సీపీఎస్‌పై దండయాత్ర వాల్‌పోస్టలను విడుదల చేస్తున్న నాయకులు
కర్నూలు(అగ్రికల్చర్): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దుకు ప్రభుత్వాలపై ఉద్యమిద్దామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, నాగరమణయ్య ఉద్యోగులకు పిలుపు నిచ్చారు. సీపీఎస్ రద్దు డిమాండ్‌తో ఈ నెల 14న నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని..ఇందులో అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొనాలని కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పొదుపు భవన్‌లో ఏపీసీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీపీఎస్‌పై దండయాత్ర వాల్‌పోస్టర్‌ను జిల్లా నాయకులు విడుదల చేశారు.
ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర సహ అధ్యక్షుడు రామనరసింహ మాట్లాడుతూ... సీపీఎస్ రద్దుకు ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచాలన్నారు. ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని, ప్రభుత్వ ఉద్యోగులు మేల్కొని పోరాటం ఉద్ధృతం చేయలన్నారు. కార్యక్రమంలో ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా నేతలు శ్రీనివాసరెడ్డి, మద్దయ్య, వెంకటరమణ, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా నేతలు గంగా, నాగేశ్వరి, నాగమణి, సీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంభూపాల్, శివారెడ్డి, రాజశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment