utf leaders
-
సీపీఎస్ రద్దయ్యేవరకూ పోరాటాలు
పెనగలూరు : సీపీఎస్ రద్దయ్యేవరకూ అలుపెరుగని పోరాటాలు చేయనున్నట్లు యూటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా బెస్తపల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో నాయకులు భవిష్యత్‌లో చేపట్టబోవు పోరాటాల్లో అందరూ భాగస్వాములు కావాలని నిర్ణయించారు. సీపీఎస్ రద్దు డిమాండ్‌తో త్వరలో చేపట్టే పోరుయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కోశాధికారి హరిప్రసాద్ మాట్లాడుతూ పని చేయించుకుని పదవీ విరమణ తర్వాత పింఛన్ ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. సీపీఎస్ ఉపాధ్యాయులతో సబ్ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా ఎస్ ప్రదీప్‌కుమార్‌రెడ్డి కో–కన్వీనర్లుగా ఎం నరసింహారావు, పీ నాగరాజు, ఈ వెంకటరమణ, కే పుల్లన్న, దిలీప్‌కుమార్‌రెడ్డి, సభ్యులుగా సునీల్‌కుమార్, ఖాదర్‌బాషా, ఉదయభాస్కర్, రామాంజనేయులు, సూర్యబాబును ఎన్నుకున్నారు. యూటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే వీరయ్య, ఏ చెన్నయ్య, సహాధ్యక్షుడు సీ సుబ్రమణ్యం, కోశాధికారి ఎస్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దు కోసం పోరుబాట
గోనెగండ్ల: కొత్త పెన్షన్ విధానం సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వంపై పోరుబాట తప్పదని యూటీఎఫ్ మండల అధ్యక్షకార్యదర్శులు జిక్రియ, నరసింహులు అన్నారు. గురువారం స్థానిక బస్టాండ్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో యూటీఫ్ మండల గౌరవాధ్యక్షుడు రామ్మోహన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సీపీఎస్ విధానం రద్దు కోసం ఉపాధ్యాయులు పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు యూటీఎఫ్ ప్రత్యేక కార్యాచణ రూపొందించిందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి ఆగష్టు 5వ తేదీ వరకు జీపుజాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో మొదలయ్యే ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనుందన్నారు. ఆగష్టు 5న విజయవాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాఘవేంద్ర ఆధ్వర్యంలో సీపీఎస్ మండల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్‌గా లింగన్న, కో–కన్వీనర్‌గా రామచంద్ర, ఉసేన్, సభ్యులుగా శ్రీనివాసరెడ్డి, పురుషోత్తంతోపాటు మరో నలుగురిని ఎన్నుకున్నారు. సమావేశంలో యూటీఎఫ్ నాయకులు శాంతిరాజు, కాశయ్య, నాయక్, పౌల్, రంగన్న, నాగేశ్వరరావు, నజీర్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. 14న సీపీఎస్‌పై దండయాత్ర ఎమ్మిగనూరు రూరల్: సీపీఎస్‌పై ఈ నెల 14న జరపతలపెట్టిన దండయాత్రను జయప్రదం చేయలని ఏపీసీపీఎస్ఈఏ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు కోరారు. గురువారం దండయాత్రకు సంబంధించిన పోస్టరును విడుదల చేశారు. ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని చెప్పారు. ఈ నెల 14న కర్నూలులోని కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు చేపట్టే భారీ ర్యాలీకి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు రాముడు, రామకృష్ణ, నారాయణ, పరుశరాము, ప్రేమకుమార్, రంగన్న, హేమంత్‌కుమార్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ కత్తికి అభినందనలు
కడప ఎడ్యుకేషన్: పశ్చిమ రాయలసీమ శాసనమండలి సభ్యుడిగా విజయం సాధించిన ఉద్యమనేత, సంఘనాయకుడు కత్తి నరసింహారెడ్డికి యూటీఎఫ్ నేతలు అభినందనలు తెలిపారు. జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా,అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్‌కుమార్, సుబ్బరాజు , ఎస్టీయూ జిల్లా నాయకులు రఘునాథరెడ్డి, రాష్ట్రనాయకులు జయరామయ్య ప్రసంగించారు. జిల్లా హెచ్ఎం సంఘం అధ్యక్షుడు రామసుబ్బరాజు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు జాబీర్, రవికుమార్, నరసింహారావు, గంగన్న ఎస్టీయూ రాష్ట్ర నాయకులు సురేష్‌బాబు, రామకృష్ణారెడ్డి, జిల్లా నాయకులు ఇలియాస్‌బాషా, బీవీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి వారికి ధన్యవాదాలు తెలిపారు. -
ఉపాధ్యాయ సమస్యలపై దశలవారీ పోరాటాలు
ఏలూరు సిటీ: రాష్ట్ర విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ఫ్యాప్టో నాయకత్వానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు దశలవారీ పోరాటాలకు సిద్ధపడుతున్నట్టు ఫ్యాప్టో నాయకులు స్పష్టం చేశారు. స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబ్జీ మాట్లాడుతూ ఈ నెల 30, 31 తేదీల్లో తాలూకా కేంద్రాల్లో, ఫిబ్రవరి 13న జిల్లా కేంద్రంలో, 27న విజయవాడలో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శిని నియమించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు సాధించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఎంఈవో, డీవైఈవో, డైట్ లెక్చరర్స్, జేఎల్ పోస్టులలో అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. స్పెషల్ టీచర్లకు సర్వీసు కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, సర్ప్లస్ ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక డీఎస్ఈ నిర్వహించాలని, ఎయిడెడ్ టీచర్లకు పదోన్నతులు, ఆరోగ్యకార్డులు మంజూరు చేయాలని కోరారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌ను సవరించి జీపీఎఫ్, ఎల్టీసీ సౌకర్యం కల్పించాలని కోరారు. ఉర్దూ మీడియం స్కూళ్లలో జరిగే పరీక్షలకు ఉర్దూ మీడియంలోనే ప్రశ్నపత్రాలు సరఫరా చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఈడే శివశంకర్, డి.లింగేశ్వరరావు, జి.సాయిశ్రీనివాస్, కేవీ అప్పారావు, సీహెచ్ అనిల్‌బాబు, ఎండీ జిక్రియ పాల్గొన్నారు. -
జెడ్పీ చైర్‌పర్సన్‌కు యూటీఎఫ్ వినతి
శ్రీకాకుళం: జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ల ఆన్లైన్ ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని యూటీఎఫ్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. పీఎఫ్ చెల్లింపుల్లో జాప్యం నివారించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పీఎఫ్ ఆన్లైన్ ప్రక్రియలో జాప్యం చేస్తున్న అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి చైర్పర్సన్ సానుకూలంగా స్పందించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, జిల్లా సహాధ్యక్షుడు బమ్మిడి శ్రీరామమూర్తి, జిల్లా కార్యదర్శి కేవీ శ్రీరామమూర్తి, జిల్లా నాయకుడు హనుమంతు అన్నాజీరావు ఉన్నారు.