stay order
-
పుండు మీద కారం చల్లేలా.. పీసీబీకి హైకోర్టు షాక్
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల కావడంతో క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. త్వరలో పీసీబీకి చైర్మన్‌కు సంబంధించి జరగనున్న ఎన్నికపై బలూచిస్తాన్ హైకోర్టు స్టే విధించింది.జూలై 17 వరకు ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో రిపోర్టు ప్రకారం.. 2014 రాజ్యాంగ చట్టాన్ని పీసీబీ గవర్నింగ్ బాడీ ఉల్లఘించినట్లు ఆరోపణలు రావడంతో ఎన్నికలు నిలిపివేయాలని కోర్టు తెలిపింది. అయితే పీసీబీ వాదనను వినడానికి కూడా ఇష్టపడని హైకోర్టు గవర్నింగ్ బాడీలో ఉన్న ప్రతినిధులందరికి నోటీసులు జారీ చేసింది. కోర్టు నిర్వహించే తదుపరి సెషన్‌కు హాజరవ్వాలని కోరింది. అయితే పీసీబీ చైర్మన్‌గా జకా అష్రఫ్ పేరు ఖరారు అయినప్పటికి కోర్టు నుంచి క్లియరెన్స్ వస్తేనే పీసీబీ చైర్మన్‌కు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఆరోపణలు నిజమని తేలితే మాత్రం పీసీబీ గవర్నింగ్ బాడీ ప్రాసెస్‌ను మొత్తం రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి పీసీబీ గవర్నింగ్ బాడీ పది మంది పాలకవర్గంతో ఉంటుంది. ఇందులో ఇద్దరు ప్రధాని సిఫార్సు చేసిన వ్యక్తులు ఉంటే.. మిగతావారిలో నలుగురు ప్రాంతీయ ప్రతినిధులు, మరో నలుగురు సేవా ప్రతినిధులు ఉంటారు. వీరందరు కలిసి నూతన చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే పీసీబీ చైర్మన్ ఎవరనేది మాత్రం ప్రధానమంత్రి చేతుల్లో ఉంటుంది. ఎన్నికైన నూతన పీసీబీ చైర్మన్ మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. ఇక ఇవాళ విడుదలైన వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌కు సంబంధించి పాకిస్తాన్ తన మ్యాచ్‌లన్నీ దక్షిణాది నగరాల్లో ఆడనుండగా.. భారత్‌తో మ్యాచ్‌ను మాత్రం అహ్మదాబాద్‌లో ఆడనుంది. అక్టోబర్ 15న జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి పాకిస్తాన్ భారత్‌తో మ్యాచ్‌ను కూడా దక్షిణాది నగరాల్లో లేదా కోల్‌కతా, ముంబైలో నిర్వహించాలని కోరింది. కానీ అందుకు ఒప్పుకొని బీసీసీఐ అహ్మదాబాద్‌లోనే ఆడాలంటూ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి ఓటు వేసిన ఐసీసీ భారత్-పాక్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది. అంతేగాక దక్షిణాదిన పాకిస్థాన్ రెండు వేదికలు (చెన్నై, బెంగళూరు) తమకు అనుకూలంగా లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఐసీసీ దానిని పట్టించుకున్న పాపాన పోలేదు. చదవండి: వన్డే వరల్డ్‌కప్-2023 మ్యాచ్ టైమింగ్స్, తదితర వివరాలు -
ఏపీ అమరావతి కేసు.. సుప్రీం స్టే విధించిన అంశాలివే
సాక్షి, ఢిల్లీ: కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ఏపీ ప్రభుత్వానికి ఇవాళ (సోమవారం) భారీ ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా?. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? అంటూ మందలింపు వ్యాఖ్యలు చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ తరుణంలో.. ఏపీ హైకోర్టు 7 అంశాలతో ఇచ్చిన తీర్పులోని.. చివరి ఐదు అంశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 1. AP CRDA 2015 లాండ్ పూలింగ్ షెడ్యూల్ 2 మరియు 3 నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం, CRDA నిర్వర్తించాలి 2. థర్డ్ పార్టీ ప్రయోజనాలకు పూలింగ్ లాండ్ తనఖా పెట్టారాదు. రాజధాని నిర్మాణం, కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్కు తనఖా పెట్టవచ్చు 3. CRDA యాక్ట్ సెక్షన్ 58 ప్రకారం రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు ప్రాసెస్ తీర్పు వచ్చిన తేదీ నుంచి నెలరోజుల్లో పూర్తిచేయాలి 4. APCRDA యాక్ట్ సెక్షన్ 61 ప్రకారం టౌన్ మాస్టర్ ప్లానింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం, CRDA కలిసి పూర్తి చేయాలి 5. డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఫామ్ 9.14 ప్రోవిజన్ - CRDA యాక్ట్ 2015లోని నిబంధనల ప్రకారం 6 నెలల్లో అమరావతి కేపిటల్ సిటీ, కేపిటల్ రీజియన్ నిర్మాణం చేపట్టాలి 6. ప్రభుత్వం మరియు CRDA కలిసి రోడ్లు, తాగునీరు, ప్రతిప్లాట్‌కు విద్యుత్ కనెక్షన్, డ్రైనేజి సహా ఏర్పాటు చేసిన అమరావతి కేపిటల్ సిటీ నివాసయోగ్యంగా మార్చాలి 7. రాష్ట్ర ప్రభుత్వం మరియు APCRDA కలిసి భూములిచ్చిన రైతులకు ప్రామిస్ చేసినట్టుగా అమరావతి కేపిటల్ రీజియన్‌లో స్థలాలు 3 నెలల్లోగా కేటాయించాలి రాష్ట్రప్రభుత్వం, సీఆర్డీఏలు అక్కడ జరుగుతున్న అభివృద్ధిపై ఎప్పటికప్పుడు వేర్వేరు అఫిడవిట్లు సమర్పించాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఆరు నెలల్లో నిర్మాణం చేయాలంటారా?. మీరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్ ఎందుకు? అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కదా? హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించింది అంటూ సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలే చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది. 👇 హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా?: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు -
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై ఎన్జీటీ స్టే
-
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే
న్యూఢిల్లీ: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టును నిర్మించొద్దని ఎన్జీటీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తాగునీటి కోసమని చెప్పి సాగునీటి కోసం నిర్మాణాలు చేపట్టారని పిటిషనర్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని చంద్రమౌళీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ తీర్పు వెలువరించింది. చదవండి: (ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ పదవీకాలం పొడిగింపు) -
‘కోర్టు ధిక్కరణ’ నిధులపై తెలంగాణ హైకోర్టు విస్మయం
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసుల విచారణ కోసం ఖర్చుల కోసం కేటాయించిన నిధులపై తెలంగాణ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రూ.58 కోట్లు మంజూరుపై బుధవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. నిధులు విడుదల చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్లు మంజూరు చేయడమేమిటని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది. ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని హైకోర్టు రెవెన్యూ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులకు ఆదేశించింది. ఈ సందర్భంగా సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు వ్యక్తిగత హోదాలో హైకోర్టు నోటీసు ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. -
హైకోర్టులో అజారుద్దీన్‌కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా బుధవారం అజారుద్దీన్‌కు naహైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవలే అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తూ అంబుడ్స్‌మెన్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. అంబుడ్స్‌మెన్ ఎవరనే దానిపై క్లారిటీ లేకపోవడంతోనే స్టే విధిస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు అపెక్స్ కౌన్సిల్ స్థానంలో అజహర్ నియమించిన కొత్త సభ్యుల నియామకంపైనా హైకోర్టు స్టే విధించింది. కాగా ఇటీవలే హెచ్‌సీఏలోని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీకి అనుకూలంగా తీర్పు రావాలి: సజ్జల
సాక్షి, అమరావతి: రెండు రోజుల్లో రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు జరగనుండగా.. ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. తదుపరి చర్యలపై సమాలోచనలు జరిపారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామాకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికల విషయంలో టీడీపీ పిల్ల చేష్టలకు పాల్పడుతోంది. పరిషత్ ఎన్నికలు బహిష్కరించిన టీడీపీ.. హైకోర్టుకు వెళ్లడంలో అర్థం లేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏడాది క్రితం పూర్తి కావాల్సినవి.. కానీ ఆనాడు కూడా అన్యాయంగా, దురుద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా వేశారు’’ అని సజ్జల గుర్తు చేశారు. ‘‘పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రచారం ముగిసింది.. రెండు రోజుల్లో పోలింగ్ ఉండగా.. కోర్టుకు వెళ్లారు. ఈ అంశంలో ఎస్ఈసీ త్వరగా హౌస్‌మోషన్ పిటిషన్ వేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. కోవిడ్ విస్తరిస్తోన్న పరిస్థితుల్లో ఎన్నికలు త్వరగా పూర్తయితే చాలా మేలు జరిగేది. కోర్టుకు వెళ్లకుండా ఉంటే ఎన్నికలు త్వరగా పూర్తయ్యేవి. దాంతో వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేసేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు అడ్డంకులు సృష్టించడం అన్యాయం. డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీకి అనుకూలంగా తీర్పు రావాలి’’ అని సజ్జల కోరుకున్నారు. చదవండి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు స్టే -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు స్టే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడినట్లయ్యింది. పరిషత్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలపై నాలుగు వారాల కోడ్ అమలు చేయలేదన్న హైకోర్టు పేర్కొంది. దీనిపై ఈనెల 15వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో ఎల్లుండి జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. -
భూకుంభకోణం: ముఖ్యమంత్రికి భారీ ఊరట
న్యూఢిల్లీ: భూకుంభకోణం కేసులో కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు భారీ ఊరట లభించింది. ఆ కేసు విషయంలో విచారణ ఏమీ అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. పదేళ్ల కిందట సీఎంగా ఉన్న యడియూరప్ప 24 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై 2012లో లోకాయుక్తలో చార్జిషీటు కూడా దాఖలైంది. ఈ చార్జిషీట్ ఆధారంగా విచారణ చేయాలని ప్రత్యేక కోర్టుకు కర్నాటక హైకోర్టు గతనెలలో ఆదేశించింది. దీంతో యడియూరప్ప పదవికి గండం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తలుపు తట్టగా విచారణ చేపట్టిన న్యాయస్థానం కర్నాటక హైకోర్టు నిర్ణయంపై స్టే విధించింది. దీంతో యడియూరప్పకు భారీ ఊరట లభించింది. -
బాంబే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: శరీరానికి శరీరం తాకకుండా బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పటికీ ‘పోక్సో’ చట్టం కింద లైంగిక వేధింపులుగా పరిగణించలేమని తేల్చిచెబుతూ కేసులో నిందితుడికి విముక్తి కలిగిస్తూ బాంబే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వానికి, నిందితుడికి నోటీసు జారీ చేసింది. రెండు వారాల్లోగా ప్రతిస్పందించాలని ఆదేశించింది. బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనం జనవరి 19న ఇచ్చిన తీర్పుపై అప్పీల్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్‌కు సూచించింది. నాగపూర్ ధర్మాసనం తీర్పును సవాలు చేస్తూ ‘యూత్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎస్.ఎ.బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ హాజరై నాగపూర్ ధర్మాసనం తీర్పు వివరాలను తెలియజేశారు. గతంలో ఏ కోర్టు కూడా ఇలాంటి తీర్పు ఇవ్వలేదని, ఇది ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
అనిల్ అంబానీపై దివాలా చర్యల నిలుపుదల
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీపై దాదాపు రూ. 1,200 కోట్ల రుణాల ఎగవేతలకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వేసిన కేసులో మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. అయితే ఈ కేసులో ఆయన ఆస్తులపై తీవ్ర ఆంక్షలు విధించింది. వాటిని బదలాయించడంగానీ లేక విక్రయించడంగానీ లేదా తాకట్టు పెట్టడంకానీ చేయరాదని స్పష్టం చేసింది. ఆస్తులకు సంబంధించి ఆయన ప్రయోజనాల్లో ఎటువంటి మార్పులూ జరగరాదని ఆదేశించింది. జస్టిస్ విపిన్ సంఘీ, రజ్నీష్లతో కూడిన త్రిసభ్య ధర్మానసం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తమ వాదనలు తెలియజేయాలని ఇన్సా ల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), ఎస్బీఐలకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదావేస్తూ, ఆలోపు తమ వాదనలు తెలపాలని ప్రతివాదులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే కంపెనీలపై ఈ లోపు తగిన న్యాయపరమైన చర్యలు కొనసాగుతాయని, ఐబీసీ పార్ట్ 3 కింద అంబానీ పిటిషన్ విషయంలో మాత్రమే స్టే విధిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. అనిల్ అంబానీ గ్రూప్ (అడాగ్)లో భాగమైన ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌టీఐఎల్)కు 2016 ఆగస్టులో ఎస్బీఐ రుణ సదుపాయం కల్పించింది. ఆర్‌కామ్‌కు రూ. 565 కోట్లు, ఆర్‌టీఐఎల్‌కు రూ. 635 కోట్లు రుణంగా అందించింది. 2016 సెప్టెంబర్‌లో అనిల్ అంబానీ వ్యక్తిగత పూరీకత్తునిచ్చారు. అయితే, 2016 ఆగస్టు నుంచి వర్తింపజేస్తూ ఆర్‌కామ్, ఆర్ఐటీఎల్ ఖాతాలను 2017లో మొండిపద్దుల కింద బ్యాంకులు వర్గీకరించాయి. దీంతో అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును 2018 జనవరిలో ఎస్బీఐ రుణ బాకీల కింద జప్తు చేసుకోవాలని నిర్ణయించింది. తదుపరి అనిల్ అంబానీకి నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు. ఈలోగా ఆర్కామ్నకు ఇచ్చిన రూ. 5,447 కోట్లు వసూలు చేసుకునేందుకు చైనా బ్యాంకులకు బ్రిటన్ కోర్టుల నుంచి అనుమతులు లభించాయి. ఒకవేళ చైనా బ్యాంకులు కూడా అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులపై చర్యలు ప్రారంభిస్తే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందని ఎస్బీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. దివాలా ప్రక్రియకు సమాంతరంగా గ్యారెంటర్‌పై కూడా విచారణ జరపవచ్చని నిబంధనల్లో స్పష్టంగా ఉందని తన వాదనల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమిస్తూ ఎన్సీఎల్టీ ఈ నెల 20న ఆదేశాలు ఇచ్చింది. -
జూన్ 7 వరకు స్టేలు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు, కింది కోర్టులు ఇచ్చిన స్టే ఉత్తర్వులను జూన్ 7 వరకూ పొడిగిస్తూ ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో గతంలోనే హైకోర్టు సహా కింది కోర్టులు జారీ చేసిన స్టే ఉత్తర్వులను ఈ నెల 20 వరకూ పొడిగించిన విదితమే. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఆ తేదీ నుంచి మధ్యంతర స్టే ఉత్తర్వులను జూన్ 7 వరకూ పొడిగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. జూన్ 7లోగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఏమైనా ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఈ స్టే ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయని స్పష్టం చేసింది. స్టే పొడిగింపు ఉత్తర్వుల కారణంగా ఎవరికైనా అన్యాయం జరిగిందని భావించినా, తీరని నష్టం వాటిల్లుతోందని అనుకున్నా వారు సంబంధిత కోర్టుల ద్వారా తగిన ఉత్తర్వులు పొందవచ్చని తెలిపింది. ఆస్తులకు సంబంధించి డిక్రీల అమలులో భాగంగా కోర్టు అధికారులు ఆస్తుల స్వాధీనం చేయకుండా అప్పీల్ చేసేందుకు ఆస్కారం లేనందున తిరిగి ఉత్తర్వులు జారీ చేసే వరకూ డిక్రీల అమలును నిలిపివేస్తున్నట్లు హైకో ర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పీల్‌కు ఆస్కా రం లేనప్పుడు న్యాయాన్ని తోసిపుచ్చినట్లు అవుతుందని, అందుకే డిక్రీల అమలును నిలిపివేయాల్సి వస్తోందని పేర్కొంది. -
నిర్భయ కేసు : దోషుల ఉరిపై స్టే
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో జాప్యం నెలకొంది. ఈ కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నెల 22న వారి ఉరిశిక్షను ఢిల్లీ కోర్టు గురువారం నిలిపివేసింది. వారికి డెత్ వారెంట్ ఇస్తూ తాను జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించడం లేదని, క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో వారి ఉరి శిక్ష అమలుపై స్టే విధిస్తున్నామని తీస్ హజారి కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసుపై పూర్తి నివేదికను రేపటిలోగా ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించారు. కాగా, రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున నిర్భయ దోషులను తాము ఈనెల 22న ఉరితీయడం లేదని అంతకుముందు తీహార్ జైలు అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించారు. కాగా నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో ఈనెల 22న వారి ఉరిశిక్ష నిలిచిపోయిందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసులోనలుగరు దోషులు ముఖేష్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాలను జనవరి 22న ఉరి తీయాలని ఈనెల 7న ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. చదవండి : నిర్భయ కేసులో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం -
గ్రూప్ 2 ప్రొవిజనల్ లిస్ట్‌పై హైకోర్టు స్టే
సాక్షి,హైదరాబాద్ : గ్రూప్-2 కు సంబంధించిన ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్‌పై స్టే విధించినట్లు బుధవారం హైకోర్టు తెలిపింది .తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టారాదని టీఎస్‌పీఎస్సీనీ హైకోర్టు ఆదేశించింది. గతంలో గ్రూప్ 2 కేసులో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును దిక్కరిస్తూ టీఎస్పీఎస్సీ వ్యవహరించిందని గ్రూప్ 2 అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వైట్నర్, ట్యాంపరింగ్, స్క్రాచింగ్ చేసిన అభ్యర్థులను సెలక్ట్ చేయొద్దని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో గ్రూప్ 2 పరీక్షల్లో అందుకు సంబంధించిన జవాబులు తీసివేసి మిగిలిన వారికి ఇంటర్య్వూలలో 1:2 ప్రకారం నియామకాలు జరపాలని హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది. అయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు లెక్కచేయకుండా మళ్లీ అదే అభ్యర్థులను సెలక్ట్ చేసి ప్రొవిజనల్ లిస్ట్‌ను ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ ఫైనల్ లిస్టుకు సెలక్ట్ కాని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు టీఎస్పీఎస్సీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టరాదని హైకోర్టు తెలిపింది. కాగా, తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. -
ఎన్డీఎస్ఎల్ అమ్మకానికి బ్రేక్
బోధన్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎ స్ఎల్) లిక్విడేషన్ను ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తు న్యూ ఢిల్లీ ఎన్సీఎల్ఏటీ ( నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్) బుధవారం స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులకు తీపికబురందినట్లయ్యింది. ఎన్సీఎల్టీ గత నెల 3న ఎన్డీఎస్ఎల్ మూడు యూనిట్లను లిక్విడేషన్‌కు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , స్టేట్ డైరెక్టర్ ఆఫ్ కేన్ అండ్ షుగర్ కమిషనర్ హై దరాబాద్ ఎన్సీఎల్టీ షుగర్ ఫ్యాక్టరీ లిక్విడేషన్ ఉత్తర్వులపై సవాలు చేస్తు న్యూఢిల్లీ ఎన్సీఎల్ఏటీకి ఈ నెల 12న అప్పీలు పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్సీఎల్ఏటీలో విచారణ కొనసాగగా, రాష్ట్ర ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో బుధవారం ఎన్డీఎస్ఎల్ స్థిర, చర ఆస్తుల అమ్మకం నిలుపుదల చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల మేరకు ఫ్యాక్టరీ చర, స్థిరఆస్తులను విక్రయించడానికిగాని, బదలాయింపునకు గాని అవకాశం ఉండదు. ఎన్సీఎ ల్టీ హైదరాబాద్ బెంచ్ ఎన్డీఎస్ఎల్ లిక్విడేషన్ ఉత్తర్వులతో చెరుకు రైతులు, వందలాది కార్మిక కుటుంబాల్లో ఫ్యాక్టరీ భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠతకుగురయ్యారు. తాజా పరిణామాలతో చెరుకు రైతులు, కార్మికుల్లో ఒకింత హర్షం వ్యక్తం అవుతోంది. తాత్కాలికంగానైనా షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి బ్రేక్ పడటం తీపి కబురేనని వారంటున్నా రు. తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఎస్ఎల్ను స్వాధీ నం చేసుకుని ప్రభుత్వరంగంలోనే నడిపించినట్లయితే ఈప్రాంత చెరుకు రైతులు, కార్మికులకు మే లు చేకూరుతోందని అంటున్నారు. 2015 డిసెంబర్ 23న లేఆఫ్... ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం అనుహ్యాంగా 2015 డిసెంబర్ 23న లేఆఫ్ ప్రకటించి బోధన్, ము త్యంపేట (జగిత్యాల) ముంబోజిపల్లి ( మెదక్) ఫ్యాక్టరీలను మూసివేసింది. వాస్తవంగా ప్రభుత్వం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రా గానే ఎన్డీఎస్ఎల్ను స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామని హామీ ఇచ్చింది. కాని ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకోకపోగా, నడిచే ఫ్యాక్టరీ మూతపడటంతో చెరుకు రైతులు, కార్మికులు తీవ్ర నిరా శకు గురయ్యారు. కాని తెలంగాణ ప్రభుత్వం సా నుకూలమైన నిర్ణయం తీసుకుంటోందనే ఆశతో చెరుకు రైతులు, కార్మికులు నిరీక్షించారు. కాని 2017 సెప్టెంబర్‌లో అనుహ్యంగానే షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారం కోసం ఎన్సీఎల్టీ రంగప్రవే శం చేసింది. ఈ పరిణామం చెరుకు రైతులు, కా ర్మికుల్లో మరింత ఉత్కంఠతకు గురిచేసింది. ఎన్సీ ఎల్టీ హైదరాబాద్ బెంచ్ ఐపీఆర్‌గా నియామకమైన రాచర్ల రామక్రిష్ణ గుప్తా విచారణ ప్రక్రియను 2017 అక్టోబర్‌లో ప్రారంభించగా.. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన సమయంలో వివరాలను వెల్లడించారు. బ్యాంక్ అప్పులు, కార్మికుల ఆర్థికపరమైన బకాయిలు, ఇతర పన్ను బకాయిలు చె ల్లించేందుకు అంగీకరించిన వారికి ఫ్యాక్టరీని అప్పగించే ప్రక్రియ ఉంటుందని తెలిపారు. తొలి ప్రా ధాన్యతగా ప్రస్తుత ఎన్డీఎస్ఎల్ ప్రైవేట్ యాజ మాన్యం అవకాశం కల్పించడం జరుగుతోందని వివరించారు. ప్రైవేట్ యాజమాన్యం, ప్రభుత్వం బకాయిలు చెల్లించి, ఫ్యాక్టరీని నడిపేందుకు ముం దుకు రానియెడల ఇతర ప్రైవేట్ కంపెనీలకు ఆ హ్వానిస్తామని, ఈ ప్రక్రియ సాధ్యం కాకపోతే ఫ్యా క్టరీ ఆస్తులు విక్రయించి అప్పు బకాయిలు చెల్లించ డం జరుగుతోందని స్పష్టత ఇచ్చారు. దీంతో ఈ కోణంలో విచారణ కొనసాగింది. 2017 నుంచి ఎ న్సీఎల్టీ విచారణ కొనసాగించి ఆఖరుకు 2019 జూన్ 3న ఎన్డీఎస్ఎల్ లిక్విడేషన్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హఠాత్పరిణామంతో చెరుకు రైతులు, కార్మికులు హతాశులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఎస్ఎల్ అమ్మకం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నిలుపుదలకు అప్పీలేట్ ట్రి బ్యునల్‌కు అప్పీలు పిటిషన్ దాఖలు చేయడం. ఈ మేరకు సానుకూలంగా ట్రిబ్యునల్ స్టే ఉత్తర్వులు ఇవ్వడం శుభపరిణామమని కార్మిక సంఘాల నాయకులంటున్నారు. ఇదే స్ఫూర్తితో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలంటున్నారు. తాజా పరిణామంతో చెరుకు రైతులు, కార్మికుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. స్టే ఉత్తర్వులు వాస్తవమే.. ఎన్సీఎల్టీ గత నెల 3న ఎన్డీఎస్ఎల్ లిక్విడేషన్‌కు జారీ చేసిన ఉత్తర్వుల పై న్యూఢిల్లీ ఎన్సీఎల్ఏటీకి ఈ నెల 12న అప్పీలు పిటిషన్ దాఖలు చేశాం. బుధవారం లిక్విడేషన్ ఉత్తర్వులు నిలుపుదల చేస్తు ఎన్సీఎల్ఏటీ స్టే ఉత్తర్వులు జారీ చేసిన విషయం వాస్తవమే. –భద్రు మల్హోత్, రాష్ట్ర కేన్ కమిషనర్, హైదరాబాద్ -
తన ఆదేశాలపైనే స్టే ఇచ్చుకున్న ‘సుప్రీం’
సాక్షి, న్యూఢిల్లీ : అటవీ భూములపై హక్కులు లేకుండా అక్రమంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని ఆదేశిస్తూ ఫిబ్రవరి 13వ తేదీన తను ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అటవీ హక్కుల చట్టం(ఎఫ్ఆర్ఏ)–2006 కింద అటవీ భూముల హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైన దాదాపు 11.8 లక్షల మందిని ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు నాటి ఆదేశాల్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దరఖాస్తుల తిరస్కరణ ప్రక్రియలో పాటించిన విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నాలుగు నెలల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అటవీ హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులు భారీ సంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటన్నింటినీ పరిశీలించి అఫిడవిట్లు సమర్పించాలని కోరింది. అటవీ హక్కుల చట్టం–2006 ప్రకారం 2005 డిసెంబరుకు ముందు నుంచి అడవుల్లో నివసిస్తున్న గిరిజనులు, మూడు తరాలుగా(75 ఏళ్లు) అక్కడే నివసిస్తున్న ఇతర సంప్రదాయ తెగలు వారి వారి భూములపై హక్కులు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఇలా చేసుకున్న దరఖాస్తుల్లో కేవలం 44.83 శాతం మాత్రమే ఆమోదం పొందాయి. ఆచరణయోగ్యం కాని గడువు, తగిన సమాచారం లేకపోవడం, రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీలు సమావేశాలు నిర్వహించకపోవడం, జిల్లా యంత్రాంగం నుంచి తగిన సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయన్న ఫిర్యాదులు వచ్చాయి. ప్రక్రియ సవ్యంగా సాగకపోవడం వల్లే హక్కుదారులు పత్రాలు పొందలేకపోయారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వు లక్షలాది మంది గిరిజనులపై ప్రభావం చూపుతోందని, అటవీ హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులను విధిగా గ్రామసభలు, రాష్ట్ర యంత్రాంగం పరిశీలించాయా? లేదా ? అన్న అంశాలను చూడాల్సిన అవసరం ఉందని కేంద్రం చేసిన అభిప్రాయంతో ధర్మాసనం ఏకీభవించింది. అటవీ హక్కులు లేనివారిని ఖాళీ చేయించే ముందు ప్రక్రియ సవ్యంగా సాగిందా లేదా అనే అంశంలో రాష్ట్రాలు తగిన అఫిడవిట్ సమర్పించాల్సిన అవసరం ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నివేదించారు. ‘గిరిజనులను ఖాళీ చేయించే ప్రక్రియను నిలిపివేయాలి. నిరుపేదలు, నిరక్షరాస్యులుగా ఉన్న గిరిజనులు తమ అటవీ హక్కులపై తగిన ఆధారాలు పొందలేకపోయి ఉండొచ్చు. ప్రక్రియ అమలుపై తగిన సమాచారం లేకుండా వారిని తొలగించడం వారికి అన్యాయం చేయడమే అవుతుంది’అని నివేదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ తిరస్కరణకు గురైన దరఖాస్తులను సమీక్షించేందుకు యంత్రాంగం ఎందుకు లేదని ప్రశ్నించింది. ‘తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలు సమర్పించాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వాలను కోరగా ఇప్పటిదాకా స్పందించలేదు. మేం ఉత్తర్వులిచ్చాక మాత్రమే వాటిని సరిచేయాలంటూ అడుగుతోంది. ఇప్పడు ప్రస్తావించిన అంశాలను గతంలో ఎందుకు లేవనెత్తలేదు. ఇంతకాలం ఎందుకు నిద్రపోయింది’అని ప్రశ్నించింది. సంప్రదాయ హక్కులు కలిగిన గిరిజనుల అటవీ భూములను గొప్పవ్యక్తులు’ఎవరూ ఆక్రమించరాదని కోర్టు పేర్కొంది. పిటిషనర్ అయిన వైల్డ్ లైఫ్ ఫస్ట్ స్వచ్ఛంద సంస్థ తరపున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ వాస్తవికమైన లక్షలాది దరఖాస్తులకు న్యాయం జరిగిందని వివరించారు. మొత్తం 42,24,951 దరఖాస్తులు రాగా 18,94,225 పట్టాలు పంపిణీ అయినట్టు వివరించారు. తదుపరి విచారణను ధర్మాసనం జూలై 10వ తేదీకి వాయిదావేసింది. -
ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలపై స్టేకు సుప్రీం నో
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలపై స్టే జారీ చేసేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరించింది. ఈ చట్టం కింద నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని తిరిగి చట్టంలో జోడిస్తూ తీసుకువచ్చిన సవరణలపై స్టే ఇవ్వాలన్న అప్పీల్‌ను నిలిపివేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు గతంలో వెలువరించిన తీర్పుపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌తో పాటు అన్ని అంశాలను ఫిబ్రవరి 19న విచారణ చేపడతామని న్యాయస్ధానం వెల్లడించింది. ఈ అంశాన్ని లోతుగా విచారించాల్సిన అవసరం ఉన్నందున దీనికి సంబంధించిన అన్ని అంశాలను వచ్చే నెల 19న వాద, ప్రతివాదనలను కోర్టు పరిశీలిస్తుందని జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ పేర్కొంది. చట్టానికి చేసిన మార్పులను తక్షణమే నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదించగా, ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద విచారణ లేకుండానే అరెస్టులు వద్దంటూ గతంలో సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ చట్టాన్ని బలోపేతం చేస్తూ గత ఏడాది ఆగస్ట్ 9న పార్లమెంట్ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక సవరణ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. -
టీడీపీ ఎమ్మెల్యేకి పరాజయం..
ఎమ్మిగనూరు: అధికార పార్టీలో భేదాభిప్రాయాలు భగ్గుమన్నాయి. అసంతృప్తులు రచ్చకెక్కాయి. ఆధిపత్యం కోసం కోర్టు మెట్లు ఎక్కేటట్లు చేశాయి. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ పాలకవర్గం ఏర్పాటులో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డికి పరాజయం ఎదురైంది. సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికార పార్టీ ప్రధాన నాయకుడు కాసులకు కక్కుర్తి పడి నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఏం జరిగిందంటే.. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుకు పాలకవర్గాన్ని నియమిస్తూ గత నెల 17న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రధాన ప్రజాప్రతినిధికి రూ. 30లక్షలు ముడుపులు ముడితేనే ముహూర్తం ఖరారంటూ ఓ రిటైర్డ్ డీఈ ద్వారా పాలకవర్గంతో రాయబేరాలు జరిగాయి. చివరకు గురువారం ఉదయం 11.10 గంటలకు ప్రమాణ స్వీకారం ముహూర్తం ఖరారు చేశారు. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో గత నాలుగేళ్లలో వివిధ మండలాల్లోని పార్టీ నాయకులు దూరమవుతూ వచ్చారు. తాజాగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపికతో మరింత దుమారం రేగింది. ఈ వ్యవహారంపై జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ జె. పుష్పావతి, ఆమె భర్త నాగరాజుగౌడ్ తమ వర్గీయులతో హైకోర్టులో పిటిషన్ వేయించారు. పాలకవర్గం ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో అసంబద్ధంగా ఉందని, ప్రమాణ స్వీకారం చేయించరాదంటూ హైకోర్టు బుధవారం స్టే ఉత్తర్వులు ఇచ్చింది. పరువు పోతుందని.. హైకోర్టు నుంచి వచ్చిన స్టే ఉత్తర్వులను గురువారం ఉదయం 7.30 గంటలకు కలెక్టర్ సత్యనారాయణ, మార్కెటింగ్ శాఖ ఏడీకి పిటిషనర్ తరఫు లాయర్ అందజేశారు. మార్కెటింగ్ శాఖ నుంచి ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుకు స్టే ఉత్తర్వులు మెయిల్ ద్వారా అందాయి. బుధవారం అర్ధరాత్రే స్టే ఉత్తర్వులు రావడం తెలుసుకున్న అధికార పార్టీ నేతలు గురువారం ఉదయం 8.30 గంటలకే చైర్మన్‌గా మాధవరావ్ దేశాయి బాధ్యతలు తీసుకుంటున్నట్లు సెక్రటరీ ఆర్. జయలక్ష్మి ద్వారా చెప్పించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మిగనూరుకు చేరుకున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి జిల్లా అధికారుల ద్వారా స్టే విషయం తెలియడంతో నొచ్చుకున్నట్లు తెలిసింది. ‘‘పార్టీలో ఉన్న క్యాడర్‌ను సమన్వయం చేసే సామర్థ్యం కూడా లేకపోతే ఎలా? టీడీపీ నేతలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేలు తీసుకురావడం ఏమిటి? పద్ధతులు మార్చుకోరా?’’ అంటూ స్థానిక ప్రధాన ప్రజాప్రతినిధిపై డిప్యూటీ సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ నాయకుడొకరు తెలిపారు. కార్యక్రమం జరగకపోతే నియోజకవర్గంలో తన పరువు పోతుందని, ఇలా పాల్గొని అలా వచ్చేద్దామంటూ ప్రజాప్రతినిధి బతిమిలాడడంతో కేఈ అయిష్టంగానే హాజరైనట్లు తెలుస్తోంది. అయితే మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకార కార్యక్రమంటూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగాలు చేయడం కూడా కోర్టు ధిక్కారం కిందే వస్తుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. అభాసుపాలు.. ఏదిఏమైనా కార్యక్రమం అభాసు పాలు కావడంతో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ముభావంగా కనిపించారు. ఇంత ఖర్చు పెట్టి సాధించుకున్న చైర్మన్ గిరి ప్రమాణ స్వీకారం జరగకపోవడంతో మాధవరావ్ దేశాయ్ కూడా తీవ్ర కలత చెందారు. పైగా మాధవరావ్ దేశాయ్‌కు సభలో ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం కల్పించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు అవమానభారంతో రగిలిపోయారు. ఇదిలావుండగా.. స్టే కాపీ రాకముందే తాను చార్జ్ తీసుకున్నట్లు మాధవరావ్ మీడియాకు తెలిపారు. మార్కెటింగ్ శాఖ నుంచి జిల్లా స్థాయి, స్థానిక అధికారులే కాకుండా కనీసం అటెండర్లు కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. అధికార పార్టీలో విభేదాలకు ప్రమాణ స్వీకారోత్సవం అభాసుపాలు కావడమే నిదర్శమని పలువురు వ్యాఖ్యానించారు. అసంబద్ధ ప్రసంగం.. అధికార పార్టీ నేతలు స్టే తెస్తే ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాత్రం.. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని, వారు ఎమ్మిగనూరులో అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ అసంబద్ధంగా ప్రసంగించారు. దీంతో సభలో ఆ పార్టీ నేతలే తెల్లముఖం వేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి మాట్లాడుతూ.. పాలకవర్గం ప్రమాణ స్వీకారం తాత్కాలికంగా బ్రేక్ పడిందని, లోపాలను సరి చేసి కొత్త జీవో తీసుకువస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం కేఈ మాట్లాడుతూ.. పార్టీలో అందర్ని సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యే ముందుకు పోవాలని, ఈ సమస్యను ఆయనే పరిష్కరించుకోగలరంటూ చలోక్తి విసిరారు. -
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. హంద్రీనీవ బ్రాంచ్ కెనాల్ పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని నర్సాపురం, సిరిపి రైతులు కోర్టును ఆశ్రయించారు. నష్టపరిహారం చెల్లించకుండా పనులు నిర్వహిస్తున్నారనీ, లాండ్ అక్విజేషన్ యాక్ట్-2013ను ఉల్లంఘించారంటూ రైతులు హైకోర్టులో పిటిషన్‌పై దాఖలు చేశారు. విచారణ చేపట్టి హైకోర్టు రైతులకు నష్టపరిహారం చెల్లించి 2013 లాండ్ అక్విజేషన్ యాక్ట్‌లోని 13 వ నిబంధనను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కాగా, ఈ తీర్పుతో అనంతపురం, పెరూర్, హగరి బ్రాంచ్ కెనాల్ రైతులకు ఊరట లభించింది. రైతుల తరపున న్యాయవాది రాజేశ్వర్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. -
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
-
పరిపూర్ణానంద బహిష్కరణపై స్టే నో!
సాక్షి, హైదరాబాద్: కాకినాడలోని శ్రీపీఠం వ్యవస్థాపకుడుపరిపూర్ణానంద స్వామి హైదరాబాద్ నగర బహిష్కరణ అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. నగర బహిష్కరణ కొనసాగింపునకు వీలుగా తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను సోమవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ వ్యవహారంలో స్వామీజీకి గతంలో జారీ చేసిన నోటీసు అందాల్సి ఉందని, దానిని పరిశీలించాక ఈ అప్పీల్‌పై విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. కరీంనగర్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో స్వామీజీ రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించినందుకే నగర బహిష్కరణ చేస్తూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు విడివిడిగా ఉత్తర్వులిచ్చాయని, వీటి అమలును నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉతర్వులపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు వాదించారు. యాత్ర పేరుతో అనుమతులు తీసుకుని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై పరిపూర్ణానంద స్వామి వాదనలు వినాల్సి ఉందని, ఇప్పటికే స్వామీజికి ఇచ్చిన నోటీసు అందాల్సి ఉన్నందున ఈ పరిస్థితుల్లో స్టే ఆదేశాలు జారీ చేయబోమని ధర్మాసనం ప్రకటించింది. విచారణ వాయిదా పడింది. -
పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించే ముందు చట్ట ప్రకారం అనుసరించాల్సిన విధివిధానాలను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ముందు బీసీ జనాభాను, ఓటర్లను లెక్కించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఆ వివరాలను ప్రచురించి, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని స్పష్టం చేసింది. ఇవన్నీ పూర్తి చేశాకే ఎన్నికల నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు తేల్చకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఇది చట్టవిరుద్ధమంటూ కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, బి.రవీంద్రనాథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేల్చిన లెక్కల్లో బీసీ జనాభా ఎంతుందో ప్రకటించి, పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం మేర రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తెలంగాణ రాష్ట్ర బీసీ తరగతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఆంధ్రప్రదేశ్ బీసీ తరగతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.అలిమేన్ రాజు సంయుక్తంగా మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు మంగళవారం విచారణ జరిపారు. బీసీ జనాభా ఎంతో ప్రభుత్వానికే స్పష్టత లేదు... ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిబంధనల ప్రకారం బీసీ జనాభాను లెక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బీసీ జనాభా లెక్కించాకే బీసీ ఓటర్లను గుర్తించి చట్ట ప్రకారం వారికి రిజర్వేషన్లు కల్పించాల్సి ఉందని, ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు బీసీ జనాభా, ఓటర్లను లెక్కించలేదని, అయినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవడం చట్టవిరుద్ధమని వాదించారు. బీసీ జనాభా విషయంలో ప్రభుత్వానికే స్పష్టత లేదన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా 34 శాతం అని ఓసారి, గతేడాది జారీ చేసిన బిల్లులో 37 శాతమని, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 54 శాతం అని రకరకాలుగా చెబుతోందన్నారు. ఈ గందరగోళాన్ని తొలగించేందుకు బీసీ జనాభాను శాస్త్రీయంగా లెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ జనాభా లెక్కలు తేలితే తప్ప ఏ,బీ,సీ,డీ,ఈ వర్గీకరణ సాధ్యం కాదన్నారు. నోటిఫికేషన్ ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు... ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె. రామచంద్రరావు వివరణ కోరారు. బీసీ జనాభా ఎంతో తేల్చకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీనికి ఏఏజీ స్పందిస్తూ బీసీ జనాభా గణన జరిగిందని చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వద్ద బీసీ జనాభా లెక్కలు ఉన్నాయన్నారు. ఈ సమయంలో పంచాయతీరాజ్ చట్టాన్ని పరిశీలించిన న్యాయమూర్తి... తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సర్వే నిర్వహించాల్సి ఉందని తెలిపారు. అంతే తప్ప డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌కు బీసీ జనాభా లెక్కల గణనతో సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనికి ఏఏజీ సమాధానమిస్తూ గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తానన్నారు. గడువిచ్చేందుకు అభ్యంతరం లేదని, ఈలోగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేయవచ్చునని ఏఏజీ చెప్పడంతో అలా అయితే చట్టం నిర్దేశించిన విధివిధానాలను పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. -
కథువా కేసు : విచారణపై సుప్రీం స్టే
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా మైనర్ బాలిక హత్యాచారం కేసు విచారణపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కేసు విచారణను చండీఘర్‌కు బదలాయించాలన్న అప్పీల్‌పై స్పందించాలని నిందితుడిని కోరింది. కథువాలో శనివారం జరగాల్సిన విచారణను నిలిపివేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస ఇందూ మల్హోత్రాలతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. కేసు బదలాయింపు పిటిషన్‌పై మే 7న తాము విచారణ చేపడతామని ప్రకటించింది. గతంలో కేసు విచారణను చండీఘర్‌కు బదలాయించాలన్న ప్రతిపాదనను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వ్యతిరేకించింది. జమ్మూ కశ్మీర్లో విభిన్న పీనల్ కోడ్ ఉందని, విచారణను బదలాయిస్తే సాక్షులకు అసౌకర్యం కలుగుతుందని పేర్కొంది. అయితే కేసు విచారణలో ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించింది. కథువాలో మైనర్ బాలికపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడి హతమార్చడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. -
ఆ కాలనీల్లో నిర్మాణాలు బంద్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని 1797 అనధికార కాలనీల్లో నిర్మాణాలపై సుప్రీం కోర్టు మంగళవారం స్టే విధించింది. అనధికార కాలనీల్లో భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా సాగే నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. జాతీయ రాజధానిలో రహదారులు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఢిల్లీ మాస్టర్‌ప్లాన్‌కు ప్రతిపాదిత సవరణలపై విధించిన స్టేను ఎత్తివేయాలన్న ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అనధికార కాలనీల్లో భవనాలు, నిర్మాణాలు మున్సిపల్ చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూడాలన్న సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనతో కోర్టు ఏకీభవించింది. కాగా దేశ రాజధానిలో నివాస ఆస్తులను వ్యాపార సముదాయాలుగా మార్చిన వాణిజ్య సంస్థలపై కొరడా ఝళిపిస్తూ కోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీ సీలింగ్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమైనందునే పరిస్థితి దిగజారిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కోర్టులో నటి ట్వింకిల్ ఖన్నాకు ఊరట
ముంబై: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నాకు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ట్వింకిల్ తండ్రి, దివంగత సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా రాయించిన వీలునామా కాపీని ఆయన సహచరి అనితా అద్వానీకి ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేయాలని కోరుతూ ట్వింకిల్ చేసిన అప్పీలును హైకోర్టు విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ మోహిత్ షా సారథ్యంలోని ధర్మాసనం.. కేసు విచారణ ముగిసే వరకు గత తీర్పుపై స్టే విధిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. అనిత రాజేష్ ఖన్నా కుటుంబ సభ్యురాలు లేదా వారసురాలు కాదని, ఆమెకు వీలు కాపీ ఇవ్వాల్సిన అవసరం ట్వింకిల్‌కు లేదని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. రాజేష్ ఖన్నా తన వారసురాళ్లుగా కుమార్తెలు ట్వింకిల్, రింకీ పేర్లను వీలులో రాశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలావుండగా, ఆయన నివసించిన బంగ్లాను ఇటీవల ఓ వ్యాపారవేత్తకు అమ్మేశారు. 2012లో రాజేష్ ఖన్నా మరణించారు. రాజేష్ ఖన్నాతో విభేదాల కారణంగా ఆయన భార్య, బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా తన పిల్లలతో కలసి వేరుగా ఉండేవారు. అప్పట్లో రాజేష్ అనితతో సన్నిహితంగా ఉండేవారు. దీంతో అనితకు, రాజేష్ ఖన్నా కుమార్తెలకు మధ్య ఆస్తి వివాదాలు ఏర్పడ్డాయి.