
నినాదాలు చేస్తున్న ఉపాధ్యాయులు
పెనగలూరు : సీపీఎస్ రద్దయ్యేవరకూ అలుపెరుగని పోరాటాలు చేయనున్నట్లు యూటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా బెస్తపల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో నాయకులు భవిష్యత్‌లో చేపట్టబోవు పోరాటాల్లో అందరూ భాగస్వాములు కావాలని నిర్ణయించారు. సీపీఎస్ రద్దు డిమాండ్‌తో త్వరలో చేపట్టే పోరుయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కోశాధికారి హరిప్రసాద్ మాట్లాడుతూ పని చేయించుకుని పదవీ విరమణ తర్వాత పింఛన్ ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. సీపీఎస్ ఉపాధ్యాయులతో సబ్ కమిటీని ఎన్నుకున్నారు.
కన్వీనర్‌గా ఎస్ ప్రదీప్‌కుమార్‌రెడ్డి కో–కన్వీనర్‌లుగా ఎం నరసింహారావు, పీ నాగరాజు, ఈ వెంకటరమణ, కే పుల్లన్న, దిలీప్‌కుమార్‌రెడ్డి, సభ్యులుగా సునీల్‌కుమార్, ఖాదర్‌బాషా, ఉదయభాస్కర్, రామాంజనేయులు, సూర్యబాబును ఎన్నుకున్నారు. యూటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే వీరయ్య, ఏ చెన్నయ్య, సహాధ్యక్షుడు సీ సుబ్రమణ్యం, కోశాధికారి ఎస్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment