న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసులో మంగళవారం జరగాల్సిన విచారణను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించాల్సి ఉండగా, వారిలో ఒకరైన జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే మంగళవారం అందుబాటులో ఉండరనీ, కాబట్టి కేసు విచారణను ఆ రోజున రద్దు చేస్తున్నామంటూ సుప్రీంకోర్టు రిజస్ట్రీ ఓ నోటీసు విడుదల చేసింది. సీజేఐ రంజన్ గొగోయ్ ఈ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తుండగా, జస్టిస్ బాబ్డేతోపాటు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ ధర్మాసనాన్ని ఈ నెల 25న ఏర్పాటు చేశారు. అంతకుముందు ఈ కేసు విచారణలో పాలుపంచుకునేందుకు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎన్వీ రమణలు విముఖత చూపారు. వారి స్థానంలో జస్టిస్ భూషణ్, జస్టిస్ నజీర్‌లు ధర్మాసనంలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment