోగిస్తున్నారు. సబ్స్క్రిప్షన్లు, ఈఎంఐ వంటివి చెల్లించడానికి వీటినే వాడేస్తున్నారు. దీనికోసం గూగుల్ పేలోని 'ఆటోపే' (Autopay) సెట్ చేసుకుంటారు. ఇది ఆటోమాటిక్ చెల్లింపులకు ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది ఆటోమాటిక్‌గా చెల్లించడానికి ఇష్టపడనప్పుడు 'ఆటోపే క్యాన్సిల్ చేసుకోవచ్చు.గూగుల్ పేలో ఆటోపే ఎలా నిలిపివేయాలంటే?➤గూగుల్ పే (Google Pay) యాప్ ఓపెన్ చేసిన తరువాత, ఎగువ భాగంలో కూడైవైపు కనిపించే మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి.➤ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తరువాత ఆటోపే ఆప్షన్స్ కనిపించే వరకు కిందికి స్క్రోల్ చేయాలి.➤ఆటోపే ఆప్షన్ కనిపించిన తరువాత.. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత లైవ్ ట్యాబ్ కింద యాక్టివ్ మ్యాండేట్ల జాబితా కనిపిస్తుంది. మీరు తీసివేయాలనుకుంటున్న ఆటోపే మ్యాండేట్‌పై క్లిక్ చేయండి.➤ఆటోపే క్యాన్సిల్ చేయాలనుకున్నప్పుడు.. క్యాన్సిల్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ➤యూపీఐ ఎంటర్ చేయగానే ఆటోపే క్యాన్సిల్ అవుతుంది.మళ్ళీ ఆటోపే సెట్ చేసుకోవాలంటే?➤గూగుల్ పేలో మళ్ళీ ఆటోపే సెట్ చేసుకోవాలంటే.. మళ్ళీ యాప్ ఓపెన్ చేసి, ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి.. ఆటోపే ఆప్షన్స్ ఎంచుకోవాలి.➤ఉదాహరణకు నెట్‌ఫ్లిక్స్ కోసం ఆటోపే ఆదేశాన్ని సెటప్ చేసి, తరువాత దానిని రద్దు చేసి ఉంటే.. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో చెల్లింపు పద్ధతిగా మీ యూపీఐ ఐడీని తిరిగి ఎంటర్ చేయాలి. ఆ తరువాత యధావిధిగా ఆటోపే యాక్టివేట్ అవుతుంది.ఇదీ చదవండి: పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరికఆటోపే వల్ల ఉపయోగాలుబిజీ జీవితంలో అన్నింటిని గుర్తుపెట్టుకోవడం కొంత కష్టమైన పని. ఏదైనా చెల్లింపులు లేదా ఈఎంఐ వంటి చెల్లించడంలో ఆలస్యమైతే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి జరిమానాల నుంచి తప్పించుకోవడానికి, సమయానికి చెల్లింపులు పూర్తి చేసుకోవడానికి ఆటోపే అనేది బెస్ట్ ఆప్షన్. -
విడాకులు క్యాన్సిల్! ధనుష్-ఐశ్వర్య మళ్లీ ఒక్కటి కానున్నారా? (ఫొటోలు)
-
Vizag : పొగమంచు ఎఫెక్ట్.. పలు విమానాలు రద్దు
విశాఖపట్నం: పొగమంచు కారణంగా విశాఖ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. విశాఖపట్నం నుంచి వేర్వేరు రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు నిర్ణీత సమయానికి విమానాశ్రయానికి చేరుకుంటున్నా.. వాతావరణం అనుకూలించక కొన్ని సర్వీసులు రద్దు అవుతున్నాయి. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో పొగ మంచు ప్రభావం.. మరో రెండు రోజులు ఉండనున్న దృష్ట్యా మరిన్ని సర్వీసులు రద్దయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. రద్దు అయిన ఫ్లైట్ వివరాలు: 1) 6E6336/5309 VOBL-VOVZ-VOBL 2) 6E626/783 HS-VOVZ- HS 3) 6E5176/2776 DP-VOVZ-DP. ఈరోజు రద్దయిన విమానాల వివరాలు... 1) బెంగళూరు నుంచి..విశాఖపట్నం. విశాఖ టు బెంగళూర్.. 6E6336/5309 VOBL-VOVZ-VOBL 2) హైదరాబాద్. టు. విశాఖపట్నం. విశాఖ టు. హైదరాబాద్.. 6E626/783 HS-VOVZ- HS 3) ఢిల్లీ. టు. విశాఖపట్నం అండ్ ఢిల్లీ.. 6E5176/2776 DP-VOVZ-DP. -
నేడు పౌర్ణమి గరుడసేవ రద్దు
తిరుపతి: తిరుమలలో మంగళవారం నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా మంగళవారం పౌర్ణమి గరుడసేవ ఉండదని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని తెలిపింది. నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో అభివృద్ధి పనులతో పాటు మరిన్ని అంశాలపై పాలకమండలి చర్చించనుంది. ఈ సమావేశానికి టీటీడీ బోర్డు సభ్యులు హాజరుకానున్నారు. సర్వదర్శన టోకెన్ల జారీ పూర్తి ఈ నెల 23 నుంచి 2024, జనవరి 1వ తేదీ వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వ దర్శన టోకెన్ల జారీని సోమవారం టీటీడీ పూర్తి చేసింది. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్లో 90 కౌంటర్లలో 10 రోజులకు గాను నాలుగు లక్షలకుపైగా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను భక్తులకు అందించారు. తదుపరి సర్వదర్శనం టోకెన్లను జనవరి 2వ తేదీ నుంచి ఇవ్వనున్నారు. టోకెన్లు లేని భక్తులను దర్శనానికి అనుమతించరు. -
ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు?
కెనడాలో ఉంటున్న ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) స్వాధీనం చేసుకున్న నేపధ్యంలో విదేశాలలో ఇదేరీతిలో తలదాచుకున్న ఇతర ఉగ్రవాదుల ఆస్తులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను కోరింది. యుఎస్, యుకె, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదులను గుర్తించాలని, వారు భారతదేశానికి తిరిగి రాకుండా వారి విదేశీ పౌరసత్వాన్ని (ఓసిఐ) రద్దు చేయాలని ప్రభుత్వం ఆ ఏజెన్సీలను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చండీగఢ్, అమృత్‌సర్‌లోని పన్నూన్ ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వాధీనం చేసుకున్న దరిమిలా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఫలితంగా భారతదేశానికి చెందిన ఈ ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందదని, అప్పుడు వారు ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా, బ్రిటన్, కెనడా, యూఏఈ, పాకిస్తాన్ తదితర దేశాల్లో పరారీలో ఉన్న 19 మంది ఖలిస్తానీ ఉగ్రవాదులను ప్రభుత్వం గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గతంలో కెనడా, యునైటెడ్ స్టేట్స్, పాకిస్తాన్లో నివసిస్తున్న 11 మందిని గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదులుగా భద్రతా సంస్థలు గుర్తించాయి. వీరిలో ఎనిమిది మంది అనుమానితులు కెనడాలోనే ఉన్నట్లు అధికారవర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ జాబితాలో గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదుల పేర్లు ఉన్నాయి. పాకిస్తాన్లో హర్విందర్ సంధు అలియాస్ రిండా ఉన్నాడని భావిస్తున్నారు. లఖ్బీర్ సింగ్ అలియాస్ లాండా, సుఖ్దుల్ సింగ్ అలియాస్ సుఖ దునాకే (మూడు రోజుల క్రితం హతమయ్యాడు), అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దల్లా, రమణదీప్ సింగ్ అలియాస్ రామన్ జడ్జి, చరణ్‌జిత్ సింగ్ అలియాస్ రింకూ బిహాలా, సనావర్ ధిల్లాన్, గుర్పిందర్ సింగ్ అలియాస్ బాబా డల్లా కెనడాలో ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. ఇక అమెరికాలో గౌరవ్ పత్యాల్ లక్కీ, అన్మోల్ బిష్ణోయ్‌లు ఉన్నారనే అనుమానాలున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న తాజా చర్యలు ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కార్డులతో విదేశాల్లో నివసిస్తున్న ఉగ్రవాదుల కార్యకలాపాలను అరికట్టడానికి సహాయపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వారు భారతదేశంలో ఉద్యమాలు చేపట్టి, యువతను తప్పుదారి పట్టించేందుకు అవకాశం ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: భారత్- కెనడాల మధ్య చిచ్చుపెడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు? -
ప్రధాని మోదీ ప్రోగ్రాం ఉందని మొహర్రం సెలవు రద్దు..!
యూపీలోని యోగీ సర్కారు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు శనివారం(ఈరోజు) సెలవును రద్దుచేసింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో ప్రారంభమయ్యే అఖిల భారత విద్యా సదస్సు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని యోగీ సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపధ్యంలో శనివారం పాఠశాలలు తెరుచుకున్నాయి. జాతీయ విద్యావిధానం మూడో వార్షికోత్సవం సందర్భంగా 29న న్యూఢిల్లీలో నిర్వహించే అఖిల భారత విద్యా సమాఖ్య కార్యక్రమాన్ని యూపీలోని పాఠశాలలో ప్రసారం చేయాలని జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యూపీ డైరెక్టర్ జనరల్ ఎడ్యుకేషన్ విజయ్ కిరణ్ ఆనంద్ జారీ చేసిన ఒక ఉత్తర్వులో ప్రధానమంత్రి అఖిల భారత విద్యా సమాగమం ప్రోగ్రాం ప్రారంభ సెషన్‌ను పాఠశాల స్థాయి వరకు వెబ్‌కాస్ట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఈ సెషన్లో పాల్గొనే వారి వివరాలను నేటి సాయంత్రంలోగా విద్యా మంత్రిత్వ శాఖకు పంపాలని ఆదేశించినట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే అంతకుముందు యూపీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. తరువాత దానిని రద్దు చేశారు. ఇది కూడా చదవండి: ఆర్డర్ పెట్టకుండానే ఆమె ఇంటికి 100కు పైగా పార్సిళ్లు.. ఆరా తీస్తే.. -
రూ. 14 వేల ఫ్లైట్ టిక్కెట్ ఛార్జీకి రిఫండ్‌గా 2 కప్పుల చాయ్!
ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా అనుకోని పరిస్థితుల్లోఫ్లైట్ టిక్కెట్ క్యాన్సిల్ చేయాల్సివస్తే ఎంత రిఫండ్ వస్తుందోనని ఆందోళనపడుతుంటాం. టిక్కెట్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఎంత ఉంటాయోనని అనుకుంటాం. ఇటువంటి సందర్భాల్లో టిక్కెట్ ఛార్జీలోని సగం మొత్తం అయినా రిఫండ్ రూపంలో మనకు అందదు. బీహార్ క్యాడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి రాహుల్ కుమార్‌కు ఫ్లయిట్ టిక్కెట్ రిఫండ్ విషయంలో చేదు అనుభవం ఎదురయ్యింది. రాహుల్ కుమార్ రూ. 13,820కు ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకుని, అనుకోని పరిస్థితుల్లో క్యాన్సిల్ చేసుకోగా, అతనికి రిఫండ్ రూపంలో కేవలం రూ. 20 చేతికి అందింది. అంటే రెండు కప్పుల చాయ్ పైసలు రిఫండ్ రూపంలో తిరిగి వచ్చాయి. ఏదైనా పెట్టుబడుల పథకం ఉంటే.. ఐఎస్ అధికారి రాహుల్ కుమార్ ఫైట్ టిక్కెట్ క్యాన్సిలేషన్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేశారు. తాను విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్న అనంతరం ఎయిర్‌లైన్స్.. ఫ్లైట్ క్యాన్సిలేషన్ రిఫండ్ ఆఫ్ టిక్కెట్‌ను ఆయనకు పంపింది. దానిలో టిక్కెట్ క్యాన్సిలేషన్ ఛార్జీ రూ.11,800, జీఐ క్యాన్సిలేషన్ ఛార్జీ 1,200గా ఉంది. కన్వీనియన్స్ ఛార్జీలు రూ. 800. మొత్తంగా క్యాన్సిలేషన్ ఫీజు 13,800. ఫలితంగా రాహుల్ కుమార్‌కు రిఫండ్ రూపంలో కేవలం రూ.20 తిరిగి వచ్చాయి. దీనికి క్యాప్షన్‌గా ఆయన తనకు రిఫండ్ అయిన ఈ మొత్తంతో ఏదైనా పెట్టుబడుల పథకం ఉంటే తెలియజేయాలని వ్యంగ్యంగా కోరారు. రాహుల్ కుమార్ పోస్టుకు 5 లక్షలకు మించిన వ్యూస్ వచ్చాయి. 5 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. యూజర్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. Pls suggest some good investment plans for my refund. pic.twitter.com/lcUEMVQBnq — Rahul Kumar (@Rahulkumar_IAS) July 10, 2023 ఇది కూడా చదవండి: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే.. -
అలర్ట్: ఈ రూట్లలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ)/తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): సౌత్ ఈస్ట్రన్ రైల్వేలోని ఖరగ్‌పూర్–భాద్రక్ సెక్షన్లో జరుగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణంగా ఆయా మార్గంలో నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఆదివారం షాలీమార్–హైదరాబాద్ (18045/18046), సత్రగచ్చి–తిరుపతి (22855), గౌహతి–సికింద్రాబాద్ (02605), హౌరా–పుదుచ్చేరి (12867), చెన్నై సెంట్రల్– సత్రగచ్చి (22808), మైసూర్–హౌరా (22818) రైళ్లు రద్దు అయ్యాయి. ఈ నెల 19న తిరుపతి–సత్రగచ్చి (22856), సికింద్రాబాద్–అగర్తల (07030), యర్నాకులం–హౌరా (22878) రైళ్లను రద్దు చేశారు. వందేభారత్ రీషెడ్యూల్ విశాఖలో శనివారం ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం– సికింద్రాబాద్(20833) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.10 గంటలకు బయల్దేరింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి శుక్రవారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరాల్సి ఉండగా సుమారు 10 గంటలు ఆలస్యంగా శనివారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం చేరుకుంది. అందువల్ల విశాఖ నుంచి సుమారు 8 గంటలు ఆలస్యంగా బయల్దేరింది. చదవండి: అగ్నివీరులొచ్చేశారు.. -
IPL కోసం ఇంగ్లాండ్ కాంట్రాక్ట్ వదులుకున్న KKR స్టార్ బ్యాటర్
-
36 వేల టీచర్ల నియామకం రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు..
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఏడేళ్ల క్రితం ఉపాధ్యాయ నియా మక ప్రక్రియలో నిబంధనావళి ఉల్లంఘన ద్వారా ఉద్యోగాలు పొందిన 36వేల మంది ఉపాధ్యాయుల నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. 3 నెలల్లోపు ఆ పోస్టులను భర్తీచేయాలని తృణమూల్ కాంగ్రెస్ సర్కార్‌ను జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ‘ఇంతటి అవినీతిని పశ్చిమబెంగాల్ లో ఏనాడూ చూడలేదు. ఉద్యోగాలు కోల్పోయిన ప్రైమరీ టీచర్లు 4 నెలలపాటు విధుల్లో కొనసాగవచ్చు. అప్పటిదాకా పారా టీచర్ల స్థాయిలో తక్కువ జీతమే తీసుకోవాలి’ అని జడ్జి జస్టిస్ అభిజిత్ సూచించారు. ‘నాటి రాష్ట్ర ప్రాథమిక విద్యా బోర్డు అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య, బోర్డ్ సభ్యులు ఈ నియామకాల ప్రక్రియను ఒక లోకల్ క్లబ్ మాదిరిగా మార్చే శారు’ అని జడ్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. 2016 నాటి బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కుంభకోణాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లు విచారణచేపట్టిన విషయం విదితమే. ‘2016లో రిక్రూట్ అయిన 42,500 మందిలో 36వేల మంది ఆప్టిట్యూట్ పరీక్ష అర్హత లేకుండా, శిక్ష ణ లేకుండా ఉద్యోగాలు పొందారు. అందుకే వీరి నియామకం మాత్రమే రద్ద యింది’ అని ఓ న్యాయవాది చెప్పారు. చదవండి: కేరళలో రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత.. సముద్రంలో 134 సంచుల్లో.. -
వెంకటేష్ తో అర్దాంతరంగా సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటంటే...
-
Gun Culture: ఒకే రోజు 813 తుపాకీ లైసెన్సులు రద్దు..
పంజాబ్‌లో తుపాకి సంస్కృతికి వ్యతిరేకంగా భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం విరుచుకుపడింది. విచ్చలవిడిగా వినియోగిస్తున్న తుపాకులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఒకే రోజు సుమారు 813 ఆయుధాల లైసెన్సులను రద్దు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు దాదాపు 2 వేలకు పైగా ఆయుధ లైసెన్సులు రద్దు చేసింది. ఈ మేరకు లూథియానా రూరల్ నుంచి 87, షాహీద్ భగత్‌సింగ్ నగర్ నుంచి 48, గురుదాస్‌పూర్ నుంచి 10, ఫరీద్కోట్ నుంచి 84, పఠాన్‌కోట్ నుంచి 199, హోషియాపూర్ నుంచి 47, కపుర్తలా నుంచి 6, ఎస్ఏఎస్ కస్బా నుంచి 235, సంగర్ నుంచి 16 తపాకీ లైసెన్స్‌లను రద్దు చేసింది. అలాగే తుపాకుల లైసెన్సు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమాలను పేర్కొంది. పంజాబ్‌లో బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన ప్రదేశాలు, వివాహ వేడుకలు లేదా ఇతర కార్యక్రమాల్లో ఆయుధాలు తీసుకువెళ్లడం, ప్రదర్శించడాన్ని నిషేధించింది. రానున్న రోజుల్లో పోలీసులు వివిధ ప్రాంతాల్లో రాండమ్ చెకింగ్లు నిర్వహిస్తారని, హింసను ప్రోత్సహించేలా ఆయుధాలను ప్రదర్శించడంపై పూర్తి నిషేధం ఉంటుందని అధికార ఆప్ ప్రభుత్వం తెలిపింది. పంజాబ్‌లో మొత్తం మూడు లక్షల ఆయుధాల లైసెన్సులు ఉన్నాయని, ఈ తుపాకీ సంస్కృతిని అంతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, 28 ఏళ్ల పంజాబీ గాయకుడు సిద్ధు మూస్ వాలా హత్యోదంతంతో రాష్ట్ర ప్రభుత్వం తుపాకీ సంస్కృతిపై దృష్టి సారించి, నియంత్రణ కోసం పిలుపునిచ్చింది. వాస్తవానికి సిద్ధు మూస్ వాలా వివాదాస్పద పంజాబీ పాటలకు ప్రసిద్ధి, అవి తుపాకీ సంస్కృతిని బహింరంగంగా ప్రోత్సహించడమే గాక గ్యాంగ్స్టర్లను కీర్తించింది. అతను రైఫిల్‌తో కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనిపై కేసు కూడా నమోదైంది. (చదవండి: ఫుల్‌గాతాగి పెళ్లి మండపంలోనే నిద్రపోయిన వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే..) -
నిత్యానంద కైలాసకు బిగ్ షాక్
వాషింగ్టన్: కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో వార్తల్లోకెక్కిన వివాదాస్పద వ్యక్తి నిత్యానందకు పెద్ద షాకే తగిలింది. కైలాసానికి అంతర్జాతీయ ఉనికి, ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం నిత్యానంద అండ్ కో తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈలోపే కైలాసతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా నగరం ఒకటి ప్రకటించింది. అమెరికన్ సిటీ నెవార్క్.. కైలాసతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘‘మేం మోసపోయాం. జరిగినదానికి చింతిస్తున్నాం. కైలాస పరిసర పరిస్థితుల గురించి తెలుసుకున్న వెంటనే మేం స్పందించాం. దాని చుట్టూరా అన్నీ వివాదాలే. అందుకే ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాన్ని జనవరి 18వ తేదీనే రద్దు చేసుకున్నాం’’ అని నగర అధికార ప్రతినిధి సుసాన్ గారోఫాలో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కైలాస ప్రభుత్వ వెబ్సైట్ మాత్రం అమెరికా నగరం, తమ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసను(USK)ను గుర్తించిందని, ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుందంటూ సంబంధిత పత్రాలను పోస్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించుకుంటోంది. జనవరి 12వ తేదీన నెవార్క్ సిటీ హాల్లో కైలాస ప్రతినిధులతో ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మోసం గురించి తెలిసిన వెంటనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని, అది చెల్లుబాటు కాదని, పైగా కైలాసం చుట్టూ వివాదాలు ఉన్నట్లు గుర్తించామని నెవార్క్ ప్రతినిధులు ఇప్పుడు చెప్తున్నారు. అత్యాచారం, కిడ్నాప్ లాంటి కేసులు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పారిపోయాడు నిత్యానంద స్వామి. ఆపై కొన్నాళ్లకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించి జనాల్ని బిత్తరపోయేలా చేశాడు. పైగా ఆ దేశానికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నాడు. తాజాగా కైలాస తరపున ఐక్యరాజ్యసమితికి ఓ ప్రతినిధి హాజరవడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ఐరాస మానవహక్కుల కమిషన్‌లో నిత్యానంద వేధింపులకు గురవుతున్నాడని, స్వదేశం నుంచే బహిష్కరణకు గురయ్యాడంటూ ఆ దేశ ప్రతినిధిగా చెప్పుకుంటున్న విజయప్రియ చేసిన ప్రసంగం.. దానిని ఐరాస మానవహక్కుల కమిషన్ కొట్టిపారేయడం గురించి తెలిసిందే. అసలు నిత్యానంద ఏర్పాటు చేసుకున్న ఈ కైలాస దేశం ఎక్కడ ఉందో స్పష్టత లేదు. ఈక్వెడార్ సమీపంలోని దీవుల్లో ఒకదానిలో ఉందని చెబుతున్నప్పటికీ.. నిత్యానంద తమ దేశ పరిసరాల్లోనే లేడంటూ ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పరమహంస నిత్యానంద ఫాలోవర్స్ మాత్రం కైలాసను విపరీతంగా ప్రమోట్ చేస్తుంటారు. అంతర్జాతీయ ప్రతినిధులను కలిసి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా కైలాస మీద నడిచే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. -
SSMB28: మహేశ్-త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందా? నిర్మాత ట్వీట్ వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలె మహేష్‌బాబు తల్లి ఇందిరా దేవి చనిపోవడంతో షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడింది. అయితే రెండు, మూడు రోజుల నుంచి ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు పుకార్లు వస్తుండటంతో నిర్మాత నాగవంశీ ఈ వార్తలకి చెక్ పెట్టారు. ‘SSMB28’ సెకండ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఎగ్జ్జైటింగ్ అప్డేట్స్ వస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. The second schedule of our most awaited action extravaganza #SSMB28 will begin soon. Many more exciting updates will be unveiled in upcoming days. Stay tuned! — Naga Vamsi (@vamsi84) October 31, 2022 -
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఏ) రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్)కి విదేశీ నిధుల లైసెన్స్‌ని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్)కి ఉన్న విదేశీ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్‌ని కేంద్రం రద్దు చేసింది. ఇది గాంధీ కుటుంబాలకు చెందిన ప్రభుత్వేతర సంస్థ. ఐతే ఈ సంస్థ విదేశీ నిధుల చట్టాన్ని ఉల్లంఘించిందని, అందువల్ల ఈ లైసెన్స్‌ని రద్దు చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. జూలై 2020లో ఎంహెచ్ఏ దీనిపై ఒక కమిటి నియమించి, వారి ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అంతేగాదు లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ఆర్జీఈఎఫ్ కార్యాలయానికి నోటీసులు జారీ చేశామని కూడా తెలిపింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ ఫౌండేషన్‌కి చైర్ పర్సన్ కాగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరం, పార్లమెంట్ సభ్యులు రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు ట్రస్ట్ సభ్యులు. ఈ ఫౌండేషన్‌ని 1991లో ఏర్పాటు చేశారు. అంతేగాదు ఈ ఫౌండేషన్ 1991 నుంచి 2009 వరకు ఆరోగ్యం, సైన్స్, టెక్నాలజీ, మహిళలు, పిల్లలు, దివ్యాంగులకు మద్దతుతో సహా అనేక క్లిష్టమైన సమస్యలపై పనిచేసింది. పైగా విద్యా రంగానికి సంబంధించి పలు సేవలు అందించింది. (చదవండి: తెలంగాణలోకి రాహుల్ యాత్ర.. జోడో యాత్ర ఇలా కొనసాగుతుంది..) -
బంజారాహిల్స్ డీఏవీ పాఠాశాల గుర్తింపు రద్దు
-
రేప్ కేసు రద్దు.. మాజీ భర్తకు వెరైటీ శిక్ష
ఢిల్లీ: అత్యాచారం ఆరోపణలతో మాజీ భర్తపై కోర్టుకెక్కింది ఓ మహిళ. అయితే.. చివరికి ఇద్దరూ ఓ ఒప్పందానికి వచ్చి కేసు వాపసు తీసుకునే యత్నం చేశారు. మరి తమ విలువైన సమయాన్ని వృథా చేస్తే న్యాయస్థానం ఊరుకుంటుందా? అందుకే విచిత్రమైన ఓ శిక్ష విధించింది. నోయిడా, మయూర్ విహార్‌లో బర్గర్ సింగ్, వాట్ ఏ బర్గర్ పేరుతో సదరు వ్యక్తికి రెండు బర్గర్ రెస్టారెంట్లు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో బాధితురాలితో విడిపోయి.. మరో వివాహం చేసుకున్నాడతను. అయితే.. వైవాహిక బంధంలో తన భర్త శారీరకంగా, మానసికంగా తనను హింసించాడంటూ 2020లో ఆమె కోర్టును ఆశ్రయించింది. రెండేళ్లపాటు కోర్టులో కేసు విచారణ కొనసాగగా.. జులై4వ తేదీన న్యూఢిల్లీ సాకేత్ కోర్టులో మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. దీంతో ఆ మాజీ భార్య అతనిపై ఎఫ్ఐఆర్ రద్దుకు అంగీకారం తెలిపింది. అయితే.. ఈ పరిణామంపై జస్టిస్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, కోర్టుల విలువైన సమాయాన్ని వృథా చేశారు. ఈ వ్యవధిలో ఎన్నో కీలక అంశాలను చర్చించే వాళ్లం. కాబట్టి, పిటిషనర్ కచ్చితంగా సంఘానికి పనికొచ్చే ఏదైనా ఒక పని చేయాల్సిందే అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు.. అతనిపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటే అనాథలకు బర్గర్ అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రెండు అనాథశ్రమాలను ఎంచుకుని వంద మంది దాకా అనాథలకు బర్గర్ అందించాలని ఆ వ్యక్తిని ఆదేశించింది కోర్టు. పైగా శుభ్రమైన వాతావరణంలో ఆ బర్గర్లు తయారు చేయాలని, పోలీసులు దగ్గరుండి ఈ వ్యవహారాన్ని చూసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. అంతేకాదు.. మాజీ భార్య సమయాన్ని సైతం వృధా చేసినందుకుగానూ రూ.4.5 లక్షలు పరిహారంగా చెల్లించాలని, అనాథలకు బర్గర్లు పంచే రోజునే అది చెల్లించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. -
ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే శాఖ... ఆ రూట్లలో 80 రైళ్లు రద్దు!
దసరా పండుగ సీజన్ ప్రారంభమైంది. ప్రజలు నగరాలను విడిచి వారి సొంతూర్లకు పయనమవుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు రద్దీగా మారాయి. ఈ తరుణంలో రైల్వే శాఖ ప్రయాణికులకు భారీ షాక్‌నే ఇచ్చింది. పలు కారణాల వల్ల దాదాపు 80 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. అక్టోబర్ 1న బయలుదేరాల్సిన 52 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, 26 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణ, మౌలిక సదుపాయాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రద్దు చేయబడిన రైళ్ల జాబితాలో లక్నో, వారణాసి, ఢిల్లీ, కాన్పూర్, మరిన్ని నగరాల నుంచి నడిచే రైళ్లు ఉన్నాయి. ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్ల ఆటోమేటిక్‌గా రద్దు అవుతుందని, ఆ మొత్తం నగదు వినియోగదారు ఖాతాలలో నేరుగా రీఫండ్ కానుంది. కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు రీఫండ్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి రిజర్వేషన్ కౌంటర్‌ను సందర్శించాల్సి ఉంటుంది. చదవండి: బ్యాంకింగ్ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే! -
షాకింగ్.. హీరోయిన్ పూర్ణ పెళ్లి ఆగిపోయిందా?
హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ప్రస్తుతం బుల్లితెరపై కూడా అదరగొడుతుంది. సీమ టపాకాయ్,అవును, అఖండ, దృశ్యం-2 చిత్రాల్లో నటించిన పూర్ణ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతుంది. హీరోయిన్గా కంటే బుల్లితెరపై ఓ షోకు జడ్జిగా వ్యవహరించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కనుంది. అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే... పూర్ణ తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందట.ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోవాలని మొదట డిసైడ్ అయినా ఇప్పుడు ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పటికీ పూర్ణ తన సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ ఫోటోలను డిలీట్ కూడా చేయకపోవడంతో మరి నెట్టింట వైరల్ అవుతున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నదానిపై సందేహం కలుగుతుంది. దీనిపై పూర్ణ స్వయంగా ఏమైనా ప్రకటన చేయనుందా అన్నది త్వరలోనే తెలియనుంది. -
మహిళకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్
Woman Racist Comments.. అమెరికాలో జాత్యహంకార కామెంట్స్ కామన్. నల్లజాతీయుల పట్ల తెల్లజాతీయులకు చిన్నచూపు ఉంటుంది. పలు సందర్భాల్లో నల్లజాతీయులపై దాడులు జరిగిన ఘటనలు సైతం చాలానే చూశాము. తాజాగా జాత్యహంకార కామెంట్లు చేస్తున్న ఓ మహిళకు క్యాబ్ డ్రైవర్ రైడ్ నిరాకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుండటంతో నెటిజన్లు.. క్యాబ్ డ్రైవర్‌ను మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..పెన్సిల్వేనియాలోని ఫాసిల్స్ లాస్ట్ స్టాండ్ బార్ బయట జాకీ అనే మహిళ.. బోడే అనే వ్యక్తి క్యాబ్‌లో ఎక్కింది. డ్రైవర్‌ను విష్ చేసిన తర్వాత, “వావ్, నువ్వు తెల్లవాడిలా ఉన్నావే” అని కామెంట్ చేయగా.. బోడే ‘‘ఎక్స్క్యూజ్ మీ’’ అని అనడంతో.. మళ్లీ ఆమె.. “నువ్వు సాధారణ వ్యక్తివా?.. ఇంగ్లీష్ మాట్లాడతారా?” అంటూ బోడే భుజం మీద తడుముతూ కనిపించింది. దీంతో, సీరియస్ అయిన బోడే.. ఇది కరెక్ట్ కాదు. ఎవరో వ్యక్తి తెల్లవాడు కాకపోయినా ఆ సీటులో కూర్చుంటే వచ్చే తేడా ఏంటి అని ప్రశ్నించే సరికి ఆమె షాకైంది. అనంతరం బోడే.. ఆ మహిళను మీరు కారు దిగి వదిలివెళ్లిపోవచ్చు. రైడ్‌ను క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పేశాడు. ఈ ఘటనకు సంబంధిన వీడియో మొత్తాన్ని డ్రైవర్ బోడే.. తన హ్యాండ్ కామ్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. A @lyft driver, James W. Bode exemplified what it is to be a White Ally. He lost money. Risked his rating. All in the name of doing what he believed is right. Be more like James! I owe you a beer, Jimmy. pic.twitter.com/WrdA2AxntD — Kenny Nwankwo (@KennyNwankw0) May 16, 2022 వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. రేసిస్ట్ కస్టమర్లను తిరస్కరించడం కరెక్ట్ అని కామెంట్స్ చేస్తూనే దీనిని చూసి ప్రతిఒక్కరూ నేర్చుకోవాలంటున్నారు. కానీ, అది అంత ఈజీ కాదంటూ డ్రైవర్ బోడేకు అభినందనలు తెలుపుతున్నారు. అంతకు ముందు.. అమెరికన్ పొలిటికల్ యాక్టివిస్ట్, రైటర్ ఏంజెలా డేవిస్ ఒకానొక సమయంలో.. "జాత్యంహకార సమాజంలో జాత్యంహకారం చేయకుండా ఉంటే సరిపోదు. జాత్యంహకార వ్యతిరేకి అయి కూడా ఉండాలి" అని అన్నారు. ఈ ఘటన ఆయన కామెంట్స్‌కు సూట్ అయ్యేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ముప్పై ఏళ్ల బంధానికి ముగింపు.. రష్యా నుంచి దిగ్గజ కంపెనీ నిష్క్రమణ -
111 జీవో ఎత్తేస్తే నగరానికి ముప్పు
సాక్షి,బంజారాహిల్స్: హైదరాబాద్ నగరానికి వరదల నివారణ కోసం నిర్మించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను కాపాడుకోకపోతే భవిష్యత్తులో భాగ్యనగరానికి ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరించారు. జలాశయాల పరిరక్షణకు తెచ్చిన 111 జీవోను ఎత్తేయడం వల్ల రాబోయే రోజుల్లో నగరానికి ముప్పు పొంచి ఉన్నట్లేనని అభిప్రాయపడ్డారు. 111 జీవో ఎత్తివేతపై శుక్రవారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో త్రిసభ్య పీపుల్స్ కమిటీ సమావేశం జరిగింది. ఐఐసీటీ హైదరాబాద్ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబూరావు కలపాల, సుప్రీంకోర్టు కమిటీ సభ్యుడు సాగర్ దార, ఎన్జీఆర్ఐ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బి. రామలింగేశ్వర్రావు, వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ లుగ్నా సార్వత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబూరావు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు చేకూర్చేందుకే 111 జీవో ఎత్తేశారనే విమర్శలు వినిపిస్తున్నాయన్నారు. ఈ జీవో ఎత్తివేత వల్ల జంట జలాశయాలు హుస్సేన్‌సాగర్‌లాగా మారబోతున్నాయని చెప్పారు. మల్లన్న సాగర్ నుంచి పంప్‌ల ద్వారా ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లకు నీళ్లు నింపుతామని చెబుతున్నారని.... అయితే ఈ నీటిని తీసుకొచ్చేందుకు ఎంత విద్యుత్ అవసరమవుతుందో తెలుసా అని ప్రశ్నించారు. 90 శాతం ఓపెన్ ఏరియాను కాపాడతామని ప్రభుత్వం చెబుతున్నదని... తీరా నిర్మాణాలు జరిగాక బీఆర్ఎస్ పేరుతో వాటిని రెగ్యులరైజ్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడబోదని మరో హైదరాబాద్‌గా 111 జీవో ప్రాంతమంతా మారబోతున్నదని హెచ్చరించారు. వాతా వరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుందని.. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌కు ఈ ప్రమాదం పొంచి ఉందని సాగర్ ధార పేర్కొన్నారు. -
హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తే లైసెన్స్ రద్దు!
న్యూఢిల్లీ: ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు సరికొత్త చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముంబైలో హెల్మెట్ లేకుండా రైడింగ్ చేస్తే మూడు నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తాం అని పోలీసులు చెప్పారు. అంతేకాదు యూట్యూబ్‌లో ఈ కొత్త నిబంధనలకు సంబంధించిన వీడియోని ముంబై పోలీసులు పోస్ట్ చేశారు కూడా. ఆ వీడియోలో ...."హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరం. హెల్మెట్ లేకుండా ప్రయాణించే ప్రతి వ్యక్తి చలాన్ని వెంటనే ఆర్టీవోకి పంపతాం. దీంతో మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా జరిమాన కూడా విధించబడుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి సమీపంలోని ట్రాఫిక్ పోలీస్టేషన్ పంపిస్తాం. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే వీడియోలను చూపిస్తాం." అని డీసీపీ రాజ్ తిలక్ రోషన్ పేర్కొన్నారు. అలాగే ఎరుపు రంగు సిగ్నల్ పడినప్పుడూ హారన్లు మోగించకుండా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డెసిబెల్ మీటర్లను ఏర్పాటు చేశారు. దీంతో ఎవరైన గనుక ఇలా హారన్ మోగిస్తే ఆయా వాహనాల వ్యక్తుల డబుల్ టైం వెయిటింగ్ చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. అదీగాక ముంబై ప్రపంచంలోనే అత్యంత ధ్వనించే నగరాల్లో ఒకటి. పైగా ముంబై వాసులు రెడ్ సిగ్నల్ వద్ద కూడా హారన్లు వేయడంతో శబ్దకాలుష్యం ఎక్కువ అతుతోందని, దీన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ పోలీస్ కమీషనర్ మధుకర్ పాండే అన్నారు. (చదవండి: రిక్షాలో మినీ గార్డెన్...ఫోటోలు వైరల్) -
మధ్యలో నన్నెందుకు లాగడం?.. పుతిన్‌కి కౌంటర్
రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పై ప్రముఖ బ్రిటిష్ రచయిత్రి, హ్యారీ పోటర్ ఫేమ్ జేకే రోలింగ్(56) ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరమైన వివాదంలోకి తనను లాగినందుకు ఆమె పుతిన్ పై మండిపడ్డారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో.. రోలింగ్‌కు అనుకూలంగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు బూమరాంగ్ అయ్యాయి. లింగమార్పిడి(ట్రాన్స్ జెండర్ ఇష్యూ) సమస్యలపై.. తన అభిప్రాయాలను తెలియజేసినందుకే రచయిత జెకె రౌలింగ్ స్వేచ్ఛను ఈయూ దేశాలు అడ్డుకున్నాయంటూ పుతిన్ ఈమధ్య ఓ ప్రసంగంలో పేర్కొన్నారు. రష్యా సాహిత్యం, సంగీతంపై ఆంక్షలు విధిస్తూ ఈయూ దేశాలు నిర్ణయం తీసుకోవడంపై ఆయన ఆ వర్చువల్ మీటింగ్‌లో మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన జేకే రోలింగ్ పేరును ప్రస్తావించారు. అయితే అసందర్భంగా తనను ఈ వివాదంలోకి లాగినందుకు ఆమెకు మండిపోయింది. ‘‘పాశ్చాత్య రద్దు సంస్కృతిపై ఎవరైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో.. అమాయకుల ప్రాణాల్ని బలిగొంటున్నవాళ్లు, వాళ్లను ఎవరైతే విమర్శిస్తారో వాళ్లను జైలులో పెట్టేవాళ్లు, విమర్శకులకు విషం పెట్టేవాళ్లు.. విమర్శలకు అర్హులు కాదేమో’’ అంటూ పరోక్షంగా పుతిన్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారామె. అంతేకాదు.. పుతిన్‌ను విమర్శించినందుకు జైల్లో ఉంచిన ఓ విశ్లేషకుడికి సంబంధించిన కథనాన్ని సైతం ఆమె ట్యాగ్ చేశారు. #IStandWithUkraine హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేసిన ఆమె.. ఉక్రెయిన్‌కే తన మద్ధతు ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు. తన ఫౌండేషన్ తరపున ఉక్రెయిన్‌లో అందుతున్న సాయంపైనా కొన్ని పోస్ట్‌లు చేశారు. Critiques of Western cancel culture are possibly not best made by those currently slaughtering civilians for the crime of resistance, or who jail and poison their critics. #IStandWithUkraine https://t.co/aNItgc5aiW — J.K. Rowling (@jk_rowling) March 25, 2022 పాశ్చాత్య దేశాలు చివరికి రష్యా సంస్కృతిపై సైతం ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యాకు చెందిన ఎంతో మంది రచయితలను, వాళ్లు రాసిన పుస్తకాలనూ నిషేధించారు. ఇది నాజీ జర్మనీ చేష్టల్లాగే ఉన్నాయి. ఇంతకు ముందు పిల్లలు అభిమానించే రచయిత్రి జేకే రౌలింగ్ కూడా జెండర్ ఫ్రీడమ్ పేరుతో ఆమెకు ఇలాంటి అనుభవమే ఎదురైంది అంటూ వ్యాఖ్యానించాడు పుతిన్. కానీ, ఆమె మాత్రం పుతిన్‌కు మద్ధతు ఇవ్వకుండా ఇలా నెగెటివ్ పోస్ట్ చేసింది. -
శాస్త్ర సాంకేతికతపై యుద్ధం పిడుగు
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టి నెల రోజులు అవుతోంది. ఈ యుద్ధ ఫలితంగా వేలాదిమంది శరణార్థులుగా మారడంతో అతిపెద్ద మానవీయ సమస్య తలెత్తుతోంది. యుద్ధ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు, ఎరువులు, ఆహారపదార్థాల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రష్యా దాడుల ప్రభావం ప్రపంచ శాస్త్ర పరిశోధన రంగంపై భారం మోపుతోంది. యుద్ధ కారణంగా కీలక ప్రాజెక్టులు రద్దు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ మానవ శాస్త్ర సాంకేతిక పురోగతిని దెబ్బతీస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధారంభం నుంచి ఇంతవరకు ప్రభావితమైన సైన్సు సంబంధిత అంశాలు ఇలా ఉన్నాయి.. మార్స్ మిషన్ రష్యాతో చేపట్టదలిచిన సంయుక్త మార్స్ మిషన్‌ను నిలిపివేస్తున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇరు పక్షాలు కలిసి కుజగ్రహ యాత్రను చేపట్టాల్సిఉంది. కేవలం ఎక్సోమార్స్ మిషన్ మాత్రమే కాకుండా పలు ఇతర ప్రాజెక్టుల్లో రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కోమాస్‌తో బంధాలను తెంచుకుంటున్నట్లు యూరోపియన్ ఏజెన్సీ తెలిపింది. ఇంధన రంగం ఉక్రెయిన్‌పై దాడితో ముందెన్నడూ చూడనటువంటి అంతర్జాతీయ ఇంధన సంక్షోభం ముంచుకువస్తోందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ) హెచ్చరించింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల స్థిరీకరణకు ఈ ఏజెన్సీని 1973లో నెలకొల్పారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ సంక్షోభం తొలగిపోవాలంటే మిగిలిన దేశాలు ఉత్పత్తి పెంచితే సరిపోదని, ఇంధన పొదుపును అన్ని దేశాలు పాటించాలని ఏజెన్సీ సూచించింది. ఇందుకోసం ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, విమానయానాలను తగ్గంచడం, కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించడం తదితర చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకాన్ని వేగంగా అమలు చేయాలని ప్రభుత్వాలను కోరింది. దీంతోపాటు ఫార్మా, ఆహార రంగాల్లో పలు పరిశోధనలు యుద్ధం కారణంగా అటకెక్కనున్నాయి. ఈ పరిణామాలన్నీ ఇంతవరకు మానవాళి సాధించిన సైన్సు విజయాలను ధ్వంసం చేస్తాయని ప్రపంచ పరిశోధకులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఐఎస్ఎస్ నిర్వహణ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నిర్మాణంలో రష్యా, అమెరికా కలిసి పనిచేశాయి. తాజా యుద్ధంతో ఇరు దేశాల మధ్య ఆవేశాలు పెరిగాయి. దీని ప్రభావం అంతరిక్ష ప్రయోగాలపై పడనుంది. ఇక మీదట ఇరుదేశాల ఉమ్మడిపాత్రపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఐఎస్ఎస్లో ఉన్న అమెరికా ఆస్ట్రోనాట్ మార్క్ వాండే మరో ఇద్దరు రష్యన్ కాస్మోనాట్స్‌తో కలిసి భూమి మీదకు రష్యా అంతరిక్ష వాహనంలో రావాల్సిఉంది. ప్రస్తుతానికి ఈ ప్రయోగం వరకు సహకరించుకునేందుకు రష్యా, అమెరికా అంగీకారానికి వచ్చాయి. కానీ ఇకపై అమెరికాకు రాకెట్ విక్రయాలు చేపట్టమని రష్యా ప్రకటించింది. రష్యా దాడికి నిరసనగా అన్నట్లుగా రష్యన్ వ్యోమగాములు తమ ఐఎస్ఎస్ ప్రయాణంలో పసుపురంగు సూట్లు ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. రష్యా దాడికి నిరసనగా ఉక్రెయిన్‌కు చెందిన ఈ రంగును కాస్మోనాట్లు వాడారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తాము సాధారణంగానే ఈ రంగును ఎంచుకున్నట్లు కాస్మోనాట్లు చెబుతున్నారు. ముందుముందు ఐఎస్ఎస్పై రష్యా పట్టు తొలగిపోవచ్చన్న అనుమానాలున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు
న్యూఢిల్లీ: దేశంలో షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణికుల విమానాల రద్దును పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఈ రద్దు అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు. -
మెడలో దండ సరిగా వేయలేదని కోపంతో వధువు ఏం చేసిందంటే!
లక్నో: ఇటీవల కాలంలో కొన్ని వివాహాలు వింత కారణాలతో పెళ్లి పీటలు వరకు వచ్చి ఆగిపోతున్నాయి. మంటపం వరకు వచ్చిన పెళ్లి కాస్త.. వరుడు లేక వధువు చేసిన పని ఇరువరిలో ఎవరికో ఒకరికి నచ్చక మధ్యలోనే పెళ్లిని ఆపేస్తున్నారు. ఈ తరహా రద్దు వివాహాలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లోని బిదునా పోలీస్ సర్కిల్ పరిధిలోని నవీన్ బస్తీలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఔరయ్యా జిల్లాలోని ఓ ప్రాంతంలో పెళ్లి జరగాల్సి ఉంది. ఆ వివాహ వేడుకలో అక్కడ సాంప్రదాయం ప్రకారం వరమాల కార్యక్రమం జరగాలి. అయితే అసలు సమస్యంతా ఇక్కడే వచ్చింది. వరమాల కార్యక్రమంలో.. వరడు దండను వధువు మెడలో వేయకుండా విసిరడంతో వధువుకి కోపం వచ్చింది. దీంతో వధువు పెళ్లి వద్దంటూ తెగేసి చెప్పేసింది. చివరకు ఆమె కుటుంబ సభ్యలు ఎంత చెప్పినా వినలేదు. ఈ విషయమై ఇరు కుటుంబాలు వాగ్వాదానికి కూడా దిగారు. విషయం తేల్చేందుకు పోలీసులను పిలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి పెళ్లి రద్దు చేసుకుని ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. -
పెళ్లిలో డ్యాన్స్ చేసిన వధువు.. ఆ తరువాత వరుడు మారిపోయాడు.. చివర్లో ఏం జరిగిందంటే
Tamil Nadu groom slaps bride: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసినందుకు వరుడు తనను చెంపదెబ్బ కొట్టాడని ఓ వధువు ఆ పెళ్లిని రద్దు చేసుకుని అంతేనా అదే ముహూర్తంలో తన బంధువును పెళ్లి చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రిటీలో చోటుచేసుకుంది. పన్రుటికి చెందిన వధువు, పెరియకట్టుపాళయానికి చెందిన వరుడితో గతేడాది నవంబర్ 6న నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం జనవరి 20న కడంపుల్యూర్ గ్రామంలో జరగాల్సి ఉంది. వివరాల ప్రకారం.. జనవరి 19న వివాహానికి ముందు వధూవరుల బృందం మంటపానికి చేరుకున్నారు. అనంతరం డీజేకు వధూవరులు ఆనందంగా డ్యాన్స్ చేశారు. అయితే, వధువు బంధువు జంట చేతులు పట్టుకుని వారితో కలిసి నృత్యం చేయడంతో విషయాలు గందరగోళంగా మారినట్లు సమాచారం. వధువు తన బంధువులతో కలిసి ఢీజేకి స్టెప్పులు వేస్తోంది. అది నచ్చని వరుడు వేదికపైకి వచ్చి అందరి ముందు వధువును చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.వధువు కూడా ఈ చర్యతో వివాహాన్ని వద్దని తన తల్లదండ్రులకి తెగేసి చెప్పింది. వధువు కుటుంబానికి వారి బంధువులలో తగిన వరుడిని చూసి ముందు అనుకున్న ముహూర్తానికి ఆమెకు పెళ్లి జరిపించారు.తిరస్కరించిన వరుడు పన్రుటి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పెళ్లి ఏర్పాట్ల కోసం తన కుటుంబం రూ. 7 లక్షలు ఖర్చు చేసి పరిహారం ఇప్పించాలని కోరినట్లు వరుడు తెలిపాడు. -
కరోనా: ఈ నెల 24 వరకు కొన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి విస్తరణ ఉధృతంగా కొనసాగుతోంది. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య మూడు లక్షలను దాటేసిన కొత్త కేసుల సంఖ్య 3,47,254గా ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జనవరి ఈ నెల 21 నుండి 24 వరకు కొన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసింది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. క్రితం రోజు మూడు లక్షలు దాటేయగా 24 గంటల వ్యవధిలో మరింత పెరిగాయి. దేశంలో పాజిటివిటీ రేటు 17.94 శాతానికి ఎగబాకింది. కేసుల పరంగా తెలంగాణాలో రోజుకు నాలుగువేలకు పైగా, ఏపీలో 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 1.40 లక్షల కేసులతో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ ఒమిక్రాన్ బారినపడిన వారి సంఖ్య 9,692కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. (2/3) Cancellation of Passenger Trains from 21st to 24th January, 2022 @drmsecunderabad @drmhyb @drmgtl @VijayawadaSCR @drmgnt #IndiaFightsCorona pic.twitter.com/kPpHJOHHen — South Central Railway (@SCRailwayIndia) January 21, 2022 (1/3) Cancellation of Passenger Trains from 21st to 24th January, 2022 @drmsecunderabad @drmhyb #Unite2FightCorona #IndiaFightsCorona pic.twitter.com/oy6WOCKYbH — South Central Railway (@SCRailwayIndia) January 21, 2022 -
జెన్ జడ్... క్యాన్సిల్ కల్చర్
ప్రేమ: ‘ఏరా, కాఫీ మానేశావట!!!’ ‘ఎప్పుడైతే కావ్యకు టీ తప్ప కాఫీ నచ్చదు అనే విషయం తెలిసిందో ఇక అప్పటి నుంచి కాఫీ ముఖం ఈ జన్మలో చూడొద్దని డిసైడైపోయాను’ అభిమానం: ‘మీరు ఏమైనా అనుకోండి. మీ హీరో సినిమా ఏమాత్రం బాగలేదు. అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి?’ ‘సినిమా ఎందుకు చూడాలి? అనే మాట వాడి చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. అంతపెద్ద మాట అంటావా! ఇక ముందు మీ హీరో సినిమాలను బాయ్‌కాట్ చేస్తున్నాము’ కుటుంబం: ‘నాన్న పలకరించినా ముఖం తిప్పేస్తున్నావట! ఇది మంచి పద్ధతి కాదు. పెద్దవాళ్లు మన బాగు కోసం ఒక మాట అంటే తప్పేమిటి?!’ సామాజికం: ‘మిత్రులారా... ఫలానా షూస్ ఎవరూ వాడవద్దు. వాటిని జంతుచర్మంతో తయారుచేస్తారట’ ∙∙ ‘జెన్ జడ్’ జనరేషన్లో కీలకపాత్ర వహిస్తుంది ‘క్యాన్సిల్ కల్చర్’ దీనికి సోషల్‌మీడియా ప్రధాన వేదిక అయింది. ‘క్యాన్సిల్’ అంటే ఉన్న సాధారణ అర్ధాలలో రెండు.. రద్దు చేయడం, తుడిచివేయడం. ఇక పాప్–కల్చర్ డిక్షనరీ ప్రకారం తమ మనోభావాలను దెబ్బతీశారనే కారణంతో సెలబ్రిటీలు లేదా కంపెనీలను ఏదో ఒక రూపంలో బాయ్‌కాట్ చేయడం. ఈ క్యాన్సిల్ కల్చర్ మూలాలు 2014 ‘లవ్ అండ్ హిప్–పాప్: న్యూయార్క్’ రియాల్టీ షోలో ఉన్నాయి అంటారు. ఆ షోలో ఒక నటుడికి తన గర్ల్‌ఫ్రెండ్‌కు అంతకుముందే కూతురు ఉందనే విషయం తెలిసి ‘యూ ఆర్ క్యాన్సిల్డ్’ అంటాడు. మొదట్లో ‘యూ ఆర్ క్యాన్సిల్డ్’ను సోషల్ మీడియాలో సరదాగా అనుకరించేవారు. అయితే ఈ సరదా కాస్త ఆ తరువాత సీరియస్ రూపంలోకి మారింది. మనలాంటి దేశాల్లోకి కూడా వచ్చేసి చాలామంది యూత్‌ను పట్టేసింది. ట్విట్టర్లో ‘బాయ్‌కాట్’ హ్యాష్‌టాగ్‌లు పెరిగాయి. ఫేస్బుక్లో ఒక కుర్రాడు ఇలా పోస్ట్ పెట్టాడు. ‘జాను లవ్స్ ఆరెంజ్. షీ ఈజ్ క్యాన్సిల్డ్’ యూత్‌లోని ఈ ‘క్యాన్సిల్ కల్చర్’ గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అనడం కంటే...‘ఇది సరికాదు’ అనే వారే ఎక్కువ. అమెరికన్ యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్ ‘సౌత్ పార్క్’ ఈ ధోరణిని వెక్కిరించింది. స్టాండప్ కామెడి షో ‘స్పీక్స్ అండ్ స్టోన్స్’ కూడా అదే మార్గాన్ని అనుసరించింది. ‘కాలేజి క్యాంపస్‌లో ప్రత్యర్థి పక్షం భావాలను వ్యతిరేకించడం... అనే భావన క్యాన్సిల్ కల్చర్‌కు విత్తనంలాంటిది. అది కాస్త సోషల్ మీడియాకు విస్తరించింది’ అంటాడు ‘కోడింగ్ ఆఫ్ ది అమెరికన్ మైండ్’ పుస్తకం రాసిన జోనాధన్. బాయ్కాట్లు, బహిష్కరణలు మన సామాజిక చరిత్రలో కొత్తేమీ కాదు. స్వాతంత్య్ర ఉద్యమంలో ‘విదేశీ వస్తు బహిష్కరణ’ ఎంత కీలక పాత్ర పోషించిందో మనకు తెలిసిందే. అలాంటి ఉద్యమాలకు అర్థం, పరమార్థం, అనంతమైన బలం ఉన్నాయి. అలా కాకుండా చిన్న చిన్న విషయాలు, అల్పమైన విషయాలపై ‘క్యాన్సిల్ కల్చర్’ను ఫాలోకావడం తగదని చెబుతున్నారు విజ్ఞులు. అయితే జెన్ జడ్లో ‘క్యాన్సిల్ కల్చర్’ని తలకెత్తుకుంటున్నవారితో పాటు ‘క్యాన్సిల్ ది క్యాన్సిల్ కల్చర్’ అని నినదిస్తున్నవారు కూడా ఉన్నారు. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. అక్కడ పర్యటనలు, ర్యాలీలు రద్దు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కరోనా ప్రభావం పడినట్లే కనిపిస్తోంది. మహమ్మారి కారణంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోయిడా ర్యాలీని రద్దు చేసుకున్నారు. కాగా నోయిడాలో గురువారం ముఖ్యమంత్రి ప్రచారం చేపట్టాల్సి ఉండగా.. అక్కడ కొవిడ్ కేసులు రికార్డుస్థాయిలో పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు కాంగ్రెస్ కూడా వారి ప్రచార ర్యాలీలు రద్దుచేసుకుంది. లడ్కీ మారథాన్ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలను కూడా రద్దు చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ప్రచార ర్యాలీలపై నిషేధం విధించాలంటూ ఈసీకి యూపీ కాంగ్రెస్ లేఖ రాసింది . కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రచారసభలు బ్యాన్ చేయాలని విజ్ఞప్తిచేసింది. యూపీలోని బరేలీ జిల్లా నుంచి మంగళవారం కొన్ని దిగ్భ్రాంతికరమైన ఘటనలు చోటు చేసుకోవడంతో పార్టీలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. కాగా ఓ పార్టీ కార్యక్రమానికి హాజరైన వందలాది మంది మహిళలు, యువకులు ముసుగులు లేకుండా బహిరంగంగా కార్యక్రమంలో లోపల, వెలుపల కనిపించారు. వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సభలను, ర్యాలీలను పార్టీలు రద్దు చేసుకున్నాయి. బుధవారం నాటికి దేశంలో కొత్తగా నిర్థారణ అయిన వాటితో కలిపి 58,097 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గత తొమ్మిది రోజుల్లో రోజువారీ పెరుగుదల జరగడం ఇది ఆరో సారి కావడం గమనార్హం. దేశంలో ఇప్పటివరకు 2,135 ఓమిక్రాన్ స్ట్రెయిన్ కేసులు గుర్తించగా, అందులో 31 యూపీ నుంచి నమోదయ్యాయి. చదవండి: Omicron Variant Updates In India: ‘ఒమిక్రాన్ కేసుల జోరు.. భారత్‌లో మూడో వేవ్, ఢిల్లీలో ఐదో వేవ్’ -
ముత్తూట్‌కు ఆర్బీఐ షాక్
ఫైనాన్షియల్ కార్పొరేషన్ ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. వెహికిల్స్ విభాగానికి సంబంధించిన ముత్తూట్ వెహికిల్ అండ్ అస్సెట్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు ఆథరైజేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నియంత్రణ అవసరాలకు అనుగుణంగా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అంతేకాదు చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్ (PSO)గా ఉన్న మరో కంపెనీ ఈకో(EKO) ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సైతం సీవోఏను రద్దు చేసేసింది. ఇదిలా ఉంటే ఎస్బీఐ, ఐసీసీఐ బ్యాంక్‌తో పాటు యస్ బ్యాంక్ తరపున సేవలు అందిస్తోంది ఈకో. సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ (CoA) రద్దు చేయబడిన తరువాత.. ముత్తూట్ వెహికిల్ ఫైనాన్స్, ఈకో కంపెనీలు ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల జారీ, నిర్వహణ లాంటి వ్యాపారాలకు అర్హత కోల్పోయినట్లు అయ్యింది. అయితే, ఈ కంపెనీలపై PSOలుగా చెల్లుబాటు అయ్యే క్లెయిమ్ ఉన్న కస్టమర్లు, వ్యాపారులు.. రద్దు చేసిన తేదీ నుండి మూడు సంవత్సరాలలోపు తమ క్లెయిమ్‌ల పరిష్కారం కోసం వారిని సంప్రదించవచ్చు. ఇదిలా ఉంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని విచక్షణ అధికారాల్ని వినియోగించి బ్యాంకుల పెద్దన్న ఈ నిర్ణయం తీసుకుంది. సీవోఏ క్యాన్సిలేషన్ డిసెంబర్ 31నే జరిగినప్పటికీ.. అధికారిక ప్రకటన మాత్రం జనవరి 4న చేసింది ఆర్బీఐ. చదవండి: బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ! -
పార్టీ లేదా 'పుష్ప'.. సక్సెస్ మీట్ క్యాన్సిల్
Pushpa Movie Massive Success Party Cancelled In Kakinada: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. డిసెంబర్17న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా అదరగొట్టగా, రష్మిక మందన్నా శ్రీవల్లిగా కనువిందు చేసింది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో చేరిపోయిన పుష్ప ప్రస్తుతం సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేస్తుంది. ఈ సందర్భంగా వివిధ నగరాల్లో మూవీ టీం సక్సెస్ పార్టీలు నిర్వహిస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు(డిసెంబర్24)న కాకినాడలో సక్సెస్ మీట్ జరగాల్సి ఉంది. అయితే అనుమతులు రాకపోవడంతో ఆ సమావేశాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. -
‘భోజనమాత’పై వివక్ష.. దళిత మహిళ వండిన ఆహారం మాకొద్దు
డెహ్రడూన్: కుల వివక్ష ఇప్పటికీ ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఘటన ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లా సుఖిందాంగ్‌లో చోటుచేసుకుంది. దళిత మహిళ వండిన ఆహారాన్ని తినడానికి అగ్రవర్ణ పిల్లలు నిరాకరించారు. దాంతో పాఠశాల బాధ్యులు ఆమెను తొలగించి మరో వివక్షాపూరిత చర్యకు పాల్పడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం వండి, వడ్డించే మహిళలను ఉత్తరాఖండ్‌లో ‘భోజనమాత’గా సంబోధిస్తారు. కొద్దిరోజుల కిందట ఈ బడిలో భోజనమాత పోస్టు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. అగ్రవర్ణ మహిళ కూడా ఇంటర్వ్యూకు వచ్చినా ఆమెను కాదని దళిత మహిళను ఎంపిక చేయడంపై పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత సదరు మహిళ వండిన ఆహారాన్ని తినడానికి పిల్లలు నిరాకరించారు. మొత్తం 66 మంది పిల్లల్లో 40 మంది పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనాన్ని తినడం మానివేసి ఇంటి నుంచి లంచ్ బాక్స్‌లు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. దీంతో దళిత మహిళను తొలగించి ఆమె స్థానంలో మరొకరికి తాత్కాలికంగా నియమించారు పాఠశాల బాధ్యులు. అయితే చంపావత్ జిల్లా విద్యాధికారి పి.సి.పురోహిత్ వాదన మాత్రం భిన్నంగా ఉంది. దళిత మహిళ నియామకంలో నిబంధనలను పాటించలేదని, ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేయకుండానే సదరు మహిళను భోజనమాతగా నియమించారని పురోహిత్ చెప్పుకొచ్చారు. అందుకే ఆమె నియామకాన్ని రద్దు చేశామని చెప్పారు. (చదవండి: మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం) -
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినేట్ ఆమోదం
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ రద్దను బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టనుంది. ‘‘ ద ఫామ్ లాస్ రిపీల్ బిల్ 2021 టు రిపీల్ త్రీ ఫామ్ లాస్’’ అని లోక్‌సభ చేపట్టబోయే బిజెనెస్ లిస్ట్‌లో పేర్కొంది. ఈ సమావేశాల్లో మొత్తం 26 బిల్లులు ప్రవేశపెడుతుండగా జాబితాలో 25వ అంశంగా వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టడం, పరిశీలన, ఆమోదాన్ని ప్రతిపాదించింది. అయితే, తొలిరోజైన నవంబరు 29నే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గత వారం, ప్రధాన మంత్రి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ, నిరసన తెలుపుతున్న రైతులను వారి ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరారు. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో, మూడు చట్టాలను రద్దు చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రధాని తెలిపారు. దాదాపు ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాలను అధికారికంగా రద్దు చేసే వరకు నిరసనకారులు వేచి ఉంటారని రైతు నాయకుడు రాకేష్ టికైత్ అన్నారు. అలానే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని కేంద్రం మరో నాలుగు నెలలు పొడిగించింది. ఈ పథకం ద్వారా కరోనా నేపథ్యంలో పేదలకు ఉచితంగా బియ్యం, పప్పు పంపిణీ చేశారు. దీన్ని మరో నాలుగు నెలలు పొడిగించారు. గడిచిన 15 నెలల కాలానికి గాను ఈ పథకానికి కేంద్రం 2,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రకటించింది. చదవండి: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు -
శబరిమల యాత్ర నిలిపివేత.. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ
కొచ్చి: కేరళలో భారీ వర్షాలు కురవడంతో శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్థానిక జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంబా నది ఉప్పొంగుతోంది. దీంతో నది డ్యామ్ వద్ద రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతరీత్యా శబరిమల యాత్ర కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత సమీప స్లాట్‌లో దర్శన అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పారు. చదవండి: దేశంలోనే తొలి స్థానంలో ఇండోర్.. విజయవాడకు మూడోస్థానం -
చట్టాలు ఉపసంహరించాకే ఇళ్లకు
న్యూఢిల్లీ/ఘజియాబాద్/పాల్ఘర్: మూడు సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేసే దాకా రైతులు ఉద్యమ వేదికలను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని రైతు సంఘాల సమాఖ్య.. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) శుక్రవారం స్పష్టంచేసింది. ఎంఎస్పీకి చట్టబద్ధత డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉందని తెలిపింది. సాగు చట్టాల రద్దు నిర్ణయంపై ఎస్కేఎం హర్షం వ్యక్తంచేసింది. అయితే, చట్టాలు రద్దయ్యేదాకా ఉద్యమవేదికలను వదిలే ప్రసక్తే లేదని, రైతులు ఎవరూ ఇళ్లకు వెళ్లబోరని ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ అన్నారు. శని, ఆదివారాల్లో జరిపే ఎస్కేఎం కోర్ కమిటీ సమావేశాల్లో రైతు ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు. చట్టాలను రద్దుచేస్తే ఏడాదికాలంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి చరిత్రాత్మక విజయం దక్కినట్లేనని ఎస్కేఎం తెలిపింది. చేతల్లో చూపండి: తికాయత్ సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేశాక రైతుల ఉద్యమాన్ని విరమిస్తామని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పష్టంచేశారు. రద్దు చేస్తామని మాటల్లోనే కాదు.. చేతల్లోనూ చూపి చట్టాలను వెంటనే రద్దుచేయాలన్నారు. ‘ చట్టాలను పార్లమెంట్లో రద్దుచేసేదాకా రైతులు ఎవ్వరూ సంబరాలు చేసుకోకండి. రైతుల ఆందోళన ఇప్పటికిప్పుడే ఆగిపోదు. పార్లమెంట్లో ఈ చట్టాలను రద్దుచేసే రోజు దాకా వేచి చూస్తాం. పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తోపాటు ఇతర ప్రధాన సమస్యలపైనా రైతు సంఘాలతో మోదీ సర్కార్ చర్చలు జరపాల్సిందే’ అని తికాయత్ హిందీలో ట్వీట్‌చేశారు. ‘ చట్టాలు రద్దయ్యేదాకా రైతులు ఉద్యమ వేదికల నుంచి ఇళ్లకు వెనుతిరిగేదే లేదు. పంటలకు కనీస మద్దతు ధర లభించట్లేదు. ఈ సమస్య దేశం మొత్తాన్నీ పట్టి పీడిస్తోంది’ అనిæ అన్నారు. -
పాకిస్తాన్‌కు మరో షాక్.. సిరీస్‌ను రద్దు చేసుకున్న ఇంగ్లండ్
-
ప్రమాణ స్వీకారోత్సవం రద్దు చేసిన తాలిబన్లు
కాబూల్: కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని తాలిబన్లు రద్దు చేశారు. వనరులు, నిధుల వృ«థా నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అమెరికాపై దాడులు జరిగిన 11 సెప్టెంబర్ నాడే అట్టహాసంగా తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించాలని తొలుత తాలిబన్లు భావించారు. ఇందుకోసం రష్యా, చైనా, ఖతార్, పాకిస్తాన్, ఇరాన్‌కు ఆహ్వానాలు కూడా పంపారు. కానీ అకస్మాత్తుగా ప్రమాణస్వీకారోత్సవ రద్దు నిర్ణయం ప్రకటించారు. ప్రమాణ స్వీకారోత్సవం లేకపోయినా ప్రభుత్వం ఏర్పడి పనిచేయడం ప్రారంభమైందని తాలిబన్ ప్రతినిధి ఇనాముల్లా సమంగని ప్రకటించారు. అయితే నిధుల వృథా నివారణ అనేది అసలు కారణం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాలిబన్ మిత్రుల ఒత్తిడి వల్లనే ఈ ఉత్సవాన్ని రద్దు చేశారని రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది. 11న ప్రమాణ స్వీకారోత్సవం జరపడం అమానవీయమని, దాన్ని నిలిపివేయమని తాలిబన్లకు సలహా ఇవ్వాలని యూఎస్, నాటో దేశాలు ఖతార్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని పేర్కొంది. దీనివల్ల అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనను ప్రపంచ దేశాలు గుర్తించడం మరింత కఠినతరమవుతుందని హెచ్చరించినట్లు తెలిసింది. -
హైదరాబాద్: ఆకస్మికంగా ఆర్టీసీ బస్సులు రద్దు!
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేట్‌కు చెందిన నగేష్ ఈ నెల 12వ తేదీన విజయవాడకు వెళ్లేందుకు ఆర్టీసీ గరుడప్లస్ బస్సు (1402) కోసం అడ్వాన్స్‌గా రిజర్వేషన్ బుక్ చేసుకున్నాడు. ఉదయం 5.50 గంటలకు ఎస్సార్‌నగర్ నుంచి బస్సు బయలుదేరవలసిన సమయాని కంటే అరగంట ముందే చేరుకున్నాడు. కానీ ఉదయం 8.15 గంటల వరకు కూడా బస్సు రాలేదు. పైగా బస్సు రద్దయినట్లు ఎలాంటి సమాచారం లేదు. అసలు వస్తుందో, రాదో కూడా తెలియలేదు. టీఎస్ఆర్టీసా కాల్‌సెంటర్‌ను సంప్రదించాడు. ఎలాంటి స్పందన లేదు. చివరకు రెండు గంటల తరవాత ఆర్టీసీ బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన అధికారులు సదరు బస్సు రద్దయినట్లు తాపీగా సెలవిచ్చారు. కానీ ఆ బస్సు కోసం ఉదయం నాలుగున్నరకే పాయింట్‌కు చేరుకున్ననగేష్ మాత్రం 8 గంటల వరకు అంటే మూడున్నర గంటల పాటు ఆందోళనగా ఎదురు చూడవలసి వచ్చింది. ఇది ఒక్క నగేశ్‌కు ఎదురైన సమస్య మాత్రమే కాదు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా రద్దవుతున్న దూరప్రాంత బస్సుల వల్ల అప్పటికప్పుడు మరో బస్సులో వెళ్లేందుకు అవకాశం లేక ప్రయాణికులు తరచుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు తప్పనిసరిగా వెళ్లవలసిన వాళ్లు మాత్రం ప్రైవేట్ వాహనాల్లో పెద్ద మొత్తం చెల్లించవలసి వస్తోంది. నిర్వహణలో సమన్వయ లోపం... బస్సుల నిర్వహణలో సమన్వయ లోపం కారణంగా ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. సాంకేతిక కారణాల వల్ల బస్సులు రద్దయితే ఆ సమాచారాన్ని ప్రయాణికులకు ముందే చేరవేయాలి. మరో బస్సు అందుబాటులో ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కానీ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. బీహెచ్ఈఎల్ డిపో నుంచి ఉదయం నాలుగున్నర గంటలకు బయలేదేరవలసిన గరుడ ప్లస్ బస్సు ఇంజన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల బస్సు రద్దయినట్లు అధికారులు తెలిపారు. కానీ ప్రయాణికులకు ఆ సమాచారం అందజేయడంలో తమ సిబ్బంది విఫలమైనట్లు డివిజనల్ మేనేజర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీంతో ఒక్క ఎస్సార్ నగర్ నుంచి బయలుదేరే ప్రయాణికులే కాకుండా కేపీహెచ్‌బీ, అమీర్‌పేట్, లకిడికాపుల్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో అదే బస్సు కోసం ఎదురు చూస్తున్న వాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. ‘ఆర్టీసీ అధికారుల నిర్వాకం వల్ల ముఖ్యమైన కార్యక్రమానికి హాజరుకాలేకపోయాను. ఇది చాలా దారుణం’. అని నగేశ్ విస్మయం వ్యక్తం చేశారు. ఆదరణ లేకపోవడమే కారణమా... ► సాంకేతిక కారణాల వల్ల బస్సులు రద్దవుతున్నట్లు అధికారులు పైకి చెబుతున్నప్పటికీ ఏసీ బస్సులకు ఆదరణ లేకపోవడం వల్లనే అప్పటికప్పుడు రద్దు చేస్తున్నట్లు తెలిసింది. ► ఏసీ బస్సుల్లో హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు వెనుకంజ వేస్తున్నారు. ఏసీ వల్ల కోవిడ్ వ్యాపిస్తుందేమోననే ఆందోళన ఇందుకు కారణం. ►దీంతో కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ కూడా లేకపోవడంతో బస్సులను రద్దు చేసుకోవలసి వస్తున్నట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. కానీ అదే సమాచారాన్ని ముందస్తుగానే ప్రయాణికులకు తెలియజేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సూచించకపోవడం ఆర్టీసీ అధికారులు బాధ్యతారాహిత్యాన్ని ప్రతిబింబిస్తోంది. పనిచేయని కాల్ సెంటర్ ► ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఎప్పటికప్పుడు బస్సు సమాచారం తెలుసుకొనేందుకు ఆర్టీసీ కాల్సెంటర్లను ఏర్పాటు చేసింది. ► ఆర్టీసీ కాల్‌సెంటర్ నెంబర్లు : 040–30102829, 040–68153333 ► ఈ కాల్‌సెంటర్లు ఇరువైనాలుగు గంటలు ప్రయాణికులకు అందుబాటులో ఉండాలి. ఫిర్యాదులను స్వీకరించాలి. ఎప్పటికప్పుడు తగిన సమాచారం ఇవ్వాలి. ► కానీ అందుకు విరుద్ధంగా ఫోన్ చేసినా ఎలాంటి సమాచారం లభించడం లేదని, స్పందన కరువవుతుందని ప్రయాణికులలు పేర్కొంటున్నారు. -
Traffic Challan: వాహనదారులకు తీపి కబురు
సాక్షి, బనశంకరి( బెంగళూరు): వాహనదారులకు హోంశా మంత్రి ఎ.జ్ఞానేంద్ర తీపి కబురు అందించారు. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ స్పాట్ ఫైన్‌ను రద్దుచేయాలని పోలీసుశాఖను ఆయన ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు వినియోగిస్తున్న చలానా ఉపకరణాలను వారి వారి పోలీస్స్టేషన్లలో అప్పగించాలన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు నిలిపి అక్కడిక్కడే చలానాలు రాసి వసూలు చేస్తున్నారు. ఇందుకు పీడీఏ మిషన్లను ఉపయోగిస్తున్నారు. చలానాలపై ఆరోపణలు ఫైన్ చెల్లించినప్పటికీ పీడీఏ లేదా పీఓఎస్ మెషిన్లు గత జరిమానాలు పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా స్పాట్ చలానాలను రద్దు చేయాలని హోంమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్లపై డిజిటల్ కెమెరాలో రికార్డయ్యే ఉల్లంఘలనపై వాహనదారు ఇంటికి చలానా పంపిస్తారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. రెట్రో ట్యాక్స్ రద్దు
న్యూఢిల్లీ: స్థిరమైన పన్ను విధానాలపై ఇన్వెస్టర్లలో భరోసా కల్పించేందుకు, కార్పొరేట్ సంస్థలతో నెలకొన్న రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ వివాదాలకు ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెట్రో ట్యాక్స్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన చట్టాల్లో తగు సవరణలు చేసేందుకు లోక్‌సభలో గురువారం బిల్లు ప్రవేశపెట్టింది. 2012 మే, 28కి పూర్వం జరిగిన డీల్స్‌కి సంబంధించి దీని కింద జారీ చేసిన ట్యాక్స్ డిమాండ్లను ఉపసంహరించేందుకు.. ట్యాక్సేషన్ చట్టాల (సవరణలు) బిల్లు, 2021ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆయా సంస్థలు కట్టిన మొత్తాన్ని.. వడ్డీ ప్రసక్తే లేకుండా ప్రభుత్వం తిరిగి చెల్లించే విధంగా ఈ బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకోసం సదరు సంస్థలు రెట్రో పన్నుపై వేసిన దావాలను ఉపసంహరించుకోవాలి లేదా ఉపసంహరించుకుంటామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, తాము వ్యయాలు, నష్టపరిహారం, వడ్డీ వంటివి కోరబోమంటూ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనితో కెయిర్న్ ఎనర్జీ, వొడాఫోన్ గ్రూప్ వంటి బహుళ జాతి దిగ్గజాలకు ఊరట లభించనుంది. రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ నిబంధన కింద మొత్తం రూ. 8,100 కోట్లు వసులు కాగా.. ఇందులో కెయిర్న్ ఎనర్జీ నుంచి రాబట్టినదే రూ. 7,900 కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి టి.వి. సోమనాథన్ తెలిపారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. కాగా తాజా పరిణామంపై తగు సమ యంలో స్పందిస్తామని కెయిర్న్ పేర్కొంది. ఇన్వెస్టర్లకు భరోసా.. 2014 నుంచే (కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత) రెట్రో ట్యాక్సేషన్ అనేది ప్రభుత్వ విధానం కాదని సోమనాథన్ పేర్కొన్నారు. ఇవన్నీ 2014కి పూర్వపు వివాదాలని తెలిపారు. ప్రస్తుతం భారత్‌కి పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమని వివరించారు. పన్ను విధానాలపై ఇన్వెస్టర్లలో భరోసా కల్పించాలనే ఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. ‘‘పన్ను వేసే విషయంలో భారతదేశ సార్వభౌమ అధికారాలను ప్రశ్నించడానికి లేదు. కానీ రెట్రో ట్యాక్సేషన్ అనేది మాత్రం ప్రభుత్వ విధానం కాదని తెలియజెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని స్పష్టం చేశారు. రెట్రో సంగతి ఏమిటంటే... గతంలో ఎప్పుడో జరిగిన లావాదేవీలకు కూడా పన్నులు వసూలు చేసే విధానాన్ని రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్‌గా వ్యవహరిస్తారు. దీని ప్రకారం కొత్తగా పన్ను విధించవచ్చూ లేదా గతంలో చెల్లించిన దానికి అదనంగా వసూలూ చేయవచ్చు. సాధారణంగా గత, ప్రస్తుత ట్యాక్స్ విధానాల్లో భారీగా మార్పులు ఉన్నప్పుడు, పాత విధానం కింద కట్టిన పన్నులు చాలా తక్కువని భావించినప్పుడు దీన్ని అమలు చేయవచ్చు. తద్వారా వ్యత్యాసాలను సరిచేయొచ్చు. అయితే, గత కాలంలో జరిపిన లావాదేవీలకు అప్పటి నిబంధనల ప్రకారమే పన్నులు కట్టి ఉంటారు కాబట్టి ఇలాంటి రెట్రోస్పెక్టివ్ పన్నులపై ట్యాక్స్‌పేయర్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రస్తుతం కూడా అదే జరిగింది. భారతదేశంలోని ఆస్తుల అమ్మకం, షేర్ల బదలాయింపు వంటి లావాదేవీలు గతంలో విదేశాల్లో జరిగినా వాటికి సంబంధించి ఇక్కడ పన్ను కట్టాల్సిందేనన్న ఉద్దేశంతో 2012 మే, 28న అప్పటి యూపీఏ ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్నుండి సుమారు 17 సంస్థలకు దాదాపు రూ. 1.10 లక్షల కోట్ల మేర కట్టాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. ప్రధానంగా బ్రిటన్ దిగ్గజాలైన కెయిర్న్ ఎనర్జీ, వొడాఫోన్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఈ ట్యాక్స్‌పై అవి అంతర్జాతీయంగా ఆర్బిట్రేషన్‌కు వెళ్లగా, వాటికి అనుకూలంగానే ఉత్తర్వులు వచ్చాయి. పరిస్థితి ఎంతదాకా వెళ్లిందంటే .. తనకు రావాల్సిన బకాయిలను రాబట్టుకునేందుకు కెయిర్న్ ఎనర్జీ విదేశాల్లో ఉన్న భారత ఆస్తులను జప్తు చేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట మరింత మసకబారకుండా ఇలాంటి వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు రెట్రో ట్యాక్స్‌ను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. వొడాఫోన్ వివాదం ఇదీ.. బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ 2007లో భారత్‌లో టెలికం కార్యకలాపాలున్న హచిసన్ ఎస్సార్‌లో 67 శాతం వాటాలను 11.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. రెండూ విదేశీ సంస్థలే కాగా కేమ్యాన్ ఐల్యాండ్స్ వేదికగా ఈ డీల్ జరిగింది. దీనికి సంబంధించి విత్‌హోల్డింగ్ ట్యాక్స్ మినహాయించుకోనందుకు గాను రూ. 11,218 కోట్లు కట్టాలంటూ 2010లో వొడాఫోన్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. 2011లో రూ. 7,900 కోట్ల పెనాల్టీ విధించింది. దీన్ని సవాలు చేస్తూ కంపెనీ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రెండు విదేశీ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందానికి ఇవి వర్తించవంటూ అత్యున్నత న్యాయస్థానం 2012లో ట్యాక్స్ డిమాండ్లను కొట్టివేసింది. ఆ దరిమిలా వొడాఫోన్‌పై విధించిన పన్నును సమర్థించుకునే విధంగా రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌కు సంబంధించి అదే ఏడాది కేంద్రం ఐటీ చట్టాన్ని సవరించింది. అటుపైన 2013లో వొడాఫోన్‌కు మళ్లీ రూ. 14,200 కోట్లకు డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. భారత్–నెదర్లాండ్స్ ఒడంబడిక కింద 2014లో వొడాఫోన్ కేంద్రానికి ఆర్బిట్రేషన్ నోటీసులు ఇచ్చింది. దీనిపై కొత్తగా చర్యలేమీ తీసుకోమంటూ కేంద్రం చెప్పినప్పటికీ 2016లో మరోసారి రూ. 22,100 కోట్లు కట్టాలంటూ కంపెనీకి డిమాండ్ నోటీసులు వచ్చాయి. ఈ వివాదంలో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో వొడాఫోన్‌కి అనుకూలంగా తీర్పు వచ్చింది. కెయిర్న్ అంశం.. కెయిర్న్ ఎనర్జీ వివాదం కూడా దాదాపు పదిహేనేళ్ల క్రితం నాటిది. 2006లో కెయిర్న్ యూకే అంతర్గతంగా కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కెయిర్న్ ఇండియా హోల్డింగ్‌లో తన షేర్లను కెయిర్న్ ఇండియాకు బదలాయించింది. 2011లో దీన్ని వేదాంత రిసోర్సెస్‌కి విక్రయించింది. 2006లో నిర్వహించిన లావాదేవీలకు సంబంధించి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలంటూ రెట్రో ట్యాక్స్ విధానం కింద రూ. 20,495 కోట్లు (అసలు, పెనాల్టీలు కలిపి) కట్టాలంటూ 2014లో కెయిర్న్ ఎనర్జీకి ఆదాయ పన్ను శాఖ నోటీసు జారీ చేసింది. దాన్ని రాబట్టుకునేందుకు విక్రయ డీల్ ప్రకారం వేదాంతలో కెయిర్న్ ఎనర్జీకి లభించిన 5 శాతం వాటాలను జప్తు చేసుకుని, విక్రయించింది. వీటి విలువ 1 బిలియన్ డాలర్ల పైగానే ఉంటుంది. అది కాకుండా కెయిర్న్ యూకేకి చెందాల్సిన డివిడెండ్లు, దానికి ఇవ్వాల్సిన పన్ను రీఫండ్లను కూడా ఆపేసింది. దీనిపై కెయిర్న్ ఎనర్జీ వివిధ న్యాయస్థానాల్లో పోరాడింది. 2020 డిసెంబర్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్..కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. వీటి ప్రకారం కెయిర్న్ ఎనర్జీకి భారత ప్రభుత్వం వడ్డీ మొదలైనవి కలిపి 1.7 బిలియన్ డాలర్లు కట్టాలి. హేగ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్లో భారత ప్రభుత్వం దీన్ని సవాలు చేసింది. మరోవైపు, తనకు రావల్సిన మొత్తాన్ని రాబట్టుకునేందుకు విదేశాల్లో భారత్‌కి ఉన్న ఆస్తులను జప్తు చేసుకునేందుకు అనుమతులు పొందేలా అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్ తదితర దేశాల్లో న్యాయస్థానాలను కెయిర్న్ ఆశ్రయించింది. ప్యారిస్‌లో దాదాపు 20 మిలియన్ డాలర్ల విలువ చేసే భారత ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసుకునేందుకు అనుమతులు కూడా పొందింది. అటు ఇదే కేసులో వేదాంతకు కూడా నోటీసులు జారీ కాగా ఆ సంస్థ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో సవాలు చేసింది. అనిశ్చితి పోతుంది.. పన్ను చట్టాల విషయంలో ప్రభుత్వ ధోరణిపై అనిశ్చితిని తొలగించేందుకు తాజా బిల్లు తోడ్పడుతుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ జేబీ మహాపాత్ర పేర్కొన్నారు. -
అమర్నాథ్ యాత్ర రద్దు..!
న్యూఢిల్లీ: కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది కూడా అమర్నాథ్ యాత్రను రద్దు చేస్తూ జమ్మూకశ్మీర్ యంత్రాంగం సోమవారం ప్రకటించింది. కరోనా కారణంగా అమర్నాథ్ యాత్ర రద్దు కావడం ఇది రెండోసారి. కరోనా విజృంభిస్తోన్న సమయంలో అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. యాత్రికుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఈ విషయాన్ని ట్విటర్లో తెలిపింది. వర్చ్యువల్‌లో పూజా కార్యక్రమాలను చూడొచ్చని అమర్నాథ్ బోర్డు తెలిపింది. 56 రోజులపాటు జరిగే అమర్నాథ్ యాత్ర జూన్ 28న ప్రారంభమై ఆగష్టు 22న ముగుస్తుంది. Shri Amarnathji Yatra cancelled in wake of Covid-19 Pandemic. Decision after threadbare discussion with Shri Amarnathji Shrine Board members. Yatra to be symbolic only. However, all the traditional religious rituals shall be performed at the Holy Cave Shrine as per past practice. — Office of LG J&K (@OfficeOfLGJandK) June 21, 2021 చదవండి: గడ్డకట్టే చలిలో.. 18 వేల అడుగుల ఎత్తున యోగాసనాలు -
పెళ్లిలో గుట్కా నమిలిన వరుడు.. వధువు ఏం చేసిందంటే?
లక్నో: ఇటీవల కొన్ని వివాహాలు మంటపాల్లోనే పలు కారణాల వల్ల రద్దవుతున్నాయి. ఇదే తరహా ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో వెలుగు చూసింది. ముహుర్తం సమయానికి ముందు వరుడు గుట్కా నములుతున్న విషయాన్ని గ్రహించిన వధువు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మిశ్రౌలి గ్రామానికి చెందిన యువతితో కేజూరి గ్రామానికి చెందిన యువకుడికి జూన్ 5న పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. పెళ్లి రోజు ముహూర్త సమయానికి వరుడితో పాటు బంధువులు ఊరేగింపుగా మంటపానికి చేరుకున్నాడు. అదే సమయంలో వరుడు గుట్కా నములుతూ వధువుకు కనిపించాడు. దీంతో తనకు వరుడు గుట్కా నమలడం నచ్చలేదంటూ, వివాహం వద్దని తల్లిదండ్రులకు తెగేసి చెప్పేసింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి జరగాలని వధువుకు ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ యువతి పెళ్లికి ససేమిరా అనేసింది. చివరికి చేసేదేమి లేక ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి ముందు ఇచ్చిపుచ్చుకున్న కట్నకానుకలను తిరిగి ఇచ్చేశారు. కాగా ఉత్తర ప్రదేశ్‌లో ఒక వారంలో ఇలాంటి రెండవ సంఘటన ఇది. గత వారం, ప్రతాప్‌ఘర్ జిల్లాలో ఓ వధువు వరుడు తాగి వచ్చి అతనితో కలిసి నృత్యం చేయమని బలవంతం చేయగా, విసుగు చెందిని వధువు ఇలానే పెళ్లి ఆపేసిన సంగతి తెలిసిందే. చదవండి: వ్యాక్సిన్ వేసుకున్న వారికి బ్యాంకుల బంపర్ ఆఫర్! -
ఆసియా కప్ టి20 టోర్నీ రద్దు
కొలంబో: శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీ రద్దయింది. కరోనా నేపథ్యంలో టోర్నీని నిర్వహించే స్థితిలో తాము లేమని శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈఓ యాష్లే డి సిల్వా ప్రకటించారు. వాస్తవానికి ఈ టోర్నీ గత ఏడాది పాకిస్తాన్లో జరగాల్సింది. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్లో భారత్ పర్యటించే అవకాశం లేకపోవడంతో టోర్నీ వేదికను పాక్ నుంచి శ్రీలంకకు మార్చారు. ఈ టోర్నీలో పాల్గొనాల్సిన అన్ని జట్లు అంతర్జాతీయ క్రికెట్లో రెండేళ్లపాటు బిజీగా ఉండటంతో ఆసియా కప్ 2023 వన్డే వరల్డ్‌కప్ తర్వాత జరిగే అవకాశముంది. ఆసియా కప్‌ను 2016 నుంచి రొటేషన్ పద్ధతిలో వన్డే, టి20 ఫార్మాట్లలో నిర్వహిస్తున్నారు. -
కరోనా సెకండ్‌వేవ్ ప్రభావం; తగ్గిన పెళ్లిళ్లు
-
చిన్నారి ప్రాణం నిలిపేందుకు 6 కోట్ల జీఎస్టీ రద్దు
ముంబై: జన్యుపరమైన అరుదైన వ్యాధితో బాధపడుతోన్న ఐదు నెలల చిన్నారి తీరా కామత్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉదారం చూపారు. ఈ చిన్నారికి రూ.16 కోట్ల విలువైన మందులను దిగుమతి చేసుకునేందుకు 6 కోట్ల రూపాయల జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ జీఎస్టీ మొత్తాన్ని మోదీ రద్దు చేశారు. ఈ చిన్నారి ఆపరేషన్ల కోసం దాతల నుంచి రూ.16 కోట్లను ముంబైలోని కామత్ కుటుంబం సేకరించింది. ఈ పాపాయిని వ్యాధి నుంచి కాపాడేందుకు జన్యుమార్పిడి థెరఫీ చేయాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన జోల్గెన్స్మా అనే ఔషధాన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలి. ఖర్చుకి తోడు రూ.6 కోట్ల జీఎస్టీ భారం పడుతోంది. ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకు∙మోదీ చొరవ చూపి జీఎస్టీ రద్దు చేశారు. 2021 జనవరిలో కుమార్తె వైద్య పరిస్థితిని మోదీకి పాప తల్లిదండ్రులు చెప్పారు. మందుల దిగుమతిపై పన్నులన్నింటినీ మినహాయించాలని ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు లేఖలు రాశారు. ఈ చిన్నారి తల్లిదండ్రులు ఈ ఖర్చుని భరించే స్థితిలో లేకపోవడంతో వారు విరాళాల ద్వారా ఈ మొత్తాన్ని దాతల నుంచి సేకరించారు. అందుకే ఈ కేసుని ప్రత్యేక కేసుగా భావించి పన్నులు రద్దుచేయాలని ఫడ్నవీస్ కోరారు. లైఫ్ సేవింగ్ డ్రగ్ పై విధించే అన్ని పన్నులను తీరా విషయంలో రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. తీరా తల్లిదండ్రులు ప్రియాంక, మిహిర్ కామత్‌లు మోదీ ప్రకటన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆగస్టు 14, 2020న ఈ పాప పుట్టింది. పుట్టిన రెండు వారాల తరువాత ఈమెకు ఈ జన్యుపరమైన లోపం ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. పాలు తాగే సమయంలో ఈ పాప ఊపిరి తీసుకోని పరిస్థితి వస్తుంది. దీన్ని స్పైనల్ మస్క్యులర్ ఆస్ట్రోఫీస్ అంటారు. -
ఫార్మాసిటీని రద్దు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకరేజ్ వ్యవస్థలా మార్చిందని, తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా ఒక దళారీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమిని పంచుతామని చెప్పిన కేసీఆర్, ఫార్మాసిటీ పేరుతో దళిత, గిరిజన, పేదల భూములను ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వరంగ సంస్థల కోసం భూసేకరణను తాము తప్పుబట్టబోమని, కానీ ఫార్మాసిటీ పేరుతో అమెరికా సంస్థలకు, ఎంఎన్సీలకు భూములను కట్టబెట్టడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. బహుళజాతి సంస్థలకు భూములు ధారాదత్తం చేయడం ప్రజాప్రయోజనం ఎలా అవుతుం దో అర్థం కావడం లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2 ల క్షల 60 వేల ఇండ్లు నిర్మిస్తామని కేసీఆర్, లక్ష ఇళ్లు నిర్మి స్తాం అంటూ కేటీఆర్ అసెంబ్లీలో చెప్పిన వీడియో క్లిప్‌ల ను భట్టి మీడియాకు చూపించారు. కానీ మంత్రి తలసాని తమకు 3,428 ఇండ్లు మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. గత గ్రేటర్ ఎన్నికలకు సంబంధిం చిన టీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ వెబ్సైట్ నుంచి తీసేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ మాటలకు మరోసారి మోసపోవద్దని భట్టి విజ్ఞప్తి చేశారు. -
చైనాకు ఇస్కాన్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య చైనాకు మరో షాక్ తగిలింది. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్నెస్(ఇస్కాన్) కూడా చైనా కంపెనీతో చేసుకున్న కోట్ల రూపాయల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. రెండువందల కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కురుక్షేత్రలో కృష్ణార్జున దేవాలయానికి అవసరమైన గుర్రాలను చైనానుంచి కాకుండా ఇండోనేషియా నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. కృష్ణార్జున మందిరానికి అవసరమైన 4గుర్రాలను చైనానుంచి కొనుగోలుకు చర్చలు దాదాపు ఖరారయ్యాయి. కానీ దేశంలో చైనా వ్యతిరేక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆలోచనను విరమించుకుంది. ఈ పరిణామాన్నిఇస్కాన్ అధ్యక్షుడు గోపాల్ దాస్ ధృవీకరించారు. నాలుగు గుర్రాల కోసం చైనా కంపెనీతో చర్చలు జరిపామనీ, అయితే చైనా వ్యతిరేకత కారణంగా ఆర్డర్ ఇవ్వకూడదని నిర్ణయించామని తెలిపారు. ఇండోనేషియాలోని ఒక సంస్థతో చర్చలు జరుగుతున్నామని త్వరలోనే ఖరారు చేయనున్నామని వెల్లడించారు. గోపాల్ దాస్ అందించిన సమాచారం ప్రకారం 34 అడుగులఎత్తు 41 మీటర్ల పొడవుతో పాలరాయితో నాలుగు గుర్రాలను రూపొందించనున్నారు. ఒక్కోదానికి 80-90లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఈ ఆలయ సముదాయం నిర్మాణం 2018లో ప్రారంభం కాగా 2022 లో పూర్తి కానుంది. ఆరు ఎకరాలలో 23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తులు, 165 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతను కలిగి ఉంటుంది. అన్ని గ్రంథాలతో లైబ్రరీ, గోవింద రెస్టారెంట్, 75 గదుల గెస్ట్ హౌస్, ఆర్ట్ గ్యాలరీ, ఆధ్యాత్మిక గిప్ట్స్ షాప్, సూపర్ మార్కెట్, కేఫ్ సౌకర్యాలను కూడా ఇందులో ఏర్పాటు చేస్తారు. 60 శాతం నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసుకుంది. -
తమిళనాట విమాన సర్వీసులు వాయిదా?
చెన్నై: తమిళనాడులో నగరాల మధ్య విమాన సర్వీసులను ఈ నెలాఖరు వరకు అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. విదేశాల నుంచి విమానాల్లో, ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో వచ్చిన వారిని పరీక్షించగా 66 కోవిడ్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయని ఆయన తెలిపారు. ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ విషయం వెల్లడించింది. -
పదో తరగతి పరీక్షలు రద్దు: పంజాబ్ ప్రకటన
ఛండీగర్ : పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు రద్దు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిగతా తరగతుల మాదిరిగానే పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తామని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. ప్రీ బోర్డ్ పరీక్షల ఫలితాల ఆధారంగా వారిని పై తరగతులకు పంపిస్తామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. (ఇకపై మద్యం హోం డెలివరీ..ఇవిగో టైమింగ్స్ ) ప్రతి ఏడాది దాదాపు 4 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. అయితే కరోనా కారణంగా పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఎగ్జామ్స్‌ని రద్దు చేస్తూ పై తరగతులకు పంపాలని నిర్ణయించారు. ఇప్పటికే 5 నుంచి 8 సహా వివిధ తరగతుల విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఇటీవల ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. దేశంలోనే మొదటిసారి విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటించిన మొదటి రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. కాగా ఇప్పటివరకు పంజాబ్‌లో 1,731 కరోనా కేసులు నమోదవగా, 29 మంది మరణించారు. -
జూలై వరకు బ్యాడ్మింటన్ టోర్నీల్లేవు: బీడబ్ల్యూఎఫ్
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉత్పాతం కొనసాగుతుండటంతో... జూలై వరకు అంతర్జాతీయ టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. టోర్నీ ఆతిథ్య సంఘాలతో, ఆయా దేశాల సమాఖ్యలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. రద్దయిన టోర్నీల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ (జూన్ 2–7), థాయ్‌లాండ్ ఓపెన్ (జూన్ 9–14), ఇండోనేసియా ఓపెన్ (జూన్ 16–21), రష్యా ఓపెన్ (జూలై 7–12) ఉన్నాయి. షూటింగ్ వరల్డ్‌కప్‌లు కూడా... మరోవైపు మే నెలలో భారత్‌లో జరగాల్సిన రెండు ప్రపంచకప్ టోర్నమెంట్లను... మ్యూనిచ్, బాకు నగరాల్లో జూన్‌లో జరగాల్సిన రెండు ప్రపంచకప్ టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య తెలిపింది. -
ఎఫ్–1 సీజన్ రద్దు చేయాలి
లండన్: ఈ సీజన్ ఫార్ములావన్ (ఎఫ్1) చాంపియన్‌షిప్‌ను రద్దు చేయాలని ఫార్ములావన్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నీ ఎకిల్‌స్టోన్ అన్నారు. షెడ్యూల్ ప్రకారం ఇప్పటివరకు జరగాల్సిన 8 రేసులు కరోనా కారణంగా వాయిదా పడటమో, రద్దు కావడమో జరిగాయి. తదుపరి రేసులు కూడా అనుకున్న సమయానికి జరిగే పరిస్థితులు లేకపోవడంతో మాజీ బాస్ మిగతా 14 రేసుల్ని కూడా నిలిపివేసి వచ్చే ఏడాది తాజాగా సీజన్‌ను ప్రారంభించాలని అభిప్రాయపడ్డారు. ‘ఈ ఏడాది చాంపియన్‌షిప్ నిర్వహణను ఆపేయాలి. వచ్చే సీజన్‌ను తాజాగా ప్రారంభిస్తే మంచిది. ఎందుకంటే ఈ సీజన్లో చాంపియన్‌షిప్ టైటిల్ గెలుపొందడానికి అవసరమైన రేసుల్ని నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు. కనీసం 8 రేసులు జరిగితే ఆ చాంపియన్‌షిప్‌కు విలువ ఉంటుంది. కానీ ఈ విపత్కర పరిస్థితుల్లో అది జరిగేలా అనిపించడం లేదు’ అని ఎకిల్‌స్టోన్ పేర్కొన్నారు. కరోనా కారణంగా రేసులన్నీ రద్దుకావడంతో షుమాకర్ పేరిట ఉన్న ఏడు ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిళ్ల రికార్డును సమం చేసేందుకు లూయిస్ హామిల్టన్‌కు మరింత కాలం వేచి చూడాల్సి రావొచ్చు. ప్రస్తుతం హామిల్టన్ ఖాతాలో 6 టైటిళ్లు ఉన్నాయి. -
ఆ దేశాలకు ఎయిరిండియా సర్వీసులు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 (కరోనా వైరస్) మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని దేశాలకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపి వేసింది. ఏప్రిల్ 30 వరకు ఈ నిషేధం అమలు కానుందని ఎయిరిండియా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందే, ఇటలీ, ఫ్రాన్స్‌తో సహా చాలా యూరోపియన్ మార్గాల్లో విమానయాన సంస్థ సేవలను తగ్గించిన ఎయిరిండియా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, శ్రీలంక దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కువైట్‌కు తన విమాన సర్వీసులను నిలిపివేసింది. కాగా మార్చి 13 నుండి ఏప్రిల్ 15 వరకు దౌత్య లాంటి కొన్ని వర్గాలు మినహా అన్ని వీసాలను నిలిపివేయాలని బుధవారం ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య శుక్రవారం సాయంత్రానికి 5 వేలకు చేరుకోవడం గమనార్హం. -
కరోనా కలకలం: మోదీ బంగ్లా పర్యటన రద్దు?
ఢాకా : మూడు కరోనా కేసులు నమోదయ్యాయని బంగ్లాదేశ్ ప్రకటించిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఢాకా పర్యటనను రద్దు చేసుకోవచ్చని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ దిశగా త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నాయి. బంగ్లాదేశ్ వ్యవస్ధాపకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొనాలని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానం మేరకు మార్చి 17న ప్రధాని మోదీ ఢాకా పర్యటన ఖరారైంది. కాగా ఇటలీ నుంచి ఢాకాకు వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్టు నిర్ధారణైంది. వీరి బంధువైన మరొకరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. బంగ్లాదేశ్‌లోనూ కరోనా వ్యాప్తితో ప్రధాని మోదీ పర్యటన రద్దయ్యే అవకాశం ఉండటంతో ప్రధాని రద్దు చేసుకున్న రెండో విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. ఇండో-ఈయూ సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ బ్రసెల్స్ పర్యటన సైతం కరోనా భయాలతో రద్దయిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ బంగ్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ పర్యటనను రద్దు చేయాలని ప్రధాని షేక్ హసీనాపై ఆందోళనకారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. చదవండి: ప్రధాని సోషల్ ఖాతాలు ఆ ఏడుగురికి -
విత్‌డ్రాయల్స్ ఆంక్షలు, ఆర్బీఐ గుప్పిట్లో ‘యస్’!
న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మొండిబాకీల భారం, నిధుల కొరత కష్టాలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ కొరడా ఝుళిపించింది. బ్యాంక్ బోర్డును రద్దు చేయడంతో పాటు ఖాతాదారులకు షాక్‌నిచ్చేలా విత్డ్రాయల్స్పై పరిమితులు విధించింది. ఖాతాదారులకు రూ. 50,000కు మించి చెల్లింపులు జరపకుండా 30 రోజుల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 5 నుంచి అమల్లోకి వచ్చిన మారటోరియం ఏప్రిల్ 3 దాకా కొనసాగుతుంది. వైద్యం, ఉన్నత విద్య, వివాహం వంటి అత్యవసర సందర్భాల్లో మాత్రమే రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. అటు యస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిన నేపథ్యంలో బోర్డును కూడా రద్దు చేసిన ఆర్బీఐ.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. భారీ స్కామ్‌తో కుదేలైన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకుపైనా ఆర్బీఐ కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఆంక్షలే విధించింది. అది జరిగిన 6 నెలల వ్యవధిలోనే యస్ బ్యాంక్‌పైనా రిజర్వ్ బ్యాంక్ అటువంటి చర్యలే తీసుకోవడం గమనార్హం. ఆందోళన వద్దు .. డిపాజిట్లు భద్రమే.. మొండిబాకీల భారం, డిపాజిట్ల విత్‌డ్రాయల్స్, రేటింగ్ డౌన్‌గ్రేడ్స్ వంటి పలు ప్రతికూల అంశాలతో బ్యాంకు పరిస్థితి నానాటికి దిగజారిందని ఆర్బీఐ పేర్కొంది. ‘పరిస్థితి చక్కదిద్దుకోవడానికి, విశ్వసనీయమైన పునరుద్ధరణ ప్రణాళికతో నిధులు సమీకరించుకోవడానికి యస్ బ్యాంక్ మేనేజ్మెంట్కు తగినన్ని అవకాశాలు ఇచ్చాం. కానీ ప్రణాళికలు అమలు చేయడంలో అది విఫలమైంది. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత.. ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం యస్ బ్యాంకుపై మారటోరియం విధించాలంటూ ప్రభుత్వానికి సూచించడం మినహా మరో మార్గాంతరం లేదని భావించాం. తదనుగుణంగానే కేంద్రం నిర్ణయం తీసుకుంది‘ అని ఆర్బీఐ పేర్కొంది. ఖాతాదారులు ఆందోళన చెందనక్కర్లేదన్న ఆర్బీఐ.. డిపాజిట్లు భద్రంగానే ఉంటాయని, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడతామని భరోసానిచ్చింది. బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్ట నిబంధనల ప్రకారం యస్ బ్యాంక్ పునరుద్ధరణ లేదా మరో బ్యాంకులో విలీనం చేయడానికి సంబంధించి త్వరలోనే తగు ప్రణాళికను రూపొందిస్తామని ఆర్బీఐ పేర్కొంది. డిపాజిటర్లు సుదీర్ఘకాలం ఇబ్బందులు పడకుండా మారటోరియం ముగిసేలోగానే దీన్ని అమలు చేస్తామని తెలిపింది. ఎస్బీఐ చేతికి..? ఎల్ఐసీతో కలిసి టేకోవర్ వార్తలు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు.. యస్ బ్యాంక్‌ను ఎల్ఐసీతో కలిసి ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియం టేకోవర్ చేయనుందంటూ వార్తలు వచ్చాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కన్సార్షియం మొత్తం 49 శాతం వాటాలు కొనేలా ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. నియంత్రణాధికారాలు దక్కే స్థాయిలో వాటాలు కొనుగోలు చేసేందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రావొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం ముంబైలో ఎస్బీఐ బోర్డు సమావేశం కావడం ఈ వార్తలకు ఊతమిచ్చింది. యస్ బ్యాంక్ మూతబడే పరిస్థితి ఉండబోదంటూ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యలు చేసిన కొన్నాళ్లకే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ దిగ్గజ బ్యాంకులు.. యస్ బ్యాంక్‌ను టేకోవర్ చేసేందుకు అనువైనవంటూ గతంలో ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ వార్తలపై వివరణనివ్వాలంటూ ఎస్బీఐ, యస్ బ్యాంకులకు స్టాక్ ఎక్సే్చంజీలు సూచించాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం అలాంటి పరిణామాలేమైనా ఉన్న పక్షంలో వెల్లడిస్తామంటూ ఎస్బీఐ తెలియజేసింది. అటు యస్ బ్యాంక్ కూడా .. ఇప్పటిదాకా తమకు దీనిపై ఆర్బీఐ లేదా ప్రభుత్వం లేదా ఇతరత్రా నియంత్రణ సంస్థలు, ఎస్బీఐ నుంచి ఏ విధమైన సమాచారమూ రాలేదని తెలిపింది. అటు, బ్రోకరేజీ సంస్థలు మాత్రం యస్ బ్యాంక్ పరిస్థితి ఆశావహంగా లేదంటూ వ్యాఖ్యానించాయి. ఒకవేళ ఇన్వెస్టర్లకు బలవంతంగా అంటగట్టినా.. మొండిబాకీల రిస్కులు భారీగా ఉన్నందున బ్యాంకు విలువను సున్నా కింద లెక్కగట్టి తీసుకోవడమే జరగవచ్చని జేపీ మోర్గాన్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘యస్’ నుంచి ‘నో’ వరకూ...! ► జూన్ 12, 2018: యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా మూడేళ్లపాటు రాణా కపూర్ పునర్నియామకానికి వాటాదారుల ఆమోదం ► సెప్టెంబర్ 19, 2018: రాణా కపూర్ పదవీ కాలాన్ని జనవరి 31,2019 వరకే తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ► సెప్టెంబర్ 21, 2018: యస్ బ్యాంక్ షేర్ ఒకే రోజు 30 శాతం పతనం, రూ.21,951 కోట్ల మార్కెట్ క్యాప్ ఆవిరి ► సెప్టెంబర్ 28, 2018: ప్రమోటర్ షేర్లను విక్రయించబోనని, కూతుళ్లకు ఇచ్చేస్తానని రాణా కపూర్ ప్రకటన. యస్ బ్యాంక్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు క్రెడిట్ వాచ్ రేటింగ్‌ను ఇస్తున్నామని కేర్ రేటింగ్స్ వెల్లడి ► అక్టోబర్ 17, 2018: రాణా కపూర్‌కు మరింత గడువును ఇవ్వడానికి నిరాకరించిన ఆర్బీఐ. 2019, ఫిబ్రవరి 1 కల్లా కొత్త సీఈఓను నియమించుకోవాలని ఆదేశం ► అక్టోబర్ 25, 2018: గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి. మార్క్‌టు మార్కెట్ నష్టాలు రెట్టింపు కావడం, మొండి బకాయిలకు కేటాయింపులు అధికంగా ఉండటంతో ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. రుణ నాణ్యత భారీగా క్షీణించింది. ► నవంబర్ 14, 2018: చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా. ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలగిన వసంత్ గుజరాతీ ► నవంబర్ 19, 2018: మరో ఇండిపెండెంట్ డైరెక్టర్ రెంటాల చంద్రశేఖర్ రాజీనామా ► నవంబర్ 27, 2018: యస్ బ్యాంక్ రేటింగ్‌ను డౌన్ గ్రేడ్‌చేసిన మూడీస్ సంస్థ. ► మార్చి 1, 2019: యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రవ్నీత్ గిల్. 3 శాతం ఎగసిన షేర్ ధర ► మార్చి 5, 2019: స్విఫ్ట్ కార్యకలాపాల విషయంలో నిబంధనలు పాటించనందుకు రూ. 1 కోటి జరిమానా విధించిన ఆర్బీఐ ► ఏప్రిల్ 26, 2019: గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఆర్థిక ఫలితాలు వెల్లడి. రూ.1,507 కోట్ల నికర నష్టాలు ► ఏప్రిల్ 29, 2019: యస్ బ్యాంక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసిన మాక్వైరీ బ్రోకరేజ్ సంస్థ. ► ఏప్రిల్ 30, 2019: క్యూ4 ఫలితాల ప్రభావంతో 30% పతనమైన షేర్ ► మే 9, 2019: యస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ రేటింగ్‌ను ప్రధాన రేటింగ్ ఏజెన్సీలైన ఇండియా రేటింగ్స్, ఇక్రాలు డౌన్ గ్రేడ్ చేశాయి. ► మే 15, 2019: యస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్‌లో అదనపు డైరెక్టర్‌గా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ నియామకం ► జూలై 18, 2019: రాణా కపూర్ తన పూర్తి వాటా షేర్లను తనఖా పెట్టారన్న వార్తలు వచ్చాయి. భారీగా పతనమైన బ్యాంక్ షేర్ ► ఆగస్టు 10, 2019: సీఎఫ్ఓగా అనురాగ్ అద్లాఖ నియామకం ► సెప్టెంబర్ 21, 2019: యస్ బ్యాంక్‌లో 2.75 శాతం వాటా విక్రయించిన రాణా కపూర్. 6.89 శాతానికి తగ్గిన వాటా ► అక్టోబర్ 3, 2019: యస్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ రజత్ మోంగా రాజీనామా ► నవంబర్ 1, 2019: ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.600 కోట్ల నష్టాలు ► డిసెంబర్ 6, 2019: యస్ బ్యాంక్‌కు నెగిటివ్ అవుట్ లుక్ ఇచ్చిన రేటింగ్ ఏజెన్సీ మూడీస్. 9 శాతానికి పైగా పతనమైన షేర్ ధర ► డిసెంబర్ 17, 2019: కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో యస్ బ్యాంక్ విలీనం కానున్నదని వినిపించిన వార్తలు ► జనవరి 10, 2020: కార్పొరేట్ గవర్నెన్స్ సరిగ్గా లేదంటూ రాజీనామా చేసిన బోర్డ్ మెంటర్ ఉత్తమ్ ప్రకాశ్ రాజీనామా ► జనవరి 13, 2020: ఇన్సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందని, ఈ విషయమై సెబీ దర్యాప్తు చేయాలని లేఖ రాసిన ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్. 6 శాతం పతనమైన షేర్ ధర ► మార్చి 5, 2020: ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియమ్... యస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని వార్తలు. 26 శాతం లాభంతో రూ.36.85కు ఎగసిన షేర్. షేరు టార్గెట్ @ రూ. 1 అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, జేపీ మోర్గాన్ యస్ బ్యాంక్ షేర్ టార్గెట్ ధరను రూ.1కు (గతంలో రూ.55)కు తగ్గించింది. రేటింగ్‌ను అండర్ వెయిట్‌గా కొనసాగించింది. ప్రస్తుత ధర (రూ.37)కు బాగా ఎక్కువ డిస్కౌంట్‌కు కొత్త మూలధనం లభించే అవకాశాలున్నందున టార్గెట్ ధరను రూ.1కు తగ్గిస్తున్నామని జేపీ మోర్గాన్ వివరించింది. గురువారం 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయిన యస్ బ్యాంక్ షేరు.. ఆ తర్వాత టేకోవర్ వార్తలతో బీఎస్ఈలో 26% పెరిగి రూ.36.85 వద్ద క్లోజయ్యింది. -
తాత్కాలికంగా ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: నిర్వహణాపరమైన కారణాల దృష్ట్యా హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం 19 రైళ్లను పూర్తిగా, మరో 24 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కూడా ఎంఎంటీఎస్ రైళ్ల పాక్షిక, పూర్తిస్థాయి రద్దు కొనసాగనుంది. ఈ మేరకు నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్‌నుమా, జనగామ–ఫలక్‌నుమా (ఇది ప్యాసింజర్ ట్రైన్), నాంపల్లి–ఫలక్‌నుమా, లింగంపల్లి–నాంపల్లి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్ రూట్లలో 19 సర్వీసులను రద్దు చేశారు. అలాగే మరో 24 సర్వీసులను సికింద్రాబాద్–ఫలక్‌నుమా, నాంపల్లి–ఫలక్‌నుమా మధ్య రద్దు చేశారు. దీంతో ఈ రైళ్లు లింగంపల్లి–సికింద్రాబాద్, లింగంపల్లి–నాంపల్లి మధ్య మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. -
‘అన్న’మాట నిలబెట్టుకున్నారు
జీవో నంబరు 97... విశాఖపట్నం మన్యంలోని కొండల్లో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి ఇస్తూ గత టీడీపీ ప్రభుత్వం 2015, నవంబరులో ఇచ్చిన ఉత్తర్వులు ఇవి! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్‌పై యుద్ధం చేస్తానంటూ గిరిజనులను నమ్మించిన చంద్రబాబు 2014 సంవత్సంలో అధికారంలోకి రాగానే ఆ మాట మరచిపోయారు! అందుకే గిరిజనులంతా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు! గిరిజనుల సెంటిమెంటుకు గౌరవం.. ఇదీ జనం మనసు ఎరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట! ‘సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదు.. గిరిజనుల సెంటిమెంటునూ గౌరవించాల్సిందే’నని విస్పష్టంగా చెప్పిన జన నాయకుడని ఇప్పుడు గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు! ఇదీ ఇద్దరు నాయకుల మధ్య తేడా! దశాబ్దాలుగా పలు ఉద్యమాలతో కీలక మలుపులు తిరిగిన బాక్సైట్ మైనింగ్ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజనుల మనసుల్లో గూడుకట్టుకున్న భయాందోళనలకు ముగింపు పలికారు. 3,030 ఎకరాల్లో మైనింగ్ కార్యకలాపాలను నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాక్షి, విశాఖపట్నం/పాడేరు: విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని రిజర్వు ఫారెస్టు ప్రాంతంలోనున్న అపారమైన బాక్సైట్ ఖనిజ సంపదపై కొన్ని దశాబ్దాల క్రితమే బడాబాబులు కన్నేశారు. ఖనిజం కోసం కొండలను తవ్వేస్తే తమ జీవనానికి, సాంస్కృతిక వారసత్వానికే కాదు అటవీ, పర్యావరణానికి విఘాతం కలుగుతుందనే భయాందోళనలతో దాదాపు 50 ఏళ్లుగా గిరిజనులు పోరాటం చేస్తూ వచ్చారు. వారి పక్షాన వైఎస్సార్సీపీ అధినేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో మూడేళ్ల క్రితం చింతపల్లిలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి భారీ సదస్సు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండు చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు వెనుకంజ వేసినప్పటికీ జీవో 97ను మాత్రం రద్దు చేయలేదు. జీవో నంబరు 97ను రద్దు చేయాలనే డిమాండుతో గిరిజనులు ప్రారంభించిన పోరాటానికి జగన్మోహన్రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఏజెన్సీలోని వైఎస్సార్సీపీ నాయకులు కూడా బాక్సైట్ వ్యతిరేక పోరాటంలో చురుకైన పాత్ర వహించారు. పార్టీ అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాల జీవోను పూర్తిగా రద్దు చేసి గిరిజనులకు మేలు చేస్తామని జగన్ తన ప్రజాసంకల్పయాత్ర సందర్భంలోనూ పునరుద్ఘాటించారు. తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి నెలలో పాడేరులో నిర్వహించిన బహిరంగ సభలోనూ గిరిజనులకు అభయమిచ్చారు. అలా ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకున్నారు. గిరిజనుల పక్షాన తాను ఉన్నానని నిరూపించారు. బాక్సైట్ తవ్వకాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకమని, గత ప్రభుత్వాలు జారీ చేసిన బాక్సైట్ అనుకూల జీవోలన్నీ రద్దు చేస్తున్నామని సీఎం జగన్మోహన్రెడ్డి తాజాగా ప్రకటించడంతో విశాఖ ఏజెన్సీలోని అన్ని వర్గాల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ మనుగడను కాపాడిన ముఖ్యమంత్రి అంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. బాక్సైట్ కొండలిక సురక్షితం... అరకులోయ మండలంలోని గాలికొండ, రక్తికొండ, చిత్తంగొంది, చింతపల్లి ప్రాంతంలోని జర్రెల, సప్పర్లతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని గుర్తేడు అటవీ ప్రాంతంలో కలిపి దాదాపు 75 కోట్ల టన్నుల బాక్సైట్ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఈ రెండు జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో 27 కొండల్లో ఈ బాక్సైట్ నిక్షిప్తమై ఉందని గుర్తించారు. అయితే ఈ కొండలలో బాక్సైట్ తవ్వకాలు జరిపితే 270 గ్రామాలకు చెందిన గిరిజనులు పూర్తిగా నిర్వాసితులవుతారని, వ్యవసాయ భూములు, అటవీ సంపద అంతా నాశనమవుతాయని, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఏజెన్సీ ప్రజల మనుగడమే ముప్పు పొంచి ఉదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాగే మైదాన ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరికలు చేశారు. దీంతో అప్రమత్తమైన గిరిజనులు దశాబ్దాల క్రితమే ఆందోళనలు ప్రారంభించారు. పంచపట్మాలి ప్రత్యక్ష నిదర్శనం.. విశాఖ మన్యానికి సమీపంలోనే ఉన్న ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలోనున్న పంచపట్మాలి కొండల్లో జరుగుతున్న దాష్టీకం గిరిజనుల్లో ఆందోళనలను మరింత పెంచింది. దమన్‌జోడి వద్ద ఏర్పాటు చేసిన అల్యూమినా రిఫైనరీ కోసం 1985 సంవత్సరం నుంచి అక్కడ బాక్సైట్ తవ్వకాలు మొదలుపెట్టారు. కేవలం 48 లక్షల టన్నుల బాక్సైట్ ఖనిజం తవ్వకం వల్లే సమీప గ్రామాల గిరిజనులంతా నిర్వాసితులయ్యారు. అటవీ సంపద కనుమరుగైంది. జలవనరులు కలుషితమయ్యాయి. వేలాది ఎకరాల వ్యవసాయ భూములన్నీ నాశనమయ్యాయి. వాటిపై గిరిజనులంతా మనుగడను కోల్పోయారు. ఈ పరిస్థితిని చూసిన పర్యావరణవేత్తలంతా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో 75 కోట్ల టన్నుల బాక్సైట్ కోసం చేపట్టిన మైనింగ్ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 270 గ్రామాలకు చెందిన గిరిజనుల మనుగడనే ప్రశ్నార్థం చేస్తున్న జీవో నంబరు 97ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రద్దు చేయడంపై సర్వత్రా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజన మేధావులు, నాయకులు అభినందనలు తెలుపుతున్నారు. బాక్సైట్ జీవో 97 రద్దు చారిత్రాత్మకం.. గిరిజనుల పక్షపాతిగా పేరొం దిన సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న బాక్సైట్ అనుకూల జీవో నంబరు 97ను రద్దు నిర్ణయం చారిత్రాత్మకం. గత చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్‌ను తవ్వి గిరిజనులను నాశనం చేసే చర్యల్లో భాగంగానే ఈ జీవోను జారీ చేసింది. ఆ సమయంలో గిరిజనుల పక్షాన జగన్మోహన్రెడ్డి నిలబడ్డారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. పాదయాత్రలో ఈ బాక్సైట్ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే జీవో 97ను రద్దు చేసేందుకు నిర్ణయించడం సంతోషంగా ఉంది. – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే, పాడేరు గిరిజనుల మనుగడకు భద్రత.. రాష్ట్ర ఖజానాకు వచ్చే రూ. వేల కోట్ల ఆదాయం కన్నా గిరిజనుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు. బాక్సై ట్ జీవో 97ను రద్దు చేసి ముఖ్యమంత్రి జగన్ గిరిజను ల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. గిరిజనుల పక్షపాతిగా దేశ చరిత్రలో నిలిచారు. – చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్యే, అరకు గిరిజనులకు పండుగ రోజు.. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ గత చంద్రబాబు ప్రభుత్వం జీవో నంబరు 97ను జారీ చేసినప్పుడు మే మంతా పోరాటానికి దిగాం. మా గిరిజనులకు అండగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నాడు అండగా నిలబడ్డారు. మాలో మనోధైర్యాన్ని నింపారు. చింతపల్లిలో గిరిజనులతో సదస్సు నిర్వహించారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను రద్దు చేసేందుకు నిర్ణయించారు. ఇది బాక్సైట్ ప్రభావిత జర్రెల, గాలికొండ ప్రాంతాల గిరిజనులకు పండుగ రోజు. – అడపా విజయకుమారి,జర్రెల మాజీ సర్పంచ్, జీకే వీధి మండలం బాక్సైట్ జీవో రద్దును స్వాగతిస్తున్నాం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాక్సైట్ జీవో 97 రద్దుకు నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజనులు దశాబ్దాల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్ దోపిడీకి పూనుకోవడం దుర్మార్గ చర్యగా గిరిజన సంఘం అప్పట్లో ఖండించింది. ఉద్యమం చేసింది. సీఎం జగన్మోహన్రెడ్డి బాక్సైట్ జీవో రద్దుకు నిర్ణయం తీసుకోవడం గిరిజనులకు ఎంతో మేలు చేస్తుంది. – పి.బాలదేవ్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, అరకులోయ ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది.. గిరిజనులంతా బాక్సైట్‌ను వ్యతిరేకించి ఉద్యమాలు చేస్తుంటే, గత చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులను నాశనం చేసే చర్యలకు పాల్పడింది. జీవో నంబర్ 97ను జారీ చేసి గిరిజనులకు అన్యాయం చేయాలని చూసింది. బాక్సైట్ ఖనిజ సంపద దోపిడీ చేసి విదేశీ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కుట్రపూరితంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్మోహన్రెడ్డి గిరిజనుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, జీవో 97ను రద్దు చేసేందుకు నిర్ణయించడం చరిత్రలో నిలిచిపోతుంది. – పి.రంజిత్‌కుమార్, దండకారణ్య విమోచన సమితి నేత, హుకుంపేట గిరిజనుల రక్షకుడు జగన్మోహన్రెడ్డి.. సీఎం జగన్మోహన్రెడ్డి తన తండ్రి, మహానేత వైఎస్సార్ వలే మాటకు కట్టుబడి ఉండే మంచి నేతగా గిరిజనుల్లో గుర్తింపు పొందారు. అధికారంలోకి రాగానే బాక్సైట్ అనుకూల జీవో 97ను రద్దు చేస్తానని చింతపల్లి సదస్సులో గిరిజనులకు మాట ఇచ్చారు. ఆ రోజుల్లో గిరిజనుల పక్షాన బాక్సైట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంను గిరిజనులు ఇప్పటికి మరువలేదు. ప్రభుత్వానికి ఆదాయం కంటే గిరిజనుల ప్రయోజనాలు, వారి సురక్షిత మనుగడే ముఖ్యమని మహోన్నత ఆశయంతో ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి బాక్సైట్ జీవో 97 రద్దుకు నిర్ణయించి గిరిజనులకు రక్షకుడిగా మారారు. ఆయన నిర్ణయంపై గిరిజనులు సంతోషంగా ఉన్నారు. – చిట్టపులి శ్రీనివాసపడాల్, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పాడేరు -
ఢిల్లీ–లాహోర్ బస్సు రద్దు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనంతరం లాహోర్–ఢిల్లీ బస్ సర్వీసులను పాక్ రద్దు చేసిన నేపథ్యంలో, భారత్ కూడా ఢిల్లీ–లాహోర్ బస్ సర్వీసును రద్దు చేసిందని ప్రజారవాణా సీనియర్ అధికారి తెలిపారు. ఈ బస్సు సోమవారం ఉదయం 6 గంటలకు లాహోర్‌కు వెళ్లాల్సి ఉండగా ప్రస్తుతం రద్దు అయింది. తమ దేశం నుంచి వస్తున్న బస్ సర్వీసులన్నీ సోమవారం నుంచి నిలిచిపోతాయని శనివారమే పాక్ స్పష్టం చేసింది. 1999 ఫిబ్రవరిలో ఈ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. -
ఆహారానికి మతం లేదు
న్యూఢిల్లీ: ‘ఆహారానికి మతం లేదు. ఆహారమే ఓ మతం’ అన్న జొమాటో ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారి నెటిజన్ల మన్ననలు అందుకుంటోంది. ఈ కామెంట్ వైరల్ కావడం వెనుక పెద్ద కథే ఉంది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన పండిత్ అమిత్ శుక్లా జొమాటోలో మంగళవారం ఆహారం ఆర్డర్ చేశాడు. ఆహారాన్ని డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి ముస్లిం కావడంతో డెలివరీ బాయ్‌ని మార్చాలని, లేదా ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసి రిఫండ్ ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే మత ప్రాతిపదికన ఆహారాన్ని అందించే వ్యక్తులను మార్చబోమంటూ జొమాటో బదులిచ్చింది. తనకు రిఫండ్ కూడా వద్దని కేవలం క్యాన్సిల్ చేయండి చాలు, మిగిలింది నేను లాయర్లతో చూసుకుంటానని అతడు బదులిచ్చాడు. దీంతో జొమాటో స్థాపకుడు దీపిందర్ గోయల్ రంగంలోకి దిగారు. ‘భారతదేశం, దేశంలోని వైవిధ్యమైన మా వినియోగదారులు, భాగస్వాములు మాకు గర్వకారణం. మా విలువల పరిరక్షణలో వ్యాపారం నష్టపోయినా బాధలేదు’ అని ట్వీట్ చేశారు. ఈ వ్యవహారాన్నంతా అమిత్శుక్లానే స్క్రీన్షాట్లు తీసి మరీ ట్విట్ట ర్లో ఉంచాడు. దీంతో నెటిజన్లు శుక్లాను ఓ ఆటాడుకుంటున్నారు. తమరు ఆర్డర్ చేసిన ఫుడ్‌ను ముస్లిం తయారుచేయలేదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అంటూ ఓ వ్యక్తి వ్యంగ్యంగా శుక్లాని విమర్శించారు. తమరు నడిపే వాహన ఇంధనం కూడా అక్కడి ముస్లిం ఇంధనమే (ఆ దేశాల నుంచే దిగుమతి అవుతోంది) అంటూ మరోవ్యక్తి ట్వీట్ చేశారు. ఈ తతంగమంతా చూసిన కొందరు అధి కారులు కూడా దీనిపై స్పందించారు. ‘కంపెనీని అభినందించేందుకు నాకో కారణం దొరికింది. యాప్‌ను ప్రేమిస్తున్నాను’ అంటూ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ‘సెల్యూట్ దీపిందర్ గోయల్ ! అసలైన భారతీయుడివి నువ్వే.. నిన్ను చూసి గర్విస్తున్నాం’ అని మాజీ ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ అన్నారు. నేను పేదవాన్ని... ఏం చేయగలను ! ‘జరిగిన ఘటనతో నేనెంతో బాధపడ్డాను. కానీ ఏం చేయగలను, మేమంతా పేదవాళ్లం. బాధలు తప్పవు’ అంటూ అమిత్ శుక్లాకు ఆహారం డెలివరీ చేసేందుకు వెళ్లిన ఫయాజ్ అన్నారు. ‘ఆర్డర్ అందుకున్న తర్వాత లొకేషన్ కోసం ఆయనకు ఫోన్‌చేశాను. ఆర్డర్ కాన్సిల్ చేశాను అన్నాడు’ అని వివరించారు. -
బంగ్లాదేశీ నటుడి వీసా రద్దు
న్యూఢిల్లీ/కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎమ్సీ) తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలతో బంగ్లాదేశ్ ప్రముఖ సినీనటుడు ఫిర్దౌస్ అహ్మద్ వీసాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ‘వీసా ఉల్లంఘనలకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఫిర్దౌస్ అహ్మద్ వ్యాపార వీసాను రద్దు చేశాం. ఆయనకు ‘లీవ్ ఇండియా’పేరుతో నోటీసు పంపాం. అలాగే ఫిర్దౌస్ పేరును బ్లాక్లిస్టెడ్లో ఉంచాం’అని హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీంతో భవిష్యతులో ఆయన భారత్‌లో పర్యటించడంపై ప్రభావం చూపుతుందన్నారు. ఫిర్దౌస్తో పాటు బెంగాలీ నటులు అంకుష్, పాయల్ ఇక్కడి రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీఎమ్సీ అభ్యర్థి కన్హయ్యలాల్ అగర్వాల్ తరపున ఆదివారం రోడ్ షోలో పాల్గొని ప్రచారం చేసిన వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో టీఎమ్సీ తరపున ఆయన ప్రచారంలో పాల్గొనడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లేనని బీజేపీ ఆరోపించింది. ఈమేరకు బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కలిసి ఫిర్యాదుచేశారు. -
రెండు రోజులు అన్ని అంతర్జాతీయ విమానాలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతూ విమాన సర్వీసులను నిలిపివేస్తున్న జెట్ ఎయిర్వేస్ తాజాగా మరోషాకింగ్ న్యూస్ చెప్పింది. ఇవాళ, రేపు( ఏప్రిల్ 11,12) అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆమ్స్టర్డాం, ప్యారిస్, లండన్‌కు సర్వీసులను నిలిపి వేసింది. నిధుల లేమి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి తోడు లీజు చెల్లించలేక మరో 10 విమానాలను రద్దు చేస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ గురువారం బీఎస్ఈ ఫైలింగ్‌లో ప్రకటించింది. దీంతో బకాయిలు చెల్లించలేక నిలిచిపోయిన విమానాల సంఖ్య మొత్తం 79 కి చేరింది. మరోవైపు జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను అటు ప్రభుత్వం, ఇటు డీజీసీఏ పరిశీలిస్తోంది. నిబంధనల ప్రకారం, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపాలంటే ఎయిర్‌లైన్స్ కనీసం 20 విమానాలను కలిగి వుండాలి. అయితే గత నెలనుంచి కేవలం14 విమానాలను మాత్రమే నడుపుతోంది. ఇది అంతర్జాతీయ కార్యకలాపాలను నిలిపి వేయడానికి దారి తీయనుంది. ఒకవైపు జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించే ప్రయత్నాలు కొనసాగుతుండగానే, తాజా పరిమాణాలతో జెట్ ఎయిర్వేస్ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్నట్టు దారుణంగా తయారవుతోంది. -
జనసేన సభకు జనం కరువు.. మూడు సభలు రద్దు
-
బీటింగ్ రిట్రీట్ వేడుక రద్దు
-
జాధవ్‌ను విడుదల చేయండి
హేగ్: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(48)కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) సోమవారం కోరింది. కుల్‌భూషణ్ జాధవ్‌ను వెంటనే విడుదల చేసేలా పాకిస్తాన్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. జాధవ్‌పై నమోదైన అభియోగాలను నిరూపించడంలో పాక్ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టింది. జాధవ్‌ను కలుసుకునేందుకు కనీసం భారత దౌత్యాధికారిని పాక్ అనుమతించలేదనీ, ఇది వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనంది. గూఢచర్యం, ఉగ్రవాద అభియోగాల కింద దోషిగా తేలుస్తూ పాక్ సైనిక కోర్టు జాధవ్‌కు 2017 ఏప్రిల్ 10న మరణశిక్ష విధించింది. జాధవ్‌ను పాక్ ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసిందన్న భారత్.. మరణశిక్షను సవాలు చేస్తూ ఐసీజేను ఆశ్రయించింది. సోమవారం ఐసీజే ముందు భారత్ తరఫున వాదనలు వినిపించిన మాజీ సోలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే పాక్‡శైలిని తీవ్రంగా ఎండగట్టారు. ఆర్మీ అధికారులే జడ్జీలు ‘జాధవ్‌ను కలుసుకునేందుకు అనుమతించాలని భారత్ 13 సార్లు కోరింది. పాక్ వాటిని పట్టించుకోలేదు. కేసును విచారించిన పాక్ మిలటరీ కోర్టు జడ్జీలకు న్యాయ శిక్షణ లేదు. కనీసం న్యాయశాస్త్రంలో డిగ్రీ అవసరం లేదు. పాక్ మిలటరీ కోర్టులు గత రెండేళ్లలో 161 మంది పౌరులకు మరణశిక్ష విధించాయి. పాక్ మిలటరీ కోర్టుల్లో ఆర్మీ అధికారులే జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఆర్మీలోని ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. మిలటరీ కోర్టులు పౌరుల్ని విచారించడంపై ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ పాక్ రాజ్యాంగాన్ని మార్చి మరణశిక్ష విధిస్తోంది’ అని మండిపడ్డారు. బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారు జాధవ్ భారత గూఢచారి అని ఆరోపిస్తున్న పాకిస్తాన్ అందుకు తగ్గ సాక్ష్యాలను మాత్రం సమర్పించలేకపోయిందని సాల్వే విమర్శించారు. ‘ కేసులో జాధవ్‌కు కనీస న్యాయ సాయం అందించడంలో పాక్ ఘోరంగా విఫలమైంది. జాధవ్‌కు పాక్‌లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు లేదు. జాధవ్ ఉగ్రవాది అని చెబుతున్న పాక్ అందుకు సంబంధించి ఒక్క సాక్ష్యాన్ని సమర్పించలేకపోయింది. ఆయన చేత బలవంతంగా నేరాంగీకార వాంగ్మూలాన్ని ఇప్పించారు. మూడేళ్లుగా జైలులో జాధవ్ అనుభవించిన మానసిక క్షోభను, ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ను విడుదల చేయాలని ఐసీజేను కోరుతున్నాం’ అని తెలిపారు. 3 నెలల గడువు ఎందుకు? జాధవ్‌ను 2016, మార్చి 3న అరెస్ట్ చేసిన పాకిస్తాన్ నెల రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదుచేసిందని సాల్వే అన్నారు. ‘విదేశీ పౌరులు గూఢచర్యం అభియోగం కింద అరెస్టయినా వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36 ప్రకారం ఆ విషయాన్ని సంబంధిత దేశానికి తెలియజేయాలి. కానీ అరెస్ట్‌పై పాక్ మాకు సమాచారమివ్వలేదు. దౌత్యసాయంపై ఒప్పందం ఉన్నప్పటికీ అది వియన్నా ఒప్పందానికి అనుబంధంగానే ఉంది. పాకిస్తాన్ వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36ను ఉల్లంఘించింది. జాధవ్‌ను కలుసుకునేందుకు 3 నెలల గడువు ఎందుకు కావాలో పాక్ సమాధానం చెప్పాలి. జాధవ్‌ను కలుసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులను 2017, డిసెంబర్ 25న పాక్ అనుమతించినప్పటికీ, ఆ సందర్భంగా పాక్ అధికారుల తీరుపై భారత్ నిరసన తెలియజేసింది’ అని సాల్వే వెల్లడించారు. భారత్ వాదనలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం పాకిస్తాన్ తమ వాదనల్ని ఐసీజే ముందు వినిపించనుంది. పాక్ జడ్జికి గుండెపోటు ఇస్లామాబాద్: అంతర్జాతీయ న్యాయస్థానంలో జాధవ్ కేసు విచారణ సందర్భంగా పాక్ తాత్కాలిక జడ్జి హుస్సేన్ గిల్లానీ(69)కి గుండెపోటు వచ్చింది. దీంతో అధికారులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, హుస్సేన్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆర్టికల్ 31 ప్రకారం ఐసీజేలో విచారణ సందర్భంగా సంబంధిత దేశానికి కోర్టులో ప్రాతినిధ్యం లేకపోతే అదే దేశానికి చెందిన వ్యక్తిని ఐసీజే బెంచ్ తాత్కాలిక జడ్జీగా ఎంపిక చేస్తుంది. ఆ తరహాలో తాజాగా ఐసీజే హుస్సేన్‌ను తాత్కాలిక జడ్జిగా నియమించింది. దీంతో ఐసీజేలో మొత్తం జడ్జీల సంఖ్య 16కు చేరుకుంది. ఐసీజేలో సాధారణంగా 15 మంది జడ్జీలు ఉంటారు. వీరు 9 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఐసీజేలో భారత్ తరఫున దల్వీర్ భండారీ జడ్జీగా వ్యవహరిస్తున్నారు. పాక్ అధికారులకు ‘నమస్కారం’ జాధవ్ కేసు విచారణ సందర్భంగా ఐసీజే ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ అధికారులతో కరచాలనం చేసేందుకు భారత అధికారులు నిరాకరించారు. జాధవ్ కేసు విచారణ మొదలయ్యే ముందు పాక్ అటార్నీ జనరల్ అన్వర్ మన్సూర్ ఖాన్ భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి దీపక్ మిట్టల్‌తో కరచాలనం చేసేందుకు చెయ్యి చాచగా, మిట్టర్ నమస్కారం పెట్టారు. దీంతో ఖాన్ నెదర్లాండ్స్‌లో భారత రాయబారి వేణు రాజమొనితో కరచాలనం చేసేందుకు యత్నించారు. కానీ అయన కూడా నమస్కారం పెట్టి తప్పుకున్నారు. ఈ ఘటనతో ఖంగుతిన్న అన్వర్ ఖాన్.. చివరికి చేసేదేం లేక భారత మాజీ అటార్నీ జనరల్ హరీశ్ సాల్వేతో కరచాలనం చేసి తన స్థానానికి వెళ్లి కూర్చున్నారు. మరోవైపు పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి, సార్క్ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ ఫైజల్‌కు కూడా మిట్టల్ నమస్కారంతోనే సరిపెట్టారు. -
పుట్టినరోజు వేడుకలు వద్దు
సాక్షి, హైదరాబాద్: కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో అనేకమంది జవాన్లు మరణించడంతోపాటు చాలామంది తీవ్రంగా గాయపడటంపై సీఎం తీవ్రంగా కలత చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కశ్మీర్లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని, తాను కూడా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17న తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపుకోరాదని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌కు రాష్ట్రపతి శుభాకాంక్షలు.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రికి లేఖ పంపారు. సీఎం కేసీఆర్ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో చిరకాలం ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వానికి కొత్త అటవీ చట్టం ముసాయిదా న్యాయ శాఖ పరిశీలించాకసీఎం గ్రీన్ సిగ్నల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అడవు లు, వన్యప్రాణుల సంరక్షణకు ఉద్దేశించి కఠిన నిబంధనలు, చర్యలు ప్రతిపాదిస్తూ సిద్ధం చేసి న కొత్త అటవీ చట్టం ముసాయిదాను శుక్రవారం రాష్ట్ర న్యా య వ్యవహారాల శాఖకు అటవీశాఖ సమర్పించింది. ఈ చట్టంలో చేసిన ప్రతిపాదనలను న్యాయ శాఖ పరిశీలించి, ఏవైనా మార్పులు సూచిస్తే.. ఆమేరకు మార్పులు చేయనుంది. అడవుల పరిరక్షణకు ప్రతిపాదిత చట్టంలో ఆయా అంశాలను అటవీశాఖ చేర్చింది. ఈ ప్రతిపాదనలకు న్యా య శాఖ ఆమోదం తెలిపాక, సీఎం కేసీఆర్ పరిశీలన కోసం పంపిస్తారు. ముసాయిదా చట్టంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేస్తే ఈ నెల 22 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ఆమోదించే అవకాశాలున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. -
చందాకొచర్ నుంచి రూ.9 కోట్లు వెనక్కి..!
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచర్ సుమారు రూ.9 కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనాలను కోల్పోనున్నారు. వీడియోకాన్ గ్రూపునకు రుణాల జారీలో కొచర్ బ్యాంకు నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ట కమిటీ నిర్ధారించిన నేపథ్యంలో, కొచర్‌ను తొలగించినట్టేనని, ఆమెకు గతంలో ఇచ్చిన బోనస్‌లు, పెండింగ్‌లో ఉన్నవి, ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలను సైతం రద్దు చేస్తామని బ్యాంకు బుధవారమే ప్రకటించింది. బోనస్‌లతోపాటు అన్‌ఎక్సర్‌సైజ్డ్ స్టాక్ ఆప్షన్లను కూడా వదులుకోవాల్సి ఉంటుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. 2009 మే నెలలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా నియమితులైన కొచర్, తనపై ఆరోపణల కారణంగా గతేడాది పదవికి రాజీనామా చేశారు. గత రెండేళ్లకు సంబంధించి కొచర్‌కు ఇవ్వదలిచిన పనితీరు ఆధారిత బోనస్‌లకు ఆర్బీఐ ఆమోదం తెలియజేయలేదని, దీంతో ఈ బోనస్‌లను కొచర్‌కు ఇచ్చినట్టు పరిగణించబోమని బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి. కాగా, కొచర్‌కు ఇప్పటిదాకా బ్యాంకు 94 లక్షల షేర్లను(స్టాక్ ఆప్షన్స్) బ్యాంకు మంజూరు చేసింది. వీటిలో ఎన్ని ఆమె వినియోగించుకున్నారనే సమాచారం లేదు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం చందాకొచర్‌కు ముట్టిన ఆర్థిక ప్రయోజనాలు రూ.340 కోట్ల మేర ఉంటాయని బ్యాంకు వర్గాల సమాచారం. -
29న అయోధ్యపై విచారణ రద్దు
న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసులో మంగళవారం జరగాల్సిన విచారణను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించాల్సి ఉండగా, వారిలో ఒకరైన జస్టిస్ ఎస్ఏ బాబ్డే మంగళవారం అందుబాటులో ఉండరనీ, కాబట్టి కేసు విచారణను ఆ రోజున రద్దు చేస్తున్నామంటూ సుప్రీంకోర్టు రిజస్ట్రీ ఓ నోటీసు విడుదల చేసింది. సీజేఐ రంజన్ గొగోయ్ ఈ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తుండగా, జస్టిస్ బాబ్డేతోపాటు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ ధర్మాసనాన్ని ఈ నెల 25న ఏర్పాటు చేశారు. అంతకుముందు ఈ కేసు విచారణలో పాలుపంచుకునేందుకు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎన్వీ రమణలు విముఖత చూపారు. వారి స్థానంలో జస్టిస్ భూషణ్, జస్టిస్ నజీర్‌లు ధర్మాసనంలో చేరారు. -
13 ‘జూ’ల గుర్తింపు రద్దు
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల్లోని మొత్తం 13 జంతు ప్రదర్శన శాల (జూ)ల గుర్తింపు రద్దయ్యింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఈ జంతు ప్రదర్శన శాలలు పనిచేయకపోవడం, అక్కడి జంతువుల ఆరోగ్యం కోసం కేంద్ర జూ సంస్థ (సీజెడ్ఏ) వాటి గుర్తింపును రద్దు చేసిందని పర్యావరణ శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ శుక్రవారం లోక్‌సభకు చెప్పారు. గుర్తింపు రద్దయిన వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఉన్న డీర్ పార్క్ ఎన్సీఎఫ్ఎల్, తెలంగాణలోని డీర్ పార్క్ కేశోరాం సిమెంట్, సంఘీ మినీ జూ, కర్ణాటకలోని తుంగభద్ర మినీ జూ, శ్రీ క్షేత్ర సొగల్ సౌండట్టి, తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న వీఓసీ పార్క్ మినీ జూ మొదలగునవి ఉన్నాయి. -
మలేసియాలో మరణశిక్ష రద్దు
కౌలాలంపూర్: మలేసియా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులకు విధించే మరణశిక్షను త్వరలోనే రద్దు చేస్తామని ప్రకటించింది. ప్రధాని మహతీర్ మొహమ్మద్ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మలేసియా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో త్వరలో మరణశిక్ష అమలు కానున్న 1,200 మందికి పైగా ఖైదీలకు ఊరట లభించినట్లయింది. సాధారణంగా హత్య, డ్రగ్స్ అక్రమరవాణా, దేశద్రోహం, ఉగ్రదాడులు, కిడ్నాప్ వంటి ఘటనల్లో దోషులుగా తేలినవారికి మలేసియాలో ఇప్పటివరకూ మరణదండన విధిస్తున్నారు. తాజా నిర్ణయంపై మలేసియా న్యాయశాఖ మంత్రి ల్యూ వుయ్ కియాంగ్ మాట్లాడుతూ.. మరణదండనకు సంబంధిం చి సవరించిన బిల్లును వచ్చే సోమవారం పార్లమెంటులో ప్రవేశపెడతామని తెలిపారు. అవినీతి రహిత పాలన అందిస్తామనీ, మరణశిక్షను రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని వెల్లడించారు. కాగా, మలేసియా ప్రభుత్వ నిర్ణయాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, మానవహక్కుల సంస్థ‘లాయర్స్ ఫర్ లిబర్టీ’ స్వాగతించాయి. ఈ సందర్భంగా కొత్త చట్టంలో ఎలాంటి మినహాయింపులు లేకుండా అన్ని నేరాలకు మరణశిక్షను రద్దు చేయాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శి కుమీ నైదూ విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 142 దేశాలు మరణదండనను తిరస్కరించాయని వెల్లడించారు. భారత్, సింగపూర్, చైనా, ఇండోనేసియా, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలు ఇంకా మరణశిక్షను అమలు చేస్తున్నాయన్నారు. -
3 నెలల్లో ‘హెచ్4’ను తేలుస్తాం
వాషింగ్టన్: హెచ్–4 వీసాదారులకు వర్క్ పర్మిట్లను రద్దు చేసే విషయమై వచ్చే మూడు నెలల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ ప్రభుత్వం ఫెడరల్ కోర్టుకు తెలిపింది.‘హెచ్–1బీ వీసాదారుల భాగస్వాములకు ఉపాధి కల్పనకు అవకాశం కల్పించే హెచ్–4 వీసాకు సంబంధించిన నిబంధనను తొలగించాలని ప్రతిపాదించడంలో మేము కచ్చితమైన పురోగతి సాధిస్తున్నాం’అని కొలంబియా జిల్లాలోని అమెరికా జిల్లా కోర్టుకు సమర్పించిన నివేదికలో హోంల్యాండ్ భ్రదత విభాగం(డిహెచ్ఎస్) పేర్కొంది. కొత్త నిబంధనను మూడు నెలల్లో అధ్యక్ష భవనంలోని ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ బడ్జెట్(ఓఎంబీ)కు సమర్పిస్తామని,అంత వరకు ఈ కేసులో నిర్ణయాన్ని ప్రకటించవద్దని కోర్టును కోరింది. హెచ్1బీ వీసాపై అమెరికా వచ్చే విదేశీయుల భాగస్వాములకు అక్కడ ఉద్యోగ అవకాశం కల్పిస్తూ గతంలో ఒబామా ప్రభుత్వం హెచ్–4 వీసా నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధన కింద యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యుఎస్సిఐఎస్)హెచ్–1బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు(భాగస్వామి,21 ఏళ్లలోపు పిల్లలకు)హెచ్–4 వీసాలు మంజూరు చేస్తోంది.దీనివల్ల లక్షల మంది భారతీయ మహిళలు లబ్ది పొందుతున్నారు.ఒబామా హయాంలో ఇచ్చిన ఈ అవకాశం దుర్వినియోగమవుతోందని, ఈ నిబంధన సాకుతో కంపెనీలు అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని భావిస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఒబామా ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఒమాబా హయాంలో అమల్లోకి వచ్చిన ఈ విధానం వల్ల తమ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతోందంటూ కొందరు అమెరికన్లు(ఉద్యోగులు) కోర్టులో కేసు వేశారు.ఆ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం గత ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. హెచ్4వీసాదారుల వర్క్ పర్మిట్లను రద్దు చేయనున్నట్టు ట్రంప్ ప్రభుత్వం బహిరంగంగాను, కోర్టులోనూ కూడా చెబుతూ వస్తోంది. హెచ్4 వీసా వర్క్ పర్మిట్ రద్దుకు త్వరలో నిర్ణయం తీసుకుంటామంటూ ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు కోర్టుకు తెలిపింది. నిర్ణయం ఆలస్యం అవుతోందంటూ గత ఫిబ్రవరి 28, మే 22, ఆగస్టు 20లలో కోర్టుకు తెలిపింది. తరువాయి స్టేటస్ రిపోర్టును(స్థాయి నివేదిక) వచ్చే నవంబర్ 19న కోర్టుకు సమర్పించనుంది. సాధారణ ప్రక్రియే హెచ్4 వీసా వర్క్ పర్మిట్ల రద్దుపై నిర్ణయంలో జాప్యం జరగడం సాధారణమేనని అమెరికా అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు.‘డిహెచ్‌ఎస్‌కు చెందిన సీనియర్ నాయకులు ప్రతిపాదనను సమీక్షించడం, సవరణలు సూచించడం సాధారణంగా జరిగేదే.అవసరమైన సవరణలు పొందుపరిచిన తర్వాత తుది ఆమోదం కోనం యుఎస్సిఐఎస్ ఆ ప్రతిపాదనను డిహెచ్‌ఎస్‌కు పంపుతుంది. తర్వాత ఓఎంబీకి సమర్పించడం జరుగుతుంది’అని అటార్నీ తాజా అఫిడవిట్లో కోర్టుకు వివరించారు.అయితే, కోర్టు తీర్పు ఆలస్యం అవుతున్న కొద్దీ తమకు మరింత ఎక్కువ హాని జరుగుతుందని పిటిషనర్లు(సేవ్ జాబ్స్ యుఎస్ఏ) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా తీర్పు ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు. 1.26 లక్షల మందికి ఆనుమతి 2015, మే నుంచి ఒబామా విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి 2017 డిసెంబర్ 25 వరకు యుఎస్సిఐఎస్ 1,26,853 మందికి వర్క్ పర్మిట్లు మంజూరు చేసింది. వీటిలో 90,846 దరఖాస్తులు కొత్తగా అనుమతి కోరుతూ పెట్టుకున్నవి కాగా,35,219 రెన్యువల్ దరఖాస్తులు.వర్క్ పర్మిట్ కార్డులు పోవడంతో కొత్త కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులు 688.‘ యుఎస్సిఐఎస్ మంజూరు చేసిన దరఖాస్తుల్లో 93శాతం భారతదేశంలో పుట్టి ఇక్కడికి వచ్చిన వారివే.5శాతం చైనాలో పుట్టిన వారివి. మిగతా రెండు శాతం ఇతర దేశాల్లో పుట్టిన వారివి.’అని కాంగ్రెçసనల్ రీసెర్చ్ సర్వీస్ ఒక నివేదికలో తెలిపింది.యుఎస్సిఐఎస్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. -
సీపీఎస్‌ను రద్దు చేయకుంటే గుణపాఠం చెబుతాం
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని లక్షా 86వేల మంది ఉద్యోగుల కోసం పనిచేస్తావా? షేర్ మార్కెట్ కోసం పనిచేస్తావా? ఈ విషయమై వెంటనే తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) చైర్మన్ పీ బాబురెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. ఉద్యోగుల జీవితాలను షేర్ మార్కెట్లో పెట్టి ముఖ్యమంత్రి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగుల ప్రయోజనాల కంటే షేర్ మార్కెటే ముఖ్యమనుకుంటే సీపీఎస్ ఉద్యోగులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణలో భాగంగా అమలుచేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో ఉద్యోగులు ఉద్యమిస్తున్నా పాలకులకు చీమకుట్టినట్లు లేదని విమర్శించారు. సీపీఎస్ విధానం వల్ల రాష్ట్రంలోని లక్షా 86వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేసిన తరువాత నష్టపోతారన్నారు. 2003 డిసెంబర్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేసిందన్నారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వామపక్షాలు పార్లమెంట్లో, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు బయట అడ్డుకోవడంతో పదేళ్లపాటు సీపీఎస్ బిల్లు ఆగిపోయిందన్నారు. 2013లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కలిసి పీఎఫ్ఆర్డీఏ బిల్లు తీసుకువచ్చి దేశంలోని కోట్లాది మంది ఉద్యోగుల జీవితాలకు భద్రత లేకుండా చేశాయని ధ్వజమెత్తారు. రూ. 700కోట్లు మిగులుతాయి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందంటూ పదేపదే చెబుతున్న చంద్రబాబు సీపీఎస్ వల్ల 700 కోట్ల రూపాయలు షేర్ మార్కెట్లో ఎందుకు చెల్లించాలని బాబురెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఏడాది రూ.1000కోట్లు, ఆ తర్వాత 1500కోట్లు, ఇలా 2000కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. పీఎఫ్ఆర్డీఏతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయల కోసం కేంద్రంతో కొట్లాడేందుకు సిద్ధపడాలన్నారు. సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్ధరిస్తూ ప్రభుత్వం తీర్మానం చేయాలన్నారు. సీపీఎస్ రద్దుకు కొన్ని పార్టీలు హామీలు ఇస్తున్నాయని, అది ఆచరణాత్మక హామీ అయితే అసెంబ్లీలో, పార్లమెంటులో సీపీఎస్ రద్దుకు బిల్లును ప్రతిపాదించాలని సూచించారు. క్విట్ సీపీఎస్‌తో జాతాలు సీపీఎస్ విధానాన్ని అమలు చేసుకునే, రద్దు చేసుకునే వెసులుబాటు కేంద్రం కల్పించిన నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు క్విట్ సీపీఎస్ నినాదంతో ఫ్యాప్టో ఆధ్వర్యంలో జాతాలు నిర్వహించనున్నట్లు బాబురెడ్డి వెల్లడించారు. ఈనెల 30 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా జాతాలు ప్రారంభం అవుతాయన్నారు. సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగల జీవితాల్లో చీకటి రోజు నింపిన సెప్టెంబర్ 1వ తేదీ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపా«ధ్యాయులంతా మాస్ క్యాజువల్ లీవ్‌లు పెట్టి అన్ని కలెక్టరేట్లను ముట్టడించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గుదిబండగా మారిన యాప్‌లు ప్రభుత్వ ఉపాధ్యాయులకు యాప్‌లు గుదిబండగా బాబురెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 21రకాల యాప్స్‌ను ప్రతిరోజూ ఉపాధ్యాయులు నిర్వహించాల్సి వస్తోందని, దీంతో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలా, యాప్స్‌కు సమాధానం పంపుతూ ఉండాలా అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. విద్యార్థులకు సక్రమంగా పాఠాలు చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకే ఇలాంటి విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. గతంలో యాప్‌లు లేకుండా పాఠశాలలు సక్రమంగా నిర్వహించలేదా, ఫలితాలు సాధించలేదా అని ప్రశ్నించారు. యాప్‌ల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు. -
ఉద్యోగులకు ఉరితాడుగా సీపీఎస్
పెద్దదోర్నాల: సీపీఎస్ విధానం ఉద్యోగులకు ఉరితాడుగా మారిందని, ఈ విధానాన్ని రద్దు పరిచే వరకు ప్రతి ఒక్కరూ రాజీలేని పోరాటం చేయాలని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్ పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక ఎమ్మార్సీ భవన ప్రాంగణంలో ఆయన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోపభూయిష్టమైన వ్యవస్థలో ఉన్న లక్షా 84 వేల మంది ఉద్యోగులను రక్షించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నెట్టి వేస్తుందన్నారు. ఇలాంటి చర్యలను మానుకుని సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. 2019 ఎన్నికల లోపు ఈ విధానాన్ని రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దయ్యేవరకూ పోరాటాలు
పెనగలూరు : సీపీఎస్ రద్దయ్యేవరకూ అలుపెరుగని పోరాటాలు చేయనున్నట్లు యూటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా బెస్తపల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో నాయకులు భవిష్యత్‌లో చేపట్టబోవు పోరాటాల్లో అందరూ భాగస్వాములు కావాలని నిర్ణయించారు. సీపీఎస్ రద్దు డిమాండ్‌తో త్వరలో చేపట్టే పోరుయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కోశాధికారి హరిప్రసాద్ మాట్లాడుతూ పని చేయించుకుని పదవీ విరమణ తర్వాత పింఛన్ ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. సీపీఎస్ ఉపాధ్యాయులతో సబ్ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా ఎస్ ప్రదీప్‌కుమార్‌రెడ్డి కో–కన్వీనర్లుగా ఎం నరసింహారావు, పీ నాగరాజు, ఈ వెంకటరమణ, కే పుల్లన్న, దిలీప్‌కుమార్‌రెడ్డి, సభ్యులుగా సునీల్‌కుమార్, ఖాదర్‌బాషా, ఉదయభాస్కర్, రామాంజనేయులు, సూర్యబాబును ఎన్నుకున్నారు. యూటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే వీరయ్య, ఏ చెన్నయ్య, సహాధ్యక్షుడు సీ సుబ్రమణ్యం, కోశాధికారి ఎస్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దుకు ఉద్యమిద్దాం
కర్నూలు(అగ్రికల్చర్): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దుకు ప్రభుత్వాలపై ఉద్యమిద్దామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, నాగరమణయ్య ఉద్యోగులకు పిలుపు నిచ్చారు. సీపీఎస్ రద్దు డిమాండ్‌తో ఈ నెల 14న నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని..ఇందులో అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొనాలని కోరారు. మంగళవారం కలెక్టరేట్లోని పొదుపు భవన్లో ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీపీఎస్‌పై దండయాత్ర వాల్‌పోస్టర్‌ను జిల్లా నాయకులు విడుదల చేశారు. ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర సహ అధ్యక్షుడు రామనరసింహ మాట్లాడుతూ... సీపీఎస్ రద్దుకు ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచాలన్నారు. ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని, ప్రభుత్వ ఉద్యోగులు మేల్కొని పోరాటం ఉద్ధృతం చేయలన్నారు. కార్యక్రమంలో ఏపీసీపీఎస్ఈఏ జిల్లా నేతలు శ్రీనివాసరెడ్డి, మద్దయ్య, వెంకటరమణ, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా నేతలు గంగా, నాగేశ్వరి, నాగమణి, సీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంభూపాల్, శివారెడ్డి, రాజశేఖర్ పాల్గొన్నారు. -
హెచ్–4 వీసా నిబంధన రద్దుకే మొగ్గు
వాషింగ్టన్: అమెరికాకు హెచ్–1బీ వీసాలపై వెళ్లే వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములకు అక్కడ పనిచేసుకునేందుకు వీలుగా అమలు చేస్తున్న హెచ్–4 వీసా నిబంధనల్ని రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ట్రంప్ సర్కారు మరో సారి పునరుద్ఘాటించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)కు అర్హుల జాబితా నుంచి హెచ్–4 వీసాదారుల్ని తొలగించాలని ప్రతిపాదిస్తున్నామని ఫెడరల్ రిజిస్టర్ నోటిఫికేషన్లో అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. దీనిపై అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ స్పందిస్తూ.. రూల్ మేకింగ్(చట్టం అమలు ప్రక్రియ) పూర్తయ్యేవరకూ హెచ్–4 వీసాలపై ఏ నిర్ణయం అంతిమం కాదంది. -
చివరి దశలో హెచ్-4 వీసా రద్దు
వాషింగ్టన్: భారతీయ ఐటి నిపుణుల గుండెల్లో గుబులు పుట్టించే వార్త. హెచ్-4 వీసాను రద్దు చేసే ప్రక్రియ చివరి దశల్లో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంకేతాలు అందించింది. అమెరికాలో హెచ్ -1బి వీసా మీద పనిచేస్తున్న వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములకు ఇచ్చే స్పౌస్ వీసా హెచ్-4ను రద్దు చేయాలన్న నిర్ణయం తుది దశలో ఉందని ట్రంప్ పరిపాలన విభాగం అమెరికా కోర్టుకు తెలియజేసింది. ప్రతిపాదిత నియమం తుది దశంలో ఉందని డిపార్ట్మెంట్ అఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఫెడరల్ కోర్టుకు గురువారం నివేదించింది. ఈ నిర్ణయం తుదిరూపు దాల్చి అమలులోకి వస్తే అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. హెచ్1బి వీసా మీద అమెరికాలో పనిచేసే వృత్తినిపుణుల జీవిత భాగస్వాములు హెచ్-4 వీసా కింద అమెరికాలో నివసించడానికి అనుమతి లభిస్తుంది. అయితే.. అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో (2015)లో హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయటానికి అనుమతించిన ఈఏడీ (ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) కి చరమగీతం పాడాలని ట్రంప్ సర్కార్ ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. కాగా హెచ్-4 వీసాదారులకు ఈఏడీల జారీని రద్దు చేస్తామని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) 2017 సెప్టెంబర్‌లో ప్రకటించింది. అయితే 2018 ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన ప్రకటన జారీ చేస్తామని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంలో భాగంగా హెచ్-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలు చేయటానికి ఇచ్చే అనుమతులను రద్దు చేయాలనీ ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్-1బీ, హెచ్-4 వీసాలను ఎక్కువగా పొందుతున్న భారతీయ ఐటీ నిపుణుల్లో ఇప్పటికే తీవ్ర ఆందోళన నెలకొన్న సంగతి విదితమే. దాదాపు 70వేల మంది హెచ్-4 వీసాదారుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం పొంచి ఉంది. -
ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తే తెల్లరేషన్‌కార్డు, పింఛన్ల రద్దు
పుత్తూరు రూరల్ : ప్రైవేట్ పాఠశాలల్లో తమ చిన్నారులను చదివిస్తే కుటుంబసభ్యులకు తెల్లరేషన్‌కార్డు, పింఛన్లను రద్దు చేయడంతో పాటు సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని ఎంపీపీ గంజి మాధవయ్య స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఇషా విద్య ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్తోమత ఉన్నప్పుడు ఆ కుటుంబానికి సంక్షేమ పథకాల అవసరం ఎందుకని ఆయన ప్రశ్నించారు. విద్య కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, దుస్తులను ఉచితంగా అందించడంతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన చేస్తున్నట్లు ఆయన వివరించారు. అయినప్పటికీ ప్రైవేట్ విద్యాసంస్థల వైపు చూడడం తగదని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఎంపీడీఓ నిర్మలాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నైతిక విలువలతో కూడిన విద్యను బోధిస్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. ఇషా కోఆర్డినేటర్ వీరమంగళం వెంకటరమణ మాట్లాడుతూ అంగన్వాడీల్లో ఐదేళ్లు పూర్తయిన చిన్నారులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలన్నారు.ఇషా విద్య అమలులో ఉండడంతో ఆటపాటలతో కూడిన అత్యున్నత విద్యాబోధన అందిస్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతాన్ని పెంచాలన్నారు. ఎంఈఓ తిరుమలరాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఇందిరా ప్రియదర్శిని, రోజారమణి, షామిని పాల్గొన్నారు. -
బంగ్లాలో ప్రభుత్వ కొలువుల్లో రిజర్వేషన్లు రద్దు
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. రిజర్వేషన్ విధానంలో సంస్కరణలు తేవాలంటూ విద్యార్థులు, నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఢాకా ఆందోళనలతో అట్టుడికింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని పార్లమెంట్లో ఈమేరకు ప్రకటన చేశారు. డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత కూడా ఆందోళనలు కొనసాగించటం తగదన్నారు. ఢాకా వర్సిటీ వైస్ఛాన్సెలర్పై దాడిని ఆమె ఖండించారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ విధానం ప్రకారం.. 56% ప్రభుత్వ ఉద్యోగాలను స్వాతంత్య్ర సమర యోధుల పిల్లలు, మహిళలు, మైనారిటీలు, వికలాంగులు, వెనుకబడిన జిల్లాల వారికి కేటాయిస్తున్నారు. -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
జనగామ అర్బన్ : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, కామన్ సర్వీస్ రూల్స్ రూపొందించాలని టీటీజేఏసీ చైర్మన్ తిరునగరి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం టీటీజేఏసీ నూతన కార్యవర్గాన్ని వివిధ భాగస్వామ్య సం ఘాలు, పీఆర్టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి కొల్ల మహిపాల్‌రెడ్డి సమన్వయంతో స్ధానిక పీఆర్టీయూ జిల్లా కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. పీఆర్సీ ఏర్పాటు కోరుతూ పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అనంతరం టీటీజేఏసీ జిల్లా చైర్మన్‌గా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తిరునగరి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్‌గా టీపీయూఎస్ అధ్యక్షుడు ముసిని వేణుగోపాల్, డిప్యూటీ చైర్మన్‌గా టీఎస్హెచ్ఎంఏ అధ్యక్షుడు గాండె మల్లికార్జున్, కోచైర్మన్‌గా డీజీటీయూ ప్రధాన కార్యదర్శి జె.రత్నాకర్, కార్యదర్శిగా టీఎస్టీఎస్టీయూఎస్ అధ్యక్షుడు సలాడి సత్తయ్యను ఎన్నుకున్నారు. సమావేశంలో రమేష్, అర్జున్‌కుమార్, విద్యాసాగర్, సోమరాజు, విజ య్‌కుమార్, ప్రభాకర్, పంచాక్షరి, రత్నాకర్, మనోజ్‌కుమార్, శ్రీనివాస్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.