‘పరీక్షలతో ఉపాధ్యాయుల్లో ఆందోళన’
Published Wed, Aug 10 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్లకు పరీక్షలు పెట్టి వారిని మానసిక ఆందోళనకు గురి చేస్తోందని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్సు యూనియన్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు వి.హరిశ్చంద్రుడు అన్నారు. ఆయన బు««దlవారం మాట్లాడుతూ వృత్యంతర, నైపుణ్య శిక్షణ ఇవ్వాలి గానీ ఇ లాంటి పరీక్షలు నిర్వహించకూడదన్నారు. విద్యావ్యవస్థను ప్రైవేటీకరించడానికే ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు.
టీఎన్‌ఐటీ పరీక్షలు వద్దు
శ్రీకాకుళం: ఉపాధ్యాయుల సామర్థ్యాలను పరీక్షిం చే పేరుతో ట్రైనింగ్ నీడ్స్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ (టీఎన్‌ఐటీ) పరీక్షలు నిర్వహించడాన్ని ఏపీటీఎఫ్ వ్యతిరేకిస్తుందని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు సీహెచ్ అచ్యుతరావు, కొప్పల భా నుమార్తి, కార్యదర్శులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు కంప్యూటర్ విద్య బోధించాల్సిన పని లేదని తెలిపారు.
Advertisement
Advertisement