TNIT
-
టీఎన్‌ఐటీ వాయిదాకు మంత్రి హామీ
శ్రీకాకుళం: ఫ్యాప్టో పోరాట ఫలితంగా స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించ తలపెట్టిన ఉపాధ్యాయ సామర్థ్య పరీక్ష (టీఎన్‌ఐటీ)ను వాయిదా వేసేందుకు పాఠశాల విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారని ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఫ్యాప్టో శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జి సామల సింహాచలం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల సామర్థాలను పరీక్షించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) తీవ్రంగా వ్యతిరేకిస్తూ టీఎన్‌ఐటీ పరీక్షను బాయ్‌కాట్ చేయాలని ఇచ్చిన పిలుపునకు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు టీఎన్‌ఐటీ పరీక్షకు నమోదు చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావును బుధవారం ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం విజయవాడలో కలిసి టీఎన్‌ఐటీ పరీక్షను రద్దు చేయాలని కోరగా మంత్రి స్పందించి వాయిదా వేస్తామని, ఈ సమస్యపై అన్ని ఉపాధ్యాయ సంఘాలతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారనిచెప్పారు. -
టీఎన్ఐటీని రద్దు చేయాలి
– ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ – వాయిదా వేస్తున్నట్లు మంత్రి గంటా ప్రకటన అనంతపురం ఎడ్యుకేషన్ : అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న బోధనా టీచర్లకు (సబ్జెక్టు) ట్రైనింగ్ నీడ్స్ ఐడింటెఫికేషన్ టెస్ట్ (టీఎన్‌ఐటీ)ను పూర్తిగా రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బోధనాంశాలపై ఉన్న అవగాహనను అంచనా వేయడానికి సబ్జెక్టు టీచర్లకు ఈనెల 20, 21 తేదీల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని యాజామాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సబ్జెక్టు టీచర్లు, భాషా పండితులు, పీఈటీలు హాజరుకావాలని అధికారులు స్పష్టం చేశారు. టీఎన్ఐటీని బహిష్కరిస్తున్నట్లు ప్యాప్టో నాయకులు ప్రకటించారు. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. టీచర్లు ఎవరూ దరఖాస్తు చేసుకోవద్దని పిలునిచ్చారు. జిల్లాలో దాదాపు 6700 మంది ప్రభుత్వ టీచర్లు ఉండగా కేవలం కేవలం 2800 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసి చర్చించారు. అనంతరం టీఎన్ఐæ పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. అయితే ఈ టెస్టును రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పూర్తిగా రద్దు చేయాలి టీఎన్ఐ పరీక్షను వాయిదా వేయడం కాదని పూర్తిగా రద్దు చేయాలి. ఉపాధ్యాయ సంఘాలతో మాట మాత్రం చెప్పకుండా, చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటుంది?. ఉపాధ్యాయులంటే అంత అలుసా. రద్దు చేయకుండా పరీక్షపెడితే మాత్రం ఎవరూ రాయకుండా అడ్డుకుంటాం. కనీసం 30 శాతం మంది కూడా దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకోకూడదంటూ ఉపాధ్యాయుల్లో చైతన్యం తెస్తున్నాం. – ప్యాప్టో, నాయకులు ––––––––– -
‘పరీక్షలతో ఉపాధ్యాయుల్లో ఆందోళన’
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్లకు పరీక్షలు పెట్టి వారిని మానసిక ఆందోళనకు గురి చేస్తోందని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్సు యూనియన్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు వి.హరిశ్చంద్రుడు అన్నారు. ఆయన బు««దlవారం మాట్లాడుతూ వృత్యంతర, నైపుణ్య శిక్షణ ఇవ్వాలి గానీ ఇ లాంటి పరీక్షలు నిర్వహించకూడదన్నారు. విద్యావ్యవస్థను ప్రైవేటీకరించడానికే ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. టీఎన్‌ఐటీ పరీక్షలు వద్దు శ్రీకాకుళం: ఉపాధ్యాయుల సామర్థ్యాలను పరీక్షిం చే పేరుతో ట్రైనింగ్ నీడ్స్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ (టీఎన్‌ఐటీ) పరీక్షలు నిర్వహించడాన్ని ఏపీటీఎఫ్ వ్యతిరేకిస్తుందని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు సీహెచ్ అచ్యుతరావు, కొప్పల భా నుమార్తి, కార్యదర్శులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు కంప్యూటర్ విద్య బోధించాల్సిన పని లేదని తెలిపారు. -
సామర్ధ్యపరీక్షలు అంటే టీచర్లను అవమానించడమే
ట్రయినింగ్ నీడ్స్ ఐడెంటిఫికేషన్ టెస్టు (టీఎన్‌ఐటీ) పేరిట పనితీరు సామర్ధ్యాలను అంచనా వేసేందుకు పాఠశాల విద్యాశాఖ తలపెట్టిన పరీక్షలపై టీచర్లనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని ప్రధాన సంఘాలనుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రకటనలు వెలువడుతున్నాయి. యూటీఎఫ్, పీఆర్టీయూ, ఎస్టీయూ సహ పలుసంఘాలు దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ బుధవారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. జాతీయ సర్వేలలో వెనుకబడ్డామని టీచర్లకు ఆన్లైన్ పరీక్ష పెట్టాలనుకోవడం సరికాదని యూటీఎఫ్ అధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా సెక్షన్‌కు 60 మంది విద్యార్ధులను పెట్టి స్కూళ్లు నడుపుతూ సీసీఈ మోడల్ ప్రయోగాలు చేస్తూ ఇప్పుడు సర్వేల్లో వెనుకబడ్డామని టీచర్లను బాధ్యులను చేయడమేమిటన్నారు. ప్రభుత్వ లోపాన్ని టీచర్లపై నెట్టడానికే ఈ పరీక్షలన్నారు. ఇప్పటికే పలు సబ్జెక్టులకు, టీచర్లు లేరని, టెలికాన్ఫరెన్సు ద్వారా నిర్వహించే ట్రయినింగ్‌లతో ఫలితం లేదని చెప్పారు. అనేక మంది టీచర్లకు కంప్యూటర్ పరిజ్ఞానం అంతంతమాత్రమేనని, ఈ సమయంలో ఏకంగా ఆన్లైన్లో పరీక్ష పెట్టడం వారికి నష్టం కలిగిస్తుందన్నారు. పైగా రూ.300 చొప్పున ఫీజు వసూలు చేయడం దారుణమని పేర్కొన్నారు. పరీక్ష ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, బోధనా పద్ధతులపై నేరుగా శిక్షణ ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ఆ ఉత్తర్వులు ఉపసంహరించాల్సిందే:ఎస్టీయూ టీచర్లకు పరీక్షలకోసం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని ఫ్యాప్టో నేతలు కత్తినర్సింహారెడ్డి, పాండురంగవరప్రసాదరావు, హృదయరాజు, నారాయణరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. టీచర్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలన్నదానికి కోట్లు ఖర్చు పెట్టి పరీక్ష నిర్వహించడం సరికాదన్నారు. ఆయా సబ్జెక్టు ప్రతినిధులతో, టీచర్లతో వెబ్సైట్ ద్వారా అభిప్రాయాలు తీసుకొని శిక్షణాంశాలను నిర్ధారించవచ్చని సూచించారు. రూ.300 ఫీజు సరికాదన్నారు. పరీక్షల పేరుతో టీచర్లకు శిక్ష వేయడాన్ని వ్యతిరేకిస్తామన్నారు. ముందు ఖాళీగా ఉన్న వేలాదిపోస్టులను భర్తీచేయాలని, పర్యవేక్షణాధికారులను నియమించడంతోపాటు డీఈడీ, బీఈడీ శిక్షణను పటిష్టంచేయాలని సూచించారు. టీచర్లకు మళ్లీ పరీక్షా? టెట్, డీఎస్సీ ద్వారా నియమితులైన టీచర్లకు ప్రతి ఏటా నూతన విద్యావిధానాలపై శిక్షణ ఇస్తున్నారని, ఈ తరుణంలో టీఎన్‌ఐటీ పేరిట పరీక్ష పెట్టడం సరికాదని, వ్యతిరేకిస్తున్నామని పీఆర్టీయూ నేతలు కమలాకర్‌రావు, శ్రీనివాసరాజులు పేర్కొన్నారు. పరీక్షలంటూ టీచర్ల మనోభావాలు దెబ్బతీసేలా ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీలు శ్రీనివాసులు నాయుడు, బచ్చలపుల్లయ్యలతో పాటు తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.