సెప్టెంబర్‌ 7కు హైదర్‌నగర్‌ భూముల కేసు వాయిదా | Hydernagar land Case Adjourned To September 7th | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 7కు హైదర్‌నగర్‌ భూముల కేసు వాయిదా

Published Fri, Aug 26 2022 10:38 AM | Last Updated on Fri, Aug 26 2022 10:38 AM

Hydernagar land Case Adjourned  To September 7th - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హైదర్‌నగర్‌ భూములకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబరు 7కు వాయిదా వేసింది. హైదర్‌నగర్‌ సర్వే నంబర్‌ 172లోని 98 ఎకరాల భూమి తమదేనంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది.

పిటిషన్‌లో లోపాలుంటే సరిచేసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. ఈ భూములకు సంబంధించి హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ గోల్డ్‌స్టోన్‌ ఎక్స్‌పోర్ట్స్, ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్‌ సంస్థలు కూడా పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement