– ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
– వాయిదా వేస్తున్నట్లు మంత్రి గంటా ప్రకటన
అనంతపురం ఎడ్యుకేషన్ : అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న బోధనా టీచర్లకు (సబ్జెక్టు) ట్రైనింగ్ నీడ్స్ ఐడింటెఫికేషన్ టెస్ట్ (టీఎన్‌ఐటీ)ను పూర్తిగా రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బోధనాంశాలపై ఉన్న అవగాహనను అంచనా వేయడానికి సబ్జెక్టు టీచర్లకు ఈనెల 20, 21 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అన్ని యాజామాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సబ్జెక్టు టీచర్లు, భాషా పండితులు, పీఈటీలు హాజరుకావాలని అధికారులు స్పష్టం చేశారు. టీఎన్‌ఐటీని బహిష్కరిస్తున్నట్లు ప్యాప్టో నాయకులు ప్రకటించారు. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. టీచర్లు ఎవరూ దరఖాస్తు చేసుకోవద్దని పిలునిచ్చారు. జిల్లాలో దాదాపు 6700 మంది ప్రభుత్వ టీచర్లు ఉండగా కేవలం కేవలం 2800 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసి చర్చించారు. అనంతరం టీఎన్‌ఐæ పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. అయితే ఈ టెస్టును రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పూర్తిగా రద్దు చేయాలి
టీఎన్‌ఐ పరీక్షను వాయిదా వేయడం కాదని పూర్తిగా రద్దు చేయాలి. ఉపాధ్యాయ సంఘాలతో మాట మాత్రం చెప్పకుండా, చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటుంది?. ఉపాధ్యాయులంటే అంత అలుసా. రద్దు చేయకుండా పరీక్షపెడితే మాత్రం ఎవరూ రాయకుండా అడ్డుకుంటాం. కనీసం 30 శాతం మంది కూడా దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకోకూడదంటూ ఉపాధ్యాయుల్లో చైతన్యం తెస్తున్నాం.
– ప్యాప్టో, నాయకులు
–––––––––
టీఎన్‌ఐటీని రద్దు చేయాలి
Published Wed, Aug 17 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
Advertisement
Advertisement