న్యూఢిల్లీ: భూకుంభకోణం కేసులో కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు భారీ ఊరట లభించింది. ఆ కేసు విషయంలో విచారణ ఏమీ అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. పదేళ్ల కిందట సీఎంగా ఉన్న యడియూరప్ప 24 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలపై 2012లో లోకాయుక్తలో చార్జిషీటు కూడా దాఖలైంది. ఈ చార్జిషీట్ ఆధారంగా విచారణ చేయాలని ప్రత్యేక కోర్టుకు కర్నాటక హైకోర్టు గతనెలలో ఆదేశించింది. దీంతో యడియూరప్ప పదవికి గండం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తలుపు తట్టగా విచారణ చేపట్టిన న్యాయస్థానం కర్నాటక హైకోర్టు నిర్ణయంపై స్టే విధించింది. దీంతో యడియూరప్పకు భారీ ఊరట లభించింది.
Comments
Please login to add a commentAdd a comment